Australia tour of India
-
భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. హైదరాబాద్‌లో మ్యాచ్ ఎప్పుడంటే..?
IND VS AUS T20 Series Schedule: టీ20 ప్రపంచకప్ 2022కు ముందు భారత క్రికెట్ జట్టు ఊపిరి సడలని షెడ్యూల్‌తో ఉక్కిరిబిక్కిరవుతుంది. ప్రస్తుతం విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియా.. ఆ తర్వాత జింబాబ్వే పర్యటన, ఆ వెంటనే ఆసియా కప్‌తో బిజీబిజీగా గడపనుంది. ఆసియా కప్ ముగిసిన తర్వాత టీమిండియా దాదాపు నెలన్నర ఖాళీగా ఉండటంతో బీసీసీఐ ఈ మధ్యలో రెండు సిరీస్‌లను ప్లాన్ చేసింది. Take a look at #TeamIndia's home series fixture against Australia. 👍#INDvAUS pic.twitter.com/zwNuDtF32R — BCCI (@BCCI) August 3, 2022 సెప్టెంబర్ 20-25 మధ్యలో ఆస్ట్రేలియా, సెప్టెంబర్ 28-అక్టోబర్ 11 మధ్యలో సౌతాఫ్రికా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. భారత పర్యటనలో ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుండగా.. దక్షిణాఫ్రికా 3 టీ20లు, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. Check out the #INDvSA home series schedule. 👌#TeamIndia | @BCCI | @OfficialCSA pic.twitter.com/jo8zC4hjDq — BCCI (@BCCI) August 3, 2022 ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు పంజాబ్‌లోని మొహాలీ వేదిక కాగా.. రెండో టీ20 నాగ్‌పూర్‌లో జరుగనుంది. చివరిదైన మూడో టీ20కి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్) వేదిక కానుంది. చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. దీంతో స్థానికులు ఉబ్బితబ్బుబ్బిపోతున్నారు. సౌతాఫ్రికా పర్యటన విషయానికొస్తే.. సెప్టెంబర్ 28- తొలి టీ20 (తిరువనంతపురం) అక్టోబర్ 2- రెండో టీ20 (గౌహతి) అక్టోబర్ 4- మూడో టీ20 (ఇండోర్) అక్టోబర్ 6- తొలి వన్డే (లక్నో) అక్టోబర్ 9- రెండో వన్డే (రాంచీ) అక్టోబర్ 11- మూడో వన్డే (ఢిల్లీ) చదవండి: Asia Cup 2022: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. త్రిబుల్ ధమాకా..! -
ఊరేగింపు... మేళతాళాలు...
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో ఆస్ట్రేలియానే నేలకు దించి చరిత్ర తిరగరాసిన భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ముందుగా ముంబై చేరుకున్నారు. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పయనమయ్యారు. సిరీస్ గెలిపించిన కెప్టెన్ అజింక్య రహానే మాతుంగాలోని తన స్వగృహానికి చేరగానే హౌజింగ్ సొసైటీలోని స్థానికులంతా ఎర్రతివాచీ పరిచి మరీ నాయకుడికి ఘన స్వాగతం పలికారు. భార్యతో పాటు రహానే తన రెండేళ్ల కుమార్తెను ఎత్తుకొని నడుస్తుండగా ఇరుగు పొరుగువారు, స్థానికులు అతనిపై అడుగడుగున పూలజల్లు కురిపించారు. అనంతరం రహానేతో కేక్ కట్ చేయించి వేడుక జరుపుకున్నారు. అంతకుముందు ముంబై క్రికెట్ సంఘం రహానే, రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్, పృథ్వీ షాలను ఘనంగా సన్మానించింది. బ్రిస్బేన్ టెస్టు హీరో రిషభ్ పంత్ ఢిల్లీలో హర్షధ్వానాల మధ్య ఇంటికి చేరుకున్నారు. తమిళ సీమర్ నటరాజన్‌కు సొంతూరైన ‘చిన్నప్పంపట్టి’ గ్రామస్థులంతా రథంపై ఊరేగించి బ్రహ్మరథం పట్టారు. ఈ స్వాగత కార్యక్రమంలో ఊరంతా పాల్గొనడం విశేషం. ఓ నెట్ బౌలర్‌గా జట్టుతో పాటు వెళ్లిన ఈ తమిళ తంబి అన్ని ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా ఘనత వహించాడు. కరోనా దృష్ట్యా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం రహానే, రోహిత్, శార్దుల్, పృథ్వీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిలను ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్ కావాలని అధికారులు సూచించారు. -
ఎయిర్‌పోర్ట్‌లో టీమిండియాకు ఘన స్వాగతం
ముంబై: ఆస్ట్రేలియా టూర్‌ను విజయవంతంగా ముగించి.. ట్రోఫీతో భారత క్రికెట్ జట్టు సభ్యులు సగర్వంగా స్వదేశం చేరారు. విమానాశ్రయాల్లో వారికి ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా నుంచి జట్టు సభ్యులు గురువారం భారత్‌కు చేరుకున్నారు. ముంబైలో కెప్టెన్ అజింక్య రహానే, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రి, ఓపెనర్ పృథ్వీ షా దిగగా.. బ్రిస్బెన్ టెస్ట్‌లో హీరోగా నిలిచిన రిషబ్ పంత్ ఢిల్లీలో అడుగుపెట్టాడు. ఇక టెస్ట్‌లో సత్తా చాటిన మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ చేరుకున్నాడు. ఆటగాళ్లకు విమానాశ్రయ సిబ్బందితో పాటు అభిమానులు, ప్రయాణికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఢిల్లీలో దిగిన అనంతరం రిషబ్ పంత్ మీడియాతో మాట్లాడారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. సిరీస్ మొత్తం ఆడిన తీరుపై జట్టు అంతా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. -
ఏం జరిగినా ఆడాలనుకున్నా: హనుమ విహారి
సాక్షి, హైదరాబాద్: 161 బంతుల్లో 23 పరుగులు... ఈ స్కోరు చూస్తే ఇంతేనా అనిపిస్తుంది! కానీ ఇదే ఇన్నింగ్స్ విలువ మాటల్లో చెప్పలేనంత అమూల్యం! గాయంతో బాధపడుతూనే ఒక్కో బంతిని ఎదుర్కొంటూ భారత్‌ను ఓటమి నుంచి రక్షించిన ఈ ప్రదర్శన హనుమ విహారిని ఒక్కసారిగా హీరోను చేసింది. అప్పటి వరకు ఆడిన 11 టెస్టుల ప్రదర్శనతో పోలిస్తే సిడ్నీలో పోరాటం విహారి స్థాయిని పెంచింది. అశ్విన్‌తో కలిసి విహారి ఆడిన ఆటతో మూడో టెస్టును కాపాడుకున్న భారత్ చివరి టెస్టులో విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. వరుసగా రెండో పర్యటనలోనూ గెలుపు బృం దంలో భాగంగా ఉన్న విహారి తాజా సిరీస్ విజయం పట్ల అమితానందంగా కనిపించాడు. ప్రస్తుతం అతను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్తో గాయం నుంచి కోలుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తన కెరీర్లో సిడ్నీ ప్రదర్శన ఎప్పటికీ మరచిపోలేని ఘట్టంగా నిలిచిపోతుం దన్న విహారి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే... బ్రిస్బేన్‌లో గెలుపు, సిరీస్ సొంతం కావడంపై... చాలా చాలా సంతోషంగా ఉంది. కొద్ది రోజుల క్రితం మేం ఉన్న స్థితి నుంచి సిరీస్ గెలుపు వరకు చూస్తే అంతా అద్భుతంలా కనిపించింది. చరిత్రలో అతి గొప్ప విజయాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఇందులో నేనూ ఉండటం చాలా గర్వంగా అనిపిస్తోంది. ముఖ్యంగా చివరి టెస్టులో మా వాళ్లంతా చాలా బాగా ఆడారు. వారిని అక్కడ చూస్తుంటే నేనూ ఉంటే బాగుండేదనిపించింది. విజయపు వేడుకల్లో భాగం కాలేకపోవడం సహజంగానే నిరాశ కలిగించింది. అశ్విన్‌లాగా కాకుండా నేను తర్వాతి మ్యాచ్ ఆడలేనని సిడ్నీలోనే తేలిపోయింది. ఎన్సీఏకి వెళ్లి గాయం నుంచి కోలుకునేం దుకు సాధ్యమైనంత త్వరగా రీహాబిలిటేషన్ ప్రారంభించా లని చెప్పడంతో సిడ్నీ నుంచి రావాల్సి వచ్చింది. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపిక కాలేదు కానీ మూడో టెస్టులోగా కోలుకొని జట్టులోకి వస్తానని నమ్మకముంది. చదవండి: (ఆసీస్ అడ్డాలో టీమిండియా కొత్త చరిత్ర) రెండేళ్ల క్రితం గెలుపుతో పోలిస్తే... ఆసీస్ గడ్డపై అప్పటి వరకు భారత్ ఒక్కసారీ సిరీస్ నెగ్గలేదు. కాబట్టి నాడు అది చాలా ప్రత్యేకంగా అనిపించింది. అయితే ఇప్పుడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో తాజా విజయం మరింత మధురంగా అనిపిస్తోంది. నా వరకు చూస్తే రెండు సిరీస్ లలోనూ నేను జట్టులో సభ్యుడిగా ఉన్నాను కాబట్టి నా ఆనందం రెట్టింపైంది. దీనిని మాటల్లో చెప్పలేను. ఇంత కంటే ఇంకేం ఆశించగలను! నిజానికి క్వారంటైన్, బయో బబుల్ చాలా కఠినంగా అనిపించాయి. అయితే ఇంత ప్రతిష్టాత్మక సిరీస్ ఆడుతున్న సమయంలో ఇతర విషయాలను పెద్దగా పట్టించుకోవద్దని మేమందరం గట్టిగా అనుకున్నాం కాబట్టి అది ఇబ్బంది కాలేదు. ఈ రెండు పర్యటనల మధ్య బ్యాట్స్‌మన్‌గా కూడా నేను ఎంతో మెరుగయ్యాను. వైఫల్యాల తర్వాత జట్టులో స్థానంపై... సహజంగానే కొంత అనిశ్చితి ఉంటుంది. అడిలైడ్, మెల్బోర్న్లలో నేను తక్కువ స్కోర్లు చేయడం వాస్తవమే అయినా ఎక్కడా తడబడలేదు. క్రీజ్‌లో ఉన్నంత సేపు మంచి ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడాను. అయితే అవి భారీ స్కోర్లుగా మారలేదు. అయినా తుది జట్టు ఎంపిక గురించి ఊహించలేం. అవకాశం రాకపోతే ఏమీ చేయలేం. అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం వంద శాతం కష్టపడి బాగా ఆడేందుకు ప్రయత్నిస్తా. ఇక నేను ఒకటి మినహా (వైజాగ్‌లో దక్షిణాఫ్రికాపై) మిగిలిన 11 టెస్టులు విదేశాల్లోనే ఆడాను. టీమ్ మేనేజ్మెంట్ నన్ను బయటి టెస్టుల్లోనే పరిగణనలోకి తీసుకుంటోందా అనేది కూడా చెప్పలేను. అయితే అలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు నేను సిద్ధం. సిడ్నీ అద్భుతం గురించి... ఆ రోజు గురించి నేను ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా భావోద్వేగానికి లోనవుతా! నేను బ్యాటింగ్ మొదలు పెట్టిన కొద్ది సేపటికే (27 బంతులకు) కండరాలు పట్టేశాయి. ఇక పరుగు తీయడం కష్టమని అర్థమైపోయింది. తర్వాతి ఓవర్లోనే పుజారా వెనుదిరిగాడు. అంతే... ఇక మ్యాచ్‌ను కాపాడుకోవాలని నేను, అశ్విన్ నిర్ణయించుకున్నాం. వికెట్ కాపాడుకోవడమే లక్ష్యంగా నిలబడ్డాం. ఆస్ట్రేలియా అత్యుత్తమ బౌలింగ్ దళాన్ని ఎదుర్కోవడం సులువు కాదు. ఆ సమయంలో అది మరీ కష్టంగా అనిపించింది. నొప్పి పెరిగిపోవడంతో నివారణ ఇంజక్షన్ తీసుకున్నాను. బలవంతంగా ఆటలో కొనసాగితే గాయం తీవ్రమయ్యే ప్రమాదం ఉందనే విషయం గురించి ఆలోచించలేదు. రెండు టెస్టుల్లో విఫలమైన తర్వాత కూడా నన్ను నమ్మి మేనేజ్మెంట్ నాకు అవకాశం ఇచ్చింది. దానిని నిలబెట్టుకునేందుకు ఏం జరిగినా ఆడాలనుకున్నా. ఇద్దరం ఒకే తరహా స్థితిలో ఉన్నాం కాబట్టి ప్రోత్సహించుకుంటూ కదిలాం. అశ్విన్‌కు కొంత తెలుగు పరిజ్ఞానం ఉండగా... చెన్నైలో ఆడిన అనుభవంతో నాకు తమిళం వచ్చు. అవే భాషల్లో మా సంభాషణ సాగింది. ఆట ముగిశాక నాకు కలిగిన సంతృప్తిని మాటల్లో చెప్పలేను. సిరాజ్ ప్రదర్శనపై... సిరాజ్ తొలి రంజీ మ్యాచ్‌కు (2015లో సర్వీసెస్‌తో) నేనే హైదరాబాద్ కెప్టెన్‌గా ఉండి క్యాప్ అందించా. అప్పటి నుంచి అతనితో సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు కలిసి టెస్టులు ఆడాం. అంతులేని ఆత్మవిశ్వాసమే అతని బలం. మైదానంలో ఉన్నప్పుడు, బౌలింగ్ చేసేటప్పుడు ఆ జోష్, పట్టుదల కనిపిస్తూ ఉంటుంది. ఆస్ట్రేలియాలో మూడు టెస్టుల్లోనూ సిరాజ్ చాలా బాగా ఆడాడు. వ్యక్తిగతంగా ప్రతికూల పరిస్థితులను అధిగమించి అతను ఆడిన ఆటను ప్రశంసించకుండా ఉండలేం. -
కెప్టెన్‌కే ఏమీ తెలీదు!
సిడ్నీ: ఆస్ట్రేలియా విమానం ఎక్కుతున్న సమయంలో కూడా జట్టు వైస్ కెప్టెన్ తమతో పాటు ఎందుకు రావడం లేదో కెప్టెన్‌కు తెలీదు! ఈ వ్యవహారంపై జట్టు సారథికి సమాచారం ఇవ్వాల్సిన బోర్డు ఏదీ చెప్పకుండా అన్ని విషయాలను దాచి పెట్టింది! భారత క్రికెట్‌కు సంబంధించి తాజా పరిస్థితి ఇది. ఐపీఎల్లో రోహిత్ శర్మ గాయపడటం మొదలు ఇప్పుడు తొలి రెండు టెస్టులకు దూరం కావడం వరకు నెల రోజులుగా సాగుతున్న అతని ఫిట్నెస్ వివాదంలో ఇప్పుడు మరో కొత్త అంశం తెర పైకి వచ్చింది. అసలు రోహిత్ శర్మ గాయం గురించే తనకు పూర్తి సమాచారం లేదని స్వయంగా కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. అసలు ఒక రకమైన అనిశ్చితి, గందరగోళం కనిపించిందని అతను చెప్పడం ఈ వ్యవహారం ఎలా సాగిందో చెబుతోంది. టీమిండియా కెప్టెన్‌కు, బీసీసీఐకి మధ్య ఎలాంటి సమాచార లోపం ఉందో కూడా ఇది చూపిస్తోంది. రోహిత్ వ్యవహారానికి సంబంధించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు అతని మాటల్లోనే... ‘దుబాయ్‌లో సెలక్షన్ కమిటీ సమావేశానికి రెండు రోజుల ముందు మాకు ఒక మెయిల్ వచ్చింది. ఐపీఎల్లో గాయపడిన కారణంగా రోహిత్ శర్మ సెలక్షన్‌కు అందుబాటులో లేడని, అతనికి కనీసం రెండు వారాల విశ్రాంతి, రీహాబిలిటేషన్ అవసరమని అందులో ఉంది. దీనికి సంబంధించి మంచి చెడులన్నీ రోహిత్‌కు చెప్పామని, అతను దానిని అర్థం చేసుకున్నాడని కూడా ఉంది. అందుకే ఎంపిక చేయడం లేదని చెప్పారు. అయితే ఆ తర్వాత అతను ఐపీఎల్ ఆడటంతో అంతా బాగుందని, ఆస్ట్రేలియా విమానం ఎక్కుతాడని మేం అనుకున్నాం. అయితే అది జరగలేదు. (289 రోజుల తర్వాత...) మాతో రోహిత్ ఎందుకు ప్రయాణించడం లేదో మాకెవరికీ సమాచారం లేదు. దాని తర్వాత బోర్డు నుంచి అధికారికంగా ఒకే ఒక మెయిల్ వచ్చింది. అందులో రోహిత్ ఎన్సీఏలో ఉన్నాడని, అతని గాయాన్ని పర్యవేక్షిస్తున్నామని, నవంబర్ 11న మరింత స్పష్టత వస్తుందని రాసుంది. సెలక్షన్ కమిటీ సమావేశం జరిగిన రోజు నుంచి మొదలు పెడితే ఐపీఎల్ ముగిసి, ఎన్సీఏలో చేరే వరకు మాకు ఎలాంటి సమాచారం లేదు. దీనిపై పూర్తిగా స్పష్టత లోపించింది. అసలు ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు వేచి చూడటమే సరైంది కాదు. అంతా గందరగోళంగా ఉందనేది వాస్తవం. రోహిత్ పరిస్థితికి సంబంధించి ఎంతో అనిశ్చితి నెలకొంది. ఎక్కడా స్పష్టత లేదు’ -
కోహ్లి నిర్ణయం సరైందే: రవిశాస్త్రి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా టూర్లో కెప్టెన్ విరాట్ కోహ్లిని కచ్చితంగా మిస్సవుతామని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. అయితే ప్రస్తుతం జట్టులో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఉన్నారని, కోహ్లి నిర్ణయం వల్ల తమను తాము నిరూపించుకునే అవకాశం వారికి దక్కిందని పేర్కొన్నాడు. కాగా కోహ్లి సతీమణి, హీరోయిన్ అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రసవ సమయంలో భార్యకు తోడుగా ఉండేందుకు అతడు పితృత్వ సెలవు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17న మొదలయ్యే తొలి టెస్టు తర్వాత కోహ్లి స్వదేశానికి తిరిగి రానున్నాడు. దీంతో ఆసీస్‌తో జరిగే కీలకమైన టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో కోహ్లి నిర్ణయం.. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని మరోసారి సొంతం చేసుకోవాలన్న టీమిండియా బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపనుందని క్రికెట్ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు.(చదవండి: కోహ్లి దూరం: ఆ చాన్స్ కొట్టేస్తే లక్కీయే!) ఈ విషయంపై తాజాగా స్పందించిన రవిశాస్త్రి... కోహ్లి సరైన నిర్ణయమే తీసుకున్నాడని అతడిని సమర్థించాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘గత ఐదారేళ్లుగా టీమిండియా విజయ పరంపరను గమనిస్తే దాని వెనుక కోహ్లి ఉన్నాడన్న విషయం సుస్పష్టమే. జట్టును ముందుండి నడిపించడంలో అతడు సఫలమయ్యాడని అందరికీ తెలుసు. అలాంటి ఆటగాడు, కెప్టెన్‌ను ఇప్పటి సిరీస్‌లో కచ్చితంగా మిస్సవుతాం. అయితే జీవితంలో అలాంటి మధుర క్షణాలు(తొలి సంతానానికి సంబంధించి) ఆస్వాదించే సమయం మళ్లీ మళ్లీ రాదు. తనకు స్వదేశానికి వెళ్లేందుకు అనుమతి లభించింది. కాబట్టే తిరిగి వెళ్తున్నాడు. అందుకు తనెంతో సంతోషంగా ఉన్నాడని భావిస్తున్నా. అతడు సరైన నిర్ణయమే తీసుకున్నాడు. అందువల్ల యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకునే అవకాశం లభించింది’’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. (చదవండి: ఏంటిది కోహ్లి.. ధోనీలా ఆలోచించలేవా?) -
టెస్టు జట్టులో సిరాజ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్య పరిస్థితుల్లో... ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జంబో బృందాన్ని ఎంపిక చేసింది. నవంబర్ 27న టి20 సిరీస్‌తో మొదలయ్యే ఈ పర్యటనలో భారత్ మూడు టి20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీతో ఈ పర్యటన ముగియనుంది. చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి నేతృత్వంలోని భారత సెలక్టర్ల బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై మొత్తం 32 మందిని ఈ పర్యటన కోసం ఎంపిక చేసింది మూడు ఫార్మాట్ (టి20, వన్డే, టెస్టు)లలో కలిపి అధికారికంగా 28 మందిని ఎంపిక చేశారు. అయితే నెట్ ప్రాక్టీస్ సెషన్స్ కోసం మరో నలుగురు పేసర్లు కమలేశ్ నాగర్కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పోరెల్, నటరాజన్ కూడా ఈ 28 మందితో కలిసి ఆస్ట్రేలియాకు వెళతారు. బయో బబుల్ వాతావరణంలో జరిగే ఈ సిరీస్ కోసం మూడు జట్లు ఒకేసారి ఆస్ట్రేలియాకు వెళతాయి. గాయాలతో బాధపడుతున్న స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, బౌలర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్‌లను ఈ పర్యటనకు ఎంపిక చేయలేదు. తొడ కండరాలతో బాధపడుతున్న రోహిత్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సిరాజ్ శ్రమకు ఫలితం... ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో భారత టి20, వన్డే జట్లకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలిసారి టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. 26 ఏళ్ల సిరాజ్ కొన్నాళ్లుగా భారత ‘ఎ’ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 36 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ మొత్తం 147 వికెట్లు పడగొట్టాడు. అతను ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు 13 సార్లు, ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు నాలుగుసార్లు తీశాడు. వన్డే, టి20 జట్ల నుంచి పంత్ అవుట్... ఏడాది తర్వాత కేఎల్ రాహుల్ టెస్టు జట్టులో పునరాగమనం చేయగా... నిలకడగా ఆడలేకపోతున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను వన్డే, టి20 జట్ల నుంచి తప్పించి కేవలం టెస్టు జట్టుకే పరిమితం చేశారు. తమిళనాడు ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి తొలిసారి టి20 జట్టులో స్థానం పొందాడు. ప్రస్తుత ఐపీఎల్లో 11 మ్యాచ్‌లు ఆడిన 29 ఏళ్ల వరుణ్ 13 వికెట్లు తీశాడు. ఏడు రకాల బంతులను వేయగల వైవిధ్యం వరుణ్ సొంతం. ఈ ఐపీఎల్లో వరుణ్ స్పిన్‌కు వార్నర్, ధోని, పంత్, శ్రేయస్ అయ్యర్ తదితర అంతర్జాతీయ క్రికెటర్లు బోల్తా పడ్డారు. భారత జట్ల వివరాలు టెస్టు జట్టు: కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), మయాంక్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, పుజారా, విహారి, శుబ్‌మన్ గిల్, సాహా (వికెట్ కీపర్), పంత్ (వికెట్ కీపర్), బుమ్రా, షమీ, ఉమేశ్, సెనీ, కుల్దీప్, జడేజా, అశ్విన్, సిరాజ్. వన్డే జట్టు: కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), ధావన్, శుబ్‌మన్ గిల్, అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్, జడేజా, చహల్, కుల్దీప్, బుమ్రా, షమీ, సైనీ, శార్దుల్ ఠాకూర్. టి20 జట్టు: కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), ధావన్, మయాంక్, అయ్యర్, పాండే, హార్దిక్ పాండ్యా, సామ్సన్ (వికెట్ కీపర్), జడేజా, వాషింగ్టన్ సుందర్, చహల్, బుమ్రా, షమీ, సైనీ, దీపక్ చహర్, వరుణ్ చక్రవర్తి. అదనపు పేస్ బౌలర్లు: కమలేశ్ నాగర్కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పోరెల్, నటరాజన్. -
వన్డేలతో మొదలు...
మెల్బోర్న్: కంగారూ గడ్డపై భారత జట్టు పర్యటన అధికారికంగా ఖరారైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ సిరీస్‌కు గురువారం పచ్చజెండా ఊపడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తేదీలతో సహా తుది షెడ్యూల్‌ను ప్రకటించింది. దీనిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆమోదించడం లాంఛనమే. అయితే ఈ పూర్తి స్థాయి పర్యటనలో చిన్న మార్పు చోటుచేసుకుంది. సుదీర్ఘ ద్వైపాక్షిక సమరంలో ఇన్నాళ్లు ముందుగా పొట్టి ఫార్మాట్ మ్యాచ్‌లు జరుగుతాయన్న సీఏ ఇప్పుడు మార్చింది. తొలుత వన్డేలు... ఆ తర్వాతే టి20 జరుగుతాయని ప్రకటించింది. కంగారూ గడ్డపై అడుగుపెట్టగానే సిడ్నీలో భారత ఆటగాళ్లు క్వారంటైన్ అవుతారు. ఇదీ షెడ్యూల్... సిడ్నీలో కరోనా ప్రొటోకాల్ ముగిశాక... అక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లోనే వచ్చే నెల 27, 29 తేదీల్లో తొలి రెండు వన్డేలు జరుగుతాయి. ఆఖరి వన్డే కాన్‌బెర్రాలోని మనుక ఓవల్ మైదానంలో డిసెంబర్ 1న జరుగుతుంది. ఇదే వేదికపై 4న తొలి టి20 నిర్వహిస్తారు. మిగతా రెండు పొట్టి మ్యాచ్‌ల్ని మళ్లీ సిడ్నీలో నిర్వహిస్తారు. 6, 8 తేదీల్లో ఎస్సీజీలో రెండు, మూడో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక నాలుగు టెస్టుల సిరీస్ పింక్‌బాల్‌తో మొదలవుతుంది. డిసెంబర్ 17 నుంచి 21 వరకు అడిలైడ్ ఓవల్‌లో తొలి డేనైట్ టెస్టు జరుగుతుంది. బాక్సింగ్ డే టెస్టు 26 నుంచి 30 వరకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహిస్తారు. అప్పుడు కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా విక్టోరియా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తే ‘బాక్సింగ్ డే’ టెస్టు వేదికను అడిలైడ్ ఓవల్‌కు మారుస్తారు. ఇది బ్యాకప్ వేదికైనా డేనైట్ టెస్టు కాదు. మూడో టెస్టు జనవరి 7 నుంచి 11 వరకు సిడ్నీలో, చివరి టెస్టు జనవరి 15 నుంచి 19 వరకు బ్రిస్బేన్‌లో జరుగుతాయి. -
ఆసీస్‌కు భారత్ జంబో బృందం!
ముంబై: వచ్చే నెలలో కోహ్లి సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. పూర్తిస్థాయిలో అన్ని ఫార్మాట్లు ఆడనున్న నేపథ్యంలో అక్కడికి టీమిండియా జంబో సేనతో బయల్దేరుతుంది. పైగా కరోనా ప్రొటోకాల్ కూడా ఉండటంతో ఒకేసారి భారీ జట్టునే పంపనున్నట్లు తెలిసింది. మొత్తం 32 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళతారు. ఇందులో భారత్ ‘ఎ’ ఆటగాళ్లు కూడా ఉంటారు. యూఏఈలో ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లు అక్కడి నుంచే నేరుగా ఆసీస్‌కు పయనమవుతారు. కరోనా మహమ్మారి తర్వాత కోహ్లి సేన ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్ ఇదే. రెండున్నర నెలల పాటు సాగే ఈ పర్యటనలో భారత్ మూడు టి20లు, మూడు వన్డేలతోపాటు నాలుగు టెస్టుల సిరీస్‌లో పాల్గొంటుంది. ఇందులో ఒక డే–నైట్ టెస్టు జరుగుతుంది. పరిమిత ఓవర్ల సిరీస్ ముగిశాక టెస్టు జట్టులో లేని ఆటగాళ్లను స్వదేశానికి పంపే అవకాశాల్ని అప్పటి పరిస్థితుల్ని బట్టి తీసుకుంటుంది. ‘జంబో సేన’ ఎందుకంటే... ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ఏ దేశంలోనూ పూర్తిస్థాయిలో పునరుద్ధరించనే లేదు. పైగా వెళ్లిన ప్రతీ ఒక్కరు క్వారంటైన్ కావాల్సిందే. దీంతో టూర్ మధ్యలో ఆటగాడు ఎవరైనా గాయపడితే ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే ప్రత్యేక విమానం (చార్టెడ్ ఫ్లయిట్) కావాలి. తీరా భర్తీ అయిన ఆటగాడు అక్కడికి వెళ్లాక జట్టుతో కలిసే అవకాశం కూడా ఉండదు. 14 రోజులు క్వారంటైన్లో గడపాల్సిందే. ఈ సమయంలో రెండు, మూడుసార్లు కోవిడ్ పరీక్ష చేస్తారు. ప్రయాణ బడలికలో కానీ, ఇతరత్రా సౌకర్యాల వల్ల కరోనాను పొరపాటున అంటించుకుంటే ఇంత వ్యయప్రయాసలోర్చి పంపిన ఆటగాడు ఆడే అవకాశం క్లిష్టమవుతుంది. ఇవన్నీ కూలంకశంగా పరిశీలించిన సీనియర్ సెలక్షన్ కమిటీ ఏకంగా జంబో సేనను పంపడమే మేలనే నిర్ణయానికి వచ్చింది. అలాగే కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు భారత బృందమే రెండు మూడు జట్లుగా ఏర్పడి ప్రాక్టీస్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. అయితే సుదీర్ఘంగా సాగే ఈ టూర్ పూర్తిగా ఆటగాళ్ల వరకే పరిమితమవుతుంది. క్రికెటర్ల వెంట సతీమణులు, ప్రియసఖిలకు అనుమతి లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్లో మాత్రం భార్య, గర్ల్‌ఫ్రెండ్స్‌పై నిర్ణయాన్ని ఆయా ఫ్రాంచైజీలకే వదిలేసిన సంగతి తెలిసిందే. ముందుగా పొట్టి మ్యాచ్‌లు... కంగారూ గడ్డపై ముందుగా భారత్ మూడు పొట్టి మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం టి20లు ముగిశాక... వన్డేలు ఆడుతుంది. అయితే దీనికి సంబంధించిన తేదీలను మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇంకా ఖరారు చేయలేదు. ఈ నెలాఖరులోగా తుది షెడ్యూల్‌ను భారత బోర్డుకు తెలియజేసే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా టెస్టు స్పెషలిస్టులైన చతేశ్వర్ పుజారా, హనుమ విహారిలకు మ్యాచ్ ప్రాక్టీస్ ఏర్పాట్లపై బోర్డు దృష్టి పెట్టింది. ఐపీఎల్లో అవకాశంరాని వీరిద్దరికి దేశవాళీ టోర్నీలు కూడా లేక ఎలాంటి ప్రాక్టీసే లేకుండా పోయింది. కరోనా తర్వాత అసలు బరిలోకే దిగలేని వీరి కోసం బోర్డు ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసే పనిలో పడింది. సిడ్నీలో క్వారంటైన్? భారత జట్టు బ్రిస్బేన్‌లో అడుగు పెట్టినా... క్వారంటై న్ మాత్రం అక్కడ కుదరదు. క్వీన్స్లాండ్ ప్రభు త్వం కరోనా నేపథ్యంలో విదేశీ ప్రయాణికుల్ని అక్కడ బస చేసేందుకు అనుమతించడం లేదు. దీంతో సిడ్నీ లేదంటే కాన్బెర్రాలో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సీఏ ఉన్నతాధికారులు న్యూసౌత్‌వేల్స్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
బీసీసీఐకి తలనొప్పిగా ఆసీస్ పర్యటన
ముంబై: ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించే అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆలోచనలో పడింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్ నవంబర్‌లో ఆసీస్‌కు పయనం కావాల్సి ఉంటుంది. ఆటగాళ్ల ఆసీస్ ప్రయాణానికి సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేదు. ఈ స్వల్ప సమయంలో చార్టెర్డ్ విమానాల ఏర్పాటు, క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందికి వసతి, జట్ల ఎంపిక, ఆటగాళ్లకు ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహణ, పర్యటనకు తీసుకెళ్లాల్సిన ఆటగాళ్ల సంఖ్య ఇలా ప్రతీ విషయంలోనూ బీసీసీఐ ముందు అనేక సవాళ్లు నిలిచాయి. మరోవైపు ఆస్ట్రేలియాలోని క్వారంటైన్ నిబంధనలు ప్రతీ రాష్ట్రానికి వేర్వేరుగా ఉండటంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా తలపట్టుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా ఉంటే... మరో చోట ఈ నిబంధన ఏడు రోజులుగా ఉంది. షెడ్యూల్ ప్రకారం 4 టెస్టులకు వేర్వేరు వేదికలు ఉండటంతో పాటు... వన్డే, టి20 ఫార్మాట్లు కూడా ఆడాల్సి రావడంతో ఆటగాళ్లకు ఎలాంటి క్వారంటైన్ విధించాలనే అంశంపై సీఏ ఇంకా అస్పష్టతతోనే ఉంది. దీంతో కేవలం ఒక ఫార్మాట్‌తోనే సిరీస్‌ను ముగించాలా? లేక రెండే వేదికల్లో మ్యాచ్‌లన్నీ ముగించాలా అనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. వీటిపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టతనిచ్చే వరకు బీసీసీఐ వేచి చూడాల్సిందే. -
‘క్వారంటీన్ నిబంధనలు మారవు’
సిడ్నీ: ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటనలో కోవిడ్–19కు సంబంధించిన ఆంక్షల్లో తమకు కొన్ని సడలింపులు ఇవ్వాలంటూ బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని క్రికెట్ ఆస్ట్రేలియా తిరస్కరించింది. ప్రస్తుతం అక్కడి నిబంధనల ప్రకారం విదేశాలనుంచి ఎవరు వచ్చినా సరే...కనీసం రెండు వారాల పాటు హోటల్ క్వారంటీన్లో ఉండాల్సిందే. అయితే ఇది తమ ఆటగాళ్లను మానసికంగా దెబ్బ తీస్తుందని, దానికి బదులుగా బయో సెక్యూర్ బబుల్‌లో సాధన చేసేందుకు అవకాశం ఇవ్వాలని భారత బోర్డు కోరింది. భారత్ ఆస్ట్రేలియా గడ్డపై ముందుగా బ్రిస్బేన్‌లో అడుగు పెట్టాల్సి ఉంది. అయితే అక్కడి క్వీన్స్లాండ్ ప్రభుత్వం మాత్రం కరోనా నిబంధనల్లో ఏమాత్రం సడలింపులు ఇవ్వమని తేల్చేసింది. భారత క్రికెట్ జట్టయినా సరే, ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందేనంటూ అక్కడి అధికారులు స్పష్టం చేశారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత బృందం ఆస్ట్రేలియాకు వెళుతుంది. -
భారత టెస్టు స్పెషలిస్ట్‌లు దుబాయ్‌కి
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత టెస్టు జట్టు స్పెషలిస్ట్‌లు, కోచింగ్ బృందం కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఐపీఎల్లో ఆడని చతేశ్వర్ పుజారా, హనుమ విహారిలతోపాటు హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇతర సహాయక సిబ్బందిని నేరుగా ఆస్ట్రేలియా పంపించకుండా సహచరులతో కలిసి దుబాయ్ నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం వీరందరినీ బోర్డు ఈ నెలాఖరులో దుబాయ్‌కు పంపించనుంది. యూఏఈ నిబంధనల ప్రకారం వీరంతా అక్కడే ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు. వారంలో మొదటి, మూడో, ఆరో రోజున కోవిడ్–19 పరీక్షలకు హాజరవుతారు. అంతా ఓకే అనుకుంటే బయో బబుల్‌లో అక్కడే ఉన్న భారత జట్టు ఆటగాళ్లతో కలుస్తారు. వీరంతా ఒకే చార్టెర్డ్ ఫ్లయిట్లో ఆస్ట్రేలియా బయల్దేరతారు. ఆస్ట్రేలియా సిరీస్ పూర్తిగా బయో బబుల్ వాతావరణంలో జరగనున్న నేపథ్యంలో భారత బృందమంతా ఒకే తరహా వాతావరణం నుంచి వెళితే బాగుంటుందని బోర్డు భావిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఒక బయో బబుల్ రక్షణ కవచం నుంచి మరో బయో బబుల్ (ఆస్ట్రేలియాలో)లోకి వెళ్లడం సులువవుతుందని, అందుకే అందరూ కలిసి వెళ్లడం మంచిదని తాము భావించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు ఆస్ట్రేలియాలో భారత జట్టు నేరుగా ఏ నగరానికి వెళుతుందో, ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతుందో ఇంకా ఖరారు కాలేదు. ఆస్ట్రేలియాలో ఆ సమయంలో ఉండే కరోనా పరిస్థితిని బట్టి మార్పులు జరగవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం రెండు వారాలు క్వారంటీన్ కావాల్సి ఉంటుంది. దీనిపై కూడా ఇప్పటి వర కు ఇంకా ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. -
బేబీ సిట్టర్ యాడ్‌పై స్పందించిన పంత్
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆ జట్టు కెప్టెన్ టీమ్ పెయిన్‌తో భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సరదా మాటల యుద్దం చర్చనీయాంశమైంది. స్లెడ్జింగ్‌లో భాగంగా పంత్‌ను పెయిన్ మా పిల్లలను ఆడిస్తావా? అని కోరడం.. దీన్ని పంత్ నిజం చేయడం.. దీనికి పెయిన్ భార్య.. పంత్ బెస్ట్ బేబీ సిట్టర్ అని కితాబివ్వడం తెలిసిందే. ఆ తర్వాత రోహిత్ కూడా తన కూతురిని ఆడిస్తావా? అని అడగడం.. బెబీసిట్టర్‌గా పంత్‌కు బోలేడు అవకాశాలు రావడంతో ఈ పదం పాపులర్ అయింది. దీన్ని క్యాచ్ చేసుకున్న స్టార్ స్పోర్ట్స్.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో ఓ కమర్షియల్ యాడ్నే రూపోందించింది. ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో భాగంగా రూపొందించిన ఈ యాడ్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. భారత అభిమానులను ఈ వీడియో వీపరీతంగా ఆకట్టుకుంటుండగా.. ఆసీస్ మాజీ ఆటగాళ్లు, అభిమానులకు మాత్రం తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. కేవలం భారత అభిమానులను దృష్టిలో ఉంచుకొని తీసిన ఈ వీడియోపై.. ‘బేబీ సిట్టర్’ ట్రెండింగ్ సృష్టికర్త రిషబ్‌పంత్ తనదైన శైలిలో స్పందించాడు. ‘వీరూ పాజీ.. గొప్ప క్రికెటర్‌గా.. బేబీ సిట్టర్‌గా ఎలా ఉండాలో చూపించారు. స్పూర్తిదాయకమైన వీడియో’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ వీడియోపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ ఘాటుగా స్పందించాడు. ప్రధానంగా ఆసీస్ జట్టు జెర్సీలతో యాడ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆసీస్‌ను తేలిగ్గా తీసుకోవద్దు వీరూ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. వరల్డ్‌కప్ వంటి మెగాటోర్నీలో ఎవరు బేబీ సిట్టర్స్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. ఆసీస్ ఏమీ పసికూన కాదనే సంగతిని తెలుసుకోవాలని హెచ్చరించాడు. భారత పర్యటనకు రానున్న ఆసీస్.. రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ ఫిబ్రవరి 24న ప్రారంభమయ్యే తొలి టీ20తో ఈ సిరీస్ ఆరంభం కానుంది. Viru paaji showing me how to be better at cricket and babysitting — an inspiration always! 🙌@StarSportsIndia @virendersehwaghttps://t.co/IZvf9AqoJV — Rishabh Pant (@RishabPant777) February 13, 2019 -
ఆసీస్‌తో సిరీస్: తొలి విజయం ఇండియాదే..
చెన్నై: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై వేదికగా ఆదివారం సాగిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడటంతో ఆసీస్ లక్ష్యాన్ని 164కు (21 ఓవర్లలో) కుదించారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్(25), థర్డ్ డౌన్ మ్యాక్స్‌వెల్(39), లోడౌన్ జేమ్స్ ఫల్కనర్(32) మినహా మిగతావాళ్లెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోవడంతో ఆసీస్ 26 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సివచ్చింది. భారత బౌలర్లలో చాహల్ 3, పాండ్యా, కుల్దీప్లు చెరో 2, భువీ, భుమ్రా తలో వికెట్ పడగొట్టారు. ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రతిభ కనబర్చిన హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యాన్ని సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 281 పరుగులు సాధించింది. టాప్ఆర్డర్ విఫలమైనా మిడిల్, లోయర్ ఆర్డర్ ప్లేయర్లు హార్దిక్ పాండ్యా(83), ధోనీ(79), జాదవ్(40), భువీ(32)లు సమయోచిత ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్ బౌలర్లలో కుల్టర్నెయిల్ 3, స్టోనిస్ 2, ఫల్కనర్, జంపాలు చెరో వికెట్ పగడొట్టారు. ఇరుజట్ల మధ్య 21న కోల్‌కతాలో రెండో వన్డే జరగనుంది.