Australia tour of India, 2022- India Vs Australia T20 Series: టీ20 ప్రపంచకప్-2022కు ముందు టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం కంగారూ జట్టు గురువారం భారత్‌కు చేరుకుంది. ఐసీసీ మెగా ఈవెంట్‌కు ముందు జరుగనున్న ఈ సిరీస్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది.
ఇక డేవిడ్ వార్నర్ మినహా.. ప్రపంచకప్ జట్టులోని మిగతా ఆసీస్ ఆటగాళ్లంతా రోహిత్ సేనతో సిరీస్‌లో పాల్గొననున్న విషయం తెలిసిందే. అయితే, మిచెల్ మార్ష్, మార్కస్ స్టొయినిస్, మిచెల్ స్టార్క్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. నాథన్ ఎలిస్, డేనియల్ సామ్స్, సీన్ అబాట్‌లు వారి స్థానాలను భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో భారత్- ఆసీస్ పోరు ఎప్పుడు ఆరంభం కానుంది? పూర్తి షెడ్యూల్, మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలు, జట్ల వివరాల తాజా అప్‌డేట్లు, తదితర అంశాలు పరిశీలిద్దాం.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా- మూడు టీ20 మ్యాచ్‌లు
మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ఆరంభం
మొదటి టీ20
సెప్టెంబరు 20- మంగళవారం- పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం, మొహాలి
రెండో టీ20
సెప్టెంబరు 23- శుక్రవారం, విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్‌పూర్
మూడో టీ20
సెప్టెంబరు 25- ఆదివారం- రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
మ్యాచ్ ప్రసారాలు, లైవ్ స్ట్రీమింగ్
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం
డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్‌స్ట్రీమింగ్
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చహర్, జస్‌ప్రీత్ బుమ్రా.
అప్‌డేట్: షమీకి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చాడు.
టీమిండియాతో సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు:
ఆరోన్ ఫించ్(కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, డేనియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, ఆడం జంపా.
చదవండి: 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్
T20 World Cup 2022: జట్టును ప్రకటించిన అఫ్గనిస్తాన్.. యువ బౌలర్ ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment