IND Vs AUS 2022, 3rd T20I: Virat Kohli And Rohit Sharma Hugged Each Other After India Won, Video Viral - Sakshi
Sakshi News home page

Rohit Sharma- Virat Kohli: పట్టరాని సంతోషం.. కోహ్లి- రోహిత్‌ ఆలింగనం.. వీడియో వైరల్‌

Published Mon, Sep 26 2022 9:40 AM | Last Updated on Mon, Sep 26 2022 10:18 AM

Ind Vs Aus 3rd T20: Rohit Sharma Virat Kohli Hug After Clinch Series Viral - Sakshi

విరాట్‌ కోహ్లి- రోహిత్‌, కోహ్లి ఆలింగనం(PC: Twitter/Disney+hotstar)

India Vs Australia T20 Series- 3rd T20- Hyderabad- Virat Kohli: స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలోనూ ఆకట్టుకోలేకపోయాడు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి. మొహాలీ మ్యాచ్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన ఈ వన్‌డౌన్‌ బ్యాటర్‌.. నాగ్‌పూర్‌లో 11 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. అయితే, తనకు కలిసి వచ్చిన ఉప్పల్‌ స్టేడియంలో మాత్రం అదరగొట్టాడు ఈ రన్‌మెషీన్‌.

పాత కోహ్లిని గుర్తుచేస్తూ..
చివరిసారి ఉప్పల్‌లో ఆడిన మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొని 94 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లి.. మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆసీస్‌తో మూడో టీ20లో 48 బంతుల్లో 63 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌(69 పరుగులు)తో కలిసి జట్టును గెలిపించాడు.

ఇక ఆఖరి వరకు పట్టుదలగా నిలబడ్డ కోహ్లి.. చివరి ఓవర్‌ రెండో బంతికి డేనియల్‌ సామ్స్‌ బౌలింగ్‌లో ఆరోన్‌ ఫించ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఈ క్రమంలో క్రీజును వీడిన కోహ్లి డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్తుండగా.. అక్కడే ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కోహ్లిని అభినందించాడు. 

రోహిత్‌- కోహ్లి బ్రొమాన్స్‌.. వీడియో వైరల్‌
ఇదిలా ఉంటే.. ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి హార్దిక్‌ పాండ్యా ఫోర్‌ బాదడంతో టీమిండియా విజయం ఖరారైన సమయంలో అక్కడే మెట్లపై కూర్చున్న కోహ్లి, రోహిత్‌ పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. రోహిత్‌ను దగ్గరకు లాక్కొని మరీ ఆలింగనం చేసుకున్న కోహ్లి.. అతడి వీపును తడుతూ మనం సాధించాం అన్నట్లుగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన విరాట్‌- రోహిత్‌ ఫ్యాన్స్‌.. ఇంతకంటే కన్నులపండుగ ఏముంటుంది అంటూ మురిసిపోతున్నారు.

చదవండి: Ind Vs Aus 3rd T20- Rohit Sharma: పంత్‌ను అందుకే ఆడించలేదు; హైదరాబాద్‌లో మ్యాచ్‌ ప్రత్యేకం.. ఎందుకంటే!
Ind Vs Aus 3rd T20- Rohit Sharma: హైదరాబాద్‌ బిర్యానీకి రోహిత్‌ ఫిదా 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement