IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్‌ ఎవరో తెలుసా? | IPL 2025: Top 10 Highest Paid English And Hindi Commentators, Gavaskar In 1st Spot | Sakshi
Sakshi News home page

IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్‌ ఎవరో తెలుసా?

Published Thu, Apr 24 2025 4:16 PM | Last Updated on Thu, Apr 24 2025 4:40 PM

IPL 2025: Top 10 Highest Paid English And Hindi Commentators, Gavaskar In 1st Spot

ఐపీఎల్‌ అంటే ఫోర్లు, భారీ సిక్సర్లే కాదు.. వాటిని బాదిన ఆటగాళ్లు, వారు ఆడిన షాట్లను విశ్లేషిస్తూ.. వారి ఆట కట్టించేందుకు బౌలర్లు రచించే వ్యూహాలు.. ఇలా ఒక్కటేమిటి.. మ్యాచ్‌ ఆసాంతం తమ అద్భుతమైన గొంతుతో ఆటను కళ్లకు గట్టినట్లు చూపుతున్నారే అనేలా వ్యాఖ్యానం చేసే కామెంటేటర్లు కూడా ఇందులో భాగమే!

భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌కు చెందిన ఎంతో మంది దిగ్గజాలు ఐపీఎల్‌లో వ్యాఖ్యాతలుగా అలరిస్తున్నారు. మరి.. వాళ్లకు ఇచ్చే పారితోషికం ఎంత? అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే కామెంటేటర్‌ ఎవరు?.. హిందీ, ఇంగ్లిష్‌, ప్రాంతీయ భాషల్లో కామెంట్రీ చేసే సీనియర్‌, జూనియర్ల జీతాలు ఎంత? తదితర విషయాలు గమనిద్దామా?

టీమిండియా దిగ్గజాలు సునిల్‌ గావస్కర్‌, అనిల్‌ కుంబ్లే, రవిశాస్త్రి నుంచి ఆకాశ్‌ చోప్రా, హర్షా భోగ్లే, ఇయాన్‌ బిషప్‌ వరకు అత్యధిక పారితోషికం అందుకునే కామెంటేటర్ల జాబితాలో ఉన్నారు. వీరిలో సునిల్‌ గావస్కర్‌ అత్యధికంగా ఇంగ్లిష్‌ కామెంట్రీకి రూ. 4.17 కోట్ల వరకు అందుకుంటున్నట్లు సమాచారం.

ఐపీఎల్‌-2024కు గానూ అత్యధిక పారితోషికం అందుకున్న టాప్‌-10 కామెంటేటర్లు 
1. సునిల్‌ గావస్కర్‌ (భారత్‌)- ఇంగ్లిష్‌- రూ. 4.17 కోట్లు
2. మాథ్యూ హెడెన్‌ (ఆస్ట్రేలియా)- ఇంగ్లిష్‌- రూ. 4.17 కోట్లు
3. కెవిన్‌ పీటర్సన్‌ (ఇంగ్లండ్‌)- ఇంగ్లిష్‌- రూ. 4.17 కోట్లు
4. ఇయాన్‌ బిషప్‌ (వెస్టిండీస్‌)- ఇంగ్లిష్‌- రూ. 4.17 కోట్లు
5. హర్షా భోగ్లే (భారత్‌)- ఇంగ్లిష్‌- రూ. 4.1 కోట్లు
6. రవిశాస్త్రి (భారత్‌)- ఇంగ్లిష్‌- రూ. 4 కోట్లు
7. ఆకాశ్‌ చోప్రా (భారత్‌)- హిందీ- రూ. 2.92 కోట్లు
8. సంజయ్‌ మంజ్రేకర్‌ (భారత్‌)- హిందీ- రూ. 2.8 కోట్లు
9. సురేశ్‌ రైనా (భారత్‌)- హిందీ- రూ. 2.5 కోట్లు
10. హర్భజన్‌ సింగ్‌ (భారత్‌)- హిందీ- రూ. 1.5 కోట్లు
11. జతిన్‌ సప్రూ (భారత్‌)- హిందీ-  ఒక్కో మ్యాచ్‌కు రూ. 1.5 లక్షల చొప్పున

టాప్‌ టైర్‌, జూనియర్‌ కామెంటేటర్ల జీతాల మధ్య భారీ వ్యత్యాసం (ఒక్కో మ్యాచ్‌కు)
ఇంగ్లిష్‌- టాప్‌ టైర్‌ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షలు- జూనియర్లకు రూ. 35 వేల చొప్పున
హిందీ- టాప్‌ టైర్‌ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షలు- జూనియర్లకు రూ. 35 వేల చొప్పున
తమిళ్‌ లేదా ఇతర ప్రాంతీయ భాషలు- టాప్‌ టైర్‌ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షలు- జూనియర్లకు రూ. 35 వేల చొప్పున

ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లపైనా కనక వర్షం కురిపించేదే ఐపీఎల్‌. మరి క్యాష్‌ రిచ్‌ లీగ్‌ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా! అంటారా?!

చదవండి: IND Vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement