న్నికల ముంగిట పంజాబ్‌లో పోలీసులు రూ.21 కోట్ల విలువైన 160 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
చండీగఢ్: ఎన్నికల ముంగిట పంజాబ్‌లో పోలీసులు రూ.21 కోట్ల విలువైన 160 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొహాలీ జిల్లాలోని సొహానా పోలీస్ స్టేషన్ పరిధిలోని బకార్‌పూర్ చౌక్‌లో ఓ చెక్‌పోస్టు వద్ద చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో మంగళవారం రాత్రి ఓ వాహనంలో ఈ ముడి బంగారం లభించింది. ఈ బంగారాన్ని శుద్ధిచేయడానికి ఢిల్లీ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వాహనంలో ఉన్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారం గురించి వారు సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని, సంబంధిత పత్రాలు కూడా వారి వద్ద లేవని పోలీసులు తెలిపారు. తదుపరి ధృవీకరణ నిమిత్తం ఈ విషయాన్ని పోలీసులు ఎక్సైజ్, పన్ను శాఖ అధికారులకు తెలియజేశారు.