
మొహాలీ: పంజాబ్‌లోని మొహాలీ(Mohali)లో దారుణం చోటుచేసుకుంది. చిన్నపాటి వివాదం హత్యకు దారితీసింది. మొహాలీ లోని సెక్టార్-66లో బైక్ పార్కింగ్ విషయమై జరిగిన వివాదంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐసర్)కు చెందిన సైంటిస్టు హత్యకు గురయ్యారు.
ఈ ఘటనా క్రమమంతా అక్కడి సీసీ టీవీలో రికార్డయ్యింది. మృతుడిని సైంటిస్టు(Scientist) అభిషేక్ స్వర్ణకార్(30)గా గుర్తించారు. ఇతని స్వస్థలం జార్ఖండ్. పొరుగింట్లో ఉంటున్న మోంటీ అనే వ్యక్తి అభిషేక్‌పై దాడి చేశాడని, ఈ నేపద్యంలో అభిషేక్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అభిషేక్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారునికి ఇటీవలే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ జరిగిందని, ప్రస్తుతం డయాలసిస్ కొనసాగుతున్నదని వారు తెలిపారు.
అభిషేక్ తన తల్లిదండ్రులతో పాటు సెక్టార్-66లోని ఒక అద్దె ఇంటిలో ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం 8 గంటల సమయంలో అతను వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతని పొరుగింటిలో ఉంటున్న మోంటీతో వివాదం చెలరేగింది. ఈ సమయంలో మోంటీ తన ఎదురుగా ఉన్న అభిషేక్‌పై దాడి చేశాడు. అతని పొట్ట, ఛాతీపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో అభిషేక్ బాధతో విలవిలలాడుతూ కిందపడిపోయాడు. దీనిని గమనించిన అభిషేక్ కుటుంబ సభ్యులు అతనిని ఆస్పత్రి(Hospital)కి తరలించారు. అక్కడి వైద్యులు అప్పటికే అభిషేక్ మృతిచెందాడని నిర్ధారించారు. సీసీటీవీలో లభ్యమైన ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Holi 2025: ఈ దేశాల్లోనూ అంబరాన్నంటే హోలీ వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment