
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ విధ్వంసం సృష్టించాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై పూరన్ విరుచుకుపడ్డాడు.
అద్భుతమైన అభిమానులను అలరించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 36 బంతుల్లోనే పూరన్ 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ తుపాన్ ఇన్నింగ్స్‌తో పూరన్ ఐపీఎల్‌లో రెండు వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.
తద్వారా ఓ అరుదైన రికార్డును పూరన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగుల (బంతుల పరంగా) మైలు రాయిని అందుకున్న రెండో ప్లేయర్‌గా నికోలస్ రికార్డులకెక్కాడు. పూరన్ కేవలం 1198 బంతుల్లోనే ఈ రేర్ ఫీట్‌ను అందుకున్నాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(1211) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సెహ్వాగ్ రికార్డును ఈ కరేబియన్ వీరుడు బ్రేక్ చేశాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాతో పూరన్ సహచరుడు రస్సెల్(1120) అగ్రస్ధానంలో ఉన్నాడు.
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాళ్లు
1120 - ఆండ్రీ రస్సెల్
1198 - నికోలస్ పూరన్
1211 - వీరేంద్ర సెహ్వాగ్
1251 - క్రిస్ గేల్
1306 - రిషబ్ పంత్
1309 - గ్లెన్ మాక్స్‌వెల్
ఉత్కంఠ పోరులో లక్నో గెలుపు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆఖరి వరకు జరిగిన ఉత్కంఠపోరులో 4 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేయగల్గింది.
కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(61) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్(38), వెంకటేశ్ అయ్యర్(45), సునీల్ నరైన్(30) పోరాడారు. లక్నో బౌలర్లలో ఆకాష్ దీప్, శార్ధూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్,బిష్ణోయ్, దిగ్వేష్ తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్‌కు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో పూరన్(87)తో పాటు మార్ష్ (48 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు),మార్‌క్రమ్(28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్బతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.
చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం..!