Punjab Cricket Association
-
పంజాబ్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్..
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌కు ముందు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్‌కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ను పీసీఎ నియమించింది. ఈ విషయాన్ని పీసీఎ అధ్యక్షుడు అమర్జీత్ సింగ్ మెహతా ఆధికారికంగా ధ్రువీకరించారు.కాగా పంజాబ్ హెడ్‌కోచ్ పదవికి ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ స్టార్ షాన్ టైట్ కూడా ధరఖాస్తు చేశాడు. కానీ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం జాఫర్ వైపే మొగ్గు చూపింది.రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ క్రమంలోనే జాఫర్‌ను మా జట్టు ప్రధాన కోచ్‌గా నియమించాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము. జాఫర్ తన అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తాడని ఆశిస్తున్నాము. భారత్ నుంచి అత్యుత్తమ టెస్టు ప్లేయర్లలో జాఫర్ ఒకడు. కాబట్టి అతడిని మా బోర్డులో చేర్చుకున్నామని పీసీఎ అధ్యక్షుడు అమర్జీత్ సింగ్ మెహతా పేర్కొన్నాడు. జాఫర్ గతంలో ఉత్తరాఖండ్, ఒడిశా జట్లకు హెడ్‌కోచ్ పనిచేశాడు. అంతేకాకుండా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు మెంటార్, బ్యాటింగ్ కోచ్‌గా కూడా జాఫర్ తన సేవలను అందించాడు. -
ముంబై ఇండియన్స్ బ్యాటర్ విధ్వంసం.. ఐదు బంతుల్లో 5 సిక్స్‌లు! వీడియో వైరల్
పంజాబ్ క్రికెట్ ఆసోషియేషన్ ఆధ్వర్యంలో జరగుతున్న షేర్-ఈ-టీ20 T20 కప్‌లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ రమణదీప్ సింగ్ అదరగొడుతున్నాడు. ఈ టీ20 లీగ్‌లో అగ్రి కింగ్స్ నైట్స్‌కు రమణదీప్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం బీఎల్వీ బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రమణదీప్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్స్‌లు బాదాడు. అగ్రి కింగ్స్ నైట్స్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన క్రిష్ణన్ అలాంగ్ బౌలింగ్‌లో తొలి ఐదు బంతులను రమణదీప్ సిక్స్‌లుగా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రమణదీప్ 6 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో 63 పరుగులు చేశాడు. అయితే రమణదీప్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికి తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అగ్రి కింగ్స్ నైట్స్ 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 195 లక్ష్యంతో బరిలోకి దిగిన అగ్రి కింగ్స్ నైట్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేయగల్గింది. బీఎల్వీ బ్లాస్టర్స్ బౌలర్లలో కెప్టెన్ మయాంక్ మార్కండే, అలాంగ్ తలా మూడు వికెట్లు సాధించి అగ్రి కింగ్స్ నైట్స్‌ను దెబ్బతీశారు. అంతకుముందు బీఎల్వీ బ్లాస్టర్స్.. కువార్ పఠాక్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. చదవండి: పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 18 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై pic.twitter.com/Ejq5DmyHrJ — IndiaCricket (@IndiaCrick18158) July 20, 2023 -
భజ్జీ మాటలే నిజమయ్యాయి.. పీసీఏ అధ్యక్ష పదవికి రాజీనామా
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)లో అక్రమాలు ఎక్కువయ్యాయంటూ టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. బోర్డు సభ్యులు పేర్లు బయటపెట్టకుండా హర్భజన్ చేసిన వ్యాఖ్యలు పంజాబ్ క్రికెట్లో కలకలం రేపింది. పీసీఏ చీఫ్ అడ్వైజర్‌గా ఉన్న భజ్జీ చేసిన వ్యాఖ్యలే తాజాగా నిజమయ్యాయి. పీసీఏ అధ్యక్షుడిగా ఉన్న గుల్జార్ ఇందర్ సింగ్ చహల్ బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశాడు. పీసీఏలో గుల్జార్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. గుల్జార్ సహా అతని బృందం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా మే నెలలో పీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన గుల్జార్‌కు ఆ పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు గుల్జార్ చహల్ పేర్కొన్నారు. ఇక హర్భజన్ రాసిన లేఖలో ఏముందంటే.. ''ప్రస్తుత పీసీఏ అధ్యక్షుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడని గడిచిన వారం పది రోజులుగా పంజాబ్ క్రికెట్ ప్రేమికులు, స్టేక్ హోల్డర్ల నుంచి పలు ఫిర్యాదులు అందుకుంటున్నా.ఇది పారదర్శకత,క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఓటింగ్ హక్కులతో దాదాపు 150 మంది సభ్యులను చేర్చుకోవడానికి పీసీఏ తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలుస్తున్నది. ఇది బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధం. అంతేగాక పీసీఏ మార్గదర్శకాలు, పారదర్శకత ఉల్లంఘన కిందికే వస్తుంది.. ఈ వ్యవహారానికి సంబంధించి ఇదివరకే బీసీసీఐ అంబుడ్స్‌మెన్ కు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తున్నది. పీసీఏలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలను దాచడానికి కనీసం సాధారణ సమావేశాలకు కూడా పిలవకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వారి స్వప్రయోజనాల కోసం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు భజ్జీ వార్నింగ్.. -
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు భజ్జీ వార్నింగ్..
టీమిండియా మాజీ క్రికెటర్.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)కు వార్నింగ్ ఇచ్చాడు. బీసీసీఐ నిబంధనలు ఖాతరు చేయకుండా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గుల్జారీందర్ చాహల్ అక్రమాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నాడు. అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకుని అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్.. పంజాబ్, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ లకు గవర్నింగ్ బాడీగా వ్యవహరిస్తున్నది. మాజీ క్రికెటర్, నటుడు గుల్జారీందర్ చాహల్ పీసీఏ చీఫ్ కాగా ఇంద్రజిత్ సింగ్ బింద్రా చైర్మెన్ గా ఉన్నాడు. హర్భజన్ సింగ్ పీసీఏలో చీఫ్ అడ్వైజర్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే భజ్జీ పీసీఏకు బహిరంగ లేఖ రాశాడు.''ప్రస్తుత పీసీఏ అధ్యక్షుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడని గడిచిన వారం పది రోజులుగా పంజాబ్ క్రికెట్ ప్రేమికులు, స్టేక్ హోల్డర్ల నుంచి పలు ఫిర్యాదులు అందుకుంటున్నా.ఇది పారదర్శకత,క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఓటింగ్ హక్కులతో దాదాపు 150 మంది సభ్యులను చేర్చుకోవడానికి పీసీఏ తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలుస్తున్నది. ఇది బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధం. అంతేగాక పీసీఏ మార్గదర్శకాలు, పారదర్శకత ఉల్లంఘన కిందికే వస్తుంది.. ఈ వ్యవహారానికి సంబంధించి ఇదివరకే బీసీసీఐ అంబుడ్స్‌మెన్ కు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తున్నది. పీసీఏలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలను దాచడానికి కనీసం సాధారణ సమావేశాలకు కూడా పిలవకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వారి స్వప్రయోజనాల కోసం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు''అని పేర్కొన్నాడు. చదవండి: '110 శాతం ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాతో పోరుకు సిద్ధం' 'అసలు ధోనిలానే లేడు.. ఎవరు తయారు చేశారో కానీ!' -
Ind Vs Aus: యువీ, భజ్జీకి సముచిత గౌరవం.. ఆసీస్‌తో తొలి టీ20కి ముందు..
Ind Vs Aus 1st T20- మొహాలి: భారత క్రికెట్లో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) సముచిత రీతిలో గౌరవించనుంది. మొహాలి స్టేడియంలో రెండు స్టాండ్లకు ఈ ఇద్దరు ఆటగాళ్ల పేర్లు పెడుతున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మంగళవారం తొలి టి20 మ్యాచ్‌కు ముందు ఈ స్టాండ్స్‌ను ఆవిష్కరిస్తారు. యువరాజ్ భారత్ తరఫున 40 టెస్టుల్లో 1,900, 304 వన్డేల్లో 8,701, 58 టి20ల్లో 1,117 పరుగులు చేయడంతో పాటు 148 వికెట్లు కూడా పడగొట్టాడు. హర్భజన్ 103 టెస్టుల్లో 417... 236 వన్డేల్లో 269... 28 టి20ల్లో 25 వికెట్లు పడగొట్టడంతో పాటు మూడు ఫార్మాట్లలో కలిపి 3,569 పరుగులు సాధించాడు. చదవండి: కోహ్లి ప్రత్యామ్నాయ ఓపెనర్: రోహిత్ శర్మ -
పాక్ క్రికెటర్ల ఫొటోలు తొలగింపు
చండీగఢ్: పుల్వామా ఘటన నేపథ్యంలో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) తమ తరఫున నిరసన వ్యక్తం చేసింది. మొహాలి క్రికెట్ స్టేడియంలో ఉన్న 15 మంది పాకిస్తాన్ క్రికెటర్ల ఫొటోలను పీసీఏ తొలగించింది. స్టేడియంలో లోపలి భాగంలో గ్యాలరీలో, రిసెప్షన్ వద్ద, ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఈ చిత్రాలు ఉన్నాయి. ‘జవాన్ల పై దాడికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు ఉన్నాయి. మేం కూడా దానికి అతీతులం కాదు. చనిపోయిన కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ మా వైపు నుంచి ఈ చర్య తీసుకున్నాం’ అని పీసీఏ కోశాధికారి అజయ్ త్యాగి చెప్పారు. తొలగించిన వాటి జాబితాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మియాందాద్, వసీం అక్రమ్, షాహిద్ అఫ్రిది తదితరుల ఫొటోలు ఉన్నాయి. -
మొహాలీలో స్పోర్టింగ్ వికెట్
మొహాలీ: దక్షిణాఫ్రికాతో జరుగబోయే తొలి టెస్టుకు మంచి స్పోర్టింగ్ వికెట్‌ను తయారుచేసినట్టు పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) కార్యదర్శి ఎంపీ పండావ్ తెలిపారు. ప్రారంభంలో పేసర్లు రాణించినా ఆ తర్వాత స్పిన్నర్లు కీలకమవుతారని చెప్పారు. ‘మా శాయశక్తులా మంచి క్రికెటింగ్ వికెట్‌ను రూపొందించేందుకు ప్రయత్నించాం. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లకు కూడా లాభించేలా ఉంటుంది. పిచ్ అవుట్ ఫీల్డ్ పూర్తి పచ్చికతో ఉంది. కచ్చితంగా ఇక్కడ అభిమానులకు చక్కటి క్రికెట్ వినోదం లభిస్తుంది’ అని పాండోవ్ తెలిపారు. 1న ప్రొటీస్ జట్టు మొహాలీకి చేరుకోనుంది. అదే రోజు ఢిల్లీలో హర్భజన్ వివాహ విందు ఉండడంతో భారత్ ఆటగాళ్లు మర్నాడు రానున్నారు. 5 నుంచి 9 వరకు మ్యాచ్ జరుగుతుంది. అయితే టిక్కెట్ల అమ్మకాలు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేవు. వీటి రేట్లను తగ్గిస్తే టెస్టులను చూసేందుకు ఎక్కువ సంఖ్యలో అభిమానులు వస్తారని పాండోవ్ అభిప్రాయపడ్డారు.