dharamshala
-
IND Vs ENG 5th Test Photos: టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ సొంతం (ఫొటోలు)
-
రింకూ సింగ్‌కు బంపరాఫర్.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఛాన్స్?
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు టీమిండియా సిద్దమవుతోంది. మార్చి 7 నుంచి ఇరు జట్ల మధ్య ఈ ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే ధర్మశాలకు చేరుకోగా.. భారత జట్టు సోమవారం అక్కడ అడుగుపెట్టింది. అయితే టెస్టు జట్టులో లేని టీమిండియా ఆటగాడు రింకూ సింగ్ సైతం ధర్మశాలకు చేరుకున్నాడు. భారత ఆటగాళ్లతో కలిసి తిరుగుతూ రింకూ కన్పించాడు. జట్టులో సభ్యునిగా లేని రింకూ సింగ్ ధర్మశాలలో కన్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జట్టులో లేనప్పటికీ అక్కడకు ఎందుకు వెళ్లాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ చర్చించికుంటున్నారు. అయితే రింకూ ధర్మశాలకు వెళ్లడానికి ఓ కారణం ఉంది. ధర్మశాలలో టీ20 వరల్డ్ కప్ ప్రాబబుల్స్‌తో సోమవారం బీసీసీఐ నిర్వహించిన ఫొటో షూట్లో రింకూ సింగ్ పాల్గోనున్నాడు. ఆటగాళ్లతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. బీసీసీఐ ఆదేశాల మేరకే రింకూ అక్కడికి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మేలో ప్రకటించనున్న టీ20 వరల్డ్‌కప్ భారత జట్టులో ఈ నయా ఫినిషర్‌కు చోటు ఖాయమైనట్లే. కాగా టీ20ల్లో రింకూ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు కేవలం 15 మ్యాచ్‌లు ఆడిన రింకూ 89.00 సగటుతో 356 పరుగులు చేశాడు. అందులో రెండు ఫిప్టీలు ఉన్నాయి. చదవండి: IPL 2024: ధోని సంచలన నిర్ణయం.. సీఎస్కే కెప్టెన్‌గా రుత్‌రాజ్ గైక్వాడ్!? -
బుమ్రాకు విశ్రాంతి!
రాజ్‌కోట్: భారత ప్రధాన పేపర్ జస్ప్రీత్ బుమ్రాకు నాలుగో టెస్టులో విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో సీనియర్ సీమర్ బుమ్రా రెండో టెస్టును ఒంటిచేత్తో గెలిపించాడు. మూడు మ్యాచ్‌లు ముగిసిన ఈ సిరీస్‌లో అతను 17 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో 80.5 ఓవర్లు వేశాడు. ఈ నేపథ్యంలో అతనికి రెస్ట్ ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. బోర్డుకు ఇది కొత్తేం కాదు. ఆటగాళ్లపై పనిఒత్తిడి తగ్గేంచేందుకు బోర్డు కొంతకాలంగా ఇలాంటి వైఖరి అవలంభిస్తోంది. వైజాగ్‌లో జరిగిన రెండో టెస్టులో హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి తిరిగి మూడో టెస్టు ఆడించింది. ‘టీమిండియా మంగళవారం రాంచీకి బయలుదేరుతుంది. ఈ మ్యాచ్ నుంచి బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడు. తొడ కండరాల గాయం నుంచి కోలుకుని వందశాతం ఫిట్నెస్తో ఉన్న కేఎల్ రాహుల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు చెప్పారు. ధర్మశాలలో మార్చి 7 నుంచి జరిగే ఆఖరి టెస్టులో బుమ్రా తాజాగా బరిలోకి దిగేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని బోర్డు భావిస్తోంది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తొలి టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ప్రత్యర్థి స్పిన్ ఉచ్చుతో భారత్ ఓడిపోయింది. పాతగాయం తిరగబెట్టడంతో రెండో టెస్టు నుంచి తప్పించారు. మూడో మ్యాచ్‌కు ఎంపిక చేసినప్పటికీ ఫిట్నెస్ సంతరించుకోకపోవడంతో మళ్లీ జాతీయ క్రికెట్ అకాడమీకి పంపించారు. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది. -
న్యూజిలాండ్‌తో మ్యాచ్.. ధర్మశాలకు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో మరో రసవత్తరపోరుకు టీమిండియా సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్‌తో ఆదివారం భారత్ తలపడనుంది. ఆక్టోబర్ 20న ధర్శశాల వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం రోహిత్ సేన ధర్మశాలలో శుక్రవారం అడుగుపెట్టింది. పూణే నుంచి ప్రత్యేక విమానంలో భారత జట్టు ధర్మశాలకు చేరుకుంది. భారత క్రికెటర్లు విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ధర్మశాలకు చేరుకున్న భారత జట్టు శనివారం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గోనుంది. మరోవైపు తమ ఆఖరి మ్యాచ్‌లో ఆఫ్గాన్‌పై విజయం సాధించిన న్యూజిలాండ్ ఇప్పటికే ధర్మశాలలో తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టేసింది. హార్దిక్ దూరం.. కాగా కివీస్‌తో మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా కాలికి గాయమైంది. గాయం తీవ్రమైనది కావడంతో అతడు వారం రోజుల పాటు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో గడపనున్నాడు. అతడు తిరిగి మళ్లీ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా స్ధానంలో సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. చదవండి: India vs New Zealand: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. హార్దిక్ దూరం! జట్టులోకి విధ్వంసకర ఆటగాడు Team India arrives in Dharamshala to take on New Zealand.pic.twitter.com/KY0ms9qUAB — Mufaddal Vohra (@mufaddal_vohra) October 20, 2023 -
‘ధర్మశాల’ అవుట్ ఫీల్డ్‌పై బట్లర్ అసంతృప్తి
ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. అయితే ఇంగ్లండ్ సారథి బట్లర్ ధర్మశాల స్టేడియంపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ ‘ఈ మైదానం పేలవంగా ఉంది. అవుట్‌ఫీల్డ్ ఆటగాళ్లకు ప్రమాదకరం. క్యాచ్‌లు పట్టేటపుడు, డైవింగ్ చేసేటపుడు ఫీల్డర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. పరుగు ఆపేందుకు డైవ్ చేస్తే గాయాల బారిన పడొచ్చు. ఐపీఎల్లో ఆడినప్పటిలా ఈ అవుట్‌ఫీల్డ్ లేదు. ఇది క్రికెటర్లకు ఇబ్బందికరం’ అని బట్లర్ అన్నాడు. బౌలర్లకు ప్రత్యేకించి పేసర్లు రనప్ ఏరియాను ఓ కంట కనిపెడుతూనే బౌలింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఈ వేదికపై అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు బంతిని అందుకునే క్రమంలో పదేపదే జారి పడ్డారు. దీంతో అఫ్గాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ అవుట్‌ఫీల్డ్ చెత్తగా ఉందన్నాడు. -
ధర్మశాల టెస్టు వైజాగ్‌లో?
న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 1 నుంచి ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టు వేదిక మారనుంది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్పీసీఏ)కు చెందిన ఈ మైదానంలో అసంపూర్తి పనులవల్ల మ్యాచ్ వేదికను మార్చాల్సి వస్తుందని బీసీసీఐ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ధర్మశాల స్టేడియంలోని అవుట్ ఫీల్డ్ సహా పిచ్‌పై పచ్చికను కొత్తగా పరిచారు. పిచ్‌ను ఇంకా పరీక్షించలేదు. అక్కడక్కడ పనులు ఇంకా పూర్తవలేదు. ప్యాచ్ వర్క్ అలాగే మిగిలిపోయింది. అందువల్లే ఐదు రోజుల ఆట (టెస్టు మ్యాచ్)ను అసంపూర్ణమైన మైదానంలో నిర్వహించడం సమంజసం కాదని బీసీసీఐ భావిస్తోంది. మూడో టెస్టుకు ప్రత్యామ్నాయ వేదికలుగా వైజాగ్, బెంగళూరు, ఇండోర్, రాజ్కోట్లను బోర్డు పరిశీలిస్తోంది. -
World Tourism Day: లోకం చుట్టేద్దాం
నిత్యం ఒత్తిళ్ల నడుమ బిజీ బిజీగా సాగే రొటీన్‌గా బతుకుల్లో అప్పుడప్పుడూ కాస్త కొత్తదనం నింపేవి టూర్లే. కరోనాతో కుదేలైన పర్యాటక రంగం కొన్నాళ్లుగా తిరిగి కళకళలాడుతోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పలు దేశాలు రీ థింకింగ్ టూరిజం పేరుతో టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నాయి... కరోనాతో తీవ్రంగా నష్టపోయిన ప్రధాన రంగాల్లో పర్యాటకం ఒకటి. రెండేళ్ల పాటు లాక్డౌన్లు, అంతర్జాతీయ రాకపోకలపై నిషేధాలతోనే సరిపోయింది. దాంతో పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న శ్రీలంక వంటి దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ‘రీ థింకింగ్ టూరిజం’ థీమ్‌తో పలు దేశాలు ముమ్మరంగా ప్రమోట్ చేస్తున్నాయి. టూరిస్టులు ఇష్టపడే ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయడం, కాస్త అలా తిరిగి వస్తే నిత్య జీవిత ఒత్తిళ్ల నుంచి బయట పడవచ్చంటూ ప్రచారం చేయడంపై దృష్టి పెట్టాయి. పర్యాటక రంగంలో ప్రపంచ దేశాల్లో ఫ్రాన్స్‌కు తిరుగు లేదని ఎన్నో సర్వేలు తేల్చాయి. 2019లో ఏకంగా 9 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించింది. దేశ జీడీపీలో 8% వాటా పర్యాటక రంగానిదే. కరోనా వేళ ఫ్రాన్స్‌కు టూరిస్టులు సగానికి సగం తగ్గిపోయారు. మళ్లీ ఈ ఏడాది ఆ దేశానికి టూరిస్టుల తాకిడి పెరిగింది. తర్వాతి స్థానాల్లో స్పెయిన్, అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్, సింగపూర్ తదితరాలున్నాయి. టాప్ 10 దేశాల్లో యూరప్, ఆసియా ఫసిఫిక్ దేశాలే ఎక్కువగా ఉండటం విశేషం! ఎటు చూసినా ఎకో టూరిజమే ఎకో టూరిజం. సింపుల్‌గా చెప్పాలంటే ప్రకృతి సౌందర్యంలో లీనమైపోవడం. కాంక్రీట్ అడవుల్లో నిత్యం రణగొణధ్వనుల మధ్య బతికేవారు అప్పుడప్పుడూ ప్రకృతి అందాల మధ్య రిలాక్సవడం. ఉద్యానవనాలు, అడవులు, సముద్ర తీర ప్రాంతాల సందర్శన, కొండలు గుట్టలు ట్రెక్కింగ్, ఆయా ప్రాంతాల సంస్కృతిని తెలుసుకోవడంపైç ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో అన్ని దేశాలూ ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టాయి. మారుమూలల్లోని ప్రాకృతిక అందాలని టూరిస్ట్ స్పాట్లుగా తీర్చిదిద్దితే ఇటు ఆదాయం రావడంతో పాటు పేదరికంలో మగ్గుతున్న స్థానికుల బతుకులూ బాగుపడతాయి. ఐస్‌ల్యాండ్, కోస్టారికా, పెరు, కెన్యా, అమెజాన్ అడవులతో అలరారే బ్రెజిల్ వంటివి ఎకో టూరిజానికి పెట్టింది పేరు. ప్రపంచ ఎకో టూరిజం మార్కెట్ 2019లో 9 వేల కోట్ల డాలర్లు. 2027 నాటికి 11 వేల కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా. పర్యాటకానిది పెద్ద పాత్ర ► పర్యాటక రంగానికున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 10% వాటా దీనిదే! ► ప్రపంచ ఎగుమతుల్లో 7% పర్యాటకుల కోసమే జరుగుతున్నాయి. ► ప్రతి 10 ఉద్యోగాల్లో ఒకటి పర్యాటక రంగమే కల్పిస్తోంది. ► 2019లో అత్యధికంగా ఫ్రాన్స్‌ను 9 కోట్ల మంది సందర్శించారు. 8.3 కోట్లతో స్పెయిన్, 7.9 కోట్ల పర్యాటకులతో అమెరికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► పర్యాటక రంగం 2019లో ప్రపంచవ్యాప్తంగా 33.3 కోట్ల ఉద్యోగాలు కల్పించింది. కరోనా దెబ్బకు 2020లో ఇది ఏకంగా 2.7 కోట్లకు తగ్గిపోయింది. ► 2019లో భారత జీడీపీలో పర్యాటక రంగానిది 6.8% వాటా. 2020 నాటికి 4.7 శాతానికి తగ్గింది. ► 2019లో 1.8 కోట్ల మంది భారత్‌ను సందర్శిస్తే 2020లో 60 లక్షలకు పడిపోయింది. ► 2020 నాటికి దేశ పర్యాటక రంగం 8 కోట్ల ఉద్యోగాల కల్పించింది. భారత్.. పర్యాటక హబ్ ► పర్యాటక రంగ పురోగతికి భారత్ పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ► సుస్థిర, బాధ్యతాయుత పర్యాటకమే లక్ష్యంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి జి.కిషన్ రెడ్డి ఇటీవల ధర్మశాల డిక్లరేషన్ ఆమోదించారు. ► పర్యాటక రంగ వృద్ధితో విదేశీ మారక నిల్వలు పెరిగి దేశం ఆర్థికంగా సుసంపన్నంగా మారుతుంది. ► 2030 నాటికి పర్యాటక ఆదాయం జీడీపీలో 10 శాతానికి పెంచడం, 2.5 కోట్ల విదేశీ పర్యాటకులను రప్పించడం, 14 కోట్ల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'పాక్ జట్టుకు భద్రత కల్పించలేం'
సిమ్లా: టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈనెల 19న భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో జరగనున్న మ్యాచ్‌కు పాక్ ఆటగాళ్లకు ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి భద్రతా కల్పించలేమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ మరోసారి స్పష్టం చేశారు. వేదికపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పునరాలోచించాలని ఇప్పటికే ఆయన విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్‌తో టి20 మ్యాచ్‌ను ధర్మశాలలో జరగనివ్వమని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ సైనికుల సంఘం హెచ్చరించిన విషయం తెలిసిందే. పఠాన్‌కోట్ బేస్‌పై ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు రాష్ట్రానికి చెందిన సైనికులు మరణించారని, అమరవీరుల స్మారక స్థూపానికి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే జరిగే ఈ మ్యాచ్‌ను ఎట్టి పరిస్థితిలోనూ జరగనివ్వబోమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరభద్రసింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు విదాస్పదంగా మారిన ధర్మశాల స్టేడియంను సందర్శించేందుకు పాక్ అధికారులు భారత్ చేరుకున్నారు. స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను వారు పరిశీలించి పాక్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ఈ నివేదిక ఆధారంగానే టి-20 ప్రపంచకప్‌లో ధర్మశాల స్టేడియంలో పాక్ జట్టును ఆడించడంపై ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇక టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ధర్మశాలలోనే జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ జరుగుతుందని, ఇప్పటికిప్పుడు వేదిక మార్చడం కష్టమని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో బీసీసీఐ అధికారులతో పాటు పాక్ భద్రతా బృందం సభ్యులు కూడా పాల్గొంటారు. -
ధర్మశాలలో భద్రత బాగుంది: శ్రీధర్
ధర్మశాల: టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లు నిర్వహించే ధర్మశాలలో భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందీ లేదని టోర్నమెంట్ డెరైక్టర్ ఎంవీ శ్రీధర్ వ్యాఖ్యానించారు. ఈ నెల 9నుంచి ఈ మైదానంలో మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో శ్రీధర్ బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. షెడ్యూల్ ప్రకారం 19న ఇదే వేదికపై భారత్, పాకిస్తాన్ జట్లు తలపడాల్సి ఉంది. ‘ఇక్కడి భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులు చాలా బ్రహ్మాండంగా పని చేస్తున్నారు. ఒక అధికారిగా కాకుండా సాధారణ వ్యక్తిలా వారి పనితీరును నేను దగ్గరినుంచి పరిశీలించాను. అందరిలోనూ ఇక్కడి మ్యాచ్‌లు విజయవంతం చేయాలనే కోరిక స్పష్టంగా కనిపిస్తోంది’ అని శ్రీధర్ అన్నారు. భారత్, పాక్ మ్యాచ్ పట్ల కొంత మందికి అభ్యంతరాలు ఉన్నా, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినందున మార్చడం కష్టమన్న శ్రీధర్... మ్యాచ్ నిర్వహణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
విజయుడు!
'మమ్మల్ని దురదృష్టం వెంటాడింది. మాపైనే విరాట్ కోహ్లి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అయితే అతడు ఫామ్ కొనసాగించాలని కోరుకుంటున్నా'- ధర్మశాలలో భారత్ తో జరిగిన నాలుగో వన్డే ముగిసిన తర్వాత వెస్టిండీస్ వన్డే కెప్టెన్ చేసిన వ్యాఖ్యలివి. తాను ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో టీమిండియా యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి మరోసారి చూపించాడు. మళ్లీ ఫామ్ అందుకుని విమర్శకుల నోళ్లకు తాళం వేశాడు. అంతేకాదు తాను సెంచరీ చేస్తే టీమిండియా గెలుస్తుందన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశాడు. తను 20 సెంచరీలు చేస్తే 18సార్లు భారత్ గెలవడం గమనార్హం. ధర్మశాలలో వెస్టిండీస్ తో జరిగిన నాలుగో వన్డేలో కోహ్లి సెంచరీ సాధించాడు. 114 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 127 పరుగులు పిండుకున్నాడు. వన్డేల్లో అతడికి ఇది 20వ సెంచరీ కావడం విశేషం. 141 వన్డేల్లోనే కోహ్లి ఈ ఘనత సాధించాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లి ధర్మశాలలో కళాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లు స్క్వే కట్స్, మణికట్టు ఫ్లిక్స్ లతో అభిమానులను అలరించాడు. దాదాపు 8 నెలల తర్వాత సెంచరీ కొట్టి పరుగులు దాహం తీర్చుకున్నాడు. కొచ్చిలో జరిగిన తొలి వన్డేలో కోహ్లి 2 పరుగులే చేశాడు. దానికితోడు ఈ మ్యాచ్ లో తన జట్టు కూడా ఘోరంగా ఓడిపోవడం, అంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలోనూ కోహ్లి విఫలం కావడంతో అందరూ అతడిని వేలెత్తి చూపించారు. వరుసగా సెంచరీలు కొట్టిన ఆటగాడు పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుండడంతో అందరికీ అతడు లక్ష్యంగా మారాడు. అతడి బ్యాటింగ్ ఆర్డర్ కూడా మార్చాలని సీనియర్లు సలహా కూడా ఇచ్చారు. ఫలితంగా ఢిల్లీలో జరిగిన రెండో వన్డేలో కోహ్లి సెకండ్ డౌన్ లో రావాల్సివచ్చింది. ఈ మ్యాచ్ లో అర్థసెంచరీ(62) సాధించి ఫామ్ లోకి వచ్చిన కోహ్లి.. ధర్మశాలలో దాన్ని కొనసాగించాడు. భవిష్యత్ లోనూ కోహ్లి దూకుడు కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
విండీస్ పై భారత్ గెలుపు
ధర్మశాల: వెస్టిండీస్ తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 59 పరుగులతో విజయం సాధించింది. 331 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 48.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటయింది. మార్లోన్ శామ్యూల్స్(112) ఒంటరి పోరాటం చేసినా జట్టుకు ఓటమి తప్పలేదు. టేలర్ 11, హోల్డర్ 11, రసెల్స్ 46, స్యామీ 15, బ్రేవో 40, పొలార్డ్ 6, రామ్ దిన్ 9, పరుగులు చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(127) సెంచరీ సాధించాడు. రైనా(71), రహానే(68) అర్థ సెంచరీలు కొట్టారు. కోహ్లి 'మ్యాన్ ఆఫ్ మ్యాచ్' దక్కించుకున్నాడు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డేలో విండీస్, రెండో వన్డేలో భారత్ గెలిచాయి. హుదూద్ తుపాను కారణంగా విశాఖపట్నంలో జరగాల్సిన మూడో వన్డే రద్దయిన సంగతి తెలిసిందే. చివరి వన్డే కటక్ లో జరగాల్సివుంది. -
విజయం దిశగా భారత్
ధర్మశాల: వెస్టిండీస్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ గెలుపుబాటలో పయనిస్తోంది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా బౌలింగ్ లోనూ రాణించి విజయం దిశగా దూసుకెళుతోంది. 331 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 44.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. శామ్యూల్స్(94) పోరాడుతున్నాడు. హోల్డర్ 11, రసెల్స్ 46, స్యామీ 15, బ్రేవో 40, పొలార్డ్ 6, రామ్ దిన్ 9, పరుగులు చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(127) సెంచరీ సాధించాడు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా భారత్ విజయాన్ని విండీస్ అడ్డుకోలేదు. తొలి వన్డేలో శామ్యూల్స్ 126 పరుగులతో తో విండీస్ కు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. -
ఆదుకున్న రవితేజ, అహ్మద్ ఖాద్రీ
ధర్మశాల: బ్యాట్స్‌మెన్ రాణించడంతో హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో కోలుకుంది. రవితేజ (118 బంతుల్లో 73, 12 ఫోర్లు), అహ్మద్ ఖాద్రీ (115 బంతుల్లో 77 బ్యాటింగ్, 14 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. దీంతో హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ప్రస్తుతం 260 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా చేతిలో మూడు వికెట్లున్నాయి. రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 99 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. రాణించిన అక్షత్, విహారి శనివారం 40/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన హైదరాబాద్ కాసేపటికే ఓపెనర్ తిరుమలశెట్టి సుమన్ (63 బంతుల్లో 30, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం కెప్టెన్ అక్షత్ రెడ్డికి రవితేజ జతయ్యాడు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. అయితే జట్టు స్కోరు 99 పరుగుల వద్ద అక్షత్ (112 బంతుల్లో 43, 7 ఫోర్లు) అక్షయ్ చౌహాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో హైదరాబాద్ 99 పరుగుల వద్ద ఓపెనర్లిద్దర్నీ కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విహారి (83 బంతుల్లో 41, 8 ఫోర్లు) రవితేజతో కలిసి ఇన్నింగ్స్‌ను గాడినపెట్టాడు. ఇద్దరూ చూడచక్కని బౌండరీలతో ఆకట్టుకున్నారు. మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం విహారినీ అక్షయ్ చౌహానే పెవిలియన్ పంపాడు. తర్వాత వచ్చిన సందీప్ (9) విఫలమయ్యాడు. ఈ వికెట్ కూడా అక్షయ్ ఖాతాలోకే వెళ్లింది. ఖాద్రీ అజేయ అర్ధసెంచరీ సందీప్ నిష్ర్కమణతో క్రీజులోకి వచ్చిన అహ్మద్ ఖాద్రీ నింపాదిగా ఆడాడు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రవితేజను రిషి ధావన్ బోల్తాకొట్టించాడు. ఈ దశలో హైదరాబాద్ స్కోరును పెంచే బాధ్యతల్ని ఖాద్రీ తన భుజాన వేసుకున్నాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఇన్నింగ్స్‌ను కుదుటపర్చాడు. హబీబ్ అహ్మద్ (28) చక్కటి సహకారం అందించడంతో ఖాద్రీ అర్ధసెంచరీ సాధించాడు. జట్టు స్కోరును క్రమంగా 300 పరుగులు దాటించాడు. కనిష్క్ నాయుడు డకౌట్ కాగా ఆట ముగిసే సమయానికి అబ్సోలెం (4 బ్యాటింగ్)తో కలిసి ఖాద్రీ క్రీజులో ఉన్నాడు. హిమాచల్ బౌలర్లలో చౌహాన్ 5, రిషి ధావన్ 2 వికెట్లు పడగొట్టారు. ఆదివారం ఆటకు చివరి రోజు కాగా హైదరాబాద్ ప్రత్యర్థి ముందు 300 పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించగలిగితే మ్యాచ్‌లో నిలబడే అవకాశం ఉంటుంది. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 237; హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 296; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: సుమన్ (సి) ఆతిశ్ (బి) రిషి ధావన్ 30; అక్షత్ (సి) ఆతిశ్ (బి) అక్షయ్ చౌహాన్ 43; రవితేజ (సి) ఆతిశ్ (బి) రిషి ధావన్ 73; విహారి (సి) ఆతిశ్ (బి) అక్షయ్ చౌహాన్ 41; సందీప్ (బి) అక్షయ్ చౌహాన్ 9; అహ్మద్ ఖాద్రీ బ్యాటింగ్ 77; హబీబ్ అహ్మద్ (సి) రిషి ధావన్ (బి) అక్షయ్ చౌహాన్ 28; కనిష్క్ నాయుడు (సి) చోప్రా (బి) అక్షయ్ చౌహాన్ 0; అబ్సోలెం బ్యాటింగ్ 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (99 ఓవర్లలో 7 వికెట్లకు) 319 వికెట్ల పతనం: 1-58, 2-99, 3-181, 4-195, 5-231, 6-290, 7-292 బౌలింగ్: విక్రమ్‌జిత్ 26-7-86-0, రిషి ధావన్ 31-8-84-2, అహ్మద్ 14-2-35-0, బిపుల్ శర్మ 2-0-14-0, అక్షయ్ చౌహాన్ 23-3-80-5, అభినవ్ బాలి 3-0-15-0 -
హైదరాబాద్ 237 ఆలౌట్
ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ బౌలర్లు తొలిరోజే హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఆట కట్టించారు. దీంతో మొదటి రోజు ఆటలోనే హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓపెనర్ తిరుమలశెట్టి సుమన్ (92 బంతుల్లో 65, 12 ఫోర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. ఆతిథ్య బౌలర్లలో రిషి ధావన్ (5/75) బెంబేలెత్తించాడు. రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో భాగంగా ఇక్కడి హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 82.3 ఓవర్లలో 237 పరుగుల వద్ద ఆలౌటైంది. ఒక దశలో 183 పరుగుల స్కోరు వరకు మూడే వికెట్లు కోల్పోయిన హైదరాబాద్... ధావన్ సూపర్ స్పెల్‌కు 54 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లను చేజార్చుకుంది. టాస్ గెలిచిన హిమాచల్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ అక్షత్ రెడ్డితో కలిసి సుమన్ ఆరంభించాడు. జట్టు స్కోరు 21 పరుగుల వద్దే ధావన్ తొలిదెబ్బ తీశాడు. అక్షత్ (5)ను పెవిలియన్ పంపాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రవితేజ, ఓపెనర్ సుమన్ జట్టు ఇన్నింగ్స్‌ను గాడినపెట్టారు. చక్కని షాట్లతో ఆకట్టుకున్న సుమన్ ఈ క్రమంలో అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. సరిగ్గా జట్టు స్కోరు 100 పరుగుల వద్ద సుమన్... అక్షయ్ చౌహాన్ బౌలింగ్‌లో సంగ్రామ్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. క్రీజులోకి విహారి రాగా... కాసేపటికే రవితేజ (74 బంతుల్లో 39, 6 ఫోర్లు)ను విక్రమ్‌జిత్ మాలిక్ బోల్తాకొట్టించాడు. జట్టు స్కోరు 184 పరుగుల వద్ద విహారి (74 బంతుల్లో 31, 5 ఫోర్లు)ని ఔట్ చేసిన రిషి ధావన్ క్రమం తప్పకుండా కీలక వికెట్లు పడగొట్టడంతో హైదరాబాద్ కోలుకోలేకపోయింది. ఆ తర్వాత సందీప్ (82 బంతుల్లో 34, 4 ఫోర్లు, 1 సిక్స్)ను పెవిలియన్ చేర్చిన ధావన్ కాసేపటికే హబీబ్ అహ్మద్ (0), పగడాల నాయుడు (0)లను డకౌట్‌గా పెవిలియన్ పంపడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపుపట్టలేదు. చివర్లో అబ్సొలెం (22), ప్రజ్ఞాన్ ఓజా (19) కాసేపు ప్రతిఘటించడంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ప్రత్యర్థి బౌలర్లలో విక్రమ్‌జీత్ మాలిక్ 2 వికెట్లు తీయగా, వకార్ అహ్మద్, అక్షయ్ చౌహాన్, బిపుల్ శర్మ తలా ఓ వికెట్ పడగొట్టారు. సంక్షిప్త స్కోర్లు: హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 237 (సుమన్ 65, రవితేజ 39, సందీప్ 34; ధావన్ 5/75, విక్రమ్‌జీత్ 2/59)