ధర్మశాలలో భద్రత బాగుంది: శ్రీధర్ | Dharamsala the security is good: Sridhar | Sakshi
Sakshi News home page

ధర్మశాలలో భద్రత బాగుంది: శ్రీధర్

Published Thu, Mar 3 2016 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

Dharamsala  the security is good: Sridhar

ధర్మశాల:  టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లు నిర్వహించే ధర్మశాలలో భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందీ లేదని టోర్నమెంట్ డెరైక్టర్ ఎంవీ శ్రీధర్ వ్యాఖ్యానించారు. ఈ నెల 9నుంచి ఈ మైదానంలో మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో శ్రీధర్ బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. షెడ్యూల్ ప్రకారం 19న ఇదే వేదికపై భారత్, పాకిస్తాన్ జట్లు తలపడాల్సి ఉంది. ‘ఇక్కడి భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులు చాలా బ్రహ్మాండంగా పని చేస్తున్నారు. ఒక అధికారిగా కాకుండా సాధారణ వ్యక్తిలా వారి పనితీరును నేను దగ్గరినుంచి పరిశీలించాను. అందరిలోనూ ఇక్కడి మ్యాచ్‌లు విజయవంతం చేయాలనే కోరిక స్పష్టంగా కనిపిస్తోంది’ అని శ్రీధర్ అన్నారు. భారత్, పాక్ మ్యాచ్ పట్ల కొంత మందికి అభ్యంతరాలు ఉన్నా, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినందున  మార్చడం కష్టమన్న శ్రీధర్... మ్యాచ్ నిర్వహణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement