Third T20
-
సిరీస్ సొంతం చేసుకోవాలని...
ముంబై: భారత్, వెస్టిండీస్ మహిళల జట్ల మధ్య గురువారం నిర్ణయాత్మక మూడో టి20 మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టి20లో భారత్ విజయం సాధించగా... రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిచి 1–1తో లెక్క సరిచేసింది. తొలి టి20లో బ్యాటర్లు దంచికొట్టడంతో భారీ స్కోరు చేసిన టీమిండియా... రెండో మ్యాచ్‌లో అదే జోరు కొనసాగించలేకపోయింది. గత మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయిన భారత రెగ్యులర్ కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం కూడా సందేహమే. ఈ నేపథ్యంలో మరోసారి స్మృతి మంధాన జట్టును నడిపించనుంది. బ్యాటింగ్‌లో స్మృతి రాణిస్తున్నా... ఆమెతో పాటు ఇతర ప్లేయర్లు కూడా సత్తా చాటాల్సిన అవసరముంది. ఈ సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధశతకాలు సాధించిన స్మృతి అదే ఫామ్ కొనసాగించాలని మేనేజ్మెంట్ ఆశిస్తుండగా... జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ నిలకడ ప్రదర్శించాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు విజృంభిస్తుంటే... మన బౌలర్లు వారిని అడ్డుకోవడంలో విఫలమయ్యారు. సీనియర్లు దీప్తి శర్మ, రాధ యాదవ్, రేణుక సింగ్‌తో పాటు యంగ్‌ప్లేయర్లు సైమా ఠాకూర్, సజీవన్ సజన, టిటాస్ సాధు సమష్టిగా సత్తా చాటాల్సిన అవసరముంది. మరోవైపు రెండో టి20లో విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న వెస్టిండీస్ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. ఈ ఫార్మాట్లో భారత్ చేతిలో వరుసగా తొమ్మిది పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో విజయం సాధించిన కరీబియన్ జట్టు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ముఖ్యంగా కెప్టెన్ హేలీ మాథ్యూస్, క్యాంప్‌బెల్, డాటిన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో కరీబియన్ ప్లేయర్లు భారత బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నారు. 150 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 26 బంతులు మిగిలుండగానే పూర్తి చేశారు. సిరీస్ సొంతం చేసుకోవాలంటే కరీబియన్ హిట్టర్ల దూకుడును భారత్ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. -
సూర్యకుమార్ వల్లే సాధ్యమైంది
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో మూడో టి20లో అజేయ సెంచరీతో ఆకట్టుకున్న హైదరాబాద్ బ్యాటర్ ఠాకూర్ తిలక్ వర్మ... ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సాధారణంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే తిలక్... ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అడిగి మరీ మూడో స్థానంలో బరిలోకి దిగి సత్తా చాటాడు. తొలి రెండు టి20ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి వరుసగా 33, 20 పరుగులు చేసిన తిలక్ వర్మ... తనను తాను నిరూపించుకోవడానికి ఒక స్థానం ముందే బ్యాటింగ్‌కు దిగాలనుకుంటున్నట్లు కెప్టెన్ కు వివరించాడు. దీనికి అంగీకరించిన సూర్యకుమార్ తాను బ్యాటింగ్ చేయాల్సిన మూడో ప్లేస్‌లో తిలక్‌ను దింపాడు. దీంతో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే క్రీజులోకి అడుగుపెట్టిన తిలక్ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. సెంచరీ అనంతరం అభివాదం చేస్తున్న సమయంలో తిలక్ తన హావభావాలతో సారథికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. ‘సూర్యకుమార్ వల్లే అది సాధ్యమైంది. అతడు మూడో స్థానంలో ఆడే అవకాశం ఇవ్వడంతోనే స్వేచ్ఛగా ఆడాను. గత రెండు మ్యాచ్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశా. నాకు స్వతహాగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్ ఇష్టం. అదే సూర్యకు చెప్పా. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రే అతడు దానికి అంగీకారం తెలిపాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు మైదానంలో నేనేంటో నిరూపించుకుంటా అని ముందే చెప్పాను. విఫలమైన సమయంలోనూ టీమ్ మేనేజ్మెంట్ అండగా నిలిచింది. సహజ సిద్ధమైన ఆట ఆడేవిధంగా ప్రోత్సహించింది. కెపె్టన్, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వికెట్ పడ్డా వెనకడుగు వేయవద్దని సూచించారు’ అని తిలక్ చెప్పుకొచ్చాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మూడో టి20లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించగా... తిలక్ వర్మ 56 బంతుల్లోనే అజేయంగా 107 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్లో తొలి శతకం తన పేరిట లిఖించుకున్నాడు. అందులో 7 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. గాయాల కారణంగా కొన్నాళ్ల పాటు జట్టుకు దూరమైన తిలక్ వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడమే తన పని అని వివరించాడు. ఆల్‌రౌండర్‌గా జట్టుకు సేవలందించేందుకు ఎప్పుడూ ముందుంటానని వెల్లడించాడు. -
తిలక్ తుఫాన్.. మూడో టీ20లో భారత్ గెలుపు
గతేడాది విండీస్ గడ్డపై టి20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు (18 టి20లు, 4 వన్డేలు) ఆడాడు. అడపాదడపా రాణించినా... తాజాగా తన 19వ టి20 మ్యాచ్‌లో చేసిన తుఫాన్ సెంచరీ కెరీర్లో కలకాలం గుర్తుండిపోతుంది. ఇన్నింగ్స్ మూడో బంతికి క్రీజులోకి వచ్చిన తిలక్ ఆఖరి బంతిదాకా అజేయంగా నిలిచాడు. సఫారీ గడ్డపై తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీని సాఫల్యం చేసుకున్నాడు. ఇక ఈ సిరీస్‌లో టీమిండియాను ఓడిపోకుండా నిలబెట్టాడు. వన్డే కెరీర్‌ను కూడా విదేశీ గడ్డపై (శ్రీలంక) మొదలుపెట్టిన ఈ టాపార్డర్ బ్యాటర్ ఇప్పుడు తొలి శతకాన్ని విదేశంలోనే నమోదు చేయడం విశేషం. సెంచూరియన్: హైదరాబాదీ సంచలనం ఠాకూర్ తిలక్ వర్మ అజేయ సెంచరీతో భారత్‌కు విజయ తిలకం దిద్దడంతో పర్యాటక జట్టు ఇక ఈ సిరీస్ గెలిచే స్థితిలో తప్ప ఓడే అవకాశం లేదు. మూడో టి20లో 11 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో పైచేయి సాధించింది. భారత్ 2–1తో ఆధిక్యంలో ఉండగా, శుక్రవారం (15న) జొహన్నెస్‌బర్గ్‌లో ఆఖరి నాలుగో టి20 మ్యాచ్ జరుగనుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీస్కోరు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ (56 బంతుల్లో 107 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతక్కొట్టగా, ఓపెనర్ అభిషేక్ శర్మ (25 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచేశాడు. సిమ్‌లేన్, కేశవ్ మహరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం కష్టమైన లక్ష్యఛేదనకు దిగిన సఫారీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి ఓడింది. మార్కొ జాన్సెన్ (17 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), క్లాసెన్ (22 బంతుల్లో 41; 1 ఫోర్, 4 సిక్స్‌లు) విరుచుకుపడ్డారు. 51 బంతుల్లోనే సెంచరీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సంజూ సామ్సన్ (0) డకౌటయ్యాడు. మూడో బంతికి క్రీజులోకి వచ్చిన తిలక్... ఓపెనర్ అభిషేక్‌తో ధనాధన్ ఆటకు శ్రీకారం చుట్టాడు. ఇద్దరి జోరుతో 8.1 ఓవర్లో జట్టు స్కోరు 100కు చేరింది. అదే ఓవర్లో అభిషేక్ 24 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకొని అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కెప్టెన్ సూర్యకుమార్ (1), హార్దిక్ పాండ్యా (18; 3 ఫోర్లు) మెరిపించలేదు. 32 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాక తిలక్ విశ్వరూపం చూపించాడు. కేశవ్ వేసిన 15వ ఓవర్లో వరుసగా 4, 6, 4 కొట్టిన తిలక్... కొయెట్జీ 16వ ఓవర్లో 2 సిక్స్‌లు, ఒక బౌండరీ బాదడంతో ఈ రెండు ఓవర్ల వ్యవధిలోనే 55 స్కోరు నుంచి అనూహ్యంగా 87కు చేరాడు. 19వ ఓవర్లో ఫోర్ కొట్టి 51 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. రమణ్‌దీప్ (6 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో భారత్ 200 పైచిలుకు స్కోరు చేసింది. క్లాసెన్, జాన్సెన్ మెరుపులు దూకుడుగా మొదలైన దక్షిణాఫ్రికా లక్ష్యఛేదనకు మూడో ఓవర్ నుంచే ముకుతాడు పడింది. రికెల్టన్ (20), హెండ్రిక్స్ (21), స్టబ్స్ (12), కెపె్టన్ మార్క్రమ్ (18 బంతుల్లో 29; 2 సిక్స్‌లు) ధాటిగా ఆడే క్రమంలో వికెట్లను పారేసుకున్నారు. దీంతో సగం ఓవర్లు ముగిసేసరికి టాప్–4 బ్యాటర్లను కోల్పోయిన సఫారీ 84 పరుగులు చేసింది. మిగతా సగం ఓవర్లలో 136 పరుగుల సమీకరణం ఆతిథ్య జట్టుకు కష్టమైంది. అయితే హిట్టర్ క్లాసెన్ భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. వరుణ్ వేసిన 14వ ఓవర్లో క్లాసెన్ 6, 6, 6, 0, 4, 1లతో 23 పరుగుల్ని పిండుకున్నాడు. అతని జోరుకు అర్ష్ దీప్ కళ్లెం వేయగా, తర్వాత జాన్సెన్ ధనాధన్ షోతో భారత శిబిరాన్ని వణికించాడు. చివరి 2 ఓవర్లలో దక్షిణాఫ్రికా విజయానికి 51 పరుగులు కావాలి. హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో జాన్సెన్ 26 పరుగులు సాధించాడు. విజయం కోసం దక్షిణాఫ్రికా 6బంతుల్లో 25 పరుగులు చేయాల్సి ఉండగా, ఆఖరి ఓవర్లో అర్ష్ దీప్ అతన్ని అవుట్ చేయడంతో భారత్ విజయం సాధించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) జాన్సెన్ 0; అభిషేక్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) కేశవ్ 50; తిలక్ వర్మ (నాటౌట్) 107; సూర్యకుమార్ (సి) జాన్సెన్ (బి) సిమ్‌లేన్ 1; హార్దిక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కేశవ్ 18; రింకూ సింగ్ (బి) సిమ్‌లేన్ 8; రమణ్‌దీప్ (రనౌట్) 15; అక్షర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–0, 2–107, 3–110, 4–132, 5–190, 6–218. బౌలింగ్: జాన్సెన్ 4–0–28–1, కొయెట్జీ 3–0–51–0, సిపామ్లా 4–0–45–0, సిమ్‌లేన్ 3–0–34–2, మార్క్రమ్ 2–0–19–0, కేశవ్ 4–0–36–2.దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (బి) అర్ష్ దీప్ 20; హెండ్రిక్స్ (స్టంప్డ్) (బి) వరుణ్ 21; మార్క్రమ్ (సి) రమణ్‌దీప్ (బి) వరుణ్ 29; స్టబ్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్ 12; క్లాసెన్ (సి) తిలక్ (బి) అర్ష్ దీప్ 41; మిల్లర్ (సి) అక్షర్ (బి) హార్దిక్ 18; జాన్సెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్ 54; కొయెట్జీ (నాటౌట్) 2; సిమ్‌లేన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–27, 2–47, 3–68, 4–84, 5–142, 6–167, 7–202. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–37–3, హార్దిక్ 4–0–50–1, అక్షర్ 4–0–29–1, వరుణ్ 4–0–54–2, రవి బిష్ణోయ్ 4–0–33–0.8 ఈ ఏడాది భారత జట్టు టి20ల్లో 8 సార్లు 200 పైచిలుకు పరుగులు సాధించింది. గత ఏడాది భారత జట్టు ఏడుసార్లు ఈ మైలురాయిని దాటింది.12 అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ సాధించిన 12వ భారతీయ క్రికెటర్‌గా తిలక్ వర్మ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (4), కేఎల్ రాహుల్ (2), సంజూ సామ్సన్ (2), సురేశ్ రైనా (1), దీపక్ హుడా (1), విరాట్ కోహ్లి (1), శుబ్‌మన్ గిల్ (1), యశస్వి జైస్వాల్ (1), రుతురాజ్ గైక్వాడ్ (1), అభిషేక్ శర్మ (1) ఉన్నారు. అంతర్జాతీయ టి20ల్లో ఓవరాల్‌గా భారత క్రికెటర్లు 21 సెంచరీలు నమోదు చేశారు. -
భారం బ్యాటర్లపైనే!.. ఆధిక్యంపై భారత్ కన్ను
సెంచూరియన్: సిరీస్‌లో పైచేయి సాధించడమే లక్ష్యంగా భారత జట్టు మూడో టి20 బరిలోకి దిగుతోంది. సూర్యకుమార్ సేన గత మ్యాచ్‌లో ఓడినా కూడా తక్కువ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టును వణికించింది. తొలి మ్యాచ్‌లో బ్యాటర్లు, రెండో మ్యాచ్‌లో బౌలర్లు సత్తా చాటుకున్నారు. ఇప్పుడు ఈ రెండు విభాగాలు పట్టు బిగిస్తే మూడో మ్యాచ్ గెలవడం ఏమంత కష్టమే కాదు. మరోవైపు సొంతగడ్డపై రెండు మ్యాచ్‌ల్లోనూ సఫారీల ప్రభావం అంతంతే! గత మ్యాచ్ గెలిచినా... అది గట్టెక్కడమే కానీ సాధికారిక విజయం కానేకాదు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మూడో టి20 కోసం పెద్ద కసరత్తే చేసింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి బ్యాటర్లు నెట్స్‌లో చెమటోడ్చారు. ఇది నాలుగు మ్యాచ్‌ల సిరీస్ కావడంతో బుధవారం జరిగే పోరులో ఎవరు గెలిచినా ఆ జట్టు సిరీస్‌ను చేజార్చుకోదు. నిలకడే అసలు సమస్య ఓపెనర్లలో సంజూ సామ్సన్ తొలి మ్యాచ్‌లో చెలరేగాడు. గత మ్యాచ్‌లో అతను విఫలమైనా ఫామ్‌పై ఏ బెంగా లేదు. కానీ అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలు జట్టు శుభారంభానికి ప్రతికూలంగా మారుతోంది. డర్బన్‌లో (7), పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో (4) సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యాడు. ఇప్పుడు సెంచూరియన్‌లో అయినా అభిషేక్ బ్యాట్ ఝళిపిస్తే బ్యాటింగ్ బలగం పెరుగుతుంది. రెండో మ్యాచ్‌లో టాపార్డర్ వైఫల్యం, నిలకడలేని మిడిలార్డర్‌తో భారత్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో 20, 30 పరుగులు వచ్చే చోట 11 పరుగులే చేయడం బ్యాటింగ్ లోపాల్ని ఎత్తిచూపుతోంది. సూర్యకుమార్ నుంచి కూడా అలరించే ఇన్నింగ్స్ ఇంకా రాలేదు. ఈ మ్యాచ్‌లో అతని 360 డిగ్రీ బ్యాటింగ్ చూపిస్తే ఇన్నింగ్స్ దూసుకెళుతుంది. ఈ సిరీస్‌లో స్పిన్నర్లు వరుణ్, రవి బిష్ణోయ్‌లు సత్తా చాటుకుంటున్నారు. ఈ బౌలింగ్ ద్వయంకు ఊతమిచ్చేలా బ్యాటింగ్ దళం కూడా బాధ్యత పంచుకుంటే భారత్ ఈ మ్యాచ్‌లో గెలుస్తుంది. లేదంటే గత మ్యాచ్‌లో ఎదురైన ఫలితం వచి్చనా ఆశ్చర్యపోనక్కర్లేదు. టాపార్డర్‌లో లోపించిన నిలకడ గత మ్యాచ్‌కు సమస్యగా మారింది. వీటిని వెంటనే అధిగమిస్తేనే అనుకున్న ఫలితాలు సాధించవచ్చు.పైచేయి కోసం ప్రయత్నం మరోవైపు ఆతిథ్య దక్షిణాఫ్రికా కూడా సిరీస్‌లో పైచేయి సాధించాలని పట్టుదలగా ఉంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు పూర్తయినా... సఫారీ ఆటతీరు అంతంతమాత్రంగానే ఉంది. డర్బన్‌లో రెండొందల పైచిలుకు లక్ష్యానికి చేతులెత్తేసిన బ్యాటర్లు... రెండో టి20లో 125 పరుగులు చేసేందుకు కూడా తెగ కష్టపడ్డారు. చివరకు ఏదోలా గెలిచినా ఇదే తీరు కొనసాగితే మాత్రం సిరీస్ కోల్పోక తప్పదు. రికెల్టన్, హెండ్రిక్స్, మార్క్రమ్లతో కూడిన టాపార్డర్, క్లాసెన్, మిల్లర్‌లాంటి హిట్టర్లతో కూడిన మిడిలార్డర్ భారత స్పిన్నర్లకు ఏమాత్రం నిలబడలేకపోతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో కలిపి వరుణ్ (3/25, 5/17) 8 వికెట్లు తీశాడు. దీంతో సఫారీ జట్టు మేనేజ్మెంట్ అతన్ని ఎదుర్కోనేందుకు పెద్ద కసరత్తే చేసింది.సెంచూరియన్‌లో అది ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. బౌలర్లలో కొయెట్జీ, మార్కొ జాన్సెన్ భారత బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. పేస్‌కు అనుకూలించే సెంచూరియన్‌లో పోరు ఆసక్తికరంగా జరగడం ఖాయం. -
క్లీన్ స్వీప్‌పై కన్నేసిన టీమిండియా.. నేడు (జులై 30) శ్రీలంకతో మూడో టీ20
శ్రీలంకతో చివరిదైన మూడో టీ20 ఇవాళ (జులై 30) జరుగనుంది. పల్లెకెలె వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుంది. తొలి రెండు టీ20ల్లో టీమిండియా ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే.సిరీస్ ఫలితం తేలిపోవడంతో నేటి మ్యాచ్‌లో భారత్ ప్రయోగాల బాట పట్టవచ్చు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇప్పటివరకు అవకాశాలు రాని వారికి ఛాన్స్ ఇవ్వవచ్చు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన మేరకు రాణించలేకపోయిన సిరాజ్ స్థానంలో ఖలీల్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. రెండో టీ20కి ముందు మెడ కండరాలు పట్టేయడంతో ఆ మ్యాచ్ ఆడలేకపోయిన శుభ్‌మన్ గిల్ నేటి మ్యాచ్‌కు కూడా బెంచ్‌కే పరిమితం కావచ్చు. మేనేజ్మెంట్ సంజూ శాంసన్‌కు మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా స్థానంలో శివమ్ దూబే.. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.మరోవైపు శ్రీలంక నేటి మ్యాచ్ కోసం పూర్తి స్థాయి జట్టునే బరిలోకి దించవచ్చు. ఆ జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంకకు మంచి ఆరంభాలే లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలుచుకోలేకపోయింది. రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ స్వల్ప వ్యవధిలో పేకమేడలా కూలింది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందుంచాలని భావిస్తుంది. ఈ సిరీస్ అనంతరం కొలొంబో వేదికగా ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 2, 4 , 7 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత వన్డే ప్లేయర్లు ఇప్పటికే కొలొంబోకు చేరుకున్నారు. నిన్న వర్షం కారణంగా భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ చేయలేకపోయారు.తుది జట్లు (అంచనా)..టీమిండియా: యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రిషబ్ పంత్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్ -
Ind vs SL 3rd T20: క్లీన్‌స్వీప్ లక్ష్యంగా...
పల్లెకెలె: భారత్ రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు గెలిచింది. టి20 సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఇప్పుడు దీన్ని 3–0గా వైట్‌వాష్ చేసేందుకు భారత్ ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆతిథ్య శ్రీలంకపై ముచ్చటగా మూడో విజయం సాధించేందుకు సూర్యకుమార్ బృందం తహతహలాడుతోంది. మంగళవారం జరిగే మూడో టి20 బరిలోకి టీమిండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బ్యాటర్లు, బౌలర్లు ఫామ్‌లో ఉండటంతో ‘హ్యాట్రిక్’ గెలుపుపై ఎవరికి అనుమానాల్లేవ్! మరోవైపు లంక సొంతగడ్డపై పరువు కోసం పాకులాడుతోంది. కనీసం ఆఖరి పోరులో గెలిచి క్లీన్‌స్వీప్ కాకుండా బయటపడాలని ఆరాటపడుతోంది. టీమిండియాకు ఎదురుందా... ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. గిల్ స్థానంలో రెండో టి20 ఆడిన సంజూ సామ్సన్ డకౌట్‌ను మరిచేలా మెరిపిస్తే ఇన్నింగ్స్‌కు ఢోకా ఉండదు. సూర్యకుమార్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యాలు మిగతా పని కానిచ్చేస్తారు. బౌలర్లు అర్‡్షదీప్, అక్షర్, రవి బిష్ణోయ్, సిరాజ్‌లు కూడా నిలకడగా రాణిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో దూసుకెళ్తున్న లంక ఇన్నింగ్స్‌ను 30 పరుగుల వ్యవధిలో 9 వికెట్లను కూల్చారు. రెండో మ్యాచ్‌లో 32 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను తీసిన టీమిండియా బౌలింగ్ దళం సత్తాచాటుకుంది. ఈ ఒక్కటైనా గెలవాలని... సిరీస్‌ను చేజార్చుకున్న శ్రీలంక ఆఖరి పోరులో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డనుంది. వచ్చే నెల 2 నుంచి జరిగే వన్డే సిరీస్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలని ఆశిస్తోంది. నిలకడలేని బ్యాటింగ్, పసలేని బౌలింగ్ ఆతిథ్య జట్టుకు తలనొప్పిగా మారింది. భారత్ నుంచి వైట్‌వాష్ తప్పించుకోవాలంటే మాత్రం వ్యూహాలకు పదును పెట్టాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. ఓపెనర్ నిసాంక మాత్రమే రెండు మ్యాచ్‌ల్లో కుదురుగా ఆడాడు. మిగతా వారంతా భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోతున్నారు. ఇకపై లోపాలను అధిగమించి విజయాన్నందుకోవాలని లంక సేన పట్టుదలతో ఉంది.పిచ్, వాతావరణం వేదిక మారలేదు కానీ గత రెండు మ్యాచ్‌లు ఆడిన పిచ్‌పై కాకుండా వేరే పిచ్‌పై ఈ మ్యాచ్ జరుగుతుంది. బ్యాటింగ్‌కు అనుకూలమే అలాగే స్పిన్నర్లకు కలిసొచ్చే పిచ్. వర్ష సూచన ఉన్నప్పటికీ మ్యాచ్ జరుగుతుంది. జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), యశస్వి, సంజూ సామ్సన్, రిషభ్ పంత్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, పరాగ్, అక్షర్, రవి బిష్ణోయ్, అర్‡్షదీప్, సిరాజ్. శ్రీలంక: అసలంక (కెప్టెన్), నిసాంక, కుశాల్ మెండిస్, పెరీరా, కమిండు మెండీస్, షనక, హసరంగ, తీక్షణ, పతిరణ, మదుషంక, ఫెర్నాండో. -
మళ్లీ మనదే గెలుపు
జింబాబ్వేపై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు చక్కటి ప్రదర్శన చేయడంతో మరో పోరులో టీమిండియాకు సునాయాస విజయం దక్కింది. టి20 వరల్డ్ కప్‌లో ఆడిన ముగ్గురు ఆటగాళ్ల పునరాగమనంతో బ్యాటింగ్ ఆర్డర్లో కొంత మార్పు వచ్చినా... చివరకు భారత్‌దే పైచేయి అయింది. గత మ్యాచ్ తరహాలోనే ఈసారి కూడా పేలవ బ్యాటింగ్‌తోనే ఆతిథ్య జింబాబ్వే జట్టు ఆరంభంలోనే ఆటను అప్పగించింది. ఇక శనివారం జరిగే నాలుగో మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ మన ఖాతాలో చేరుతుంది. హరారే: జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్ 2–1తో ముందంజలో నిలిచింది. బుధవారం జరిగిన మూడో టి20లో భారత్ 23 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (27 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేయగలిగింది. డియాన్ మైర్స్ (49 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), క్లయివ్ మదాండె (26 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వాషింగ్టన్ సుందర్ (3/15) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. శనివారం ఇదే మైదానంలో నాలుగో టి20 జరుగుతుంది. కీలక భాగస్వామ్యాలు... భారత్ తమ ఇన్నింగ్స్‌ను జోరుగా ప్రారంభించింది. తొలి ఓవర్లో జైస్వాల్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా, రెండో ఓవర్లో గిల్ 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 55 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు గిల్‌తో 50 బంతుల్లో 67 పరుగులు జోడించిన తర్వాత జైస్వాల్ వెనుదిరిగాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో అభిõÙక్ శర్మ (10) ఈసారి ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో జత కలిసిన గిల్, రుతురాజ్ మరింత ధాటిగా ఆడారు. మదెవెరె ఓవర్లో ఇద్దరూ చెరో సిక్స్ కొట్టగా... ఆ తర్వాత సికందర్ రజా ఓవర్లోనూ ఇదే పునరావృతమైంది. ఎట్టకేలకు గిల్‌ను అవుట్ చేసి ముజరబాని ఈ భాగస్వామ్యాన్ని ముగించాడు. గిల్, రుతురాజ్ మూడో వికెట్‌కు 44 బంతుల్లోనే 72 పరుగులు జత చేశారు. 36 బంతుల్లో గిల్ అర్ధసెంచరీ చేయగా... ఎన్‌గరవ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన రుతురాజ్ అర్ధ సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. జింబాబ్వే పేలవ ఫీల్డింగ్‌తో భారత్‌కు అదనపు అవకాశాలు కల్పించింది. గిల్, జైస్వాల్, రుతురాజ్ ఇచ్చిన క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలేశారు. చివరి 4 ఓవర్లలో భారత్ 52 పరుగులు చేసింది. టి20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యులైన జైస్వాల్, సామ్సన్, దూబే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగగా... పరాగ్, సాయిసుదర్శన్, జురేల్‌లను పక్కన పెట్టారు. టపటపా... భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటర్లు నిలవలేకపోయారు. 13 బంతుల వ్యవధిలో తొలి 3 వికెట్లు కోల్పోయిన జట్టు ఆ తర్వాత ఒకే ఓవర్లో మరో 2 వికెట్లు చేజార్చుకుంది. 7 ఓవర్లు ముగిసేసరికి 39/5తో జింబాబ్వే ఓటమికి బాటలు వేసుకుంది. ఈ దశలో మైర్స్, మదాండె కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 57 బంతుల్లోనే 77 పరుగులు జోడించారు. అనంతరం 45 బంతుల్లో మైర్స్ తన కెరీర్లో తొలి హాఫ్ సెంచరీని అందుకున్నాడు. చివర్లో ఓవర్లో మైర్స్, మసకద్జా (10 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి 18 పరుగులు రాబట్టినా... అప్పటికే ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బెన్నెట్ (బి) రజా 36; గిల్ (సి) రజా (బి) ముజరబాని 66; అభిõÙక్ (సి) మరుమని (బి) రజా 10; రుతురాజ్ (సి) మదెవెరె (బి) ముజరబాని 49; సామ్సన్ (నాటౌట్) 12; రింకూ సింగ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–67, 2–81, 3–153, 4–177. బౌలింగ్: బెన్నెట్ 1–0–15–0, ఎన్‌గరవ 4–0–39–0, చటారా 3–0–30–0, ముజరబాని 4–0–25–2, రజా 4–0–24–2, మసకద్జా 3–0–25–0, మదెవెరె 1–0–19–0. జింబాబ్వే ఇన్నింగ్స్: మదెవెరె (సి) అభిషేక్ (బి) అవేశ్ 1; మరుమని (సి) దూబే (బి) ఖలీల్ 13; బెన్నెట్ (సి) బిష్ణోయ్ (బి) అవేశ్ 4; మైర్స్ (నాటౌట్) 65; రజా (సి) రింకూ (బి) సుందర్ 15; క్యాంప్‌బెల్ (సి) (సబ్) పరాగ్ (బి) సుందర్ 1; మదాండె (సి) రింకూ (బి) సుందర్ 37; మసకద్జా (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–9, 2–19, 3–19, 4–37, 5–39, 6–116. బౌలింగ్: ఖలీల్ 4–0–15–1, అవేశ్ 4–0–39–2, రవి బిష్ణోయ్ 4–0–37–0, వాషింగ్టన్ సుందర్ 4–0–15–3, అభిషేక్ 2–0–23–0, దూబే 2–0–27–0. 150 అంతర్జాతీయ టి20ల్లో భారత్ సాధించిన విజయాల సంఖ్య. ఇప్పటి వరకు 230 టి20 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 150 మ్యాచ్‌ల్లో గెలిచి ఈ మైలురాయి అందుకున్న తొలి జట్టుగా నిలిచింది. పాకిస్తాన్ (142), న్యూజిలాండ్ (111), ఆ్రస్టేలియా (105), దక్షిణాఫ్రికా (104), ఇంగ్లండ్ (100) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
సత్తా చాటిన శుభ్‌మన్, సుందర్.. మూడో టీ20లో టీమిండియా గెలుపు
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరిగిన మూడో టీ20 టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్‌మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఘోర ఓటమి దిశగా సాగింది. అయితే డియాన్ మైర్స్ (65 నాటౌట్), మదండే (37) జింబాబ్వేను దారుణ పరాభవం బారిన పడకుండా తప్పించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. ఓ దశలో (మైర్స్, మదండే క్రీజ్‌లో ఉండగా) జింబాబ్వే టీమిండియాకు షాకిచ్చేలా కనిపించింది. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (4-0-15-3), ఆవేశ్ ఖాన్ (4-0-39-2), ఖలీల్ అహ్మద్ (4-0-15-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. కాగా, తొలి మ్యాచ్‌లో జింబాబ్వే, రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. -
రోహిత్ శర్మను దాటేసిన యశస్వి జైస్వాల్
జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడిన యశస్వి జైస్వాల్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వి ఈ ఏడాది 14 ఇన్నింగ్స్‌ల్లో (అన్ని ఫార్మాట్లలో) 65.23 సగటున, 85.82 స్ట్రయిక్‌రేట్‌తో 848 పరుగులు చేశాడు. యశస్వి తర్వాత ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇబ్రహీం జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) ఉన్నాడు. జద్రాన్ 27 ఇన్నింగ్స్‌ల్లో 33.76 సగటున, 80.76 స్ట్రయిక్‌రేట్‌తో 844 పరుగులు చేశాడు. యశస్వి ఈ ఏడాది హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా మారే క్రమంలో టీమిండియా సారధి రోహిత్ శర్మను అధిగమించాడు. హిట్‌మ్యాన్ ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో 22 ఇన్నింగ్స్‌లు ఆడి 833 పరుగులు చేశాడు.జింబాబ్వే, భారత్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ సత్తా చాటడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్‌మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి టీ20 జింబాబ్వే.. రెండో మ్యాచ్ భారత్ గెలిచిన విషయం తెలిసిందే. -
ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన గిల్.. జింబాబ్వే టార్గెట్ 183
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటారు. రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్‌మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి టీ20 జింబాబ్వే.. రెండో మ్యాచ్ భారత్ గెలిచిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్‌కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా -
IND W vs SA W : సమం కోసం చివరి పోరు
చెన్నై: దక్షిణాఫ్రికా జట్టుపై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి... ఏకైక టెస్టులోనూ ఘనవిజయం సాధించిన భారత మహిళల జట్టుకు టి20 సిరీస్ కలిసి రాలేదు. తొలి మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓడిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందానికి రెండో టి20లో విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు వరుణుడు అవకాశం ఇవ్వలేదు. దాంతో రెండో టి20 ఫలితం తేలకుండానే ముగిసింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే చివరిదైన మూడో టి20లో గెలిచి సిరీస్‌ను 1–1తో సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే మంగళవారం కూడా వర్ష సూచన ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత బౌలర్లు రాణించలేకపోయారు. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి మ్యాచ్‌లో భారత బౌలర్ల నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్‌ను కెపె్టన్ హర్మన్‌ప్రీత్ ఆశిస్తోంది. -
మెరిసిన షఫాలీ: భారత్‌దే టి20 సిరీస్
సిల్హెట్: బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుసగా మూడో విజయంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే టి20 సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ఓపెనర్ దిలారా అక్తర్ (27 బంతుల్లో 39; 5 ఫోర్లు), కెప్టెన్ నిగర్ సుల్తానా (36 బంతుల్లో 28; 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ (2/22), శ్రేయాంక (1/25), రేణుక (1/25), పూజ (1/26) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 18.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (38 బంతుల్లో 51; 8 ఫోర్లు), స్మృతి మంధాన (42 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించడంతో విజయం మరింత సులువైంది. ఈ నెల 6న నాలుగో టి20 కూడా ఇదే వేదికపై జరుగనుంది. -
హసరంగపై సస్పెన్షన్ వేటు
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగపై సస్పెన్షన్ వేటు పడింది. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడో టీ20లో ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్‌ను దూషించినందుకు గాను ఐసీసీ హసరంగపై రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌తో పాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. ఈ ఘటనతో ఐదు డీ మెరిట్ పాయింట్లను పొందిన హసరంగ.. ఓ టెస్ట్, రెండు టీ20ల్లో (మొదట ఏది వస్తే అది) సస్పెన్షన్‌ను ఎదుర్కొంటాడు. దీంతో మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి రెండు టీ20లకు హసరంగ దూరం కానున్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.13ను ఉల్లంఘించినందుకు గాను హసరంగపై చర్యలకు ఆదేశించినట్లు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. హసరంగతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్‌పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. అదే మ్యాచ్‌లో అంపైర్ సూచనలు దిక్కరించినందుకు గుర్బాజ్ మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం జరిమానా విధించింది. కాగా, శ్రీలంకతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండగా (ఆఖరి మూడు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన తరుణంలో ).. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ వఫాదర్ మొమంద్ నడుము కంటే ఎత్తులో బంతి వేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్ నో బాల్‌గా ప్రకటించకపోవడంతో హసరంగ ఫైరయ్యాడు. అంపైర్ నిర్ణయంతో చిర్రెతిపోయిన హసరంగ కోపంగా అతని వైపు దూసుకొచ్చి దూషణను దిగాడు. చిన్న పిల్లల్ని అడిగినా ఆ బంతిని నో బాల్‌గా ప్రకటిస్తారు.. కళ్లు కనిపిస్తున్నాయా లేదా.. నువ్వు అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లకు పనికిరావు.. వెళ్లి వేరే ఏదైనా పని చూసుకో అంటూ అంపైర్‌పై దూషణ పర్వానికి దిగాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
రాణించిన రహ్మానుల్లా గుర్బాజ్.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
శ్రీలంక పర్యటనలో చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారీ స్కోర్ చేసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 21) జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో పర్యాటక టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (22 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (43 బంతుల్లో 70; 7 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోవడంతో ఆఫ్ఘన్ జట్టు శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ సాధించడంలో అజ్ముతుల్లా ఒమర్జాయ్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు) తన వంతు పాత్ర పోషించాడు. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ 10, మొహమ్మద్ నబీ 16 నాటౌట్, మొహమ్మద్ ఇషాక్ 16 నాటౌట్ పరుగులు చేయగా.. కరీం జనత్ డకౌటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో మతీశ పతిరణ, అఖిల ధనంజయ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ వనిందు హసరంగ ఓ వికెట్ దక్కించకున్నాడు. ఏంజెలో మాథ్యూస్ (2-0-21-0), నువాన్ తుషార (4-0-48-0) భారీగా పరుగులు సమర్పించుకోగా.. దసున్ షనక (2-0-16-0) పర్వాలేదనిపించాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన శ్రీలంక 2-0 తేడాతో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంక పర్యటనలో టెస్ట్, వన్డే సిరీస్ ఆడింది. తొలుత జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. అనంతరం జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టు 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ పర్యటన ఆఫ్ఘనిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మూడో టీ20లో భారీ స్కోర్ చేయడంతో విజయావకాశాలు ఉన్నాయి. -
టాప్-10లోకి దూసుకొచ్చిన జైస్వాల్, అక్షర్ పటేల్
ఐసీసీ తాజాగా (భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడో టీ20 అనంతరం) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, బౌలింగ్‌లో అక్షర్ పటేల్ టాప్-10లోకి దూసుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20లో మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించిన యశస్వి.. ఏడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. ఇదే సిరీస్‌లో విశేషంగా రాణించిన అక్షర్ పటేల్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి ఐదో ప్లేస్‌కు చేరుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో ఆడనప్పటికీ సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్‌ను కాపాడుకోగా.. ఆఫ్ఘన్ సిరీస్‌కు దూరమైన రుతురాజ్ ఓ స్థానం కోల్పోయి తొమ్మిదో ప్లేస్‌కు పడిపోయాడు. ఈ జాబితాలో ఫిలప్ సాల్ట్, మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్ రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ ఎఫెక్ట్ సహచర బౌలర్ రవి భిష్ణోయ్పై పడింది. తాజా ర్యాంకింగ్స్‌లో బిష్ణోయ్ ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి ఆరో ప్లేస్‌కు పడిపోయాడు. జింబాబ్వే సిరీస్‌లో రాణించిన లంక బౌలర్లు హసరంగ, తీక్షణ ఒకటి, రెండు స్థానాలు మెరుగుపర్చుకుని సంయుక్తంగా మూడో స్థానానికి ఎగబాకారు. ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అకీల్ హొసేన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని రెండో ప్లేస్‌కు చేరాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న ముగిసిన టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రసవత్తరంగా సాగిన నిన్నటి సమరంలో భారత్ రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. తొలుత రోహిత్ శర్మ మెరుపు శతకంతో విరుచుకుపడటంతో భారత్ 212 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో సైతం మరోసారి స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. -
ఫిన్ అలెన్ సునామీ శతకం.. పాక్‌కు మరో ఘోర పరాభవం
పాకిస్తాన్ జట్టుకు మరో ఘోర పరాభవం ఎదురైంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో చేతిలో (0-3తో టెస్ట్ సిరీస్ ఓటమి) భంగపడ్డ ఆ జట్టు.. తాజాగా న్యూజిలాండ్ చేతిలో అంతకుమించిన అవమానాన్ని (0-3తో టీ20 సిరీస్ ఓటమి) ఎదుర్కొంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కోల్పోయి ఇంటాబయట అభిమానుల ఆగ్రహానికి గురవుతుంది. వన్డే ప్రపంచకప్ నుంచి చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్న పాక్ క్రికెట్ జట్టును పూర్తిగా ప్రక్షాళణ చేయాలని ఆ జట్టు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఫిన్ అలెన్ సునామీ శతకంతో (62 బంతుల్లో 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 137 పరుగులు) విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 224 పరుగుల భారీ స్కోర్ (7 వికెట్ల నష్టానికి) చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో అలెన్ మినహా టిమ్ సీఫర్ట్ (31), గ్లెన్ ఫిలిప్స్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అలెన్‌తో పాటు మరొక్కరు రాణించినా న్యూజిలాండ్ ఇంతకంటే భారీ స్కోర్ చేసేది. అలెన్ ధాటికి పాక్ బౌలర్లు షాహీన్ అఫ్రిది (4-0-43-1), హరీస్ రౌఫ్ (4-0-60-2), మొహమ్మద్ నవాజ్ (4-0-44-1) బెంబేలెత్తిపోయారు. ఈ ముగ్గురు 10కిపైగా ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 కోల్పోయి 179 పరుగులకు మాత్రమే పరిమతమై 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ ఇన్నింగ్స్‌లో మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (58) అర్ధసెంచరీతో రాణించాడు. టీ20ల్లో బాబర్‌కు ఇది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (10), మొహమ్మద్ రిజ్వాన్ (24), ఫకర్ జమాన్ (19), ఆజం ఖాన్ (10), ఇఫ్తికార్ అహ్మద్ (1), మొహమ్మద్ నవాజ్ (28) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో సౌథీ 2, హెన్రీ, ఫెర్గూసన్, సాంట్నర్, సోధి తలో వికెట్ పడగొట్టారు. నామమాత్రపు నాలుగో టీ20 జనవరి 19న క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది. -
విధ్వంసం.. ఊచకోత.. ఎన్ని చెప్పినా తక్కువే, 16 సిక్స్‌లతో పరుగుల సునామీ
న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ సరసన నిలిచాడు. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జజాయ్ 16 సిక్సర్లు బాదగా.. తాజాగా అలెన్ జజాయ్ రికార్డును సమం చేశాడు. స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అరివీర భయంకర ఫామ్‌లో ఉన్న అలెన్.. డునెడిన్ వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి 62 బంతుల్లో 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో విధ్వంసర శతకం (137) బాదాడు. అలెన్ తన సెంచరీని కేవలం 48 బంతుల్లోనే పూర్తి చేశాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అలెన్‌దే అత్యుత్తమ స్కోర్. దీనికి ముందు ఈ రికార్డు బ్రెండన్ మెక్కల్లమ్ (123) పేరిట ఉండింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. అలెన్ ఊచకోత ధాటికి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో అలెన్ ఒక్కడే వన్ మ్యాన్ షో చేశాడు. టిమ్ సీఫర్ట్ (31) పర్వాలేదనిపించగా.. కాన్వే (7), డారిల్ మిచెల్ (8), చాప్మన్ (1), సాంట్నర్ (4) విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో అలెన్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. ఈ ఇన్నింగ్స్ గురించి విధ్వంసం.. ఊచకోత లాంటి ఎన్ని పదాలు వాడినా తక్కువే అవుతుంది. అంతర్జాతీయ టీ20ల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని విశ్లేషకులు కొనియాడుతున్నారు. ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న ఫిన్ అలెన్ రెండో మ్యాచ్‌లో 74 (41 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), తొలి టీ20లో 34 (15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. మూడో మ్యాచ్‌లో అలెన్ విధ్వంసం ధాటికి పాక్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. షాహీన్ అఫ్రిది (4-0-43-1), హరీస్ రౌఫ్ (4-0-60-2), మొహమ్మద్ నవాజ్ (4-0-44-1) 10కిపైగా ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు. పాక్ బౌలర్లలో అలెన్ ధాటి నుంచి మొహమ్మద్ వసీం జూనియర్ (4-0-35-1), జమాన్ ఖాన్ (4-0-37-1) కాస్త తప్పించుకున్నారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 9 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసి, ఓటమి దిశగా సాగుతుంది. సైమ్ అయూబ్ (10), మొహమ్మద్ రిజ్వాన్ (24) ఔట్ కాగా.. బాబర్ ఆజమ్ (27), ఫకర్ జమాన్ (12) పోరాడుతున్నారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్ తొలి రెండు టీ20ల్లో ఓడింది. ఈ మ్యాచ్‌లో కూడా ఆ జట్టు ఓడితే మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కివీస్ వశమవుతుంది. -
IND VS SA 3rd T20: కోహ్లిని వెనక్కునెట్టిన సూర్యకుమార్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో మెరుపు శతకంతో (56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 100 పరుగులు) విరుచుకుపడిన సూర్యకుమార్.. భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. విరాట్ 107 ఇన్నింగ్స్‌ల్లో 117 సిక్సర్లు బాదగా.. స్కై కేవలం 57 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ రికార్డును అధిగమించాడు (123 సిక్సర్లు). ఈ విభాగంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ (140 ఇన్నింగ్స్‌ల్లో 182 సిక్సర్లు) స్కై, విరాట్ల కంటే ముందున్నాడు. వీరి తర్వాతి స్థానాల్లో కేఎల్ రాహుల్ (68 ఇన్నింగ్స్‌ల్లో 99), యువరాజ్ సింగ్ (51 ఇన్నింగ్స్‌ల్లో 74) ఉన్నారు. ఇదే మ్యాచ్‌లో స్కై మరిన్ని రికార్డులు కూడా సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీల రికార్డు (4).. రోహిత్ తర్వాత సెంచరీ చేసిన రెండో టీమిండియా కెప్టెన్‌గా.. నాలుగు అంతకంటే కింది స్థానాల్లో వచ్చి అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (15) చేసిన ఆటగాడిగా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, సూర్యకుమార్సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. స్కైకు యశస్వి జైస్వాల్ (60) అర్ధసెంచరీ తోడవ్వడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్ చేసింది. వీరిద్దరు మినహా టీమిండియా ఆటగాళ్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. -
సూర్యకుమార్ సుడిగాలి శతకం.. ప్రపంచ రికార్డు సమం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో శతక్కొట్టిన స్కై.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీల (4) ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఈ రికార్డును మ్యాక్స్‌వెల్, రోహిత్ శర్మ సంయుక్తంగా షేర్ చేసుకోగా.. తాజాగా స్కై ఈ ఇద్దరి సరసన చేరాడు. స్కైకు ఈ రికార్డు సాధించేందుకు కేవలం 57 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరం కాగా.. మ్యాక్స్‌వెల్ 92 ఇన్నింగ్స్‌ల్లో, రోహిత్ శర్మ 140 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు (29/2) బరిలోకి దిగిన స్కై.. తొలి 25 బంతుల్లో కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. ఆతర్వాత పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయిన సూర్యకుమార్.. ఆతర్వాతి 31 బంతుల్లో ఏకంగా 73 పరుగులు పిండుకుని సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కై తన కెరీర్లో చేసిన నాలుగు సెంచరీలు నాలుగు వేర్వేరు దేశాల్లో (భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా) చేసినవి కావడం విశేషం. కాగా, సూర్యకుమార్ యాదవ్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. స్కైకు యశస్వి జైస్వాల్ (60) అర్ధసెంచరీ తోడవ్వడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో స్కై, యవస్వి మినహా టీమిండియా ఆటగాళ్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. -
IND VS SA 3rd T20: పాపం గిల్.. కాస్త ధైర్యం చేసుండాల్సింది..!
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాది మాంచి జోరుమీదున్నట్లు కనిపించిన టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (12).. ఆతర్వాత తానెదుర్కొన్న రెండో బంతికే కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. మూడో ఓవర్ రెండో బంతికి ఎల్బీ కోసం కేశవ్ మహారాజ్ బిగ్గరగా అప్పీల్ చేయగా అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అయితే రీప్లేలో గిల్ ఔట్ కాలేదని తేలడంతో టీమిండియా అభిమానులంతా చాలా బాధపడ్డారు. రివ్యూ విషయంలో గిల్ కాస్త ధైర్యం చేసి ఉంటే ఔట్ కాకుండా బయటపడే వాడని అనుకుంటున్నారు. రిప్లే చూసిన అనంతరం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ హావభావాలు నెట్టింట వైరలవుతున్నాయి. రివ్యూ తీసుకోకుండా గిల్ చాలా తప్పు చేశాడన్నట్లు ద్రవిడ్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు. అసలే ఫామ్ లేమితో సతమతమవుతున్న గిల్ సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో గిల్ ఔటైన మరుసటి బంతికే తిలక్ వర్మ (0) కూడా ఔటయ్యాడు. ఈ రెండు వికెట్లు కేశవ్ మహారాజ్కే దక్కాయి. మూడో ఓవర్లోనే వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయినా టీమిండియా బ్యాటర్లు ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ (19), యశస్వి జైస్వాల్ (28) పోటాపోటీగా బౌండరీలు,సిక్సర్లు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 62/2గా ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తుంది. -
స్కై విధ్వంసకర శతకం.. కుల్దీప్ మాయాజాలం.. టీమిండియా ఘన విజయం
స్కై విధ్వంసకర శతకం.. కుల్దీప్ మాయాజాలం.. టీమిండియా ఘన విజయం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో డ్రాగా (తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది) ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత సూర్యకుమార్ విధ్వంసకర శతకంతో (56 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడగా.. అనంతరం కుల్దీప్ ఐదు వికెట్ల ప్రదర్శనతో (2.5-0-17-5) మాయాజాలం చేసి టీమిండియాను గెలిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. స్కై శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా కుల్దీప్ ధాటికి 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో జడేజా 2, అర్షదీప్, ముకేశ్ తలో వికెట్ పడగొట్టగా.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మిల్లర్ (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 89 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో కేశవ్ మహారాజ్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 82 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఫెహ్లుక్వాయో (0) ఔటయ్యాడు. 75 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 202 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 75 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో ఫెరియెరా (12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా జడేజా బౌలింగ్‌లో జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ (25) ఔటయ్యాడు. 6.1 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 42/4గా ఉంది. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 42 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో క్లాసెన్ (5) క్యాచ్ ఔటయ్యాడు. 5.4 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 42/3గా ఉంది. మార్క్రమ్ (25), మిల్లర్ క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 202.. రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా సిరాజ్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రీజా హెండ్రిక్స్‌ను (8) రనౌట్ చేశాడు. టార్గెట్ 202.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా ముకేశ్ కుమార్ వేసిన రెండో ఓవర్లో సౌతాఫ్రికా వికెట్ కోల్పోయింది. ముకేశ్ బౌలింగ్‌లో బ్రీట్జ్కీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు తొలి ఓవర్‌ను సిరాజ్ మెయిడిన్ చేశాడు. సూర్యకుమార్ సుడిగాలి శతకం.. టీమిండియా భారీ స్కోర్ సూర్యకుమార్ యాదవ్ సుడిగాలి శతకంతో (56 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. స్కైకు యశస్వి జైస్వాల్ (60) అర్ధసెంచరీ తోడవ్వడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్ చేసింది. ఆఖరి ఓవర్లో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. జడేజాను (4) అనవసరంగా రనౌట్ చేసిన జితేశ్ శర్మ (4) హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. సూర్యకుమార్ ఊచకోత.. 55 బంతుల్లో శతకం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ 55 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 19.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 194/4గా ఉంది. స్కైతో పాటు జితేశ్ శర్మ క్రీజ్‌లో ఉన్నాడు. సెంచరీకి చేరువైన స్కై హాఫ్ సెంచరీ తర్వాత పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతున్న స్కై సెంచరీకి చేరువయ్యాడు. 50 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 92 పరుగులతో అజేయంగా నిలిచాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 173/3గా ఉంది. స్కైతో పాటు రింకూ (5) క్రీజ్‌లో ఉన్నాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. జైస్వాల్ ఔట్ 141 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. షంషి బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ (60) ఔటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 141/3గా ఉంది. సూర్యకుమార్ (65), రింకూ సింగ్ క్రీజ్‌లో ఉన్నారు. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 108/2 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 108/2గా ఉంది. జైస్వాల్ (57), స్కై (35) ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. 2 వికెట్లు పడ్డా చెలరేగి ఆడుతున్న జైస్వాల్, స్కై మూడో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయినా టీమిండియా బ్యాటర్లు ఏమాత్రం తగ్గకుండా దూకుడుగా ఆడుతున్నారు. జైస్వాల్ (28), జ్కై (19) పోటాపోటీగా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 62/2గా ఉంది. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన టీమిండియా 29 పరుగుల వద్ద (2.2 ఓవర్లు) టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అతర్వాతి బంతికే టీమిండియా మరో వికెట్ కూడా కోల్పోయింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (12), తిలక్ వర్మ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లు బాదిన గిల్ రెండో టీ20లో డకౌట్ అయిన శుభ్‌మన్ గిల్.. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అరంగేట్రం బౌలర్ నండ్రే బర్గర్ బౌలింగ్‌లో చివరి 3 బంతులను గిల్ బౌండరీలుగా మలిచాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న కీలకమైన మూడో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా ఏకంగా మూడు మార్పులు చేయగా.. భారత్, రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టునే యధాతథంగా కొనసాగిస్తుంది. ట్రిస్టన్ స్టబ్స్ స్థానంలో డొనొవన్ ఫెరియెరా.. మార్కో జాన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ స్థానాల్లో కేశవ్ మహారాజ్, నండ్రే బర్గర్ జట్టులోకి వచ్చారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్. సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డొనొవన్ ఫెరియెరా, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్, నండ్రే బర్గర్, అండిల్ ఫెహ్లుక్వాయో, లిజాడ్ విలియమ్స్, తబ్రేజ్ షంసీ. -
IND VS AUS 3rd T20: 35 బంతుల్లోనే శతక్కొట్టిన రుతురాజ్
గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్న అతను 13 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 123 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో నిదానంగా ఆడిన రుతురాజ్ ఆతర్వాత గేర్ మార్చి చెలరేగిపోయాడు. తానెదుర్కొన్న తొలి 22 బంతుల్లో కేవలం 22 పరుగులు మాత్రమే చేసిన రుతు.. ఆతర్వాతి 35 బంతుల్లో ఏకంగా 101 పరుగులు బాదాడు. మ్యాక్స్‌వెల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రుతురాజ్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. ఈ ఓవర్లో అతను సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేయడంతో పాటు మరో 2 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో రుతురాజ్ భారత్ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన తొమ్మిదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ చేసిన స్కోర్ (123 నాటౌట్) భారత్ తరఫున టీ20ల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా రికార్డైంది. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు శుభ్‌మన్ గిల్ (126 నాటౌట్) పేరిట ఉంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో మ్యాక్స్‌వెల్ విధ్వంసకర శతకం (48 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) బాది ఆసీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆసీస్ గెలుపుకు చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కాగా మ్యాక్సీ, మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) తలో చేయి వేసి ఆసీస్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో ఆసీస్ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. -
వస్తాడు.. సునామీలా విరుచుకుపడతాడు.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను లాగేసుకుపోతాడు..!
ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రస్తుత భారత పర్యటనలో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ పర్యటనలో అతను నెల వ్యవధిలో మూడు మెరుపు శతకాలతో విరుచుకుపడ్డాడు. వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 బంతుల్లోనే శతక్కొట్టిన (9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 106) మ్యాక్సీ.. అదే వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ద్విశతకం (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) బాది తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. తాజాగా భారత్‌తో జరిగిన మూడో టీ20లోనూ ఇంచుమించు అలాంటి మెరుపు ఇన్నింగ్సే ఆడిన మ్యాక్సీ.. ఈ మ్యాచ్‌లోనూ తన జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చి ఛేజింగ్‌లో కింగ్ అనిపించుకున్నాడు. మ్యాక్సీ గత 21 రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు ఫార్మాట్లలో ఛేజింగ్ చేస్తూ రెండు చిరస్మరణీయ సెంచరీలు సాధించాడు. దీంతో సోషల్‌మీడియా మొత్తం అతని నామస్మరణతో మార్మోగిపోతుంది. వీడెక్కడి మనిషి రా బాబూ.. టోర్నడోలా వచ్చి అమాంతం మ్యాచ్‌ను ఎగరేసుకుపోతాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఆసీస్ గెలవడం కష్టం అనుకున్న ప్రతిసారి మెరుపు ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ను లగేసుకుంటున్న వైనాన్ని కొనియాడుతూ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో మ్యాక్స్‌వెల్‌ను మించినోడు లేడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పొట్టి క్రికెట్లో ఇతనికి మించిన ఫినిషన్ లేడు, రాబోడని కితాబునిస్తున్నారు. -
అతడు నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు.. ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు: సూర్యకుమార్
గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర శతకంతో (48 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడి ఆసీస్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో మ్యాక్స్‌వెల్ విశ్వరూపం ప్రదర్శించి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కాగా మ్యాక్సీ, మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) తలో చేయి వేసి ఆసీస్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో ఆసీస్ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మ్యాక్స్‌వెల్‌ను త్వరగా ఔట్ చేయాలనుకున్న మా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అతడు మాపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. మంచులో 220 స్కోర్‌ను డిఫెండ్ చేయాలంటే, బౌలర్లకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. ఈ విషయంలో కూడా మా ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఆస్ట్రేలియా మొదటి నుంచే గేమ్‌లో ఉండింది. ఆఖర్లో వారు మాపై పైచేయి సాధించారు. అక్షర్ అనుభవజ్ఞుడైన బౌలర్. మంచు అధికంగా కురుస్తున్నప్పుడు అనుభవజ్ఞుడైన బౌలర్ స్పిన్నర్ అయినా పేసర్ అయినా ఫలితం ఒకేలా ఉంటుంది. అందుకే 19వ ఓవర్ అక్షర్‌కు ఇచ్చా. ఇది కూడా మిస్ ఫైర్ అయ్యింది. ఓడినప్పటికీ అబ్బాయిల ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉందని అన్నాడు. -
టీ20 బాస్ మ్యాక్సీ.. హిట్‌మ్యాన్ ప్రపంచ రికార్డు సమం
గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో సుడిగాలి శతకంతో (48 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడిన మ్యాక్స్‌వెల్.. టీ20ల్లో ఆసీస్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ (47 బంతుల్లో) రికార్డుతో పాటు మరో ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీల (4) రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండగా.. తాజాగా మ్యాక్స్‌వెల్ ఆ రికార్డును సమం చేశాడు. మ్యాక్సీ ఈ ప్రపంచ రికార్డును తన వందో మ్యాచ్‌లో సాధించడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు.. రోహిత్ శర్మ-4 గ్లెన్ మ్యాక్స్‌వెల్-4 బాబర్ ఆజమ్-3 సబావూన్ దవిజి-3 కొలిన్ మున్రో-3 సూర్యకుమార్ యాదవ్-3 విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక సెంచరీలు.. భారత్‌తో జరిగిన మూడో టీ20లో సెంచరీతో మ్యాక్స్‌వెల్ మరో రికార్డును కూడా సాధించాడు. విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక సెంచరీలు (3) చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో బాబర్ ఆజమ్ (2), ముహమ్మద్ వసీమ్ (2) మ్యాక్సీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత్‌పై అత్యధిక సిక్సర్లు.. నిన్నటి మ్యాచ్‌లో 8 సిక్సర్లు కొట్టిన మ్యాక్స్‌వెల్ టీ20ల్లో భారత్‌పై అత్యధిక సిక్సర్లు (37) బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో సెర్బియా ఆటగాడు లెస్లీ డన్బర్ (బల్గేరియాపై 42 సిక్సర్లు) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ రెండో స్థానంలో (వెస్టిండీస్‌పై 39 సిక్సర్లు) నిలిచాడు. ఇదిలా ఉంటే, భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో మ్యాక్స్‌వెల్ చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు. -
IND VS AUS 3rd T20: మ్యాక్స్‌వెల్ ఊచకోత.. ఫాస్టెస్ట్ సెంచరీ
గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం బాదాడు. ఫలితంగా ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. రుతురాజ్ మెరుపు శతకం.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (6), ఇషాన్ కిషన్ (0) నిరాశపర్చగా.. సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (24 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) పర్వాలేదనిపించారు. కేన్ రిచర్డ్సన్, బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ పడగొట్టారు. మ్యాక్సీ ఊచకోత.. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. మ్యాక్స్‌వెల్ సునామీ శతకంతో చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఆరోన్ హార్డీ (16), జోష్ ఇంగ్లిస్ (10), మార్కస్ స్టోయినిస్ (17) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ట్రవిస్ హెడ్ (35) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో మ్యాక్స్‌వెల్.. మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సహకారంతో ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత బౌలర్లలో రవి భిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రసిద్ద్ కృష్ణ (4-0-68-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి బంతికి గెలిచిన ఆసీస్.. ఆసీస్ గెలవాలంటే చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కావడంతో భారత గెలుపు లాంఛనమే అని అంతా అనుకున్నారు. అయితే మ్యాక్సీ ఒక్కసారిగా మెరుపుదాడికి దిగి భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. అక్షర్ వేసిన 19వ ఓవర్లో 22 పరుగులు, ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్లో 23 పరుగులు పిండుకున్న మ్యాక్సీ.. ఆఖరి బంతికి ఫోర్ బాది ఆసీస్‌ను గెలిపించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సమం చేసిన మ్యాక్సీ.. ప్రస్తుత భారత పర్యటనలో భీకర ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ వరల్డ్‌కప్ 2023లో రెండు మెరుపు శతకాలు బాదడంతో పాటు నిన్న (నవంబర్ 28) జరిగిన మూడో టీ20లోనూ సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. నిన్నటి మ్యాచ్‌లో 47 బంతుల్లోనే శతక్కొట్టిన అతను.. ఆస్ట్రేలియా తరఫున పొట్టి క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. మ్యాక్సీకి ముందు ఆరోన్ ఫించ్, జోష్ ఇంగ్లిస్ కూడా 47 బంతుల్లోనే శతకాలు బాదారు. ఆసీస్ తరఫున టీ20ల్లో టాప్-5 ఫాస్టెస్ట్ శతకాల్లో మ్యాక్స్వెల్వే మూడు ఉండటం విశేషం. దీనికి ముందు మ్యాక్సీ ఓసారి 49 బంతుల్లో, ఓసారి 50 బంతుల్లో టీ20 సెంచరీలు బాదాడు. -
భారత్‌తో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు.. స్టార్ ఆటగాళ్లంతా ఇంటికి
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 28) జరుగబోయే మూడో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత జట్టులోని సభ్యుల్లో ఆరుగురు స్వదేశానికి బయల్దేరతారని వెల్లడించింది. వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యులైన మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా, స్టోయినిస్, ఇంగ్లిస్, సీన్ అబాట్‌లకు విశ్రాంతినిస్తున్నట్లు పేర్కొంది. వీరిలో స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా రెండో టీ20 ముగిసిన అనంతరమే స్వదేశానికి బయల్దేరగా.. మిగతా నలుగురు ఇవాళ మ్యాచ్ (మూడో టీ20) అనంతరం స్వదేశానికి బయల్దేరతారని ప్రకటించింది. ఈ ఆరుగురికి ప్రత్యామ్నాయంగా క్రికెట్ ఆస్ట్రేలియా నలుగురు ఆటగాళ్లను ప్రకటించింది. వీరిలో జోష్ ఫిలిప్, బెన్ మెక్‌డెర్మాట్ ఇదివరకే భారత్‌కు చేరుకోగా.. బెన్ డ్వార్షుయిస్, క్రిస్ గ్రీన్‌లు నాలుగో టీ20 సమయానికంతా జట్టులో చేరతారని వెల్లడించింది. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. విశాఖ, తిరువనంతపురం వేదికలుగా జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఘన విజయాలు సాధించింది. ఆసీస్ జట్టులో స్టార్ ఆటగాళ్లు మిస్ కానుండటంతో ఈ సిరీస్ ఇకపై కల తప్పనుంది. భారత్ జట్టులోని స్టార్ ఆటగాళ్లు సైతం వరల్డ్‌కప్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. భారత్‌తో టీ20 సిరీస్‌కు అప్డేట్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. మాథ్యూ వేడ్ (కెప్టెన్), బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, కేన్ రిచర్డ్సన్ -
IND VS AUS: విరాట్ సరసన చేరిన రింకూ
టీమిండియా యంగ్ డైనమైట్ రింకూ సింగ్ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 9 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 31 పరుగులు (344.44 స్ట్రయిక్ రేట్) చేసిన రింకూ.. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో 30 అంతకంటే ఎక్కువ పరుగులు (19 లేదా 20 ఓవర్లలో) చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో భారత్ తరఫున విరాట్ కోహ్లి మాత్రమే ఈ ఫీట్‌ను సాధించాడు. విరాట్, రింకూ సింగ్ ఇద్దరూ రెండ్రెండు సార్లు ఈ ఘనత సాధించడం విశేషం. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. విశాఖ, తిరువనంతపురం వేదికలుగా జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఘన విజయాలు సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్లు పేట్రేగిపోయారు. తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (58), సూర్యకుమార్ యాదవ్ (80) మెరుపులు మెరిపించగా.. రెండో టీ20లో యశిస్వి (53), రుతురాజ్ (58), ఇషాన్ (52), రింకూ సింగ్ (31 నాటౌట్) విధ్వంసం సృష్టించారు. గౌహతి వేదికగా ఇవాళ (నవంబర్ 28) జరుగబోయే మూడో టీ20లో భారత బ్యాటర్లు ఇదే జోరును కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. -
India vs Australia 3rd T20I: సిరీస్ విజయమే లక్ష్యంగా...
గువాహటి: టి20ల్లో వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత జట్టు ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను 3–0తో ఇక్కడే కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే మూడో టి20 మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. అటు బ్యాటర్స్, ఇటు బౌలర్స్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో ఆతిథ్య జట్టుకు సిరీస్ విజయం ఏమంత కష్టమేమీ కాదు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ 200 పైచిలుకు స్కోరు చేసిన భారత్ మళ్లీ గువాహటి ప్రేక్షకులకు అలాంటి మజానే అందించేందుకు సిద్ధమైంది. పైగా ఆల్‌రౌండ్ సామర్థ్యంతో జట్టు సమరోత్సాహంతో ఉంది. ఆస్ట్రేలియా మాత్రం సిరీస్‌లో నిలవాలంటే కచి్చతంగా గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. పరాజయాల ‘హ్యాట్రిక్’ అయితే మాత్రం సిరీస్ చేజార్చుకుంటుంది. బ్యాటర్స్‌ను ఆపతరమా... టాపార్డర్ బ్యాటర్స్ అసాధారణ ఫామ్‌లో ఉన్నారు. యశస్వి దూకుడు ఆసీస్‌ను కంగారు పెట్టిస్తోంది. రెండు వరుస అర్ధ సెంచరీలతో ఇషాన్ కిషన్ ప్రత్యర్థి బౌలర్లపై సత్తా చాటగా, రుతురాజ్ కూడా ఫిఫ్టీతో తొలిమ్యాచ్ డకౌట్‌ను మరచిపోయేలా చేశాడు. రింకూ సింగ్ డెత్ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇక నిరూపించుకోవాల్సింది, సత్తా చాటుకోవాల్సిన వారు ఎవరైనా ఉన్నారంటే అది హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మే! ఎందుకంటే విశ్రాంతిలో ఉన్న శ్రేయస్ అయ్యర్ తదుపరి రెండు మ్యాచ్‌లకు వైస్ కెపె్టన్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను తుది జట్టులో ఆడటం ఖాయం కావడంతో బెంచ్‌కు పరిమితమయ్యే పరిస్థితి తిలక్కే వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్‌లో మెరుపులు మెరిపిస్తే... ప్రస్తుతానికి పక్కన పెట్టినా టచ్‌లోకి వచి్చన బ్యాటర్‌గా జట్టు ఎంపికలో ఉంటాడు. ఇక బౌలింగ్ విభాగం కూడా గత మ్యాచ్‌లో మెరుగైంది. కీలకమైన వికెట్లను వరుస విరామాల్లో తీసి మ్యాచ్‌లో పట్టు సాధించింది. ప్రసి«ద్‌కృష్ణ, అర్‡్షదీప్‌లతో పాటు స్పిన్నర్లు రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఆసీస్ రేసులోకొచ్చేనా... ఆ్రస్టేలియా తొలి టి20లో 200 పైచిలుకు పరుగులు చేసినా ఓడింది. తర్వాతి మ్యాచ్‌లో 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న ఆ్రస్టేలియా గెలిచి నిలవడం సాధ్యమవుతుందా అనేది నేటి మ్యాచ్‌తో తేలుతుంది. గత మ్యాచ్‌లో అనుభవజు్ఞలైన డాషింగ్ బ్యాటర్ మ్యాక్స్‌వెల్, ప్రధాన స్పిన్నర్ ఆడమ్ జంపాలను కూడా బరిలోకి దించినా కంగారూ జట్టుకైతే ఒరిగిందేమీ లేదు. నిలకడ లేని బ్యాటింగ్, నియంత్రణ లేని బౌలింగ్ జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. స్మిత్, షార్ట్, ఇన్‌గ్లిస్, టిమ్ డేవిడ్, స్టోయినిస్లాంటి మేటి బ్యాటర్లున్నప్పటికీ ఈ సిరీస్‌లో గెలుపు దారిలో మాత్రం ఆసీస్ పడలేకపోతోంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిస్తే తప్ప పటిష్టమైన ఆతిథ్య జట్టు జోరుకు కళ్లెం వేయలేదు. జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెపె్టన్), రుతురాజ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, తిలక్‌వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్‡్షదీప్, ప్రసిధ్ కృష్ణ, ముకేశ్ కుమార్. ఆ్రస్టేలియా: మాథ్యూ వేడ్ (కెపె్టన్), స్టీవ్ స్మిత్, షార్ట్, జోష్ ఇన్‌గ్లిస్, మ్యాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, స్టోయినిస్, ఆడమ్ జంపా, సీన్ అబాట్, నాథన్ ఎలిస్, తనీ్వర్ సంఘా. -
అలెన్ అదరహో
బర్మింగ్హమ్: ఇంగ్లండ్ జట్టుతో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 74 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిన్ అలెన్ (53 బంతుల్లో 83; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ (34 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడి అర్ధ సెంచరీలు చేశారు. 203 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 18.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ జోస్ బట్లర్ (21 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమీసన్ (3/23), ఇష్ సోధి (3/33) రాణించారు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2–1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. -
IND VS IRE 3rd T20: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
భారత్-ఐర్లాండ్ మధ్య ఇవాళ (ఆగస్ట్ 23) జరగాల్సిన నామమాత్రపు మూడో టీ20 వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణమైంది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియానే విజయం సాధించిన విషయం తెలిసిందే. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో తొలి టీ20లో 2 పరుగుల తేడాతో నెగ్గిన భారత్.. రెండో టీ20లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. టాప్ స్కోరర్‌గా రుతురాజ్.. కాగా, ఈ సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (2 మ్యాచ్‌ల్లో 77 పరుగులు) టాప్ స్కోరర్‌గా ఉండగా, ఐరిష్ బ్యాటర్ ఆండ్రూ బల్బిర్నీ (2 మ్యాచ్‌ల్లో 76) సెకెండ్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో ఇద్దరు ఐర్లాండ్ బ్యాటర్లు, ఓ టీమిండియా బ్యాటర్ హాఫ్ సెంచరీలు చేశారు. ఐర్లాండ్ తరఫున ఆండ్రూ బల్బిర్నీ (72), బ్యారీ మెక్‌కర్తీ (51) అర్ధశతకం చేయగా.. టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ (58) మాత్రమే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇక ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా టీమిండియా బౌలర్లు బుమ్రా, బిష్ణోయ్, ప్రసిద్ధ్ నిలిచారు. ఈ ముగ్గురు మ్యాచ్‌కు రెండు చొప్పున తలో 4 వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్ క్రెయిగ్ యంగ్ 3 వికెట్లు పడగొట్టాడు. -
ఐర్లాండ్‌తో మూడో టీ20.. టీమిండియా ఎలా ఉండబోతుందంటే..?
ఐర్లాండ్‌తో ఇవాళ (ఆగస్ట్ 23) జరుగనున్న నామమాత్రపు మూడో టీ20లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో ఇదివరకే కైవసం చేసుకున్న భారత్, నేటి మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన ముకేశ్ కుమార్, జితేశ్ శర్మ, షాబాజ్ అహ్మద్, ఆవేశ్ ఖాన్లు మూడో టీ20 బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్‌ల స్థానంలో ఈ నలుగురు బరిలోకి దిగవచ్చు. పై పేర్కొన్న నలుగురికి అవకాశం ఇస్తే ఐర్లాండ్‌లో పర్యటించిన భారత జట్టు మొత్తానికి కనీసం ఓ అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సైతం విశ్రాంతి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఆసియా కప్‌కు ముందు అనవసర రిస్క్ ఎందుకుని మేనేజ్మెంట్ భావిస్తే.. బుమ్రా రెస్ట్ తీసుకుని, అర్షదీప్‌కు అవకాశం ఇస్తాడు. అప్పుడు జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తాడు. ఆసియా క్రీడల్లో రుతు ఎలాగూ టీమిండియాకు నాయకత్వం వహించాల్సి ఉంది కాబట్టి, అతనికి ఈ మ్యాచ్ ప్రాక్టీస్ అయినట్లవుతుంది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా రిజర్వ్ బెంచ్‌కు పరీక్షగా మారనుంది. మరోవైపు ఐర్లాండ్ సైతం ఒకటిరెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ జట్టు కూడా రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే భారత్‌లా భారీ ప్రయోగాలు కాకుండా ఒకటి, రెండు మార్పులకు ఆస్కారం ఉంటుంది. ఇదిలా ఉంటే, ఇప్పటివరకు జరిగిన రెండు టీ20ల్లో ఇద్దరు ఐర్లాండ్ బ్యాటర్లు, ఓ టీమిండియా బ్యాటర్ హాఫ్ సెంచరీలు చేశారు. ఐర్లాండ్ తరఫున ఆండ్రూ బల్బిర్నీ (72), బ్యారీ మెక్‌కర్తీ (51) అర్ధశతకం చేయగా.. టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ (58) మాత్రమే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇక ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల విషయానికొస్తే.. ముగ్గురు టీమిండియా బౌలర్లు 4 వికెట్లు పడగొట్టారు. బుమ్రా, బిష్ణోయ్, ప్రసిద్ధ్‌లు మ్యాచ్‌కు రెండు చొప్పున తలో 4 వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్ క్రెయిగ్ యంగ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్‌తో మూడో టీ20కి టీమిండియా (అంచనా): జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్)/అర్షదీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్/కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ -
IND VS WI 3rd T20: టాస్ ఓడిన టీమిండియా, యశస్వి జైస్వాల్ అరంగేట్రం
5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గయానా వేదికగా విండీస్‌తో ఇవాళ (ఆగస్ట్ 8) జరుగుతున్న మూడో టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఓడి 0-2తో వెనుకపడిన భారత్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని భావిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. ఇషాన్ కిషన్ స్థానంలో అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్ జట్టులోకి రాగా.. రవి బిష్ణోయ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులో చేరాడు. మరోవైపు విండీస్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జేసన్ హోల్డర్ స్థానంలో రోస్టన్ ఛేజ్ బరిలోకి దిగనున్నాడు. వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (w), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ (సి), రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్ భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ -
శ్రీలంకతో న్యూజిలాండ్ మూడో టీ20.. మ్యాచ్ మధ్యలో విమానం
NZ VS SL 3rd T20: క్వీన్స్టౌన్లోని జాన్ డేవిస్ మైదానంలో ఇవాళ (ఏప్రిల్ 10) న్యూజిలాండ్-శ్రీలంక జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ మరో బంతి మిగిల్చి లక్ష్యాన్ని చేరుకుంది (19.5 ఓవర్లలో 183/6). న్యూజిలాండ్ గెలుపుకు ఆఖరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా.. చాప్మన్ తొలి బంతికే సిక్సర్ కొట్టి లక్ష్యానికి చేరువ చేసినప్పటికీ.. కివీస్ మరుసటి 3 బంతులకు 3 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిపోయింది. అయితే 19వ ఓవర్ ఐదో బంతికి రచిన్ రవీంద్ర 2 పరుగులు తీయడంతో న్యూజిలాండ్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటింగ్ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లంక బ్యాటర్లు తమ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండగానే, ఇంచుమించు చేతికందేంత ఎత్తులో ఓ విమానం టేకాఫ్ అయ్యింది. ఇది పెద్దగా పట్టించుకోకుండా ఆటగాళ్లు ఆటను కొనసాగించగా.. మైదానంలో ఉన్న ప్రేక్షకులు ఏమాత్రం బెరుకు లేకుండా ఆటను ఆస్వాధిస్తూ కనిపించారు. విమానం మ్యాచ్ మధ్యలో టేకాఫ్ అవుతున్న దృశ్యం సోషల్‌మీడియాలో వైరలవగా.. విషయం తెలియని వారు రకరకాలుగా ఊహించుకుంటున్నారు. జనాలకు ఇంత దగ్గరలో విమానాలు వెళితే ఎంత ప్రమాదమని కొందరంటుంటే, ఇంకొందరేమో ఇది కెమెరా ట్రిక్ అని లైట్‌గా తీసుకుంటున్నారు. వాస్తవ విషయం ఏంటంటే, జాన్ డేవిస్ మైదానం పక్కనే ఎయిర్పోర్ట్ రన్‌వే ఉంది. అనునిత్యం ఇక్కడి నుంచి విమానాలు టేకాఫ్ అవుతుంటాయి. గతంలో చాలా సందర్భాల్లో మ్యాచ్‌లు జరుగుతుండగా విమానలు టేకాఫ్ అయ్యాయి. -
శుభ్‌మన్ గిల్‌ను ఫెదరర్‌తో పోల్చిన పాక్ మాజీ కెప్టెన్
టీమిండియా యంగ్ డైనమైట్, రైజింగ్ స్టార్ శుభ్‌మన్ గిల్‌పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానల్లో ఓ ప్రోగ్రాం సందర్భంగా భట్ మాట్లాడుతూ.. గిల్‌తో పాటు టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్, టెన్నిస్ ఆల్‌టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్ పేర్లను ప్రస్తావించాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో గిల్ చేసిన విధ్వంసకర శతకాన్ని కొనియాడిన భట్.. ఇదే సందర్భంగా గిల్ సహచరుడు, సహ ఓపెనర్ ఇషాన్‌ను తక్కువ చేసి మాట్లాడాడు. గిల్ బ్యాటింగ్ స్టయిల్‌ను ఆకాశానికెత్తుతూనే, ఇషాన్ స్థాయి ఇంకా మెరుగుపడాలని సూచించాడు. ఇషాన్‌తో పోలిస్తే గిల్ స్థాయి చాలా ఎక్కువ అని, ఈ ఒక్క ఇన్నింగ్స్ ఆధారంగా తాను ఈ కామెంట్ చేయట్లేదని అన్నాడు. గిల్ బ్యాటింగ్ చూస్తుంటే టెన్నిస్‌లో ఫెదరర్ ఆట చూసిన ఫీలింగ్ కలుగుతుందని, ఫెదరర్లా గిల్ కూడా ఆటను చాలా క్లాస్‌గా ఆడతాడని ప్రశంసించాడు. పవర్ హిట్టింగ్ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో గిల్ కష్టపకుండా, టెక్నిక్ ఉపయోగించి సునాయాసంగా షాట్లు ఆడుతున్నాడని కొనియాడాడు. గిల్ ఆడిన ప్రతి షాట్ కూడా అచ్చమైన క్రికెటింగ్ షాట్ అని, టెన్నిస్‌లో ఇదే ఫార్ములా ఫాలో అయిన ఫెదరర్ ఎలా సక్సెస్ అయ్యాడో గిల్ కూడా అలాగే సక్సెస్ అవుతాడని జోస్యం చెప్పాడు. టెక్నిక్ విషయంలో ప్రస్తుత తరం క్రికెటర్లలో గిల్ మించిన బ్యాటర్ లేడని, ఇతను కచ్చితంగా టీమిండియా భవిష్యత్ ఆశాకిరణమని ప్రశంసల వర్షం కురింపించాడు. పాక్ మాజీలు సహజంగా టీమిండియా ఆటగాళ్లను విమర్శించడమే పనిగా పెట్టుకుంటుంటారు. కానీ, భట్ గిల్‌ను పొగడ్తలతో ముంచెత్తడం ఆశ్చర్యకరంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, న్యూజిలాండ్‌తో మూడో టీ20లో గిల్ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 126 నాటౌట్ పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా టీమిండియా మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన గిల్.. అంతకుముందు కివీస్‌తోనే జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీ, డబుల్ సెంచరీ బాదాడు. -
శతక్కొట్టిన గిల్, నిప్పులు చెరిగిన పేసర్లు.. టీమిండియా ఘన విజయం
అహ్మదాబాద్: మోదీ స్టేడియంలో భారత్ పరుగుల మోత మోగించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (63 బంతుల్లో 126 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) తన బ్యాటింగ్ సునామీని చూపించాడు. దీంతో ఆఖరి టి20లో టీమిండియా 168 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి 2–1తో సిరీస్ గెలుచుకుంది. మొదట భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిపించాడు. అనంతరం న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు తీశాడు. గిల్ విధ్వంసం ఇషాన్ కిషన్ (1) రెండో ఓవర్లోనే నిష్క్రమించగా... గిల్, త్రిపాఠి కివీస్ బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగారు. రెండో వికెట్‌కు ఈ జోడీ మెరుపులతో 7 ఓవర్ల వ్యవధిలోనే భారత్ 80 పరుగులు చేసింది. తర్వాత సూర్యకుమార్ (13 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. కెపె్టన్ హార్దిక్ పాండ్యా క్రీజులోకి రాగా... 15 ఓవర్లలో భారత్ స్కోరు 156/3. శుబ్‌మన్ 44 బంతుల్లో 67 పరుగులతో ఉన్నాడు. గిల్ అప్పటిదాకా ఒక ఆట, 16వ ఓవర్ నుంచి మరో ఆట ఆడాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడిన గిల్... లిస్టర్, టిక్నర్, ఫెర్గూసన్ ఎలా ఎవరెదురైనా... బంతుల్ని అదేపనిగా బౌండరీ దాటించాడు. పాండ్యా ఆడిన బంతుల్ని మినహాయిస్తే... గిల్ 16 బంతులను వరుసగా 0, 6, 6, 1, 6, 4, 0, 6, 1, 4, 6, 1, 4, 1, 4, 6లుగా ధనాదంచేశాడు. దీంతో 4 ఓవర్లలోనే భారత్ 72 పరుగులు చేసింది. ఇందులో 56 పరుగులు గిల్వే! ఈ క్రమంలో 54 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆఖరి ఓవర్లో పాండ్యా (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) అవుట్‌కాగా కేవలం 6 పరుగులే వచ్చాయి. భారత్ పేస్‌కు కివీస్ బ్యాటర్స్ వణికారు. మూడో ఓవర్లోనే కివీస్ 7 పరుగులకే 4 వికెట్లను కోల్పోవడంతో భారత్ విజయానికి బాటపడింది. మిచెల్, సాన్‌ట్నర్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బ్రేస్‌వెల్ 1; గిల్ (నాటౌట్) 126; త్రిపాఠి (సి) ఫెర్గూసన్ (బి) సోధి 44; సూర్యకుమార్ (సి) బ్రేస్‌వెల్ (బి) టిక్నర్ 24; పాండ్యా (సి) బ్రేస్‌వెల్ (బి) మిచెల్ 30; హుడా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 234. వికెట్ల పతనం: 1–7, 2–87, 3–125, 4–228. బౌలింగ్: లిస్టర్ 4–0–42–0, బ్రేస్‌వెల్ 1–0–8–1, ఫెర్గూసన్ 4–0–54–0, టిక్నర్ 3–0–50–1, ఇష్ సోధి 3–0–34–1, సాన్‌ట్నర్ 4–0–37–0, మిచెల్ 1–0–6–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (సి) సూర్య (బి) పాండ్యా 3; కాన్వే (సి) పాండ్యా (బి) అర్‡్షదీప్ 1; చాప్మన్ (సి) ఇషాన్ (బి) అర్‡్షదీప్ 0; ఫిలిప్స్ (సి) సూర్య (బి) పాండ్యా 2; మిచెల్ (సి) మావి (బి) ఉమ్రాన్ 35; బ్రేస్‌వెల్ (బి) ఉమ్రాన్ 8; సాన్‌ట్నర్ (సి) సూర్య (బి) మావి 13; ఇష్ సోధి (సి) త్రిపాఠి (బి) మావి 0; ఫెర్గూసన్ (సి) ఉమ్రాన్ (బి) పాండ్యా 0; టిక్నర్ (సి) ఇషాన్ (బి) పాండ్యా 1; లిస్టర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (12.1 ఓవర్లలో ఆలౌట్) 66. వికెట్ల పతనం: 1–4, 2–4, 3–5, 4–7, 5–21, 6–53, 7–53, 8–54, 9–66, 10–66. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 4–0–16–4, అర్ష్‌దీప్ సింగ్ 3–0–16–2, ఉమ్రాన్ మాలిక్ 2.1–0–9–2, కుల్దీప్ యాదవ్ 1–0–12–0, శివమ్ 2–0–12–2. ►అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్‌గా శుబ్‌మన్ గిల్ (126 నాటౌట్) గుర్తింపు పొందాడు. కోహ్లి (122 నాటౌట్; అఫ్గానిస్తాన్‌పై 2022 లో) పేరిట ఉన్న రికార్డును గిల్ సవరించాడు. ►అంతర్జాతీయ టి20ల్లో పరుగుల తేడా పరంగా భారత్‌కిదే అతిపెద్ద విజయం. 2018లో ఐర్లాండ్‌పై 143 పరుగుల తేడా తో సాధించిన విజయం రెండో స్థానానికి వెళ్లింది. ►భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20లు) సెంచరీ సాధించిన ఐదో క్రికెటర్‌గా గిల్ నిలిచాడు. గతంలో రైనా, కేఎల్ రాహుల్, రోహిత్, కోహ్లి ఈ ఘనత సాధించారు. -
కివీస్‌తో మూడో టీ20లో గిల్ సెంచరీ.. రికార్డుల రారాజు కోహ్లి రికార్డుకే ఎసరు
IND VS NZ 3rd T20I: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో బ్లాస్టింగ్ హండ్రెడ్‌తో పేలిన టీమిండియా యంగ్ డైనమైట్ శుభ్‌మన్ గిల్ (63 బంతుల్లో 126 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో పొట్టి ఫార్మాట్లో తన తొట్టతొలి శతకం నమోదు చేసిన గిల్.. కోహ్లి రికార్డుకు పంగనామం పెట్టడంతో పాటు మరిన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 35 బంతులు ఆడిన గిల్.. సెంచరీ కంప్లీట్ చేసేందుకు మరో 19 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇది కూడా ఓ రికార్డే. 23 ఏళ్ల గిల్.. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా, ఈ ఫీట్ సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. అతనికి ముందు సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. టీ20ల్లో సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికటర్ రికార్డు కూడా గిల్ ఖాతాలోనే చేరింది. అలాగే న్యూజిలాండ్‌పై టీమిండియా తరఫున వన్డేలు, టీ20ల్లో అత్యధిక స్కోర్ (208, 126 నాటౌట్) చేసిన ఆటగాడిగానూ గిల్ రికార్డు నెలకొల్పాడు. వీటితో పాటు గిల్ ఖాతాలో మరో భారీ రికార్డు చేరింది. టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడు గిల్ రికార్డు సృష్టించాడు. గిల్‌కు ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి (122 నాటౌట్) పేరిట ఉండేది. కాగా, ఈ మ్యాచ్‌లో గిల్ సుడిగాలి శతకానికి రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 24; ఫోర్, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు కూడా తోడవ్వడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ (1) ఒక్కడే నిరుత్సాహపరిచాడు. కివీస్ బౌలర్లలో బ్రేస్‌వెల్, టిక్నర్, సోధీ, డారిల్ మిచెల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 235 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 2.4 ఓవర్లలో కేవలం 7 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి, ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. తొలి ఓవర్లోనే హార్ధిక్.. ఫిన్ అలెన్ (3) పెవిలియన్‌కు పంపగా.. రెండో ఓవర్లో అర్షదీప్ కాన్వే (1), చాప్మన్ (0)లను, ఆ వెంటనే మూడో ఓవర్లో హార్ధిక్ గ్లెన్ ఫిలిప్స్ (2)ను ఔట్ చేశాడు. -
శుభ్‌మన్ గిల్ సుడిగాలి శతకం.. టీమిండియా భారీ స్కోర్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా యంగ్ డైనమైట్ శుభ్‌మన్ గిల్ (63 బంతుల్లో 126 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన గిల్ ఈ మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో పొట్టి ఫార్మాట్లో తన తొట్టతొలి సెంచరీ నమోదు చేశాడు. గిల్ 187.04 స్ట్రయిక్ రేట్‌తో శతక్కొట్టాడంటే, అతని విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో ఇట్టే అర్ధమవుతోంది. సెంచరీ చేశాక కూడా ఏమాత్రం తగ్గని గిల్.. సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. సెంచరీ సాధించిన అనంతరం గిల్ ప్రేక్షకుల వైపు తలవంచి అభివాదం చేశాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీతో పాటు మరో సెంచరీ కూడా బాదిన గిల్.. టీ20ల్లోనూ శతకాల పరంపరను కొనసాగించాడు. గిల్ విధ్వంసకర శతకానికి రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 24; ఫోర్, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు కూడా తోడవ్వడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ (1) ఒక్కడే నిరుత్సాహపరిచాడు. కివీస్ బౌలర్లలో బ్రేస్‌వెల్, టిక్నర్, సోధీ, డారిల్ మిచెల్ తలో వికెట్ పడగొట్టారు. -
రాహుల్ త్రిపాఠి మెరుపు ఇన్నింగ్స్.. ఔటయ్యాక బాధ వర్ణణాతీతం
న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి మెప్పించిన టీమిండియా వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)పై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నది కొద్దిసేపే అయినా త్రిపాఠి ఆడిన ఇన్నింగ్స్‌ను జనాలు మెచ్చుకోలేక ఉండలేకపోతున్నారు. అయితే త్రిపాఠి వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేద్దామనే తొందరలో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఐష్ సోధీ బౌలింగ్‌లో ఫెర్గూసన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించిన త్రిపాఠి ఔటైన అనంతరం చాలా బాధపడ్డాడు. ఫెర్గూసన్ క్యాచ్ పట్టగానే అతను కోపం కట్టలు తెంచుకుంది. బౌండరీ లైన్ క్లియర్ చేయలేనందుకు తనను తానే దూషించుకన్నాడు. బ్యాట్‌ను పలు మార్లు నేలకేసి కొట్టేలా కనిపించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడదామనుకున్న కలలు కల్లలుగానే మిగిలిపోవడంతో త్రిపాఠి బాధ వర్ణణాతీతంగా ఉండింది. ఈ సందర్భంగా అతను ప్రదర్శించిన హావభావాలు, అతని మనసులోని బాధను టీమిండియా అభిమానులు అర్ధం చేసుకుని మద్దతుగా నిలిచారు. కాగా, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఒక్క పరుగుకే ఇషాన్ కిషన్ ఔట్ కాగా.. త్రిపాఠి మెచ్చుకోదగ్గ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ (36 బంతుల్లో 51; 7 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (11 బంతుల్లో 18; ఫోర్, సిక్స్) మెరుపులు మెరిపిస్తున్నారు. 12 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 118/2గా ఉంది. -
తీరు మార్చుకోని ఇషాన్ కిషన్.. మూడో టీ20లోనూ దారుణ వైఫల్యం, వేటు ఖాయం..!
గతేడాది బంగ్లాదేశ్‌పై వన్డేల్లో డబుల్ సెంచరీ చేశాక వరుస అవకాశాలు ఇస్తున్నా టీమిండియా యంగ్ వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్ తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. న్యూజిలాండ్ సిరీస్‌లో వరుస వైఫల్యాల బాట పట్టిన ఇషాన్.. ఇవాళ (ఫిబ్రవరి 1) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లోనూ తక్కువ స్కోర్‌కే (3 బంతుల్లో 1) ఔటయ్యాడు. క్లియర్‌గా ఔటైయ్యాడని తెలిసినా, పోతూపోతూ రివ్యూని వేస్ట్ చేసి మరీ జట్టును దెబ్బకొట్టాడు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో 5, రెండో మ్యాచ్‌లో 8 నాటౌట్, మూడో వన్డేలో 17 పరుగులు చేసిన ఇషాన్.. ఆ తర్వాత టీ20 సిరీస్‌లో వరుసగా 4, 19, 1 స్కోర్లకే ఔటై, అందివచ్చిన అవకాశాలను చేజేతులా నాశనం చేసుకుని భవిష్యత్తులో జట్టులో చోటును ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ (37, 2, 1 స్కోర్లు) ఇదే తరహా దారుణ ప్రదర్శన కనబర్చిన ఇషాన్.. సెలెక్టర్ల ఆగ్రహానికి గురికాక తప్పదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఇషాన్ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన గత 9 మ్యాచ్‌ల్లో ప్రదర్శన చూస్తే.. ఈ పట్నా కుర్రాడు కేవలం 90 పరుగులు మాత్రమే చేసి కెరీర్‌నే ఇరకాటంలో పడేసుకున్నాడు. పంత్ పూర్తిగా కోలుకునే లోపు ఇషాన్‌కు ప్రత్యామ్నాయం వెతకాలని అభిమానులు సెలెక్టర్లకు సూచిస్తున్నారు. లేదు, డబుల్ సెంచరీ చేశాడు కదా అని మరిన్ని అవకాశాలు ఇస్తే మాత్రం ఇతను టీమిండియా కొంప ముంచుతాడని హెచ్చరిస్తున్నారు. కాగా, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒక్క మార్పు చేసింది. యుజ్వేంద్ర చహల్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ సైతం ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. జాకబ్ డప్ఫీ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బెన్ లిస్టర్ జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. మ్యాచ్ విషయానికొస్తే.. 7 పరుగులకే ఇషాన్ వికెట్ కోల్నోయిన టీమిండియా, ఆతర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. గిల్ (20 బంతుల్లో 34; 6 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (13 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 58/1గా ఉంది. -
నిర్ణయాత్మక మూడో టీ20.. ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే.. చహల్ ఔట్
3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒక్క మార్పు చేసింది. యుజ్వేంద్ర చహల్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ సైతం ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. జాకబ్ డప్ఫీ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బెన్ లిస్టర్ జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. టీమిండియా: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావీ, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఐష్ సోధీ, లోకీ ఫెర్గూసన్, బెన్ లిస్టర్, బ్లెయిర్ టిక్నర్ -
న్యూజిలాండ్‌తో మూడో టీ20.. టీమిండియాలో మూడు మార్పులు..?
IND VS NZ 3rd T20: ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగనున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో దాదాపు ఒకే జట్టుతో (చహల్ మినహాయించి) బరిలోకి దిగిన భారత్.. మూడో టీ20 కోసం మూడు మార్పులు చేయనుందని సమాచారం. రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్లతో పాటు బౌలింగ్ విభాగంలో మరో కీలక మార్పు చేయాలన్నది జట్టు యాజమాన్యం యోచనగా తెలుస్తోంది. శుభ్‌మన్, ఇషాన్‌ల స్థానాల్లో పృథ్వీ షా, వికెట్‌కీపర్ జితేశ్ శర్మ.. అలాగే చహల్ లేదా కుల్దీప్ స్థానాల్లో ముకేశ్ కుమార్‌కు అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం తొలుత బ్యాటింగ్‌కు, ఆతర్వాత పేసర్లకు సహకరించే అస్కారం ఉండటంతో స్పిన్నర్ స్థానంలో అదనపు పేసర్‌కు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. ముకేశ్ కుమార్‌కు ఈ సిరీస్‌లో ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో మూడో టీ20లో తప్పక ఆడించాలన్నది కోచ్ ద్రవిడ్ ఆలోచనగా తెలుస్తోంది. అలాగే గిల్, ఇషాన్‌లు వరుసగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోని నేపథ్యంలో పృథ్వీ షా, వికెట్‌కీపర్ జితేశ్ శర్మలకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నది టీమ్ ప్లాన్‌గా తెలుస్తోంది. మరోవైపు, సిరీస్ డిసైడర్ మ్యాచ్ కావడంతో మేనేజ్మెంట్ పెద్దగా ప్రయోగాలు చేసేందుకు మొగ్గు చూపకపోవచ్చన్న టాక్ కూడా నడుస్తోంది. ఏదిఏమైనప్పటికీ తుది జట్టులో ఎవరెవరు ఉంటారో తేలాలంటే మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు వరకు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచి (తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, రెండో మ్యాచ్‌లో భారత్ గెలిచాయి) సిరీస్‌లో సమవుజ్జీలుగా ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను రోహిత్ సేన 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. వన్డేల్లో డబుల్ సెంచరీ, ఓ సెంచరీతో హిట్ అయిన శుభ్‌మన్ గిల్.. టీ20 సిరీస్‌లో మాత్రం ఫట్ అయ్యాడు. -
ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడు.. సూర్యకుమార్ యాదవ్
Surya Kumar Yadav: రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో నిన్న (జనవరి 7) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా 91 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను హార్ధిక్ సేన 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ సునామీ శతకం (51 బంతుల్లో 112 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) ధాటికి నిశ్చేష్టులుగా మిగిలిపోయిన లంకేయులు మ్యాచ్‌లో పాటు సిరీస్‌ను భారత్ చేతికి అప్పజెప్పారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే శతకంతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్కై ఆకాశమే హద్దుగా చెలరేగితే శుభ్‌మన్ గిల్ (36 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (16 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (9 బంతుల్లో 21 నాటౌట్; 4 ఫోర్లు) తమ పాత్రలను న్యాయం చేశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులు భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 16.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్ 3 వికెట్లు పడగొట్టగా.. హార్ధిక్, ఉమ్రాన్ మాలిక్, చహల్ తలో 2 వికెట్లు, అక్షర్ పటేల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ విధ్వంసకర శతకం సాధించే క్రమంలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. అవేంటంటే.. పొట్టి క్రికెట్ చరిత్రలో మూడు వేర్వేరు ఖండాల్లో (ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్) శతకాలు సాధించిన అత్యంత అరుదైన ఘనత సొంతం చేసుకున్న సూర్యకుమార్. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు (3) చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ నాలుగు సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. రెండు సెంచరీలతో కేఎల్ రాహుల్ మూడో స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ (45 బంతుల్లో) చేసిన రెండో భారత క్రికెటర్‌గా సూర్య కుమార్ యాదవ్ రికార్డుల్లో నిలిచాడు. గతంలో శ్రీలంకపై రోహిత్ శర్మ 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ మూడో స్థానంలో (46 బంతుల్లో) ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఐదో ప్లేయర్‌గా సూర్యకుమార్ యాదవ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ జాబితాలో నాలుగు సెంచరీలతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (3), కొలిన్ మన్రో (3), సబావూన్ డావిజీ (3)లతో కలిసి సూర్య భాయ్ రెండో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన తొలి భారత నాన్ ఓపెనర్‌గా, అలాగే అత్యంత వేగంగా (843 బంతుల్లో ) 1500 పరుగుల మార్కును (బంతుల ప్రకారం) అందుకున్న ఆటగాడిగా సూర్య భాయ్ రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు మ్యాక్స్‌వెల్ పేరిట ఉండేది. మాక్సీ.. 1500 పరుగులు చేసేందుకు 940 బంతులు ఎదుర్కొన్నాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (9) బాదిన భారత నాన్ ఓపెనర్‌గా రికార్డు. -
లంకతో మూడో టీ20.. భారీ రికార్డుపై కన్నేసిన చహల్
IND VS SL 3rd T20: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 7) జరుగనున్న నిర్ణయాత్మక మూడో టీ20లో చహల్ (73 మ్యాచ్‌ల్లో 88) మరో 3 వికెట్లు తీస్తే, భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. భువీ.. 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కివీస్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ (107 మ్యాచ్‌ల్లో 134) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (109 మ్యాచ్‌ల్లో 128), రషీద్ ఖాన్ (74 మ్యాచ్‌ల్లో 122) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా, శ్రీలంక చెరో మ్యాచ్ గెలువగా, ఇవాళ జరుగబోయే మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. రెండు జట్లు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. తుది జట్ల విషయానికొస్తే.. భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో విఫలమైన శుభ్‌మన్ గిల్, అర్షదీప్ స్థానాల్లో రుతురాజ్, ముకేశ్ కుమార్ ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. లంక విషయానికొస్తే.. రెండో టీ20లో బరిలోకి దిగిన జట్టే యధాతథంగా కొనసాగవచ్చు. తుది జట్లు (అంచనా) భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్/శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, అక్షర్ పటేల్, చహల్, ముఖేశ్ కుమార్/అర్ష్‌దీప్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్. శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, భనుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుషంక, కసున్ రజిత. -
న్యూజిలాండ్ కొంపముంచిన సాంట్నర్.. మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ కోల్పోయేలా చేశాడు
నేపియర్‌లోని మెక్లీన్ పార్క్ వేదికగా నూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 23) జరిగిన మూడో టీ20 టైగా ముగిసింది. భారత ఇన్నింగ్స్ సమయంలో (9 ఓవర్ల తర్వాత 75/4) వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం టైగా ప్రకటించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో మ్యాచ్‌లో 'సూర్య'ప్రతాపం (111 నాటౌట్) చూపించడంతో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (59), గ్లెన్ ఫిలిప్స్ (54) అర్ధసెంచరీలతో రాణించడంతో 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో భారత్ స్కోర్ 9 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 75 పరుగుల వద్ద ఉండగా, ఒక్కసారిగా వర్షం ప్రారంభమై మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం టైగా ముగిసేలా చేసింది. డీఎల్ఎస్ ప్రకారం 9 ఓవర్ల తర్వాత టీమిండియా గెలిచి ఉండాలంటే 76 పరుగులు చేయాల్సి ఉండింది. అయితే ఈ సమయానికి టీమిండియా స్కోర్ 75 పరుగులు మాత్రమే ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను డీఎల్ఎస్ టైగా ప్రకటించారు. క్రికెట్ చరిత్రలో ఇలా డీఎల్ఎస్ టైగా ముగిసిన సందర్భాలు ఈ మ్యాచ్‌తో కలిపి మూడు ఉన్నాయి. 2021లో నెదర్లాండ్స్-మలేషియా మధ్య జరిగిన మ్యాచ్, 2021లో మాల్టా-జిబ్రాల్టర్ మధ్య జరిగిన మ్యాచ్‌లు ఇలాగే డక్‌వర్త్ లూయిస్ టైగా ముగిశాయి. న్యూజిలాండ్ కొంపముంచిన సాంట్నర్.. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ చేసిన ఓ చిన్న తప్పిదం ఆ జట్టు పాలిట శాపంలా మారింది. మ్యాచ్‌తో పాటు ఏకంగా సిరీస్ కోల్పోయేలా చేసింది. వర్షం కారణంగా భారత ఇన్నింగ్స్ ఆగిపోయే సమయానికి క్షణాల ముందు, అంటే 8.6వ ఓవర్లో (9వ ఓవర్ ఆఖరి బంతి) ఐష్ సోధి బౌలింగ్‌లో సాంట్నర్ మిస్ ఫీల్డింగ్ చేశాడు. బ్యాక్ వర్డ్ పాయింట్ దిశలో ఉన్న సాంట్నర్.. దీపక్ హుడా ఆడిన షాట్‌కు మిస్ ఫీల్డ్ చేయడంతో ఓ పరుగు వచ్చింది . ఇదే పరుగు న్యూజిలాండ్ కొంపముంచింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ( 9 ఓవర్ల తర్వాత) టీమిండియా గెలిచి ఉండాలంటే 76 పరుగులు చేయాల్సి ఉండింది. అదే న్యూజిలాండ్ ఈ మ్యాచ్ గెలిచి ఉండాలంటే టీమిండియా స్కోర్ 9 ఓవర్ల తర్వాత 74గా ఉండాల్సిందే. అదే సాంట్నర్ 9వ ఓవర్ ఆఖరి బంతికి మిస్ ఫీల్డ్ చేయకుండి ఉంటే, పరుగు వచ్చేది కాదు.. న్యూజిలాండ్ మ్యాచ్ గెలిచి, సిరీస్ సమం చేసుకుని ఉండేది. ఈ విషయం తెలిసి మ్యాచ్‌ను అధికారికంగా టైగా ప్రకటించక ముందే సాంట్నర్ చాలా బాధపడ్డాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
IND VS NZ 3rd T20: అత్యంత అరుదైన 'టై'గా ముగిసిన మ్యాచ్.. సిరీస్ టీమిండియాదే
నేపియర్‌లోని మెక్లీన్ పార్క్ వేదికగా నూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 23) జరిగిన సిరీస్ డిసైడర్ మూడో టీ20 టైగా ముగిసింది. భారత ఇన్నింగ్స్ సమయంలో (9 ఓవర్ల తర్వాత 75/4) వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం టైగా ప్రకటించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో మ్యాచ్‌లో 'సూర్య'ప్రతాపం (111 నాటౌట్) చూపించడంతో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టై ఎలా అంటే..? మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సమయానికి టీమిండియా స్కోర్ 9 ఓవర్ల తర్వాత 75/4గా ఉంది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 9 ఓవర్ల తర్వాత టీమిండియా గెలిచి ఉండాలంటే 76 పరుగులు చేయాల్సి ఉండింది. అయితే ఈ సమయానికి స్కోర్లు సమంగా (9 ఓవర్ల తర్వాత 75) ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టైగా నిర్ధారించారు. క్రికెట్ చరిత్రలో ఇలా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్‌లు టైగా ముగిసిన సందర్భాలు ఈ మ్యాచ్‌తో కలిపి మూడు ఉన్నాయి. 2021లో నెదర్లాండ్స్-మలేషియా మధ్య జరిగిన మ్యాచ్, 2021లో మాల్టా-జిబ్రాల్టర్ మధ్య జరిగిన మ్యాచ్‌లు ఇలాగే డక్‌వర్త్ లూయిస్ టైగా ముగిశాయి. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. పేసర్లు మహ్మద్ సిరాజ్ (4/17), అర్షదీప్ సింగ్ (4/37), హర్షల్ పటేల్ చెలరేగడంతో న్యూజిలాండ్ తమ కోటా 20 ఓవర్లు ఆడకుండానే 160 పరుగులకు ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. ఆరంభంలోనే 2 వికెట్లు (ఫిన్ అలెన్ (3), మార్క్ చాప్మన్ (12)) కోల్పోయినా డెవాన్ కాన్వే (59), గ్లెన్ ఫిలిప్స్ (54) జట్టును ఆదుకున్నారు. అయితే వీరిద్దరు 16 పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో న్యూజిలాండ్ పతనం ఆరంభమైంది. వీరి తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఏ ఒక్క బ్యాటర్ నిలదొక్కుకోలేకపోయారు. ఏకంగా ముగ్గురు (నీషమ్, మిల్నే, సోధి) డకౌట్లు అయ్యారు. డారిల్ మిచెల్ (10) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. అనంతరం 161 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. కివీస్ పేసర్లు సౌథీ (2/27), ఆడమ్ మిల్నే (1/23), సోధి (1/12) ధాటికి 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను (10) మిల్నే ఔట్ చేయగా.. మరో ఓపెనర్ రిషబ్ పంత్ (11), శ్రేయస్ అయ్యర్ (0)లను సౌథీ, సూర్యకుమార్‌ను (13) సోధి పెవిలియన్‌కు పంపారు. 9 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 75/4 వద్ద ఉండగా వర్షం మొదలైంది. దీపక్ హుడా (9), హార్ధిక్ పాండ్యా (30) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం ఎంతకీ శాంతించకపోవడంతో మ్యాచ్‌ను టైగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లతో చెలరేగిన సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా, రెండో టీ20లో శతక్కొట్టిన సూర్యకుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. ఈ పర్యటనలో 25 జరిగే తొలి వన్డేతో 3 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమవుతుంది. 27, 30 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌లు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
IND VS NZ 3rd T20: పంత్.. ఇక మారవా..? ఇంకా ఎన్ని ఛాన్స్‌లు ఇవ్వాలి..!
నేపియర్‌లోని మెక్లీన్ పార్క్ వేదికగా నూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 22) జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో టీ20లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. పేసర్లు మహ్మద్ సిరాజ్ (4/17), అర్షదీప్ సింగ్ (4/37), హర్షల్ పటేల్ (1/28) చెలరేగడంతో న్యూజిలాండ్ తమ కోటా 20 ఓవర్లు ఆడకుండానే 160 పరుగులకు ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. ఆరంభంలోనే 2 వికెట్లు (ఫిన్ అలెన్ (3), మార్క్ చాప్మన్ (12)) కోల్పోయినా, డెవాన్ కాన్వే (59), గ్లెన్ ఫిలిప్స్ (54) జట్టును ఆదుకున్నారు. అయితే వీరిద్దరు 16 పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో న్యూజిలాండ్ పతనం ఆరంభమైంది. వీరి తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఏ ఒక్క బ్యాటర్ నిలదొక్కుకోలేకపోయారు. ఏకంగా ముగ్గురు (నీషమ్, మిల్నే, సోధి) డకౌట్లు అయ్యారు. డారిల్ మిచెల్ (10) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. అనంతరం 161 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. కివీస్ పేసర్లు సౌథీ (2/27), ఆడమ్ మిల్నే (1/23) ధాటికి 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను (10) మిల్నే ఔట్ చేయగా.. మరో ఓపెనర్ రిషబ్ పంత్ (11), శ్రేయస్ అయ్యర్ (0)లను సౌథీ పెవిలియన్‌కు పంపాడు. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 58/3గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ (12), హార్ధిక్ పాండ్యా (23) క్రీజ్‌లో ఉన్నారు. పంత్.. ఇక మారవా..? టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ కమ్ వైస్ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఓపెనర్‌గా అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేక మరోసారి చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. టిమ్ సౌథీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండు, మూడు బంతులకు వరుసగా బౌండరీలు బాది టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన పంత్.. ఆతర్వాతి బంతికే అనవసరపు షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఆ ఓవర్లో అప్పటికే రెండు ఫోర్లు వచ్చినా సంతృప్తి చెందక.. సౌథీపై ఎటాకింగ్ చేద్దామని వెళ్లి వికెట్ సమర్పించుకున్నాడు. సౌథీ వేసిన షార్ట్ బాల్‌ను అంచనా వేయలేక క్రీజ్ వదిలి ముందుకు వచ్చి థర్డ్ మెన్లో ఉన్న సోధికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పంత్.. రెండో టీ20లోనూ ఇదే తరహాలో చెత్త షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. పంత్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోవడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పంత్.. ఇక మారవా..? అంటూ చీదరించుకుంటున్నారు. మరికొంత మంది అయితే పంత్‌ను తప్పించి సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పంత్‌కు ఇచ్చినన్ని అవకాశాలు భారత క్రికెట్ చరిత్రలో ఎవరికీ ఇవ్వలేదని.. బీసీసీఐకి, సెలెక్టర్లకు పంత్‌పై ఎందుకు ఇంత ప్రేమ అని ప్రశ్నిస్తున్నారు. ఫామ్‌లో ఉన్న శాంసన్‌ను పక్కకు పెట్టి, పంత్‌కు వరుస అవకాశాలు ఇవ్వడమేంటని నిలదీస్తున్నారు. -
న్యూజిలాండ్‌తో మూడో టీ20కి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్
నేపియర్‌లోని మెక్లీన్ పార్క్ వేదికగా రేపు (నవంబర్ 22) న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడో టీ20కి ముందు టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ తెలిసింది. రేపు జరుగబోయే మ్యాచ్‌కు వరుణుడి నుంచి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. మ్యాచ్ సమయానికి (భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు) ఆకాశం మేఘావృతమైనప్పటికీ.. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువని అక్కడి వాతావరణ శాఖ వెదర్ ఫోర్‌కాస్ట్‌లో పేర్కొంది. మ్యాచ్ ఎటువంటి అంతరాయం లేకుండా 20 ఓవర్ల మ్యాచ్‌గా సాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆకాశం పూర్తిగా మబ్బు పట్టి ఉంటే పేసర్లకు అనుకూలిస్తుందని, పరుగుల ప్రవాహానికి కూడా అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా, సిరీస్ డిసైడర్ కావడంతో ఈ మ్యాచ్ కచ్చితంగా జరగాలని ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానులు కోరుకుంటున్నారు. వెల్లింగ్టన్లో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. మౌంట్ మాంగనూయ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో సూర్యకుమార్ విధ్వంసం (111 నాటౌట్), దీపక్ హుడా మాయాజాలం (4/10) చేయడంతో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో టీ20లో కివీస్ జట్టుకు టిమ్ సౌథీ నాయకత్వం వహించనున్న విషయం తెలిసిందే. మెడికల్ అపాయింట్మెంట్ ఉండటంతో రెగ్యలర్ కెప్టెన్ విలియమ్సన్ లీవ్ తీసుకోవడంతో సౌథీకి జట్లు పగ్గాలు అప్పజెప్పారు. విలియమ్సన్ స్థానాన్ని మైఖేల్ బ్రేస్‌వెల్ భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ మార్పు మినహా రెండో టీ20లో ఆడిన జట్టునే కివీస్ యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. రెండో టీ20లో అంతగా ఆకట్టుకోలేని సుందర్ స్థానంలో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. -
IND vs AUS 3rd T20: మెరిసిన కోహ్లి, సూర్య కుమార్.. భారత్ భలే గెలుపు
India Vs Australia T20 Series- 3rd T20- Hyderabad: ఆస్ట్రేలియాకు లభించిన ఆరంభం చూస్తే స్కోరు 200 ఖాయమనిపించింది. కానీ మన బౌలర్లు మిడిలార్డర్లో ప్రత్యర్థిని కదలనీయలేదు. చివరకు అంతకంటే తక్కువ స్కోరుకే పరిమితం చేసేశారు. మనకు లభించిన ఆరంభం చూస్తే ఛేదన కష్టమనిపించింది. కానీ సూర్యకుమార్, కోహ్లి దానిని సునాయాసం చేసేశారు. కీలక సమయాల్లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన జట్టుకు మరో గుర్తుంచుకోదగ్గ విజయాన్ని అందించింది. భారీ స్కోర్లతో ఆసక్తికరంగా సాగి ఆఖర్లో కాస్త ఉత్కంఠను పెంచిన పోరులో చివరకు టీమిండియాదే పైచేయి అయింది. రోహిత్ సేన ఖాతాలో మరో సిరీస్ చేరింది. రెండు రోజుల విరామం తర్వాత ఈనెల 28 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టి20 సిరీస్‌లో భారత్ బరిలోకి దిగనుంది. సాక్షి, హైదరాబాద్: చివరి ఓవర్లో భారత్ విజయానికి 11 పరుగులు అవసరం కాగా, తొలి బంతికే కోహ్లి సిక్స్ బాదాడు. తర్వాతి 3 బంతుల్లో ఒకే పరుగు రావడంతోపాటు కోహ్లి వెనుదిరిగాడు. దాంతో 2 బంతుల్లో 4 పరుగుల చేయాల్సి రాగా... హార్దిక్ తెలివిగా ఆడిన షాట్ థర్డ్‌మాన్ దిశగా బౌండరీకి దూసుకుపోవడంతో స్టేడియంలో సంబరాలు హోరెత్తాయి. మ్యాచ్‌లో విజయంతో టి20 సిరీస్ 2–1తో భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన చివరి టి20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (27 బంతుల్లో 54; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్ (21 బంతుల్లో 52; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (48 బంతుల్లో 63; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 62 బంతుల్లోనే 104 పరుగులు జోడించారు. మెరుపు ఓపెనింగ్... ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మూడు భిన్నమైన దశల్లో సాగింది. ముందుగా గ్రీన్ విధ్వంసం, ఆపై భారత బౌలర్ల కట్టడితో జోరు తగ్గగా... చివర్లో డేవిడ్ దూకుడు జట్టుకు భారీ స్కోరు అందించింది. కెప్టెన్ ఫించ్ (7) విఫలం కాగా, ఆసీస్ 5 ఓవర్లలో చేసిన తొలి 62 పరుగుల్లో 52 గ్రీన్ సాధించడం విశేషం. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో వరుసగా 6,4 కొట్టిన గ్రీన్... బుమ్రా ఓవర్లో ఫోర్, 2 వరుస సిక్స్‌లతో చెలరేగాడు. అక్షర్ ఓవర్లోనూ వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. అయితే గ్రీన్ అవుటైన తర్వాత ఆసీస్ స్కోరు వేగం ఒక్కసారిగా మందగించింది. ముఖ్యంగా అక్షర్ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించాడు. ఒకదశలో 27 బంతుల వ్యవధిలో 22 పరుగులు మాత్రమే చేసి ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అక్షర్ ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. అయితే డేవిడ్, స్యామ్స్ భాగస్వామ్యం కంగారూలను మళ్లీ నిలబెట్టింది. వీరిద్దరు ఏడో వికెట్‌కు 34 బంతుల్లోనే 68 పరుగులు జోడించారు. భువనేశ్వర్ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన అనంతరం హర్షల్ ఓవర్లో మరో భారీ సిక్సర్‌తో 25 బంతుల్లో డేవిడ్ ఆసీస్ తరఫున తన తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు బుమ్రా ఓవర్లో స్యామ్స్ 6, 4 కొట్టడం కూడా హైలైట్‌గా నిలిచింది. శతక భాగస్వామ్యం... భారీ ఛేదనలో భారత్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. 4 ఓవర్లు ముగిసేసరికి 34 పరుగులు రాగా, రాహుల్ (1), రోహిత్ (17) వెనుదిరిగారు. అయితే కోహ్లి, సూర్య భాగస్వామ్యం భారత్‌ను గెలుపు దిశగా నడిపించింది. హాజల్‌వుడ్ ఓవర్లో వరుస బంతుల్లో కోహ్లి 6, 4 కొట్టగా, స్యామ్స్ బౌలింగ్‌లో సూర్య బాదిన సిక్సర్ మైదానాన్ని హోరెత్తించింది. ఆపై జంపా ఓవర్లో రెండు వరుస సిక్సర్లు బాది సూర్య 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. హాజల్‌వుడ్ ఓవర్లోనూ 4, 6 కొట్టిన అనంతరం మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరిగాడు. అయితే 36 బంతుల్లో 53 పరుగులు చేయాల్సిన ఈ దశలో కోహ్లి తన జోరును కొనసాగించగా, హార్దిక్ (16 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. 37 బంతుల్లో అర్ధ సెంచరీ చేరుకున్న కోహ్లి జట్టును విజయానికి చేరువగా తెచ్చి చివరి ఓవర్లో నిష్క్రమించినా హార్దిక్ మరో బంతి మిగిలి ఉండగానే పని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: గ్రీన్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 52; ఫించ్ (సి) హార్దిక్ (బి) అక్షర్ 7; స్మిత్ (స్టంప్డ్) కార్తీక్ (బి) చహల్ 9; మ్యాక్స్‌వెల్ (రనౌట్) 6; ఇన్‌గ్లిస్ (సి) రోహిత్ (బి) అక్షర్ 24; డేవిడ్ (సి) రోహిత్ (బి) హర్షల్ 54; వేడ్ (సి అండ్ బి) అక్షర్ 1; స్యామ్స్ (నాటౌట్) 28; కమిన్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–44, 2–62, 3–75, 4–84, 5–115, 6–117, 7–185. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–39–1, అక్షర్ 4–0–33–3, బుమ్రా 4–0–50–0, హార్దిక్ 3–0–23–0, చహల్ 4–0–22–1, హర్షల్ 2–0–18–1. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) వేడ్ (బి) స్యామ్స్ 1; రోహిత్ (సి) స్యామ్స్ (బి) కమిన్స్ 17; కోహ్లి (సి) ఫించ్ (బి) స్యామ్స్ 63; సూర్యకుమార్ (సి) ఫించ్ (బి) హాజల్‌వుడ్ 69; హార్దిక్ (నాటౌట్) 25; కార్తీక్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–5, 2–30, 3–134, 4–182. బౌలింగ్: స్యామ్స్ 3.5–0–33–2, హాజల్‌వుడ్ 4–0–40–1, జంపా 4–0–44–0, కమిన్స్ 4–0–40–1, గ్రీన్ 3–0–14–0, మ్యాక్స్‌వెల్ 1–0–11–0. M. O. O. D as #TeamIndia beat Australia in the third #INDvAUS T20I & seal the series win. 👍 👍 Scorecard ▶️ https://t.co/xVrzo737YV pic.twitter.com/uYBXd5GhXm — BCCI (@BCCI) September 25, 2022 -
IND VS AUS 3rd T20: వేలల్లో టికెట్లు.. కోట్లలో బెట్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా భారత్–ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన మూడో టీ20 క్రికెట్ మ్యాచ్ ద్వారా బ్లాక్‌మార్కెటింగ్, బెట్టింగ్ మాఫియాలు భారీగా డబ్బు దండుకున్నాయి. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు వరకు బ్లాక్‌లో టికెట్ల దందా యథేచ్ఛగా సాగగా మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ సైతం జోరుగా జరిగింది. స్టేడియంలో ఫస్ట్ ఫ్లోర్, సౌత్ పెవిలియన్, నార్త్ పెవిలియన్, టెర్రస్.. ఇలా పలు రకాలుగా ఉండే టికెట్లను బ్లాక్ మార్కెట్ మాఫియా కనీసం నాలుగింతలు పెంచి అమ్మింది. మరోవైపు మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ మాఫియా రూ. కోట్లలో కొల్లగొట్టినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాన ఆటగాళ్లు చేయబోయే పరుగులు, వికెట్లు తీసే బౌలర్లు, మొత్తంగా జట్టు సాధించే స్కోర్.. ఇలా పలు విభాగాల్లో బెట్టింగ్ సాగింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌ల ద్వారా బెట్టింగ్ గ్రూపులు క్రియేట్ చేసి ఆధార్ కార్డుతో కూడిన వ్యక్తిగత వివరాలు పంపిన వారినే ఇందులో చేర్చుకున్నట్లు తెలిసింది. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా కేంద్రాలుగా సాగిన ఈ దందాలో రూ.1000 మొదలు రూ. 10 లక్షల దాకా ఒక్కో బంతికి లేదా ఒక్కో పరుగుకు బెట్టింగ్ జరిగినట్లు సమాచారం. -
Ind Vs Aus 3rd T20- Uppal: హైదరాబాద్ బిర్యానీకి రోహిత్ ఫిదా
India Vs Australia T20 Series- 3rd T20- Hyderabad- బంజారాహిల్స్: హైదరాబాద్ బిర్యానీకి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫిదా అయ్యారు. ఇండియా–ఆస్ట్రేలియా టీ–20 మ్యాచ్ కోసం శనివారం హైదరాబాద్‌కు వచ్చిన రోహిత్ శర్మ జట్టుసభ్యులతో కలిసి బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో బస చేశారు. అయితే మల్కాజ్‌గిరిలో నివసించే భారత ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆహ్వానం మేరకు శనివారంరాత్రి రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, మిగతా కోచ్‌లు, అసిస్టెంట్లతో కలిసి ఆయన ఇంటికి విందుకు వెళ్లారు. గోల్కొండ హోటల్ నుంచి తీసుకొచ్చిన బిర్యానీని రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్, మిగతా సిబ్బంది పసందుగా ఆరగించారు. రుచికరమైన బిర్యానీని వడ్డించిన గోల్కొండ హోటల్ సిబ్బందితో రోహిత్ శర్మ సెల్ఫీ తీసుకున్నారు. ఇక ఆదివారం మూడో టీ20లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు సన్నద్ధమయ్యే పనిలో పడింది. Winners Are Grinners! ☺️ ☺️ That moment when #TeamIndia Captain @ImRo45 received the #INDvAUS @mastercardindia T20I series trophy 🏆 from the hands of Mr. @ThakurArunS, Treasurer, BCCI. 👏 👏 pic.twitter.com/nr31xBrRBQ — BCCI (@BCCI) September 25, 2022 చదవండి: IND vs AUS 3rd T20: మెరిసిన కోహ్లి, సూర్య కుమార్.. భారత్ భలే గెలుపు IND vs Aus: కార్తీక్‌పై మరోసారి సీరియస్ అయిన రోహిత్!.. కానీ -
Sakshi Cartoon 24-09-2022
-
IND VS AUS 3rd T20 Tickets: జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట.. ఏడుగురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్/ రాంగోపాల్‌పేట్: గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతం. ఒక్కసారిగా వర్షం. జింఖానా గ్రౌండ్స్ వద్ద అప్పటివరకు కిలోమీటర్ పొడవు క్యూ లైన్లలో ఉన్నవారు, చుట్టుపక్కల ఉన్నవారు ఒకేసారి మైదానం ప్రధాన గేటు వైపు దూసుకువచ్చారు. లోపలకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఫలితం.. తీవ్రమైన తొక్కిసలాట. ఊపిరే అందని పరిస్థితి. కొందరు కింద పడిపోయారు. కాళ్ల కింద నలిగిపోయారు. గుమిగూడిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ క్రమంలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు గాయపడ్డారు. మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగే భారత్–ఆ్రస్టేలియా టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం జింఖానా మైదానంలో నేరుగా (ఆఫ్‌లైన్) టికెట్లు విక్రయించాలని నిర్ణయించిన హెచ్‌సీఏ ఆ మేరకు సరైన ఏర్పాట్లు, బందోబస్తు చేయలేదని, అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల తర్వాత మ్యాచ్‌తో.. మూడేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. బుధవారం వరకు ఆన్లైన్లోనే టికెట్ల అమ్మకాలు అంటూ చెప్పిన హెచ్‌సీఏ.. గురువారం మాత్రం కౌంటర్ ద్వారా టికెట్లు అమ్మాలని నిర్ణయించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మకాలు జరుగుతాయని ప్రకటించింది. మైదానంలోని హెచ్‌సీఏ కార్యాలయానికి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన గేట్ వద్ద కుడివైపు పురుషులు, ఎడమవైపు మహిళలకు లైన్లు కేటాయించారు. గేటు దాటి లోపలకు వచ్చిన తర్వాత మాత్రం ఒకే లైన్లో టిక్కెట్ కౌంటర్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టికెట్ల కోసం బుధవారం రాత్రి నుంచే అభిమానులు గ్రౌండ్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభించారు. గురువారం తెల్లవారుజాముకే వీరి సంఖ్య పది వేలు దాటింది. ఒక్కోటి దాదాపు కి.మీ. మేర క్యూలైన్లు ఏర్పడ్డాయి. ప్రధాన గేట్‌ను మూసి ఉంచిన పోలీసులు విడతల వారీగా కొందరి చొప్పున లోపలి క్యూ లైన్లోకి పంపిస్తున్నారు. వర్షంతో పరుగులు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వర్షం కురిసింది. దీంతో తలదాచుకునేందుకు మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్లకు ఇదే గేటు కావడంతో లోపల నుంచి వచ్చే వారి కోసం పోలీసులు కొద్దిగా దాన్ని తెరిచారు. అదే సమయంలో బయట ఉన్న దాదాపు 1,000 మంది ఒకేసారి లోపలకు దూసుకురావడానికి ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులు అదుపు చేయలేకపోవడంతో ముందు వరుసల్లో ఉన్న వాళ్లు కింద పడిపోయారు. అదే అదనుగా కొందరు పోకిరీలు.. మహిళలు, యువతులపై పడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జీకి దిగారు. తొక్కిసలాట, లాఠీచార్జిలో ఒక కానిస్టేబుల్, ఒక అగ్నిమాపక సిబ్బందితో పాటు ఏడుగురికి గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఉదంతంతో గ్రౌండ్స్ వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. టిక్కెట్ల విక్రయానికి మరో కౌంటర్ ఏర్పాటు చేయించారు. సాయంత్రం టిక్కెట్ల విక్రయం పూర్తయ్యే వరకు భారీ బందోబçస్తు ఏర్పాటు చేశారు. లాఠీచార్జీ తర్వాత బయట ఉన్నవారిని పోలీసులు పంపేయగా.. సాయంత్రం వరకు ఉండి టిక్కెట్ల దొరకని వారు నిరసనకు ప్రయత్నించడంతో అధికారులు నచ్చజెప్పి పంపేశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స తొక్కిసలాటలో గాయపడిన ఏడుగురిని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో జింఖానా మైదానంలో స్వీపర్‌గా పనిచేసే బోరబండకు చెందిన రంజిత, బేగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ శ్రీకాంత్, కవాడీగూడకు చెందిన విద్యార్థి ఆదిత్యనాథ్, తిరుమలగిరి ఇందిరానగర్‌కు చెందిన విద్యారి్థని సయ్యదా ఆలియా, కొంపల్లి బహుదూర్‌పల్లికి చెందిన సాయి కిశోర్, సికింద్రాబాద్ కంట్రోల్ రూమ్‌కు చెందిన అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ శ్రీనాథ్ యాదవ్, కేపీహెచ్‌బీ (జేఎన్టీయూ)కి చెందిన సుజాత ఉన్నారు. వీరిలో సాయి కిశోర్, సుజాతలను ప్రా£ýథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశామని, చికిత్స పొందుతున్న వారు కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. బాధితుల ఫిర్యాదుతో మూడు కేసులు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌తో పాటు నిర్వాహకులపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. జింఖానా వద్ద జరిగిన తొక్కిసలాటకు హెచ్‌సీఏ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని చికిత్స పొందుతున్న వారు ఫిర్యాదు చేయడంతో, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌తో పాటు నిర్వాహకులపై బేగంపేట పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ యాక్ట్, 420, 21,22/76 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. టికెట్లు బ్లాక్‌లో అమ్ముకున్నట్లు ఫిర్యాదులందాయి. హెచ్‌సీఏ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని, వారిపై చర్యలు ఉంటాయని, నోటీసులు జారీ చేస్తామని అదనపు సీపీ (శాంతిభద్రతలు) డీఎస్ చౌహాన్ చెప్పారు. కనీస ఏర్పాట్లు లేకపోవడం వల్లే.. ఉప్పల్ స్టేడియం సామర్థ్యం సుమారు 39,800లో అన్నిరకాల పాస్‌ల సంఖ్య 20 శాతానికి మించదు. మిగిలిన వాటిని ప్రేక్షకులకు అందుబాటులో ఉంచే విషయంలో హెచ్‌సీఏలో నెలకొన్న గందరగోళం తాజా పరిస్థితికి దారి తీసినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లోనా లేక ఆఫ్‌లైన్‌లోనా అనే విషయంలో బుధవారం వరకు స్పష్టత లేకుండా పోయింది. హెచ్‌సీఏలో చాలా కాలంగా ఉన్న విభేదాల కారణంగా గతంలో టికెట్ల విషయంలో కీలకంగా, చురుగ్గా వ్యవహరించినవారు అధ్యక్షుడు అజారుద్దీన్‌కు సహకరించలేదని సమాచారం. దీంతో ఆయన పూర్తిగా దిగువ స్థాయి ఉద్యోగులపై ఆధారపడ్డారు. బుధవారం జింఖానా మైదానం వద్దకు ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో వచ్చి హడావుడి చేసిన నేపథ్యంలో.. ఆఫ్‌లైన్‌లో టికెట్లు అమ్ముదామని అజహర్ చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద కనీస ఏర్పాట్లు, బందోబస్తు లేకపోవడం, వర్షం నేపథ్యంలో తొక్కిసలాట జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మ్యాచ్ నిర్వహణ సులువు కాదు: అజారుద్దీన్ గురువారం చోటు చేసుకున్న ఘటనలో తన తప్పేమీ లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ చెప్పారు. క్రికెట్ మ్యాచ్ నిర్వహణ అంత సులువు కాదని పేర్కొన్నారు. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. ఘటనపై ప్రభుత్వానికి నివేదిక సమరి్పస్తామని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మ్యాచ్‌ల నిర్వహణ ఉంటుందని చెప్పారు. అందరం క్రికెట్ అభివృద్ధి కోసమే కష్టపడుతున్నామని అన్నారు. మ్యాచ్ టికెట్లు అన్నీ అమ్ముడుబోయినట్లు తెలిపారు. తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగితే సహించం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయం సందర్భంగా జింఖానా గ్రౌండ్స్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో టీ20 క్రికెట్ మ్యాచ్ ఏర్పాట్లపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. దళారులు టికెట్లు అమ్మే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్‌సీఏ పాలకమండలి ఏకపక్షంగా వ్యవహరించకుండా ప్రభుత్వ సహకారాన్ని కోరిఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 25న జరిగే మ్యాచ్‌ను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని విజ్ఞప్తి చేశారు. జింఖానా వద్ద గాయపడిన వారికి హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్యసేవలు అందజేస్తామన్నారు. సమావేశంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, టీఎస్పీడీసీఎల్ ఎండీ రఘుమా రెడ్డి, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు పాల్గొన్నారు. ఒక కౌంటర్ నుంచే టికెట్లు అమ్మారు నాలుగు కౌంటర్లు అని చెప్పినా డిజిటల్ పేమెంట్లు పని చేయలేదు. మధ్యాహ్నం వరకు ఒక కౌంటర్ నుంచే టికెట్లు అమ్మారు. మరో కౌంటర్ కేవలం పోలీసుల కోసమే కేటాయించినట్టుంది. చాలామంది అడ్డదారిలో అక్కడకు వెళ్లి కొనుక్కున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి వేచి చూసినా నాకు టికెట్ దొరకలేదు. – సాయి ప్రవీణ్, గాజులరామారం -
ఎట్టకేలకు ఓ విజయం.. వైట్‌వాష్ గండం నుంచి గట్టెక్కిన విండీస్
ఇటీవలి కాలంలో వరుస వైట్‌వాష్ పరాభవాలను ఎదుర్కొంటున్న వెస్టిండీస్ జట్టు.. మరోసారి ఆ అవమానం బారిన పడకుండా గట్టెక్కింది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగుతున్న టీ20 సిరీస్‌లో ఆ జట్టు ఎట్టకేలకు ఓ ఓదార్పు విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్ ఇదివరకే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో నామమాత్రంగా సాగిన ఆఖరి టీ20లో కరీబియన్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఓడియన్ స్మిత్ (3/29), అకీల్ హొసేన్ (2/28), డోమినిక్ డ్రేక్స్ (1/19), హేడెన్ వాల్ష్ (1/16) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. కివీస్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్ (26 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. ఛేదనలో ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (35 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), షమార్ బ్రూక్స్ (59 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో చెలరేగడంతో విండీస్ 19 ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆఖర్లో కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (15 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వరుస ఓవర్లలో సిక్సర్లతో విరుచుకుపడి విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా విండీస్ 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 1-2 తేడాతో ముగించింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, ఐష్ సోధీకి తలో వికెట్ దక్కింది. సిరీస్ మొత్తంలో 5 అద్భుతమైన క్యాచ్‌లతో పాటు ఓ హాఫ్ సెంచరీ సహా 100కిపైగా పరుగులు సాధించిన గ్లెన్ ఫిలిప్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కగా.. ఈ మ్యాచ్‌లో సుడిగాలి హాఫ్ సెంచరీతో చెలరేగిన బ్రాండన్ కింగ్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇదిలా ఉంటే, ఈ సిరీస్‌కు ముందు విండీస్ టీమిండియా చేతిలో 0-3 తేడాతో వన్డే సిరీస్‌ను, 1-4 తేడాతో టీ20 సిరీస్‌ను, అంతకుముందు స్వదేశంలోనే బంగ్లాదేశ్ చేతిలో 0-3 తేడాతో వన్డే సిరీస్‌ను, పాక్ గడ్డపై 0-3 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. విండీస్-న్యూజిలాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగస్ట్ 17 నుంచి ప్రారంభం కానుంది. బార్బడోస్ వేదికగా ఆగస్ట్ 17న తొలి వన్డే, 19న రెండో వన్డే, 21న ఆఖరి వన్డే జరుగనుంది. చదవండి: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్.. న్యూజిలాండ్‌కు బిగ్ షాక్! -
భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. హైదరాబాద్‌లో మ్యాచ్ ఎప్పుడంటే..?
IND VS AUS T20 Series Schedule: టీ20 ప్రపంచకప్ 2022కు ముందు భారత క్రికెట్ జట్టు ఊపిరి సడలని షెడ్యూల్‌తో ఉక్కిరిబిక్కిరవుతుంది. ప్రస్తుతం విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియా.. ఆ తర్వాత జింబాబ్వే పర్యటన, ఆ వెంటనే ఆసియా కప్‌తో బిజీబిజీగా గడపనుంది. ఆసియా కప్ ముగిసిన తర్వాత టీమిండియా దాదాపు నెలన్నర ఖాళీగా ఉండటంతో బీసీసీఐ ఈ మధ్యలో రెండు సిరీస్‌లను ప్లాన్ చేసింది. Take a look at #TeamIndia's home series fixture against Australia. 👍#INDvAUS pic.twitter.com/zwNuDtF32R — BCCI (@BCCI) August 3, 2022 సెప్టెంబర్ 20-25 మధ్యలో ఆస్ట్రేలియా, సెప్టెంబర్ 28-అక్టోబర్ 11 మధ్యలో సౌతాఫ్రికా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. భారత పర్యటనలో ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుండగా.. దక్షిణాఫ్రికా 3 టీ20లు, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. Check out the #INDvSA home series schedule. 👌#TeamIndia | @BCCI | @OfficialCSA pic.twitter.com/jo8zC4hjDq — BCCI (@BCCI) August 3, 2022 ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు పంజాబ్‌లోని మొహాలీ వేదిక కాగా.. రెండో టీ20 నాగ్‌పూర్‌లో జరుగనుంది. చివరిదైన మూడో టీ20కి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్) వేదిక కానుంది. చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. దీంతో స్థానికులు ఉబ్బితబ్బుబ్బిపోతున్నారు. సౌతాఫ్రికా పర్యటన విషయానికొస్తే.. సెప్టెంబర్ 28- తొలి టీ20 (తిరువనంతపురం) అక్టోబర్ 2- రెండో టీ20 (గౌహతి) అక్టోబర్ 4- మూడో టీ20 (ఇండోర్) అక్టోబర్ 6- తొలి వన్డే (లక్నో) అక్టోబర్ 9- రెండో వన్డే (రాంచీ) అక్టోబర్ 11- మూడో వన్డే (ఢిల్లీ) చదవండి: Asia Cup 2022: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. త్రిబుల్ ధమాకా..! -
బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన జింబాబ్వే
ఫ్లవర్ బ్రదర్స్, అలిస్టర్ క్యాంప్‌బెల్, హీత్ స్ట్రీక్ లాంటి స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత కళ తప్పిన జింబాబ్వే క్రికెట్ టీమ్ ఇటీవలి కాలంలో పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. చాలాకాలం తర్వాత ప్రపంచకప్‌కు (టీ20) అర్హత సాధించిన ఆ జట్టు.. తాజాగా స్వదేశంలో తమకంటే మెరుగైన బంగ్లాదేశ్‌కు షాకిచ్చి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్ గెలిచి సమానంగా ఉండిన రెండు జట్లు మంగళవారం జరిగిన నిర్ణయాత్మక మూడు మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడ్డాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జాంబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఆరంభంలో బంగ్లా బౌలర్లు రెచ్చిపోవడంతో ఓ దశలో 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆతిధ్య జట్టు.. ర్యాన్ బుర్ల్ (28 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), జాంగ్వే (20 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ల సాయంతో ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్, హసన్ మహమూద్ చెరో 2 వికెట్లు, ముస్తాఫిజుర్, మెసద్దెక్ హొసేన్, నసుమ్ అహ్మద్, మహ్మదుల్లా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో తడబడిన బంగ్లా జట్టు.. లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయి 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జింబాబ్వే బౌలర్లు విక్టర్ న్యాయుచి (3/29), బ్రాడ్ ఈవాన్స్ (2/26) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. అఫీఫ్ హొసేన్ (27 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు), మెహిది హసన్ (17 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్) జట్టును గెలిపించేందుకు సాయశక్తులా ప్రత్నించారు. ఈ మ్యాచ్ మినహాయించి తొలి రెండు టీ20ల్లో మెరుపు అర్ధసెంచరీలు సాధించిన సికందర్ రాజా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకోగా.. ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీతో రాణించిన ర్యాన్ బుర్ల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగస్ట్ 5 నుంచి ప్రారంభంకానుంది. చదవండి: 17 ఏళ్ల తర్వాత పాక్ పర్యటనకు ఇంగ్లండ్.. షెడ్యూల్ విడుదల..! -
బట్లర్ సేనకు చుక్కలు చూపించిన షంషి.. మరో సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్
టెస్ట్‌ల్లో వరుస విజయాలతో అదరగొడుతున్న ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రం దారుణంగా విఫలమవుతుంది. జోస్ బట్లర్ కెప్టెన్సీ చేపట్టాక ఆ జట్టు పరిస్థితి మరింత దిగజారింది. ఇటీవల టీమిండియా చేతిలో వన్డే, టీ20 సిరీస్ కోల్పోయిన ఇంగ్లీష్ జట్లు.. తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో టీ20 సిరీస్‌లో కూడా ఓటమిపాలైంది. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టీ20 గెలిచిన బట్లర్ టీమ్.. ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై 2-1తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఆదివారం (జులై 31) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20ల్లో సఫారీ జట్టు 90 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. సఫారీ స్పిన్నర్ తబ్రేజ్ షంషి (5/24) తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. టాస్ ఓడినప్పటికీ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్.. నిర్ణీత ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. రీజా హెండ్రిక్స్ (50 బంతుల్లో 70; 9 ఫోర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (36 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా.. రొస్సో (18 బంతుల్లో 31; 6 ఫోర్లు), కెప్టెన్ మిల్లర్ (9 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే (3/25) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ జట్టుకు షంషి చుక్కలు చూపించాడు. ఫలితంగా ఆ జట్టు 16.4 ఓవర్లలో 101 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జేసన్ రాయ్ (17), జోస్ బట్లర్ (14), జానీ బెయిర్‌స్టో (27), క్రిస్ జోర్డాన్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. ఆ జట్టులో అరివీర భయంకర హిట్టర్లు ఉన్నా షంషి మాయాజాలం ముందు అంతా తేలిపోయారు. షంషికి మరో ఎండ్‌లో కేశవ్ మహారాజ్ (2/21), ఫెలుక్వాయో (1/23), మార్క్రమ్ (1/5) సహకరించడంతో సఫారీ టీమ్ వారి స్వదేశంలోనే ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. కాగా, ఈ సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1-1తో డ్రా ముగిసిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా నిర్ణయాత్మక మూడో మ్యాచ్ రద్దు కావడంతో ఫలితం ఎటు తేలకుండా నిలిచిపోయింది. ఈ పర్యటనలో తదుపరి 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఆగస్ట్ 17, 25, సెప్టెంబర్ 8 తేదీల్లో మూడు టెస్ట్‌లు ప్రారంభమవుతాయి. చదవండి: ఐదేసిన మొసద్దెక్.. జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న బంగ్లా -
మూడో టి20లో ఇంగ్లండ్ విజయం.. టీమిండియాదే సిరీస్
ఇంగ్లండ్‌తో మూడో టి20లో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీ చేసినప్పటికి టీమిండియా పరాజయం నుంచి తప్పించలేకపోయాడు. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సూర్యకుమార్ సెంచరీ.. విజయం దిశగా టీమిండియా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టి20లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో మెరిశాడు. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 102 నాటౌట్, రవీంద్ర జడేజా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. సూర్యకుమార్ హాఫ్ సెంచరీ టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ మరో హాఫ్ సెంచరీతో మెరిశాడు. 32 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో ఫిఫ్టి పూర్తి చేసుకున్నాడు. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 96/3. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 82/3 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 82/3గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ (41), శ్రేయస్ (14) క్రీజ్‌లో ఉన్నారు. 60 బంతుల్లో 134 పరుగులు చేయాల్సి ఉంది. టీమిండియాకు మరో షాక్ టీమిండియాకు మరో షాక్ తగిలింది. 5వ ఓవర్ ఆఖరి బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ (11) కూడా ఔటయ్యాడు. టాప్లే బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు. 5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 31/3. శ్రేయస్, సూర్యకుమార్ (7) క్రీజ్‌లో ఉన్నారు. మళ్లీ నిరాశపర్చిన కోహ్లి చాలాకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లి మళ్లీ నిరాశపర్చాడు. మూడో టీ20లోనూ తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. విల్లే బౌలింగ్‌లో ఫోర్, సిక్సర్ బాది జోరుమీదున్నట్లు కనిపించినప్పటికీ ఆ మరుసటి బంతికే రాయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 14/2. క్రీజ్‌లో రోహిత్ (1), సూర్యకుమార్ (1) ఉన్నారు. ఆదిలోనే షాక్ 216 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ (5 బంతుల్లో 1) టాప్లే బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 1.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 2/1. క్రీజ్‌లో రోహిత్ శర్మ (1), విరాట్ కోహ్లి ఉన్నారు. తేలిపోయిన భారత బౌలర్లు.. ఇంగ్లండ్ భారీ స్కోర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించింది. మలాన్ (77), లివింగ్‌స్టోన్ (42 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఇంగ్లండ్ హిట్టర్ల ధాటికి తేలిపోయారు. హర్షల్ పటేల్ (2/35), బిష్ణోయ్ (2/30) కాస్త పర్వాలేదనిపించగా.. ఆవేశ్ ఖాన్ (1/43), ఉమ్రాన్ మాలిక్ (1/56), రవీంద్ర జడేజా (0/45) దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి బ్రూక్ (19) ఔటయ్యాడు. ఈ ఓవర్లో ఇంగ్లండ్ కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. 19 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 198/6. లివింగ్‌స్టోన్ (38), క్రిస్ జోర్డాన్ క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ను దారుణంగా దెబ్బకొట్టిన బిష్ణోయ్ టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్.. ఇంగ్లండ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో డేవిడ్ మలాన్ (77), మొయిన్ అలీ (0)లను పెవిలియన్‌కు పంపాడు. 17 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 169/. క్రీజ్‌లో లివింగ్‌స్టోన్ (30), హ్యారీ బ్రూక్ ఉన్నారు. 15 ఓవర్ల తర్వాత 151/3 డేవిడ్ మలాన్ (37 బంతుల్లో 77) రెచ్చిపోయి ఆడుతుండటంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. మరో ఎండ్‌లో లివింగ్‌స్టోన్ (13 బంతుల్లో 14) ఆచితూచి ఆడుతున్నాడు. 15 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 151/3. మలాన్ ఫిఫ్టీ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ మలాన్ హాఫ్ సెంచరీ బాదాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్లో 12వ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 13 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 125/3. కీజ్లో మలాన్(62), లివింగ్‌స్టోన్ (4) ఉన్నారు. సాల్ట్ క్లీన్ బౌల్డ్ 2 ఓవర్ల వ్యవధిలో ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఫిలిప్ సాల్ట్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 86/3. క్రీజ్‌లో మలాన్ (27), లివింగ్‌స్టోన్ (1) ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి జేసన్ రాయ్ (27) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 71/2. క్రీజ్‌లో మలాన్ (16), సాల్ట్ (5) ఉన్నారు. శభాష్ ఆవేశ్.. బట్లర్ క్లీన్ బౌల్డ్ టీమిండియా యువ పేసర్ ఆవేశ్ ఖాన్ మరోసారి తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో భువనేశ్వర్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆవేశ్.. ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను (9 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్) అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. 4 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 32/1. క్రీజ్‌లో జేసన్ రాయ్ (10), డేవిడ్ మలాన్ ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇదివరకే 2-0తో కైవసం చేసుకున్న భారత్.. ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఇవాళ (జులై 10) జరుగనున్న నామమాత్రపు మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఏకంగా నాలుగు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. టీమిండియా నుంచి హార్ధిక్, భవీ, బుమ్రా, చహల్ స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయ్ బరిలోకి దిగుతుండగా.. ఇంగ్లండ్ నుంచి పార్కిన్సన్, కర్రన్ స్థానాలను రీస్ టాప్లే, ఫిలిప్ సాల్ట్ రీప్లేస్ చేయనున్నారు. తుది జట్లు: భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయ్ ఇంగ్లండ్: జేసన్ రాయ్, జోస్ బట్లర్(కెప్టెన్), డేవిడ్ మలన్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, ఫిలిప్ సాల్ట్, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, రిచర్డ్ గ్లీసన్, రీస్ టాప్లే -
టీమిండియాకు షాక్.. మూడో టీ20లో శ్రీలంక ఘన విజయం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత మహిళల జట్టుతో ఇవాళ (జూన్ 27) జరిగిన ఆఖరి టీ20లో ఆతిధ్య శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా ఇదివరకే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో నామమాత్రంగా సాగిన ఈ మ్యాచ్‌లో లంక కెప్టెన్ చమారి ఆటపట్టు (48 బంతుల్లో 80 నాటౌట్; 14 ఫోర్లు, సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది. ఫలితంగా శ్రీలంక ఈ సిరీస్‌లో బోణీ కొట్టడంతో పాటు భారత ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేయగా.. లంక మరో 18 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చామరి సహా నిలాక్షి డిసిల్వా (28 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించడంతో శ్రీలంక సునాయస విజయం సాధించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్, రేణుక సింగ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు హర్మన్‌ప్రీత్ కౌర్ (39 నాటౌట్), జెమీమా రోడ్రిగెస్ (33) ఓ మోస్తరుగా రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. ఈ పర్యటనలో టీమిండియా జులై 1, 4, 7 తేదీల్లో వన్డేలు ఆడనుంది. చదవండి: IND VS IRE 1st T20: భువీ ఖాతాలో అరుదైన రికార్డు -
IND vs SA 3rd T20 : టీమిండియా సూపర్ విక్టరీ (ఫోటోలు)
-
చెలరేగిన హర్షల్, చహల్.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం
సత్తా చాటిన భారత బౌలర్లు.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం భారత బౌలర్లు హర్షల్ పటేల్ (4/25), చహల్ (3/20) సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్లు ఇషాన్ కిషన్ (54), రుతురాజ్ గైక్వాడ్ (57) అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో సఫారీలు భారత బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్లాసెస్ (29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. ఓటమి దిశగా పయనిస్తున్న దక్షిణాఫ్రికా వరుస క్రమంలో వికెట్లు కోల్పోతున్న దక్షిణాఫ్రికా ఓటమి దిశగా పయనిస్తుంది. 9 వికెట్ కోల్పోయే సమయానికి జట్టు 7 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉంది. 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా భారత బౌలర్లు వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. 9వ ఓవర్లో చహల్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ప్రిటోరియస్ (20) ఔట్ కాగా.. 11వ ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్‌లో గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి మిల్లర్ (3) వెనుదిరిగాడు. 11 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 71/5. క్రీజ్‌లో క్లాసెన్, పార్నెల్ ఉన్నారు. డస్సెన్ ఔట్ వరుస ఓవర్లలో దక్షిణాఫ్రికా వికెట్లు కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి డస్సెన్ (1) ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 40/3. క్రీజ్‌లో ప్రిటోరియస్, క్లాసెన్ ఉన్నారు. రెండో వికెట్ డౌన్ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో చహల్‌కు క్యాచ్ ఇచ్చి హెండ్రిక్స్ (23) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 38/2. క్రీజ్‌లో ప్రిటోరియస్, డస్సెన్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీ జట్టు ఇన్నింగ్స్ 4వ ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి బవుమా(8) ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 23/1. క్రీజ్‌లో హెండ్రిక్స్, ప్రిటోరియస్ ఉన్నారు. సౌతాఫ్రికా టార్గెట్ 180 టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఓపెనర్లు రుతురాజ్, ఇషాన్ కిషన్‌లు అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆఖర్లో హార్ధిక్ పాండ్యా (21 బంతుల్లో 31 నాటౌట్) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోర్ సాధించగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్ 2, రబాడ, షంషి, కేశవ్ మహారాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్ రబాడ వేసిన 19వ ఓవర్లో దినేశ్ కార్తీక్ ఔటయ్యాడు. 8 బంతుల్లో 6 పరుగులు చేసిన డీకే పార్నెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 167/4. క్రీజ్‌లో హార్ధిక్ (20), అక్షర్ ఉన్నారు. పంత్ ఔట్ ప్రస్తుత సిరీస్‌లో రిషబ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగుతుంది. తొలి రెండు టీ20ల్లో నిరాశపరిచిన పంత్ ఈ మ్యాచ్‌లోనూ విఫలయ్యాడు. 8 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసిన పంత్ ప్రిటోరియస్ బౌలింగ్‌లో బవుమాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 148/4. క్రీజ్‌లో హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 3 పరుగుల వ్యవధిలో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 128 పరుగుల వద్ద శ్రేయస్ వికెట్ కోల్పోయిన భారత్ 131 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 54) వికెట్‌ను చేజార్చుకుంది. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 133/3. క్రీజ్‌లో పంత్, హార్ధిక్ పాండ్యా ఉన్నారు. మరోసారి నిరాశపరిచిన శ్రేయస్ వన్‌డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోసారి నిరాశపరిచాడు. 11 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 14 పరుగులు చేసిన అతను.. షంషి బౌలింగ్‌లో నోర్జేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 128/2. క్రీజ్‌లో ఇషాన్ కిషన్ (53), పంత్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా ధాటిగా ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన రుతురాజ్ కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 97/1. క్రీజ్‌లో ఇషాన్ కిషన్ (36), శేయస్ అయ్యర్ ఉన్నారు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన రుతురాజ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ధాటిగా ఆడుతున్న రుతురాజ్.. కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ధనాధన్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన రుతురాజ్.. కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 9 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 89/0గా ఉంది. రుతురాజ్ (54), ఇషాన్ కిషన్ (35) క్రీజ్‌లో ఉన్నారు. ధాటిగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు రుతురాజ్ (16), ఇషాన్ కిషన్ (6) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఫలితంగా టీమిండియా 3 ఓవర్లలో వికెట్ నష్టాపోకుండా 22 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా విశాఖ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన దక్షిణాఫ్రికా సైతం ఈ మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆతృతగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులేకుండా బరిలోకి దిగుతున్నాయి. భారత్ తుదిజట్టు: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్ దక్షిణాఫ్రికా తుదిజట్టు: టెంబా బావుమా(కెప్టెన్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డ్వైన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే -
India Vs South Africa: ఇక గెలవాల్సిందే!
మన స్పిన్ తిరగట్లేదు. పేస్‌లో పదును లేదు. బ్యాటింగ్‌లో నిలకడ లేదు. రిషభ్ పంత్ కెప్టెన్ గా, బ్యాటర్‌గా ఏమాత్రం ప్రభావం చూపట్లేదు. సొంతగడ్డపై ఇన్ని ప్రతికూలతల తో తల్లడిల్లుతున్న టీమిండియా చావోరేవో తేల్చుకునేందుకు విశాఖపట్నంలో సిద్ధమైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో నేడు జరిగే మూడో టి20లో తప్పక గెలవాల్సిన పోరులో జోరుమీదున్న దక్షిణాఫ్రికాను ఢీ కొట్టబోతోంది. ఇక్కడా ఓడితే... ఇక ముందు జరిగే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా లాభముండదు. భారత్ లక్ష్యం సిరీసే అయితే వైజాగ్ నుంచే అంతా మార్చుకోవాలి. సీమర్లు నిప్పులు చెరగాలి. స్పిన్నర్లు తిప్పేయాలి. బ్యాటర్స్ బాధ్యతగా ఆడాలి. ఇవన్నీ ఈ మ్యాచ్‌లో కనిపిస్తే ఆఖరి దాకా సిరీస్ వేటలో ఉంటాం. సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది టి20 ప్రపంచకప్ కోసం గట్టి ప్రత్యర్థితో ఏర్పాటు చేసిన సిరీస్ ఇది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి కుర్రాళ్లను పరిశీలిస్తున్నారు. ఓ రకంగా కోచ్ ద్రవిడ్‌కే పరీక్షలాంటింది ఈ సిరీస్! గతంలో ఐపీఎల్, యువ జట్ల (అండర్ –19, భారత్ ‘ఎ’)ను తీర్చిదిద్దడంలో, కుర్రాళ్ల ప్రతిభను సానబెట్టడంలో సఫలమైన హెడ్ కోచ్‌ను సీనియర్ జట్టు ఫలితాలు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ద్రవిడ్ పంథా మార్చాలి. ఫలితంపై కాకుండా ఆటగాళ్లలో పట్టుదల పెరిగేలా అతను స్ఫూర్తి నింపాలి. అప్పుడే వరుస ఓటమిల తాలుకు ఒత్తిడి తగ్గుతుంది. బ్యాటర్లు పరుగులపై దృష్టి పెడతారు. బౌలర్లు వైవిధ్యం కనబరుస్తారు. ఓపెనింగ్‌లో రుతురాజ్, ఇషాన్ పవర్ ప్లేను బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఆ తర్వాత పంత్, హార్దిక్ ధాటైన ఇన్నింగ్స్ ఆడితే ఆఖర్లో దినేశ్ కార్తీక్ మెరుపులకు తగిన భారీస్కోరు సాధ్యమవుతుంది. అయితే ఓ పెద్ద స్కోరు చేస్తే పనైపోదని, గెలుపు దక్కదని తొలి మ్యాచ్‌లోనే సఫారీలు నిరూపించారు. కాబట్టి బౌలర్ల పాత్ర కూడా కీలకమే. వికెట్లు తీయడంలో ఏమాత్రం పట్టుసడలించకుండా ఉంటేనే విజయం దక్కుతుంది. ఆత్మవిశ్వాసంతో దక్షిణాఫ్రికా తొలి టి20ని బ్యాటింగ్‌తో, రెండో మ్యాచ్‌ను బౌలింగ్ ప్రతాపంతో చేజిక్కించుకున్న సఫారీ జట్టు ఆతిథ్య జట్టుకు కఠినమైన సవాళ్లు విసురుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇప్పుడు వరుసగా మూడో విజయంతో సిరీస్‌పైనే కన్నేసింది. ఈ సిరీస్ ఫలితాలని గమనిస్తే సఫారీ సమష్టి కృష్టితో నెగ్గుకొచ్చింది. కెప్టెన్ బవుమా, డసెన్, మిల్లర్, క్లాసెన్, ప్రిటోరియస్ అంతా బ్యాటింగ్‌లో మెరిపిస్తున్నారు. సీమర్లు నోర్జే, ప్రిటోరియస్, పార్నెల్, రబడ, స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌లు రెండో టి20లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్గల ఆతిథ్య జట్టును ఎక్కడికక్కడ కట్టడి చేశారు. జట్లు (అంచనా) భారత్: పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్/దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, చహల్. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), హెండ్రిక్స్, డసెన్, మిల్లర్, క్లాసెన్, ప్రిటోరియస్, పార్నెల్, రబడ, ఇన్‌గిడి/కేశవ్, నోర్జే, షమ్సీ. పిచ్, వాతావరణం ఇక్కడ జరిగిన రెండు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లోనూ తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. రెండుసార్లూ చేజింగ్ జట్టే గెలిచింది. సీమర్లు, స్పిన్నర్లకు అనుకూలం. టాస్ నెగ్గిన జట్టు కచ్చితంగా ఫీల్డింగే ఎంచుకుంటుంది. రుతుపవనాల ఆగమనంతో వర్షం కురిసేందుకు 20 శాతం అవకాశముంది. -
IND VS SL T20 Series: విన్నింగ్ ట్రోఫీని రోహిత్ ఎవరి చేతిలో పెట్టాడో చూడండి..!
శ్రీలంకతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో ప్రత్యర్ధిని చిత్తు చేసి, పొట్టి ఫార్మాట్లో వరుసగా 12వ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో అఫ్ఘానిస్థాన్ పేరిట ఉన్న అత్యధిక వరుస విజయాల రికార్డును టీమిండియా సమం చేసింది. సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాది టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్ (45 బంతుల్లో 73; 9 ఫోర్లు, సిక్సర్) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. pic.twitter.com/IACYLgn8TK — Addicric (@addicric) February 27, 2022 కాగా, లంకతో సిరీస్ ముగిసాక అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా విన్నింగ్ ట్రోఫీని జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్లకు అందజేసే రోహిత్.. ఈ సారి టీమిండియా కొత్త మేనేజర్ జయ్‌దేవ్ షాకి అందించి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. బీసీసీఐ మాజీ సెక్రటరీ నిరంజన్ షా కొడుకైన జయ్‌దేవ్ షా.. 2007-08 సీజన్లో సౌరాష్ట్రకు విజయ్ హజారే ట్రోఫీ అందించాడు. ఆతర్వాత సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్ సభ్యుడిగా కొనసాగాడు. జయ్‌దేవ్ షా.. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌కు టీమిండియా మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: సచిన్ సహచరుడు, టీమిండియా మాజీ ప్లేయర్ అరెస్ట్ -
కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్
శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన టీమిండియా స్టార్ టాపార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. పరుగుల యంత్రం, టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి పేరిట ఉన్న సిరీస్‌లో అత్యధిక పరుగుల రికార్డును శ్రేయస్ బ్రేక్ చేశాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో (2016లో ఆస్ట్రేలియాపై) కోహ్లి అత్యధికంగా 199 పరుగులు చేయగా, తాజాగా శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో శ్రేయస్.. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 204 పరుగులు సాధించి కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు. Shreyas Iyer scored 204 runs at a Strike Rate of 174.35 without even being dismissed once against Sri Lanka in the T20i series. He now holds the record for India of scoring most runs in a 3 match bilateral T20i series. pic.twitter.com/CGupBe9KqR — Mufaddal Vohra (@mufaddal_vohra) February 27, 2022 ఈ సిరీస్ మొత్తం అజేయంగా నిలిచిన శ్రేయస్.. తొలి మ్యాచ్‌లో 28 బంతుల్లో 57 పరుగులు, రెండో మ్యాచ్‌లో 44 బంతుల్లో 74 పరుగులు, మూడో మ్యాచ్‌లో 45 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఈ క్రమంలో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించిన శ్రేయస్.. కోహ్లి (2012, 2014, 2016), రోహిత్ శర్మ (2018), కేఎల్ రాహుల్ (2018, 2021)ల తర్వాత ఈ అరుదైన ఫీట్‌ను సాధించిన మూడో భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇదిలా ఉంటే, ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లో కెప్టెన్ దసున్ శనక (37 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 నాటౌట్) ఒంటిరి పోరాటం చేయడంతో లంక జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. శనకకు చండీమాల్(27 బంతుల్లో 2 ఫోర్లతో 25) సహకరించడంతో లంకేయులు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2, సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లంక నిర్ధేశించిన 147 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా మరో 19 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుని 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో టీమిండియా వరుసగా 12వ మ్యాచ్‌లో విజయం సాధించి అఫ్ఘానిస్థాన్ పేరిట ఉన్న అత్యధిక వరుస విజయాల రికార్డును సమం చేసింది. శ్రేయస్ అయ్యర్ (45 బంతుల్లో 73; 9 ఫోర్లు, సిక్సర్) సిరీస్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 22 నాటౌట్) శ్రేయస్‌కు సహకరించాడు. టీ20ల్లో తొలిసారి బ్యాటింగ్‌కు దిగిన దీపక్ హుడా (16 బంతుల్లో 21; ఫోర్, సిక్స్) పర్వాలేదనిపించాడు. లంక బౌలర్లలో కుమార 2, చమీరా, కరుణరత్నే తలో వికెట్ పడగొట్టారు. చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచంలో తొలి ఆటగాడిగా -
మెరిసిన శ్రేయస్.. మరో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
-
దంచి కొట్టిండు.. దండం పెట్టిండు.. వైరలవుతున్న సూర్యకుమార్ నమస్తే సెలబ్రేషన్స్
వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరి టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో విండీస్‌పై హ్యాట్రిక్ విజయాలు నమోదు టీమిండియా వరుసగా మరో సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. అంతకుముందు రోహిత్ సేన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. వరుసగా మూడో సిరీస్‌ను వైట్ వాష్ చేసిన కెప్టెన్‌గా అరుదైన గుర్తుంపు దక్కించుకున్నాడు. pic.twitter.com/UNUfkV8G1Z — Sports Hustle (@SportsHustle3) February 20, 2022 ఇదిలా ఉంటే, ఆఖరి టీ20లో సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 65; ఫోర్, 7 సిక్సర్లు) సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ప్రత్యర్ధి బౌలర్లపై విచక్షణారాహిత్యంగా సిక్సర్లతో విరుచుకుపడిన సూర్యకుమార్.. వెంకటేశ్ అయ్యర్ (19 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి ఆఖరి 5 ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ క్రమంలో సిక్సర్‌తో టీ20ల్లో నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్యకుమార్.. ఆ ఫీట్ సాధించాక చేసుకున్న సంబురాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. అర్థ సెంచరీ పూర్తికాగానే సూర్యకుమార్ బ్యాట్ పైకెత్తి సహచరులకు అభివాదం చేశాక, రెండు చేతులు జోడించి దండం పెట్టాడు. వెరైటీగా ఉన్న ఈ నమస్తే సెలబ్రేషన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అలాగే సూర్యప్రతాపాం చూపించి విండీస్ బౌలర్లకు దడ పుట్టించినందుకు గాను అభినందిస్తున్నారు. కాగా, టీమిండియా నిర్ధేశించిన 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయడంతో 17 పరుగుల తేడాతో ఓటమిపాలై 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో చేజార్చుకుంది. నికోలస్ పూరన్ (47 బంతుల్లో 61; 8 ఫోర్లు, సిక్సర్) వరుసగా మూడో మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీ చేసినప్పటికీ విండీస్‌కు విజయాన్ని అందించలేకపోయాడు. ఆఖర్లో రొమారియో షెపర్డ్ (21 బంతుల్లో 29; ఫోర్, 3 సిక్సర్లు) భారీ సిక్సర్లతో భయపెట్టినప్పటికీ విండీస్‌కు బోణీ విజయం దక్కలేదు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, శార్ధూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: సూర్యకుమార్ విధ్వంసం.. మూడో టీ20లోనూ టీమిండియాదే విజయం -
స్వల్ప మార్పులతో... విండీస్‌తో భారత్ చివరి టి20
India Vs West Indies Last T20 Match, కోల్‌కతా: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు టి20ల్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే 2–0తో సిరీస్ గెలుచుకున్న టీమిండియా నేడు విండీస్‌తో చివరిదైన మూడో టి20లో తలపడనుంది. భారత్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సిరీస్‌ను గెలుపుతో ముగిస్తుందా లేక ఈ పర్యటనలో కనీసం ఒక్క విజయంతోనైనా విండీస్ వెనుదిరుగుతుందా చూడాలి. ఈ మ్యాచ్‌తోపాటు శ్రీలంకతో టి20 సిరీస్ నుంచి కోహ్లి, పంత్ తప్పుకోవడంతో భారత్ రెండు మార్పులు చేయడం ఖాయమైంది. ఓపెనర్ గా రుతురాజ్, కోహ్లి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కనుంది. బౌలింగ్‌లో కూడా చహర్, భువనేశ్వర్లలో ఒకరిని పక్కన పెట్టి సిరాజ్ లేదా అవేశ్ ఖాన్‌కు అవకాశం ఇవ్వవచ్చు. -
IND Vs WI T20 Series: బీసీసీఐ కీలక నిర్ణయం.. అభిమానులకు శుభవార్త
టీమిండియా అభిమానులకు శుభవార్త. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ నెల 20న జరిగే చివరిదైన మూడో టీ20 మ్యాచ్‌కు ఇరవై వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించింది. వీరిలో అధిక శాతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) టికెట్ హోల్డర్స్ ఉంటారని బీసీసీఐ పేర్కొంది. బీసీసీఐ నిర్ణయం పట్ల క్యాబ్ అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా హర్షం వ్యక్తం చేశాడు. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, ప్రస్తుత పర్యటనలో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 3 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ (తొలి టీ20).. ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియాల్లో జరిగిన విషయం తెలిసిందే. కోవిడ్ నేపథ్యం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లను మహమ్మారి నుంచి రక్షించే ఉద్దేశంతోనే మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించడం లేదని బీసీసీఐ బాస్ గంగూలీ గతంలో వెల్లడించాడు. అయితే, నిన్న జరిగిన తొలి టీ20తో పాటు ఫిబ్రవరి 18న (శుక్రవారం) జరిగే రెండో టీ20 మ్యాచ్ కోసం 2000 మందికి పైగా అభిమానులు స్టేడియంలో కూర్చునేందుకు బీసీసీఐ అనుమతించడం విశేషం. ఇదిలా ఉంటే, విండీస్ తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్ లో టీమిండియా ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ ల్లో విజయాలు సాధించి, జోరుమీదుంది. వన్డే సిరీస్ ను 3-0తో, టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో టీమిండియా కొనసాగుతుంది. చదవండి: IPL 2022 Auction: రైనా.. ధోని నమ్మకాన్ని కోల్పోయాడు, అందుకే ఈ పరిస్థితి..! -
Ban Vs Pak: చివరి బంతికి గట్టెక్కిన పాక్.. 3–0తో క్లీన్‌స్వీప్
ఢాకా: బంగ్లాదేశ్‌తో ఉత్కంఠగా సాగిన మూడో టి20లో చివరి బంతికి నెగ్గిన పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంది. 125 పరుగుల స్వల్ప లక్ష్యంతో పాక్ ఛేదనను మొదలు పెట్టగా... ఆ జట్టు బ్యాటర్స్ మరీ నెమ్మదిగా ఆడారు. దాంతో విజయం కోసం పాకిస్తాన్ ఆఖరి ఓవర్లో 8 పరుగులు చేయాల్సి వచ్చింది. బౌలింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్ సారథి మహ్ముదుల్లా తొలి బంతికి పరుగు ఇవ్వలేదు. రెండు, మూడు బంతులకు వరుసగా సర్ఫరాజ్ అహ్మద్ (6), హైదర్ అలీ (38 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లను అవుట్ చేశాడు. దాంతో పాక్ శిబిరంలో కలవరం మొదలైంది. అయితే క్రీజులోకి వచ్చిన ఇఫ్తిఖార్ అహ్మద్ (2 బంతుల్లో 6; 1 సిక్స్) నాలుగో బంతికి సిక్సర్ బాదాడు. తర్వాతి బంతికి అతడు వెనుదిరగడంతో ఉత్కంఠ తార స్థాయికి చేరింది. చివరి బంతికి రెండు పరుగులు చేస్తే గెలుపు ఖాయం అన్న తరుణంలో మొహమ్మద్ నవాజ్ (4; 1 ఫోర్) ఫోర్ బాది పాక్‌ను గట్టెక్కించాడు. దాంతో మూడో టి20లో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచి సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులు చేసింది. ఓపెనర్ నైమ్ (50 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. ఛేదనలో పాకిస్తాన్ సరిగ్గా 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసి నెగ్గింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన హైదర్ అలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్‌లో అద్భుతంగా రాణించిన మొహమ్మద్ రిజ్వాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు ఈనెల 26న మొదలవుతుంది. చదవండి: Ind Vs Nz 2021 T20 Series: టీమిండియా సరికొత్త రికార్డు.. ఏకంగా ఆరు సార్లు.. Player of the Series @iMRizwanPak reviews the three-match series against Bangladesh.#BANvPAK | #HarHaalMainCricket pic.twitter.com/QHOkjsNKZj — Pakistan Cricket (@TheRealPCB) November 22, 2021 -
ఆస్ట్రేలియాకు షాకిచ్చిన బంగ్లా.. తొలిసారి సిరీస్ సొంతం
ఢాకా: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో ఆసీస్ 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3–0 తో సొంతం చేసుకుంది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గడం బంగ్లాదేశ్‌కు ఇదే ప్రథమం. తొలుత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ మహ్ముదుల్లా (53 బంతుల్లో 52; 4 ఫోర్లు) రాణించాడు. ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిచెల్ మార్‡్ష (47 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆసీస్‌ను గెలిపించలేకపోయాడు. అరంగేట్రంలో ఎలీస్ హ్యాట్రిక్ ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా తరఫున టి20ల్లో అరం గేట్రం చేసిన నాథన్ ఎలీస్... తొలి మ్యాచ్‌లోనే తన బౌలింగ్ పదును చూపెట్టాడు. 20వ ఓవర్లో బౌలింగ్ వచ్చిన అతడు చివరి మూడు బంతుల్లో వరుసగా... మహ్ముదుల్లా, ముస్తఫిజుర్, మెహదీ హసన్‌లను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ను పూర్తి చేశాడు. అరంగేట్రంలో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా ఎలీస్ ఘనతకెక్కాడు. ఓవరాల్‌గా టి20ల్లో ఇది 17వ హ్యాట్రిక్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీమిండియా ఘోర ఓటమి..సిరీస్ శ్రీలంక వశం
టీమిండియా ఘోర ఓటమి..సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లో రాణించిన శ్రీలంక భారత్ పై 7 వికెట్లతేడాతో ఘన విజయం సాధించింది. దీంతో శ్రీలంక 2-1 తేడాతో సీరీస్ కైవసం చేసుకుంది. 82 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆడుతూ పాడుతూ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.భారత బౌలర్లలో రాహుల్ చాహార్ మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా శ్రీలంక లంక బౌలర్ల ధాటికి 81 పరుగులకే కుప్పకులిపోయింది. శ్రీలంక స్పిన్నర్ హసరంగ నాలుగు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బతీశాడు. ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో నిలబడలేకపోయారు. బౌలర్ కుల్దీప్ యాదవ్(23) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.. మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక..సమరవిక్రమ(6)ఔట్ రాహుల్ చాహర్ దాటికి 82 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. సమరవిక్రమ(6) ను రాహుల్ చాహర్ బౌల్డ్ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక..మినోద్ భానుక (18)ఔట్ 82 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 35 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. మినోద్ భానుక (18) రాహుల్ చాహర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక.. అవిష్క ఫెర్నాండో(12) ఔట్ 82 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 23 పరుగుల స్కోర్ వద్ద శ్రీలంక తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(18 బంతుల్లో 12; ఫోర్)ను రాహుల్ చాహర్ పెవిలియన్‌కు పంపాడు. 6 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 23/1. క్రీజ్‌లో భానుక(8), సమరవిక్రమ(0) ఉన్నారు. టీమిండియా చెత్త ప్రదర్శన..లంక టార్గెట్ 82 టీమిండియా ప్లేయర్లు తమ చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. రెండో టీ20లో కనీసం మూడంకెల స్కోర్‌నైనా చేయగలిగిన భారత్.. ఈ మ్యాచ్‌లో కనీసం 100 పరుగుల మార్కును కూడా చేరుకోలేక దారుణంగా విఫలమైంది. లంక బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 81 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత జట్టులో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్ కాగా, మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. కుల్దీప్ యాదవ్ 23 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లు హసరంగ(4/9), షనక(2/20), మెండిస్(1/13), చమీర(1/16) అద్భుతంగా రాణించారు. 8వ వికెట్ కోల్పోయిన టీమిండియా.. వరుణ్ చక్రవర్తి డకౌట్ బర్త్ డే బాయ్ హసరంగ మరోసారి మ్యాజిక్ చేశాడు. టీమిండియా ప్లేయర్ వరుణ్ చక్రవర్తిని అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు పంపాడు. కరుణరత్నే క్యాచ్ అందుకోవడంతో వరుణ్ చక్రవర్తి డకౌట్‌గా వెనుదిరిగాడు. 16.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 63/8. క్రీజ్‌లో కుల్దీప్ యాదవ్(12), చేతన్ సకారియా ఉన్నారు. రాహుల్ చాహర్(5) ఔట్.. 62 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా లంక బౌలర్ల ధాటికి టీమిండియా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతుంది. షనక బౌలింగ్‌లో వికెట్ కీపర్ భానుక క్యాచ్ అందుకోవడంతో రాహుల్ చాహర్(5) పెవిలియన్ బాటపట్టాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 62/7. క్రీజ్‌లో కుల్దీప్ యాదవ్(12), వరుణ్ చక్రవర్తి ఉన్నారు. చెలరేగుతున్న హసరంగ.. 55 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా లంక స్పిన్నర్ హసరంగ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో టీమిండియా బ్యాట్స్మెన్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్(16)ను ఔట్ చేయడంతో టీమిండియా 55 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 55/6. క్రీజ్‌లో కుల్దీప్ యాదవ్(9), రాహుల్ చాహర్ ఉన్నారు. 36 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా టీమిండియా బ్యాట్స్మెన్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. లంక కెప్టెన్ షనక బౌలింగ్‌లో నితీశ్ రాణా(6) ఔటయ్యాడు. షనక అద్భుతమైన రిటర్న్ క్యాచ్ అందుకోవడంతో రాణా పెవిలియన్ బాట పట్టక తప్పలేదు. దీంతో 36 పరుగులకే టీమిండియా సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. క్రీజ్‌లో భువనేశ్వర్ కుమార్(6), కుల్దీప్ యాదవ్ ఉన్నారు. హసరంగ మాయాజాలం.. 25 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ లంక స్పిన్నర్ హసరంగ టీమిండియా బ్యాట్స్మెన్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. 5వ ఓవర్ నాలుగో బంతికి సామ్సన్ వికెట్ పడగొట్టిన హసరంగ ఇదే ఓవర్ ఆఖరి బంతికి రుతురాజ్(14)ను కూడా ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 25/4. క్రీజ్‌లో నితీశ్ రాణా(1), భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. పెవిలియన్‌కు క్యూ కట్టిన టీమిండియా బ్యాట్స్మెన్లు.. సామ్సన్ డకౌట్ హసరంగ వేసిన 5వ ఓవర్లో టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఆదుకుంటాడనుకున్న సంజూ సామ్సన్ మరోసారి దారుణంగా నిరాశపరిచాడు. హసరంగ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 4.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 24/3. క్రీజ్‌లో రుతురాజ్ గైక్వాడ్(14), నితీశ్ రాణా ఉన్నారు. టీమిండియాకు మరో షాక్.. పడిక్కల్(9) ఔట్ జట్టు స్కోర్ 23 పరుగుల వద్ద నుండగా టీమిండియాకు మరో షాక్ తగిలింది. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ పడిక్కల్(15 బంతుల్లో 9; ఫోర్)ను రమేశ్ మెండిస్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. 4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 23/2. క్రీజ్‌లోకి సంజూ సామ్సన్ వచ్చాడు. తొలి ఓవర్లోనే టీమిండియాకు భారీ షాక్.. ధవన్ డకౌట్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ నాలుగో బంతికే కెప్టెన్ ధవన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. చమీరా బౌలింగ్‌లో ఫస్ట్ స్లిప్‌లో ఉన్న డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి గోల్డన్ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. 0.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 5/1. పడిక్కల్(5)కు జోడీగా రుతురాజ్ గైక్వాడ్ క్రీజ్‌లోకి వచ్చాడు. కొలొంబో: శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్‌లోని తొలి టీ20లో టీమిండియా 38 పరుగుల తేడాతో విజయం సాధించగా, బుధవారం జరిగిన ఉత్కంఠ పోరులో(రెండో టీ20) ఆతిధ్య లంక జట్టు 4 వికెట్లు తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో గెలుపుతో సమానంగా నిలువగా, నేటి మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. టీమిండియాలో నవ్‌దీప్ సైనీ స్థానంలో సందీప్ వారియర్ బరిలోకి దిగనుండగా, లంక జట్టులో ఇసురు ఉదానకు బదులు పతుమ్ సిసంకా జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ ద్వారా సందీప్ వారియర్ టీ20 అరంగేట్రం చేయనున్నాడు. తుది జట్లు: భారత్: శిఖర్ ధవన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ , దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కీపర్), నితీశ్ రాణా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చహర్, సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా. శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక (కీపర్), సదీరా సమర విక్రమా, దనుంజయ డిసిల్వా, రమేశ్ మెండీస్, డసన్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, వానిందు హసరంగ, పతుమ్ సిసంకా, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ. -
ఆఖరి టీ20కి ముందు ధవన్ సేనకు మరో షాక్..!
కొలంబో: నిన్న శ్రీలంకతో జరిగిన రెండో టీ20 సందర్భంగా టీమిండియా స్టార్ పేసర్ నవదీప్ సైనీ గాయపడ్డాడు. ప్రస్తుతం అతను బీసీసీఐ వైద్య బృందం అబ్జర్వేషన్లో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో ఎక్స్ట్రా కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సైనీ గాయపడ్డాడు. కరుణరత్నే కొట్టిన బంతిని గాల్లోకి ఎగిరి పట్టుకునే ప్రయత్నంలో బలంగా కిందపడ్డాడు. దీంతో అతడి భుజానికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన వైద్య బృందం అతడిని మైదానం నుంచి తీసుకెళ్లి చికిత్స అందించింది. గాయం తీవ్రంగా ఉండడంతో నేటి నిర్ణయాత్మక మ్యాచ్ నుంచి అతను తప్పుకున్నట్లు తెలుస్తోంది. అసలే ఆటగాళ్లు అందుబాటులో లేక సతమతమవుతున్న సమయంలో సైనీ గాయం టీమిండియాను మరింత ఇబ్బంది పెడుతోంది. కనీసం పదకొండు మంది ఆటగాళ్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి ప్రస్తుతం భారత జట్టులో నెలకొంది. కాగా, ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా సోకడంతో అతనితో పాటు ఎనిమిది మంది భారత క్రికెటర్లు ఐసోలేషన్‌ను తరలించబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటి మ్యాచ్‌కు స్టాండ్ బై ప్లేయర్లతో బరిలోకి దిగిన టీమిండియా ఘోరంగా ఓటమిపాలైంది. సిరీస్ డిసైడర్ అయిన నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తున్న భారత్‌కు సైనీ గాయం తలనొప్పిగా మారింది. ఈ మ్యాచ్‌లో సైనీ స్థానంలో తమిళనాడు లెఫ్టార్మ్ స్పిన్నర్ సాయి కిషోర్‌కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. సాయి కిషోర్‌తో పాటు అర్షదీప్ సింగ్ మాత్రమే ప్రస్తుతం టీమిండియా బెంచ్‌పై ఉన్నారు. -
పదునైన పేస్‌కు మరోసారి తలొంచిన టీమిండియా
పదునైన పేస్ బౌలింగ్ ముందు భారత్ మరోసారి తలవంచింది. దాదాపు తొలి టి20 మ్యాచ్ తరహాలోనే సాగిన పోరులో బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియా ఓటమిని ఆహ్వానించింది. మార్క్ వుడ్ వేగం ముందు బ్యాట్స్‌మెన్ తలవంచగా... ఒక్క కోహ్లి మాత్రమే ఎదురుదాడితో జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అయితే పసలేని బౌలింగ్‌తోపాటు పేలవ ఫీల్డింగ్‌తో మన జట్టు లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. బట్లర్ మెరుపులతో ఇంగ్లండ్ అలవోకగా లక్ష్యం చేరి సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అహ్మదాబాద్: ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ తన 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాకుండానే అతని సహచరులు విజయాన్ని కానుకగా అందించారు. మంగళవారం ఇక్కడ జరిగిన మూడో టి20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి (46 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించగా, మిగతా బ్యాట్స్‌మెన్ ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బట్లర్ (52 బంతుల్లో 83 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించగా... బెయిర్‌స్టో (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. నాలుగో మ్యాచ్ రేపు జరుగుతుంది. పవర్‌ప్లేలో 24/3... భారత ఇన్నింగ్స్ రెండు పార్శ్వాలుగా సాగింది. తొలి 15 ఓవర్లలో కనీసం బంతికో పరుగు కూడా చేయలేకపోయిన జట్టు చివరి 5 ఓవర్లలో చెలరేగింది. ఆరంభంలో భారత్‌ను దెబ్బ తీయడంలో పేసర్ మార్క్ వుడ్ కీలకపాత్ర పోషించాడు. అతని తొలి ఓవర్లోనే రాహుల్ (0) క్లీన్‌బౌల్డ్ అయి మరోసారి నిరాశపర్చాడు. ఈ సిరీస్‌లో అతను మూడు మ్యాచ్‌లలో వరుసగా 1, 0, 0 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో తుది జట్టులోకి వచ్చి ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ (15; 2 ఫోర్లు) కూడా వుడ్ బౌలింగ్‌లోనే వెనుదిరగ్గా... గత మ్యాచ్ హీరో ఇషాన్ కిషన్ (4)ను జోర్డాన్ అవుట్ చేశాడు. దాంతో తొలి ఆరు ఓవర్లలో 24 పరుగులే చేసిన భారత్ 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత పంత్ (20 బంతుల్లో 25; 3 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడినా... లేని మూడో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. కొద్ది సేపటికే అయ్యర్ (9; ఫోర్) రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. కోహ్లి మెరుపులు... 15 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 87 పరుగులే. అప్పటి వరకు తడబడుతూనే ఆడిన కోహ్లి కూడా 29 బంతుల్లో 28 పరుగులు (3 ఫోర్లు) చేశాడు. అయితే ఈ స్థితి నుంచి భారత కెప్టెన్ అద్భుత షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆర్చర్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన అతను జోర్డాన్ వేసిన తర్వాతి ఓవర్లో కూడా మరో సిక్స్, ఫోర్ బాదాడు. ఈ క్రమంలో 37 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. అప్పటి వరకు భారత్‌ను కట్టడి చేసిన వుడ్ ఓవర్లోనైతే కోహ్లి చెలరేగిపోయాడు. వరుస బంతుల్లో 6, 6, 4 సాధించాడు. వీటిలో ఆఫ్ సైడ్ వైపునకు జరిగి మిడ్ వికెట్ మీదుగా కొట్టిన తొలి సిక్సర్ అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. తాను ఎదుర్కొన్న చివరి 17 బంతుల్లో కోహ్లి 49 పరుగులు చేశాడు. ఆరో వికెట్‌కు హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 17; 2 సిక్స్‌లు)తో కలిసి కోహ్లి 70 పరుగులు జోడించాడు. ఆడుతూ పాడుతూ... ఛేదనలో ఇంగ్లండ్‌కు పెద్దగా ఇబ్బంది ఎదురుకాలేదు. బట్లర్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడటంతో జట్టు స్కోరు వేగంగా సాగింది. చహల్ తొలి ఓవర్లో జేసన్ రాయ్ (13 బంతుల్లో 9; 2 ఫోర్లు) అవుటైనా...అదే ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో బట్లర్ తన జోరును మొదలు పెట్టాడు. శార్దుల్ వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదిన బట్లర్ ... చహల్ మరుసటి ఓవర్లో కూడా 2 ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 57 పరుగులకు చేరింది. 26 బంతుల్లోనే బట్లర్ అర్ధ సెంచరీ సాధించడం విశేషం. డేవిడ్ మలాన్ (17 బంతుల్లో 18; సిక్స్)ను అవుట్ చేసి సుందర్ ఆశలు రేపినా... బట్లర్, బెయిర్‌స్టో కలిసి భారత్‌కు మరో అవకాశం ఇవ్వలేదు. 62 బంతుల్లో 76 పరుగులు చేయాల్సిన ఈ దశలో వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. అటు బౌండరీలు, ఇటు సింగిల్స్ ద్వారా సమర్థంగా పరుగులు రాబట్టి జట్టును విజయతీరం చేర్చారు. 76 పరుగుల వద్ద బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి, 20 పరుగుల వద్ద బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను చహల్ వదిలేసినా... అప్పటికే మ్యాచ్ దాదాపుగా చేజారడంతో వాటిని అందుకున్నా పెద్దగా ఫలితం ఉండకపోయేది! స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) ఆర్చర్ (బి) వుడ్ 15; రాహుల్ (బి) వుడ్ 0; ఇషాన్ కిషన్ (సి) బట్లర్ (బి) జోర్డాన్ 4; కోహ్లి (నాటౌట్) 77; పంత్ (రనౌట్) 25; అయ్యర్ (సి) మలాన్ (బి) వుడ్ 9; పాండ్యా (సి) ఆర్చర్ (బి) జోర్డాన్ 17; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–7, 2–20, 3–24, 4–64, 5–86, 6–156. బౌలింగ్: రషీద్ 4–0–26–0; ఆర్చర్ 4–0–32–0; వుడ్ 4–0–31–3; జోర్డాన్ 4–1–35–2; స్టోక్స్ 2–0–12–0; స్యామ్ కరన్ 2–0–14–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) రోహిత్ (బి) చహల్ 9; బట్లర్ (నాటౌట్) 83; మలాన్ (స్టంప్డ్) పంత్ (బి) సుందర్ 18; బెయిర్‌స్టో (నాటౌట్) 40; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–23, 2–81. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–27–0; శార్దుల్ 3.2–0–36–0; చహల్ 4–0–41–1; హార్దిక్ 3–0–22–0; సుందర్ 4–0–26–1. -
మూడో టీ20: రాహుల్ స్థానంలో రోహిత్ శర్మ!
టెస్టు సిరీస్ తరహాలోనే టి20ల్లోనూ ఇంగ్లండ్ చేతిలో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు వెంటనే కోలుకొని సత్తా చాటింది. రెండో పోరులో సునాయాస విజయం సాధించిన టీమిండియా ఇదే జోరును కొనసాగించి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ అనుభవంతో ఇంగ్లండ్ మళ్లీ తమ బ్యాటింగ్‌కు పదును పెట్టే పనిలో పడింది. ఈ నేపథ్యంలో మరోసారి టాప్–2 జట్ల మధ్య పొట్టి సమరం ఆసక్తికరంగా సాగనుంది. అహ్మదాబాద్: భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్న స్థితిలో ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌లో ముందంజ వేసే అవకాశం ఉంటుంది. రెండో మ్యాచ్‌లో విజయం తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగిన కోహ్లి సేన అన్ని రంగాల్లో రాణించి ప్రత్యర్థిని మళ్లీ పడగొట్టాలని భావిస్తోంది. రాహుల్ స్థానంలో రోహిత్ శర్మ! గత మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ టీమిండియా బెంచీ బలాన్ని చూపించింది. పైగా ఓపెనర్‌గా కిషన్ రూపంలో మన జట్టుకు మరో ప్రత్యామ్నాయం కూడా లభించింది. ఈ యువ ఆటగాడు మళ్లీ ఒక మెరుపు ప్రదర్శన ఇవ్వాలని జట్టు కోరుకుంటోంది. రెండు మ్యాచ్‌ల వరకు రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు సిరీస్ ఆరంభ సమయంలో కోహ్లి చెప్పాడు. అదే నిజమైతే ఈ మ్యాచ్‌లో అతను బరిలోకి దిగాలి. వరుసగా రెండు మ్యాచ్‌లలో 1, 0 పరుగులు మాత్రమే చేసిన రాహుల్ స్థానంలో మాత్రమే రోహిత్ వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే గత రెండేళ్లలో భారత్ తరఫున టి20ల్లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా ఉన్న రాహుల్‌కు మరో అవకాశం ఇవ్వకుండా అప్పుడే పక్కన పెడతారా అనేది చూడాలి. కోహ్లి తనదైన శైలిలో ఫామ్‌లోకి రావడం జట్టుకు శుభపరిణామం. పంత్, అయ్యర్ కూడా చెలరేగితే జట్టు భారీ స్కోరు సాధించవచ్చు. అరంగేట్రం మ్యాచ్‌లో బ్యాటింగ్ అవకాశం దక్కని సూర్య కుమార్ యాదవ్‌కు ఆరో స్థానంలో ఈసారి ఎన్ని బంతులు లభిస్తాయో చూ డాలి. బౌలింగ్‌లో టీమిండియా మార్పులు చేయకపోవచ్చు. స్పిన్నర్లు చహల్, సుందర్ ప్రత్యర్థిని కట్టడి చేయగలరు. శార్దుల్ తన బౌలింగ్‌తో ఆకట్టుకోగా, హార్దిక్ పూర్తి కోటా బౌలింగ్ చేయగలిగాడు. పునరాగమనంలో భువనేశ్వర్ కూడా మెరుగైన ప్రదర్శన ఇస్తున్నాడు కాబట్టి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించడం సులువు కాదు. మొయిన్ అలీకి చాన్స్! మంచి విజయం తర్వాత ఇంగ్లండ్ రెండో మ్యాచ్‌లో తేలిపోయింది. ముందుగా బ్యాటింగ్‌లో రాణించలేకపోయిన ఆ జట్టు ఆ తర్వాత బౌలింగ్‌లోనూ ప్రత్యర్థిని నిలువరించలేక సునాయాసంగా తలవంచింది. మొత్తంగా చూస్తే దూకుడైన బ్యాటింగ్ లైనప్ కనిపిస్తున్నా కీలక సమయంలో జట్టు సమష్టిగా విఫలమైంది. జేసన్ రాయ్, బట్లర్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభిస్తే మలాన్, బెయిర్‌స్టో ముందుకు తీసుకెళ్లగలరు. ఈసారి ఈ టాప్–4 ఎన్ని పరుగులు చేస్తుందో చూడాలి. ఒక్క కెప్టెన్ మోర్గాన్ మాత్రమే తడబాటు లేకుండా ఆత్మవిశ్వాసంతో ఆడగలుగుతున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ స్టోక్స్ పేలవ ప్రదర్శన కూడా ఇంగ్లండ్‌కు ఇబ్బందిగా మారింది. పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని రెండో స్పిన్నర్‌గా అనుభవజ్ఞుడు మొయిన్ అలీకి అవకాశం దక్కుతుంది. టామ్ కరన్‌ను పక్కన పెట్టనున్న మేనేజ్మెంట్... వుడ్ ఫిట్‌గా ఉంటే జోర్డాన్ ను తప్పించాలని యోచిస్తోంది. ప్రేక్షకులు లేకుండానే... దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత మరోసారి పెరుగుతుండటంతో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే చివరి మూడు టి20 మ్యాచ్‌లను ప్రేక్షకలు లేకుండానే నిర్వహించాలని గుజరాత్ క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లకు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించిన సంగతి తెలిసిందే. పిచ్, వాతావరణం ఎర్ర మట్టితో రూపొందించిన పిచ్‌పై ఈ మ్యాచ్ జరగనుంది. కాబట్టి బంతి టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇరు జట్ల స్పిన్నర్లు కీలకం కానున్నారు. ఛేదనలో సులువుగా కనిపిస్తుం డటంతో టాస్ గెలిచే జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. వర్ష సూచన లేదు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్/రోహిత్, కిషన్, పంత్, అయ్యర్, సూర్యకుమార్, హార్దిక్, సుందర్, శార్దుల్, భువనేశ్వర్, చహల్. ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బట్లర్, మలాన్, బెయిర్‌స్టో, స్టోక్స్, స్యామ్ కరన్, అలీ, ఆర్చర్, రషీద్, వుడ్/జోర్డాన్. -
క్లీన్‌స్వీప్‌పై గురి
సిడ్నీ: మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ తుది సమరానికి సిద్ధమైంది. గత మ్యాచ్ వేదికలోనే ఇరు జట్లు నేడు మూడో టి20లో తలపడనున్నాయి. వన్డే సిరీస్ తరహాలోనే చివరి మ్యాచ్ గెలిచి ఆసీస్ లెక్క సరి చేస్తుందా... లేక భారత్ తమ జోరు కొనసాగించి రెండోసారి ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుందా అనేది ఆసక్తికరం. భారత్ ఎలాంటి మార్పులు లేకుండా ఈ మ్యాచ్‌లో దిగే అవకాశం కనిపిస్తుండగా... ఆస్ట్రేలియా కూడా టెస్టు స్పెషలిస్ట్‌లను దూరంగా ఉంచాలనే నిర్ణయించింది. నటరాజన్‌పైనే అందరి దృష్టి... షమీ, బుమ్రాలవంటి సీనియర్లు లేకుండానే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకున్న భారత్ మరోసారి యువ బౌలర్లనే నమ్ముకోనుంది. భారీ స్కోర్లు నమోదైన గత మ్యాచ్‌లో కూడా కేవలం 20 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన నటరాజన్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఐపీఎల్లో తన యార్కర్లతోనే గుర్తింపు తెచ్చుకున్నా... అంతకుమించి వైవిధ్యభరిత ప్రతిభ అతనిలో ఉందని తాజా ప్రదర్శన నిరూపించింది. మరో మ్యాచ్‌లోనూ రాణిస్తే ఆడిన తొలి సిరీస్‌లోనే నటరాజన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలవడం ఖాయం. మిగతా ఇద్దరు పేసర్లు దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్ కూడా ఆసీస్‌ను కట్టడి చేయగలరు. ఆఫ్ స్పిన్నర్ సుందర్ ఎప్పటిలాగే పొదుపుగా బౌలింగ్ చేస్తుండగా... లెగ్‌స్పిన్నర్ చహల్ తొలి టి20 మ్యాచ్ మ్యాజిక్‌ను మళ్లీ చూపించాల్సి ఉంది. బ్యాటింగ్‌పరంగా ఎలాంటి లోపాలు లేవు. కోహ్లి చెప్పినట్లు ఐపీఎల్ అనుభవం జట్టులో సభ్యులందరికీ ఈ సిరీస్ గెలుచుకోవడంలో బాగా పనికొచ్చింది. ఫించ్ జట్టులోకి... ప్రత్యర్థితో పోలిస్తే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. అయినా సరే తొలి మ్యాచ్‌లో లక్ష్యం ఛేదించలేక, రెండో మ్యాచ్‌లో దానిని కాపాడుకోలేక జట్టు చతికిలపడింది. గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ ఫించ్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. టి20 ప్రమాణాలపరంగా చూస్తే అతి పేలవంగా ఆడుతున్న డార్సీ షార్ట్‌పై వేటు ఖాయమైంది. వన్డే సిరీస్ తరహాలో మ్యాక్స్‌వెల్ నుంచి ఒక దూకుడైన ఇన్నింగ్స్‌ను ఆసీస్ ఆశిస్తోంది. రానున్న టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన బౌలర్లకు విశ్రాంతినిచ్చిన ఆస్ట్రేలియా టాప్ బ్యాట్స్‌మన్ స్మిత్‌కు కూడా ఈ మ్యాచ్ నుంచి విరామం ఇవ్వాలని యోచిస్తోంది. అయితే ఆసీస్ అసలు సమస్య అంతా బౌలింగ్‌లోనే ఉంది. ఒక్క అనుభవజ్ఞుడైన ఆటగాడు కూడాలేని లైనప్ భారత బ్యాట్స్‌మెన్‌ను నిలువరిచడం అంత సులువు కాదు. టెస్టుల్లో కీలకమయ్యే పేసర్లను సిరీస్ కోల్పోయిన తర్వాత టి20ల్లో బరిలోకి దింపడం అనవసర మనే భావన టీమ్ మేనేజ్మెంట్లో ఉంది. పిచ్, వాతావరణం తొలి రెండు వన్డేలు, రెండో టి20లో ఇక్కడ పరుగుల వరద పారింది. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం. కాబట్టి మరోసారి భారీ స్కోర్లు ఖాయం. వాతావరణం బాగుంది. వర్ష సూచన లేదు. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రాహుల్, సామ్సన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శార్దుల్, సుందర్, దీపక్ చహర్, నటరాజన్, చహల్. ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మాథ్యూ వేడ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, క్యారీ, హెన్రిక్స్, సీన్ అబాట్, స్యామ్స్, స్వెప్సన్, జంపా, ఆండ్రూ టై. -
ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్
కేప్‌టౌన్: వరుసగా మూడో టి20 మ్యాచ్‌లోనూ అదరగొట్టిన ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టును చిత్తుగా ఓడించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 17.4 ఓవర్లలో కేవలం వికెట్ కోల్పోయి ఛేదించింది. డేవిడ్ మలాన్ (47 బంతుల్లో 99 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), జాస్ బట్లర్ (46 బంతుల్లో 67 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) రెండో వికెట్‌కు అజేయంగా 167 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు 166 పరుగులతో జయవర్ధనే– సంగక్కర (శ్రీలంక–2010లో వెస్టిండీస్‌పై) పేరిట ఉన్న రికార్డును మలాన్, బట్లర్ సవరించారు. అంతకు ముందు దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (37 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), వాన్ డెర్ డసెన్ (32 బంతుల్లో 74 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) హడలెత్తించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 10.3 ఓవర్లలో 127 పరుగులు జత చేశారు. ఇంగ్లండ్ ‘టాప్’ ర్యాంక్‌లోకి... దక్షిణాఫ్రికాపై క్లీన్‌స్వీప్ సాధించడంతో ఇంగ్లండ్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను రెండో స్థానానికి నెట్టేసి టాప్ ర్యాంక్‌ను అందుకుంది. టి20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో మలాన్ తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో మలాన్ 915 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. టి20 ర్యాంకింగ్స్‌లో ఓ బ్యాట్స్‌మన్ 915 రేటింగ్ పాయింట్లు సాధించడం ఇదే ప్రథమం. -
మోర్గాన్ మెరుపులు
సెంచూరియన్: కొండంత లక్ష్యం కళ్ల ముందు ఉన్నా ఇంగ్లండ్ జట్టు అదరలేదు... బెదరలేదు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో (22 బంతుల్లో 57 నాటౌట్; 7 సిక్స్‌లు)... దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ (33 బంతుల్లో 66; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), బవుమా (24 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), డికాక్ (24 బంతుల్లో 35; ఫోర్, 4 సిక్స్‌లు), మిల్లర్ (20 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టారు. భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 226 పరుగులు చేసి గెలుపొందింది. చదవండి: మయాంక్, పంత్ ఫిఫ్టీల ‘ప్రాక్టీస్’ ఓపెనర్ జేసన్ రాయ్ (7; సిక్స్) విఫలమైనా... జోస్ బట్లర్ (29 బంతుల్లో 57; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెయిర్ స్టో (64; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. అయితే కీలక సమయంలో వీరిద్దరూ అవుటైనా... మోర్గాన్ మిగతా పనిని పూర్తి చేశాడు. మోర్గాన్ ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు ఉండటం విశేషం. 21 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన మోర్గాన్... గతంలో తన పేరిటే ఉన్న ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ ఫిప్టీ రికార్డును సమం చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా మోర్గాన్ నిలిచాడు. ఈ మ్యాచ్‌తో రెండు నెలల దక్షిణాఫ్రికా పర్యటనను ఇంగ్లండ్ ఘనంగా ముగించింది. టెస్టు సిరీస్‌ను 3–1తో, టి20 సిరీస్‌ను 2–1తో గెల్చుకున్న ఇంగ్లండ్... వన్డే సిరీస్‌ను 1–1తో సమం చేసుకుంది. చదవండి: ఇంటా బయట గులాబీ బాట! -
గెలుపు విజిల్ మోగాలి
సొంతగడ్డపై తిరుగులేని రికార్డును పదిలంగా ఉంచేందుకు కోహ్లి సేన మరో విజయంపై కన్నేసింది. రెండో మ్యాచ్‌లో కనీసం పోరాటం చేయలేని ప్రత్యర్థిని వరుసగా ఈ మ్యాచ్‌లోనూ దెబ్బకొట్టాలని భావిస్తోంది.ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌ను గెలవడం, సిరీస్‌ను సమం చేయడం లంకకు శక్తికి మించిన పనే! అయితే ఏ మేరకు పోటీనిస్తుందనేది చూడాలి. పుణే: ఈ సీజన్లో మరో సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు భారత్ సిద్ధమైంది. తమకు సరితూగలేని శ్రీలంకతో శుక్రవారం జరిగే ఆఖరి టి20లోనూ గెలిచి 2–0తో కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. తద్వారా 2020కి ఘనమైన విజయారంభం ఇవ్వాలని ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో ఏమాత్రం పోరాటమే ఇవ్వలేకపోయిన లంకపై భారత్ ఆడుతూ పాడుతూ చెమట చిందించకుండానే గెలిచింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో భారత్‌దే ఆధిపత్యమైంది. ఈ విజయమిచ్చిన ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగుతుంటే... ప్రత్యర్థి శ్రీలంక మాత్రం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆల్‌రౌండర్ ఉడాన గాయం కూడా ఆ జట్టును మరింత కలవరపెడుతోంది. ముందే బ్యాటింగ్ చేస్తే భారత్ జోరుకు నిలబడగలమా అన్న సందేహం కూడా వారిలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఓడినా పోరాటంతోనైనా పరువు కాపాడుకోవాలని లంక చూస్తోంది. పరుగుల ఓపెనర్ రాహుల్ రాహుల్ మ్యాచ్ మ్యాచ్‌కు మెరుగవుతున్నాడు. కొన్నాళ్లుగా ఓపెనింగ్‌లో మెరికయ్యాడు. ఇంకా చెప్పాలంటే రెగ్యులర్ ఓపెనర్‌గా పాతుకుపోయినట్లే! ముప్పు అంటు ఉంటే ధావన్‌కే ఉంది. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో ఈ సిరీస్ ఆడుకుంటున్న ధావన్, అతడు జట్టులోకి వస్తే మాత్రం తుది జట్టుకు దూరం కావాల్సిందే. సహచరులతో శుభారంభాలు ఇవ్వడంతో పాటు తాను వ్యక్తిగతంగా భారీస్కోర్లను నిలకడగా సాధించేస్తున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో అతని ఆత్మవిశ్వాసం అద్భుతం. ఎలాంటి ప్రమాదకర బౌలర్ ఎదురైనా చక్కగా ఎదుర్కోవడంలో స్థిరత్వం సంపాదించాడు. అతడు ఎదురుదాడికి దిగితే మాత్రం ప్రత్యర్థి బౌలింగ్ దళమంతా కకావికలం కావాల్సిందే. ఇప్పుడు అంతటి ప్రమాదకర ఓపెనర్‌గా ఎదిగాడు లోకేశ్ రాహుల్. వాళ్లని ఆడిస్తారా? భారత్ అన్నింటా పైచేయి కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించాలా లేక రిజర్వ్ బెంచ్‌లోని ఆటగాళ్లకు అవకాశమివ్వాలా అనే సందిగ్ధంలో పడింది టీమిండియా. జట్టుకు ఎంపికవడం... డగౌట్లో కూర్చోవడం ఇదే పని అయిన సంజూ శామ్సన్తో పాటు మనీశ్ పాండేలకు చాన్స్ ఇవ్వాలా వద్దా అనే డైలామాలో ఉంది. పొట్టి ప్రపంచకప్ ఈ ఏడాదే కాబట్టి కుర్రాళ్లకు చాన్స్ ఇస్తే బాగుంటుందని జట్టు యాజమాన్యం ఆలోచిస్తోంది. పైగా ప్రత్యర్థి కూడా అంత పటిష్టంగా లేకపోవడంతో కెప్టెన్ కోహ్లి ఆ దిశగా యోచించే అవకాశాలున్నాయి. ఇక సీనియర్లు లేని పేస్ దళంలో ఇటు శార్దుల్ ఠాకూర్, అటు నవ్‌దీప్‌సైనీ చక్కగా ఇమిడిపోయారు. భారత ఫాస్ట్ బౌలింగ్‌కు ఏ లోటు రాకుండా చూసుకున్నారు. లంక జట్టులో ఎక్కువగా ఎడంచేతి ఆటగాళ్లుండటంతో కుల్దీప్, వాషింగ్టన్ సుందర్‌లనే కొనసాగించే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఈ మ్యాచ్‌లోనూ రవీంద్ర జడేజా, చహల్ ఇద్దరు డగౌట్‌కే పరిమితం కావాల్సివుంటుంది. కష్టాల లంక... భారత్‌కు పూర్తి భిన్నంగా ఉంది ప్రత్యర్థి పరిస్థితి. ఆతిథ్య జట్టు ఎంత పటిష్టంగా ఉందో... ప్రత్యర్థి జట్టు అంత బలహీనంగా ఉంది. ముఖ్యంగా అనుభవలేమి ఇటు బ్యాటింగ్‌ను, అటు బౌలింగ్‌ను వేధిస్తోంది. జట్టు మొత్తంలో అనుభవజ్ఞులు ఇద్దరే ఒకరు ఆల్‌రౌండర్ మాథ్యూస్ అయితే... కెప్టెన్, పేసర్ మలింగ. కుశాల్ పెరీరా, డిక్వెలా, ధనంజయలు బాగా ఆడగలరు. కానీ వారితో పోల్చి చూసుకునేంత అనుభవమైతే లేదు. అయినప్పటికీ రెండో మ్యాచ్‌లో మాథ్యూస్‌కు ఆడే అవకాశమివ్వలేదు. నిజానికి ఈ మాజీ కెప్టెన్ 16 నెలలుగా పొట్టి ఫార్మాట్‌కు దూరమయ్యాడు. ఇపుడు ఉడాన గాయపడటంతో మాథ్యూస్ కీలకమయ్యాడు. ఏదేమైనా భీకరమైన ఫామ్‌లో ఉన్న కోహ్లి సేన ముందు ఎదురుపడే సత్తా ఇప్పటి లంక జట్టుకు లేదు. పొట్టి ఆటలో ఫేవరెట్ అంటూ ఎవరూ ఉండరు. ఆ రోజు ఎవరు మెరుపులు మెరిపిస్తే ఆ జట్టే గెలుస్తుందనడంలో సందేహం లేదు. కానీ మెరిపించే వారే శ్రీలంకకు కరువయ్యారు. కాబట్టే పోరాడి పరువు నిలబెట్టుకుంటుందేమో కానీ... మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేసుకుంటుందనేది అత్యాశే అవుతుంది. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, శ్రేయస్, రిషభ్ పంత్, శివమ్ దూబే, జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్/ చహల్, శార్దుల్, బుమ్రా. శ్రీలంక: మలింగ (కెప్టెన్), గుణతిలక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరా, రాజపక్స, ఒషాడా ఫెర్నాండో, మాథ్యూస్, షనక, ధనంజయ, హసరంగ, లహిరు కుమార. పిచ్, వాతావరణం బంతికి, బ్యాట్‌కు చక్కని పోరాటం జరగొచ్చు. ఇక్కడి పిచ్ బ్యాట్స్‌మెన్, బౌలర్లకు సమాన అవకాశాలు కల్పిస్తుంది. వర్ష సూచనైతే లేదు... కానీ మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రెండో ఇన్నింగ్స్ బౌలర్లకు కాస్త ఇబ్బంది తప్పదు. -
తప్పటడుగులతో కుప్పకూలిన ఇంగ్లండ్
నెల్సన్: ఇంగ్లండ్ లక్ష్యం 181 పరుగులు. 15వ ఓవర్ పూర్తవకముందే 139/2 స్కోరుతో పటిష్టంగా నిలిచింది. 5.1 ఓవర్లలో అంటే 31 బంతుల్లో 42 పరుగులే చేస్తే గెలిచేది! పొట్టి ఫార్మాట్లో ఇది సులువైన విజయ సమీకరణం. మరో 8 వికెట్లు చేతిలో ఉన్న ఇంగ్లండ్‌కు ఇది ఇంకా ఇంకా సులువైన లక్ష్యం. కానీ విజయానికి 15 పరుగుల దూరంలో నిలిచి అనూహ్యంగా ఓడింది. 10 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు తీసిన న్యూజిలాండ్ గెలుపు మలుపు తీసుకుంది. నాటకీయంగా ముగిసిన మూడో టి20లో కివీస్ 14 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గ్రాండ్‌హోమ్ (35 బంతుల్లో 55; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), గప్టిల్ (17 బంతుల్లో 33; 7 ఫోర్లు) ధాటిగా ఆడారు. రాస్ టేలర్ 27, నీషమ్ 20 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్ స్యామ్ కరన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులే చేయగలిగింది. మలాన్ (34 బంతుల్లో 55; 8 ఫోర్లు, 1 సిక్స్), విన్స్ (39 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు చకచకా 63 పరుగులు జతచేశారు. అయితే 15వ ఓవర్ వేసిన సాన్‌ట్నర్ ఆఖరి బంతికి కెప్టెన్ మోర్గాన్ (18)ను ఔట్ చేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. తర్వాత వచ్చిన బిల్లింగ్స్ (1) రనౌట్ కావడం, క్రీజ్‌లో పాతుకుపోయిన విన్స్‌తో పాటు కరన్ (2), గ్రెగరీ (0) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ (2/25), టిక్నెర్ (2/25) రాణించారు. ఈ విజయంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టి20 మ్యాచ్ 8న నేపియర్‌లో జరుగుతుంది. -
వార్నర్ మళ్లీ మెరిసె...
మెల్బోర్న్: శ్రీలంకపై పూర్తి ఆధిపత్యం చలాయించిన ఆస్ట్రేలియా టి20 సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో ఫించ్ బృందం ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత శ్రీలంక మరోసారి బ్యాటింగ్‌లో తడబడింది. కుశాల్ పెరీరా (45 బంతుల్లో 57; 4 ఫోర్లు, సిక్స్) మినహా మిగతావారు విఫలమవ్వడంతో... శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేసింది. 143 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ వార్నర్ (50 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీతో మెరిశాడు. ఫించ్ (37; ఫోర్, 3 సిక్స్‌లు)తో కలిసి తొలి వికెట్‌కు 69 పరుగులు జతచేశాడు. స్మిత్ (13), మెక్‌డెర్మట్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... టర్నర్ (22 నాటౌట్; 2 సిక్స్‌లు)తో కలిసి వార్నర్ జట్టును గెలిపిం చాడు. వార్నర్ తొలి మ్యాచ్ లో అజేయ సెంచరీ... రెండో మ్యాచ్‌లో అజేయ అర్ధ సెంచరీ.... మూడో మ్యాచ్‌లో నాటౌట్‌గా నిలిచి సిరీస్‌లో 217 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం కూడా గెల్చుకున్నాడు.