ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. అయితే ఇంగ్లండ్ సారథి బట్లర్ ధర్మశాల స్టేడియంపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ ‘ఈ మైదానం పేలవంగా ఉంది. అవుట్‌ఫీల్డ్ ఆటగాళ్లకు ప్రమాదకరం. క్యాచ్‌లు పట్టేటపుడు, డైవింగ్ చేసేటపుడు ఫీల్డర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. పరుగు ఆపేందుకు డైవ్ చేస్తే గాయాల బారిన పడొచ్చు.
ఐపీఎల్‌లో ఆడినప్పటిలా ఈ అవుట్‌ఫీల్డ్ లేదు. ఇది క్రికెటర్లకు ఇబ్బందికరం’ అని బట్లర్ అన్నాడు. బౌలర్లకు ప్రత్యేకించి పేసర్లు రనప్ ఏరియాను ఓ కంట కనిపెడుతూనే బౌలింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఈ వేదికపై అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు బంతిని అందుకునే క్రమంలో పదేపదే జారి పడ్డారు. దీంతో అఫ్గాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ అవుట్‌ఫీల్డ్ చెత్తగా ఉందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment