ఈసారి ఐపీఎల్ సీజన్‌లో మహేంద్రసింగ్ ధోని చిన్నారి కూతురు జివా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన ముద్దుముద్దు చేష్టలు, ఆటలతో అందరి హృదయాలను ఈ క్యూట్ బేబి గెలుచుకుంది. చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచుల సందర్భంగా మైదానంలో, మైదానం బయట తండ్రి ధోనీతో కలిసి కనిపించిన జివా.. ఈసారి ఐపీఎల్‌కు కొత్త ఫ్లెవర్ అద్దింది.