PC: CRICADDICTOR
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు టీమిండియా సిద్దమవుతోంది. మార్చి 7 నుంచి ఇరు జట్ల మధ్య ఈ ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే ధర్మశాలకు చేరుకోగా.. భారత జట్టు సోమవారం అక్కడ అడుగుపెట్టింది. అయితే టెస్టు జట్టులో లేని టీమిండియా ఆటగాడు రింకూ సింగ్ సైతం ధర్మశాలకు చేరుకున్నాడు.
భారత ఆటగాళ్లతో కలిసి తిరుగుతూ రింకూ కన్పించాడు. జట్టులో సభ్యునిగా లేని రింకూ సింగ్ ధర్మశాలలో కన్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జట్టులో లేనప్పటికీ అక్కడకు ఎందుకు వెళ్లాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ చర్చించికుంటున్నారు. అయితే రింకూ ధర్మశాలకు వెళ్లడానికి ఓ కారణం ఉంది.
ధర్మశాలలో టీ20 వరల్డ్ కప్ ప్రాబబుల్స్‌తో సోమవారం బీసీసీఐ నిర్వహించిన ఫొటో షూట్‌లో రింకూ సింగ్ పాల్గోనున్నాడు. ఆటగాళ్లతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. బీసీసీఐ ఆదేశాల మేరకే రింకూ అక్కడికి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో మేలో ప్రకటించనున్న టీ20 వరల్డ్‌కప్ భారత జట్టులో ఈ నయా ఫినిషర్‌కు చోటు ఖాయమైనట్లే. కాగా టీ20ల్లో రింకూ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు కేవలం 15 మ్యాచ్‌లు ఆడిన రింకూ 89.00 సగటుతో 356 పరుగులు చేశాడు. అందులో రెండు ఫిప్టీలు ఉన్నాయి.
చదవండి: IPL 2024: ధోని సంచలన నిర్ణయం.. సీఎస్‌కే కెప్టెన్‌గా రుత్‌రాజ్ గైక్వాడ్!?
Comments
Please login to add a commentAdd a comment