IND vs AUS 3rd T20: కోహ్లి, సూర్య మెరుపులు.. ఆసీస్‌పై భారత్‌ ఘన విజయం | IND vs AUS 3rd T20: Hyderabad: Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND vs AUS 3rd T20: కోహ్లి, సూర్య మెరుపులు.. ఆసీస్‌పై భారత్‌ ఘన విజయం

Published Sun, Sep 25 2022 6:24 PM | Last Updated on Sun, Sep 25 2022 10:43 PM

IND vs AUS 3rd T20: Hyderabad: Updates And Highlights - Sakshi

కోహ్లి, సూర్య మెరుపులు.. ఆసీస్‌పై భారత్‌ ఘన విజయం
హైదరాబాద్‌ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్‌ 6వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో భారత్‌ సొంతం చేసుకుంది. కాగా 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌(69), విరాట్‌ కోహ్లి(63) అర్ధ సెంచరీలతో చెలరేగారు.

సామ్స్‌ వేసిన అఖరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతికే విరాట్‌ సిక్స్‌ బాది లక్ష్యాన్ని తగ్గించాడు. అయితే  ఆ తర్వాతి బంతికే విరాట్‌ ఔటయ్యాడు. కాగా అఖరి నాలుగు బంతుల్లో 5 పరుగులు కావల్సిన నేపథ్యంలో హార్దిక్‌ ఫోర్‌ బాది జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆసీస్‌ బౌలరల్లో సామ్స్‌ రెండు వికెట్లు, హాజిల్‌ వుడ్‌,కమ్మిన్స్‌ చెరో వికెట్‌ సాధించారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాటర్లలో గ్రీన్‌(52), టిమ్‌ డేవిడ్‌(54) అర్ధసెంచరీలతో మెరిశారు. ఇక భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ మూడు, భువనేశ్వర్‌ కుమార్‌, చాహల్‌, హర్షల్‌ పటేల్‌ తలా వికెట్‌ సాధించారు.
18 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 166/3
18 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. భారత్‌ విజయంలో 12 బంతుల్లో 21 పరుగులు కావాలి. క్రీజులో కోహ్లి, హార్దిక్‌ ఉన్నారు.

అర్ధ సెంచరీతో చెలరేగిన కోహ్లి
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో విరాట్‌ కోహ్లి అర్ద సెంచరీతో చెలరేగాడు. 16 ఓవర్లు ముగిసే సరికి భారత్‌.. మూడు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌(50),హార్దిక్‌(3) పరుగులతో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
134 పరుగులు వద్ద భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. దూకుడుగా ఆడుతోన్న సూర్యకుమార్‌ యాదవ్‌(69).. హాజల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
చేలరేగి ఆడుతున్న భారత బ్యాటర్లు
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో భారత విజయం దిశగా అడుగులు వేస్తోంది 13 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్‌ యాదవ్‌(58), విరాట్‌ కోహ్లి(39) పరుగులతో ఉన్నారు.

8 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 67/2
8 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లి(26), సూర్యకుమార్‌ యాదవ్‌(16) పరుగులతో ఉన్నారు.


రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా..
30 పరుగులు వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 17 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ.. కమిన్స్‌ బౌలింగ్‌లో సామ్స్‌కు క్యాచ్‌ ఔటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్
►5పరుగుల వద్ద కేఎల్‌ రాహుల్‌ (1) ఔట్‌

చెలరేగిన ఆసీస్‌ బ్యాటర్లు.. భారత్‌ టార్గెట్‌ 187 పరుగులు
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాటర్లలో గ్రీన్‌(52), టిమ్‌ డేవిడ్‌(54) అర్ధసెంచరీలతో చెలరేగారు. ఇక భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ మూడు, భువనేశ్వర్‌ కుమార్‌, చాహల్‌, హర్షల్‌ పటేల్‌ తలా వికెట్‌ సాధించారు.

18 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్‌: 161/6
18 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 6 వికెట్లు నష్టానికి 161 పరుగులు చేసింది. క్రీజులో టిమ్‌ డేవిడ్‌(41), సామ్స్‌(16) పరుగులతో ఉన్నారు.

వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌
ఆస్ట్రేలియా వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ వేసిన 14 ఓవర్‌లో తొలి బంతికి ఇంగ్లీష్‌(24) ఔట్‌ కాగా.. ఐదో బంతికి వేడ్‌(1) పెవిలియన్‌కు చేరాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా.. స్మిత్‌ ఔట్‌
ఆస్ట్రేలియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన స్మిత్‌.. చాహల్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. 

మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
75 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌.. రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 8 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్‌: 76/3

రెండో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌.. గ్రీన్‌ ఔట్‌
62 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న గ్రీన్‌(52).. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 40 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఆరోన్‌ ఫించ్‌ పెవిలియన్‌కు చేరాడు. మరోవైపు గ్రీన్‌ మాత్రం దూకుడుగా ఆడుతోన్నాడు. 18 బంతుల్లో 49 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

2 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్‌: 23/0
2 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్‌ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్‌(21),ఫించ్‌(2) పరుగులతో ఉన్నారు.

హైదరాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో తుదిపోరుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఒకే ఒక మార్పుతో భారత్‌ బరిలోకి దిగింది.

ఈ మ్యాచ్‌కు పంత్‌ స్థానంలో భువనేశ్వర్‌ కుమార్‌ తుది జట్టులో వచ్చాడు. మరోవైపు ఆసీస్‌ కూడా తమ జట్టులో ఒక మార్పు చేసింది. అబాట్‌ స్థానంలో ఇంగ్లీష్‌ జట్టులోకి వచ్చాడు.

భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(వికెట్‌ కీపర్‌), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

ఆస్ట్రేలియాఆరోన్ ఫించ్(కెప్టెన్‌), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్(వికెట్‌ కీపర్‌), డేనియల్ సామ్స్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
చదవండి: Ind A vs NZ A 2nd ODI: కుల్దీప్‌ యాదవ్‌ హ్యాట్రిక్‌ .. న్యూజిలాండ్‌పై భారత్‌ ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement