Outfield
-
‘ధర్మశాల’ అవుట్ ఫీల్డ్‌పై బట్లర్ అసంతృప్తి
ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. అయితే ఇంగ్లండ్ సారథి బట్లర్ ధర్మశాల స్టేడియంపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ ‘ఈ మైదానం పేలవంగా ఉంది. అవుట్‌ఫీల్డ్ ఆటగాళ్లకు ప్రమాదకరం. క్యాచ్‌లు పట్టేటపుడు, డైవింగ్ చేసేటపుడు ఫీల్డర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. పరుగు ఆపేందుకు డైవ్ చేస్తే గాయాల బారిన పడొచ్చు. ఐపీఎల్లో ఆడినప్పటిలా ఈ అవుట్‌ఫీల్డ్ లేదు. ఇది క్రికెటర్లకు ఇబ్బందికరం’ అని బట్లర్ అన్నాడు. బౌలర్లకు ప్రత్యేకించి పేసర్లు రనప్ ఏరియాను ఓ కంట కనిపెడుతూనే బౌలింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఈ వేదికపై అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు బంతిని అందుకునే క్రమంలో పదేపదే జారి పడ్డారు. దీంతో అఫ్గాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ అవుట్‌ఫీల్డ్ చెత్తగా ఉందన్నాడు. -
విమానం టేకాఫ్ సమయంలో అపశ్రుతి... చక్రం బురదలో కూరుకుపోయి..
గౌహతి: ఇటీవల విమానాల్లో ఏదో సాంకేతిక సమస్య తలెత్తడం అప్పటికప్పుడూ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం జరుగుతోంది. ఇలాంటి ఘటనలు ఇటీవల మొత్తం మూడు చోసుకున్నాయి. ఇప్పుడూ మళ్లీ ఇండిగో విమానం కూడా అదే బాటపట్టింది. ఈ మేరకు ఇండిగో విమానం అస్సాంలోని జోర్హాట్ నుంచి కోల్‌కతాకు వెళ్తున్న ఇండిగో విమానం టేకాఫ్ సమయంలో అపశ్రుతి చోటుచ చేసుకుంది. రన్‌వే నుంచి జారి పక్కనున్న గడ్డితో కూడిన నేలపైకి దూసుకొచ్చింది. ఆ విమానం చక్రాలు బురదలో ఇరుక్కుపోయాయి. దీంతో మధ్యాహ్నాం 2.30 గంటల కల్లా బయల్దేరాల్సిన విమానం కాస్త ఆలస్యంగా బయల్దేరింది. ఈ విమానంలో సుమారు 98 మంది ప్రయాణికులు ఉన్నారని, వారంతా సురక్షితంగా ఉన్నట్లు ఇండిగో అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఈ ఘటన తాలుకా పోటోలు ట్విట్టర్వలో వైరల్ అవుతున్నాయి. (చదవండి: ముసుగు దుండగుల దాడి.. మంగళూరులో దారుణ హత్య.. 144 సెక్షన్ విధింపు) -
‘బొగ్గు’తో ఆరబెడుతున్నారు
చెన్నై: సాధారణంగా వర్షం కారణంగా మైదానం తడిగా మారినప్పుడు సూపర్ సాపర్లతో అవుట్‌ఫీల్డ్ నుంచి నీరు తొలగించడం, డ్రైయర్లతో పిచ్‌ను ఆరబెట్టడం కనిపిస్తుంది. ఇందు కోసం కొన్ని సార్లు హెలికాప్టర్లను వాడటం కూడా చూశాం. అయితే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పిచ్‌ను ఆరబెట్టేందుకు గ్రౌండ్ సిబ్బంది పాత పద్ధతుల్లోకి వెళ్లిపోయారు. అందులో భాగంగా బొగ్గును కాలబెట్టి దాని వేడితో పిచ్‌ను ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టును ఎలాగైనా నిర్వహించాలని పట్టుదలగా ఉన్న తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) అందు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ‘వర్దా’ తుపాను కారణంగా నగరం అతలాకుతలమైపోగా, ప్రతికూల పరిస్థితుల్లోనూ మ్యాచ్ కోసం చిదంబరం స్టేడియంను సిద్ధం చేసే పనిలో పడ్డారు. బుధవారం క్యురేటర్ కాశీవిశ్వనాథ్, సిబ్బంది మొత్తం పిచ్‌ను ఆరబెట్టే పనిలో పడ్డారు. బొగ్గు వేడి వల్ల మామూలుగాకంటే చాలా వేగంగా పిచ్ ఆరిపోయి, మ్యాచ్ కోసం అందుబాటులోకి వస్తుందని టీఎన్‌సీఏ నమ్ముతోంది. శుక్రవారం నుంచి ఇక్కడ భారత్, ఇంగ్లండ్ ఐదో టెస్టు జరగనుంది. బుధవారం మైదానం తడిగా ఉండటంతో ఇరు జట్లూ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాయి. గురువారం కూడా నెట్ ప్రాక్టీస్ సాధ్యం కాకపోవచ్చు.