India Vs England 3rd T20: Updates And Highlights in Telugu - Sakshi
Sakshi News home page

IND VS ENG 3rd T20: మూడో టి20లో ఇంగ్లండ్‌ విజయం.. టీమిండియాదే సిరీస్‌

Published Sun, Jul 10 2022 6:44 PM | Last Updated on Sun, Jul 10 2022 11:11 PM

India Vs England 3rd T20: Updates And Highlights - Sakshi

ఇంగ్లండ్‌తో మూడో టి20లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సూపర్‌ సెంచరీ చేసినప్పటికి టీమిండియా పరాజయం నుంచి తప్పించలేకపోయాడు. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్‌ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

సూర్యకుమార్‌ సెంచరీ.. విజయం దిశగా టీమిండియా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టి20లో సూర్యకుమార్‌ యాదవ్‌ సెంచరీతో మెరిశాడు. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 102 నాటౌట్‌, రవీం‍ద్ర జడేజా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

సూర్యకుమార్‌ హాఫ్‌ సెంచరీ
టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ మరో హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 32 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో ఫిఫ్టి పూర్తి చేసుకున్నాడు. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 96/3. 

10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 82/3
10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 82/3గా ఉంది. సూర్యకుమార్‌ యాదవ్‌ (41), శ్రేయస్‌ (14) క్రీజ్‌లో ఉన్నారు. 60 బంతుల్లో 134 పరుగులు చేయాల్సి ఉంది. 

టీమిండియాకు మరో షాక్‌
టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. 5వ ఓవర్‌ ఆఖరి బంతికి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (11) కూడా ఔటయ్యాడు. టాప్లే బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ వెనుదిరిగాడు. 5 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 31/3. శ్రేయస్‌, సూర్యకుమార్‌ (7) క్రీజ్‌లో ఉన్నారు. 

మళ్లీ నిరాశపర్చిన కోహ్లి
చాలాకాలంగా ఫామ్‌ లేమితో సతమతమవుతున్న విరాట్‌ కోహ్లి మళ్లీ నిరాశపర్చాడు. మూడో టీ20లోనూ తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. విల్లే బౌలింగ్‌లో ఫోర్‌, సిక్సర్‌ బాది జోరుమీదున్నట్లు కనిపించినప్పటికీ ఆ మరుసటి బంతికే రాయ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 14/2. క్రీజ్లో రోహిత్‌ (1), సూర్యకుమార్‌ (1) ఉన్నారు. 

ఆదిలోనే షాక్‌
216 పరుగుల భారీ  లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రిషబ్‌ పంత్‌ (5 బంతుల్లో 1) టాప్లే బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 1.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 2/1. క్రీజ్‌లో రోహిత్‌ శర్మ (1), విరాట్‌ కోహ్లి ఉన్నారు.  

తేలిపోయిన భారత బౌలర్లు.. ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌
టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ సాధించింది. మలాన్‌ (77), లివింగ్‌స్టోన్‌ (42 నాటౌట్‌) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఇంగ్లండ్‌ హిట్టర్ల ధాటికి తేలిపోయారు. హర్షల్‌ పటేల్ (2/35)‌, బిష్ణోయ్‌ (2/30) కాస్త పర్వాలేదనిపించగా.. ఆవేశ్‌ ఖాన్ (1/43)‌, ఉమ్రాన్‌ మాలిక్ (1/56)‌, రవీంద్ర జడేజా (0/45) దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.   

ఆరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో బిష్ణోయ్‌కు క్యాచ్‌ ఇచ్చి బ్రూక్ (19) ఔటయ్యాడు. ఈ ఓవర్‌లో ఇంగ్లండ్‌ కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. 19 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 198/6. లివింగ్‌స్టోన్‌ (38), క్రిస్‌ జోర్డాన్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

ఇంగ్లండ్‌ను దారుణంగా దెబ్బకొట్టిన బిష్ణోయ్‌
టీమిండియా స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌.. ఇంగ్లండ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో డేవిడ్‌ మలాన్‌ (77), మొయిన్‌ అలీ (0)లను పెవిలియన్‌కు పంపాడు. 17 ఓవర్ల తర్వాత ఇం‍గ్లండ్‌ స్కోర్‌ 169/. క్రీజ్‌లో లివింగ్‌స్టోన్‌ (30), హ్యారీ బ్రూక్‌ ఉన్నారు.  

15 ఓవర్ల తర్వాత 151/3
డేవిడ్‌ మలాన్‌ (37 బంతుల్లో 77) రెచ్చిపోయి ఆడుతుండటంతో ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తుంది. మరో ఎండ్‌లో లివింగ్‌స్టోన్‌ (13 బంతుల్లో 14) ఆచితూచి ఆడుతున్నాడు. 15 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 151/3. 

మలాన్‌ ఫిఫ్టీ
వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్‌ మలాన్‌ హాఫ్‌ సెంచరీ బాదాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో 12వ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 13 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 125/3. కీజ్‌లో మలాన్‌(62), లివింగ్‌స్టోన్‌ (4) ఉన్నారు. 

సాల్ట్‌ క్లీన్‌ బౌల్డ్‌
2 ఓవర్ల వ్యవధిలో ఇంగ్లండ్‌ రెండు వికెట్లు కోల్పోయింది. హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఫిలిప్‌ సాల్ట్‌ (8) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 10 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 86/3. క్రీజ్‌లో మలాన్‌ (27), లివింగ్‌స్టోన్‌ (1) ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌లో ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి జేసన్‌ రాయ్‌ (27) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 71/2. క్రీజ్‌లో మలాన్‌ (16), సాల్ట్‌ (5) ఉన్నారు. 

శభాష్‌ ఆవేశ్‌.. బట్లర్‌ క్లీన్‌ బౌల్డ్‌
టీమిండియా యువ పేసర్‌ ఆవేశ్‌ ఖాన్‌ మరోసారి తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో భువనేశ్వర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆవేశ్‌.. ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ను (9 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్‌) అద్భుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 4 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 32/1. క్రీజ్‌లో జేసన్‌ రాయ్‌ (10), డేవిడ్‌ మలాన్‌ ఉన్నారు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నఇంగ్లండ్‌
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇదివరకే 2-0తో కైవసం చేసుకున్న భారత్‌.. ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా ఇవాళ (జులై 10) జరుగనున్న నామమాత్రపు మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా ఏకంగా నాలుగు మార్పులు చేయగా.. ఇంగ్లండ్‌ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. టీమిండియా నుంచి హార్ధిక్‌, భవీ, బుమ్రా, చహల్‌ స్థానాల్లో శ్రేయస్‌ అయ్యర్‌, ఆవేశ్‌ ఖాన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, రవి బిష్ణోయ్‌ బరిలోకి దిగుతుండగా.. ఇంగ్లండ్‌ నుంచి పార్కిన్సన్‌, కర్రన్‌ స్థానాలను రీస్‌ టాప్లే, ఫిలిప్‌ సాల్ట్‌ రీప్లేస్‌ చేయనున్నారు.  

తుది జట్లు:
భారత్‌: రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, ఆవేశ్‌ ఖాన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, రవి బిష్ణోయ్‌

ఇంగ్లండ్‌: జేసన్ రాయ్, జోస్ బట్లర్(కెప్టెన్‌), డేవిడ్ మలన్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, ఫిలిప్‌ సాల్ట్‌, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, రిచర్డ్ గ్లీసన్, రీస్‌ టాప్లే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement