రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌కు ముందు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్‌కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ను పీసీఎ నియమించింది. ఈ విషయాన్ని పీసీఎ అధ్యక్షుడు అమర్జీత్ సింగ్ మెహతా ఆధికారికంగా ధ్రువీకరించారు.
కాగా పంజాబ్ హెడ్‌కోచ్ పదవికి ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ స్టార్ షాన్ టైట్ కూడా ధరఖాస్తు చేశాడు. కానీ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం జాఫర్ వైపే మొగ్గు చూపింది.
రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ క్రమంలోనే జాఫర్‌ను మా జట్టు ప్రధాన కోచ్‌గా నియమించాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము. జాఫర్ తన అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తాడని ఆశిస్తున్నాము.
భారత్ నుంచి అత్యుత్తమ టెస్టు ప్లేయర్లలో జాఫర్ ఒకడు. కాబట్టి అతడిని మా బోర్డులో చేర్చుకున్నామని పీసీఎ అధ్యక్షుడు అమర్జీత్ సింగ్ మెహతా పేర్కొన్నాడు. జాఫర్ గతంలో ఉత్తరాఖండ్, ఒడిశా జట్లకు హెడ్‌కోచ్ పనిచేశాడు. అంతేకాకుండా ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు మెంటార్, బ్యాటింగ్ కోచ్‌గా కూడా జాఫర్ తన సేవలను అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment