భారత యువ షూటర్‌ అనుమానాస్పద మృతి | National-Level Shooter Namanveer Singh Brar Lost Life Bullet Wound Punjab | Sakshi
Sakshi News home page

Namanveer Singh Brar: భారత యువ షూటర్‌ అనుమానాస్పద మృతి

Published Tue, Sep 14 2021 10:44 AM | Last Updated on Tue, Sep 14 2021 11:08 AM

National-Level Shooter Namanveer Singh Brar Lost Life Bullet Wound Punjab - Sakshi

నమన్‌వీర్‌ సింగ్‌ బ్రార్‌(ఫైల్‌ ఫోటో)

మొహలీ: భారత షూటర్‌ 28 ఏళ్ల నమన్‌వీర్‌ సింగ్‌ బ్రార్‌  అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మొహలీలోని సెక్టార్‌ 71లో తన ఇంట్లో నమన్‌వీర్‌ సింగ్‌ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే నమన్‌ వీర్‌ సింగ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక ప్రమాదవశాత్తూ తుపాకీ పేలిందా అన్నది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని మొహలీ డీఎస్పీ గుర్‌షేర్‌ సింగ్‌ తెలిపారు.

ఈ ఏడాది మార్చిలో జరిగిన ఢిల్లీ షూటింగ్‌ వరల్డ్ కప్ లో కనీస అర్హత స్కోరు విభాగంలో నమన్వీర్‌సింగ్‌ నాలుగోస్థానంలో నిలిచాడు. అలాగే 2015లో దక్షిణ కొరియాలోని గ్వాంగ్జౌలో జరిగిన వరల్డ్‌ యూనివర్సిటీ గేమ్స్ లో డబుల్‌ ట్రాప్‌ షూటింగ్‌ ఈవెంట్‌లో నమన్‌వీర్‌ కాంస్య పతకం సాధించాడు.

చదవండి: అంతా నాలుగు నెలల్లోనే... అనామక ప్లేయర్‌ నుంచి చాంపియన్‌ దాకా!

PELE: ఐసీయూలో ఫుట్‌బాల్ దిగ్గజం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement