మూడో టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టులోకి బట్లర్
భారత్‌తో శనివారం నుంచి మొహాలీలో జరిగే మూడో టెస్టులో ఇంగ్లండ్ తుది జట్టులోకి జాస్ బట్లర్ రావడం ఖాయమైంది. రెండు టెస్టుల్లోనూ విఫలమైన డకెట్ స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా బట్లర్ ఆడతాడు. ఇప్పటి వరకు కెరీర్‌లో 15 టెస్టులు ఆడిన బట్లర్, ఏడాది క్రితం జట్టులో స్థానం కోల్పోయాడు.
ఆ తర్వాత ఒకే ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన అతని రికార్డు ఏమంత బాగా లేదు. అరుుతే ప్రత్యామ్నాయాలు పెద్దగా అందుబాటులోలేకపోవడంతో బట్లర్‌ను ఇంగ్లండ్ ఎంపిక చేయాల్సి వచ్చింది. ఈ సారి అతను మెరుగైన ప్రదర్శన కనబరుస్తాడని కోచ్ ట్రెవర్ బెలిస్ విశ్వాసం వ్యక్తం చేశారు.