న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. ధర్మశాలకు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్‌ | ICC ODI World Cup 2023: Rohit Sharma And Co Jet Off To Dharamshala For Crunch India Vs New Zealand Clash - Sakshi
Sakshi News home page

CWC 2023: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. ధర్మశాలకు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్‌

Published Fri, Oct 20 2023 7:17 PM | Last Updated on Fri, Oct 20 2023 7:33 PM

Rohit Sharma and  Co jet off to Dharamshala for crunch IND vs NZ WC clash - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో మరో రసవత్తరపోరుకు టీమిండియా సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్‌తో ఆదివారం భారత్‌ తలపడనుంది. ఆక్టోబర్‌ 20న ధర్శశాల వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.ఇక ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం రోహిత్‌ సేన ధర్మశాలలో శుక్రవారం అడుగుపెట్టింది. పూణే నుంచి ప్రత్యేక విమానంలో భారత జట్టు ధర్మశాలకు చేరుకుంది.

భారత క్రికెటర్లు విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ధర్మశాలకు చేరుకున్న భారత జట్టు శనివారం ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గోనుంది. మరోవైపు తమ ఆఖరి మ్యాచ్‌లో ఆఫ్గాన్‌పై విజయం సాధించిన న్యూజిలాండ్‌ ఇప్పటికే ధర్మశాలలో తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టేసింది.

హార్దిక్‌ దూరం..
కాగా కివీస్‌తో మ్యాచ్‌కు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా హార్దిక్‌ పాండ్యా కాలికి గాయమైంది. గాయం తీవ్రమైనది కావడంతో అతడు వారం రోజుల పాటు బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ ​ఆకాడమీలో గడపనున్నాడు. అతడు తిరిగి మళ్లీ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్‌ పాండ్యా స్ధానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
చదవండి: India vs New Zealand: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. హార్దిక్‌ దూరం! జట్టులోకి విధ్వంసకర ఆటగాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement