పాకిస్తాన్ జట్టుకు మరో ఘోర పరాభవం ఎదురైంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో చేతిలో (0-3తో టెస్ట్ సిరీస్ ఓటమి) భంగపడ్డ ఆ జట్టు.. తాజాగా న్యూజిలాండ్ చేతిలో అంతకుమించిన అవమానాన్ని (0-3తో టీ20 సిరీస్ ఓటమి) ఎదుర్కొంది.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కోల్పోయి ఇంటాబయట అభిమానుల ఆగ్రహానికి గురవుతుంది. వన్డే ప్రపంచకప్ నుంచి చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్న పాక్ క్రికెట్ జట్టును పూర్తిగా ప్రక్షాళణ చేయాలని ఆ జట్టు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఫిన్ అలెన్ సునామీ శతకంతో (62 బంతుల్లో 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 137 పరుగులు) విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 224 పరుగుల భారీ స్కోర్ (7 వికెట్ల నష్టానికి) చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో అలెన్ మినహా టిమ్ సీఫర్ట్ (31), గ్లెన్ ఫిలిప్స్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.
అలెన్‌తో పాటు మరొక్కరు రాణించినా న్యూజిలాండ్ ఇంతకంటే భారీ స్కోర్ చేసేది. అలెన్ ధాటికి పాక్ బౌలర్లు షాహీన్ అఫ్రిది (4-0-43-1), హరీస్ రౌఫ్ (4-0-60-2), మొహమ్మద్ నవాజ్ (4-0-44-1) బెంబేలెత్తిపోయారు. ఈ ముగ్గురు 10కిపైగా ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 కోల్పోయి 179 పరుగులకు మాత్రమే పరిమతమై 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ ఇన్నింగ్స్‌లో మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (58) అర్ధసెంచరీతో రాణించాడు. టీ20ల్లో బాబర్‌కు ఇది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ.
పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (10), మొహమ్మద్ రిజ్వాన్ (24), ఫకర్ జమాన్ (19), ఆజం ఖాన్ (10), ఇఫ్తికార్ అహ్మద్ (1), మొహమ్మద్ నవాజ్ (28) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో సౌథీ 2, హెన్రీ, ఫెర్గూసన్, సాంట్నర్, సోధి తలో వికెట్ పడగొట్టారు. నామమాత్రపు నాలుగో టీ20 జనవరి 19న క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment