National level shooter
-
భారత యువ షూటర్ అనుమానాస్పద మృతి
మొహలీ: భారత షూటర్ 28 ఏళ్ల నమన్వీర్ సింగ్ బ్రార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మొహలీలోని సెక్టార్ 71లో తన ఇంట్లో నమన్వీర్ సింగ్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే నమన్ వీర్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక ప్రమాదవశాత్తూ తుపాకీ పేలిందా అన్నది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని మొహలీ డీఎస్పీ గుర్షేర్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఢిల్లీ షూటింగ్ వరల్డ్ కప్ లో కనీస అర్హత స్కోరు విభాగంలో నమన్వీర్‌సింగ్ నాలుగోస్థానంలో నిలిచాడు. అలాగే 2015లో దక్షిణ కొరియాలోని గ్వాంగ్జౌలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో డబుల్ ట్రాప్ షూటింగ్ ఈవెంట్లో నమన్వీర్ కాంస్య పతకం సాధించాడు. చదవండి: అంతా నాలుగు నెలల్లోనే... అనామక ప్లేయర్ నుంచి చాంపియన్ దాకా! PELE: ఐసీయూలో ఫుట్‌బాల్ దిగ్గజం.. -
హమ్మయ్య.. పుష్ప జీవితం మారనుంది
న్యూఢిల్లీ: ఎట్టకేలకు జాతీయ షూటర్ పుష్పా గుప్తా(21) జీవితం మారనుంది. గుజరాత్ ప్రభుత్వం ఆమెకు బాసటగా నిలిచింది. జాతీయ స్థాయిలో షూటింగ్లో పతకాలు గెలుచుకున్న ఆమె తన కుటుంబ పోషణ కోసం నూడుల్స్ అమ్ముతున్న విషయం వార్తల్లోకి ఎక్కి అందరిని విస్మయానికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితి పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు. ఆమె పరిస్థితిపట్ల స్పందించిన గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్(జీఎస్ఎఫ్సీ) ఆమెకు ఉద్యోగాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చింది. జీఎస్ఎఫ్సీ చైర్మన్ ఎస్ నందా ఆమె చదువు పూర్తికాగానే నేరుగా తమ సంస్థలో నియామకం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఆమె షూటింగ్ క్రీడను కూడా కొనసాగించేలా చేస్తామని తెలిపారు. జాతీయ స్థాయి షూటర్ అయిన గుప్తా ప్రస్తుతం బీకాం మూడో సంవత్సరం చదువుతుంది. పేదరికంలో ఉన్న తన కుటుంబానికి ఆర్థికపరమైన చేదోడువాదోడుగా ఉండేందుకు గత ఏడాదిగా నూడుల్స్ అమ్ముతోంది. ఆమె ఎన్సీసీ కోర్సు కూడా పూర్తి చేసింది. 'నేను 2013లో కాలేజీలో జాయిన్ అయ్యాను. అప్పుడే నాకు షూటింగ్ స్కిల్స్ ఉన్నాయని గుర్తించాను. వెంటనే నేషనల్ కేడెట్ కార్ప్స్ లో జాయిన్ అయ్యాను. అది కొంత ఆర్థికంగా సహాయపడింది. నేను గుజరాత్ ప్రతినిధిగా పలుసార్లు మంచి ప్రదర్శన చేశాను. అందుకే షూటింగ్ పై ఆసక్తి పెట్టాను' అని పుష్ప చెప్పింది. -
జాతీయ షూటర్ దారుణ హత్య
చండీగఢ్: జాతీయ స్థాయి షూటర్ సిప్పీ సిద్ధు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయన్ను కాల్చిచంపారు. ఆదివారం రాత్రి చండీగఢ్‌లోని ఓ పార్క్‌లో సిద్ధు (34) మృతదేహాన్ని కనుగొన్నారు. అతని మృతదేహంలోకి బుల్లెట్లు దూసుకెళ్లినట్టు గుర్తించారు. సిద్ధు మరణవార్త విని భారత షూటింగ్ రంగం దిగ్భ్రాంతికి గురైంది. పార్క్‌లో మృతదేహం ఉన్నట్టు స్థానికులు ఫోన్ చేసి చెప్పారని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి వెళ్లి విచారించగా ఆ మృతదేహం సిద్ధుదిగా గుర్తించినట్టు తెలిపారు. ఉన్నత కుటుంబానికి చెందిన సిద్ధు న్యాయవాది, స్పోర్ట్స్ ప్రమోటర్. ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 2001 నేషనల్ గేమ్స్‌లో షూటింగ్ టీమ్ ఈవెంట్లో సిద్ధు.. అభినవ్ బింద్రాతో కలసి స్వర్ణం సాధించారు. 15 ఏళ్లుగా షూటర్‌గా కొనసాగుతున్న సిద్ధు పలు షూటింగ్ పోటీల్లో పతకాలు గెలిచారు. సిద్ధు మృతికి పలువురు షూటర్లు సంతాపం ప్రకటించారు.