శ్రీలంకతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో ప్రత్యర్ధిని చిత్తు చేసి, పొట్టి ఫార్మాట్‌లో వరుసగా 12వ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో అఫ్ఘానిస్థాన్ పేరిట ఉన్న అత్యధిక వరుస విజయాల రికార్డును టీమిండియా సమం చేసింది. సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాది టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్ (45 బంతుల్లో 73; 9 ఫోర్లు, సిక్సర్) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.
— Addicric (@addicric) February 27, 2022
కాగా, లంకతో సిరీస్ ముగిసాక అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా విన్నింగ్ ట్రోఫీని జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్లకు అందజేసే రోహిత్.. ఈ సారి టీమిండియా కొత్త మేనేజర్ జయ్‌దేవ్ షాకి అందించి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
బీసీసీఐ మాజీ సెక్రటరీ నిరంజన్ షా కొడుకైన జయ్‌దేవ్ షా.. 2007-08 సీజన్‌లో సౌరాష్ట్రకు విజయ్ హజారే ట్రోఫీ అందించాడు. ఆతర్వాత సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్ సభ్యుడిగా కొనసాగాడు. జయ్‌దేవ్ షా.. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌కు టీమిండియా మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు.
చదవండి: సచిన్ సహచరుడు, టీమిండియా మాజీ ప్లేయర్ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment