చరిత్ర సృష్టించిన షమీ.. తొలి బౌలర్‌గా! ఎవరికీ సాధ్యం కాలేదు | Mohammed Shami became the first bowler to bag three five-fors in a single World Cup edition | Sakshi
Sakshi News home page

World Cup 2023: చరిత్ర సృష్టించిన షమీ.. తొలి బౌలర్‌గా! ఎవరికీ సాధ్యం కాలేదు

Published Wed, Nov 15 2023 11:11 PM | Last Updated on Thu, Nov 16 2023 8:36 AM

Mohammed  became the first bowler to bag three five fors in a single World Cup edition - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి  సెమీఫైనల్లో 7 వికెట్లతో షమీ చెలరేగాడు. ఈ వరల్డ్‌కప్‌లో షమీ ఐదుకు పైగా వికెట్లు సాధించడం ఇది మూడో సారి.

అంతకుముందు న్యూజిలాండ్‌, శ్రీలంకపై ఫైవ్‌ వికెట్ల హాల్‌ షమీ సాధించాడు. ఇక మ్యాచ్‌లో ఓవరాల్‌గా 9.5 ఓవర్లు వేసిన షమీ.. 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో దుమ్ములేపిన షమీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

షమీ సాధించిన రికార్డులు ఇవే..
వన్డే వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక సార్లు ఫైవ్‌ వికెట్ల హాల్స్‌ సాధించిన బౌలర్‌గా షమీ నిలిచాడు. షమీ ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. ఈ రికార్డు ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు. 

ఓవరాల్‌గా వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో అత్యధిక ఫైవ్‌ వికెట్ల హాల్స్‌ నమోదు చేసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. షమీ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో 4 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2019 వరల్డ్‌కప్‌లో కూడా షమీ ఒక ఫైవ్‌ వికెట్ల హాల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రి​కార్డు ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ పేరిట ఉండేది.

అంతర్జాతీయ వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 9.5 ఓవర్లలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టిన షమీ.. ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు స్టువర్ట్‌ బిన్నీ పేరిట ఉండేది. 2014లో బిన్నీ బంగ్లాదేశ్‌పై 4 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో బిన్నీ ఆల్‌టైమ్‌ రికార్డును షమీ బ్రేక్‌ చేశాడు.

ఫైనల్‌కు చేరిన టీమిండియా..
వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 70 పరుగులతో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా ఈ మెగా టోర్నీలో ఫైనల్లో భారత్‌ అడుగుపెట్టింది.  398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో కివీస్‌ను భారత్‌ ఓడించడం ఇదే తొలిసారి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement