Mohali
-
నా భార్య వల్లే ఇలా: శుభవార్త చెప్పిన క్రికెటర్
ఐర్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సిమ్రన్‌జిత్ సింగ్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. కాలేయ మార్పిడి విజయవంతంగా జరిగిందని.. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు వెల్లడించాడు. అదృష్టవశాత్తూ తన భార్యే దాతగా మారిందని.. ఆమె మంచి మనసు, అభిమానుల ప్రార్థన వల్లే ప్రాణాలతో బయటపడ్డాడని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.పంజాబ్‌కు ఆడిన సిమికాగా సిమ్రన్‌జిత్ సింగ్ భారత్‌లోని పంజాబ్‌లో గల మొహాలిలో జన్మించాడు. సిమి సింగ్‌గా ప్రసిద్ధి చెందిన అతడు భారత దేశవాళీ క్రికెట్లో అండర్-14, అండర్-17 స్థాయిలో పంజాబ్ తరఫున ఆడాడు. కానీ ఈ లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్‌కు భారత అండర్-19 జట్టులో మాత్రం స్థానం దక్కలేదు. దీంతో మళ్లీ చదువుపై దృష్టి సారించిన సిమి.. 2005లో ఐర్లాండ్‌కు వెళ్లిపోయాడు. అక్కడే హోటల్ మేనేజ్మెంట్ చేశాడు.అవకాశాలు లేక ఐర్లాండ్‌కు వెళ్లిఅయితే, క్రికెట్‌పై మక్కువ తగ్గకపోవడంతో 2006లో డబ్లిన్‌లో ప్రొఫెషనల్ క్రికెటర్ మారిన అతడు.. 2017లో ఐర్లాండ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ప్రతిభను చాటుకుంటూ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన 37 ఏళ్ల సిమి.. మొత్తంగా ఇప్పటి వరకు 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు తీశాడు. అంతేకాదు.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు.సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్గాఈ క్రమంలో... 2020లో సిమికి ఐర్లాండ్ సెంట్రల్ కాంట్రాక్టు దక్కింది. కాగా సిమి సింగ్ లివర్ పూర్తిగా పాడైపోయినట్లు అతడి కుటుంబ సభ్యులు ఇటీవల మీడియాకు తెలిపారు. అతడిని ఇండియాకు తీసుకువచ్చామని.. గురుగ్రామ్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా సిమి సింగ్ స్వయంగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ అందించాడు.నా భార్య వల్లే ఇదంతా‘‘అందరికీ హాయ్.. నా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తైంది. 12 గంటల పాటు శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. తప్పుడు యాంటి బయాటిక్స్, స్టెరాయిడ్స్‌ను కొందరు నాకు ప్రిస్కైబ్ చేశారు. వాటి వల్లే లివర్ పాడయ్యే దుస్థితి తలెత్తింది. నా భార్యే నాకు కాలేయ దాత కావడం నిజంగా నా అదృష్టం. నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా’’ అని సిమి సింగ్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.నిపుణులు సూచించిన మందులనే వాడాలని తన ఫాలోవర్లను అప్రమత్తం చేశాడు.చదవండి: Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్ బౌలర్ -
బైక్‌ను ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు.. ఒకరు మృతి
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, తాగి డ్రైవ్ చేయడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వంటి కారణాలు ప్రమాదాలకు మూలంగా మారాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. పోర్షే కారుతో 24 ఏళ్ల టెక్కీలపై దూసుకెళ్లిన ఈ ఘటనలో రోజుకో కుట్ర కోణం వెలుగుచూస్తోంది.తాజాగా పంజాబ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొహాలిలో బుధవారం రాత్రి జరిగింది ప్రమాదం. బనూర్ వైపు నుంచి వస్తున్న కారు జిరాక్పూర్ పాటియాలా హైవేపై బైక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీకి, కారుకు మధ్య బైక్ ఇరుక్కుపోయింది.ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా.. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాహిబ్ అనే వ్యక్తి మరణించారడు. పభాత్ గ్రామానికి చెందిన సుమిత్, రాజ్వీర్లు సింగ్‌లు చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధితుల కుటుంబ సభ్యులు పాటియాలా హైవేను దిగ్బంధించారు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం తర్వాత కారు డ్రౌవర్ పరారయ్యాడు. కారుపై వీఐపీ నెంబర్ ఉందని పోలీసులు తెలిపారు. రవాణా మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2022లో 67,000 హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. 30,000 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. -
దంచి కొట్టిన దూబే.. అఫ్గాన్‌ను చిత్తు చేసిన భారత్
అఫ్గానిస్తాన్‌తో మూడో టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా అఫ్గాన్‌తో జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత విజయంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే ముఖ్య భూమిక పోషించాడు. తొలుత బౌలింగ్‌లో కీలక వికెట్ పడగొట్టిన దూబే.. అనంతరం బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దూబేతో పాటు జితేష్ శర్మ(31), తిలక్ వర్మ(26) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ రెహ్మన్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ(42) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఓమర్జాయ్(29), ఇబ్రహీం జద్రాన్(25) రాణించారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దుబే ఒక్క వికెట్ సాధించాడు. కాగా దాదాపు 14 నెలల తర్వాత టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇండోర్ వేదికగా జనవరి 14న జరగనుంది. -
Ind vs Afg: రీఎంట్రీలో రోహిత్ డకౌట్! తప్పు తనదే అయినా..
Ind vs Afg 1st T20I Rohit Sharma Duck Out: అఫ్గనిస్తాన్‌తో తొలి టీ20లో టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన హిట్‌మ్యాన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయి పెవిలియన్ చేరాడు. పరుగుల ఖాతా తెరవకుండానే సున్నా చుట్టి నిష్క్రమించాడు. దీంతో టీమిండియా తరఫున రీఎంట్రీలో రోహిత్ బ్యాటింగ్ మెరుపులు చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశే ఎదురైంది. హిట్‌మ్యాన్ సైతం ఊహించని ఈ పరిణామంతో కంగుతిని గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసంతృప్తితో డగౌట్ చేరాడు. ఈ నేపథ్యంలో నెట్టింట రోహిత్ శర్మ పేరు వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘అయ్యో పాపం.. రోహిత్ దురదృష్టం కారణంగానే ఇలా జరిగింది’’ అని అభిమానులు అంటుండగా.. మరికొంత మంది నెటిజన్లు మాత్రం.. ‘‘చూసుకుని ఆడాలి కదా! సీనియర్.. పైగా రీఎంట్రీ.. కెప్టెన్ ఇలా బాధ్యతారహితంగా ఆడితే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి?’’ అని ట్రోల్ చేస్తున్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.బ్యాటింగ్‌కు దిగిన అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో రెండో బంతికే టీమిండియా రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. Nabi power 💪🔥 The Afghan veteran is striking them hard in the 1st #INDvAFG T20I! 🙌#IDFCFirstBankT20ITrophy #JioCinemaSports #GiantsMeetGameChangers pic.twitter.com/BMMMJEnB3G — JioCinema (@JioCinema) January 11, 2024 ఫజల్హక్ ఫారూకీ బౌలింగ్‌లో రోహిత్ మిడాఫ్ దిశగా షాట్‌కి యత్నించాడు. ఈ క్రమంలో పరుగు తీసేందుకు వెళ్లగా గిల్‌తో సమన్వయలోపం ఏర్పడింది. అప్పటికే అద్భుతరీతిలో డైవ్ చేసిన అఫ్గన్ కెపెన్ జద్రాన్ బంతి దాటిపోకుండా ఆపేశాడు. కానీ అప్పటికే క్రీజు వీడిన రోహిత్.. గిల్‌ను రమ్మని పిలవగా బంతిని ఫీల్డర్ అందుకోవడం చూసిన అతడు అక్కడే ఉండిపోయాడు. అయితే, తాను అవుట్ కావడంతో రోహిత్ శర్మ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.మరోవైపు.. జద్రాన్, వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్ కలిసి రోహిత్ రనౌట్‌లో పాలుపంచుకున్నారు. బిగ్‌వికెట్ దక్కడంతో అఫ్గన్ సంబరాలు అంబరాన్నంటాయి. -
పంజాబ్‌లో దారుణం: డ్రగ్స్‌కు బానిపై, సోదరుడి కుటుంబాన్ని హత్య చేసి
చండీగఢ్: డ్రగ్స్‌కు బానిసగా మారిన 28 ఏళ్ల యువకుడు సొంత సోదరుడి కుంటుంబాన్ని కిరాతకంగా హత్య చేశాడు. అన్న, అతని భార్యతో సహా రెండేళ్ల మేనల్లుడిని చంపి మృతదేహాలను కాలువలో పడేశాడు, ఈ దారుణ ఘటన మోహాలీ జిల్లాలోని ఖరార్ గ్లోబల్ సిటీలో జరిగింది. ఈ ఉదంతం గత మంగళవారం రాత్రి చోటుచేసుకోగా.. గురువారం రాత్రి వెలుగులోకి రావడం గమనార్హం. వివారలు.. బార్నాలాకు చెందిన సత్బీర్ సింగ్‌కు అమన్‌దీప్ కౌర్ అనే యువతితో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఉద్యోగరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సత్బీర్ సింగ్ తన కుటుంబంతో కలిసి గ్లోబల్ సిటీకి వచ్చి జీవిస్తున్నాడు. సత్బీర్ తన వ్యాపారాన్ని మంచిగా కొనసాగిస్తూ స్థిరపడటంతో అతని తమ్ముడు లఖ్బీర్కు ఈర్ష్యా కలిగింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సత్బీర్ తమ్ముడు లక్బీర్ ఇంటికి వచ్చాడు. అప్పటికే డ్రగ్స్‌కు బానిసైన లఖ్బీర్ తన సోదరుడిపై పగతో మంగళవారం రాత్రి ముందగా వదిన అమన్‌దీప్ కౌర్‌ను గొంతుకోసి హత్య చేశాడు. సత్బీర్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నింగా.. అతన్ని కూడా పదునైన ఆయుధంతో కొట్టి చంపాడు. అనంతరం పసికందు అనే జాలి లేకుండా దంపతుల రెండేళ్ల కుమారుడిని హత్య చేశాడు. ముగ్గురిని చంపిన తర్వాత.. సత్బీర్, అమన్‌దీప్ మృతదేహాలను రోపర్లోని సిర్హింద్ కాలువలోకి విసిరేశాడు. శిశువు మృతదేహాన్ని మొరిండా పట్టణం సమీపంలోని అదే కాలువలో పడేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడు లఖ్బీర్ను అదుపులోకి తీసుకొని మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మోరిండా సమీపంలోని కజౌలి గ్రామంలోని కాలువలో అమన్‌దీప్ కౌర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సత్బీర్, కొడుకు మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈ ట్రిపుల్ మర్డర్ వెనక సోదరుడిపై ద్వేషమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మాదక ద్రవ్యాలకు బానిసైన లఖ్బీర్.. జీవితం నాశనం చేసుకున్నాడు. సోదరుడు లైఫ్‌లో బాగా స్థిరపడటంతో అతనిపై కోపం పెంచుకొని ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు. -
Ind vs Aus: ఆదిలోనే వికెట్.. వీడియో వైరల్! షమీ ఎందుకు వెళ్లిపోయాడంటే?
India vs Australia, 1st ODI: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. తొలి వన్డేలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. మొహాలీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు తొలి ఓవర్లోనే షాకిచ్చాడు షమీ. బౌలింగ్ ఎటాక్ ఆరంభించిన అతడు.. నాలుగో బంతికే ఓపెనర్ మిచెల్ మార్ష్‌ను పెవిలియన్‌కు పంపాడు. గుడ్ లెంత్ డెలివరీతో మార్ష్‌ను బోల్తా కొట్టించాడు. బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ చేతిలో పడింది. ఎలాంటి పొరపాటుకు తావు లేకుండా.. బాల్‌ను గిల్ ఒడిసిపట్టగానే.. భారత శిబిరంలో నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తోంది. ఆనందం కాసేపే.. ఇదిలా ఉంటే.. టీమిండియాకు ఆదిలోనే వికెట్ దక్కినప్పటికీ.. వన్‌డౌన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 37, ఓపెనర్ డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీతో చెలరేగడంతో 18 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 98 పరుగులు స్కోరు చేసింది. కానీ.. మరుసటి రెండో బంతికే రవీంద్ర జడేజా వార్నర్(52)ను పెవిలియన్‌కు పంపడంతో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. షమీ ఎందుకు వెళ్లిపోయాడు? ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఏడు ఓవర్లు ముగిసిన తర్వాత మహ్మద్ షమీ మైదానం వీడాడు. మొహాలీలో ఎండ తీవ్రతకు తట్టుకోలేకే అతడు డ్రెస్సింగ్‌రూంకు వెళ్లిపోయినట్లు సమాచారం. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అతడు తిరిగి ఫీల్డ్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. చదవండి: WC 2023: సంజూను మర్చిపోవాల్సిందే!.. కుండబద్దలు కొట్టిన ద్రవిడ్ Early success for #TeamIndia! A wicket for @MdShami11 as Shubman Gill takes the catch. Australia lose Mitchell Marsh. Live - https://t.co/F3rj8GI20u… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/cNcwJeQiXN — BCCI (@BCCI) September 22, 2023 -
యూపీఎస్సీ పరీక్ష కంటే.. రాజకీయాలు కఠినం!
సాక్షి, హైదరాబాద్: ‘‘రాజకీయాల్లోకి వచ్చే యువ త క్షేత్రస్థాయి నుంచి పనిచేసి వస్తే విజయం సాధించే అవకాశం ఉంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నాకు తెలంగాణ ఉద్యమం ద్వారా ప్రజాక్షేత్రంలో క్షేత్ర స్థాయిలో పనిచేసేందుకు అవకాశం దొరికింది. రాజకీయాల్లో ప్రజా క్షేత్రంలో ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసిన దానికన్నా కఠినమైనది..’’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. పంజాబ్‌లో మొహాలీలోని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)’లో శుక్రవారం జరిగిన ‘అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ’కోర్సు ప్రారంభ సమావేశంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకుడిగా తన అనుభవాలను పంచుకున్నారు. వివరాలు కేటీఆర్ మాటల్లోనే.. ‘‘అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల కోసం దేశంలోని అన్ని ప్రభుత్వాలు నిధుల కొరత అనే అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొంటున్నాయి. రుణాలు తీసుకోకుండా ఉండాలన్న పాతకాలపు ఆలోచన ధోరణితో దేశం వెనుకబడుతోంది. రుణాలను భవిష్యత్తుపై పెట్టుబడిగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు భావిస్తున్నాయి. కానీ భారత్‌లో మాత్రం అనేక అపోహలు ఉన్నాయి. ఈ పరిస్థితి మారాలి. రాష్ట్రాల్లో అమలవుతున్న ఆదర్శ విధానాల నుంచి కేంద్రం స్ఫూర్తి పొందడానికి వెనకాడాల్సిన అవసరం లేదు. అధికారులు ఆ ఆలోచన వీడాలి ప్రభుత్వ పాలనలో శాశ్వతంగా ఉంటామనే ఆలోచన విధానం నుంచి అధికారులు బయటికి రావాలి. మారుతున్న పరిస్థితులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులతో కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకుల దూరదృష్టి గొప్పదైతే ప్రభుత్వ యంత్రాంగం కూ డా అదే స్ఫూర్తితో పనిచేస్తుందని తెలంగాణ తొ మ్మిదేళ్ల అనుభవం నిరూపించింది. నాయకత్వం అంటే ప్రతిరోజు నేర్చుకోవడమే. భవిష్యత్తు బాగుంటుందనే ఆశను ప్రజలకు కల్పించగలిగితే వారు ప్రభుత్వాలు, పార్టీలకు అండగా ఉంటారు. విజయం కోసం త్యాగాలు చేయాలనే భావనకు రాజకీయ నాయకులు మినహాయింపేమీ కాదు. విభిన్న రంగాల్లో అనుభవం కలిగిన నిపుణులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. దేశం తెలంగాణను అనుసరిస్తే..: గడిచిన దశాబ్ద కాలంలో తెలంగాణను ఇతర రాష్ట్రాలు, కేంద్రం అనుసరించి ఉంటే.. ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉండేది. ప్రజాస్వా మ్య పోరాటాలు, ఉద్యమాలతో ఏర్పాటైన తెలంగాణను ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి మా ర్గంలో నడపడంలో మేం విజయం సాధించాం. స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను అతి తక్కువ సమయంలో సాధించింది తెలంగాణ మాత్రమే’’అని కేటీఆర్ పేర్కొన్నారు. శాంతిభద్రతలు సవాల్‌గా మారుతున్నాయి దేశంలో ఎంత వైరుధ్యమున్నా సమైక్యంగానే ఉంటుందనే నమ్మకముంది. కానీ దేశంలో విభజన రాజకీయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో సుహృద్భావ వాతావరణంలో రాజకీయ పార్టీల మధ్య చర్చలు జరుగుతాయని భావించడం కొంత వాస్తవ దూరమే. మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడటం భవిష్యత్తులో అన్ని ప్రభుత్వాలకు పెద్ద సవాల్‌గా మారబోతోంది. -
ముంబై ప్రతీకారం.. పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 215 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఏడు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇషాన్ కిషన్ 75, సూర్యకుమార్ 66 పరుగులతో ముంబై ఇండియన్స్‌ను పటిష్ట స్థితిలో నిలపగా.. ఆఖర్లో టిమ్ డేవిడ్(10 బంతుల్లో 19 నాటౌట్), తిలక్ వర్మ(10 బంతుల్లో 26 నాటౌట్) ముంబైని విజయతీరాలకు చేర్చారు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్, రిషి ధవన్ చెరొక వికెట్ తీశారు. ఈ విజయంతో ముంబై సీజన్ ఆరంభంలో పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. ► ఇషాన్ కిషన్ 75 పరుగులు చేసి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రిషి ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 178 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. స్కై సంచలన ఇన్నింగ్స్‌కు తెర.. మూడో వికెట్ డౌన్ 31 బంతుల్లో 66 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో సూర్య అర్ష్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. కాగా మూడో వికెట్‌కు ఇషాన్ కిషన్, సూర్యకుమార్‌లు 116 పరుగులు జోడించారు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 75, టిమ్ డేవిడ్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. సూర్య, ఇషాన్‌లు అర్థసెంచరీలు.. విజయం దిశగా ముంబై సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లు ధాటిగా ఆడుతుండడంతో ముంబై లక్ష్యచేధనలో దూసుకెళ్తుంది. 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సూర్యకుమార్ 52, ఇషాన్ కిషన్ 57 పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 215.. 9 ఓవర్లలో ముంబై 80/2 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 30, సూర్యకుమార్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website ముంబై బౌలర్లు విఫలం.. పంజాబ్ 20 ఓవర్లలో 214/3 ముంబై బౌలర్ల వైఫల్యంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లయామ్ లివింగ్‌స్టోన్ (42 బంతుల్లో 82 పరుగులు నాటౌట్, ఏడు ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసానికి తోడు జితేశ్ శర్మ(27 బంతుల్లో 49 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. శిఖర్ ధావన్ 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. Photo Credit : IPL Website దంచికొడుతున్న లివింగ్‌స్టోన్.. 16 ఓవర్లలో 152/3 పంజాబ్ కింగ్స్ బ్యాటర్ లివింగ్‌స్టోన్ తొలిసారి తన విధ్వంసం ప్రదర్శిస్తున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ 49, జితేశ్ శర్మ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 13 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 120/2 13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ 28, జితేశ్ శర్మ 15 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website శిఖర్ ధావన్(30) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కెప్టెన్ శిఖర్ ధావన్(30 పరుగులు) పియూష్ చావ్లా బౌలింగ్‌లో స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్.. 9 పరుగులు చేసిన ప్రబ్‌సిమ్రన్ సింగ్ అర్షద్ ఖాన్ బౌలింగ్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 17/1గా ఉంది. Photo Credit : IPL Website టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం మొహలీ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వల్, అర్షద్ ఖాన్ పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ గత మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కిన ముంబై అదే కంటిన్యూ చేయాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు బలమైన సీఎస్కేను ఓడించి పంజాబ్ కింగ్స్ కూడా మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. గతంలో ఇరుజట్ల మధ్య 30 సార్ల తలపడగా.. చెరో 15 మ్యాచ్‌లు గెలిచాయి. ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌నే విజయం వరించింది. -
పంజాబ్, లక్నో మ్యాచ్‌కు పొంచిఉన్న ముప్పు.. ఏ క్షణమైనా!
ఐపీఎల్ 16వ సీజన్లో శుక్రవారం (ఏప్రిల్ 28) పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కు ముప్పు పొంచి ఉంది. వర్షం ముప్పు మాత్రం కాదు. కానీ ప్రస్తుతం అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానం కూడా ఉంది. విషయంలోకి వెళితే.. పంజాబ్, లక్నో మ్యాచ్‌కు నిహంగ్ సిక్కుల నుంచి ముప్పు పొంచి ఉండడమే దీనికి కారణం. పంజాబ్ కొన్ని రోజులుగా నిహంగ్ సిక్కుల ఆందోళన జరుగుతోంది. జైల్లో ఉన్న సిక్కు ఖైదీలను విడుదల చేయాలంటూ వీళ్లు నిరసన తెలుపుతున్నారు. నిహంగ్ సిక్కుల ఛీఫ్ బాపు సూరత్ సింగ్ ఖల్సా నిరాహార దీక్ష చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన దీక్షలోనే ఉన్నారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ ద్వారా వీళ్లు తమ నిరసన తీవ్రత ఎంతో తెలియజెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం అందింది. తమ డిమాండ్లు పంజాబ్ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఐపీఎల్ మ్యాచ్ ను అడ్డుకుంటామని కూడా ఇప్పటికే వాళ్లు అక్కడి అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు పంజాబ్, లక్నో మ్యాచ్ కు వీళ్ల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు నిర్వాహకులు భావిస్తున్నారు. ఒకవేళ వీళ్ల నిరసన కారణంగా ఈ మ్యాచ్ రద్దు చేస్తే.. పంజాబ్, లక్నో జట్లకు ఒక్కో పాయింట్ ఇస్తారు. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల టేబుల్లో పంజాబ్ కింగ్స్ ఆరోస్థానంలో ఉంది. ఏడు మ్యాచ్ లలో 4 గెలిచి, 3 ఓడిపోయింది. గత రెండు మ్యాచ్ ల నుంచి శిఖర్ ధావన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. కాగా ధావన్ నేడు లక్నోతో మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ వారం రోజుల తర్వాత మరో మ్యాచ్ ఆడుతోంది.గుజరాత్ టైటాన్స్‌తో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో 4 వికెట్లు పారేసుకొని ఓటమిని కొనితెచ్చుకుంది. పాయింట్ల పట్టికలో లక్నో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. చదవండి: స్వదేశానికి కేకేఆర్ క్రికెటర్.. ఆడింది ఒక్కటే మ్యాచ్! -
IPL 2023: హార్దిక్ పాండ్యాకు షాక్! ఈ సీజన్లో..
Punjab Kings vs Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ టీమిండియా ఆల్‌రౌండర్‌కు 12 లక్షల రూపాయల భారీ జరిమానా పడింది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందుకు ఐపీఎల్ నిర్వాహకులు ఈ చర్య తీసుకున్నారు. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌కిది తొలి తప్పిదం కావున 12 లక్షల ఫైన్‌తో సరిపెట్టారు. ఈ మేరకు శుక్రవారం ఐపీఎల్ నిర్వాహకులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా ఈ సీజన్లో బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, రాజస్తాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ తర్వాత జరిమానా ఎదుర్కొన్న మూడో కెప్టెన్ హార్దిక్ పాండ్యా. మూడో విజయం ఇదిలా ఉంటే.. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ బింద్రా స్డేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై గుజరాత్ విజయం సాధించింది. సొంతమైదానంలో ధావన్ సేనను 6 వికెట్ల తేడాతో ఓడించి తమ ఖాతాలో మూడో విజయం నమోదు చేసుకుంది. మోహిత్ మాయ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. రీఎంట్రీలో గుజరాత్ పేసర్ మోహిత్ శర్మ అదరగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేసి పంజాబ్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. అదరగొట్టిన గిల్ ఇక పంజాబ్ విధించిన లక్ష్యానికి బదులిచ్చేందుకు బరిలోకి దిగిన గుజరాత్ ఆఖరి బంతి వరకు విజయం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (30) రాణించగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్(67)తో ఆకట్టుకున్నాడు. అయితే, ఆఖర్లో గెలుపు సమీకరణం ఉత్కంఠ రేపగా.. ఓ బంతి మిగిలి ఉండగానే ఫినిషర్ రాహుల్ తెవాటియా బౌండరీ బాది గుజరాత్ గెలుపును ఖరారు చేశాడు. చదవండి: ఒకప్పుడు పర్పుల్ క్యాప్ విన్నర్.. తర్వాత నెట్‌బౌలర్! 6.5 కోట్ల నుంచి 50 లక్షల ధరకు.. వాళ్లదే పైచేయి; డెత్ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: మార్కరమ్ -
BGT 2023: బిగ్ న్యూస్.. భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ వేదిక మార్పు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి బిగ్ న్యూస్ లీకైంది. సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 1 నుంచి ధర్మశాల వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ వేదిక మారే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐలోని ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు.. మార్చి 1 నుంచి 5 వరకు జరగాల్సిన మూడో టెస్ట్ మ్యాచ్ ధర్మశాలలో జరిగేది అనుమానమని తెలుస్తోంది. ధర్మశాల స్టేడియంలో రెనొవేషన్ (పునరుద్ధరణ) పనులు జరుగుతున్నాయని, మార్చి 1 నాటికి అవి పూర్తవుతాయా.. లేదా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారిందని సదరు అధికారి తెలిపాడు. ఈనెల (ఫిబ్రవరి) 3న బీసీసీఐ బృందం నిర్వహించిన తనిఖీల్లో ఔట్ ఫీల్డ్‌తో పాటు పిచ్ సైడ్ ఏరియా పూర్తిగా సిద్ధంగా లేదని తేలిందని వివరించాడు. అయితే టెస్ట్ ప్రారంభానికి మరో మూడు వారాల సమయం ఉందని, ఆలోపు పెండింగ్ పనులను పూర్తి చేస్తామని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్పీసీఏ) హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. మూడో టెస్ట్‌కు బ్యాకప్‌గా మరో ఐదు స్టేడియాలు ఎంపిక చేసినట్లు వివరించాడు. మూడో టెస్ట్ మొహాలీలో జరిగేందుకు ఎక్కువ ఛాన్స్‌లు ఉన్నట్లు సదరు అధికారి తెలిపాడు. కాగా, స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొద్దిరోజుల క్రితమే ధర్మశాలలో పాత పిచ్‌ను తొలగించి కొత్తది తయారు చేశారు. వర్షం కురిస్తే మ్యాచ్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను కొత్త డ్రైనేజీ వ్యవస్థను అమర్చారు. దీంతో పాటు గ్రౌండ్లో స్ప్రింక్లర్లను కూడా ఫిట్ చేశారు. ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధర్మశాలలో మూడో టెస్ట్ జరిగేది అనుమానంగా మారింది. ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఇటీవల ముగిసిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. -
అత్యాచార బాధితురాలి నుంచి లంచం తీసుకున్న మహిళా పోలీస్..
చండీగఢ్: పంజాబ్ మొహాలీలో ఓ మహిళా పోలీస్ అధికారి అత్యాచార బాధితురాలి నుంచి లంచం తీసుకుంది. నిందితుడిపై కేసు నమోదు చేసేందుకు రూ.20వేలు వసూలు చేసింది. స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఏఎస్ఐ డబ్బు తీసుకున్న దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఏఎస్ఐ పర్వీన్ కౌర్ లంచం తీసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని డీఎస్పీ దర్పణ్ అహ్లూవాలియా పేర్కొన్నారు. విజిలెన్స్ బ్యూరో దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. పర్వీన్ కౌర్ పోలీస్ లైన్స్‌లో విధులు నిర్వహిస్తోంది. తనపై అత్యాచారం జరిగిందని ఓ బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. నిందుతుడ్ని అరెస్టు చేయాలండే డబ్బు ఇవ్వాల్సిందేనని ఏఎస్ఐ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితురాలు డబ్బు ఇచ్చింది. చదవండి: ఈ డాక్టర్ టెన్త్ ఫెయిల్.. భారీగా ఫీజులు.. రోగం ముదిరిందంటే చాలు.. -
రూ.3 కోట్ల బెంట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన పేరెంట్స్.. తుపాకీతో కొడుకు హల్చల్!
చండీగఢ్: తల్లిదండ్రులు బెంట్లీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన సంతోషంలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన పంజాబ్‌లోని మొహాలీలో జరిగింది. వీడియో వైరల్‌గా మారిన క్రమంలో యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.యువకుడిని మొహాలీలోని ఖరార్ ప్రాంతానికి చెందిన శుభమ్ రాజ్‌పుత్‌గా గుర్తించారు. రూ.3 కోట్లకు పైగా విలువైన లగ్జరీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన క్రమంలో చుట్టూ జనం ఉన్నప్పటికీ అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని గన్ లైసెన్స్ ఉందా? ఉంటే ఎవరి పేరుపై ఉంది అనే విషయాలపై దర్యాప్తు చేపట్టామన్నారు. వీడియో ప్రకారం.. బెంట్లీ కారు ముందు నిలుచున్న యువకుడు తుపాకీతో గాల్లోకి రెండు సార్లు కాల్పులు జరిపాడు. అతడి చుట్టూ పలువురు ఉన్నారు. వారంతో ఫోన్లలో వీడియో తీసుకోవటంలోనే నిమగ్నమయ్యారు. ఈ వీడియోను ఫ్రీ ప్రెస్ జర్నల్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘తల్లిదండ్రులు బెంట్లీ కారు ఇచ్చిన సంతోషంలో మొహాలీ యువకుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.’ అని పేర్కొంది. సమావేశాలు, మతపరమైన ప్రాంతాలు, వివాహాల వంటి సందర్భాల్లో వేడుకలో భాగంగా ఫైరింగ్ చేయటం క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. లైసెన్స్ గన్‌తోనూ కాల్పులు చేయకూడదు. ఎవరికి ఎలాంటి గాయం కానప్పటికీ శిక్షార్హమే. ఆయుధాల చట్ట సవరణ ప్రకారం.. ప్రజా కార్యక్రమాల్లో ఆయుధాలు ఉపయోగించకూడదు. చాలా సందర్భాల్లో ఇలాంటి కాల్పులు మరణాలకు దారి తీశాయి. #Punjab: Elated after being gifted a Bentley car from his parents, Mohali youth opens fires in the air; booked after video went viral on social media.#Viral #bentley #Car #Gift #Boy #Mohali #India #ViralVideo #fire pic.twitter.com/wjGAFkJEVo — Free Press Journal (@fpjindia) October 18, 2022 ఇదీ చదవండి: బాణసంచా కొన్నా, కాల్చినా 6 నెలల జైలు! -
INDvsAUS : తొలి టీ20లో ఆస్ట్రేలియా విజయం (ఫొటోలు)
-
Ind Vs Aus: మ్యాచ్‌కు ముందు కోహ్లికి స్పెషల్ గిఫ్ట్! వీడియో వైరల్
India Vs Australia T20 Series 2022- Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ‘రన్‌మెషీన్’కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఒక్కసారి కోహ్లిని నేరుగా కలిస్తే చాలని ఆశపడుతూ ఉంటారు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నేపథ్యంలో ఇలాంటి ఓ మహిళా అభిమాని ఆశ నెరవేరింది. కోహ్లికి స్పెషల్ గిఫ్ట్! టీమిండియా స్వదేశంలో ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. మొహాలీ వేదికగా మంగళవారం(సెప్టెంబరు 20) ఇరు జట్లు మొదటి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా ప్రాక్టీసు సెషన్‌కు వచ్చిన కోహ్లిని కలిసే అవకాశం వచ్చింది ఓ లేడీ ఫ్యాన్‌కు! అంతేకాదు.. కోహ్లి ముఖ చిత్రంతో ఉన్న ఫ్రేమ్‌ను కూడా అతడికి అందించి మురిసిపోయిందామె! ఇందుకు సంబంధించిన వీడియోను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా గత కొంతకాలంగా నిలకడ లేమి ఫామ్‌తో ఇబ్బంది పడ్డ కోహ్లి ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో రాణించిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ కెరీర్లో 71వ సెంచరీ నమోదు చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ అందించాడు. ఇదే జోష్‌లో టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సిద్ధమవుతున్నాడు. అంతకంటే ముందు ఆసీస్‌తో సిరీస్ నేపథ్యంలో.. విలువైన ఇన్నింగ్స్‌కు ఆడేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. చదవండి: Ind Vs Aus T20 Series: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్, జట్లు.. ఇతర వివరాలు! Ind Vs Aus: అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ! రెండు భారీ షాట్లు కొడితే.. View this post on Instagram A post shared by Punjab Cricket Association (@pcacricketassociation) -
Ind Vs Aus: నెట్స్‌లో చెమటోడుస్తున్న కోహ్లి! బలహీనత అధిగమించేలా
India Vs Australia T20 Series- Virat Kohli- Mohali: ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. మొహాలీ వేదికగా మంగళవారం(సెప్టెంబరు 20) ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆటగాళ్లంతా మొహాలీ చేరుకున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆసీస్‌తో సిరీస్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాడు. ఇందుకోసం నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. ముఖ్యంగా పుల్షాట్ల విషయంలో తన బలహీనతను అధిగమించేలా కోహ్లి ప్రాక్టీసు సాగినట్లు సమాచారం. 45 నిమిషాల పాటు.. ఇందుకు సంబంధించిన వీడియోను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ట్విటర్లో షేర్ చేసింది. కాగా కోహ్లి దాదాపు 45 నిమిషాల పాటు నెట్స్‌లో గడిపినట్లు తెలుస్తోంది. ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కొంటూ.. పుల్‌షాట్లు ఆడేందుకు కోహ్లి ప్రయత్నించాడు. ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇక గత కొన్నాళ్లుగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడిన కోహ్లి ఆసియాకప్-2022 టీ20 టోర్నీలో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ కెరీర్లో 71వ సెంచరీ.. టీ20 ఫార్మాట్లో తొలి శతకం సాధించాడు. అదే విధంగా ఈ ఈవెంట్లో టీమిండియా తరఫున టాప్ స్కోరర్(276 పరుగులు)గా నిలిచాడు. ఇదే జోష్‌లో టీ20 వరల్డ్‌కప్-2022కు సన్నద్ధమవుతున్నాడు. అంతకంటే ముందు.. ఈ మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న టీ20 సిరీస్‌లో ఆడనున్నాడు కోహ్లి. ఇక అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ఈవెంట్ జరుగనుంది. చదవండి: Yuvraj Singh Six 6s: యువీ సిక్స్ సిక్సర్ల విధ్వంసానికి 15 ఏళ్లు.. కన్నార్పకుండా చూస్తూ మరీ! An absolute treat😍 Watch @imVkohli dedicatedly practicing his shots in the nets today during practice session@gulzarchahal @BCCI @CricketAus #gulzarchahal #1stT20I #pca #pcanews #punjabcricket #punjab #cricket #teamindia #indiancricketteam #punjabcricketnews #cricketnews pic.twitter.com/ZKrCldbKbg — Punjab Cricket Association (@pcacricket) September 18, 2022 -
Ind Vs Aus: యువీ, భజ్జీకి సముచిత గౌరవం.. ఆసీస్‌తో తొలి టీ20కి ముందు..
Ind Vs Aus 1st T20- మొహాలి: భారత క్రికెట్లో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) సముచిత రీతిలో గౌరవించనుంది. మొహాలి స్టేడియంలో రెండు స్టాండ్లకు ఈ ఇద్దరు ఆటగాళ్ల పేర్లు పెడుతున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మంగళవారం తొలి టి20 మ్యాచ్‌కు ముందు ఈ స్టాండ్స్‌ను ఆవిష్కరిస్తారు. యువరాజ్ భారత్ తరఫున 40 టెస్టుల్లో 1,900, 304 వన్డేల్లో 8,701, 58 టి20ల్లో 1,117 పరుగులు చేయడంతో పాటు 148 వికెట్లు కూడా పడగొట్టాడు. హర్భజన్ 103 టెస్టుల్లో 417... 236 వన్డేల్లో 269... 28 టి20ల్లో 25 వికెట్లు పడగొట్టడంతో పాటు మూడు ఫార్మాట్లలో కలిపి 3,569 పరుగులు సాధించాడు. చదవండి: కోహ్లి ప్రత్యామ్నాయ ఓపెనర్: రోహిత్ శర్మ -
విద్యార్థినుల వీడియోల లీక్ దుమారం.. ఫోన్లో నాలుగు ఆమెవే!
చండీగఢ్: అభ్యంతరకర వీడియోల వ్యవహారం పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని చండీగఢ్ యూనివర్సిటీలో తీవ్ర అలజడి సృష్టించింది. యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థిని.. పలువురు విద్యార్థినుల ప్రైవేట్ వీడియోలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించి, మరో యూనివర్సిటీలో చదివే తన స్నేహితుడికి పంపించిందని, అతను వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడని, మొత్తంగా 60కి పైనే వీడియోలు వైరల్ అవుతున్నాయంటూ పుకార్లు గుప్పుమన్నాయి. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థినులు యూనివర్సిటీ ప్రాంగణంలో బైఠాయించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థినులు శనివారం అర్ధరాత్రి నుంచి వర్సిటీ ప్రాంగణంలోకి ఆందోళన కొనసాగించారు. వారి నినాదాలతో వర్సిటీ అట్టుడికిపోయింది. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ హాస్టల్ వార్డెన్ వీడియో లీకేజీల గురించి సదరు యువతిని నిలదీయడం.. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ మొత్తం వ్యవహారం మొదలైంది. అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతంలో.. పుకార్లను నమ్మవద్దంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు పోలీసులు. వ్యక్తిగత వీడియోలు లీకైనట్లు వార్తలు వచ్చాక కొందరు విద్యార్థినులు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఆత్మహత్యాయత్నంలో పలువురి పరిస్థితి విషమయంగా ఉందంటూ సోషల్ మీడియాలో కొందరు పెట్టిన పోస్టులను పోలీసులు ఖండించారు. అలాంటిదేమీ జరగలేదన్నారు. ఒక విద్యార్థిని మాత్రం ఆందోళనకు గురై కుప్పకూలిపోగా వెంటనే ఆసుపత్రికి తరలించామని, ఆమె పరిస్థితి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని వెల్లడించారు. ఈ ఉదంతంలో ఎవరూ చనిపోలేదని.. పుకార్లు నమ్మొద్దని విద్యార్థినులకు సూచించారు. ఈ కేసులో యువతితో పాటు షిమ్లాకు చెందిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను, ఓ బేకరీలో పని చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాయ్‌ఫ్రెండ్‌కు వీడియో పంపిన విద్యార్థిని యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్న ఒక విద్యార్థిని బాత్రూంలో స్నానం చేస్తూ తన ఫోన్లో రికార్డు చేసుకొని, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌కు(ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకుడు) పంపించినట్లు యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. అయితే.. ఆమె ఫోన్లోని అభ్యంతరకర వీడియోలను చూసిన సహచర విద్యార్థినులు, ఆమె తమవి కూడా రికార్డు చేసి అలాగే పంపి ఉంటుందని ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో మొదలైన అనుమానం.. పెనుదుమారాన్నే లేపింది. నిందితురాలిని అరెస్టు చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను కూడా హిమాచల్ ప్రదేశ్‌లో అరెస్టు చేశామని అదనపు డీజీపీ గురుప్రీత్‌కౌర్ దేవ్ తెలిపారు. ఇప్పటిదాకా దర్యాప్తులో నిందితురాలికి చెందిన ఫోన్లో ఆమెకు సంబంధించిన నాలుగు వీడియోను గుర్తించామన్నారు. ఇతర విద్యార్థినుల వీడియోలను రికార్డు చేయలేదన్నారు. అయితే.. సదరు యువతి తమను బాత్రూంలో ఉండగా దొంగచాటుగా ఫొటోలు తీసిందని ఆరోపిస్తున్నారు కొందరు విద్యార్థులు. అలాగే వార్డెన్ ఆమెను నిలదీస్తున్నట్లు వైరల్ అయిన వీడియోపై కూడా స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు డీజీపీ తెలిపారు. పోలీసులను నమ్మాలా? అయితే ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, నిజాలను తొక్కిపెడుతున్నారని యూనివర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధితుల తరపున పోరాడుతున్న తమపై పోలీసులు లాఠీచార్జి చేశారని మండిపడ్డారు. అయితే, వాళ్లను కట్టడి చేసేందుకు లాఠీచార్జ్ ప్రయోగించాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. అంతేకాదు.. వీడియోల విషయంలో ఏమాత్రం వాస్తవం లేదని, కేవలం ఒక విద్యార్థినికి చెందిన వీడియోలు మాత్రమే లీకైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. మన బిడ్డలే మనకు గర్వకారణమని, ఈ మొత్తం ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశించారు. ఊహాగానాలను విశ్వసించవద్దని సూచిస్తూ ట్వీట్ చేశారు. అభ్యంతరకర వీడియోల వ్యవహారంపై పారదర్శకంగా దర్యాప్తు జరిపించాలని, నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని పంజాబ్‌లోని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విద్యార్థినులను మానసిక వేదనకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ‘ఆప్’ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కఠిన చర్యలు: మహిళా కమిషన్ చండీగఢ్ వర్సిటీ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) స్పష్టం చేసింది. నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని పంజాబ్ డీజీపీ, చండీగఢ్ వర్సిటీ వైస్ చాన్సలర్‌కు కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ లేఖ రాశారు. విద్యార్థినుల ప్రైవేట్ వీడియో లీకైనట్లు వచ్చిన వార్తలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ మనీశా గులాజీ వెల్లడించారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ స్పందించారు. ఇది దురదృష్టకర సంఘటన, అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మన సోదరీమణులకు అండగా నిలవాలని ట్విట్టర్లో సూచించారు. ఇది మనందరికీ పరీక్షా సమయమని పేర్కొన్నారు. రెండు రోజులు సెలవులు క్యాంపస్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో యూనివర్సిటీకి సోమవారం, మంగళవారం అధికారులు సెలవులు ప్రకటించారు. దీనిపై విద్యార్థినులు మండిపడ్డారు. ఏ తప్పూ జరగకపోతే సెలవులు ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. ఈ ఉదంతంపై లోతైన దర్యాప్తు కోసం సీనియర్ మహిళా ఐపీఎస్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వీడియోల అంశంపై ఐపీసీ సెక్షన్ 354–సి, ఐటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, విచారణ కొనసాగుతోందని అన్నారు. ఇదీ చదవండి: ఫుల్‌గా తాగి.. స్నేహితుడిపై ఆటో ఎక్కించేశాడు! -
తొలి టీ20 కోసం భారత్, ఆస్ట్రేలియా జట్ల సాధన (ఫొటోలు)
-
Ind Vs Aus: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్, జట్లు.. ఇతర వివరాలు!
Australia tour of India, 2022- India Vs Australia T20 Series: టీ20 ప్రపంచకప్-2022కు ముందు టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం కంగారూ జట్టు గురువారం భారత్‌కు చేరుకుంది. ఐసీసీ మెగా ఈవెంట్‌కు ముందు జరుగనున్న ఈ సిరీస్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక డేవిడ్ వార్నర్ మినహా.. ప్రపంచకప్ జట్టులోని మిగతా ఆసీస్ ఆటగాళ్లంతా రోహిత్ సేనతో సిరీస్‌లో పాల్గొననున్న విషయం తెలిసిందే. అయితే, మిచెల్ మార్ష్, మార్కస్ స్టొయినిస్, మిచెల్ స్టార్క్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. నాథన్ ఎలిస్, డేనియల్ సామ్స్, సీన్ అబాట్‌లు వారి స్థానాలను భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో భారత్- ఆసీస్ పోరు ఎప్పుడు ఆరంభం కానుంది? పూర్తి షెడ్యూల్, మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలు, జట్ల వివరాల తాజా అప్డేట్లు, తదితర అంశాలు పరిశీలిద్దాం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా- మూడు టీ20 మ్యాచ్‌లు మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ఆరంభం మొదటి టీ20 సెప్టెంబరు 20- మంగళవారం- పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం, మొహాలి రెండో టీ20 సెప్టెంబరు 23- శుక్రవారం, విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్‌పూర్ మూడో టీ20 సెప్టెంబరు 25- ఆదివారం- రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ మ్యాచ్ ప్రసారాలు, లైవ్ స్ట్రీమింగ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్‌స్ట్రీమింగ్ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా. అప్డేట్: షమీకి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. టీమిండియాతో సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, డేనియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, ఆడం జంపా. చదవండి: 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ T20 World Cup 2022: జట్టును ప్రకటించిన అఫ్గనిస్తాన్.. యువ బౌలర్ ఎంట్రీ -
కొడుకు శవంతో 4 రోజులు వృద్ధుడి సహవాసం.. దుర్వాసన రావటంతో..!
చండీగఢ్: పిల్లలు లేకపోవటంతో బాలుడిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు ఓ 82 ఏళ్ల వృద్ధుడు. అమాయకత్వం, ఇతరులతో కలుపుగోలుగా ఉండకపోవటంతో పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. అయితే, అనారోగ్యంతో దత్తత తీసుకున్న కుమారుడు నాలుగు రోజుల క్రితం మృతి చెందగా.. ఏం చేయాలో తెలియని వృద్ధుడు శవం వద్దే ఉండిపోయాడు. నాలుగు రోజుల తర్వాత ఇంట్లోంచి దుర్వాసన రావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అపస్మారక స్థితిలో మృతదేహం వద్ద పడిపోయి ఉన్న వృద్ధుడిని సోమవారం రక్షించి ఆసుపత్రికి తరలించారు. ‘సమాచారం అందుకోవటంతో అక్కడికి వెళ్లి ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాం. మృతదేహం వద్దే వృద్ధుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆయన ఏమీ చెప్పటం లేదు. మాట్లాడే పరిస్థితి కనిపించటం లేదు. ఆయనకు అంతగా ఏమీ తెలిసేలా కనిపించటం లేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.’ అని పోలీసు అధికారి పాల్ చంద్ తెలిపారు. కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు చెప్పారు. మృతి చెందిన సుఖ్విందర్ సింగ్ అనే వ్యక్తి బల్వాంత్ సింగ్‌కు దత్తపుత్రుడిగా స్థానికులు తెలిపారు. ‘వారిని ఇటీవల ఎవరైనా పలకరించారా అనే విషయం తెలియదు. గత నెల రోజులకుపైగా వృద్ధుడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడడు. దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చింది. ఏం జరిగిందో మాకు తెలియదు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పాం.’ అని వెల్లడించారు స్థానికులు. ఇదీ చదవండి: చెల్లి శవంతో 4 రోజులు సహవాసం.. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. -
మీకు నేనున్నా.. హామీ ఇస్తున్నా: కేజ్రీవాల్
మొహాలి: ‘నన్ను మీ సోదరుడిగా భావిస్తే, దయచేసి కిందకు దిగండి. మేము త్వరలో పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. తర్వాత మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాము’ అంటూ పంజాబ్‌లోని కాంట్రాక్టు టీచర్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీయిచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మొహాలీలో ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడారు. కేజ్రీవాల్ వాహనంపై ఎక్కి పైకి చూస్తూ వారితో మైక్‌లో సంభాషించారు. కిందకు దిగి రావాలని వారిని కోరారు. ‘మీరు ఎంతకాలం నుంచి నిరసనలు చేస్తున్నారు?’ అని కేజ్రీవాల్ ప్రశ్నించగా.. దానికి వారు ‘సార్, 45 రోజులు’ అని బదులిచ్చారు. కాంట్రాక్టు టీచర్ల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ‘విచారకరమైన విషయం ఏమిటంటే, ఢిల్లీలోని ఉపాధ్యాయులను శిక్షణ కోసం ఇంగ్లండ్, స్వీడన్ దేశాలకు పంపుతున్నాము. పంజాబ్‌లోని కాంగ్రెస్ సర్కారు వారిని ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులకు పంపుతోంద’ని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో విద్యావ్యవస్థను పూర్తిగా సంస్కరించామని, ఈ ఘనత ఉపాధ్యాయులకే దక్కుతుందని అన్నారు. పర్మినెంట్ ఉద్యోగాలు, మెరుగైన జీతాల కోసం చాలా కాలంగా కాంట్రాక్టు టీచర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం పంజాబ్ ఎడ్యుకేషన్ బోర్డ్ వెలుపల టీచర్లు భారీ ఎత్తున నిరసనకు దిగారు. ఎన్నికల్లో తమకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కొంతమంది ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కారు. విషయం తెలుసుకున్న కేజ్రీవాల్ అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. పంజాబ్‌లో తాము అధికారంలోని వస్తే కాంట్రాక్టు టీచర్ల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. (చదవండి: ముఖ్యమంత్రి దాతృత్వం.. అతని కలను సాకారం చేశారు) ‘కెప్టెన్ అమరీందర్ సింగ్, బాదల్ సహా పలువురు ముఖ్యమంత్రులు ఉపాధ్యాయులకు గతంలో ఇవే హామీలు ఇచ్చారని విన్నాను. ఆ ట్రెండ్‌ని అనుసరించడానికి నేను ఇక్కడకు రాలేదు. ఢిల్లీలోని విద్యావ్యవస్థను సంస్కరించిన తీరు గురించి మీరు వినే ఉంటారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు గణనీయంగా మారిపోయాయి. ఇదంతా అది మా టీచర్ల గొప్పతనమే. నేను చేయాల్సిందల్లా వారి సమస్యలను పరిష్కరించడమే. పంజాబ్‌లోని కాంట్రాక్టు ఉపాధ్యాయుల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తానని నేను హామీ ఇస్తున్నాను’ అని కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. (చదవండి: మాటంటే మాటే.. ‘డ్యూటీలో ఉన్నా లేకున్నా మందు ముట్టం, ఆన’) -
భారత యువ షూటర్ అనుమానాస్పద మృతి
మొహలీ: భారత షూటర్ 28 ఏళ్ల నమన్వీర్ సింగ్ బ్రార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మొహలీలోని సెక్టార్ 71లో తన ఇంట్లో నమన్వీర్ సింగ్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే నమన్ వీర్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక ప్రమాదవశాత్తూ తుపాకీ పేలిందా అన్నది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని మొహలీ డీఎస్పీ గుర్షేర్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఢిల్లీ షూటింగ్ వరల్డ్ కప్ లో కనీస అర్హత స్కోరు విభాగంలో నమన్వీర్‌సింగ్ నాలుగోస్థానంలో నిలిచాడు. అలాగే 2015లో దక్షిణ కొరియాలోని గ్వాంగ్జౌలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో డబుల్ ట్రాప్ షూటింగ్ ఈవెంట్లో నమన్వీర్ కాంస్య పతకం సాధించాడు. చదవండి: అంతా నాలుగు నెలల్లోనే... అనామక ప్లేయర్ నుంచి చాంపియన్ దాకా! PELE: ఐసీయూలో ఫుట్‌బాల్ దిగ్గజం.. -
ఆ ఒక్కటి కూడా కాంగ్రెస్‌కే: బీజేపీకి సున్నా
చంఢీగడ్: పంజాబ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఏడింటిలో విజయం సాధించగా ఒక కార్పొరేషన్ ఫలితం తేలలేదు. తాజాగా గురువారం ఆ ఫలితం కూడా తేలింది. ఆ ఒక్కటి కూడా కాంగ్రెస్‌లో చేరింది. మొహలీలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది కార్పొరేషన్‌ను సొంతం చేసుకుంది. మొత్తం 8 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించగా మొత్తం 7 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగిలిన ఒక స్థానంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. అది కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చేదు అనుభవం ఎదురైంది. అధికార పక్షానికి గట్టి పోటీ కూడా ఇవ్వలేక బీజేపీ చతికిలపడింది. శిరోమణి అకాలీ దళ్(ఎస్ఏడీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. కొన్నిచోట్ల ఆ పార్టీలు తమ ఉనికిని చాటుకున్నాయి. మొహలీ కార్పొరేషన్లో 37 వార్డులను కాంగ్రెస్ సొంతం చేసుకోగా మిగిలిన 13 స్థానాలు స్వతంత్రులు భర్తీ చేశారు. ఇక మరో కార్పొరేషన్ మోగాలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో ఈ కార్పొరేషన్ కూడా అధికార పార్టీ ఖాతాలోకే వెళ్లనుంది. దీనితో కలిపి జరిగిన మొత్తం 8 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ వశమయ్యాయి. -
హెర్బల్ టీతో కరోనాకి చెక్!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్‌కు చెక్‌పెట్టే ఏ ఔషధాన్ని కనిపెట్టలేదు. మాస్క్‌లు, శానిటైజర్లు వాడటం, భౌతిక దూరం పాటించడం వల్ల ఈ మహమ్మరి నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు. కరోనాపై పోరాటంలో భాగంగా మొహాలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ రీసెర్చ్(ఎన్ఐపీఈఆర్) సెఫ్టీ డివైజ్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు తయారు చేస్తూ అండగా నిలుస్తోంది. (శుభపరిణామం: మరింత పెరిగిన రికవరీ) అయితే ఇప్పుడు తాజా కరోనాతో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీని తయారు చేసింది. ఇంతవరకు కరోనాకు ఎటువంటి మందు లేకపోవడంతో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా మాత్రమే మనం కరోనాతో పోరాడగలం. మనకి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోగలుగుతాం. ఈ హెర్బల్ టీని స్థానికంగా అందుబాటులో ఉండే ఆరు రకాల హెర్బల్స్ అశ్వగంధ, తిప్పతీగ, ములేటి, తులసి, గ్రీన్‌టీని ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. వీటిని తగిన పాళ్లలో కలిపి ఈ హెర్బల్ టీని తయారు చేసుకోవాలి. దీనిని రోజుకు మూడు సార్లు తీసుకోవడం ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. (నాలాగా కోవిడ్ బారిన పడకండి: ఎమ్మెల్యే)