punjab team
-
పంజాబ్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్..
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌కు ముందు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్‌కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ను పీసీఎ నియమించింది. ఈ విషయాన్ని పీసీఎ అధ్యక్షుడు అమర్జీత్ సింగ్ మెహతా ఆధికారికంగా ధ్రువీకరించారు.కాగా పంజాబ్ హెడ్‌కోచ్ పదవికి ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ స్టార్ షాన్ టైట్ కూడా ధరఖాస్తు చేశాడు. కానీ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం జాఫర్ వైపే మొగ్గు చూపింది.రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ క్రమంలోనే జాఫర్‌ను మా జట్టు ప్రధాన కోచ్‌గా నియమించాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము. జాఫర్ తన అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తాడని ఆశిస్తున్నాము. భారత్ నుంచి అత్యుత్తమ టెస్టు ప్లేయర్లలో జాఫర్ ఒకడు. కాబట్టి అతడిని మా బోర్డులో చేర్చుకున్నామని పీసీఎ అధ్యక్షుడు అమర్జీత్ సింగ్ మెహతా పేర్కొన్నాడు. జాఫర్ గతంలో ఉత్తరాఖండ్, ఒడిశా జట్లకు హెడ్‌కోచ్ పనిచేశాడు. అంతేకాకుండా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు మెంటార్, బ్యాటింగ్ కోచ్‌గా కూడా జాఫర్ తన సేవలను అందించాడు. -
దుమ్మురేపిన రికీబుయ్
విశాఖ స్పోర్ట్స్: స్థానిక కుర్రాడు రికీబుయ్ ఆంధ్ర జట్టును ఆదుకున్నాడు. 150 నాటౌట్ పరుగులతో క్రీజ్‌లో నిలిచి నాలుగో రోజు ఆటను కొనసాగించనున్నాడు. 54/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆట ప్రారంభించిన ఆంధ్ర జట్టు మరో రెండు వికెట్లే కోల్పోయి 273 పరుగులు చేసి మూడు రోజు ఆటలో నిలదొక్కుకుంది. ఇక్కడి వైఎస్ఆర్ స్టేడియంలో రంజీ తొలి మ్యాచ్‌లో ఆంధ్రతో తలపడుతున్న పంజాబ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 414 పరుగులకు ఆలౌటైన విషయం విదితమే. ఆంధ్ర జట్టు 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో స్థానిక కుర్రాళ్లు రికీబుయ్, భరత్, సుమంత్‌లు ఆంధ్రను ఆదుకున్నారు. ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల కోల్పోయి 327 పరుగులు చేసింది. ఆట ఆదివారంతో ముగియనుంది. రికీబుయ్ 150 నాటౌట్ కెప్టెన్ విహారీతో పాటు ఓపెనర్లు ప్రశాంత్, అశ్విన్‌లు తక్కువ స్కోర్‌కే వెనుతిరగడంతో మ్యాచ్‌ను కాపాడే బాధ్యతను విశాఖ కుర్రాళ్లు తీసుకున్నారు. రికీబుయ్ 291 బంతులాడి 13 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగి 150 పరుగులతో క్రీజ్‌లో నిలిచి మ్యాచ్‌ను తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దిశగా నడిపిస్తున్నాడు. లంచ్ బ్రేక్ వరకు వికెట్ కోల్పోకుండా రికీకి కెఎస్ భరత్ సహకరించి 175 బంతులాడి ఆరుఫోర్లు, ఒక సిక్సరుతో 76 పరుగులు చేశాడు. మరో విశాఖ కుర్రాడు బి.సుమంత్ 54 పరుగులు చేశాడు. కరణ్‌శర్మ నాలుగు పరుగులతో క్రీజ్‌లో నిలిచాడు. మిడిలార్డర్లో.. ఆంధ్ర స్కోర్ 190 పరుగుల వద్ద భరత్ ఆవుట్ కాగా... సుమంత్ 322 పరుగులకు చేర్చి వెనుతిరిగాడు. రికీబుయ్ 224 బంతులాడి పదిఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీ నమోదు చేయగా మరో ఆరవై ఏడు బంతులాడి 150 పరుగుల మార్కుకు చేరుకున్నాడు. నాలుగో వికెట్‌కు భరత్, రికీబుయ్ 151పరుగులు జోడించడగా ఐదో వికెట్‌కు రికీబుయ్తో కలిసి సుమంత్ 132 పరుగుల భాగస్వామ్యాన్నందించాడు. కార్తీక్ రామన్, అయ్యప్ప, విజయ్‌కుమార్, షోయబ్ చివరిరోజు ఆంధ్ర తరపున బ్యాటింగ్ చేయనున్నారు. పంజాబ్ తరపున రంజీల్లో ఆరంగేట్రం చేసిన మార్కండే ఇప్పటికే మూడు వికెట్లు తీశాడు. -
రుణమాఫీపై అధ్యయనానికి పంజాబ్ బృందం
అవకతవకలు లేకుండా అమలు చేయడంపై అభినందన సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ పథకంపై అధ్యయనం చేయడానికి పంజాబ్ ప్రభుత్వ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. పంజాబ్ వ్యవసాయ సహకార విభాగం అద నపు ముఖ్య కార్యదర్శి డి.పి.రెడ్డి, ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ బల్వీందర్‌సింగ్ సింధు, సహకార బ్యాంకు ఎండీ ఎస్.కె.బటీష్, పంజాబ్ వ్యవసాయ వర్సిటీ ఆర్థికవేత్త డాక్టర్ సుఖ్‌పాల్‌సింగ్ ఈ బృందంలో ఉన్నారు. వారితో రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి నేతృత్వంలో అధికారులు, వివిధ బ్యాంకర్లు శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు. పార్థసారథి రుణమాఫీ గురించి వివరించారు. సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీ కోసం ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఆ కమిటీ రెండు నెలలపాటు శ్రమించి అవసరమైన మార్గద ర్శకాలను రూపొందించిందని చెప్పారు. అవకతవకలకు అవకాశం లేకుండా జరిగిన రైతు రుణమాఫీ పథకాన్ని పంజాబ్ బృందం అభినందించింది. -
వాడియాపై ప్రీతి జింటా కేసు
ముంబై: ఈ ఏడాది ఐపీఎల్ వివాదాల్లేకుండా పూర్తయిందనుకుంటే... టోర్నీ ముగిశాక కొత్త వివాదం మొదలైంది. పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా... ఆ జట్టుకే చెందిన మరో యజమాని, తన మాజీ ప్రేమికుడు నెస్‌వాడియాపై కేసు పెట్టింది. మే 30న వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా... నెస్వాడియా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు బెదిరించాడని ప్రీతిజింటా గురువారం రాత్రి ముంబైలోని మెరీన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వాడియాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు 39 ఏళ్ల జింటా గర్వారే పెవిలియన్‌లో ఉండగా వాడియా (44) అక్కడికి వచ్చి విష్ చేసి ఆ తర్వాత అందరి ముందు ఆమెను తిట్టినట్టు సమాచారం. వీరిద్దరు గతంలో ఐదేళ్ల పాటు డేటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత విడిపోయినప్పటికీ వేధింపులు మానలేదని జింటా పేర్కొంది. ఇది తనకు కష్టకాలమని, మీడియా ఈ విషయంలో సంయమనం పాటించాలని కోరింది. ఏ మహిళ కూడా ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవాలని భావించదని, తాను ఎవరికీ హాని చేయాలని చూడడం లేదని ప్రీతి పేర్కొంది. పోలీసుల విచారణ మొదలు ప్రీతి ఇచ్చిన ఫిర్యాదుపై ముంబై మెరైన్ డ్రైవ్ పోలీసులు తమ విచారణను ప్రారంభించారు. ఐపీఎల్ సీఈవో సుందర్ రామన్, వాంఖడే స్టేడియం సిబ్బందిని వీరు ప్రశ్నించే అవకాశం ఉంది. వీరితో పాటు పంజాబ్‌కు చెందిన చాలా మంది ఆట గాళ్లు, సహాయక సిబ్బంది కూడా సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నారని, వీరి స్టేట్మెంట్ రికార్డు చేస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు 24 గంటల్లో వాడియాను అరెస్ట్ చేయాలని మహారాష్ట్ర మహిళా హక్కుల కమిషన్ డిమాండ్ చేసింది. షాక్ అయ్యాను: నెస్ వాడియా ప్రీతి జింటా ఇచ్చిన ఫిర్యాదుపై నెస్ వాడియా స్పందించారు. ‘నిజంగా ఇది నన్ను షాక్‌కు గురిచేసింది. ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం. అసలు జింటాపై దాడి చేయడమనేది అసంభవం. ఎందుకంటే ఆమె ఎప్పుడూ తన చుట్టూ బౌన్సర్లను రక్షణగా పెట్టుకుంటుంది’ అని వాడియా అన్నారు. వాడియా కొంతకాలంగా మరో అమ్మాయితో స్నేహంగా ఉంటున్నాడని, ఇది చూసి ఓర్వలేకే ప్రీతి ఇలాంటి ఆరోపణలు చేస్తోందని వాడియా సన్నిహితులు పేర్కొంటున్నారు. -
‘శతక’బాదిన సిమ్మన్స్
ఈ సీజన్ ఐపీఎల్లో తొలి సెంచరీ నమోదు పంజాబ్‌పై ముంబై ఘన విజయం ప్లే ఆఫ్ ఆశలు సజీవం మొహాలీ: ఐపీఎల్లో విధ్వంసకర ఆటతీరుతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న పంజాబ్ జట్టును ముంబై ఇండియన్స్ మాత్రం చక్కగా కట్టడి చేస్తోంది. అందరికీ కొరకరాని కొయ్యగా కనిపిస్తున్న పంజాబ్‌ను ఈ సీజన్లో రెండోసారి ఓడించింది. లెండిల్ సిమ్మన్స్ (61 బంతుల్లో 100 నాటౌట్; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) ఈ సీజన్ ఐపీఎల్లో తొలి సెంచరీ నమోదు చేయడంతో... బుధవారం జరిగిన ఐపీఎల్-7 లీగ్ మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో పంజాబ్‌పై ఘన విజయం సాధించింది. ఫలితంగా ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. పీసీఏ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముంబై ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. బెయిలీ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), వోహ్రా (34 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్సర్లు), మార్ష్ (17 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. బుమ్రా, గోపాల్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసింది. సిమ్మన్స్‌కు తోడు రోహిత్ (18), రాయుడు (17) ఫర్వాలేదనిపించారు. హెండ్రిక్స్, అక్షర్, ధావన్ తలా ఓ వికెట్ తీశారు. తడబడి పుంజుకుని... ఓపెనర్లలో సెహ్వాగ్ (11 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్సర్లు) వచ్చి రావడంతోనే ఫోర్, రెండు సిక్సర్లతో రెచ్చిపోయాడు. కానీ మూడో ఓవర్ తొలి బంతికే అనూహ్యంగా రనౌటయ్యాడు. పవర్‌ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. గోపాల్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఊపుమీదున్న మార్ష్‌ను సంతోకి బోల్తా కొట్టించాడు. దీంతో రెండో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 11వ ఓవర్లో గోపాల్ పంజాబ్‌ను ఘోరంగా దెబ్బతీశాడు. మూడు బంతుల వ్యవధిలో వోహ్రా, ‘డేంజర్ మ్యాన్’ మాక్స్వెల్ (2)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో పంజాబ్ 93 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో బెయిలీ, ధావన్ (14 నాటౌట్) ఏడో వికెట్‌కు 20 బంతుల్లో 38 పరుగులు జోడించడంతో పంజాబ్ పోరాడే స్కోరు సాధించింది. కీలక భాగస్వామ్యాలు హస్సీ (6)ని క్రీజులో నిలబెట్టి ఓ ఎండ్‌లో సిమ్మన్స్ విజృంభించాడు. బౌలర్ ఎవరైనా ఓవర్‌కు ఒకటి, రెండు ఫోర్లు బాదడంతో ముంబై స్కోరు వేగంగా కదిలింది. ఈ క్రమంలో 27 బంతుల్లోనే సిమ్మన్స్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. నిలకడగా ఆడుతున్న ఈ జోడిని అక్షర్ పటేల్ విడదీశాడు. హస్సీని క్లీన్ బౌల్డ్ చేయడంతో తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సిమ్మన్స్‌తో జత కలిసిన రాయుడు (17) చక్కని సహకారం అందించాడు. రెండో వికెట్‌కు 43 పరుగులు జోడించాక రాయుడు వెనుదిరిగాడు. అప్పటికే రెండు కీలక భాగస్వామ్యాలు జోడించిన సిమ్మన్స్‌కు రోహిత్ కూడా అండగా నిలిచాడు. సహచరుడికి ఎక్కువగా స్ట్రయికింగ్ ఇవ్వడంతో విండీస్ ప్లేయర్ బ్యాట్ ఝుళిపించాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ రనౌట్ 17; వోహ్రా (బి) గోపాల్ 36; మార్ష్ (సి) పొలార్డ్ (బి) సంతోకి 30; మాక్స్వెల్ (సి) అండ్ (బి) గోపాల్ 2; బెయిలీ (సి) రాయుడు (బి) బుమ్రా 39; సాహా రనౌట్ 3; అక్షర్ పటేల్ (సి) రోహిత్ (బి) ప్రవీణ్ 6; రిషీ ధావన్ నాటౌట్ 14; హెండ్రిక్స్ (బి) బుమ్రా 0; శివం శర్మ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1-23; 2-87; 3-92; 4-93; 5-105; 6-116; 7-154; 8-155 బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 4-0-20-1; సంతోకి 4-0-40-1; బుమ్రా 4-0-31-2; ఓజా 4-0-28-0; గోపాల్ 4-0-32-2 ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ నాటౌట్ 100; మైక్ హస్సీ (బి) అక్షర్ 6; రాయుడు (సి) సెహ్వాగ్ (బి) ధావన్ 17; రోహిత్ (సి) సందీప్ (బి) హెండ్రిక్స్ 18; పొలార్డ్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (19 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1-68, 2-111; 3-148 బౌలింగ్: సందీప్ 3-0-37-0; హెండ్రిక్స్ 4-0-33-1; అక్షర్ పటేల్ 4-0-27-1; రిషీ ధావన్ 4-0-30-1; శివం శర్మ 4-0-32-0. 29 ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఇది 29వ సెంచరీ చాలా సంతోషంగా ఉంది. సెంచరీ చేస్తానని అనుకోలేదు. ఐపీఎల్ కోసం ముంబై జట్టు నుంచి పిలుపు వచ్చినప్పుడు చాలా ఉద్వేగంగా అనిపించింది. - లెండిల్ సిమ్మన్స్ ‘క్లాస్’ ఇన్నింగ్స్ టి 20 క్రికెట్ అంటే బాదుడు. ఎవరైనా ఆటగాడు సెంచరీ చేశాడంటే కచ్చితంగా అది పెను విధ్వంసంలా కనిపిస్తుంది. రకరకాల ప్రయోగాలతో కొత్త షాట్లు ఆడితేనే శతకం సాధ్యమవుతుంది. కానీ బుధవారం సిమ్మన్స్ చేసిన సెంచరీ వీటికి పూర్తిగా భిన్నం. ఏ మాత్రం తడబాటు, హడావుడి లేకుండా... కామ్‌గా తన పని తాను చేసుకుపోతూ సెంచరీ చేశాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా పిచ్చి షాట్ లేదు. అడ్డంగా బాదటం అసలే లేదు. అన్నీ పూర్తిగా క్రికెటింగ్ షాట్స్. ఆఫ్‌సైడ్ కట్ షాట్స్‌తో క ళ్లుచెదిరాయి. బౌలర్ తలపైనుంచి బలంగా బాదిన బంతిని చూడటం ఓ ఆహ్లాదం. రివర్స్ స్వీప్‌లు, స్విచ్ హిట్లు ఏమీ లేవు. టి20 క్రికెట్లో ఇలాంటి సెంచరీ అరుదు. పవర్‌ప్లేలో పూర్తి దూకుడు ప్రదర్శించిన సిమ్మన్స్... ఆ తర్వాత లక్ష్యానికి తగ్గట్లుగా బ్యాటింగ్ శైలిని మార్చుకున్నాడు. చక్కటి ప్లేస్‌మెంట్స్‌తో సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ.. ఏ మాత్రం చెత్త బంతి పడ్డా చుక్కలు చూపించాడు. ఈ సీజన్లో సెంచరీ సిమ్మన్స్ నుంచి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే స్వతహాగా తను బాగా వేగంగా ఆడే ఆటగాడు కాదు. మొత్తానికి ఈ సీజన్లో తొలి సెంచరీ వెస్టిండీస్ క్రికెటర్ నుంచి రావడమే అసలు విశేషం. బంతులు పరుగులు 110 : 17 1120 : 17 2130 : 25 3140 : 16 4150 : 16 5161 : 9 మొత్తం: 100 నాటౌట్ (61బంతుల్లో ) 14 ఫోర్లు, 2 సిక్సర్లు -
‘బ్లాస్టర్ వెనక మాస్టర్!
ముంబై: గ్లెన్ మ్యాక్స్‌వెల్... ఈ సారి ఐపీఎల్లో పెను సంచలనం. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరుగుల సునామీతో పంజాబ్ జట్టును ఒక్కసారిగా ఒంటిచేత్తో ఫేవరెట్స్ జాబితాలోకి తీసుకొచ్చాడు. నిజానికి ఏడాది క్రితం మ్యాక్స్‌వెల్‌లో ఇంత జోరు లేదు. కానీ గత అక్టోబరులో చాంపియన్స్‌లీగ్ ద్వారా తన ‘రాత మారిపోయింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ నేతృత్వంలో తను రాటుదేలి, ఆ తర్వాత మరింత విధ్వంసకర ఆటగాడిగా మారిపోయాడు. గత ఏడాది ఐపీఎల్లో ముంబై తరఫున తొలిసారి ఐపీఎల్లో అడుగుపెట్టాడు మ్యాక్స్‌వెల్. కానీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 36 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత అక్టోబరులో చాంపియన్స్‌లీగ్ కోసం ముంబై జట్టుతో చేరాడు. మ్యాక్స్వెల్లోని సహజనైపుణ్యం గుర్తించిన సచిన్... ఈ టోర్నీ సమయంలో తనకు చాలా సూచనలు ఇచ్చాడు. నెట్స్‌లో తన వెనక నిలబెట్టుకుని ప్రాక్టీస్ చేయించాడు. స్టాన్స్ దగ్గరి నుంచి బంతిని పిక్ చేసే వరకు ప్రతి అంశంలోనూ శిక్షణ ఇచ్చాడు. సచిన్ వెనక నిలబడి మాస్టర్ ఎలా బ్యాట్ పట్టుకుంటున్నాడో, ఎలా పాదాలు కదుపుతున్నాడో అచ్చు అలాగే ప్రాక్టీస్ చేశాడు మ్యాక్స్‌వెల్. ఇది ఫలితాన్నిచ్చింది. చాంపియన్స్‌లీగ్ ఫైనల్లో కేవలం 14 బంతుల్లో 37 పరుగులతో తొలిసారి విశ్వరూపం చూపించాడు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. చాంపియన్స్ లీగ్ తర్వాత భారత్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో మ్యాక్స్ రాణించాడు. ఆ సిరీస్‌లో మూడు అర్ధ సెంచరీలు బాదాడు. ఇక ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్‌లోనూ మెరిశాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 36.75 సగటుతో 147 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ సెంచరీ కూడా ఉంది. ఇంతకంటే జోరైన బ్యాటింగ్‌ను ఐపీఎల్లో ప్రదర్శిస్తున్నాడు. అరబ్ ఎడారిలో పరుగుల తుపాన్ సృష్టిస్తున్నాడు. ఐపీఎల్ వేలంలో మ్యాక్స్‌వెల్‌కు పంజాబ్ రూ.6 కోట్లు వెచ్చించినప్పుడు ఆ జట్టును చూసి నవ్వుకున్న వారు కూడా లేకపోలేదు. అలాంటివారికి మ్యాక్స్‌వెల్ తన హిట్టింగ్తో సమాధానం చెబుతున్నాడు. ఇక అన్ని లీగ్‌లలోనూ తను కచ్చితంగా బాగా ఖరీదైన ఆటగాడిగా మారతాడు.