
India Vs Australia T20 Series 2022- Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ‘రన్‌మెషీన్’కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఒక్కసారి కోహ్లిని నేరుగా కలిస్తే చాలని ఆశపడుతూ ఉంటారు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నేపథ్యంలో ఇలాంటి ఓ మహిళా అభిమాని ఆశ నెరవేరింది.
కోహ్లికి స్పెషల్ గిఫ్ట్!
టీమిండియా స్వదేశంలో ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. మొహాలీ వేదికగా మంగళవారం(సెప్టెంబరు 20) ఇరు జట్లు మొదటి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా ప్రాక్టీసు సెషన్‌కు వచ్చిన కోహ్లిని కలిసే అవకాశం వచ్చింది ఓ లేడీ ఫ్యాన్‌కు!
అంతేకాదు.. కోహ్లి ముఖ చిత్రంతో ఉన్న ఫ్రేమ్‌ను కూడా అతడికి అందించి మురిసిపోయిందామె! ఇందుకు సంబంధించిన వీడియోను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా గత కొంతకాలంగా నిలకడ లేమి ఫామ్‌తో ఇబ్బంది పడ్డ కోహ్లి ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో రాణించిన సంగతి తెలిసిందే.
ఈ మెగా టోర్నీలో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ కెరీర్‌లో 71వ సెంచరీ నమోదు చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ అందించాడు. ఇదే జోష్‌లో టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సిద్ధమవుతున్నాడు. అంతకంటే ముందు ఆసీస్‌తో సిరీస్ నేపథ్యంలో.. విలువైన ఇన్నింగ్స్‌కు ఆడేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు.
చదవండి: Ind Vs Aus T20 Series: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్, జట్లు.. ఇతర వివరాలు!
Ind Vs Aus: అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ! రెండు భారీ షాట్లు కొడితే..