అలెన్‌ అదరహో  | Kiwis win in third T20 | Sakshi
Sakshi News home page

అలెన్‌ అదరహో 

Published Mon, Sep 4 2023 1:07 AM | Last Updated on Mon, Sep 4 2023 1:07 AM

Kiwis win in third T20 - Sakshi

బర్మింగ్‌హమ్‌: ఇంగ్లండ్‌ జట్టుతో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 74 పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఫిన్‌ అలెన్‌ (53 బంతుల్లో 83; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), గ్లెన్‌ ఫిలిప్స్‌ (34 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఇంగ్లండ్‌ బౌలర్లపై విరుచుకుపడి అర్ధ సెంచరీలు చేశారు.

203 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 18.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (21 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో కైల్‌ జేమీసన్‌ (3/23), ఇష్‌ సోధి (3/33) రాణించారు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ 2–1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్‌ మంగళవారం జరుగుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement