BCCI Announce India Schedule For Australia Home Series In September - Sakshi
Sakshi News home page

Australia Tour Of India 2022: మూడో టీ20కి ఆతిధ్యమివ్వనున్న హైదరాబాద్‌

Published Thu, Aug 4 2022 4:37 PM | Last Updated on Thu, Aug 4 2022 4:59 PM

BCCI Announce India Schedule For Australia Home Series In September - Sakshi

IND VS AUS T20 Series Schedule: టీ20 ప్రపంచకప్‌ 2022కు ముందు భారత క్రికెట్‌ జట్టు ఊపిరి సడలని షెడ్యూల్‌తో ఉక్కిరిబిక్కిరవుతుంది. ప్రస్తుతం విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న టీమిండియా.. ఆ తర్వాత జింబాబ్వే పర్యటన, ఆ వెంటనే ఆసియా కప్‌తో బిజీబిజీగా గడపనుంది. ఆసియా కప్‌ ముగిసిన తర్వాత టీమిండియా దాదాపు నెలన్నర ఖాళీగా ఉండటంతో బీసీసీఐ ఈ మధ్యలో రెండు సిరీస్‌లను ప్లాన్‌ చేసింది.

సెప్టెంబర్‌ 20-25 మధ్యలో ఆస్ట్రేలియా, సెప్టెంబర్‌ 28-అక్టోబర్‌ 11 మధ్యలో సౌతాఫ్రికా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. భారత పర్యటనలో ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుండగా.. దక్షిణాఫ్రికా 3 టీ20లు, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది.

ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు పంజాబ్‌లోని మొహాలీ వేదిక కాగా.. రెండో టీ20 నాగ్‌పూర్‌లో జరుగనుంది. చివరిదైన మూడో టీ20కి హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం (ఉప్పల్‌) వేదిక కానుంది. చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో ఓ ఇంటర్నేషనల్ క్రికెట్‌ మ్యాచ్‌ జరుగనుంది. దీంతో స్థానికులు ఉబ్బితబ్బుబ్బిపోతున్నారు. 

సౌతాఫ్రికా పర్యటన విషయానికొస్తే.. 
సెప్టెంబర్‌ 28- తొలి టీ20 (తిరువనంతపురం)
అక్టోబర్‌ 2- రెండో టీ20 (గౌహతి)
అక్టోబర్‌ 4- మూడో టీ20 (ఇండోర్‌)

అక్టోబర్‌ 6- తొలి వన్డే (లక్నో)
అక్టోబర్‌ 9- రెండో వన్డే (రాంచీ)
అక్టోబర్‌ 11- మూడో వన్డే (ఢిల్లీ)
చదవండి: Asia Cup 2022: ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌.. త్రిబుల్‌ ధమాకా..!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement