రంజీ ట్రోఫీలో భాగంగా నేటి (శనివారం) నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ జట్టు కర్ణాటకతో తలపడనుంది.
మొహాలీ: రంజీ ట్రోఫీలో భాగంగా నేటి (శనివారం) నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ జట్టు కర్ణాటకతో తలపడనుంది. గ్రూప్ దశలో కర్ణాటక చేతిలో పరాజయం పొందిన పంజాబ్ ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. కర్ణాటక జట్టు కెప్టెన్ వినయ్ కుమార్, ఓపెనర్ కౌల్, ఉతప్ప, మనీష్ పాండే, మిథున్‌లతో పటిష్టంగా ఉంది.
ఆత్మవిశ్వాసంతో మహారాష్ట్ర
ఇండోర్: పటిష్ట బ్యాటింగ్ లైనప్‌తో కూడిన మహారాష్ట్ర, నాణ్యమైన బౌలర్లు కలిగిన బెంగాల్ జట్ల మధ్య నేటి నుంచే మరో సెమీస్ జరుగనుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబైని క్వార్టర్స్‌లో మట్టికరిపించిన మహారాష్ట్ర ఆత్మవిశ్వాసంతో ఉంది.