ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగే అంటున్నాడు జోస్ బట్లర్. ఐపీఎల్ 2018లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పర్‌ఫెక్ట్ ఇన్నింగ్స్(60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు.. 95 పరుగులు) ఆడి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్‌అని, భార్య చూస్తుండగా గెలుపొందడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు.