యువరాజ్ సింగ్- హర్భజన్ సింగ్(ఫైల్ ఫొటోలు)
Ind Vs Aus 1st T20- మొహాలి: భారత క్రికెట్‌లో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) సముచిత రీతిలో గౌరవించనుంది. మొహాలి స్టేడియంలో రెండు స్టాండ్లకు ఈ ఇద్దరు ఆటగాళ్ల పేర్లు పెడుతున్నారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య మంగళవారం తొలి టి20 మ్యాచ్‌కు ముందు ఈ స్టాండ్స్‌ను ఆవిష్కరిస్తారు. యువరాజ్ భారత్ తరఫున 40 టెస్టుల్లో 1,900, 304 వన్డేల్లో 8,701, 58 టి20ల్లో 1,117 పరుగులు చేయడంతో పాటు 148 వికెట్లు కూడా పడగొట్టాడు. హర్భజన్ 103 టెస్టుల్లో 417... 236 వన్డేల్లో 269... 28 టి20ల్లో 25 వికెట్లు పడగొట్టడంతో పాటు మూడు ఫార్మాట్‌లలో కలిపి 3,569 పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment