భారత్‌ను గెలిపించిన ధరమ్‌వీర్ | Kiwis defeat in the third hockey Test | Sakshi
Sakshi News home page

భారత్‌ను గెలిపించిన ధరమ్‌వీర్

Published Fri, Oct 9 2015 11:52 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

Kiwis defeat in the third hockey Test

మూడో హాకీ టెస్టులో కివీస్ ఓటమి
 
క్రైస్ట్‌చర్చ్: మరికొద్ది సెకన్లలో ఆట ముగుస్తుందనగా ధరమ్‌వీర్ సింగ్ సూపర్ గోల్ చేసి డ్రా ఖాయమనుకున్న మ్యాచ్‌ను భారత్ వశం చేశాడు. ఫలితంగా శుక్రవారం న్యూజిలాండ్‌తో హోరాహోరీగా జరిగిన మూడో టెస్టులో భారత్ 3-2తో విజయం సాధించింది. ఈ ఫలితంతో భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం ఇరు జట్ల మధ్య చివరి టెస్టు జరుగుతుంది. భారత్‌కు 10వ నిమిషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ పాల్ సింగ్ గోల్‌గా మలిచి కివీస్‌పై ఒత్తిడి పెంచాడు.

రెండో క్వార్టర్ 22వ నిమిషంలో భారత డిఫెన్స్‌ను ఏమార్చుతూ కివీస్ తొలి గోల్ సాధించింది. అయితే 41వ నిమిషంలో ఆకాశ్‌దీప్ పాస్‌ను అందుకున్న రమణ్‌దీప్ ఫీల్డ్ గోల్‌తో స్కోరును పెంచాడు. నాలుగో క్వార్టర్‌లో భారత గోల్ అవకాశాలను కివీస్ అడ్డుకుంది. 52వ నిమిషంలో స్టీవ్ ఎడ్వర్డ్స్ ఫీల్డ్ గోల్‌తో స్కోరు 2-2తో సమమైంది. ఇక మ్యాచ్ మరో 40 సెకన్లలో ముగుస్తుందనగా ధరమ్‌వీర్ అద్భుత గోల్‌తో భారత్ నెగ్గింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement