Noor Ahmad
-
‘గోల్డెన్ ఛాన్స్ మిస్.. బుర్ర పనిచేయడం లేదా’?!.. కావ్యా మారన్ ఫైర్!
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎట్టకేలకు ఓ విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కమిన్స్ బృందం సత్తా చాటింది.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs SRH)ను తమ సొంత గడ్డపైనే ఓడించి ఈ సీజన్లో మూడో విజయం సాధించింది.అంతేకాదు.. పన్నెండేళ్ల తర్వాత మొట్టమొదటి సారి చెపాక్‌లో జయభేరి మోగించి.. చెన్నైకి ఊహించని షాకిచ్చింది. ఆద్యంతం ఆసక్తిగా, ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ (Kavya Maran) పలికించిన భావోద్వేగాలు, ఆమె ఇచ్చిన రియాక్షన్స్ వైరల్‌గా మారాయి.బుర్ర పనిచేయడం లేదా?!ముఖ్యంగా లక్ష్య ఛేదనలో రైజర్స్ స్టార్ కమిందు మెండిస్ (Kamindu Mendis) చేసిన పొరపాటు కావ్యకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ‘ఇంత చెత్తగా కూడా ఆడతారా?.. బుర్ర పనిచేయడం లేదా?!’ అన్నట్లు ఆమె ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. చెపాక్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ చేసింది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. రైజర్స్ బౌలర్ల ధాటికి 19.5 ఓవర్లలో 154 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. హర్షల్ పటేల్ నాలుగు వికెట్ల (28/4)తో చెలరేగి సీఎస్కేను దెబ్బకొట్టగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కట్ రెండేసి వికెట్లు కూల్చారు. మహ్మద్ షమీ, కమిందు మెండిస్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే రైజర్స్‌కు షాకులు తగిలాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ట్రవిస్ హెడ్ (19) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టును ఆదుకున్నాడు. 34 బంతుల్లో 44 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.అయితే, ఇన్ఫామ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (7) విఫలం కావడం.. అనికేత్ వర్మ (19) కూడా పెవిలియన్‌కు చేరడంతో రైజర్స్ శిబిరంలో మరోసారి నిరాశ ఆవహించింది. ఈ క్రమంలో ఆల్‌రౌండర్లు కమిందు మెండిస్, నితీశ్ కుమార్ రెడ్డి చక్కటి సమన్వయంతో ఆడారు.మెండిస్ 22 బంతుల్లో 32, నితీశ్ 13 బంతుల్లో 19 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. జట్టును విజయతీరాలకు చేర్చారు. అయితే, సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ పదహారో ఓవర్లో చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ వేసిన బంతి నోబాల్‌గా తేలింది.గోల్డెన్ ఛాన్స్ మిస్ఈ క్రమంలో ఫ్రీ హిట్ రాగా.. కమిందు మెండిస్ మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆఫ్ స్టంప్ దిశగా వచ్చిన బంతిని స్లాగ్ షాట్‌కు యత్రించి విఫలమయ్యాడు. ఇంతలో బంతి అందుకున్న వికెట్ కీపర్ ధోని.. స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో ఒక్క పరుగు కూడా రాకుండానే ఫ్రీ హిట్ వృథా అయిపోయింది. ఇదే కావ్యా మారన్ ఆగ్రహానికి కారణమైంది.ఇక 18.4 ఓవర్లలోనే మెండిస్, నితీశ్ కలిసి లక్ష్యాన్ని పూర్తి చేయగానే.. కావ్యా మారన్ సంబరాలు అంబరాన్నంటాయి. తీవ్ర భావోద్వేగానికి గురైన ఈ విజయం ఎంతో ముఖ్యమైనది అంటూ పక్కన ఉన్న వాళ్లను ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనేEdge-of-the-seat drama! 😱🔥#NoorAhmad oversteps, but #KaminduMendis can’t cash in on the free hit! Tension through the roof! 😵💫Watch the LIVE action ➡ https://t.co/uCvJbWec8a#IPLonJioStar 👉 #CSKvSRH | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/bWQlW9VEna— Star Sports (@StarSportsIndia) April 25, 2025A milestone victory 👏#SRH register their first ever win at Chepauk with a strong performance against #CSK 🔝💪Scorecard ▶ https://t.co/26D3UampFQ#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/lqeX4CiWHP— IndianPremierLeague (@IPL) April 25, 2025 -
IPL 2025: బ్యాటింగ్‌లో పూరన్.. బౌలింగ్‌లో నూర్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) ఆర్సీబీ, పంజాబ్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యేలా కనిపిస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. 9 గంటలకు వరకు టాస్ కూడా పడలేదు. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన బెంగళూరులో ఇంకా వర్షం కురుస్తున్నట్లు సమాచారం. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ జరగాలన్నా రాత్రి 10:41 గంటల్లోపు టాస్ పడాలి.ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) అగ్రస్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), ఆర్సీబీ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), పంజాబ్ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), లక్నో (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), కేకేఆర్ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), ముంబై (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), రాజస్థాన్ రాయల్స్ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), ఎస్ఆర్హెచ్ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), సీఎస్కే (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.పరుగుల్లో టాప్ పూరన్ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లక్నో బ్యాటర్ నికోలస్ పూరన్ కొనసాగుతున్నాడు. పూరన్ ఈ సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడి 208.77 స్ట్రయిక్‌రేట్‌తో 357 పరుగులు చేశాడు. పూరన్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు.అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుపూరన్- 357సాయి సుదర్శన్- 329మిచెల్ మార్ష్- 295సూర్యకుమార్ యాదవ్- 265శ్రేయస్ అయ్యర్- 250విరాట్ కోహ్లి- 248అత్యధిక వికెట్ల వీరుడు నూర్ప్రస్తుతం పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) హోల్డర్‌గా సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ కొనసాగుతున్నాడు. నూర్ 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. నూర్ తర్వాత కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో 11 వికెట్లు తీశారు.అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లునూర్ అహ్మద్-12కుల్దీప్ యాదవ్- 11ఖలీల్ అహ్మద్- 11 హార్దిక్ పాండ్యా- 11 శార్దూల్ ఠాకూర్- 11సెంచరీల వీరులుఅభిషేక్ శర్మ-1ప్రియాన్ష్ ఆర్య-1ఇషాన్ కిషన్-1అత్యధిక హాఫ్ సెంచరీలుపూరన్-4సాయి సుదర్శన్-4మిచెల్ మార్ష్-4అత్యధిక ఫోర్లుట్రవిస్ హెడ్- 33సాయి సుదర్శన్-31అభిషేక్ శర్మ-31అత్యధిక సిక్సర్లుపూరన్-31శ్రేయస్ అయ్యర్-20మిచెల్ మార్ష్-17ఐదు వికెట్ల ఘనతలుహార్దిక్ పాండ్యామిచెల్ స్టార్క్ -
ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది: ధోని
మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఐపీఎల్-2025 (IPL 2025)లో గెలుపు బాట పట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG vs CSK)పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి.. తమ పరాజయ పరంపరకు బ్రేక్ వేసింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సీజన్లో రెండో గెలుపు నమోదు చేసింది.రిషభ్ పంత్ తొలిసారిలక్నోలోని ఏకనా స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు రాణించడంతో లక్నోను 166 పరుగులకు కట్టడి చేయగలిగింది. లక్నో ఆటగాళ్లలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (30), ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సీజన్లో తొలిసారి బ్యాట్ ఝులిపించాడు. 49 బంతుల్లో 63 పరుగులతో రాణించాడు. ఇక సీఎస్కే బౌలర్లలో మతీశ పతిరణ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.పొదుపుగా బౌలింగ్ చేసిన నూర్మిగతా వాళ్లలో నూర్ అహ్మద్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ స్పిన్ బౌలర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 13 పరుగులే ఇచ్చాడు. ఇక లక్నో విధించిన లక్ష్యాన్ని ధోని సేన 19.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు షేక్ రషీద్ (19 బంతుల్లో 27), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించగా.. శివం దూబే (37 బంతుల్లో 43 నాటౌట్) నిలకడగా ఆడాడు. ఆఖర్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ధోని 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి దూబేతో కలిసి జట్టు గెలుపును ఖరారు చేశాడు.ఈ నేపథ్యంలో విజయానంతరం చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. దురదృష్టవశాత్తూ వివిధ కారణాల వల్ల మేము ఆరంభ మ్యాచ్‌లలో విఫలమయ్యాం. సొంత మైదానం చెపాక్‌లో ఓటములు చవిచూశాం.ఘనమైన భవిష్యత్తుఇలాంటి సమయంలో ఇతర వేదికపై గెలవడం కాస్త ఊరట కలిగించే అంశం. జట్టులో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపిన విజయం ఇది. పవర్ ప్లేలో మేము ఈసారి కూడా ఇబ్బందిపడ్డాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం.అయినప్పటికీ తిరిగి పుంజుకున్నాం. ఈరోజు మా బౌలర్లు, బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. షేక్ రషీద్ మాతో చాన్నాళ్లుగా ప్రయాణం చేస్తున్నాడు. నెట్స్‌లో స్పిన్నర్లు, పేసర్లను ఎదుర్కొంటున్నాడు. ఈరోజు అతడు మ్యాచ్ ఆడాడు. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో గొప్పగా రాణించగల సత్తా అతడికి ఉంది.ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సిందిఇక ఈరోజైతే నాకు.. ‘నాకు ఎందుకు ఈ అవార్డు ఇస్తున్నారు?’ అని అనిపించింది. నిజానికి నూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు కదా!’’ అని పేర్కొన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను నూర్ అహ్మద్‌కు ఇచ్చి ఉంటే బాగుండేదని ధోని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025లో తొలి మ్యాచ్‌లో ముంబైని ఓడించిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడింది. తాజాగా లక్నోపై గెలిచినప్పటికీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చివర్లోనే కొనసాగుతోంది.ఐపీఎల్ 2025: లక్నో వర్సెస్ చెన్నై👉లక్నో స్కోరు: 166/7 (20)👉చెన్నై స్కోరు: 168/5 (19.3)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో లక్నోపై చెన్నై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మహేంద్ర సింగ్ ధోని.చదవండి: IPL 2025: ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు.. The IMPACT player does it with MAX IMPACT 🤩Shivam Dube 🤝 MS Dhoni with a match-winning partnership 💛@ChennaiIPL are 🔙 to winning ways 😎Scorecard ▶ https://t.co/jHrifBlqQC #TATAIPL | #LSGvCSK pic.twitter.com/AI2hJkT9Dt— IndianPremierLeague (@IPL) April 14, 2025 -
వరుసగా 13వ ఏడాది...
సీజన్ ఆరంభ మ్యాచ్‌లో పరాజయం పాలయ్యే ఆనవాయితీని ముంబై ఇండియన్స్ మరోసారి కొనసాగించింది. వరుసగా 13వ ఏడాది ముంబై జట్టు ఐపీఎల్లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. గతేడాది పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించలేకపోయిన ముంబై... బౌలింగ్‌లోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. చెన్నై: ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 18వ సీజన్లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. 2012 ఐపీఎల్లో చివరిసారి తాము ఆడిన తొలి మ్యాచ్‌లో నెగ్గిన ముంబై జట్టు ఆ తర్వాత ఇప్పటి వరకు మొదటి పోరులో శుభారంభం చేయలేకపోయింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. హైదరాబాద్ యువతార ఠాకూర్ తిలక్ వర్మ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా... రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) ఎక్కువసేపు నిలవలేకపోయారు. చెన్నై బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నూర్ అహ్మద్ 4, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) దూబే (బి) ఖలీల్ 0; రికెల్టన్ (బి) ఖలీల్ 13; జాక్స్ (సి) దూబే (బి) అశ్విన్ 11; సూర్యకుమార్ (స్టంప్డ్) ధోని (బి) నూర్ 29; తిలక్ వర్మ (ఎల్బీ) (బి) నూర్ 31; రాబిన్ (సి) జడేజా (బి) నూర్ 3; నమన్ (బి) నూర్ 17; సాంట్నర్ (ఎల్బీ) (బి) ఎలీస్ 11; దీపక్ చాహర్ (నాటౌట్) 28; బౌల్ట్ (సి) రుతురాజ్ (బి) ఖలీల్ 1; సత్యనారాయణ రాజు (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–21, 3–36, 4–87, 5–95, 6–96, 7–118, 8–128, 9–141. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–29–3; స్యామ్ కరన్ 1–0–13–0; ఎలీస్ 4–0–38–1; అశ్విన్ 4–0– 31–1; జడేజా 3–0–21–0; నూర్ అహ్మద్ 4–0– 18–4. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (నాటౌట్) 65; రాహుల్ త్రిపాఠి (సి) రికెల్టన్ (బి) చాహర్ 2; రుతురాజ్ (సి) జాక్స్ (బి) విఘ్నేశ్ 53; దూబే (సి) తిలక్ వర్మ (బి) విఘ్నేశ్ 9; దీపక్ హుడా (సి) సత్యనారాయణ (బి) విఘ్నేశ్ 3; కరన్ (బి) జాక్స్ 4; జడేజా (రనౌట్) 17; ధోని (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–11, 2–78, 3–95, 4–107, 5–116, 6–152. బౌలింగ్: బౌల్ట్ 3–0–27–0; చాహర్ 2–0–18–1; సత్యనారాయణ 1–0–13–0; సాంట్నర్ 2.1–0–24–0; జాక్స్ 4–0–32–1; విఘ్నేశ్ 4–0–32–3; నమన్ 3–0–12–0. ఐపీఎల్లో నేడుఢిల్లీ X లక్నో వేదిక: విశాఖపట్నంరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్‌కు జాక్‌పాట్
నిన్న (మార్చి 12) జరిగిన హండ్రెడ్ లీగ్-2025 డ్రాఫ్ట్‌లో (వేలం) న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్, ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ జాక్‌పాట్ కొట్టారు. ఈ ఇద్దరు ఊహించని ధర 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. బ్రేస్‌వెల్‌ను గత సీజన్ రన్నరప్ సధరన్ బ్రేవ్ దక్కించుకోగా.. నూర్ అహ్మద్‌ను మాంచెస్టర్ ఒరిజినల్స్ సొంతం చేసుకుంది. బ్రేస్‌వెల్ త్వరలో స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈసారి డ్రాఫ్ట్‌లో బ్రేస్‌వెల్, నూర్ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ను లండన్ స్పిరిట్.. మరో ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లేను ట్రెంట్ రాకెట్స్ సొంతం చేసుకున్నాయి. నిన్నటి డ్రాఫ్ట్‌లో మరో మేజర్ సైనింగ్ ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ది. గతేడాది డ్రాఫ్ట్‌లో అమ్ముడుపోని వార్నర్‌ను ఈసారి లండన్ స్పిరిట్ 1.2 లక్షల పౌండ్లకు (రూ. 1.35 కోట్లు) సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్, ఛాంపియన్స్ ట్రోఫీ హీరో రచిన్ రవీంద్రను మాంచెస్టర్ ఒరిజినల్స్ ఇదే ధరకు (1.2 లక్షల పౌండ్లు) దక్కించుకుంది. ఈసారి డ్రాఫ్ట్‌కు అందుబాటులో ఉండిన ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు చుక్కెదురైంది. ఆండర్సన్‌ను డ్రాఫ్ట్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. మహిళల డ్రాఫ్ట్ విషయానికొస్తే.. సోఫి డివైన్, జార్జియా వాల్, పెయిజ్ స్కోల్ఫీల్డ్ మంచి ధరలు దక్కించుకున్నారు. పురుషులు, మహిళల డ్రాఫ్ట్‌లో మొత్తం 66 మంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. ఈ డ్రాఫ్ట్ తర్వాత కూడా ఫ్రాంచైజీలకు వైల్డ్‌కార్డ్ డ్రాఫ్ట్ ద్వారా ప్లేయర్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ద హండ్రెడ్ లీగ్-2025 (పురుషులు, మహిళలు) ఆగస్ట్ 5 నుంచి ప్రారంభం కానుంది. లార్డ్స్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో లండన్ స్పిరిట్, ఓవల్ ఇన్విన్సిబుల్స్ తలపడతాయి.హండ్రెల్ లీగ్‌లో పాల్గొనే అన్ని ఫ్రాంచైజీల జట్లు..బర్మింగ్హమ్ ఫీనిక్స్పురుషుల విభాగం: లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ డకెట్, ట్రెంట్ బౌల్ట్*, జాకబ్ బెథెల్, బెన్నీ హోవెల్, ఆడమ్ మిల్నే*, డాన్ మౌస్లీ, టిమ్ సౌథీ*, విల్ స్మీడ్, క్రిస్ వుడ్, అనేరిన్ డోనాల్డ్, జో క్లార్క్, హ్యారీ మూర్, టామ్ హెల్మ్.మహిళలు: ఎల్లీస్ పెర్రీ*, అమీ జోన్స్, ఎమిలీ ఆర్లాట్, మేగాన్ షుట్*, హన్నా బేకర్, చారిస్ పావెలీ, స్టెర్ కాలిస్, ఐల్సా లిస్టర్, జార్జియా వాల్*, ఎమ్మా లాంబ్, జార్జీ బోయ్స్, మేరీ కెల్లీ, బెథాన్ ఎల్లిస్.లండన్ స్పిరిట్పురుషుల విభాగం: జామీ స్మిత్, లియామ్ డాసన్, డేనియల్ వొరాల్, కేన్ విలియమ్సన్*, రిచర్డ్ గ్లీసన్, ఓల్లీ స్టోన్, ఓల్లీ పోప్, కీటన్ జెన్నింగ్స్, జేమీ ఓవర్టన్, డేవిడ్ వార్నర్*, ల్యూక్ వుడ్, ఆష్టన్ టర్నర్*, జాఫర్ చోహన్, వేన్ మాడ్సెన్.మహిళలు: గ్రేస్ హారిస్*, డేనియల్ గిబ్సన్, సారా గ్లెన్, చార్లీ డీన్, దీప్తి శర్మ*, జార్జియా రెడ్మైన్*, ఎవా గ్రే, కార్డెలియా గ్రిఫిత్, తారా నోరిస్, సోఫీ మున్రో, హీథర్ నైట్, ఇస్సీ వాంగ్, రెబెక్కా టైసన్.మాంచెస్టర్ ఒరిజినల్స్పురుషులు: జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, హెన్రిచ్ క్లాసెన్*, మాథ్యూ హర్స్ట్, స్కాట్ క్యూరీ, జోష్ టంగ్, టామ్ హార్ట్లీ, సోనీ బేకర్, టామ్ ఆస్పిన్‌వాల్, నూర్ అహ్మద్*, రాచిన్ రవీంద్ర*, లూయిస్ గ్రెగొరీ, బెన్ మెక్‌కిన్నీ, జార్జ్ గార్టన్.మహిళలు: అమేలియా కెర్*, సోఫీ ఎక్లెస్టోన్, బెత్ మూనీ*, లారెన్ ఫైలర్, మహికా గౌర్, ఈవ్ జోన్స్, కాథరిన్ బ్రైస్, ఫై మోరిస్, డేనియల్ గ్రెగొరీ, డియాండ్రా డాటిన్*, సెరెన్ స్మాల్, ఎల్లా మెక్‌కాఘన్, ఆలిస్ మోనాఘన్.నార్తర్న్ సూపర్చార్జర్స్పురుషుల విభాగం: హ్యారీ బ్రూక్, ఆదిల్ రషీద్, డేవిడ్ మిల్లర్*, మిచెల్ సాంట్నర్*, బ్రైడాన్ కార్స్, మాథ్యూ పాట్స్, బెన్ డ్వార్షుయిస్*, గ్రాహం క్లార్క్, పాట్ బ్రౌన్, టామ్ లావెస్, జాక్ క్రాలే, డాన్ లారెన్స్, మైఖేల్ పెప్పర్, డేవిడ్ మలన్.మహిళలు: ఫోబ్ లిచ్‌ఫీల్డ్*, అన్నాబెల్ సదర్లాండ్*, జార్జియా వేర్హామ్*, కేట్ క్రాస్, బెస్ హీత్, లిన్సే స్మిత్, హోలీ ఆర్మిటేజ్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్, గ్రేస్ బలింగర్, డేవినా పెర్రిన్, గ్రేస్ పాట్స్, లూసీ హిఘం, ఎల్లా క్లారిడ్జ్.ఓవల్ ఇన్విన్సిబుల్స్పురుషుల విభాగం: సామ్ కర్రాన్, విల్ జాక్స్, టామ్ కర్రాన్, జోర్డాన్ కాక్స్, రషీద్ ఖాన్*, సాకిబ్ మహమూద్, సామ్ బిల్లింగ్స్, గస్ అట్కిన్సన్, నాథన్ సౌటర్, డోనోవన్ ఫెర్రీరా*, తవాండా ముయేయ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్*, మైల్స్ హామండ్.మహిళలు: మారిజాన్ కాప్*, ఆలిస్ కాప్సే, లారెన్ విన్ఫీల్డ్-హిల్, అమాండా-జేడ్ వెల్లింగ్టన్*, మెగ్ లాన్నింగ్*, టాష్ ఫారెంట్, రైనా మెక్‌డోనాల్డ్-గే, సోఫియా స్మాల్, జో గార్డ్నర్, రాచెల్ స్లేటర్, పైజ్ స్కోల్ఫీల్డ్, ఫోబ్ ఫ్రాంక్లిన్, కలియా మూర్.సదరన్ బ్రేవ్పురుషులు: జేమ్స్ విన్స్, జోఫ్రా ఆర్చర్, టైమల్ మిల్స్, క్రిస్ జోర్డాన్, ఫాఫ్ డు ప్లెసిస్*, ల్యూస్ డు ప్లూయ్, క్రెయిగ్ ఓవర్టన్, లారీ ఎవాన్స్, ఫిన్ అల్లెన్*, డానీ బ్రిగ్స్, జేమ్స్ కోల్స్, మైఖేల్ బ్రేస్‌వెల్*, రీస్ టోప్లీ, జోర్డాన్ థాంప్సన్.మహిళలు: లారా వోల్వార్డ్*, డానీ వ్యాట్-హాడ్జ్, మైయా బౌచియర్, లారెన్ బెల్, ఫ్రెయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కోర్టీన్-కోల్మన్, రియానా సౌత్‌బై, సోఫీ డెవిన్*, క్లోయ్ ట్రయాన్*, మాడీ విలియర్స్, జోసీ గ్రోవ్స్, ఫోబ్ గ్రాహం.ట్రెంట్ రాకెట్స్పురుషుల విభాగం: జో రూట్, మార్కస్ స్టోయినిస్*, టామ్ బాంటన్, జాన్ టర్నర్, సామ్ కుక్, సామ్ హైన్, టామ్ అల్సోప్, కాల్విన్ హారిసన్, డేవిడ్ విల్లీ, లాకీ ఫెర్గూసన్*, మాక్స్ హోల్డెన్, జార్జ్ లిండే*, ఆడమ్ హోస్, రెహాన్ అహ్మద్.మహిళలు: ఆష్ గార్డ్నర్*, నాట్ స్కైవర్-బ్రంట్, అలానా కింగ్*, హీథర్ గ్రాహం*, బ్రయోనీ స్మిత్, గ్రేస్ స్క్రీవెన్స్, కిర్స్టీ గోర్డాన్, అలెక్సా స్టోన్‌హౌస్, నటాషా వ్రైత్, కాసిడీ మెక్‌కార్తీ, జోడి గ్రూకాక్, ఎమ్మా జోన్స్, ఎల్లీ థ్రెల్కెల్డ్.వెల్ష్ ఫైర్పురుషుల విభాగం: క్రిస్ వోక్స్, స్టీవ్ స్మిత్*, జానీ బెయిర్‌స్టో, టామ్ కోహ్లర్-కాడ్మోర్, టామ్ అబెల్, ల్యూక్ వెల్స్, స్టీఫెన్ ఎస్కినాజీ, డేవిడ్ పేన్, పాల్ వాల్టర్, రిలే మెరెడిత్*, క్రిస్ గ్రీన్*, సైఫ్ జైబ్, జోష్ హల్, మాసన్ క్రేన్.మహిళలు: హేలీ మాథ్యూస్*, టామీ బ్యూమాంట్, జెస్ జోనాసెన్*, షబ్నిమ్ ఇస్మాయిల్*, సారా బ్రైస్, జార్జియా ఎల్విస్, ఫ్రెయా డేవిస్, జార్జియా డేవిస్, ఎమిలీ విండ్సర్, బెత్ లాంగ్స్టన్, సోఫియా డంక్లీ, కేటీ జార్జ్, కేటీ లెవిక్. -
అద్భుతాలు అరుదుగా.. చూసి తీరాల్సిందే
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. బహుశా ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయేమో. విషయంలోకి వెళితే.. గుజరాత్తోమ్యాచ్లో కేకేఆర్ ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్గానిస్తాన్‌కు చెందిన గుర్బాజ్ 39 బంతుల్లోనే ఏడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 81 పరుగులు చేసి గుజరాత్‌కు చుక్కలు చూపించాడు. ఒక దశలో దాటిగా ఆడుతున్న గుర్బాజ్‌ను ఔట్ చేయడానికి బౌలర్లు తంటాలు పడ్డారు. అయితే నూర్ అహ్మద్ ఎట్టకేలకు గుర్బాజ్‌ను ఔట్ చేయగలిగాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ రెండో బంతిని గుర్బాజ్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడే రషీద్ ఖాన్ ఎలాంటి తప్పిదం చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. Photo: IPL Twitter అయితే మీరు ఒక విషయం గమనించారో లేదో.. బ్యాటింగ్ ఆడిన రహమనుల్లా గుర్బాజ్, బౌలింగ్ వేసిన నూర్ అహ్మద్, క్యాచ్ పట్టిన రషీద్ ఖాన్.. ముగ్గురు ఒక దేశానికి చెందిన ఆటగాళ్లే కావడం విశేషం. ప్రస్తుతం ఈ ముగ్గురు అఫ్గానిస్తాన్ జట్టులో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలా బ్యాటింగ్ ఆడినోడు.. బౌలింగ వేసినోడు.. క్యాచ్ పట్టినోడు ఒకే దేశానికి చెందినవారు కావడం అరుదుగా జరుగుతుంది. తాజాగా ఐపీఎల్ అందుకు వేదిక అయింది. Bowler, batter & fielder - it was an 𝐚𝐥𝐥-𝐀𝐟𝐠𝐡𝐚𝐧 𝐚𝐟𝐟𝐚𝐢𝐫 🇦🇫🇦🇫🇦🇫#KKRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/Ht1guUI9Oy — JioCinema (@JioCinema) April 29, 2023 Gurbaz c Rashid Khan b Noor Ahmad 81(39)#IPL2023 #KKRvGT pic.twitter.com/ZIOtZqGZa9 — Cricbuzz (@cricbuzz) April 29, 2023 Batter from Afghanistan. Bowler from Afghanistan. Catch taken by player from Afghanistan. The IPL has truly come a long way #IPL2023 #KKRvGT — Vishesh Roy (@vroy38) April 29, 2023 చదవండి: Shardul Thakur: మోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. ప్రయోగం బెడిసికొట్టింది