
పూణే: మహారాష్ట్రలో జీబీఎస్ వైరస్ (గ్విలియన్-బారే సిండ్రోమ్) మరొకరి ప్రాణాన్ని బలిగొంది. రాష్ట్రంలో జీబీఎస్ వైరస్ కారణంగా రెండవ మరణం నమోదయ్యింది. పూణేకు చెందిన ఒక మహిళ జీబీఎస్ బారినపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలో జీబీఎస్ వైరస్ వ్యాప్తి చెందుతోందనడానికి ఉదాహరణగా నిలిచింది.
గతంలో ఈ వైరస్ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. పూణేలో ఇప్పటివరకు 127 జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ పూణేలోని ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. కేసులు కూడా మరింతగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అనుమానిత జీబీఎస్(Guillain-Barré syndrome) కేసుల సంఖ్య 127కి చేరింది. ఈ వైరస్‌తో బాధపడుతున్న 13 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఇదే వైరస్‌తో షోలాపూర్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. పూణేలో అతనికి ఇన్ఫెక్షన్ సోకింది.
షోలాపూర్ ప్రభుత్వ వైద్య కళాశాల డీన్ డాక్టర్ సంజీవ్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కాళ్ల నొప్పులు, విరేచనాలతో బాధపడుతున్న ఒక బాధితుడిని జనవరి 18న ఆసుపత్రిలో చేర్చించారు. అతను వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.
జీబీఎస్ అనేది ఒక అరుదైన వ్యాధి. దీని బారినపడితే శరీర భాగాలు అకస్మాత్తుగా మొద్దుబారిపోతాయి. కండరాల బలహీనత ఏర్పడుతుంది. బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా జీబీఎస్‌కి కారణమవుతాయని వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రంలోనూ ‘లివ్ ఇన్’కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment