
లండన్: దాదాపు ఏడాదిన్నర తర్వాత జాస్ బట్లర్‌కు ఇంగ్లండ్ సెలక్టర్లు టెస్టుల్లో అవకాశం కల్పించారు. ఈ నెల 24 నుంచి లార్డ్స్‌లో పాకిస్తాన్‌తో జరిగే తొలి టెస్టు కోసం ఎంపిక చేసిన 12 మంది సభ్యుల జట్టులో బట్లర్‌కు చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో అతను వికెట్‌కీపర్‌గా కాకుండా రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగుతాడు. వన్డేలు, టి20ల్లో రెగ్యులర్ సభ్యుడైన బట్లర్... 18 టెస్టుల కెరీర్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని ఇటీవలి ప్రదర్శన అనంతరం బట్లర్‌ను టెస్టుల్లోకి మళ్లీ తీసుకునేందుకు సరైన సమయంగా భావించినట్లు సెలక్టర్లు ప్రకటించారు. మరో బ్యాట్స్‌మన్ జేమ్స్ విన్స్ జట్టులో స్థానం కోల్పోగా... కొత్తగా ఆఫ్ స్పిన్నర్ డొమినిక్ బెస్‌కు అవకాశం దక్కింది. ఐపీఎల్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న బట్లర్ రాజస్తాన్ రాయల్స్ తరఫున వరుసగా ఐదు అర్ధ సెంచరీలతో చెలరేగాడు.