Butler
-
10 వేల కోట్ల ఆస్తి..వీలునామాలో.. బయటపడ్డ షాకింగ్ సీక్రెట్
-
Donald Trump: అమెరికాకు గౌరవం తెస్తా
పెన్సిల్వేనియా: అవినీతి లేని వ్యవస్థను, అమెరికా విదేశాంగ విధానానికి తిరిగి ‘గౌరవం’ తీసుకొస్తానని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నేరాలకు మూలమైన ఓపెన్ బోర్డర్‌ను మూసేస్తామని హామీ ఇచ్చారు. జూలై 13న తనపై హత్యాయత్నం జరిగిన మళ్లీ పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో శనివారం ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. వేలాదిగా గుమిగూడిన అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థులు తనపై దు్రష్పచారం చేస్తున్నారని, చంపడానికి కూడా ప్రయతి్నంచారని ట్రంప్ ఆరోపించారు. జూలై 13న తనపై హత్యాయత్నం జరిగిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఓ 15 సెకన్ల పాటు కాలం ఆగిపోయింది. ఓ దుర్మార్గుడు చెడు చేద్దామని ప్రయతి్నంచాడు. కానీ విజయం సాధించలేకపోయాడు’’ అని వ్యాఖ్యానించారు. కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమవడం, ఒక వలంటీర్ ఫైర్ చీఫ్ మరణించడం తెలిసిందే.చిందేసిన మస్క్ టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో తొలిసారి కనిపించారు. ఆయనను ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తుతూ వేదికపైకి ఆహా్వనించారు. ట్రంప్ మాట్లాడుతుండగా మస్క్ చిందేసి సభికులను అలరించారు. ట్రంప్‌కు ఓటేయడం కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని చెప్పారు. ట్రంప్ ఓడిపోతే 2024 ఎన్నికలే అమెరికన్లకు చివరివి అవుతాయని హెచ్చరించారు. -
స్తంభించిన ప్రపంచం!
మైక్రోసాఫ్ట్ విండోస్ మొండికేయటంతో శుక్రవారం ఒక్కసారిగా అంతా అస్తవ్యస్తమైన తీరు ఐటీపై ప్రపంచం ఎంతగా ఆధారపడిందో కళ్లకు కట్టింది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలతోపాటు మన దేశంలోనూ అనేక సేవలకు అంతరాయం ఏర్పడింది. మ్యాక్, లైనెక్స్ ఆధారిత సేవలు యథావిధిగా పనిచేశాయి. 1872లో ఆంగ్ల రచయిత శామ్యూల్ బట్లర్ యంత్రాలకు సొంతంగా ఆలోచించే, తిరిగి తమంత తాము చేయగలిగే సామర్థ్యం వస్తే ఎలావుంటుందో చూపుతూ ఎరెవాన్ అనే వ్యంగ్య నవల రాశాడు. అది మరీ అతిగావుందని సమకాలికుల నుంచి విమర్శలొచ్చాయి. బహుశా ప్రపంచంలో అదే తొలి సైన్స్ ఫిక్షన్. ఆ కోవలో తర్వాత చాలా వచ్చాయి. సైబర్ దాడులు జరిగితే ప్రపంచం ఏమవుతుందన్న ఇతివృత్తాలతో చలనచిత్రాలు, టీవీ సీరియళ్లు వచ్చాయి. కానీ మైక్రోసాఫ్ట్ విండో స్కు సైబర్ నేరగాళ్లనుంచి కాకుండా అలాంటివారినుంచి రక్షిస్తామని చెప్పే ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌వల్ల సమస్యలు తలెత్తి ఇంత పని జరగటం ఒక వైచిత్రి. మైక్రోసాఫ్ట్‌కు సైబర్ సెక్యూరిటీ సేవలందించే క్రౌడ్‌స్ట్రయిక్ అనే అమెరికా సంస్థ తాను రూపొందించిన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను నవీకరించి కొత్తది విడుదల చేయగానే సమస్య తలెత్తిందంటున్నారు. దీంతో మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఇన్‌ట్యూన్, వన్‌నోట్, షేర్‌పాయింట్, మైక్రోసాఫ్ట్ డిఫెండర్ వంటి అనేక యాప్‌లు నిరర్థకమయ్యాయి. ఒక్కొక్కటే మళ్లీ పునరుద్ధరిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. అయితే ఈలోగా అనేక దేశాల్లో కంప్యూటర్లు ఆగిపోయాయి. రైళ్లు, విమానయాన సేవలు నిలిచి పోవటం మొదలుకొని దుకాణాల్లో చెల్లింపుల ప్రక్రియ వరకూ అన్నిటికన్నీ స్తంభించిపోయాయి. చాలాచోట్ల వాణిజ్య, వ్యాపార లావాదేవీలూ, బ్యాంకింగ్, ఆరోగ్య సేవలూ, వార్తా ప్రసారాలూ, పోలీసు వ్యవస్థలూ, మెట్రో సర్వీసులూ, స్టాక్ ఎక్స్ఛేంజ్లూ నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది సంస్థల్లో వినియోగించే టీమ్స్ సాఫ్ట్వేర్ సైతం ఆగిపోయింది. విమానాల్లో బోర్డింగ్ పాస్‌లు చేతితో రాసి ఇవ్వటం అందరూ మరిచి దాదాపు మూడు దశాబ్దాలవుతోంది. తాజా సమస్య అదెలా వుంటుందో ఈ తరానికి రుచి చూపింది.సమాచార సాంకేతికతలు వర్తమాన యుగంలో జీవితాన్ని వేగవంతం చేశాయి. కొన్ని శతాబ్దాలు ఇలాంటివేమీ లేకుండానే ప్రపంచం మనుగడ సాగించిందన్న సంగతినే మరిచేలా చేశాయి. అర చేతిలో ప్రపంచం మొత్తం ఇమిడిపోయింది. ఖండాంతరాల్లోని మారుమూల దేశాల్లోనివారితో సైతం ఎక్కడున్నవారైనా మాట్లాడగలిగే వెసులుబాటు అందుబాటులోకొచ్చింది. మనుష్య సంచారం అసాధ్యమనుకున్న చోటకు సైతం డ్రోన్లు వెళ్తున్నాయి. సాధారణ పనులు మొదలుకొని ప్రమాదం పొంచివుండే కార్యాలవరకూ రోబోలు చేస్తున్నాయి. సంక్లిష్ట సమస్యలకు చిటికెలో పరిష్కారం లభిస్తోంది. అందువల్ల ఉత్పాదకత పెరిగింది. చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ పని చేయగలిగే సామర్థ్యం మనుషుల సొంతమైంది. కావలసిన సమాచారం కోసం గూగుల్‌ని ఆశ్రయించేవారే నిమి షానికి 63 లక్షలమంది ఉన్నారంటే పరిస్థితేమిటో అర్థమవుతుంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయుఃప్రమాణం 52.5 సంవత్సరాలైతే ఆరోగ్యరంగ సాంకేతికతలవల్ల అది ప్రస్తుతం 72 సంవత్సరాలని ఐక్యరాజ్యసమితి నిరుడు ప్రకటించింది. సమాచార సాంకేతికతలు అనేకచోట్ల మనిషి అవసరాన్ని తగ్గించాయి. అందువల్ల కొందరి ఉద్యోగావకాశాలకు ముప్పు వచ్చిన మాట కూడా వాస్తవం. కానీ ఇదివరకెన్నడూ వినని అనేక రకాల కొత్త అవకాశాలు లభించాయి. వచ్చే ఏడాదికల్లా ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతికతల్లో 9 కోట్ల 70 లక్షల ఉద్యోగావకాశాలుంటాయని ఒక అంచనా. అయితే ఈ సాంకేతికతల వల్ల సాంఘిక జీవనం అస్తవ్యస్తమవుతున్నదని, మనిషి ఏకాకి అవుతున్నాడని, పర్యవసానంగా సమాజంలో అమానవీయత విస్తరించిందని, వ్యక్తి గోప్యతకు ముప్పు ఏర్పడిందని, పౌరుల జీవితాల్లోకి రాజ్యం చొరబాటు ఊహకందనంత పెరిగిందని కనబడు తూనేవుంది. తప్పుడు సమాచారం వ్యాప్తిచేసి లాభపడే శక్తులున్నట్టే, దానివల్ల నష్టపోతున్నవారూ అధికంగానే ఉన్నారు. ఈ సాంకేతికతల అభివృద్ధి పరుగులో పర్యావరణానికి కలుగుతున్న హాని గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. పారిశ్రామికీకరణ తర్వాత భవిష్యత్తు స్పృహ కొరవడి అడవుల, ఇతరేతర సహజ సంపదల విధ్వంసం, పర్యవసానంగా ప్రకృతి వైపరీత్యాలు క్రమేపీ పెరిగాయనుకుంటే ఐటీ అభివృద్ధి దీన్ని మరింత వేగవంతం చేసింది. పర్యావరణ అనుకూల సుస్థిరాభివృద్ధి వైపు దృష్టి సారించాలన్న వినతులు అరణ్యరోదనే అవుతున్నాయి. పాతికేళ్ల క్రితం వై2కె సమస్యతో ప్రపంచం తలకిందులవుతుందన్న ప్రచారం జరిగింది. ఈ సమస్య పరిష్కారానికి వేల కోట్లు ఖర్చుచేయటం తప్పనిసరన్న అంచనాలు వచ్చాయి. తీరా చాలా సులభంగానే దానికి పరిష్కారం దొరికింది. నిజానికి ఆ రోజుల్లో కంప్యూటర్ల వాడకం, వాటిపై ఆధారపడటం ఇప్పటితో పోలిస్తే తక్కువనే చెప్పాలి. కానీ తరచు సైబర్ దాడులతో తల్లడిల్లే సమా చార సాంకేతిక ప్రపంచంలో తాజా ఉదంతం ఒక పెద్ద కుదుపు. అప్రమత్తంగా లేకపోతే, విడుదల చేసేముందు ఒకటికి పదిసార్లు పరీక్షించి చూసుకోనట్టయితే ఒక సాఫ్ట్వేర్ ఎంతటి ఉత్పాతం సృష్టించగలదో తాజా ఉదంతం ఒక హెచ్చరిక. ఇంతవరకైతే ఫర్యాలేదు. కానీ దాదాపు అన్ని దేశాల రక్షణ వ్యవస్థలూ ఐటీతో ముడిపడివున్న వర్తమానంలో పొరపాటున సాఫ్ట్వేర్ లోపంతో కంప్యూటర్లు తప్పుగా అర్థం చేసుకుంటే పెనుముప్పు ఏర్పడుతుంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే మారణా యుధాలు భూగోళాన్ని వల్లకాడు చేస్తాయి. ఆ విషయంలో అప్రమత్తత అవసరం. -
‘ధర్మశాల’ అవుట్ ఫీల్డ్‌పై బట్లర్ అసంతృప్తి
ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. అయితే ఇంగ్లండ్ సారథి బట్లర్ ధర్మశాల స్టేడియంపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ ‘ఈ మైదానం పేలవంగా ఉంది. అవుట్‌ఫీల్డ్ ఆటగాళ్లకు ప్రమాదకరం. క్యాచ్‌లు పట్టేటపుడు, డైవింగ్ చేసేటపుడు ఫీల్డర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. పరుగు ఆపేందుకు డైవ్ చేస్తే గాయాల బారిన పడొచ్చు. ఐపీఎల్లో ఆడినప్పటిలా ఈ అవుట్‌ఫీల్డ్ లేదు. ఇది క్రికెటర్లకు ఇబ్బందికరం’ అని బట్లర్ అన్నాడు. బౌలర్లకు ప్రత్యేకించి పేసర్లు రనప్ ఏరియాను ఓ కంట కనిపెడుతూనే బౌలింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఈ వేదికపై అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు బంతిని అందుకునే క్రమంలో పదేపదే జారి పడ్డారు. దీంతో అఫ్గాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ అవుట్‌ఫీల్డ్ చెత్తగా ఉందన్నాడు. -
ఐపీఎల్ 2022: బట్లర్ భళా... చహల్ చాంగుభళా
IPL 2022 RR Vs KKR- ముంబై: ఐపీఎల్ పుట్టిన రోజున ఇంతకంటే ఆసక్తికర పోరును ఆశించలేమేమో! లీగ్ తొలి చాంపియన్, మెరుపు బ్యాటింగ్‌తో తొలి రోజును వెలిగించిన జట్ల మధ్య జరిగిన పోరు హోరాహోరీగా సాగి అభిమానులను అలరించింది. బట్లర్ సూపర్ సెంచరీకి తోడు యజువేంద్ర చహల్ ‘హ్యాట్రిక్’ ప్రదర్శన రాజస్తాన్‌ను గెలిపించాయి. చేతిలో 6 వికెట్లతో 24 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన స్థితిలో విజయం దిశగా సాగిన కోల్‌కతా... 17వ ఓవర్లో చహల్‌కు నాలుగు వికెట్లు సమర్పించుకొని ఓటమికి బాటలు వేసుకుంది. చివరకు 7 పరుగుల తేడాతో రాయల్స్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (61 బంతుల్లో 103; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఈ సీజన్లో రెండో సెంచరీ సాధించగా, సంజు సామ్సన్ (19 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లో 210 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (51 బంతుల్లో 85; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆరోన్ ఫించ్ (28 బంతుల్లో 58; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చహల్ ‘హ్యాట్రిక్’సహా ఐదు వికెట్లు తీశాడు. 17వ ఓవర్లోని చివరి మూడు బంతుల్లో వరుసగా శ్రేయస్ అయ్యర్, శివమ్ మావి, కమిన్స్‌లను అవుట్ చేసి చహల్ హ్యాట్రిక్ సాధించాడు. బట్లర్ మరో సెంచరీ... రాజస్తాన్‌ను నియంత్రించడంలో ఒక్క నరైన్ మినహా మిగతా బౌలర్లంతా విఫలమయ్యారు. ఎప్పటిలాగే బట్లర్ తనదైన శైలిలో దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించగా... ఈసారి దేవదత్ పడిక్కల్ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిని కనబర్చాడు. వరుణ్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన బట్లర్, మావి ఓవర్లోనూ వరుసగా 4, 6 బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 60 పరుగులకు చేరింది. ఆ తర్వాత 29 బంతుల్లోనే అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు 97 పరుగుల (59 బంతుల్లో) భాగస్వామ్యం తర్వాత పడిక్కల్‌ను అవుట్ చేయడంతో కోల్‌కతాకు తొలి వికెట్ దక్కింది. అయితే ఆ తర్వాత బట్లర్ జోరు కొనసాగగా, మూడో స్థానంలో వచ్చిన సామ్సన్ కూడా వేగంగా దూసుకుపోయాడు. ఉమేశ్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన అతను రసెల్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. కమిన్స్ వేసిన ఫుల్‌టాస్‌ను లాంగాన్ మీదుగా సిక్స్‌గా మలచి 59 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న బట్లర్... అదే ఓవర్లో అవుటయ్యాడు. అయితే చివర్లో హెట్‌మైర్ (13 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు రాయల్స్‌కు భారీ స్కోరును అందించాయి. రసెల్ వేసిన 20వ ఓవర్లోనే అతను 2 సిక్స్‌లు, ఫోర్ బాదాడు. శతక భాగస్వామ్యం... తొలి బంతికే నరైన్ (0) రనౌట్‌తో కోల్‌కతా ఇన్నింగ్స్ మొదలైంది. ఆ తర్వాత ఫించ్, శ్రేయస్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. శ్రేయస్ తొలి రెండు ఓవర్లలో వరుసగా రెండేసి ఫోర్లు కొట్టగా, ఐపీఎల్లో చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిన ఫించ్ కూడా బౌల్ట్ ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. చహల్ ఓవర్లోనూ మూడు ఫోర్లు, ఆపై మెక్కాయ్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన ఫించ్ 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు 107 పరుగుల పార్ట్నర్షిప్ తర్వాత ఫించ్ వెనుదిరగ్గా, 32 బంతుల్లో శ్రేయస్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ధాటిగా ఆడాల్సిన తరుణంలో మరో ఎండ్‌లో రాణా (18), రసెల్ (0) విఫలం కావడంతో గెలిపించాల్సిన బాధ్యత శ్రేయస్‌పై పడింది. అయితే ఉమేశ్ (9 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) పోరాడినా చివరకు కోల్‌కతాకు ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (సి) వరుణ్ (బి) కమిన్స్ 103; పడిక్కల్ (బి) నరైన్ 24; సామ్సన్ (సి) మావి (బి) రసెల్ 38; హెట్‌మైర్ (నాటౌట్) 26; పరాగ్ (సి) మావి (బి) నరైన్ 5; నాయర్ (సి) కమిన్స్ (బి) మావి 3; అశ్విన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–97, 2–164, 3–183, 4–189, 5–198. బౌలింగ్: ఉమేశ్ 4–0–44–0, మావి 4–0–34–1, వరుణ్ 2–0–30–0, కమిన్స్ 4–0–50–1, నరైన్ 4–0–21–2, రసెల్ 2–0–29–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) నాయర్ (బి) ప్రసిధ్ 58; నరైన్ (రనౌట్) 0; శ్రేయస్ (ఎల్బీ) (బి) చహల్ 85; రాణా (సి) బట్లర్ (బి) చహల్ 18; రసెల్ (బి) అశ్విన్ 0; వెంకటేశ్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 6; జాక్సన్ (సి) ప్రసిధ్ (బి) మెక్కాయ్ 8; మావి (సి) పరాగ్ (బి) చహల్ 0; కమిన్స్ (సి) సామ్సన్ (బి) చహల్ 0; ఉమేశ్ (బి) మెక్కాయ్ 21; వరుణ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 210. వికెట్ల పతనం: 1–0, 2–107, 3–148, 4–149, 5–178, 6–180, 7–180, 8–180, 9–209, 10–210. బౌలింగ్: బౌల్ట్ 4–0–48–0, ప్రసిధ్ 4–0–43–1, మెక్కాయ్ 3.4–0–41–2, అశ్విన్ 4–0–38–1, చహల్ 4–0–40–5. 21:ఐపీఎల్లో నమోదైన మొత్తం హ్యాట్రిక్‌లు. ఇందులో 12 మంది భారత బౌలర్లు హ్యాట్రిక్ తీయగా... అమిత్ మిశ్రా మూడుసార్లు, యువరాజ్ సింగ్ రెండుసార్లు చొప్పున హ్యాట్రిక్ సాధించడం విశేషం. ఐపీఎల్లో నేడు బెంగళూరు X లక్నో సూపర్ జెయింట్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం WHAT. A. GAME! WHAT. A. FINISH! 👏 👏 The 1⃣5⃣-year celebration of the IPL done right, courtesy a cracker of a match! 👌 👌@rajasthanroyals hold their nerve to seal a thrilling win over #KKR. 👍 👍 Scorecard ▶️ https://t.co/f4zhSrBNHi#TATAIPL | #RRvKKR pic.twitter.com/c2gFuwobFg — IndianPremierLeague (@IPL) April 18, 2022 -
చెన్నై చతికిలపడింది
‘ఒకే రోజు మూడు సూపర్ ఓవర్లతో ఐపీఎల్లో అద్భుతం చూశారు కదా... రేపు టెస్టు మ్యాచ్ చూడవచ్చు, లెక్క సరిపోతుంది’... ఆదివారం ఒక సగటు క్రికెట్ అభిమాని సరదా వ్యాఖ్య ఇది. ఇప్పుడు సరిగ్గా అలాగే జరిగింది. పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగిన పోరు ఏమాత్రం ఆసక్తి రేపకుండా చప్పగా సాగింది. పరుగు తీయడమే కష్టంగా మారినట్లు, బౌండరీ బాదడం అంటే బ్రహ్మాండం బద్దలు కొట్టాలేమో అన్నంత భారంగా చెన్నై బ్యాటింగ్ చేసింది. ఛేదనలో రాజస్తాన్ కూడా తడబడ్డా... స్మిత్, బట్లర్ భాగస్వామ్యంతో కీలక గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 78 బంతుల్లో అభేద్యంగా 98 పరుగులు జోడించి మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు. అబుదాబి: ఐపీఎల్లో ఆడిన 10 సార్లూ ప్లే ఆఫ్ చేసిన అరుదైన రికార్డు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ముందంజ వేయడంపై ఆశలు వదులుకోవాల్సిందే! సీజన్ మొత్తం తడబడుతూనే వస్తున్న ఈ మాజీ చాంపియన్ ఏడో పరాజయంతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సీజన్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. రవీంద్ర జడేజా (30 బంతుల్లో 35; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, ఎమ్మెస్ ధోని (28 బంతుల్లో 28; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జాస్ బట్లర్ (48 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (34 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి జట్టును విజయతీరం చేర్చారు. సమష్టి వైఫల్యం... మ్యాచ్ మ్యాచ్‌కూ మరింత పేలవ ప్రదర్శన కనబరుస్తున్న చెన్నై జట్టు బ్యాటింగ్ బలహీనత మరోసారి కనిపించింది. ఇన్నింగ్స్ మొత్తంలో 12 ఫోర్లు, 1 సిక్స్ మాత్రమే ఉండగా... భారీ షాట్లు ఆడే ప్రయత్నం కూడా బ్యాట్స్‌మెన్ చేయకపోవడం పరిస్థితిని సూచిస్తోంది. పేరుకు ధోని, జడేజా మధ్య 51 పరుగుల భాగస్వామ్యం నెలకొన్నా... అదీ 46 బంతుల్లో రావడం దూకుడులేమిని స్పష్టంగా చూపించింది. డు ప్లెసిస్ (10)ను తొందరగా అవుట్ చేసి రాజస్తాన్‌కు ఆర్చర్ శుభారంభం అందించాడు. యువ బౌలర్ త్యాగి తన తొలి ఓవర్లో 3 బౌండరీలు ఇచ్చినా... అదే ఓవర్లో వాట్సన్ (8)ను వెనక్కి పంపించాడు. స్టోక్స్ వేసిన ఐదో ఓవర్లో చెన్నై 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 15 పరుగులు రాబట్టింది. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 43 పరుగులకు చేరింది. ఆ తర్వాత మూడు పరుగుల వ్యవధిలో స్యామ్ కరన్ (25 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), రాయుడు (13) వెనుదిరిగారు. 10 ఓవర్లలో 56 పరుగులు చేసిన చెన్నై స్కోరు 15 ఓవర్లలో 89 పరుగులకు చేరింది. అనంతరం రెండో పరుగు తీసే ప్రయత్నంలో ధోని రనౌటయ్యాడు. జడేజా చలవతో ఆఖరి 5 ఓవర్లలో 3 ఫోర్లతో చెన్నై 36 పరుగులు జోడించగలిగింది. 49 బంతుల తర్వాత... చెన్నై ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్ చివరి బంతికి రాయుడు ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత జట్టు మరో బౌండరీ కోసం ఏకంగా 8.1 ఓవర్లు ఎదురు చూడాల్సి వచ్చింది. త్యాగి వేసిన 14వ ఓవర్ రెండో బంతికి త్యాగి ధోని మళ్లీ ఫోర్ కొట్టాడు. ఒక టి20 మ్యాచ్‌లో రెండు బౌండరీల మధ్య విరామం 49 బంతులు! రాజస్తాన్ ఇద్దరు లెగ్ స్పిన్నర్లు శ్రేయస్ గోపాల్, రాహుల్ తేవటియా ఎంతో ప్రభావం చూపించారు. వీరిద్దరు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 8 ఓవర్లలో కలిపి 32 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశారు. పైగా ఒక్క ఫోర్ కూడా ఇవ్వకపోవడం విశేషం. భారీ భాగస్వామ్యం... రాజస్తాన్‌కు కూడా సరైన ఆరంభం లభించలేదు. పవర్‌ప్లే ముగిసేలోపే పేలవ షాట్లతో స్టోక్స్ (19), ఉతప్ప (4), సామ్సన్ (0) వెనుదిరిగారు. ఈ దశ లో స్మిత్, బట్లర్ కూడా సమర్థంగా ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు. ఛేదించాల్సిన లక్ష్యం చిన్నది కావడంతో ఎలాంటి సాహసాలకు పోకుండా జాగ్రత్తగా, చక్కటి సమన్వయంతో ఆడారు. బట్లర్ తనదైన శైలిలో దూకుడుగా ఆడగా, స్మిత్ అతడికి సహకరించాడు. శార్దుల్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన బట్లర్... చావ్లా ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టి 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో మేం ఇక ముందుకు వెళ్లకపోవచ్చు. ప్రతీసారి అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. మా సన్నద్ధతలో ఏదైనా లోపం ఉందేమో చూడాలి. ఎందుకంటే సన్నాహాలను బట్టే ఫలితాలు ఉంటాయి. మన సన్నద్ధత బాగుంటే ఫలితాలు సాధించాలనే ఒత్తిడి దరిచేరదు. లోపాలను చక్కదిద్దుకునే పనిలో ఉన్నాం. 4–5 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత తుది జట్టులో పదే పదే మార్పులు చేయడం మంచిది కాదు. అలా చేస్తే ఆటగాళ్లలో అభద్రతాభావం పెరిగిపోతుంది. యువ ఆటగాళ్లను ఆడించడం లేదనే విమర్శ లో వాస్తవం ఉంది. అయితే మేం ఆశించినంత ప్రత్యేకత మా కుర్రాళ్లలో లేకపోవడం కూడా కారణం కావచ్చు. మున్ముందు వారికి అవకాశం ఇస్తే ఒత్తిడి లేకుండా ఆడతారేమో. –ఎమ్మెస్ ధోని, చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోని@200 ఐపీఎల్లో ధోని 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 170 మ్యాచ్‌లు చెన్నై తరఫున ఆడగా... చెన్నై నిషేధానికి గురైన రెండేళ్లలో పుణే సూపర్ జెయింట్స్ తరఫున మరో 30 మ్యాచ్‌లు ఆడాడు. లీగ్‌లో ధోని మొత్తం 4,596 పరుగులు సాధించగా... తాజా మ్యాచ్‌తో ఒక్క సీఎస్కే తరఫునే ధోని ఐపీఎల్లో 4 వేల పరుగుల మైలురాయిని (మొత్తం 4,022) కూడా దాటాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్యామ్ కరన్ (సి) బట్లర్ (బి) గోపాల్ 22; డు ప్లెసిస్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 10; వాట్సన్ (సి) తేవటియా (బి) త్యాగి 8; రాయుడు (సి) సామ్సన్ (బి) తేవటియా 13; ధోని (రనౌట్) 28; జడేజా (నాటౌట్) 35; కేదార్ జాదవ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–13; 2–26; 3–53; 4–56; 5–107. బౌలింగ్: ఆర్చర్ 4–0–20–1; అంకిత్ రాజ్‌పుత్ 1–0–8–0; కార్తీక్ త్యాగి 4–0–35–1; స్టోక్స్ 3–0–27–0; శ్రేయస్ గోపాల్ 4–0–14–1; రాహుల్ తేవటియా 4–0–18–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: స్టోక్స్ (బి) చహర్ 19; ఉతప్ప (సి) ధోని (బి) హాజల్‌వుడ్ 4; సామ్సన్ (సి) ధోని (బి) చహర్ 0; స్మిత్ (నాటౌట్) 26; బట్లర్ (నాటౌట్) 70; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–26; 2–28; 3–28. బౌలింగ్: దీపక్ చహర్ 4–1–18–2; హాజల్‌వుడ్ 4–0–19–1; జడేజా 1.3–0–11–0; శార్దుల్ 4–0–34–0; స్యామ్ కరన్ 1–0–6–0; చావ్లా 3–0–32–0. -
అశ్విన్ తప్పు చేశాడా!
రాజస్తాన్, పంజాబ్ మ్యాచ్‌లో బట్లర్ ఔట్ కొత్త వివాదాన్ని రేపింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతికి ఈ ఘటన జరిగింది. బట్లర్‌ను అశ్విన్ ‘మన్కడింగ్’ ద్వారా ఔట్ చేయడమే దీనికి కారణం. అశ్విన్ బంతి వేయబోయే సమయానికే బట్లర్ క్రీజ్ వదిలి కాస్త ముందుకు వచ్చాడు. దాంతో వెంటనే చేతిని వెనక్కి తీసుకున్న అశ్విన్ బెయిల్స్‌ను పడగొట్టి అప్పీల్ చేశాడు. థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్‌గానే ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది. నిబంధనల (రూల్ 41.16) ప్రకారమైతే థర్డ్ అంపైర్ చేసింది సరైందే. కానీ సుదీర్ఘ కెరీర్లో ‘జెంటిల్మన్’గా గుర్తింపు ఉన్న అశ్విన్... ఎలాగైనా వికెట్ తీయాలనే ప్రయత్నంలో ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరచింది. బంతిని వేసేందుకు ముందుకు వచ్చిన అశ్విన్ భుజాల వరకు చేతిని తెచ్చి అర క్షణం ఆగినట్లు రీప్లేలో కనిపించింది. బట్లర్ క్రీజ్ దాటేవరకు కావాలనే అతను వేచి చూసినట్లు అనిపించింది. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమై అశ్విన్ క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించేలా చేసింది. ‘‘మన్కడింగ్ ఘటనపై అసలు చర్చే అనవసరం. అదేమీ కావాలని చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నా బౌలింగ్ యాక్షన్ పూర్తి కాకముందే అతను క్రీజ్ వదిలాడు. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయి కాబట్టి బ్యాట్స్‌మన్ జాగరూకతతో ఉండటం అవసరం.’’ –అశ్విన్, పంజాబ్ కెప్టెన్ -
వెస్టిండీస్ ఘన విజయం
నార్త్‌సౌండ్: సొంతగడ్డపై వెస్టిండీస్ మరోసారి చెలరేగింది. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. బ్యాట్స్‌మెన్ మళ్లీ విఫలం కావడంతో ఇంగ్లండ్ శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే కుప్పకూలింది. బట్లర్ (24)దే అత్యధిక స్కోరు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కీమర్ రోచ్ (4/52), కెప్టెన్ హోల్డర్ (4/43) తమ పేస్‌తో ప్రత్యర్థిని పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 119 పరుగుల ఆధిక్యాన్ని మినహాయిస్తే...14 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 13 బంతుల్లో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. 2009 తర్వాత ఇంగ్లండ్‌పై వెస్టిండీస్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. మూడో టెస్టు ఈ నెల 9నుంచి గ్రాస్ ఐలెట్‌లో జరుగుతుంది. మరోవైపు స్లో ఓవర్ రేట్ కారణంగా విండీస్ కెప్టెన్ హోల్డర్‌పై ఐసీసీ ఒక టెస్టు నిషేధం విధించడంతో తర్వాతి మ్యాచ్‌కు అతను దూరం కానున్నాడు. -
ఇంగ్లండ్ 285 ఆలౌట్
క్యాండీ: ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ (119 బంతుల్లో 64; 1 ఫోర్, 6 సిక్స్‌లు) చివర్లో భారీ షాట్లతో విరుచుకుపడటంతో శ్రీలంకతో బుధవారం మొదలైన రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది. బట్లర్ (63; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... బర్న్స్ (43; 5 ఫోర్లు), ఆదిల్ రషీద్ (31; 2 ఫోర్లు, సిక్స్) ఫర్వాలేదనిపించారు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో తడబడింది. లంక స్పిన్నర్లు దిల్రువాన్ పెరీరా (4/61), పుష్పకుమార (3/89), అఖిల ధనంజయ (2/80) ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు వరుస కట్టారు. జెన్నింగ్స్ (1), స్టోక్స్ (19), కెప్టెన్ రూట్ (14), మొయిన్ అలీ (10), ఫోక్స్ (19) నిరాశ పరిచారు. 225 పరుగులకే 9 వికెట్లు పడిన దశలో కరన్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. అండర్సన్ (7 నాటౌట్)తో కలిసి చివరి వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. -
ఇంగ్లండ్‌ను గెలిపించిన బట్లర్
మాంచెస్టర్: తమ వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ కొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాపై తొలిసారి 5–0తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన చివరిదైన ఐదో వన్డేలో బట్లర్ (110 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటంతో ఇంగ్లండ్ వికెట్ తేడాతో నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత ఆసీస్ 34.4 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్ 48.3 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 208 పరుగులు చేసి నెగ్గింది. ఒకదశలో ఇంగ్లండ్ 114 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే ఆదిల్ రషీద్ (20)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బట్లర్ 81 పరుగులు జోడించాడు. రషీద్ ఔటయ్యాక జేక్ బాల్ (1 నాటౌట్)తో కలిసి బట్లర్ మిగతా పని పూర్తి చేశాడు. -
ఐపీఎల్‌తోనే ఫామ్‌లోకి వచ్చా: బట్లర్
లండన్: ఈ సీజన్ ఐపీఎల్ వల్లే టెస్టుల్లోనూ రాణించగలుగుతున్నానని ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ వెల్లడించాడు. పాకిస్తాన్‌తో తొలి టెస్టులో 67 పరుగులు చేసిన అతను రెండో టెస్టులో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ టెస్టులో ఇంగ్లండ్ గెలిచింది. 2014 నుంచి ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనూ సెంచరీ చేయలేకపోయిన బట్లర్‌కు ఆశ్చర్యకరంగా టెస్టు జట్టులో చోటు లభించింది. ఈ అవకాశాన్ని అతను అర్ధసెంచరీలతో చాటుకున్నాడు. ‘ఐపీఎల్ ఆటతోనే నాలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసం పెరిగింది. భారత్‌లో తీవ్ర ఒత్తిడిలో ఆడిన అనుభవం బాగా దోహదం చేసింది. అక్కడ వేల మంది ప్రేక్షకుల మధ్య ఒత్తిడి తట్టుకొని విజయవంతం కావడంతో నా ఆటతీరుపై నమ్మకం బాగా పెరిగింది. ఈ ఉత్సాహంతో ఇప్పుడు ఏ రంగు బంతి అయినా సరే యథేచ్ఛగా ఆడగలను. ఈ ఫామ్‌ను ఇక ముందు కొనసాగిస్తా’నని 27 ఏళ్ల బట్లర్ అన్నాడు. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్ కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించాడు. -
బట్లర్‌కు మళ్లీ టెస్టు పిలుపు
లండన్: దాదాపు ఏడాదిన్నర తర్వాత జాస్ బట్లర్‌కు ఇంగ్లండ్ సెలక్టర్లు టెస్టుల్లో అవకాశం కల్పించారు. ఈ నెల 24 నుంచి లార్డ్స్‌లో పాకిస్తాన్‌తో జరిగే తొలి టెస్టు కోసం ఎంపిక చేసిన 12 మంది సభ్యుల జట్టులో బట్లర్‌కు చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో అతను వికెట్‌కీపర్‌గా కాకుండా రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగుతాడు. వన్డేలు, టి20ల్లో రెగ్యులర్ సభ్యుడైన బట్లర్... 18 టెస్టుల కెరీర్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో అతని ఇటీవలి ప్రదర్శన అనంతరం బట్లర్‌ను టెస్టుల్లోకి మళ్లీ తీసుకునేందుకు సరైన సమయంగా భావించినట్లు సెలక్టర్లు ప్రకటించారు. మరో బ్యాట్స్‌మన్ జేమ్స్ విన్స్ జట్టులో స్థానం కోల్పోగా... కొత్తగా ఆఫ్ స్పిన్నర్ డొమినిక్ బెస్‌కు అవకాశం దక్కింది. ఐపీఎల్లో అద్భుత ఫామ్‌లో ఉన్న బట్లర్ రాజస్తాన్ రాయల్స్ తరఫున వరుసగా ఐదు అర్ధ సెంచరీలతో చెలరేగాడు. -
చెన్నైపై తడాఖా.. ఇదే నా బెస్ట్: బట్లర్
జైపూర్: ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగే అంటున్నాడు జోస్ బట్లర్. ఐపీఎల్ 2018లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పర్ఫెక్ట్ ఇన్నింగ్స్(60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు.. 95 పరుగులు) ఆడి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్అని, భార్య చూస్తుండగా గెలుపొందడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. (చదవండి: ధోనీ ఆగ్రహం.. ఓటమిపై వివరణ) నమ్మకాన్ని నిలబెట్టా: బేసిగ్గా నేను మిడిలార్డర్లో వచ్చేవాడిని. ఇప్పుడు ఓపెనర్ పాత్రను బాగా ఎంజాయ్ చేస్తున్నా. బ్యాటింగ్ ఆర్డర్లో నన్ను పైకి పంపాలన్న నిర్ణయం కోచ్ షేన్ వార్న్‌దే. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నా. చెన్నైపై ఆడటం అంతసులువేమీకాదు. చివరిదాకా నిలబడి, జట్టును గెలిపించడం ఆనందంగా ఉంది. ఇది(60 బంతుల్లో 95) నా బెస్ట్ ఇన్నింగ్స్’’ అని బట్లర్ చెప్పాడు. (బట్లర్ వీరబాదుడు హైలైట్స వీడియో కింద చూడొచ్చు) ఆమె ముందుర..: ‘‘ప్రస్తుతం నా భర్య ఇండియాలోనే ఉంది. అత్తమామలు, కజిన్ కూడా తనతో మ్యాచ్ చూడటానికి వచ్చారు. ఆమె ముందర బెస్ట్ ఇన్నింగ్స ఆడటం, గెలవడం మర్చిపోలేని అనుభూతి. ప్రపంచంలోనే బెస్ట్ టోర్నీ ఐపీఎల్. ఇక్కడ నేర్చుకోవడానికి ఎంతో దొరుకుతుంది..’’ అని పేర్కొన్నాడు. మ్యాచ్ రిపోర్ట్: వరుసగా రెండో గెలుపుతో రాజస్తాన్ రాయల్స్... ఐపీఎల్ ఫ్లే ఆఫ్ రేసును రసవత్తరంగా మార్చింది. పటిష్ఠమైన చెన్నై సూపర్ కింగ్స్‌తో సొంతగడ్డపై శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జాస్ బట్లర్ (60 బంతుల్లో 95 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌తో ఆ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సురేశ్ రైనా (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకానికి తోడు ఓపెనర్ వాట్సన్ (31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ ధోని (23 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. -
నమ్మకాన్ని నిలబెట్టా: జోస్ బట్లర్
-
మూడో టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టులోకి బట్లర్
భారత్‌తో శనివారం నుంచి మొహాలీలో జరిగే మూడో టెస్టులో ఇంగ్లండ్ తుది జట్టులోకి జాస్ బట్లర్ రావడం ఖాయమైంది. రెండు టెస్టుల్లోనూ విఫలమైన డకెట్ స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా బట్లర్ ఆడతాడు. ఇప్పటి వరకు కెరీర్లో 15 టెస్టులు ఆడిన బట్లర్, ఏడాది క్రితం జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత ఒకే ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన అతని రికార్డు ఏమంత బాగా లేదు. అరుుతే ప్రత్యామ్నాయాలు పెద్దగా అందుబాటులోలేకపోవడంతో బట్లర్‌ను ఇంగ్లండ్ ఎంపిక చేయాల్సి వచ్చింది. ఈ సారి అతను మెరుగైన ప్రదర్శన కనబరుస్తాడని కోచ్ ట్రెవర్ బెలిస్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
బట్లర్ షో
ఏకైక టి20లో శ్రీలంకపై ఇంగ్లండ్ విజయం సౌతాంప్టన్: ఓపెనర్ బట్లర్ (49 బంతుల్లో 73 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగిపోవడంతో శ్రీలంకతో జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. మంగళవారం ఇక్కడి రోజ్ బౌల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో శ్రీలంక పరాజయం చవిచూసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. గుణతిలక (26) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్ (3/27)తో అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టగా... జోర్డాన్ కూడా 3 వికెట్లతో రాణించాడు. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్... బట్లర్, మోర్గాన్ (39 బంతుల్లో 47 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడటంతో 17.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసి విజయం సాధించింది. శ్రీలంక బౌలర్లలో మాథ్యుస్ రెండు వికెట్లు పడగొట్టాడు. -
ఇలాంటి బర్త్ డే ఎక్కడా చూడలేరేమో.. !
వాషింగ్టన్: ఒక వ్యక్తి వందో పుట్టిన రోజు జరుపుకోవడమంటేనే ఈ రోజుల్లో ఆశ్చర్యకరమైన విషయం. అలాంటిది ముగ్గురు స్నేహితులు కలిసి వందో పుట్టిన రోజు జరుపుకునే సందర్భం వస్తే ఎలా ఉంటుంది? అమెరికాలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఒక స్నేహితుడుగానీ, స్నేహితురాలుగానీ కలిసి పుట్టిన రోజు జరుపుకునే సందర్భాలు కేవలం వేళ్లపై లెక్కబెట్టుకునేన్ని మాత్రమే ఉండే ఈ రోజుల్లో ఏకంగా ఓ ముగ్గురు స్నేహితురాళ్లు పుట్టిన రోజుకు హాజరుకావడమే కాకుండా ఏకంగా వందో పుట్టిన రోజు కలిసి ముందస్తుగా జరుపుకున్నారు. ఈ ముగ్గురికి కూడా అక్కడి మేయర్ ప్రత్యేక శుభాభినందనలు తెలియజేశారు. వాషింగ్టన్ లో 1916 జూలై నెలలో బార్నెస్, బట్లర్, అండర్ వుడ్, రూత్ హామెట్ అనే నలుగురు జన్మించారు. వీరు చిన్నప్పటి నుంచే మంచి స్నేహితురాళ్లు. సంసారాల్లో వేర్వేరు జీవితాలతో బిజీగా ఉన్న పండుగలు, పబ్బాలకే కాకుండా తమ పుట్టిన రోజుకు తప్పనిసరిగా కలుస్తుంటారు. వాషింగ్టన్ లోని జియాన్ బాప్టిస్ట్ చర్చిలో తమ పుట్టిన రోజు జరుపుకుంటారు. మరికొద్ది రోజుల్లో వారికి వందేళ్లలోకి అడుగుపెడతారు. అయితే, ఈ నలుగురిలో బార్నెస్ అనే తమ స్నేహితురాలు చనిపోగా మిగిలి ఉన్న ఆ ముగ్గురు స్నేహితురాళ్లు అదే చర్చిలో వందో పుట్టిన రోజు కేక్ కట్ చేశారు. ఎంతో సంబురంగా జరిగిన వేడుకలో తమ కుటుంబాల సంతానమే ఒక పెద్ద సమూహంగా దర్శనమిచ్చింది. ఈ సందర్బంగా ఒక్కొకరు ఒక అరగంట మాట్లాడి తమ స్మృతులు నెమరు వేసుకున్నారు. -
జిల్ జిల్ జి‘గేల్’
► అజేయ సెంచరీతో చెలరేగిన కరీబియన్ స్టార్ ► ఇంగ్లండ్‌పై విండీస్ ఘన విజయం టి20 ప్రపంచకప్ విధ్వంసానికి పరాకాష్ట... క్రిస్‌గేల్ ఎప్పుడు టి20 మ్యాచ్ ఆడినా చాలా సహజంగా వినిపించే పదం. ఈసారి అలాంటి విధ్వంసాన్ని మించిన విలయం సృష్టిస్తూ... బంతికే భయం పుట్టిస్తూ... ప్రత్యర్థుల వెన్నులో వణుకు తెప్పిస్తూ... మరోసారి క్రిస్‌గేల్ విశ్వరూపం చూపించాడు. టి20 ప్రపంచకప్ చరిత్రలో వేగవంతమైన సెంచరీతో వెస్టిండీస్‌కు ఘన విజయాన్ని అందించాడు. ముంబై: టి20ల్లో తను ఎంత ప్రమాదకరమో క్రిస్ గేల్ (48 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 11 సిక్సర్లు) మరోసారి నిరూపించాడు. కళ్ల ముందు భారీ లక్ష్యం ఉన్నా... పూనకం వచ్చినోడిలా ఇంగ్లిష్ బౌలర్ల భరతం పట్టాడు. సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపిస్తూ టి20 ప్రపంచకప్‌లో అజేయ సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో కరీబియన్ జట్టు 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. రూట్ (36 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బట్లర్ (20 బంతుల్లో 30; 3 సిక్సర్లు), హేల్స్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు), మోర్గాన్ (14 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. 37 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్‌ను రూట్, హేల్స్ రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించి ఆదుకున్నారు. దీంతో తొలి పది ఓవర్లలో ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. మిడిలార్డర్లో బట్లర్, మోర్గాన్ నాలుగో వికెట్‌కు 3.3 ఓవర్లలోనే 38 పరుగులు జత చేశారు. ఓవరాల్‌గా చివరి మూడు ఓవర్లలో 40 పరుగులు వచ్చాయి. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన వెస్టిండీస్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే చార్లెస్ (0)ను అవుట్ చేసి ఇంగ్లండ్ ఆరంభంలోనే విండీస్‌కు షాకిచ్చింది. అయితే రెండో ఓవర్లో ఓ ఫోర్, సిక్సర్‌తో కాస్త కుదురుకున్న గేల్ ఆ తర్వాత తన విశ్వరూపం చూపాడు. సహచరులు మెల్లగా ఆడినా... తను మాత్రం సిక్సర్ల జోరు చూపెట్టాడు. శామ్యూల్స్ (27 బంతుల్లో 37; 8 ఫోర్లు) కూడా వరుస బౌండరీలు బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి కరీబియన్ జట్టు స్కోరు 55/1గా మారింది. ఆరో ఓవర్లో శామ్యూల్స్ అవుట్‌కావడంతో రెండో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత రామ్‌దిన్ (12) నెమ్మదించినా... రషీద్, స్టోక్స్ ఓవర్లలో గేల్ నాలుగు సిక్సర్లు బాదాడు. కానీ వరుస ఓవర్లలో రామ్‌దిన్, డ్వేన్ బ్రేవో (2)లు అవుట్‌కావడంతో విండీస్ కాస్త తడబడింది. అయితే అలీ వేసిన 14వ ఓవర్లో గేల్ వరుసగా మూడు సిక్సర్లతో 22 పరుగులు రాబట్టి మళ్లీ ఊపు తెచ్చాడు. రస్సెల్ (16 నాటౌట్) సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ గేల్‌కు ఎక్కువగా బ్యాటింగ్ ఇవ్వడంతో ప్రత్యర్థి బౌలర్లు చేష్టలుడిగిపోయారు. 16వ ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాదిన గేల్.... 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఓవరాల్‌గా రామ్‌దిన్‌తో మూడో వికెట్‌కు 46; రస్సెల్‌తో ఐదో వికెట్‌కు అజేయంగా 70 పరుగులు జత చేయడంతో విండీస్ 11 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) బద్రీ (బి) రస్సెల్ 15; హేల్స్ (బి) బెన్ 28; రూట్ (సి) టేలర్ (బి) రస్సెల్ 48; బట్లర్ (సి) బ్రాత్‌వైట్ (బి) బ్రేవో 30; మోర్గాన్ నాటౌట్ 27; స్టోక్స్ ఎల్బీడబ్ల్యు (బి) బ్రేవో 15; మొయిన్ అలీ రనౌట్ 7; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1-37; 2-92; 3-114; 4-152; 5-175; 6-182. బౌలింగ్: టేలర్ 3-0-30-0; బద్రీ 4-0-34-0; రస్సెల్ 4-0-36-2; డ్వేన్ బ్రేవో 4-0-41-2; బెన్ 3-0-23-1; బ్రాత్‌వైట్ 2-0-16-0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) అలీ (బి) విల్లే 0; గేల్ నాటౌట్ 100; శామ్యూల్స్ (సి) విల్లే (బి) రషీద్ 37; రామ్‌దిన్ (సి) రషీద్ (బి) అలీ 12; బ్రేవో (సి) హేల్స్ (బి) టోప్లే 2; రస్సెల్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1-2; 2-57; 3-103; 4-113. బౌలింగ్: విల్లే 3-0-33-1; టోప్లే 2.1-0-22-1; జోర్డాన్ 4-0-24-0; స్టోక్స్ 3-0-42-0; రషీద్ 2-0-20-1; అలీ 4-0-38-1. విశేషాలు ► టి20 ప్రపంచకప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (10) కొట్టిన బ్యాట్స్‌మన్‌గా గతంలో తన పేరిట ఉన్న రికార్డును ఈ మ్యాచ్‌లో గేల్ (11 సిక్సర్లు) సవరించాడు. ► టి20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా గేల్ (98 సిక్సర్లు) నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్-91 సిక్సర్లు) పేరిట ఉండేది. ► టి20 ప్రపంచకప్ చరిత్రలో ఇది ఎనిమిదో సెంచరీ. ఓవరాల్‌గా టి20 అంతర్జాతీయ పోటీల్లో ఇది 20వ సెంచరీ. ఈ 20 సెంచరీల్లో గేల్, మెకల్లమ్లవి రెండేసి ఉన్నాయి. ► టి20 ప్రపంచకప్‌లో తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రికార్డును గేల్ (47 బంతుల్లో) నెలకొల్పాడు. టి20 అంతర్జాతీయ పోటీల్లో ఇది సంయుక్తంగా మూడో వేగవంతమైన సెంచరీ. రిచర్డ్ లెవీ (దక్షిణాఫ్రికా-45 బంతుల్లో), డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా-46 బంతుల్లో), ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా-47 బంతుల్లో) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
ఆజానుబాహుబలి
హ్యూమర్ ఫ్లస్ ఆయన పేరు ఆజానుబాహుబలి. ఒకరోజు షవర్ కింద స్నానం చేస్తూ వుండగా ‘‘నేనెవర్ని?’’ అని అనుమానమొచ్చింది. నడుంకి టవల్ బిగించి బయటికొచ్చి ‘‘నేనెవర్ని?’’ అని అరిచాడు.‘‘ఇంట్లో కుక్వి, గెస్ట్లొస్తే చెఫ్‌వి. స్టయిల్‌గా చెప్పాలంటే బట్లర్వి, మోటుగా వంటాడివి’’ అని విడమరిచి చెప్పింది భార్య. ‘‘ఇంతకీ నేను ఇంటోడినా? వంటోడినా?’’ ‘‘అదంతా చెప్పాలంటే మీ నాన్న అమరేంద్ర నరబలి దగ్గరుంచి మొదలుపెట్టాలి. చాలా పెద్ద కథ. రెండు పార్టులుగా చెప్పాల్సి వుంటుంది. వెళ్లి బట్టలేసుకురా. లేదంటే ఆవేశంలో నరాలు పొంగి తువ్వాలు ఊడిపోవచ్చు.’’ కథ మొదలైంది. ‘‘ఎవరి పేరు చెబితే జనం కకావికలమవుతారో, ఎవరి వంట తింటే కంట కన్నీరు ఒలుకుతుందో ఆయనే అమరేంద్ర. ఆయన వండితే సగంమంది పైకి, మిగిలిన సగం ఆస్పత్రికి వెళ్ళేవాళ్ళు. దాంతో అందరూ అమరేంద్ర నరబలి అని పిలిచేవాళ్ళు. నిజానికి వంట ఆయన ఇంటావంటా లేదు. మీ అమ్మని చేసుకున్న తరువాత నేర్చుకోవాల్సి వచ్చింది. ఆయన వంట తిన్న మీ అమ్మ జడుసుకుని భర్త వండింది తినకుండా ఉండడానికి సేఫ్టీకోసం తనను తాను గొలుసులతో బంధించుకుంది. ఇదిలావుండగా అకాలకేయుడు అనే ఆటవిక నాయకుడికి మీ నాన్న విషయం తెలిసింది. మనుషుల్ని సింగిల్ సింగిల్‌గా చంపడంకంటే ఒక మెస్సు పెట్టి మాస్‌గా చంపాలని పథకమేసి సైన్యంతో సహా వచ్చాడు. మీ నాన్నని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడానికి ‘క్కిట్టమ్మప్ప, బ్రాష్కో, ట్టగ్గర్ర’ అని ప్రతి పదానికి ఒత్తునిచ్చే భాషలో మాట్లాడి లొట్టలేశాడు. మీ నాన్న ఒత్తులు, కత్తులకి లొంగేవాడు కాదు. వాడి భాష అర్థం కాకపోయినా లొట్టలేసింది తన వంటకోసమేనని అపార్థం చేసుకుని వండి వడ్డించాడు. సైన్యం అప్పుడే పోగా, అకాలకేయుడు డయేరియాతో వాడి పాపాన వాడే పోయాడు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా నువ్వు పుట్టావు. నీ క్షేమం కోసం మీ నాయనమ్మ చంటి బిడ్డతో నదిని దాటాలనుకుంది. అయితే నదిలో నీళ్ళు లేవు. ఖర్మగాలి కాళ్ళు కాలాయి. నిన్నో గూడెం వాళ్ళకి ఇచ్చి నీడకోసం ఆమె ఎక్కడికో పారిపోయి మళ్ళీ రాలేదు’’ అని ఆమె కథ ముగించింది. ‘‘అయితే ఇప్పుడు మా నాన్న ఎక్కడ?’’ ‘‘లేడు. వెళ్ళిపోయాడు పైకి’’ ‘‘కత్తికి లొంగడన్నావు. బల్లెం భయపెట్టదన్నావు.’’ ‘‘కత్తిపోటు, బల్లెంపోటు కంటే సాపాటు ప్రమాదకరమైంది. నేనే నా చేతులతో పళ్ళెంలో వడ్డించాను.’’ ‘‘ఎందుకని?’’ తల విదిలించి ఆవేశంగా అరిచాడు ఆజానుబాహుబలి. ‘‘నాకు మాత్రమేం తెలుసు? సెకెండ్ పార్ట్‌లో చెబుతా.’’ - జి.ఆర్. మహర్షి -
ఆట సమం... అటుపై వర్షం!
మాంచెస్టర్‌లో రెండో రోజు ఆరంభంలో భారత పేసర్ల జోరు... 34 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు... మ్యాచ్‌పై పట్టు దొరికినట్లే అనిపించింది. కానీ రూట్, బట్లర్ పోరాడారు. దాంతో ఇంగ్లండ్‌కు కోలుకునే అవకాశం చిక్కింది. 36 ఓవర్ల ఆటలో ఇరు జట్లు సమఉజ్జీలుగా నిలిచిన వేళ... నేనున్నానంటూ మధ్యలో వానొచ్చింది. దాదాపు మూడున్నర గంటల పాటు ప్రభావం చూపించింది. ఫలితంగా శుక్రవారం ఆటలో ఎక్కువ భాగం వర్షార్పణమైంది. రెండో రోజు మ్యాచ్‌కు వాన దెబ్బ కేవలం 36 ఓవర్ల ఆట సాధ్యం ఇంగ్లండ్ 237/6 భారత్‌పై 85 పరుగుల ఆధిక్యం ఓల్డ్ ట్రాఫర్డ్: భారత్, ఇంగ్లండ్ నాలుగో టెస్టు మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. భారీ వర్షం కారణంగా రెండో రోజు ఆట రెండు సెషన్లు కూడా సాగలేదు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. జో రూట్ (94 బంతుల్లో 48 బ్యాటింగ్; 5 ఫోర్లు), జాస్ బట్లర్ (53 బంతుల్లో 22 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఇయాన్ బెల్ (82 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 85 పరుగులు ముందంజలో ఉంది. రెండో రోజు ఇంగ్లండ్ 36 ఓవర్లలో 124 పరుగులు చేసింది. వికెట్‌పై తేమ ఉండటంతో తొలి రోజులాగే రెండో రోజు ఉదయం కూడా పేస్ బౌలర్లు ప్రభావం చూపించారు. దాంతో తక్కువ వ్యవధిలో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ (3/47), ఆరోన్ (3/48)లకే ఆ వికెట్లు దక్కాయి. అయితే రూట్, బట్లర్ ఏడో వికెట్‌కు అభేద్యంగా 67 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఇదే తరహా వాతావరణంలో శనివారం ఉదయం కూడా భారత బౌలర్లు చెలరేగితే ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం దక్కకుండా నివారించవచ్చు. అప్పుడే ఈ మ్యాచ్‌లో టీమిండియా కోలుకునే అవకాశం ఉంది. స్కోరు వివరాలు : భారత్ తొలి ఇన్నింగ్స్: 152 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (సి) పంకజ్ (బి) ఆరోన్ 17; రాబ్సన్ (బి) భువనేశ్వర్ 6; బాలెన్స్ (ఎల్బీ) (బి) ఆరోన్ 37; బెల్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 58; జోర్డాన్ (సి) ఆరోన్ (బి) భువనేశ్వర్ 13; రూట్ (బ్యాటింగ్) 48; అలీ (బి) ఆరోన్ 13; బట్లర్ (బ్యాటింగ్) 22; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (71 ఓవర్లలో 6 వికెట్లకు) 237 వికెట్ల పతనం: 1-21; 2-36; 3-113; 4-136; 5-140; 6-170. బౌలింగ్: భువనేశ్వర్ 18-6-47-3; పంకజ్ సింగ్ 17-2-79-0; ఆరోన్ 16-2-48-3; అశ్విన్ 13-1-28-0; జడేజా 7-0-21-0. తొలి సెషన్: భారత్ జోరు రెండో రోజు ఆట ప్రారంభమయ్యాక రెండో ఓవర్లోనే బెల్ 63 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కొద్ది సేపటికే నైట్‌వాచ్‌మన్ జోర్డాన్ (13)ను అవుట్ చేసి భువనేశ్వర్ బ్రేక్ ఇచ్చాడు. మిడ్వికెట్లో ఆరోన్ చక్కటి క్యాచ్ అందుకోవడం విశేషం. మరో నాలుగు పరుగులకే ఇంగ్లండ్ జట్టు బెల్ వికెట్ కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ వికెట్ కూడా భువీ ఖాతాలోకే వెళ్లింది. ఆ వెంటనే ప్రత్యర్థిని కోలుకోనీయకుండా ఆరోన్ అద్భుత బంతితో మొయిన్ అలీ (13)ని బౌల్డ్ చేశాడు. ఈ దశలో ఇంగ్లండ్, భారత్‌కంటే కేవలం 18 పరుగులు ముందంజలో ఉంది. అయితే రూట్, బట్లర్ లంచ్ వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. మొత్తానికి ఈ సెషన్లో టీమిండియా ఆధిక్యం కనబరిచింది. ఓవర్లు: 27, పరుగులు: 88, వికెట్లు: 3 రెండో సెషన్: రూట్, బట్లర్ నిలకడ విరామం తర్వాత ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జోరు పెంచారు. ధాటిగా ఆడి పరుగులు రాబట్టారు. 87 బంతుల్లో ఈ జోడి 50 పరుగులు చేర్చి పరిస్థితిని చక్కదిద్దింది. ఇంగ్లండ్ ఆధిక్యం 85 పరుగులకు చేరిన తర్వాత భారీ వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. సుదీర్ఘ సమయం పాటు వాన కురిసి ఆట ఆరంభం కాకపోవడంతో అంపైర్లు టీ విరామం ప్రకటించారు. ఓవర్లు: 9, పరుగులు: 36, వికెట్లు: 0