IPL 2025: బ్యాటింగ్‌లో పూరన్‌.. బౌలింగ్‌లో నూర్‌ | IPL 2025 Stats Till RCB VS PBKS Clash At Chinnaswamy Stadium | Sakshi
Sakshi News home page

IPL 2025: బ్యాటింగ్‌లో పూరన్‌.. బౌలింగ్‌లో నూర్‌

Published Fri, Apr 18 2025 9:16 PM | Last Updated on Fri, Apr 18 2025 9:23 PM

IPL 2025 Stats Till RCB VS PBKS Clash At Chinnaswamy Stadium

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 18) ఆర్సీబీ, పంజాబ్‌ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌ వర్షం​ కారణంగా రద్దయ్యేలా కనిపిస్తుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. 9 గంటలకు వరకు టాస్‌ కూడా పడలేదు. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన బెంగళూరులో ఇంకా వర్షం కురుస్తున్నట్లు సమాచారం. కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌ జరగాలన్నా​ రాత్రి 10:41 గంటల్లోపు టాస్‌ పడాలి.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్‌ (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) అగ్రస్థానంలో కొనసాగుతుంది. గుజరాత్‌ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), ఆర్సీబీ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), పంజాబ్‌ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), లక్నో (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), కేకేఆర్‌ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), ముంబై (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), రాజస్థాన్‌ రాయల్స్‌ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), ఎస​్‌ఆర్‌హెచ్‌ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), సీఎస్‌కే (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

పరుగుల్లో టాప్‌ పూరన్‌
ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లక్నో బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ కొనసాగుతున్నాడు. పూరన్‌ ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 208.77 స్ట్రయిక్‌రేట్‌తో 357 పరుగులు చేశాడు. పూరన్‌ ‍ప్రస్తుతం ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్నాడు.

అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
పూరన్‌- 357
సాయి సుదర్శన్‌- 329
మిచెల్‌ మార్ష్‌- 295
సూర్యకుమార్‌ యాదవ్‌- 265
శ్రేయస్‌ అయ్యర్‌- 250
విరాట్‌ కోహ్లి- 248

అత్యధిక వికెట్ల వీరుడు నూర్‌
ప్రస్తుతం పర్పుల్‌ క్యాప్‌ (అత్యధిక వికెట్లు) హోల్డర్‌గా సీఎస్‌కే స్పిన్నర్‌ నూర్‌ అహ్మద​్‌ కొనసాగుతున్నాడు. నూర్‌ 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా ఉన్నాడు. నూర్‌ తర్వాత కుల్దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌, హార్దిక్‌ పాండ్యా, శార్దూల్‌ ఠాకూర్‌ తలో 11 వికెట్లు తీశారు.

అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు
నూర్‌ అహ్మద్‌-12
కుల్దీప్‌ యాదవ్‌- 11
ఖలీల్‌ అహ్మద్‌- 11 
హార్దిక్‌ పాండ్యా- 11 
శార్దూల్‌ ఠాకూర్‌- 11

సెంచరీల వీరులు
అభిషేక్‌ శర్మ-1
ప్రియాన్ష్‌ ఆర్య-1
ఇషాన్‌ కిషన్‌-1

అత్యధిక హాఫ్‌ సెంచరీలు
పూరన్‌-4
సాయి సుదర్శన్‌-4
మిచెల్‌ మార్ష్‌-4

అత్యధిక ఫోర్లు
ట్రవిస్‌ హెడ్‌- 33
సాయి సుదర్శన్‌-31
అభిషేక్‌ శర్మ-31

అత్యధిక సిక్సర్లు
పూరన్‌-31
శ్రేయస్‌ అయ్యర్‌-20
మిచెల్‌ మార్ష్‌-17

ఐదు వికెట్ల ఘనతలు
హార్దిక్‌ పాండ్యా
మిచెల్‌ స్టార్క్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement