suresh raina
-
చరిత్ర సృష్టించిన ధోని.. ప్రాణ మిత్రుడి రికార్డు బద్దలు
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని సీఎస్కే చేధించలేక చతికలపడింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఓటమి పాలైనప్పటికి .. ఆ జట్టు లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని మాత్రం తన మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు. తొమ్మిదో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని తనదైన స్టైల్లో షాట్లూ ఆడుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖరి ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో మిస్టర్ కూల్.. రెండు సిక్స్‌లు, 1 ఫోర్‌తో 16 పరుగులు రాబాట్టాడు. ఓవరాల్‌గా కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోని.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ధోని ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోరి రికార్డులకెక్కాడు. ధోని ఇప్పటివరకు సీఎస్కే తరపున 236 మ్యాచ్‌లు ఆడి 4693 పరుగులు చేశాడు. ఇంతకుముందు వరకు రికార్డు మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా పేరిట ఉండేది. రైనా సీఎస్కే తరపున 4,687 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తన మిత్రుడి రికార్డును తలైవా బ్రేక్ చేశాడు. కాగా రైనా చాలా సీజన్ల పాటు సీఎస్కేకే ప్రాతినిథ్యం వహించాడు. ధోనికి రైనాకు మంచి అనుబంధం ఉంది. అప్పటిలో అతడిని చిన్న తలా అని అభిమానులు పిలుచుకునే వారు. చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, లివింగ్‌స్టోన్ తలా రెండు వికెట్లు సాధించారు.చెపాక్‌లో సీఎస్కేపై ఆర్సీబీ విజయం సాధించడం 2008 సీజన్ తర్వాత ఇదే తొలిసారి. దీంతో సీఎస్కే కంచుకోటను పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ బద్దలు కొట్టింది. 2008 సీజన్ తర్వాత ఏ ఆర్సీబీ కెప్టెన్ కూడా చెపాక్‌లో సీఎస్కేపై తన జట్టును గెలిపించకలేకపోయాడు. ఇప్పుడు అది పాటిదార్‌కు సాధ్యమైంది. -
రిషబ్ పంత్ సోదరి వివాహ వేడుక.. డ్యాన్స్‌లతో పిచ్చెక్కించిన ధోని, రైనా
టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహ వేడుకలో భారత మాజీ క్రికెటర్లు ఎంఎస్ ధోని, సురేశ్ రైనా సందడి చేశారు. నిన్న రాత్రి జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరు డ్యాన్స్‌లతో పిచ్చెక్కించారు. ఈ వేడకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా ధోని, పంత్, రైనా కలిసి గ్రూప్‌గా డ్యాన్స్ చేసిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. Rishabh Pant, MS Dhoni and Suresh Raina dancing at Rishabh Pant's sister's sangeet ceremony 🕺🏻❤️ pic.twitter.com/pw232528w8— Sandy (@flamboypant) March 11, 2025నెటిజన్ల నుంచి ఈ వీడియోకు విపరీతమైన స్పందన వస్తుంది. ఈ వీడియోలో ధోని, రైనా చాలా హుషారుగా కనిపించారు. ఇంట్లో పెళ్లిలా అందరితో కలియతిరిగారు. ధోని, రైనాను ఇలా చూసి చాలా కాలమైందని వారి అభిమానులు అనుకుంటున్నారు. ధోని ఐపీఎల్ 2025 సన్నాహకాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఈ వేడకకు హాజరయ్యాడు. ఐపీఎల్ సహా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. పంత్ ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి హుషారుగా ఉన్నాడు. పంత్ త్వరలో ప్రారంభంకాబోయే ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. పంత్‌ను ఎల్ఎస్జీ కెప్టెన్‌గా కూడా ఎంపిక చేసింది. ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.కాగా, పంత్ సోదరి సాక్షి పంత్ తన చిరకాల ప్రియుడు అంకిత్ చౌదరీని ఇవాళ (మార్చి 12) ఉదయం మనువాడింది. వీరి వివాహం ముస్సోరిలోని ఐటీసీ హోటల్లో జరిగింది. వీరి వివాహాని ధోని, రైనా సతీసమేతంగా రెండు రోజుల ముందే హాజరయ్యారు. మెహంది, సంగీత్, హల్దీ ఫంక్షన్లలో సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సాక్షి పంత్ స్వయంగా సోషల్‌మీడియాలో షేర్ చేసింది.సాక్షి-అంకిత్ పదేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. గతేడాది జనవరి 6న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. సాక్షి ఎంబీఏ పూర్తి చేసి నేషనల్ ఫార్మసీ అసోసియేషన్‌లో పని చేస్తుంది. ఆమె భర్త అంకిత్ లండన్‌లో వ్యాపారం చేస్తున్నాడు. సాక్షికి సోదరుడు రిషబ్‌తో చాలా బాండింగ్ ఉంది. పంత్‌కు కారు ప్రమాదం జరిగినప్పుడు సాక్షి అన్నీ తానై చూసుకుంది. పంత్ కోలుకుని తిరిగి క్రికెట్ బరిలోకి దిగేందుకు సాక్షి ఎంతో తోడ్పడింది.రిషబ్ పంత్‌కు ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం రాలేదు. మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్‌ను ఫస్ట్ ఛాయిస్ వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఎంపిక చేయడంతో పంత్ బెంచ్‌కు పరిమితం కాక తప్పలేదు. కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత పంత్ గతేడాది ఐపీఎల్ ఆడాడు. ఆ సీజన్లో పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతూ మంచి ప్రదర్శనలు చేశాడు. ఆతర్వాత పంత్ టీ20 వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులోనూ చోటు సంపాదించాడు. ఆ టోర్నీలోనూ పంత్ చక్కగా రాణించాడు. తద్వారా భారత్ రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం పంత్ ముందు ఐపీఎల్ టాస్క్ ఉంది. ఈ లీగ్‌లో పంత్ లక్నోను ఎలా నడిపిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
రిషబ్ పంత్ సోదరి వివాహ వేడుక.. డ్యాన్స్‌లతో పిచ్చెక్కించిన ధోని, రైనా (ఫొటోలు)
-
IND vs AUS: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే: సురేశ్ రైనా
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా టీమిండియా- ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ గురించే చర్చ. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) కీలక పోరులో విజయం సాధించే జట్టుపై మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో మెజారిటీ మంది భారత్‌వైపే మొగ్గుచూపుతున్నారు. ఒకే వేదికపైనే తమ మ్యాచ్‌లన్నీ ఆడటం టీమిండియాకు సానుకూలంగా మారిందని అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకునే ఆటగాడిపై తన అంచనా తెలియజేశాడు. భారత్- ఆసీస్ మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ఈ అవార్డు గెలుచుకుంటాడని జోస్యం చెప్పాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడేఅదే విధంగా.. ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో కెప్టెన్ రోహిత్ శర్మ శతకం బాదితే టీమిండియా గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. అయితే, ఫీల్డింగ్, క్యాచ్‌ల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా మొదటికే మోసం వస్తుందని రోహిత్ సేనను రైనా హెచ్చరించాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఆసీస్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలుస్తాడు. ఇక ఈ ఐసీసీ టోర్నీలో శ్రేయస్ అయ్యర్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం.కోహ్లి అయితే వికెట్ల మధ్య పరిగెడుతున్న తీరు అబ్బురపరుస్తోంది. రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్ శుభారంభం అందిస్తే మనకు తిరుగు ఉండదు. అయితే, కేఎల్ రాహుల్ కూడా బ్యాట్ ఝులిపించాడు. అతడు కూడా ఫామ్‌లోకి వస్తే జట్టుకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. రోహిత్ గనుక సెంచరీ చేశాడంటే విజయం మనదే.అయితే, ఫీల్డింగ్‌లో నిర్లక్ష్యం వద్దు. క్యాచ్‌లు మిస్ చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి’’ అని సురేశ్ రైనా టీమిండియాకు సూచనలు ఇచ్చాడు. కాగా ఆస్ట్రేలియాతో ఐసీసీ టోర్నమెంట్లలో 2011 నుంచి టీమిండియాకు పరాభవాలే ఎదురవుతున్నాయి. కీలక మ్యాచ్‌లలో ఆసీస్ చేతిలో ఓడిపోతోంది. అయితే, దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో మాత్రం టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది.ఇక దుబాయ్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా ఫీల్డింగ్ చేస్తోంది. ఆసీస్ తుదిజట్టులో రెండు మార్పులు చేయగా.. భారత్ కివీస్‌తో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగింది.సెమీ ఫైనల్ 1- తుదిజట్లు ఇవేభారత్రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.ఆస్ట్రేలియా కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.చదవండి: CT 2025: కివీస్‌తో సెమీస్.. సఫారీలకు గాయాల బెడద! జట్టులోకి స్టార్ ప్లేయర్ -
CT 2025: రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆరంభానికి సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ వన్డే మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇందులో పాల్గొనే ఎనిమిది జట్ల వివరాలు వెల్లడయ్యాయి. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సైతం ఈ ఐసీసీ టోర్నీకి తొలుత ప్రకటించిన జట్టులో రెండు మార్పులతో టీమ్‌ను ఖరారు చేసింది.యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను ఈ జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ(BCCI).. అతడి స్థానంలో ఐదో స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)ని జట్టులో చేర్చింది. అదే విధంగా.. స్టార్ బౌలర్, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఇంకా వెన్నునొప్పి నుంచి కోలుకోకపోవడంతో అతడి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను ఎంపిక చేసింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత తుదిజట్టుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనని ప్రకటించిన ఈ మాజీ బ్యాటర్.. అనూహ్యంగా వన్డే వరల్డ్‌కప్-2023 హీరోలను మాత్రం పక్కనపెట్టాడు.అద్బుత ప్రదర్శనస్వదేశంలో 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆలస్యంగా అడుగుపెట్టినా అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు మహ్మద్ షమీ. మెగా ఈవెంట్లో ఏకంగా 24 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. అనంతరం చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు పద్నాలుగు నెలల తర్వాత పునరాగమనం చేశాడు.సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన టీ20, వన్డే సిరీస్‌లలో షమీ ఆడాడు. అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లలో ఈ బెంగాల్ పేసర్ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే వికెట్లు తీశాడు.మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఇంగ్లండ్‌తో వన్డేల్లో ఆకట్టుకోలేకపోయాడు. అయితే, అతడిని బ్యాటింగ్ ఆర్డర్లో డిమోట్ చేయడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. సాధారణంగా ఐదో స్థానంలో వచ్చే ఈ కర్ణాటక బ్యాటర్‌ను మేనేజ్మెంట్ ఆరో స్థానంలో పంపింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేల్లో రాహుల్(2, 10) విఫలమయ్యాడు.రాహుల్ ధనాధన్ ఇన్నింగ్స్అయితే, మూడో వన్డే సందర్భంగా తన రెగ్యులర్ ప్లేస్‌లో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ ధనాధన్ ఇన్నింగ్స్(29 బంతుల్లో 40) ఆడాడు. ఇక అంతకుముందు వన్డే వరల్డ్‌కప్‌లోనూ రాహుల్ రాణించాడు. అయినప్పటికీ షమీతో పాటు కేఎల్ రాహుల్‌కు కూడా సురేశ్ రైనా తన చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటివ్వకపోవడం గమనార్హం.ఇక షమీని కాదని యువ పేసర్ హర్షిత్ రాణా వైపు మొగ్గు చూపిన సురేశ్ రైనా.. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ స్థానంలో రిషభ్ పంత్‌ను ఎంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో యాజమాన్యం రిషభ్ పంత్‌ను పూర్తిగా పక్కనపెట్టడం గమనార్హం.చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చాంపియన్స్ ట్రోఫీ-2025కి సురేశ్ రైనా ఎంచుకున్న తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్.చదవండి: ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
అతడికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ.. గెలిస్తే చరిత్రే: సురేశ్ రైనా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గురించి భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)లో హిట్‌మ్యాన్ తప్పక బ్యాట్ ఝులిపిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్-2023 మాదిరి ఈ మెగా టోర్నీలోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ దూకుడుగానే ఆడతాడని అంచనా వేశాడు.ఘోర పరాభవాలుకాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న ఈ ముంబైకర్.. గతేడాది ఒకే ఒక్క వన్డే సిరీస్ ఆడాడు. అతడి సారథ్యంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఘోర పరాభవం పాలైంది.దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత లంకకు వన్డే ద్వైపాక్షిక సిరీస్ కోల్పోయింది. అనంతరం.. టెస్టులతో బిజీ అయిన రోహిత్ శర్మ.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో, ఆస్ట్రేలియాలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లోనూ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. అతడి సారథ్యంలో ఈ రెండు సిరీస్‌లనూ టీమిండియా కోల్పోయింది.అనంతరం రంజీ బరిలో దిగిన రోహిత్ శర్మ అక్కడా ముంబై ఓపెనర్‌గా విఫలమయ్యాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అనంతరం చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానున్నాడు. ఈ నేపథ్యంఓ 37 ఏళ్ల రోహిత్ శర్మను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మాట్లాడుతూ.. అతడికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ కానుందని పేర్కొన్నాడు.అతడితో కలిసి రోహిత్ రెచ్చిపోవడం ఖాయం‘‘చాంపియన్స్ ట్రోఫీలోనూ రోహిత్ శర్మ దూకుడుగానే ఆడతాడని అనుకుంటున్నా. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లోనూ అతడు అగ్రెసివ్‌గా ముందుకెళ్లాడు. కాబట్టి ఈసారీ అదే జోరు కొనసాగిస్తాడు. అయితే, అతడితో పాటు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగేది ఎవరన్నది ప్రస్తుతం చర్చనీయాంశం.శుబ్‌మన్ గిల్ వస్తాడో రాడో తెలియదు. ఒకవేళ గిల్ గనుక ఓపెనర్‌గా ఉంటే.. అతడితో కలిసి రోహిత్ రెచ్చిపోవడం ఖాయం. ఏదేమైనా రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇదే చివరి ఐసీసీ ఈవెంట్ కానుంది. ఒకవేళ ఇందులో గనుక భారత్ గెలిస్తే.. నాలుగు ఐసీసీ ట్రోఫీలు ముద్దాడిన తొలి టీమిండియా ప్లేయర్‌గా అతడు చరిత్రకెక్కుతాడు.ఇక సారథిగా ఇప్పటికే టీ20 ప్రపంచకప్ గెలిచిన రోహిత్ శర్మ.. చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిస్తే అంతకంటే గొప్ప విజయం మరొకటి ఉండదు. అయితే, అతడు ఈ టోర్నీలో బ్యాటర్‌గానూ రాణించాల్సి ఉంది’’ అని సురేశ్ రైనా స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో రోహిత్ శర్మ సభ్యుడు. ఇక కెప్టెన్‌గా 2024 టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీనీ ముద్దాడిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్ ఆరంభం కానుంది. అయితే, టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, ఫిబ్రవరి 23న పాకిస్తాన్, మార్చి రెండున న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక ఈ టోర్నీలో టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ టైటిల్ కోసం తలపడుతున్నాయి.చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్ -
Maha Kumbh Mela 2025: ఆధ్యాత్మిక బాటపట్టిన సురేశ్ రైనా.. సతీసమేతంగా..(ఫొటోలు)
-
నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ప్రశంసలు కురిపించాడు. నిజమైన, దిగ్గజ నాయకుడు అంటూ హిట్‌మ్యాన్‌ను కొనియాడాడు. జట్టు ప్రయోజనాల కోసం తనంతట తానుగా తప్పుకోగలిగిన నిస్వార్థపరుడంటూ రోహిత్ శర్మకు కితాబులిచ్చాడు.ఐదు టెస్టుల సిరీస్స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన రోహిత్ సేన.. తదుపరి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. అయితే, పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ దూరం కాగా.. అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) కెప్టెన్‌గా వ్యవహరించాడు.ఈ మ్యాచ్‌లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే, రెండో టెస్టు నుంచి జట్టుతో చేరిన రోహిత్ శర్మ.. బ్యాటర్‌గా, సారథిగా విఫలమయ్యాడు. అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ టెస్టుల్లో కలిపి కేవలం 31 పరుగులే చేసిన రోహిత్.. వీటిలో ఒక్క మ్యాచ్‌లోనూ టీమిండియాను గెలిపించలేకపోయాడు. ఫలితంగా సిరీస్‌లో భారత జట్టు 1-2తో వెనుకబడింది.చావో రేవో తేల్చుకునేందుకుఈ క్రమంలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఐదో టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే సిరీస్‌ను డ్రా చేసుకోవడం సహా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2025 అవకాశాలను భారత్ సజీవం చేసుకోగలుగుతుంది.ఇంతటి కీలక మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సిడ్నీలో జరిగే ఆఖరి టెస్టులో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఫామ్‌లేమి దృష్ట్యా స్వయంగా తుదిజట్టు నుంచి తప్పుకొని.. శుబ్‌మన్ గిల్‌కు లైన్ క్లియర్ చేశాడు. ఈ విషయం గురించి తాత్కాలిక కెప్టెన్ బుమ్రా మాట్లాడుతూ.. జట్టు ప్రయోజనాల కోసమే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు.డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఇక జట్టులో స్థానం లేకపోయినా.. సిడ్నీ టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ డగౌట్లో చురుగ్గా కనిపించాడు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఆటగాళ్ల దగ్గరికి వచ్చి వ్యూహాల గురించి చర్చించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సురేశ్ రైనా షేర్ చేస్తూ.. రోహిత్ శర్మ వ్యక్తిత్వాన్ని కొనియాడాడు.నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్‘‘తన నిజాయితీ, నిస్వార్థగుణం ద్వారా నాయకుడంటే ఎలా ఉండాలో రోహిత్ శర్మ నిరూపిస్తున్నాడు. వ్యక్తిగతంగా కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలోనూ.. జట్టు విజయానికే అతడు మొదటి ప్రాధాన్యం ఇచ్చాడు. అవసరమైన సమయంలో స్వయంగా తానే తప్పుకొన్నాడు.టీమిండియా జోరుఈ టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ భారత జట్టు సక్సెస్ కోసం కనబరుస్తున్న అంకిత భావం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆటలో అతడొక నిజమైన దిగ్గజం’’ అని సురేశ్ రైనా రోహిత్ శర్మను ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టులో టీమిండియా జోరు కనబరుస్తోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బుమ్రా సేన.. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో ఆసీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, నితీశ్ రెడ్డి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఇక శనివారం నాటి రెండో రోజు పూర్తయ్యేసరికి తమ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో కలిపి ఆసీస్ కంటే 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజు గనుక కాస్త ఓపికగా ఆడి.. కనీసం మరో వంద పరుగులు జమచేస్తే ఆతిథ్య జట్టు ముందు మెరుగైన లక్ష్యం ఉంచగలుగుతుంది. రెండో రోజు ఆట ముగిసేసరికి క్రీజులో ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా(8*), వాషింగ్టన్ సుందర్(6*)లపైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది.చదవండి: IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'Rohit Sharma exemplifies leadership through honesty and selflessness. Despite personal challenges, he prioritizes team success, stepping aside when necessary. His leadership in the current Test series reflects his unwavering dedication to India’s success. A true legend of the… pic.twitter.com/L3rPlMlRT6— Suresh Raina🇮🇳 (@ImRaina) January 4, 2025 -
అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న సురేశ్ రైనా దంపతులు (ఫొటోలు)
-
విధ్వంసం సృస్టించిన సురేశ్ రైనా
బిగ్ క్రికెట్ లీగ్-2024 ఎడిషన్‌లో ఇవాళ (డిసెంబర్ 22) ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సథరన్ స్పార్టన్స్‌తో జరుగుతున్న అంతిమ పోరులో ముంబై మెరైన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సథరన్ స్పార్టన్స్‌కు టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా సారథ్యం వహిస్తుండగా.. ముంబై మెరైన్స్కు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఫిల్ మస్టర్డ్ ఊచకోత.. సురేశ్ రైనా విధ్వంసంతొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ స్పార్టన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఫిల్ మస్టర్డ్ (39 బంతుల్లో 78; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోయగా.. సురేశ్ రైనా (26 బంతుల్లో 51; 9 ఫోర్లు, సిక్సర్) విధ్వంసం సృష్టించాడు. స్పార్టన్స్ ఇన్నింగ్స్‌లో సోలొమన్ మైర్ 7, అభిమన్యు మిధున్ 25, ఫయాజ్ ఫజల్ 30, అమాన్ ఖాన్ 10 పరుగులు చేశారు. మెరైన్స్ బౌలర్లలో మన్‌ప్రీత్ గోని, మనన్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
CSK లెజెండ్ సురేష్ రైనా ఫ్యామిలీ ఫొటోస్..మీరు ఒక్క లుక్ వేయండి
-
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా..
టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో మూడో టీ20లో సహచర ఆటగాళ్లు విఫలమైన వేళ విధ్వంసకర శతకంతో విరుచుకుపడి జట్టుకు గెలుపు అందించాడు. ఈ క్రమంలో తన పేరిట ఓ అరుదైన రికార్డునూ లిఖించుకున్నాడు. ప్రొటిస్ జట్టుపై.. ప్రపంచంలో ఇంతవరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు.మళ్లీ గెలుపు బాటకాగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో ఘన విజయంతో సిరీస్ మొదలుపెట్టిన సూర్యసేన.. రెండో టీ20లో మాత్రం ఓడిపోయింది. ఈ క్రమంలో సెంచూరియన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో తిరిగి పుంజుకుని.. మళ్లీ గెలుపు బాటపట్టింది.అభిషేక్ శర్మ ధనాధన్ హాఫ్ సెంచరీఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య సౌతాఫ్రికా.. భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(0) మరోసారి డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ(25 బంతుల్లో 50) ధనాధన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన హైదారాబాదీ ఠాకూర్ తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఆఖరి వరకు అజేయంగా తిలక్వరుసగా వికెట్లు పడుతున్నా.. అభిషేక్‌తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. కేవలం 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదిన ఈ లెఫ్టాండర్.. 107 పరుగులు సాధించాడు. ప్రొటిస్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. జట్టుకు భారీ స్కోరు(219-6)అందించాడు.ఈ క్రమంలో కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆఖరి వరకు పోరాడింది. అయితే, నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన ఆతిథ్య జట్టు.. 208 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో పదకొండు పరుగుల తేడాతో టీమిండియా గెలుపొంది.. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.ప్రపంచంలోనే తొలి క్రికెటర్గాఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత తిలక్ వర్మ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ ఇది. కెరీర్లో తొలి అంతర్జాతీయ శతకాన్ని ఏకంగా సఫారీ గడ్డపై బాదడం విశేషం. ఈ క్రమంలో 22 ఏళ్ల తిలక్ వర్మ ఓ అరుదైన రికార్డు సాధించాడు. సౌతాఫ్రికా జట్టుపై అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అదే విధంగా.. చిన్న వయసులోనే టీమిండియా తరఫున టీ20 శతకం బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.సౌతాఫ్రికాపై పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లుతిలక్ వర్మ(ఇండియా)- 22 ఏళ్ల, 5 రోజుల వయసులో 2024- సెంచూరియన్ వేదికగా..సురేశ్ రైనా(ఇండియా)- 23 ఏళ్ల, 156 రోజుల వయసులో 2010- గ్రాస్ ఐస్లెట్ వేదికగామార్టిన్ గఫ్టిల్(న్యూజిలాండ్)- 26 ఏళ్ల, 84 రోజుల వయసులో- 2012- ఈస్ట్ లండన్బాబర్ ఆజం(పాకిస్తాన్)- 26 ఏళ్ల, 181 రోజుల వయసులో- 2021- సెంచూరియన్క్రిస్ గేల్(వెస్టిండీస్)- 27 ఏళ్ల 355 రోజుల వయసులో- 2007- జొహన్నస్‌బర్గ్.టీమిండియా తరఫున చిన్న వయసులో టీ20 సెంచరీ సాధించిన ఆటగాళ్లుయశస్వి జైస్వాల్- 2023లో నేపాల్ మీద- 21 ఏళ్ల 279 రోజుల వయసులోతిలక్ వర్మ- 2024లొ సౌతాఫ్రికా మీద- 22 ఏళ్ల 5 రోజుల వయసులోశుబ్మన్ గిల్(126*)- 2023లో న్యూజిలాండ్ మీద- 23 ఏళ్ల 146 రోజుల వయసులోసురేశ్ రైనా(101)- 2010లో సౌతాఫ్రికా మీద- 23 ఏళ్ల 156 రోజుల వయసులో ఈ ఘనత సాధించారు.చదవండి: Asia Cup 2024: భారత జట్టు ప్రకటన.. 13 ఏళ్ల కుర్రాడికి చోటు Thunderstruck ❌Tilak-struck 💯A superb maiden century for the stylish #TeamIndia southpaw! 🙌Catch LIVE action from the 3rd #SAvIND T20I on #JioCinema, #Sports18, and #ColorsCineplex! 👈#JioCinemaSports #TilakVarma pic.twitter.com/L7MEfEPyY8— JioCinema (@JioCinema) November 13, 2024 -
కర్వా చౌత్ సెలబ్రేషన్స్ : ఈ సందడి అస్సలు మిస్ కావద్దు!
-
సురేష్ రైనా సిక్సర్ల వర్షం.. దద్దరిల్లిన మైదానం(వీడియో)
టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు నాలుగేళ్లు దాటినప్పటకి తనలో ఏ మాత్రం సత్తువ తగ్గలేదని మరోసారి నిరూపించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న నేషనల్ క్రికెట్ టీ10 లీగ్‌లో రైనా విధ్వంసం సృష్టించాడు.ఈ లీగ్‌లో న్యూయార్క్ లయన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రైనా.. శనివారం లాస్ ఏంజిల్స్ వేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌండరీల మోత మోగించాడు. తన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో అభిమానులను అలరించాడు.ముఖ్యంగా బంగ్లాదేశ్ స్టార్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్‌ను మిస్టర్ ఐపీఎల్ ఓ ఆట ఆడేసికున్నాడు. షకీబ్ ఓవర్లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో రైనా ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. దీంతో అతడు మరోసారి బౌలింగ్‌కు కూడా రాలేదు. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న రైనా.. 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ య్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ నిర్ణీత 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. రైనాతో పాటు ఉపుల్ తరంగా(40) పరుగులతో రాణించాడు. అనంతరం లాస్ ఏంజిల్స్ 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 107 పరుగులకే పరిమితమైంది. దీంతో 20 పరుగుల తేడాతో న్యూయర్క్ లయన్స్ విజయం సాధించింది. Suresh Raina makes a roaring entry on the NCL stage with a stroke-filled half-century that lifted New York Lions to 126. 🔥#NCLonFanCode pic.twitter.com/4IS8waiIdF— FanCode (@FanCode) October 5, 2024 -
వాన్ విక్ మెరుపు సెంచరీ.. రైనా టీమ్‌పై ధవన్ జట్టు ఘన విజయం
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో తొలి సెంచరీ నమోదైంది. తొయమ్ హైదరాబాద్‌తో ఇవాళ (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ గ్రేట్స్ ఓపెనర్ మోర్నీ వాన్ విక్ మెరుపు శతకం సాధించాడు. వాన్ విక్ 69 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సురేశ్ రైనా సారథ్యం వహిస్తున్న తొయమ్ హైదరాబాద్‌పై శిఖర్ ధవన్ జట్టు గుజరాత్ గ్రేట్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 27 బంతుల్లో 44 పరుగులు చేసిన సురేశ్ రైనా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పీటర్ ట్రెగో 36 (నాటౌట్), గుర్కీరత్ సింగ్ 26, వాల్టన్ 17, క్లార్క్ 15, వర్కర్ 13 పరుగులు చేశారు. షాన్ మార్ష్ (1), స్టువర్ట్ బిన్ని (7) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్లంకెట్, మనన్ శర్మ, ప్రసన్న తలో రెండు వికెట్లు తీయగా.. గాబ్రియెల్ ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. వాన్ విక్ మెరుపు సెంచరీతో చెలరేగడంతో 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వాన్ విక్ ఒంటిరి పోరాటం చేయగా.. శిఖర్ ధవన్ (21), లెండిల్ సిమన్స్ (20), యశ్పాల్ శర్మ (13 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఇసురు ఉడాన, గుర్కీరత్ మాన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ మ్యాచ్ -
'బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయొద్దు.. పాక్‌నే ఓడించారు'
భారత క్రికెట్ జట్టు తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమైంది. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మను మాజీ క్రికెటర్లు సున్నితంగా హెచ్చరించారు.బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయద్దని భారత మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్‌లు రోహిత్‌ను సూచించారు. కాగా టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారత్‌ను బంగ్లాదేశ్ ఓడించలేదు. కానీ బంగ్లా జట్టు మాత్రం ఇటీవల కాలంలో టెస్టుల్లో సంచలన ప్రదర్శన కనబరుస్తోంది. గతేడాది ఆఖరిలో న్యూజిలాండ్‌ను ఓడించిన బంగ్లా టైగర్స్.. తాజాగా పాకిస్తాన్‌ను వారి స్వదేశంలోనే చిత్తు చేశారు. కాబట్టి బంగ్లా జట్టు నుంచి భారత్‌కు పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది.టీమిండియా ఐదు నెలల తర్వాత టెస్టుల్లో ఆడనుంది. బంగ్లాతో సిరీస్‌కు భారత టెస్టు జట్టును ఎంపిక చేసే పనిలో సెలక్షన్ కమిటీ పడింది. దులీప్ ట్రోఫీలో భారత టాప్ ప్లేయర్లను భాగం చేయడం బీసీసీఐ తీసుకున్న ఒక మంచి నిర్ణయం.రెడ్‌బాల్ క్రికెట్(టెస్టు) ఆడినప్పుడు ఆటగాళ్లకు చాలా విషయాలు తెలుస్తాయి. బంగ్లాదేశ్‌ను తేలికగా తీసుకోవద్దు. బంగ్లా జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. అంతేకాకుండా గత కొంత కాలం నుంచి నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఈ సిరీస్ భారత జట్టు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతోందని ఏఎన్ఐతో రైనా పేర్కొన్నాడు. హర్భజన్ సింగ్ సైతం రైనా వ్యాఖ్యలను సమర్ధించాడు.ఇది గొప్ప సిరీస్ కానుంది. భారత జట్టు చాలా బలంగా ఉంది. కానీ బంగ్లాదేశ్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. వారు రావల్పండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్‌ను ఓడించారు. కొన్ని సార్లు చిన్న జట్లు కూడా అద్భుతాలు సృష్టిస్తాయి అని భజ్జీ చెప్పుకొచ్చాడు. కాగా సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది. -
ధోనీ రిటైర్మెంట్ గుట్టు విప్పిన రైనా!
2020 ఆగస్టు 15.. భారత క్రికెట్లో మాజీ కెప్టెన్, లెజెండరీ ఆటగాడు ఎంఎస్ ధోని శకం ముగిసింది. ఆ రోజు రాత్రి 7:29 గంటలకు మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలుకుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు.అయితే ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది నిమిషాలకే మరో స్టార్ క్రికెటర్, చిన్న తలా సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ తప్పుకుంటున్నానని షాకింగ్ ప్రకటన చేశాడు. దీంతో ఒకే రోజు ఇద్దరి దిగ్గజ క్రికెటర్ల ప్రయాణం ముగిసింది. ఆ సమయంలో వీరిద్దరూ ఐపీఎల్-2020 సీజన్ బయోబబుల్‌లో ఉన్నారు. కాగా ఒకే రోజు ఇద్దరు స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడం అప్పటిలో తీవ్ర చర్చనీయంశమైంది. అయితే ఒకే రోజు తను ధోని రిటైర్మెంట్ ప్రకటించడం వెనకగల కారణాన్ని అక్కడికి రెండు రోజుల తర్వాత సురేష్ రైనా వెల్లడించాడు.అసలు కారణమిదే?"శనివారం(2020 ఆగస్టు 15) రిటైర్మెంట్ ప్రకటించాలని మేమిద్దరం ముందే నిర్ణయించుకున్నాము. అందుకు ఓ కారణముంది. ధోనీ జెర్సీ నంబర్ 7, నా జెర్సీ నంబర్ 3. రెండు కలిపితే 73 అవుతుంది. ఆ రోజు(ఆగస్టు 15)న మన దేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంతకంటే మంచి రోజు మరొకటి ఉండదు అని భావించాము. అందుకే ఒకేసారి ఇద్దరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాము. ధోనితో నాకు మంచి అనుబంధం ఉంది. ధోనీ తన కెరీర్‌ను డిసెంబర్ 23 (2004)న బంగ్లాదేశ్‌పై చిట్టగాంగ్‌లో ప్రారంభించగా, నేను జూలై 30 (2005)న శ్రీలంకపై అరంగేట్రం చేశాను. మేమిద్దరం అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 15 ఏళ్లు కలిసి ప్రయాణించాము. రిటైరయ్యాక ఐపీఎల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నామని" అప్పటిలో దైనిక్ జాగరణ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. -
మమ్మల్ని క్షమించండి.. దయచేసి ఇక్కడితో ఆపేయండి: హర్భజన్
ఇంగ్లండ్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టైటిల్‌ను ఇండియా ఛాంపియన్స్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని భారత్ ముద్దాడింది.అయితే విజయనంతరం భారత మాజీ క్రికెటర్లు, డబ్ల్యూసీఎల్ విన్నింగ్ టీమ్ సభ్యులు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్‌లు బాలీవుడ్ సాంగ్ తౌబ.. తౌబకు కుంటుతూ సరదగా డ్యాన్స్ చేశారు.ఇందుకు సంబంధించిన వీడియోను యువరాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ రీల్‌పై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారా బ్యాడ్మింటన్ స్టార్ మానసి జోషి దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీశారని ఈ ముగ్గురి క్రికెటర్లపై మండిపడింది.అదే విధంగా నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ కూడా క్రికెటర్లపై పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం వారి చేసిన రీల్ వివాదస్పదం కావడంతో హర్భజన్ సింగ్ స్పందించాడు. దివ్యాంగులకు భజ్జీ క్షమపణలు తెలిపాడు."ఇంగ్లండ్‌లో ఛాంపియన్షిప్ గెలిచిన అనంతరం మేం చేసిన టౌబా టౌబా రీల్‌పై వచ్చిన ఫిర్యాదులపై ఓ క్లారిటీ ఇవ్వాలనకుంటున్నాను. మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు. ప్రతీ వ్యక్తికి, ప్రతీ కమ్యూనిటీని మేము గౌరవిస్తాము.15 రోజుల పాటు విరామం లేకుండా క్రికెట్ ఆడిన తర్వాత మా ఒళ్లు హూనమైందని తెలియజేసేందుకు ఈ వీడియోను చేశాము. మేము ఎవరినీ కించపరచడానికి ఈ వీడియో చేయలేదు. ఇప్పటికీ మేము ఏదో తప్పు చేశామని ప్రజలు భావిస్తుంటే.. అందరికి నా తరపున క్షమపణలు తెలుపుతున్నాను. దయచేసి దీన్ని ఇక్కడతో ఆపేయండి" అంటూ ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. -
ఇంత చెత్తగా వ్యవహరిస్తారా? యువీ, భజ్జీపై విమర్శలు
భారత ‘దిగ్గజ’ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా తీరుపై పారాలింపిక్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లెజెండ్స్ నుంచి ఇలాంటి అమానుషమైన, చెత్త ప్రవర్తనను ఊహించలేదంటూ ఘాటుగా విమర్శించింది.క్రికెట్ సెలబ్రిటీలుగా సానుకూల దృక్పథాన్ని వ్యాప్తి చేయాల్సింది పోయి.. ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికింది. అనుచితంగా వ్యవహరించిన కారణంగా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ విజేతగా భారత్విషయం ఏమిటంటే.. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌ను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఇండియా చాంపియన్స్ జట్టుకు యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనా తదితరులు సభ్యులుగా ఉన్నారు.ఇక ఈ టీ20 టోర్నీలో భారత్- పాకిస్తాన్ చాంపియన్స్ ఫైనల్‌కు చేరగా.. యువీ సేన గెలుపొందింది. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 అరంగేట్ర టైటిల్ కైవసం చేసుకుంది.ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో యువీ, భజ్జీ, రైనా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘‘లెజెండ్స్ క్రికెట్లో పదిహేను రోజుల పాటు ఒళ్లు హూనమైంది. శరీరంలోని ప్రతీ అవయవం నొప్పితో విలవిల్లాడుతోంది’’ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ పాట తౌబ.. తౌబకు తమ స్టెప్పులు ఇలాగే ఉంటాయంటూ కుంటుతూ నడుస్తున్నట్లుగా అభినయించారు.అనుచిత ప్రవర్తనఈ వీడియో వైరల్‌కాగా పారాలింపిక్ ఇండియా కమిటీ తీవ్రంగా స్పందించింది. ‘‘ఏమాత్రం సున్నితత్వం లేని అనుచిత ప్రవర్తన ఇది. క్రికెట్ స్టార్ సెలబ్రిటీలుగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా మీ ప్రవర్తన ఉండాలి.కానీ ఇతరుల వైకల్యాన్ని ఎత్తిచూపేలా ఇలా గంతులు వేయడం బాధ్యతారాహిత్యం. ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా? దివ్యాంగుల పట్ల వివక్ష చూపడమే ఇది. ఇలాంటి చర్యలకు పాల్పడ్డందుకు వెంటనే క్షమాపణలు చెప్పండి’’ అని పారాలింపిక్ ఇండియా కమిటీ చురకలు అంటించింది.ప్రముఖ పారా అథ్లెట్, బ్యాడ్మింటన్ స్టార్ మానసి జోషీ సైతం యువరాజ్, భజ్జీ, రైనా తీరును తప్పుబట్టారు. అయితే, ఈ ముగ్గురిలో ఎవరూ కూడా తమపై వస్తున్న విమర్శలకు ఇంతవరకు స్పందించలేదు. అయితే, విమర్శల నేపథ్యంలో యువీ ఈ వీడియోను డిలీట్ చేయడం గమనార్హం.చదవండి: T20I Captain: టీమిండియా టీ20 కెప్టెన్‌గా వాళ్లిద్దరి మధ్యే పోటీ View this post on Instagram A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) -
విరాట్, రోహిత్, రూట్: రైనా
ప్రస్తుత తరం క్రికెటర్లలో ఎవరు గొప్ప అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు నలుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. ఇందులో మొదటిగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పేరు ఉంటుంది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ ఉంటారు. పై పేర్కొన్న నలుగురు ఆటగాళ్లను క్రికెట్ సర్కిల్స్‌లో ఫాబ్ ఫోర్‌గా పిలుస్తారు. ఈ నలుగురితో పాటు రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్ పేర్లు కూడా అడపాదడపా వినిపిస్తుంటాయి.సురేశ్ రైనా ఛాయిస్ ఎవరంటే..?ఈ తరం అత్యుత్తమ ఆటగాడు ఎవరనే ప్రశ్నను టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఎదుర్కొన్నప్పుడు సెకెను కూడా ఆలస్యం చేయకుండా విరాట్ కోహ్లి పేరు చెప్పాడు. విరాట్‌తో పాటు రోహిత్ శర్మ, జో రూట్ ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఆటగాళ్లని రైనా అభిప్రాయపడ్డాడు. వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఫైనల్ అనంతరం రైనా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు.ఈ సందర్భంగా రైనాతో పాటు పలువురు మాజీలు ఇదే ప్రశ్నను ఎదుర్కోగా.. ఒక్కొక్కరు ఒక్కో విధమైన కాంబినేషన్‌ను చూస్ చేసుకున్నారు. హర్భజన్ సింగ్ తన ఆల్‌టైమ్ ఫేవరెట్ల జాబితాలో జాక్ కలిస్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా పేర్లు చేర్చగా.. ఆరోన్ ఫించ్.. రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా పేర్లు చెప్పాడు. రాబిన్ ఉతప్ప.. వివియన్ రిచర్డ్స్, టెండూల్కర్, లారా పేర్లు చెప్పాడు.ఇదిలా ఉంటే, వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఫైనల్లో టీమిండియా ఛాంపియన్స్.. పాకిస్తాన్ ఛాంపియన్స్‌పై విజయం సాధించి, తొట్టతొలి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. -
WCL 2024: రైనా హాఫ్ సెంచరీ వృథా.. పాకిస్తాన్‌పై భారత్ ఓటమి
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ విధ్వంసం సృష్టించింది. పాకిస్తాన్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో కమ్రాన్ ఆక్మల్(40 బంతుల్లో 77), షర్జీల్ ఖాన్(72), మసూద్(51) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో పవన్ నేగి, అనురీత్ సింగ్, ఆర్పీ సింగ్, కులకర్ణి తలా వికెట్ సాధించారు.రైనా హాఫ్ సెంచరీ వృథా..అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో సురేష్ రైనా(52) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు అంబటి రాయడు(39) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో షోయబ్ మాలిక్, రియాజ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. తన్వీర్, షోహిల్ ఖాన్ తలా వికెట్ సాధించారు. -
జెర్సీ నంబర్ 18, 45లకు రిటైర్ మెంట్ ఇవ్వాలి..
-
జెర్సీ నంబర్ 18, 45లకు రిటైర్ మెంట్ ఇవ్వాలి.. సచిన్, ధోని లానే: రైనా
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు తమ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు ఘనంగా విడ్కోలు పలికారు. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను భారత్‌కు అందించి వారు తమ టీ20 ప్రయణాన్ని ముగించారు. టీ20 వరల్డ్‌కప్-2024 విజయం తర్వాత ఈ దిగ్గజ క్రికెటర్లు పొట్టి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం ట్రోఫీతో భారత గడ్డపై అడుగుపెట్టిన ఈ లెజెండరీ క్రికెటర్లకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేసాడు. భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎంస్ ధోని మాదిరిగానే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల జెర్సీలను సైతం రిటైర్ చేయాలని రైనా బీసీసీఐని కోరాడు. కాగా విరాట్ కోహ్లి జెర్సీ నెం. 18 కాగా.. రోహిత్ జెర్సీ నంబర్ 45."బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేయాలనకుంటున్నాను. వరల్డ్‌కప్‌ను అందించిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు ప్రత్యేక గౌరవం దక్కాలి. కాబట్టి జెర్సీ నెం.18 నెం. 45ని రిటైర్ చేయమని భారత క్రికెట్ బోర్డును అభ్యర్థిస్తున్నాను. ఈ రెండు జెర్సీలను బీసీసీఐ తమ కార్యాలయంలో గౌరవంగా ఉంచుకోవాలి. ఇప్పటికే జెర్సీ నెం 10(సచిన్), నెం 7(ధోని)లకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ రిటైర్మెంట్ ఇచ్చింది. ఆవిధంగానే ఇప్పుడు విరాట్, రోహిత్ జెర్సీ నెంలను ఎవరికీ కేటాయించకూడదు. ఆ జెర్సీ నంబర్లను చూస్తే ప్రతీ ఒక్కరికి స్పూర్తి కలగాలి. నెం.18, నెం. 45ల జెర్సీ ధరించిన ఆ ఇద్దరు ఆటగాళ్లు భారత్‌కు ఎన్నో చారిత్రత్మక విజయాలను అందించారు. ఏ ఆటగాడు జట్టులోకి వచ్చినా ఈ జెర్సీ నంబర్లను ఆదర్శంగా తీసుకోవాలని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. -
టీ20 వరల్డ్‌కప్-2024 అంబాసిడర్‌గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన సురేశ్ రైనా ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌లో తనదైన శైలిలో మ్యాచ్‌లు, ప్లేయర్ల ఆట తీరును విశ్లేషిస్తూ వ్యాఖ్యాతగా ఆకట్టుకుంటున్నాడు.ఇక ఇటీవల ఐపీఎల్-2024 క్వాలిఫయర్-1 మ్యాచ్ సందర్భంగా సురేశ్ రైనా.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై సెటైర్లు వేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదారబాద్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌కు టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రాతో కలిసి హిందీలో కామెంట్రీ చేశాడు రైనా.ఈ సందర్భంగా ఆకాశ్ చోప్రా.. రైనాను ఉద్దేశించి.. ‘‘రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకుంటావా?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘నేనేమీ షాహిద్ ఆఫ్రిదిని కాదు’’ అని రైనా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి షాహిద్ ఆఫ్రిదిని అంబాసిడర్‌గా నియమిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటన విడుదల చేసింది. టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్, జమైకా అథ్లెట్ ఉసేన్ బోల్ట్‌లతో పాటు ఆఫ్రిది కూడా ఈ మెగా ఈవెంట్‌కు రాయబారిగా ఉంటాడని పేర్కొంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన స్పోర్ట్స్ కంటెంట్ రైటర్ రైనాను ఉద్దేశించి సెటైర్లు వేశాడు. ‘‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్-2024 అంబాసిడర్‌గా షాహిద్ ఆఫ్రిది పేరును ఐసీసీ ప్రకటించింది. హలో సురేశ్ రైనా’’ అని ట్రోల్ చేశాడు.I’m not an ICC ambassador, but I have the 2011 World Cup at my house. Remember the game at Mohali? Hope it brings back some unforgettable memories for you. https://t.co/5H3zIGmS33— Suresh Raina🇮🇳 (@ImRaina) May 24, 2024 ఇందుకు రైనా కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. ‘‘నేను ఐసీసీ అంబాసిడర్‌ను కాదు గానీ.. 2011 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిని. మొహాలీలో గేమ్ గుర్తుందా?నాకు తెలిసి ఆ మ్యాచ్ నీకు కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేస్తుందనుకుంటా’’ అని కౌంటర్ ఇచ్చాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2011లో మొహాలీ వేదికగా టీమిండియా- పాకిస్తాన్ సెమీ ఫైనల్లో తలపడ్డాయి.ఈ మ్యాచ్‌లో టీమిండియా 29 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. నాటి మ్యాచ్‌లో సురేశ్ రైనా జట్టుకు అవసరమైన సమయంలో పట్టుదలగా నిలబడి 36 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ధోని సేన షాహిద్ ఆఫ్రిది బృందాన్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ తనను ట్రోల్ చేసిన వ్యక్తికి రివర్స్ సెటైర్ వేశాడు.💥Suresh Raina played one of the most important knocks of his career "OTD in 2011" - India were 205/6 against Pakistan in Semi-Final & he scored 36* runs from 39 balls in tough situation.pic.twitter.com/gGzL5wUm0p— मैं हूँ Sanatani 🇮🇳 🚩🚩 (@DesiSanatani) May 24, 2024 -
'నేనేమి షాహిది అఫ్రిదిని కాను'.. రిటైర్మెంట్ యూటర్న్‌పై రైనా
టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండరీ ఆటగాడు సురేష్ రైనా తన రిటైర్మెంట్ యూ టర్న్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న రైనా.. ప్రస్తుతం ఐపీఎల్-2024లో కామెంటేటర్‌గా బీజీబీజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు రైనా భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రాతో కలిసి హిందీ వ్యాఖ్యతగా వ్యవహరించాడు.కోల్‌కతా బ్యాటింగ్ సందర్భంగా ఎనిమిదో ఓవర్లో ఆకాష్ చోప్రా నుంచి రైనాకు తన రిటైర్మెంట్ యూ టర్న్‌కు సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. రిటైర్మెంట్ను ఏమైనా వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నవా అంటూ రైనాను చోప్రా ప్రశ్నించాడు. అందుకు బదులుగా రైనా "నేనేమి షాహిద్ అఫ్రిదిని" కాదు అంటూ నవ్వుతూ సమాధనమిచ్చాడు. కాగా పాకిస్తాన్ మాజీ ఆల్-రౌండర్ షాహిద్ అఫ్రిది తన రిటైర్మెంట్ను మూడు సార్లు వెనక్కి తీసుకున్నాడు.చదవండి: Virat Kohli: కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి తలనొప్పి! ఒక రకంగా.. -
హార్దిక్ అద్భుతమైన ప్లేయర్.. పాక్‌పై కచ్చితంగా చెలరేగతాడు: రైనా
ఐపీఎల్-2024లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దారుణ ప్రదర్శన కనబరిచాడు. కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా సైతం తీవ్ర నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్‌కు ముందు ఆల్-క్యాష్ డీల్‌లో భాగంగా గుజరాత్ నుంచి ముంబై జట్టుకు ట్రేడ్ అయిన హార్దిక్.. కెప్టెన్‌గా తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రం విజయం సాధించింది. అదే విధంగా హార్దిక్ వ్యక్తిగత ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా 18 సగటుతో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్లో హార్దిక్ విఫలమైనప్పటకి టీ20 వరల్డ్‌కప్ భారత జట్టులో మాత్రం చోటు దక్కింది. కేఎల్ రాహుల్, గిల్ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు ఇవ్వకుండా హార్దిక్‌ను ఎంపిక చేయడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే వరల్డ్‌కప్‌నకు హార్దిక్‌ను ఎంపిక చేయడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా సపోర్ట్ చేశాడు. వరల్డ్‌కప్‌లో పాండ్యా సత్తాచాటుతాడని రైనా జోస్యం చెప్పాడు."హార్దిక్ పాండ్యా టీమిండియాకు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ తనవంతు న్యాయం చేసేవాడు. ఫామ్ అనేది తాత్కాలికం మాత్రమే. అది శాశ్వతం కాదు. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై హార్దిక్ బాగా రాణిస్తే, అందరూ అతడిని ప్రశంసలతో ముంచెత్తుతారని" క్రికెట్ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. ఇక టీ20 వరల్డ్‌కప్-2024 జూన్ 1 నంచి ప్రారంభం కానుంది. భారత్ విషయానికి వస్తే.. జూన్ 5న ఐర్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌తో తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. -
IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా
ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా చెపాక్ స్టేడియం అద్భుత దృశ్యానికి వేదికైంది. రాయల్స్‌పై విజయానంతరం సీఎస్కే స్టార్ మహేంద్ర సింగ్ ధోని స్టేడియమంతా కలియదిరుగుతూ టెన్నిస్ బంతులు స్టాండ్స్‌లోకి విసిరాడు.జట్టు వెంటరాగా ముందుండి నడుస్తూ ఉత్సాహంగా కనిపించాడు తలా. దీంతో చెపాక్‌లో ఒకరకమైన భావోద్వేగపూరిత వాతావరణం ఏర్పడింది. 42 ఏళ్ల ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అన్న వార్తల నేపథ్యంలో చెన్నై ఫ్యాన్స్‌ను తలా వీడ్కోలు పలుకుతున్నట్లుగా అనిపించింది. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl)ఇక ధోని స్టేడియాన్ని చుట్టేస్తున్న వేళ చిన్న తలా సురేశ్ రైనా కూడా జతకలిశాడు. ఈ క్రమంలో రైనాకు కూడా బంతిని ఇచ్చిన తలా.. అనంతరం అతడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ గురించి ఎదురైన ప్రశ్నకు రైనా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. జియో సినిమాలో సహ కామెంటేటర్ అభినవ్ ముకుంద్ రైనాను ఉద్దేశించి.. ఒక యుగం ముగిసిపోయినట్లేనా? అని అడిగాడు.ఇందుకు రైనా బదులిస్తూ.. ‘‘కచ్చితంగా కానే కాదు’’ అని పేర్కొన్నాడు. దీంతో తలా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన సీఎస్కే మాజీ స్టార్ రైనా ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 లీగ్ దశలో చెన్నైలో సీఎస్కే తమ చివరి మ్యాచ్ ఆడేసింది. రాజస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో మరో ముందడుగు వేసింది. కాగా క్వాలిఫయర్-2, ఫైనల్ మాత్రం చెపాక్ వేదికగానే జరుగనున్నాయి.చదవండి: ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్‌స్టార్? గుర్తుపట్టారా? View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాను అనుకోని దుర్ఘటనలు వెంటాడుతూ ఉన్నాయి. 2020 ఐపీఎల్ సీజన్ జరుగుతుండగా.. రైనా మేనమామ కుటుంబం మొత్తాన్ని దోపిడి దొంగలు అతి కిరాతకంగా చంపేయగా.. తాజాగా మరో మేనమామ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లా పఠాన్‌కోట్-మండియా జాతీయ రహదారిపై రైనా కజిన్ (మామ కొడుకు) సౌరభ్ కుమార్ (29) స్కూటర్‌పై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ట్యాక్సీ ఇతని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సౌరభ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాద సమయంలో సౌరభ్‌తో పాటు ఉన్న మరో వ్యక్తి కూడా చనిపోయాడు.సౌరభ్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి పేరు శుభమ్ (19) అని సమాచారం. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదానికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ పేరు షేర్ సింగ్. ప్రస్తుతం షేర్ సింగ్ స్థానిక పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. -
T20 World Cup 2024: ఓ ఆటగాడి కోసం చీఫ్ సెలెక్టర్‌కు రెకమండ్ చేసిన రైనా
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా ఓ ఆటగాడిగా కోసం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు రెకమండ్ చేశాడు. పొట్టి ఫార్మాట్లో భీకర ఫామ్‌లో ఉన్న శివమ్ దూబేను టీ20 వరల్డ్‌కప్ 2024కు ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. శివమ్ దూబే కోసం వరల్డ్‌కప్ లోడ్ అవుతుంది. అగార్కర్ భాయ్.. దయ చేసి దూబేని సెలెక్ట్ చేయండని రైనా ట్వీట్ ద్వారా అగార్కర్‌ను కోరాడు.ఓ మాజీ ఆటగాడు ఓ ఆటగాడి కోసం రెకమండ్ చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. బహుశా పేరున్న ఏ క్రికెటర్ కూడా ఇలా చేసి ఉండడు. అయితే రైనా మాత్రం తన ఇగోను, ఇతర విషయాలను పక్కన పెట్టి భీకర ఫామ్‌లో ఉన్న శివమ్ దూబేను వరల్డ్‌కప్ జట్టుకు సెలెక్ట్ చేయాలని చీఫ్ సెలక్టర్‌ను కోరాడు. ఏప్రిల్ నెలాఖరులోపు వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రైనా ప్రతిపాదన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. World Cup loading for Shivam dube ! @imAagarkar bhai select karo please 🇮🇳🙏 https://t.co/b7g0BxHRSp— Suresh Raina🇮🇳 (@ImRaina) April 23, 2024 కాగా, మీడియం పేస్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన శివమ్ దూబే ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. టీమిండియాలో ఆల్‌రౌండర్ స్థానానికి దూబే పర్ఫెక్ట్ సూట్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. టీమిండియా ఆల్‌రౌండర్‌గా చెప్పుకునే హార్దిక్ పాండ్యా చెత్త ప్రదర్శనలతో కాలం వెల్లదీస్తున్న తరుణంలో దూబే భారత క్రికెట్ అభిమానుల పాలిట ఆశాదీపంలా కనిపిస్తున్నాడు.దూబేకు బంతితోనూ సరైన అవకాశాలు లభిస్తే.. వరల్డ్‌కప్‌లో సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. దూబే బ్యాటింగ్ సామర్థ్యం గురించి ఇప్పటికే చాలా తెలుసుకున్నాం. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ దూబే వరుస అర్దశతకాలతో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్లో దూబే బ్యాటింగ్ మెరుపులు పతాక స్థాయిలో ఉన్నాయి.ప్రస్తుత సీజన్లో అతను ఇప్పటికే మూడు అర్దసెంచరీలు చేశాడు. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఇరదీశాడు. ఈ మ్యాచ్‌లో అతను 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ వల్ల దూబేకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. దూబే ఒకటి రెండు మ్యాచ్‌ల్లో బంతితో రాణిస్తే వరల్డ్‌కప్ బెర్త్ దక్కడం ఖాయం. -
కుటుంబంలో పెను విషాదం.. అందుకే ఆ నిర్ణయం: రైనా
‘‘అప్పుడు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అందుకే పంజాబ్‌కు వెళ్లాల్సి వచ్చింది. మా అంకుల్ కుటుంబంలో మరణాలు సంభవించాయి. ఒంటికి నూనె రాసుకుని దాడులకు పాల్పడే కచ్చా గ్యాంగ్.. గ్యాంగ్స్టర్స్ వాళ్ల కుటుంబం మొత్తాన్ని చంపేశారు. అప్పుడు మా బామ్మ కూడా అక్కడే ఉంది. పఠాన్‌కోట్‌లో ఈ దుర్ఘటన జరిగింది. అందుకే నేను అక్కడికి వెళ్లాను. అప్పటికే ఐపీఎల్లో బయో బబుల్ నిబంధనలు మొదలయ్యాయి. కాబట్టి తిరిగి జట్టుతో కలిసే పరిస్థితి లేదు. ఆ ఘటనతో మా నాన్న అప్పటికే నైరాశ్యంలో మునిగిపోయారు. అప్పుడు నాకు నా కుటుంబమే మొదటి ప్రాధాన్యంగా కనిపించింది. క్రికెట్ కావాలంటే ఎప్పుడైనా ఆడుకోవచ్చు. కష్టకాలంలో మాత్రం ఫ్యామిలీకి అండగా ఉండాలని ఆలోచించాను. ఈ విషయాన్ని నేను ఎంఎస్ ధోని, మేనేజ్మెంట్కు చెప్పాను. అందుకే జట్టును వీడాను. నేను తిరిగి వచ్చిన తర్వాత 2021 సీజన్ ఆడాను. 2021లో ట్రోఫీ గెలిచాం. అయితే, అంతకు గతేడాది ముందు మా కుటుంబంలో ఇలాంటి పెను విషాదం చోటుచేసుకుంది. అప్పటికే కోవిడ్-19 కారణంగా అందరూ డిప్రెషన్లో మునిగిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో ఇలా ఆప్తులను కోల్పోవడం నిజంగా మా అందరినీ కుంగదీసింది. కాబట్టి ఆట కంటే ఫ్యామిలీ వైపే మొగ్గుచూపాను’’ అని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్-2020 ఆరంభానికి ముందే జట్టును వీడేందుకు గల కారణాలను తాజాగా లలన్‌టాప్ షోలో వెల్లడించాడు. విపత్కర పరిస్థితుల్లో కుటుంబానికి తోడుగా ఉండేందుకు ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యానని రైనా చెప్పుకొచ్చాడు. అయితే, మరుసటి ఏడాది తిరిగి వచ్చిన తర్వాత సీఎస్కే మరోసారి చాంపియన్‌గా నిలవడం సంతోషాన్నిచ్చిందని రైనా హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2020లో చెన్నై దారుణ ప్రదర్శనతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఆరు గెలిచి పాయింట్ల పట్టిక(అప్పటికి ఎనిమిది జట్లు)లో ఏడో స్థానంలో నిలిచింది. రైనాతో పాటు కీలక ఆటగాళ్లు దూరం కావడంతో విఫలమై పరాభవం మూటగట్టుకుంది. అయితే, 2021లో విజేతగా నిలిచి నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది సీఎస్కే. 2022లో మళ్లీ దారుణంగా ఆడి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానాని(పద్నాలుగు గెలిచినవి నాలుగు)కి దిగజారిన సీఎస్కే అనూహ్య రీతిలో గతేడాది ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది. ఇక ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేశ్ రైనా తన ఐపీఎల్ కెరీర్లో 205 మ్యాచ్‌లు ఆడి 5528 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. తన ఆట తీరుతో రైనా ‘మిస్టర్ ఐపీఎల్’గా ప్రసిద్ధి పొందాడు. అదే విధంగా ‘చిన్న తలా’గా సీఎస్కే ఫ్యాన్స్ అభిమానం పొందాడు. కాగా రైనా ధోనికి అత్యంత ఆప్తుడన్న విషయం తెలిసిందే. చదవండి: T20 Captain: ‘రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే.. ఎనీ డౌట్?’ -
IPL 2024 MI VS CSK: రోహిత్, ధోని ముంగిట భారీ రికార్డులు
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 14) రాత్రి బిగ్ ఫైట్ జరుగనుంది. చెరి ఐదు సార్లు ఛాంపియన్లైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్ అయిన వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ ఎల్ క్లాసికోగా పిలువబడే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ధోని, రోహిత్ మెరుపులు చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ ఇద్దరిని భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ధోని మరో 4 పరుగులు చేస్తే సీఎస్కే తరఫున 5000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున కేవలం సురేశ్ రైనా (5529) మాత్రమే ఈ ఘనత సాధించాడు. సీఎస్కే తరఫున ధోని 249 మ్యాచ్‌ల్లో 4996 పరుగులు చేశాడు. నేడు ముంబైతో జరుగబోయే మ్యాచ్ సీఎస్కే తరఫున ధోనికి 250వ మ్యాచ్ కావడం మరో విశేషం. సీఎస్కేతో మ్యాచ్‌లో రోహిత్ మరో 11 పరుగులు చేస్తే.. ముంబై, సీఎస్కే ఎల్ క్లాసికో మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సురేశ్ రైనా పేరిట ఉంది. రైనా 30 మ్యాచ్‌ల్లో 710 పరుగులు చేశాడు. 27 మ్యాచ్‌ల్లో 700 పరుగులు చేసిన రోహిత్.. మరో 11 పరుగులు చేస్తే రైనా రికార్డును బద్దలు కొడతాడు. ఈ రికార్డు విభాగంలో ధోని మూడో స్థానంలో ఉన్నాడు. సీఎస్కే, ముంబై మ్యాచ్‌ల్లో (35) ధోని 655 పరుగులు చేశాడు. -
IPL 2024: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్ క్యాచ్ పట్టడం ద్వారా ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఈ క్యాచ్‌తో విరాట్ ఐపీఎల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్ వికెట్‌కీపర్ ఫీల్డర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో విరాట్ మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా రికార్డును బద్దలుకొట్టాడు. ఐపీఎల్లో రైనా 205 మ్యాచ్‌ల్లో 109 క్యాచ్‌లు పట్టగా.. విరాట్ 242 మ్యాచ్‌ల్లో 110 క్యాచ్‌లు పట్టి క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా అవతరించాడు. కోహ్లి, రైనా తర్వాత ఐపీఎల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఘనత కీరన్ పోలార్డ్‌కు దక్కింది. పోలార్డ్ 189 మ్యాచ్‌ల్లో 103 క్యాచ్‌లు అందుకున్నాడు. వీరి తర్వాత రోహిత్ శర్మ (99), శిఖర్ ధవన్ (98) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విరాట్ మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు (9) చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి (గేల్ 22, బాబర్ ఆజమ్ 11 తర్వాత) ఎగబాకాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు (8) చేసిన ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఐపీఎల్లో విరాట్ చేసిన సెంచరీలు.. 2016లో గుజరాత్ లయన్స్‌పై 63 బంతుల్లో 100 నాటౌట్ 2016లో పూణేపై 58 బంతుల్లో 108 నాటౌట్ 2016లో గుజరాత్ లయన్స్‌పై 55 బంతుల్లో 109 2016లో కింగ్స్ పంజాబ్‌పై 50 బంతుల్లో 113 2019లో కేకేఆర్‌పై 58 బంతుల్లో 100 2023లో సన్‌రైజర్స్‌పై 63 బంతుల్లో 100 2023లో గుజరాత్ టైటాన్స్‌పై 61 బంతుల్లో 101 నాటౌట్ 2024లో రాజస్థాన్ రాయల్స్‌పై 72 బంతుల్లో 113 నాటౌట్ ఇదిలా ఉంటే, రాయల్స్‌తో మ్యాచ్‌లో విరాట్ సెంచరీ చేసినా ఆర్సీబీ ఓటమిపాలైంది. జోస్ బట్లర్ మెరుపు శతకం చేసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) కదంతొక్కడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డుప్లెసిస్ (44) రాణించాడు. రాయల్స్ స్పిన్నర్లు అశ్విన్ (4-0-28-0), చహల్ (4-0-34-2) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్ సుడిగాలి శతకంతో (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకపడటంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. బట్లర్‌తో పాటు సంజూ శాంసన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రాయల్స్ విజయానికి ఆరు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన తరుణంలో బట్లర్ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకుని మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. తాజా ఓటమితో ఆర్సీబీ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. -
Suresh Raina Marriage Anniversary: "మిస్టర్ ఐపీఎల్"కు పెళ్లి రోజు శుభాకాంక్షలు
-
WC 2011: ఊహించని షాకులు.. ఆ మధుర జ్ఞాపకాలు మరువగలమా?!
‘‘2011.. మేము ప్రపంచకప్ ఎత్తిన రోజు. ఆ చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అద్భుతమైన జట్టుతో మరుపురాని జ్ఞాపకాలు’’.. ‘‘ఆ అద్భుత క్షణంలోకి మరొక్కసారి’’.. టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యులైన సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ భావోద్వేగం. సరిగ్గా పదమూడేళ్ల క్రితం ఇదే రోజున.. ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ జట్టు జగజ్జేతగా అవతరించింది. సొంత గడ్డపై ప్రఖ్యాత వాంఖడే మైదానంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది ధోని సేన. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ చిరకాల కలను నెరవేర్చి.. అపూర్వ విజయాన్ని అతడికి బహుమతిగా అందించింది. నాడు శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సిక్స్ బాదగానే కోట్లాది మంది భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. వాంఖడేలో ఉన్న దాదాపు 33 వేల మంది మా తుజే సలాం అంటూ జట్టును ఉత్సాహపరిచారు. మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు యావత్ భారతావని ఆనందంతో పులకించిపోయింది. ఆ అపురూప క్షణాన్ని చెరగని జ్ఞాపకంగా గుండెల్లో పదిలపరచుకున్నారు అభిమానులు. వారిలో మీరూ ఒకరా?!.. మరి ఆనాటి మ్యాచ్ విశేషాలు మరోసారి గుర్తుచేసుకుందామా? శుభారంభం లభించినా ముంబైలోని వాంఖడే స్టేడియం.. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుమార్ సంగక్కర తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత పేసర్ జహీర్ ఖాన్ ఆరంభంలోనే ఓపెనర్ ఉపుల్ తరంగ(2)ను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం హర్భజన్ సింగ్ మరో ఓపెనర్ తిలకరత్రె దిల్షాన్(33)ను అవుట్ చేయగా.. యువరాజ్ సింగ్.. కెప్టెన్ కుమార్ సంగక్కర(48) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస వికెట్లు తీసిన టీమిండియా ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. నాలుగో నంబర్ బ్యాటర్ మహేళ జయవర్ధనే అజేయ శతకం(103)తో విరుచుకుపడ్డాడు. అయితే, మిగతా వాళ్లలో మళ్లీ ఒక్కరు కూడా కనీసం 35 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగుల వద్ద శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. ఊహించని షాకులు ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఊహించని షాకిచ్చాడు లసిత్ మలింగ. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(0)ను డకౌట్ చేశాడు. మైదానమంతా నిశ్శబ్దం. ఆ తర్వాత కాసేపటికే సచిన్ టెండుల్కర్(18) కూడా అవుట్! ఊపిరులూదిన గంభీర్ ఆ సమయంలో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ భారత శిబిరంతో పాటు అభిమానుల్లో ఉత్సాహం నింపాడు వన్‌డౌన్ బ్యాటర్ గౌతం గంభీర్. 122 బంతులు ఎదుర్కొని 97 పరుగులు సాధించాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. అంతకంటే విలువైన ఇన్నింగ్సే ఆడాడు. ధనాధన్ ధోని మిగిలిన వాళ్లలో విరాట్ కోహ్లి 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ధనాధన్ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు కెప్టెన్ ధోని. యువరాజ్ సింగ్(21 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాను గెలిపించాడు. ఆ క్షణాన్ని మర్చిపోగలమా? ఇక నలభై తొమ్మిదవ ఓవర్ రెండో బంతికి అతడు కొట్టిన విన్నింగ్ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్షణంగా నిలిచిపోతుందనడం అతిశయోక్తి కాదు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 79 బంతులు ఎదుర్కొన్న ధోని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకపై జయభేరి మోగించిన భారత జట్టు రెండోసారి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. దీంతో వాంఖడేతో పాటు దేశమంతటా సంబరాలు అంబరాన్నంటాయి. Probably the greatest ever night for any Indian fan which came under MS Dhoni's captaincy. The atmosphere and feeling were unmatched. pic.twitter.com/bzrIKRbsts — Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2022 చదవండి: IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా Reliving this feeling ❤️🇮🇳🏆#CWC2011 pic.twitter.com/zT9C0FSusg — Yuvraj Singh (@YUVSTRONG12) April 2, 2024 -
ఇంకో సూపర్ రికార్డుకు చేరువలో ధోని!
ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనిను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో ధోని మరో 43 పరుగులు చేస్తే సీఎస్కే తరఫున 5000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. సీఎస్కే తరఫున 5000 పరుగులు పూర్తి చేసిన ఏకైక ఆటగాడిగా మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా చలామణి అవుతున్నాడు. రైనా సీఎస్కే తరఫున 5529 పరుగులు చేశాడు. రైనా తర్వాత ఈ మైలురాయిని అందుకునేందుకు ధోని రెడీగా ఉన్నాడు. ధోని సీఎస్కే తరఫున మొత్తం 4957 పరుగులు సాధించాడు. ఇందులో ఐపీఎల్లో చేసినవి 4508 పరుగులు కాగా.. ఛాంపియన్స్ లీగ్‌లో చేసినవి 449 పరుగులు. రైనా, ధోని తర్వాత సీఎస్కే తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఉన్నాడు. డుప్లెసిస్ సీఎస్కే తరఫున 2932 పరుగులు చేశాడు. ఇతని తర్వాత మైక్ హస్సీ (2213), మురళీ విజయ్ (2105) సీఎస్కే తరఫున 2000 పరుగుల మార్కును దాటిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇవాల్టి నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో సీఎస్కే.. ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు ధోని తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. సీఎస్కే సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు ధోనినే స్వయంగా కెప్టెన్‌గా ప్రమోట్ చేశాడు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న విషయం ఆఖరి నిమిషం వరకు సీఎస్కే యాజమాన్యానికి కూడా తెలియకపోవడం కొసమెరుపు. -
విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్.. 44 బంతుల్లో శతకం
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో విండీస్ ఆటగాడు చాడ్విక్ వాల్టన్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ లీగ్‌లో న్యూయార్క్ సూపర్‌స్టార్ స్ట్రయికర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చాడ్విక్.. కొలొంబో లయన్స్‌తో ఇవాళ (మార్చి 18) జరుగుతున్న మ్యాచ్‌లో 44 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 46 బంతులు ఎదుర్కొన్న చాడ్విక్.. 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. చాడ్విక్తో పాటు అల్విరో పీటర్సన్ (49) రాణించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ నిర్ణీత 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో కపూగెదెర (17 నాటౌట్) రెండు భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో న్యూయార్క్ 200 పరుగుల మార్కును క్రాస్ చేసింది. కొలొంబో లయన్స్ బౌలర్లలో రాణా నయీమ్ 2 వికెట్లు పడగొట్టగా.. సిరివర్దన ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కొలొంబో లయన్స్... 8.1 ఓవర్లలో 54 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతుంది. దమ్మిక ప్రసాద్ (1-0-6-2), రాహుల్ శర్మ (2.1-0-10-2) అసేల గుణరత్నే (2-0-6-1), జేరోమ్ టేలర్ (2-0-18-1) కొలొంబో లయన్స్ పతనాన్ని శాశిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో విజేత రేపు జరుగబోయే ఫైనల్లో ఢిల్లీ డెవిల్స్‌తో తలపడనుంది. ఢిల్లీ డెవిల్స్‌కు సురేశ్ రైనా సారథ్యం వహిస్తున్నాడు. -
శ్రీలంక ఆటగాడి ఉగ్రరూపం.. సురేశ్ రైనా పోరాటం వృధా
శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ఇవాళ (మార్చి 11) ఢిల్లీ డెవిల్స్, న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రయికర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ యువరాజ్ సింగ్ సారధ్యం వహించిన న్యూయార్క్ జట్టు.. సురేశ్ రైనా నాయకత్వంలోని ఢిల్లీ డెవిల్స్‌ను 50 పరుగుల తేడాతో ఓడించింది. తిరిమన్నే విశ్వరూపం.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్.. లంక ఆటగాడు లహీరు తిరిమన్నే (39 బంతుల్లో 90; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో నిర్ణీత 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. న్యూయార్క్ ఇన్నింగ్స్‌లో తిరిమన్నే మినహా ఎవరూ రాణించలేదు. ఢిల్లీ బౌలర్లలో అనురీత్ సింగ్, మల్హోత్రా తలో 2 వికెట్లు పడగొట్టగా.. అబ్దుల్లా, అమితోజ్సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. సురేశ్ రైనా పోరాటం వృధా.. 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. సురేశ్ రైనా (35 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరివరకు అజేయంగా నిలిచాడు. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అంబటి రాయుడు (19) నిరాశపరిచాడు. న్యూయార్క్ బౌలర్లలో ఉదాన 3 వికెట్లు పడగొట్టగా.. రాహుల్ శర్మ, గ్రాండ్‌హోమ్ తలో వికెట్ పడగొట్టారు. -
సురేష్ రైనా విధ్వంసం.. కేవలం 33 బంతుల్లోనే! వీడియో వైరల్
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్‌లో భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐవీపీఎల్-2024లో వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్‌కు సారథ్యం వహిస్తున్న రైనా.. తన మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు అద్భుత విజయాలను అందిస్తున్నాడు. ఈ లీగ్‌లో ఉత్తర్‌ప్రదేశ్ ఫైనల్‌కు చేరడంలో రైనా కీలక పాత్ర పోషించాడు. ఈ లీగ్‌లో భాగంగా శనివారం ఛత్తీస్‌గఢ్ వారియర్స్‌తో జరిగిన సెకెండ్ సెమీఫైనల్లో కూడా రైనా సత్తాచాటాడు. సెమీఫైనల్లో 19 పరుగుల తేడాతో ఛత్తీస్‌గడ్‌ను చిత్తు చేసిన ఉత్తర్‌ప్రదేశ్ తుది పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యూపీ బ్యాటర్లలో పవన్ నేగి మరో సారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 50 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 94 పరుగులు చేశాడు. అదేవిధంగా కెప్టెన్ రైనా కూడా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 'మిస్టర్ ఐపీఎల్' 58 పరుగులు చేశాడు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో షాదాబ్ జాక్తీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మునాఫ్ పటేల్, అమిత్ మిశ్రా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఛత్తీస్‌గఢ్.. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. ఛత్తీస్‌గఢ్ ఓపెనర్లు జటిన్ సక్సేనా(76), నమాన్ ఓజా(43) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. చదవండి: AUS vs NZ: తిరుగులేని ఆసీస్.. ఏకంగా 172 పరుగుల తేడాతో ఘన విజయం Suresh Raina is still providing clutch performances in knockouts for his team 🐐🔥pic.twitter.com/Gu0O5ty0BB — MN 👾 (@CaptainnRogerrs) March 2, 2024 -
ఆ జట్టు కెప్టెన్‌గా యువరాజ్ సింగ్..
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ త్వరలోనే మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2024లో భాగం కానున్నాడు. న్యూయార్క్ సూపర్‌స్టార్ స్ట్రైకర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ స్ట్రైకర్స్ బుధవారం కీలక ప్రకటన చేసింది. యువీని తమ కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. యువరాజ్ సింగ్ తమ జట్టుకు ఆడటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఫ్రాంఛైజీ.. అతడికి సాదర స్వాగతం పలుకుతున్నామని పేర్కొంది. తొలి సీజన్ విజేతలుగా ఆ జట్లు కాగా గతేడాది ప్రారంభమైన లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ టోర్నీలో ఆరు జట్లు చండీగఢ్ చాంప్స్, నాగ్‌పూర్ నింజాస్, పట్నా వారియర్స్, వైజాగ్ టైటాన్స్, ఇండోర్ నైట్స్, గువాహటి అవెంజర్స్ పాల్గొన్నాయి. మార్చి 22 నుంచి 30 వరకు ఘజియాబాద్‌లో టోర్నీ జరిగింది. ఇక మాజీ క్రికెటర్లు పాల్గొన్న ఈ టీ20 లీగ్‌లో సురేశ్ రైనా సారథ్యంలోని ఇండోర్ నైట్స్, యూసఫ్ పఠాన్ కెప్టెన్సీలోని గువాహటి అవెంజర్స్ సంయుక్త విజేతలుగా నిలిచాయి. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దైన నేపథ్యంలో ఈ రెండు జట్లను చాంపియన్స్‌గా ప్రకటించారు. అయితే, ఈసారి ఈ లీగ్‌లో న్యూయార్క్ సూపర్‌స్టార్ స్ట్రైకర్స్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తాజా ప్రకటన ద్వారా తేలింది. కండిషన్స్ ఇవే ఇక లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ ఈసారి మార్చి 7 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. శ్రీలంకలోని కాండీ వేదికగా ఈ ఈవెంట్ ఆరంభం కానుంది. అదే విధంగా.. ఈసారి 90 బాల్ ఫార్మాట్లో టోర్నీ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఓ జట్టు ఐదుగురు బౌలర్లను బరిలోకి ఇదింపి ఒక్కొక్కరిచే మూడు ఓవర్లు వేయించాలి. అయితే, కెప్టెన్ నిర్ణయానుసారం ఒక్కరిచే మాత్రం నాలుగు ఓవర్లు వేయించవచ్చు. అయితే, 60వ బంతి పడకముందే బౌలింగ్ జట్టు కెప్టెన్ తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంటుంది. Delighted to announce the legendary Yuvraj Singh joining our team! Get ready for some electrifying moments on and off the field. Welcome aboard, Yuvi! 💥 @YUVSTRONG12 📸 - @BCCI #NewYorkStrikers #NYSSquad #NY #YuvrajSingh pic.twitter.com/Kc2RWwpiMP — New York Strikers (@NewYorkStrikers) February 14, 2024 -
T20 WC: ఏదేమైనా వాళ్లిద్దరు జట్టులో ఉండాల్సిందే: సురేశ్ రైనా
T20 World Cup 2024: అంతర్జాతీయ టీ20లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పునరాగమనంపై టీమిండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనా స్పందించాడు. ఈ ఇద్దరు స్టార్లను తిరిగి పిలిపించడం ద్వారా బీసీసీఐ తెలివైన నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాడు. వరల్డ్‌కప్-2024 వేదికలైన అమెరికా, వెస్టిండీస్ పిచ్‌లపై అనుభవజ్ఞులైన ఈ ఆటగాళ్ల అవసరం ఎంతగానో ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా 14 నెలల విరామం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి టీమిండియా తరఫున టీ20లలో రీఎంట్రీ ఇస్తున్నారు. సొంతగడ్డపై అఫ్గనిస్తాన్‌తో జరిగే సిరీస్ ద్వారా పునరాగమనం చేయనున్నారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి తొలి మ్యాచ్‌కు దూరం కాగా.. రోహిత్ సారథిగా ఆది నుంచే అందుబాటులో ఉండనున్నాడు. అయితే, వీరిద్దరి రాక కారణంగా యువ ఆటగాళ్లకు అవకాశాలు దక్కవనే విమర్శలు వస్తున్న తరుణంలో సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రపంచ కప్ టోర్నీకి వేదికలైన యూఎస్ఏ, వెస్టిండీస్‌లలో వికెట్లు కాస్త కఠినంగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో టీమిండియాకు రోహిత్, కోహ్లి వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ల అవసరం ఉంటుంది. టీ20 క్రికెట్లో కోహ్లి 12 వేల పరుగులకు చేరువవుతాడు. అలాంటి బ్యాటర్ అందుబాటులో ఉంటే జట్టు మరింత పటిష్టమవుతుంది. కోహ్లి వన్‌డౌన్‌లోనే బ్యాటింగ్ చేయాలి. కరేబియన్ పిచ్‌లపై ఆడుతున్నపుడు రోహిత్, కోహ్లి ఉంటేనే జట్టుకు ప్రయోజనకరం. యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, శుబ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లు దూకుడైన క్రికెట్ ఆడగలరు. కానీ సీనియర్లు అది కూడా బ్యాటింగ్ దిగ్గజాలు ఉంటే జట్టు మరింత బలోపేతమవుతుంది. వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్లలో తీవ్రమైన ఒత్తిడిని తట్టుకుని ముందుకు వెళ్లాలంటే రోహిత్- కోహ్లి ఉండాల్సిందే’’ అని సురేశ్ రైనా పీటీఐతో పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్లో పది వేలకు పైగా పరుగులు సాధించగా.. కోహ్లి 11 వేలకు పైగా రన్స్ పూర్తి చేసుకున్నాడు. చదవండి: Ishan Kishan: అప్పటి వరకు ఇషాన్‌కు టీమిండియాలో స్థానం లేదు.. హింటిచ్చిన ద్రవిడ్ -
‘మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇకపై అక్కడికి వెళ్తారా? లేదా..’
Cricket Stars Fume Over Maldives Row: భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను టీమిండియా మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. భారతీయులను తక్కువ చేసేలా మాట్లాడటం తగదని హితవు పలుకుతున్నారు. గతంలో ఎన్నోసార్లు మాల్దీవుల పర్యటనకు వెళ్లామని.. కానీ ఇకపై అలాంటి పరిస్థితులు ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని.. ఇకపై వాటిపైనే మనమంతా దృష్టి సారించాలని పిలుపునిస్తున్నారు. భారత పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేలా తమ వంతు సహకారం అందిస్తామంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతున్నారు. మోదీ ఫొటోలు వైరల్.. మాల్దీవుల మంత్రుల నోటి దురుసు కాగా ప్రధాని మోదీ.. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో ఇటీవల పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు మాల్దీవులతో లక్షద్వీప్‌ను పోలుస్తూ ప్రధాని మోదీ ఫొటోలను నెట్టింట వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు మోదీని కించపరిచే విధంగా తోలుబొమ్మ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. భారత్‌లో బీచ్‌లు, హోటల్ గదులు శుభ్రంగా ఉండవని.. అలాంటి దేశంతో తమకు పోలికేంటని వివాదాస్పద రీతిలో కామెంట్లు చేశారు. దీంతో బాయ్‌కాట్ మాల్దీవ్స్, #ExploreIndianIslands ట్రెండ్ చేస్తున్నారు భారత నెటిజన్లు. మన పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ బ్యాటర్ సురేశ్ రైనా తదితరులు స్పందించారు. ఈ మేరకు సెహ్వాగ్.. ‘‘ఉడుపి, పాండిలోని పారడైజ్ బీచ్, అండమాన్‌లోని నీల్, హవెలాక్‌తో పాటు దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇంతవరకు మనం చూడని చక్కటి బీచ్‌లు కూడా చాలా ఉన్నాయి. మన ప్రధాని పట్ల మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరును అందరూ గమనించాలి. ఇకపై అవసరమైన చోట్ల మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చేసి మన పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసి.. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. Whether it be the beautiful beaches of Udupi , Paradise Beach in Pondi, Neil and Havelock in Andaman, and many other beautiful beaches throughout our country, there are so many unexplored places in Bharat which have so much potential with some infrastructure support. Bharat is… pic.twitter.com/w8EheuIEUD — Virender Sehwag (@virendersehwag) January 7, 2024 ఇక ఇర్ఫాన్ పఠాన్.. ‘‘నాకు 15 ఏళ్ల వయసు ఉన్నపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో పర్యటించాను. ఇండియన్ హోటల్స్‌లో లభించిన ఆతిథ్యం మరెక్కడా లభించదు. మన దేశంలో ఉన్నన్ని పర్యాటక ప్రాంతాలు మరెక్కడా లేవు. మనం ప్రతి దేశ సంస్కృతిని గౌరవిస్తాం. కానీ.. నా మాతృదేశం గురించి, ఇక్కడి ఆతిథ్యం గురించి ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు వినడం ఎంతో బాధిస్తోంది’’ అని మాల్దీవుల మంత్రులకు చురకలు అంటించాడు. Having traveled the world since I was 15, every new country I visit reinforces my belief in the exceptional service offered by Indian hotels and tourism. While respecting each country's culture, it's disheartening to hear negative remarks about my homeland's extraordinary… — Irfan Pathan (@IrfanPathan) January 7, 2024 మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇక వెళ్లాలా లేదా? అదే విధంగా ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘ఇండియా వద్దని మాల్దీవులు ఓటేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో.. వెళ్లవద్దో అన్న అంశంలో భారతీయులు తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా కుటుంబం అయితే, ఇలాగే చేస్తుంది. జై హింద్’’ అని పేర్కొన్నాడు. ‘India Out’ was a part of the manifesto. Maldives voted for it. Now, it’s up to us, Indians, to choose wisely. I know that my family will. Jai Hind 🇮🇳 — Aakash Chopra (@cricketaakash) January 6, 2024 కాగా మోదీపై అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇప్పటికే చాలా మంది భారత ప్రముఖులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పర్యాటకమే ఆయువుపట్టుగా ఉనికిని చాటుకుంటున్న తమకు.. తాజా పరిణామాలు భారీ నష్టం చేకూరుస్తాయని పసిగట్టిన మాల్దీవుల ప్రభుత్వం.. ఇప్పటికే సదరు మంత్రులపై వేటు వేసింది. -
లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం..!? సురేష్ రైనాకు..
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు మెంటార్‌గా టీమిండియా మాజీ ఆటగాడు, సీఎస్కే లెజెండ్ సురేష్ రైనాను నియమించేందుకు ఎల్ఎస్జి సిద్దమైనట్లు సమాచారం. ఇప్పటికే అతడితో లక్నో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రైనా చేసిన ట్వీట్ ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. 'లక్నో ఫ్రాంచైజీతో రైనా ఒప్పందం కుదర్చుకోలేదని, అవన్నీ తప్పుడు వార్తలేనని' ఓ జర్నలిస్ట్ ఓ ట్వీట్ చేశాడు. అందుకు రైనా స్పందిస్తూ.. ఈ వార్తలు ఎందుకు నిజం కాకూడదు? అంటూ రిప్లే ఇచ్చాడు. దీంతో రైనాను కొత్త అవతారంలో చూడడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కాగా గత రెండు సీజన్లగా తమ జట్టు మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్‌ను.. ఐపీఎల్-2024 వేలానికి ముందు లక్నో ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. ప్రస్తుతం లక్నో మోంటార్ పదవి ఖాళీగా ఉంది. ఈ క్రమంలోనే గంభీర్ స్ధానాన్ని మిస్టర్ ఐపీఎల్‌తో భర్తీ చేసేందుకు సిద్దమైంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకట్రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్లో సురేష్ రైనా అద్భుతమైన రికార్డు ఉంది. మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన రైనా 205 మ్యాచ్‌లాడి 5528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సీఎస్కే నాలుగుసార్లు ఛాంపియన్‌గా(మొత్తంగా ఐదుసార్లు) నిలవడంలో రైనా పాత్ర కీలకం. -
సురేశ్ రైనా మెరుపులు.. కెవిన్ పీటర్సన్ పోరాటం వృధా
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 ఎడిషన్‌లో భాగంగా గురువారం (నవంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ సారథ్యం వహిస్తున్న ఇండియా క్యాపిటల్స్‌పై సురేశ్ రైనా నాయకత్వంలోని అర్భన్‌రైజర్స్ హైదరాబాద్ స్వల్ప తేడాతో (3 పరుగులు) విజయం సాధించింది. ఈ టోర్నీలో అర్భన్‌రైజర్స్ వరుసగా రెండో విజయం సాధించగా.. ఇండియా క్యాపిటల్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అర్భన్‌రైజర్స్.. గుర్కీరత్ సింగ్ (54 బంతుల్లో 89; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), సురేశ్ రైనా (27 బంతుల్లో 46; 6 ఫోర్లు, సిక్స్), పీటర్ ట్రెగో (20 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అర్భన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో డ్వేన్ స్మిత్ (3), మార్టిన్ గప్తిల్ (2), స్టువర్ట్ బిన్నీ (1)నిరాశపరిచారు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లలో ఇసురు ఉడాన 2 వికెట్లు పడగొట్టగా.. రస్టీ థీరన్, మునాఫ్ పటేల్, కేపీ అప్పన్న తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాపిటల్స్.. గెలుపు కోసం ఆఖరి బంతి వరకు పోరాడి, స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ (48 బంతుల్లో 77; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), ఆష్లే నర్స్ (25 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) క్యాపిటల్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో రికార్డో పావెల్ (26) పర్వాలేదనిపించగా.. గౌతమ్ గంభీర్ (0), హషీమ్ ఆమ్లా (5), బెన్ డంక్ (5) విఫలమయ్యారు. అర్భన్‌రైజర్స్ బౌలర్లలో క్రిస్ మోఫు 2 వికెట్లు పడగొట్టగా.. పీటర్ ట్రెగో, టీనో బెస్ట్, పవన్ సుయల్ తలో వికెట్ దక్కించుకున్నారు. టోర్నీలో భాగంగా ఇవాళ (నవంబర్ 24) మణిపాల్ టైగర్స్, భిల్వారా కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. -
హార్దిక్ కాదు! ధోని మాదిరి ప్రభావం చూపగల బ్యాటర్ అతడే: సురేశ్ రైనా
Suresh Raina Intresting Comments: టీమిండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోని మాదిరి డెత్ ఓవర్లలో ప్రభావం చూపగల బ్యాటర్ ఇతడేనంటూ టీమిండియా టీ20 స్టార్ పేరును ఎంచుకున్నాడు. కాగా టీమిండియా దిగ్గజ కెప్టెన్ ధోని బెస్ట్ ఫినిషర్‌గా పేరొందిన విషయం తెలిసిందే. తన అసాధారణ ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చిన సందర్భాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్-2011లో సిక్స్‌తో టీమిండియాను జగజ్జేతగా నిలిపిన క్షణాలను అభిమానులు మర్చిపోలేరు. ఆరంభంలో వికెట్లు పడ్డా.. ధోని కాసేపు నిలబడితే చాలు మ్యాచ్ గెలుస్తామనే ధీమా! హార్దిక్ పాండ్యా సైతం ఇక గత కొన్నేళ్లుగా డెత్ ఓవర్లలో మెరుగ్గా ఆడుతున్న మరో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన పాండ్యా భావి కెప్టెన్‌గానూ నీరాజనాలు అందుకుంటున్నాడు. ధోని తర్వాత సూర్యకుమార్ మాత్రమే ఈ నేపథ్యంలో సురేశ్ రైనా మాత్రం.. డెత్ ఓవర్లలో హార్దిక్ పాండ్యాను కాదని.. వరల్డ్ నంబర్ 1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ధోని వారసుడిగా ఎంచుకోవడం విశేషం. స్పోర్ట్స్‌తక్‌తో మాట్లాడిన ఈ మాజీ లెఫ్టాండ్ బ్యాటర్.. ‘‘ధోని కాకుండా డెత్ ఓవర్లలో అంతటి ప్రభావం చూపగల బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మాత్రమే’’ అని పేర్కొన్నాడు. గొప్ప రికార్డేమీ లేదు కాగా వన్డేల్లో సూర్యకు అంతగొప్ప రికార్డేమీ లేదు. అయినప్పటికీ వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో అతడికి స్థానం దక్కింది. ఈ క్రమంలో విమర్శలు వెల్లువెత్తుగా.. మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో సిరీస్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాది ఫామ్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా ధోని సారథ్యంలో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో రైనా సభ్యుడన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అక్టోబరు 8న చెన్నై వేదికగా టీమిండియా.. ఆసీస్‌తో మ్యాచ్‌తో ప్రపంచకప్-2023 జర్నీ ఆరంభించింది. చదవండి: వీడెవడండీ బాబూ.. జార్వో మామ మళ్లీ వచ్చేశాడు! కోహ్లి నచ్చచెప్పడంతో -
నెక్ట్స్ సూపర్‌స్టార్.. మరో కోహ్లి కావాలనుకుంటున్నాడు: సురేశ్ రైనా
ICC ODI WC 2023: టీమిండియా ఓపెనర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్న యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ గురించి మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ మరో విరాట్ కోహ్లి అవ్వాలని కోరుకుంటున్నాడని.. అందుకు తగ్గట్లుగానే అడుగులు వేస్తున్నాడని ప్రశంసించాడు. అద్భుతమై షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించడం అతడికి అలవాటుగా మారిపోయిందంటూ కొనియాడాడు. గిల్ క్రీజులో ఉన్నాడంటే స్పిన్నర్లైనా.. పేసర్లైనా ఆచితూచి బంతిని విసరాల్సిందేనంటూ గిల్ ఆట తీరును మెచ్చుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత క్రికెట్ ప్రేమికులంతా గిల్ గురించి మాట్లాడుకోవడం ఖాయమంటూ అతడిని ఆకాశానికెత్తాడు. కాగా 2019లో న్యూజిలాండ్‌తో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన గిల్.. అనతికాలంలోనే భారత జట్టు స్టార్ ఓపెనర్‌గా ఎదిగాడు. రోహిత్‌కు జోడీగా జట్టులో పాతుకుపోయి కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా పాతుకుపోయి.. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ ముఖ్యమైన సభ్యుడిగా మారిపోయాడు. ఇక ఆసియా కప్-2023లోనూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న గిల్.. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌లో 24 ఏళ్ల శుబ్‌మన్ గిల్ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్‌లో అత్యంత ముఖ్యమైన ప్లేయర్లలో అతడూ ఒకడు. తదుపరి సూపర్‌స్టార్.. మరో కోహ్లి భారత క్రికెట్లో తదుపరి సూపర్‌స్టార్ కావాలని.. మరో విరాట్ కోహ్లి కావాలని తను కోరుకుంటున్నాడు. అందుకు తగ్గట్లుగా పక్కాగా ప్రణాళికలు అమలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. బలంగా బంతిని బాదడం అతడి నైపుణ్యాలకు నిదర్శనం. స్పిన్నర్లు.. లేదంటే ఫాస్ట్‌బౌలర్లు.. ఎవరైనా సరే గిల్ క్రీజులో ఉంటే బాల్ ఎక్కడ వేయాలా అని తలలు పట్టుకోవాల్సిందే! అతడు ఇక్కడితో ఆగిపోడు. 2019లో రోహిత్ టీమిండియా తరఫున ఎలా ఆడాడో చూశాం కదా! పుట్టుకతోనే తనొక లీడర్ ఈసారి గిల్ కూడా అదే పనిచేస్తాడు. జన్మతః గిల్ లీడర్.. ఆ విషయాన్ని తన ఆటతో ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించాడు. గత కొంతకాలంగా అతడు నిలకడగా ఆడుతున్నాడు. అయితే, వెస్టిండీస్‌తో సిరీస్‌లో కాస్త నిరాశపరిచాడు. అయితే, ఆసియా కప్‌తో మళ్లీ తన సత్తా చాటాడు. ఫుట్‌వర్క్ బాగుంది. చాలా మెరుగయ్యాడు. సునాయాసంగా 50లు, 100లు బాదగల స్థాయికి చేరుకున్నాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్‌కప్-2023లో అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అంతకంటే ముందు.. సెప్టెంబరు 22- 27 వరకు ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో పాల్గొననుంది. ఇదిలా ఉంటే.. కోహ్లి తన రోల్ మోడల్ అని గిల్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. చదవండి: ఒక్కటీ గెలవలేదు.. హోదా ఇచ్చి తప్పుచేశారు! అన్నిటికంటే చెత్త విషయం ఇదే.. -
తన ఆరాధ్య క్రికెటర్ అడుగుజాడల్లో తిలక్ వర్మ.. అచ్చుగుద్దినట్లు ఒకేలా..!
టీమిండియా యంగ్ గన్ తిలక్ వర్మ.. తన ఆరాధ్య క్రికెటర్ సురేశ్ రైనా అడుగు జాడల్లో నడుస్తున్నాడు. బ్యాటింగ్ స్టయిల్, షాట్లు ఆడే విధానం, అటాకింగ్ శైలి.. ఇలా ప్రతి విషయంలో తిలక్, రైనాను ఫాలో అవుతున్నాడు. రైనా కెరీర్ ఆరంభం ఎలా సాగిందో, తిలక్ కెరీర్ కూడా అచ్చుగుద్దినట్లు అలాగే సాగుతుంది. ఈ ఇద్దరి గణాంకాలు మక్కీ టు మక్కీ అన్నట్లుగా ఉన్నాయి. ఈ గణాంకాలను చూస్తే ఔరా అనక తప్పదు. ఈ గణాంకాలు చూసిన వారు రైనా జిరాక్స్ కాపీగా తిలక్ వచ్చాడని అంటున్నారు. రైనా, తిలక్‌ల మధ్య పోలికలపై ఓ లుక్కేద్దాం.. ఈ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు మిడిలార్డర్లో అటాకింగ్ గేమ్ ఆడటానికి ఇష్టపడతారు, ఓ రకంగా చెప్పాలంటే అలా చేసి సక్సెస్ కూడా అయ్యారు. రైనా, తిలక్ ఇద్దరూ 20 ఏళ్ల వయసులోనే భారత్ తరఫున టీ20 అరంగేట్రం చేశారు. ఈ ఇద్దరూ టీ20 డెబ్యూ మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు అందుకున్నారు. ఈ ఇద్దరూ తమతమ కెరీర్లలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 49 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ ఇద్దరి టీ20 కెరీర్లలో తొలి ఫిఫ్టి సాధించిన మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమిపాలైంది. రైనా, తిలక్ ఇద్దరూ తమ తొలి రెండు ఐపీఎల్ సీజన్లలో 350 ప్లస్ పరుగులు చేశారు. ఐపీఎల్ చరిత్రలో రైనా, తిలక్‌లు మాత్రమే ప్లే ఆఫ్స్‌లో 300 ప్లస్ స్ట్రయిక్‌రేట్ (40 ప్లస్ స్కోర్ చేసిన సందర్భాల్లో) కలిగి ఉన్నారు. -
రెస్టారెంట్ టూ స్టార్టప్ ఫండింగ్: సురేష్ రైనా నెట్‌వర్త్ తెలిస్తే షాకవుతారు
క్రికెటర్, ఐపీఎల్ ఆటగాడు సురేష్ రైనా నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభించి అటు ఫ్యాన్స్‌ను, ఇటు వ్యాపార వర్గాలను ఆకర్షించాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రైనా వ్యాపార వ్యూహంలో భారీ ప్లాన్లే ఉన్నాయి. ఇండియా నుంచి యూరప్‌కు విస్తారమైన ప్రామాణిక వంటకాలను, రుచులను, అందించనున్నాడు. రెస్టారెంట్ మాత్రమే కాదు వ్యాపార సామ్రాజ్యం, పెట్టుబడి డీల్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఆ వివరాలు ఒకసారి చూద్దాం!. సిక్సర్లేనా.. నోరూరించే ఇండియన్ వంటకాలు కూడా తన ప్రతిభతో క్రికెటర్‌గా పాపులర్ అయిన సురేష్ రైనా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంఎస్ ధోని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఆడిన సంగతి తెలిసిందే. తాజాగా ‘రైనా క్యులినరీ ట్రెజర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో కోట్ల రూపాయల రెస్టారెంట్‌ను ప్రారంభించినట్లు జూన్ 23న సోషల్ మీడియా ద్వారా రైనా ప్రకటించాడు. ఈ రెస్టారెంట్ ఢిల్లీలోని ప్రసిద్ధ చాందినీ చౌక్ నుండి స్నాక్స్‌తో సహా అనేక రకాల శాఖాహార, మాంసాహార వంటకాలను అందిస్తుందట. ఐపీఎల్ 2022 వేలంలో అమ్ముడుపోని తర్వాత, రైనా క్రికెట్ టోర్నమెంట్‌కు వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా వ్యవహరించాడు. ఇది భారీ ఆదాయాన్నే సంపాదించి పెట్టింది. దీంతోపాటు బహుళ ఎండార్స్మెంట్ డీల్స్ ద్వారా కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాడు. (సింగిల్ బ్రాండ్‌తో 100 కోట్ల డీల్ కుదుర్చుకున్న తొలి ఇండియన్ క్రికెటర్ ఎవరో తెలుసా? ) ముఖ్యంగా సురేష్ రైనా , భార్యతో కలిసి ‘మాతే’ అనే బేబీకేర్ బ్రాండ్‌ను కూడా స్థాపించాడు. ఇది ఇది పిల్లల సంరక్షణ కోసం రసాయన రహిత, ఆయుర్వేద ఉత్పత్తులను విక్రయిస్తుంది. దీంతోపాటు క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వార్తలను ప్రచురించే Sahicoin అనే స్టార్టప్ కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టాడు. అలాగే సురేష్ రైనా గతంలో అడిడాస్, టైమెక్స్, మ్యాగీ, ఇంటెక్స్, బూస్ట్ ఎనర్జీ డ్రింక్స్, పెప్సికో, ఆర్కె గ్లోబల్, హెచ్‌పి వంటి అనేక పెద్ద బ్రాండ్లతో ఎండార్స్మెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. అంతేనా, భారత్‌పే, బుకింగ్స్ డాట్కాం, ఎలిస్తా లాంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. వీటన్నింటి విలువు దాదాపు రూ.10 కోట్లకు పైమాటే. దీంతోపాటు విలాసవంతమైన భారీ బంగ్లా కూడా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఈ బంగ్లా విలువ 18 కోట్ల రూపాయలట.స్పోర్ట్స్‌కీడా అంచనా ప్రకారం రైనా నికర విలువ రూ. 200 కోట్లకు పైగా ఉండగా, వార్షిక సంపాదన దాదాపు రూ. 11.5 కోట్లుగా ఉంది.(ఆదిపురుష్ విలన్‌కి కోట్ల విలువైన డైమండ్ వాచ్ గిఫ్ట్: ఎపుడు, ఎవరిచ్చారో తెలుసా?) 1986, నవంబరు 27న యూపీలో పుట్టిన సురేష్ రైనా. ఢిల్లీ యూనివర్శిటీటీ నుంచి బీకాం (డిస్టెన్స్), 2022లో చెన్నైలోని యూనివర్శిటీనుంచి గౌరవ డాక్టరేట్ పొదారు. బీటెక్ చదివిన అతని భార్య ప్రియాంక చౌదరి పలు ఐటీ కంపెనీల్లో పనిచేశారు. ఆ తరువాత 2017లో మాతే నేచురల్ బేబీ కేర్ ఉత్పత్తుల సంస్థను స్థాపించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) -
యూరప్‌లో చెఫ్ అవతారమెత్తిన రైనా.. నోరూరించే రుచులతో..
Suresh Raina Restaurant: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాడు. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో రెస్టారెంట్ ఆరంభించాడు. యూరప్ నడిబొడ్డున భారత రుచులను కస్టమర్లకు వడ్డించేందుకు సిద్ధమైపోయాడు. రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా చెఫ్ అవతారమెత్తాడు ఈ మిస్టర్ ఐపీఎల్. ‘రైనా’ పేరిట మొదలెట్టిన రెస్టారెంట్ ముందు నిలబడి తమ ఉద్యోగులతో ఫొటోలకు పోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సరికొత్త రుచులు ‘‘ఇంతకు ముందెన్నడూ రుచి చూడని వంటకాలతో మేము సిద్ధం. రుచి చూసేందుకు మీరూ సిద్ధంకండి. ఆమ్‌స్టర్‌డామ్‌లో రైనా ఇండియన్ రెస్టారెంట్ మొదలెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. ఫుడ్ పట్ల నాకున్న ప్యాషన్ ఇక్కడ మీరు చూడబోతున్నారు’’ అని సురేశ్ రైనా తన పోస్టులో చెప్పుకొచ్చాడు. నోరూరించే వెరైటీలు తమ రెస్టారెంట్లో ఉత్తర భారత వంటల సువాసనలతో పాటు.. దక్షిణ భారత అదిరిపోయే రుచులను కూడా అందిస్తామని రైనా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా రైనా రెస్టారెంట్లో చికెన్ చాట్, మిక్స్ పకోడా, జైతుని పనీర్ టిక్కా, తందూర్ చికెన్ టిక్కా, ఆనియన్ భాజీతో పాటు పలురకాల కెబాబ్స్ స్టార్టర్లుగా వడ్డించనున్నారు. అదే విధంగా ఢిల్లీలోని చాందినీచౌక్‌లో ప్రసిద్ధి పొందిన దహీ భల్లా, పానీ పూరీ, చాట్ పాప్రీ, ఆలూ చాట్, సమోసా కూడా వీరి మెనూలో ఉన్నాయి. చికెన్, మటన్, ఫిష్ సహా వెజ్‌టేరియన్ వెరైటీలతో కస్టమర్లను ఆకర్షించేందుకు రైనా రెస్టారెంట్ సిద్ధమైపోయింది. భార్య బ్యాంకర్‌గా కాగా సురేశ్ రైనా భార్య ప్రియాంక గతంలో నెదర్లాండ్స్‌లోని ఓ బ్యాంక్‌లో పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైనా తరచుగా ఆమ్స్టర్డామ్ వెళ్లేవాడు. ఈ క్రమంలో అక్కడే రెస్టారెంట్ ఆరంభించి తన కలను నిజం చేసుకున్నాడు. ఇక తాను ఫుడీనంటూ గతంలో రైనా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చిన్న తలా కెరీర్ ఇలా ఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడిన రైనా.. వరుసగా 768, 5615, 1604 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో సుదీర్ఘకాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. చిన్న తలాగా పేరొందాడు. మహేంద్ర సింగ్ ధోనికి అత్యంత సన్నిహితుడైన రైనా.. మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెంటనే తానూ గుడ్ చెప్పాడు. 2020 ఆగష్టు 15న రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ View this post on Instagram A post shared by Suresh Raina (@sureshraina3) -
మర్చిపోయారా? లేక తొలగించారా? కన్ఫ్యూజ్ చేస్తున్న రైనా..!
-
ఎల్పీఎల్ వేలం.. రైనాను మరిచిపోయారా? పట్టించుకోలేదా?
శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించే లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2023) చరిత్రలో తొలిసారి వేలం జరిగింది. జూన్ 14న(బుధవారం) ఎల్పీఎల్లో వేలం నిర్వహించారు. మొత్తం 360 మంది ప్లేయర్లు వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో భారత్ తరపున రిజిస్టర్ చేసుకుంది కేవలం సురేశ్ రైనా మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం.. ఐపీఎల్లో కూడా ఏ జట్టు తరపున ఆడకపోవడంతో రైనాకు లైన్ క్లియర్ అయింది. ఐపీఎల్లో తనదైన ముద్ర వేసిన సురేశ్ రైనాకు లంక ప్రీమియర్ లీగ్‌లో మంచి ధర పలుకుతుందని అభిమానులు ఊహించారు. ఒక దశలో సురేశ్ రైనా పేరును లంక క్రికెట్ బోర్డు ఎల్‌పీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగించుకుంటుందని భావించారు. కానీ వేలం సమయానికి సీన్ మొత్తం రివర్స్ అయింది. వేలం జరుగుతున్న సమయంలో సురేశ్ రైనా పేరు ఎక్కడా వినిపించలేదు. అలా అని అన్‌సోల్డ్ లిస్ట్‌లో ఉన్నాడా అంటే అది లేదు. మరి రైనా పేరు ఏమైనట్లు అని అభిమానులు కన్ఫూజ్కు గురయ్యారు. అయితే విషయమేంటంటే వేలంలో హోస్ట్‌గా వ్యవహరించిన చారుశర్మ సురేశ్ రైనా పేరును మరిచిపోయాడా లేక కావాలనే పట్టించుకోలేదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై అటు రైనా కానీ ఇటు లంక క్రికెట్ బోర్డు గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైనా లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడతాడా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. వాస్తవానికి రైనా తన బేస్‌ప్రైస్ ధరతో సెట్ నెంబర్ 11లో ఉన్నాడు. ఇదే సెట్లో రాసీ వాండర్ డుసెన్(సౌతాఫ్రికా), ఇమాముల్ హక్(పాకిస్తాన్), ఎవిన్ లూయిస్(వెస్టిండీస్) వంటి స్టార్లు ఉన్నారు. వీరిందరి పేర్లను పలికిన చారు శర్మ రైనా పేరు పలకడం మాత్రం మరిచిపోయాడు. అయితే ఇదే అభిమానులను కన్ఫూజ్న్కు గురయ్యేలా చేసింది. నిజంగా చారుశర్మ రైనా పేరును పలకడం మరిచిపోయారా.. లేదంటే చివరి నిమిషంలో రైనా పేరును వేలంలో తొలగించారా అనేది క్లారిటీ లేదు. టి20 క్రికెట్లో సురేశ్ రైనాకు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన క్రికెటర్‌గా పేరు పొందిన రైనా 205 మ్యాచ్‌లాడి 5528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సీఎస్కే నాలుగుసార్లు ఛాంపియన్‌గా(మొత్తంగా ఐదుసార్లు) నిలవడంలో రైనా పాత్ర కీలకం. అంతేకాదు టీమిండియా తరపున 78 టి20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 1609 పరుగులు చేసిన రైనా ఖాతాలో ఒక సెంచరీ సహా ఐదు హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. మరి ఇంతటి ట్రాక్ రికార్డు కలిగిన సురేశ్ రైనాకు లంక ప్రీమియర్ లీగ్‌లో చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. అయితే దీనిపై క్లారిటీ వచ్చేవరకు రైనా ఎల్పీఎల్ ఆడతాడా లేదా అనేది తెలియదు. ఇప్పటికైతే రైనా ఎల్పీఎల్లో ఆడనట్లే. ఇక ఎల్పీఎల్లో ఈసారి పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఒక్కడే ఐకాన్ ప్లేయర్‌గా ఉన్నాడు. కొలంబో స్ట్రైకర్స్‌కు బాబర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక నిన్నటి వేలంలో దిల్షాన్ మధుషనక అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. మధుషనకను లైకా జఫ్నా కింగ్స్ 92వేల డాలర్లకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో చరిత్ అసలంక 80వేల డాలర్లకు(బేస్ ప్రైస్ 40వేల డాలర్లు) జఫ్నా కింగ్స్.. మూడో స్థానంలో ధనుంజయ డిసిల్వా(బేస్ ప్రైస్ 40వేల డాలర్లు)ను దంబుల్లా ఆరా 76వేల డాలర్లకు కొనుగోలు చేసింది. చదవండి: ఎల్పీఎల్ చరిత్రలో తొలిసారి వేలం.. అందరి దృష్టి ఆ క్రికెటర్‌పైనే -
ఎల్పీఎల్ చరిత్రలో తొలిసారి వేలం.. కళ్లన్నీ ఆ క్రికెటర్‌పైనే
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అంత కాకపోయినా లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) కూడా బాగానే ప్రజాధరణ పొందుతుంది. గత సీజన్ ఇందుకు ఉదాహరణ. ఇప్పటివరకు ఐపీఎల్ మినహా మిగతా లీగ్‌ల్లో ఆడేందుకు సముఖత చూపని టీమిండియా మాజీ క్రికెటర్లు ఇప్పుడు బయటి లీగుల్లోనూ దర్శనమిస్తున్నారు. తాజాగా 2023 సీజన్‌కు సంబంధించి జూన్ 14న(బుధవారం) లంక ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి వేలం జరగనుంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ వేలానికి 500 మంది ఆటగాళ్లు తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. వేలంలో ఐదు ఫ్రాంచైజీలు పాల్గొననుండగా.. ఐపీఎల్లో అనుసరించిన విధానాన్నే ఇక్కడ అమలు చేయనున్నారు. మొత్తం ఆటగాళ్ల కోసం 5లక్షల అమెరికన్ డాలర్డు ఖర్చు చేయనున్నారు. ఇక తొలిసారి జరగనున్న వేలానికి చారు శర్మ హోస్ట్‌గా వ్యవహరించనుండడం విశేషం. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకోవడం ఆసక్తి కలిగించింది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరు పొందిన రైనాకు మంచి ధర పలికే అవకాశం ఉంది. 50వేల యూఎస్ డాలర్ల కనీస ధరతో రైనా వేలంలోకి రానున్నాడు. సెప్టెంబర్ 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా ఆ తర్వాత 2023లో అబుదాబి టి10 టోర్నీలో పాల్గొన్నాడు. అయితే వేలానికి ముందే ఆయా ఫ్రాంచైజీలు కొందరు స్టార్ ప్లేయర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వారిలో బాబర్ ఆజం, షకీబ్ అల్ హసన్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లు వీరే.. ► కొలంబో స్ట్రైకర్స్: బాబర్ ఆజం, మతీషా పతిరనా, నసీమ్ షా, చమికా కరుణరత్నే ► దంబుల్లా ఆరా: మాథ్యూ వేడ్, కుసల్ మెండిస్, లుంగి ఎన్గిడి, అవిష్క ఫెర్నాండో ► జాఫ్నా కింగ్స్: మహేశ్ తీక్షణ, డేవిడ్ మిల్లర్, తిసర పెరీరా, రహ్మానుల్లా గుర్బాజ్ ► క్యాండీ ఫాల్కన్స్: వనిందు హసరంగా, ఏంజెలో మాథ్యూస్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఫఖర్ జమాన్ ► గాలే గ్లాడియేటర్స్: భానుక రాజపక్స, దసున్ షనక, షకీబ్ అల్ హసన్, తబ్రైజ్ షమ్సీ ఇప్పటివరకు మూడు సీజన్లు విజయవంతం కాగా నాలుగో సీజన్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా జూలై 30 నుంచి ఆగస్టు 20 వరకు లంక ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్ జరగనుంది. Charu Sharma thrilled to be auctioneer for LPL 2023, the league's first ever auction! 🏏🔨https://t.co/xu1EFeab3C #lpl2023 — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 12, 2023 చదవండి: ఒక రాధా.. ఇద్దరు కృష్ణులు! -
లంక ప్రీమియర్ లీగ్ ఆడనున్న సురేష్ రైనా.. ధర ఎంతంటే?
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా లంక ప్రీమియర్ లీగ్-2023లో ఆడేందుకు సిద్దమయ్యాడు. రాబోయే ఎడిషన్ కోసం జూన్ 14న వేలం ప్రక్రియ జరగనుంది. ఈ వేలంలో సురేష్ రైనా తన పేరును నమోదు చేసుకున్నాడు. అతడు తన బేస్‌ప్రైస్ 50,000 డాలర్లు(సుమారు 41 లక్షల 30 వేల రూపాయలు)గా నిర్ణయించినట్లు సమాచారం. ఇక గతేడాది సెప్టెంబర్‌లో అన్నిరకాల క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం రైనా విదేశీ లీగ్‌లపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే అబుదాబి టీ10 లీగ్-2022లో డెక్కన్ గ్లాడియేటర్ తరపున ఆడాడు. ఇప్పుడు మరోసారి తన అభిమానులను ఈ మిస్టర్ ఐపీఎల్ అలరించనున్నాడు. ఇక ఈ ఏడాది ఎల్పీఎల్ జూలై 30 నుంచి ఆగస్టు 20వరకు జరగనుంది. కాగా లంక ప్రీమియర్ లీగ్‌లో తొలిసారిగా ఐపీఎల్ తరహాలో వేలం నిర్వహించబోతున్నారు. మొదటి మూడు సీజన్లలో ప్లేయర్లను నేరుగా డ్రాఫ్ట్ రూపంలో ఐదు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఈ ఏడాది వేలంలో 140 మంది అంతర్జాతీయ క్రికెటర్లతో సహా మొత్తం 500 మందికి పైగా క్రికెటర్లు ఈ వేలం జాబితాలో ఉన్నారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్, ఆసీస్ క్రికెటర్ మాథ్యూవేడ్ వంటి ఆటగాళ్లు ఈ లీగ్‌లో భాగం కానున్నారు. అయితే ఇప్పటివరకు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడిన ఒకే ఒక్క భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రమే. ఒక వేళ రైనాను ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తే ఈ లీగ్‌లో భాగమైన రెండో ఆటగాడిగా రైనా నిలుస్తాడు. చదవండి: IND vs WI: టీమిండియా విండీస్ టూర్ షెడ్యూల్ ఖరారు.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే? -
ఫైనల్ లో జడేజా బాటింగ్ పై సురేష్ రైనా కామెంట్స్
-
ఇటువంటి అద్భుతాలు సర్ జడేజా ఒక్కడికే సాధ్యం.. చాలా సంతోషంగా ఉంది: రైనా
ఐపీఎల్-2023 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తుదిపోరులో 5 వికెట్ల తేడాతో(డక్‌వర్త్‌లూయిస్ పద్దతిలో) విజయం సాధించిన సీఎస్కే.. ఐదో సారి ఛాంపియన్స్‌గా నిలిచింది. ఇక ఆఖరి బంతికి ఫోర్ కొట్టి సీఎస్కేను ఛాంపియన్స్‌గా నిలిసిన రవీంద్ర జడేజాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా చేరాడు. జడ్డూను పొగడ్తలతో రైనా ముంచెత్తాడు. అసాధ్యాలను సుసాధ్యం చేసే సత్తా సర్ జడేజాకు ఒక్కడికే ఉందని రైనా కొనియాడు. కాగా సీఎస్కే విజయానికి ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసిన మొహిత్ శర్మ తొలి నాలుగు బంతులకే కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆఖరి రెండు బంతులకు 10 పరుగులు అవసరమవ్వగా.. జడ్డూ వరుసగా సిక్స్, ఫోర్ బాది గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ నేపథ్యంలో జియో సినిమాతో రైనా మాట్లాడుతూ.. "రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మొహిత్ తొలి నాలుగు బంతులను అద్బుతంగా వేశాడు. అటువంటి బౌలర్‌కు జడ్డూ వరుసగా సిక్స్, ఫోర్ బాది తన జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. తీవ్రమైన ఒత్తిడిలో కూడా జడ్డూ తన మాస్టర్‌క్లాస్‌ను ప్రదర్శించాడు. అందుకే ఎంఎస్ ధోని కూడా జడేజాను ఎత్తుకుని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇటువంటి అద్భుతాలు సర్జడేజాకు ఒక్కడే సాధ్యం. ఇది చారిత్రాత్మక విజయం. ఈ క్షణాన్ని దేశం మొత్తం గర్వించింది. మొత్తం పసుపు రంగుగా మారిపోయింది" అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: అదరగొట్టిన గిల్.. ఎన్ని అవార్డులు వచ్చాయంటే? మొత్తం ప్రైజ్‌మనీ ఎంతంటే? -
IPL 2023: తిలక్ వర్మ.. మరో సురేశ్ రైనా
ముంబై ఇండియన్స్ నయా సంచలనం నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ.. తన ఆరాధ్య క్రికెటర్ సురేశ్ రైనాను ఫాలో అవుతున్నాడు. షాట్లు ఆడే విధానంలోనే కాక, రికార్డులు నమోదు చేయడంలోనే తిలక్.. రైనా అడుగుజాడల్లో నడుస్తున్నాడు. నిన్న (మే 26) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో 14 బంతుల్లో 307.14 స్ట్రయిక్ రేట్‌తో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన తిలక్.. గతంలో రైనా సాధించిన ఓ అరుదైన రికార్డును షేర్ చేసుకున్నాడు. 2014 సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రైనా 25 బంతుల్లో 348 స్ట్రయిక్ రేట్‌తో 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో 40 అంతకంటే ఎక్కువ పరుగులు చేసి, 300కు పైగా స్ట్రయిక్ రేట్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా రైనా రికార్డుల్లోకెక్కాడు. తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రైనా సరసన చేరాడు. నాటి మ్యాచ్‌లో రైనా జట్టు ఎలాగైతే భారీ లక్ష్య ఛేదనలో పోరాడి ఓడిందో.. గుజరాత్‌తో మ్యాచ్‌లో ముంబై సైతం అలాగే పోరాడి ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిన్న (మే 26) జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా గుజరాత్ వరుసగా రెండో సీజన్లో ఫైనల్లోకి అడుగుపెట్టి, టైటిల్ పోరులో సీఎస్కేతో అమీతుమీకి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్‌మన్ గిల్ విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన ముంబై.. మోహిత్ శర్మ (5/10) ధాటికి 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. సూర్యకుమార్ (38 బంతుల్లో 61), తిలక్ వర్మ (14 బంతుల్లో 43) మెరుపులు వృధా అయ్యాయి. చదవండి: గెలవదగిన ఆట ఆడలేదు.. శుభ్‌మన్ సూపర్, అదే మా ఓటమికి కారణం: రోహిత్ శర్మ -
ధోని పట్టిందల్లా బంగారమే!
నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023) ఫైనల్లో అడుగుపెట్టింది. సీఎస్కే పదోసారి ఐపీఎల్ టైటిల్ పోరులో నిలవడం పట్ల ఆ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా సంతోషం వ్యక్తం చేశాడు. టోర్నీ ఆసాంతం చెన్నైని అద్భుతంగా నడిపించిన మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni)ని అతను ఆకాశానికెత్తేశాడు. జడేజా, దీపక్ చాహర్ తప్పించి జట్టులో స్టార్ బౌలర్లు లేకపోయినా సీఎస్కేను ఫైనల్‌కు చేర్చిన మహీపై ప్రశంసలు కురిపించాడు. ధోని ముట్టకున్న ప్రతీది బంగారమవుతుంది. ధోని ప్రతి విషయాన్ని చాలా సులువుగా మార్చుతాడు. యావత్ భారతదేశం మొత్తం ధోని ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని కోరుకుంది’ అని రైనా వెల్లడించాడు. ఏమంత అనుభవం లేని మహీశ్ థీక్షణ, మతీశా పతీరానా(శ్రీలంక), తుషార్ దేశ్‌పాండే వంటి బౌలర్లపై నమ్మకం ఉంచి, వాళ్లను మ్యాచ్ విన్నర్లుగా మార్చాడు. తెలివైన వ్యూహాలతో, సరైన సమయంలో బౌలింగ్ మార్పులతో ధోనీ ఫలితాలు రాబట్టాడు. గత సీజన్లో దారుణ ప్రదర్శనతో 9వ స్థానంలో నిలిచిన ధోనీ సేన ఈసారి రెండో స్థానం సాధించింది. ఒక్క ఏడాదిలో జట్టు కూర్పు, ఆటగాళ్ల ఆట తీరు మారడం వెనక ధోని తన మార్క్ చూపించాడు. అందుకు ఉదాహారణ వీళ్లే.. కెరీర్ ఇక ముగిసింది అనుకున్న అజింక్యా రహానేకు దన్నుగా నిలిచాడు. యంగ్‌స్టర్ శివం దూబే సిక్సర్ల దూబేగా మారడం వెనక ధోని ఉన్నాడు. జట్టులో సహృదయ వాతావరణం ఉండేలా చూసి, ఆటగాళ్ల శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచిన ధోని సీఎస్కేను ఛాంపియన్‌గా తయారుచేశాడు. ఈ నేపథ్యంలోనే రైనా ధోని ఏదీ ముట్టుకున్నా అది బంగారమైతుందన్నాడు. చదవండి: పాపం చివరకు వికెట్ కీపర్ బకరా అయ్యాడు! ఒక ప్లేఆఫ్.. 84 డాట్ బాల్స్.. 42వేల మొక్కలు -
వారిద్దరూ అద్బుతం.. వన్డే ప్రపంచకప్‌లో ఆడాలి: సురేష్ రైనా
ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, కేకేఆర్ ఫినిషిర్ రింకూ సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్ గార్డన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో యశస్వీ జైశ్వాల్ మరో సారి చెలరేగిపోయాడు. కేవలం కేవలం 13 బంతుల్లోనే జైశ్వాల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న జైశ్వాల్.. ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ ఫీప్టి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 47 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన జైశ్వాల్ 575 పరుగులు సాధించాడు. ఇక రింకూ సింగ్ విషయానికి వస్తే.. లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి కేకేఆర్‌కు అద్భుతమైన విజయాలను అందిస్తున్నాడు. ముఖ్యంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది కేకేఆర్‌కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్.. 353 పరుగులు చేశాడు. జైశ్వాల్, రింకూ ప్రపంచకప్‌లో ఆడాలి ఇక అద్భతమైన ఫామ్‌లో ఉన్న జైశ్వాల్, రింకూ సింగ్ వన్డే ప్రపంచకప్-2023లో ఆడాలని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ డిజిటల్ బ్రాడ్‌కాస్టర్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న రైనా..రాజస్తాన్, కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా ఈ వాఖ్యలు చేశాడు. చదవండి: #Nitish Rana: తొలి ఓవర్లోనే 26 పరుగులు.. అంతమంది ఉన్నా! తప్పు చేశాను! మరేం పర్లేదు.. ఒకవేళ -
ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన రైనా..
-
రిటైర్మెంట్పై తొందరేం లేదు.. ఐపీఎల్-2023 గెలిచి ఇంకో ఏడాది ఆడతా..!
ఐపీఎల్ రిటైర్మెంట్పై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడని సీఎస్కే అభిమానుల 'చిన్న తలా' సురేశ్ రైనా వెల్లడించాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం మేరకు.. ఇటీవలి కాలంలో రైనా.. ధోనిని కలిసినప్పుడు తాను ప్రస్తుతానికి రిటైర్మెంట్ గురించి ఆలోచన చేయట్లేదని తెలిపాడట. రిటైర్మెంట్పై తొందరేం లేదని, ఐపీఎల్-2023 గెలిచి ఇంకో ఏడాది ఆడతానని ధోని రైనాతో చెప్పాడట. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ధోని ఇంకో ఏడాది ఆడతాడని తెలిసి సీఎస్కే అభిమానులు సంబురాల్లో మునిగితేలుతున్నారు. ధోని చెప్పినట్లుగానే చేసి (ఐపీఎల్ 2023 టైటిల్ నెగ్గి), మరో ఏడాది తమతో ఉంటాడని కామెంట్స్ చేస్తూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. ధోని రిటైర్మెంట్పై రైనా చెప్పిన ఈ విషయం ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఈ సీజన్లో కీలక మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నప్పటికీ.. సీఎస్కే అభిమానులు అప్పుడే టైటిల్ గెలిచినట్లు ఫీలవుతున్నారు. ధోనిని దేవుడిలా కొలిచే తమిళ తంబిలు, అతనిపై అంతే నమ్మకం వ్యక్తం చేస్తూ ఈ ఏడాది టైటిల్ తమదేనిని ధీమాగా ఉన్నారు. కాగా, ప్రస్తుత సీజన్లో సీఎస్కే ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ జట్టు తదుపరి ఆడబోయే 3 మ్యాచ్‌ల్లో రెండు గెలిచినా సునాయాసంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ రెండింటిలో ఒక మ్యాచ్ అటుఇటైనా మెరుగైన రన్‌రేట్ (0.409) ఉంది కాబట్టి ప్లే ఆఫ్స్ బెర్తుకు ఢోకా ఉండదు. ఇక్కడ ధోని సేనకు మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఆ జట్టు ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు టేబుల్ లాస్ట్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. మే 10, 20 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మరో మ్యాచ్ కేకేఆర్‌తో మే 16న జరుగనుంది. మరోవైపు సీఎస్కే ప్రస్తుత సీజన్లో మునుపెన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. ఆ జట్టు 4 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైనప్పటికీ.. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ఫైనల్ ఎలెవెన్‌లోని ప్రతి ఆటగాడు తమలోని అత్యుత్తమ ఆటతీరును వెలికితీస్తున్నారు. ధోని సహా కాన్వే, రుతురాజ్, రహానే, శివమ్ దూబే, జడేజా, మొయిన్ అలీ, దీపక్ చాహర్, పతిరణ, తీక్షణ, తుషార్.. ఇలా జట్టులోప్రతి ఒక్కరూ రాణిస్తున్నారు. ఆ జట్టును అంబటి రాయుడు ఫామ్ లేమి ఒక్కటే కలవరపెడుతుంది. కాన్వే (458 పరుగులు), రుతురాజ్ (384) లీగ్ టాప్ స్కోరర్ల జాబితాలో 4, 7 స్థానాల్లో కొనసాగుతుండగా.. బౌలింగ్‌లో తుషార్ (19) లీగ్ టాప్ వికెట్ టేకర్‌గా, 15 వికెట్లు తీసిన జడేజా టాప్ 8 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. సీఎస్కేకు ఇన్ని శుభసూచకాలు కనిపిస్తుండటంతో ఆ జట్టు అభిమానులు సైతం టైటిల్ నెగ్గడంపై ధీమాగా ఉన్నారు. చదవండి: దేశంలో టెస్ట్‌లకు సూటయ్యే ఆటగాడే లేడనా, ఈ ఆణిముత్యాన్ని ఎంపిక చేశారు..! -
26 బంతుల్లో బౌండరీ, 10 సిక్సర్లతో వీరవిహారం
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా పట్నా వారియర్స్‌తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్‌లో చండీఘడ్ ఛాంప్స్ 91 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛాంప్స్.. పునీత్ కుమార్ (26 బంతుల్లో 78 నాటౌట్; ఫోర్, 10 సిక్సర్లు), భాను సేథ్ (21 బంతుల్లో 43; 6 సిక్సర్లు), గౌరవ్ తోమర్ (43 బంతుల్లో 86; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 229 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పట్నా వారియర్స్.. ఛాంప్స్ బౌలర్ల ధాటికి 18.5 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఛాంప్స్ బౌలర్లు పర్వీన్ థాపర్ 3, గౌరవ్ తోమర్, రమన్ దత్తా, తిలకరత్నే దిల్షన్ తలో 2 వికెట్లు, ముకేశ్ సైనీ ఓ వికెట్ పడగొట్టారు. వారియర్స్ ఇన్నింగ్స్ 9వ నంబర్ ఆటగాడు ప్రవీణ్ గుప్తా (21) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే, మొత్తం 6 జట్టు పాల్గొంటున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో చండీఘడ్ ఛాంప్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఛాంప్స్ తర్వాత ఇండోర్ నైట్స్ (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు) రెండులో, వైజాగ్ టైటాన్స్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు), గౌహతి అవెంజర్స్ (3 మ్యాచ్‌ల్లో ఓ విజయంతో 2 పాయింట్లు), పట్నా వారియర్స్ (3 మ్యాచ్‌ల్లో ఓ విజయంతో 2 పాయింట్లు), నాగ్‌పూర్ నింజాస్ (4 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఈ టోర్నీలో దేశీయ ఆటగాళ్లతో పాటు పలువురు దేశ, విదేశీ స్టార్లు కూడా పాల్గొంటున్నారు. రాస్ టేలర్, తిలకరత్నే దిల్షాన్, ఇర్ఫాన్ పఠాన్, మాంటీ పనేసర్, ఉపుల్ తరంగ, సనత్ జయసూర్య, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితర ఇంటర్నేషనల్ స్టార్లు వివిధ టీమ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
రిచర్డ్ లెవి విధ్వంసం వృధా.. ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలకరత్నే దిల్షన్
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్ నింజాస్‌తో నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్‌లో చండీఘడ్ ఛాంప్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నింజాస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. ఛాంప్స్ మరో 9 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నింజాస్ ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి (29 బంతుల్లో 71; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలకరత్నే దిల్షన్ (46 బంతుల్లో 86 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఛాంప్స్ను విజయతీరాలకు చేర్చాడు. దిల్షన్‌కు మరో ఎండ్‌లో గౌరవ్ తోమర్ (50) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీతో సహకరించాడు. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో పాటు బంతిలోనూ (2/40) చెలరేగిన దిల్షన్.. కీలకమైన రిచర్డ్ లెవి, అభిమన్యు వికెట్లు పడగొట్టాడు. నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో గౌహతి అవెంజర్స్- వైజాగ్ టైటాన్స్.. పట్నా వారియర్స్-ఇండోర్ కింగ్స్ తలపడగా అవెంజర్స్, ఇండోర్ నైట్స్ జట్లు విజయం సాధించాయి. అవెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 78 పరుగులకే చాపచుట్టేయగా.. అవెంజర్స్ 7.3 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇండోర్ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేయగా.. ఇండోర్ నైట్స్ మరో ఓవర్ మిగిలుండగానే 8 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. సురేశ్ రైనా సారధ్యం వహిస్తున్న ఇండోర్ నైట్స్ టీమ్‌లో ఏకంగా ముగ్గురు డకౌట్లు కాగా.. దిల్షన్ మునవీర (53), పర్విందర్ సింగ్ (31) పోరాడి గెలిపించారు. -
సురేశ్ రైనా విశ్వరూపం.. 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో..!
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 (LLC Masters) పూర్తయిన వెంటనే మరో లెజెండ్స్ క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. ఘాజియాబాద్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో నిన్న (మార్చి 22) ఇండోర్ నైట్స్, నాగ్‌పూర్ నింజాస్ జట్లు తలపడగా.. ఇండోర్ నైట్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోర్ నైట్స్.. ఫిల్ మస్టర్డ్ (39 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సురేశ్ రైనా (45 బంతుల్లో 90 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. After LLC Masters, Suresh Raina joined the Indore Knights squad to participate in the ongoing Legends Cricket Trophy.#SureshRaina #LLCMasters #LegendsLeagueCricket #CSK https://t.co/olITh4nprx — CricTracker (@Cricketracker) March 23, 2023 నింజాస్ బౌలర్లలో కుల్దీప్ హుడా 4 వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన నింజాస్ను కుల్దీప్ హుడా (42 బంతుల్లో 77; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) గెలిపించేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. బౌలింగ్‌లో చెలరేగిన హుడా బ్యాటింగ్‌లోనూ విజృంభించి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి నింజాస్ 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులకు పరిమితం కావడంతో 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇండోర్ బౌలర్లలో కపిల్ రాణా 3, రాజేశ్ ధాబి 2, జితేందర్ గిరి, సునీల్ చెరో వికెట్ పడగొట్టారు. నింజాస్ ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి (13), వీరేంద్ర సింగ్ (15), అభిమన్యు (13), రితేందర్ సింగ్ సోధి (11) విఫలం కాగా.. సత్నమ్ సింగ్ (32), ప్రిన్స్ పర్వాలేదనిపించాడు. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నేతృత్వంలో బరిలోకి దిగిన నింజాస్‌కు ఈ టోర్నీలో ఇది తొలి ఓటమి. ఈ టోర్నీలో దేశీయ ఆటగాళ్లతో పాటు పలువురు దేశ, విదేశీ స్టార్లు కూడా పాల్గొంటున్నారు. రాస్ టేలర్, తిలకరత్నే దిల్షాన్, ఇర్ఫాన్ పఠాన్, మాంటీ పనేసర్, ఉపుల్ తరంగ, సనత్ జయసూర్య, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితర ఇంటర్నేషనల్ స్టార్లు వివిధ టీమ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
సురేష్ రైనా సూపర్ సిక్సర్.. కొంచెం కూడా జోరు తగ్గలేదు! వీడియో వైరల్
లెజెండ్స్ లీగ్-2023లో భాగంగా బుధవారం వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఇండియా మహారాజాస్ పరాజయం పాలైనప్పటికీ.. ఆ జట్టు బ్యాటర్, టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న రైనా.. 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేశాడు. మహారాజాస్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన పనేసర్ బౌలింగ్‌లో ఐదో బంతికి.. ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి బౌలర్ తలపై నుంచి అద్భుతమైన సిక్స్ రైనా బాదాడు. ఈ సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రైనా తప్పుకున్నప్పటికీ అతడిలో ఏ మాత్రం జోరు తగ్గలేదంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది రైనా ఐపీఎల్లో ఆడాలని కోరుకుంటున్నారు. A classic @ImRaina shot! 🔥@IndMaharajasLLC #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain #IMvsWG pic.twitter.com/FtdhpF5B4U — Legends League Cricket (@llct20) March 15, 2023 -
"నాటు నాటు" స్టెప్పులతో అదరగొట్టిన టీమిండియా క్రికెటర్లు
RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో యావత్ ప్రపంచానికి ఈ పాట ఫోబియా పట్టుకుంది. ఎక్కడ చూసినా జనాల ఈ పాటకు స్టెప్పులేస్తూ దర్శనిమిస్తున్నారు. సోషల్‌మీడియా మాధ్యమాల్లో అయితే ఈ పాటకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ నాటు నాటు పాటకు కాలు కదుపుతున్నారు. తాజాగా ఇద్దరు టీమిండియా మాజీలు కూడా ఈ పాటకు స్టెప్పేసి ఇరగదీశారు. Those are some sweet feet, I tell you what! 😍@IndMaharajasLLC @harbhajan_singh @ImRaina #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain #IMvsWG pic.twitter.com/Kv9y1ss6bs — Legends League Cricket (@llct20) March 15, 2023 లెజెండ్ లీగ్ క్రికెట్-2023లో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో నిన్న (మార్చి 15) జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా నాటు నాటు పాటకు చిందేసి అభిమానులను ఉర్రూతలూగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. సీఎస్కే మాజీ క్రికెటర్లను అభిమానులు రామ్‌చరణ్, తారక్‌లతో పోలుస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఇండియా మహారాజాస్‌తో జరిగిన మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహారాజాస్.. సురేశ్ రైనా (41 బంతుల్లో 49; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), బిస్లా (36), ఇర్ఫాన్ పఠాన్ (25) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. వరల్డ్ జెయింట్స్ బౌలర్లు బ్రెట్ లీ (3-0-18-3), పోఫు (4-0-22-2), టీనో బెస్ట్ (4-0-27-2) చెలరేగారు. అనంతరం బరిలోకి దిగిన వరల్డ్ జెయింట్స్.. క్రిస్ గేల్ (46 బంతుల్లో 57; 9 ఫోర్లు, సిక్స్) వీరవిహారం ధాటికి 18.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గేల్‌కు షేన్ వాట్సన్ (26), సమిత్ పటేల్ (12) సహకరించారు. మహారాజాస్ బౌలర్లలో యుసఫ్ పఠాన్ (4-0-14-2), ప్రవీణ్ తాంబే (4-0-22-1), హర్భజన్ సింగ్ (4-0-29-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టి తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఈ మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ జట్టుకు హర్భజన్ సింగ్ నాయకత్వం వహించాడు. గంభీర గైర్హాజరీలో భజ్జీ ఈ బాధ్యతలు చేపట్టాడు. లీగ్‌లో మహారాజాస్ ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిపోయి ఒక మ్యాచ్‌లో గెలవగా.. వరల్డ్ జెయింట్స్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయం.. ఆసియా లయన్స్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. టోర్నీలో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 16) వరల్డ్ జెయింట్స్, ఆసియా లయన్స్ తలపడనున్నాయి. -
ముందు ధోని, ఆతర్వాతే దేశం.. సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని వైదొలిగిన నిమిషాల వ్యవధిలోనే (30 నిమిషాలు) తాను కూడా రిటైర్మెంట్ ప్రకటన చేయడంపై ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ రైనా ఇలా అన్నాడు. భారత జట్టుకు నేను ధోని కలిసి చాలా మ్యాచ్‌ల్లో ఆడాం. చాలా మ్యాచ్‌ల్లో జట్టును కలిసే గెలిపించాం. ధోని లాంటి గొప్ప మనసున్న వ్యక్తితో కలిసి ఆడటం, అతని సారధ్యంలో జట్టు సభ్యుడిగా కొనసాగడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. నేనేమో ఘజియాబాద్ నుంచి వచ్చాను, ధోని రాంచీ నుంచి వచ్చాడు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన మేము అన్నదమ్ములా కలిసిపోయాం. ముందుగా నేను ధోని కోసమే ఆడాను, ఆ తర్వాతే దేశం కోసం. అది మా ఇద్దరి మధ్య అనుబంధం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సురేశ్ రైనా. ఈ వ్యాఖ్యలు రైనా ఏ ఉద్దేశంతో చేశాడో కానీ, భారత క్రికెట్ అభిమానులు మాత్రం వీటిపై భిన్నంగా స్పందిస్తున్నారు. రైనా దేశాన్ని తక్కువ చేసి, ధోనిని హీరోగా ఊహించుకుంటున్నాడని కొందరంటుంటే.. మరికొందరు రైనా వ్యాఖ్యలను పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. మొత్తానికి రైనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, 2020 ఆగస్ట్ 15న ధోని, రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ధోని సారధ్యంలో టీమిండియా 2011 వన్డే ప్రపంచ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన రైనా.. భారత జట్టు తరఫున 226 వన్డేల్లో 5615 పరుగులు చేశాడు. అలాగే టీ20 ఫార్మాట్లో 1605 పరుగులు చేశాడు. ధోని, రైనా ఇద్దరూ టీమిండియా తరఫున కలిసి ఆడటమే కాకుండా ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున కూడా కలిసి ఆడారు. మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన రైనా సీఎస్కే తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మధ్యలో ఓ సీజన్ (2016-17లో గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా రైనా) మినహాంచి 2021 ఐపీఎల్ వరకు ధోని, రైనాల జర్నీ కలిసే సాగింది. అయితే 2022 సీజన్లో రైనా అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడంతో ధోనిని వదిలి ఐపీఎల్ నుంచి శాశ్వతంగా తప్పుకున్నాడు. -
ఆస్ట్రేలియా ఆ నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది: సురేష్ రైనా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు భారత పర్యటనకు ఆస్ట్రేలియా వచ్చిన సంగతి తెలిసిందే. నాగ్‌పూర్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ జట్టు బెంగళూరులోని సమీపంలోని ఆలూర్ లో నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ యాక్షన్‌ను పోలి ఉన్న బరోడా స్పిన్నర్ మహేష్ పిథియాతో కమ్మిన్స్ సేన ప్రాక్టీస్ చేస్తుంది. అయితే కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్‌లు ఆడకపోవడంపై భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా ఆశ్చర్యం వక్తం చేశాడు. "టెస్టు సిరీస్‌కు ముందు నేను ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడేవాడిని. వార్మాప్ మ్యాచ్‌లు ఆడడం చాలా ముఖ్యం. ఎందుకంటే భారత వంటి ఉపఖండ పిచ్‌లపై ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేస్తేనే.. ఇక్కడి పరిస్థితులను అర్దం చేసుకోగలరు. టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా ఎందుకు వార్మాప్ మ్యాచ్‌లు ఆడలేదో నాకు అర్ధం కావడం లేదు. ఇక మా స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అదే విధంగా రోహిత్, కోహ్లి కూడా అదరగొడుతున్నారు. కాబట్టి ఆస్ట్రేలియా- భారత్ సిరీస్ అభిమానులకు మంచి మజా ఇవ్వడం" ఖాయం అని అని మిషన్ ఒలింపిక్స్ వార్షిక దినోత్సవంలో పాల్గొన్న రైనా ఈ వాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా భారత పర్యటన షెడ్యూల్: ఫిబ్రవరి 09- మార్చి 22.. టెస్టు సిరీస్‌తో ప్రారంభం- వన్డే సిరీస్‌తో ముగింపు నాలుగు టెస్టుల సిరీస్ ► ఫిబ్రవరి 9- 13: నాగ్‌పూర్ ► ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ ► మార్చి 1-5: ధర్మశాల ► మార్చి 9- 13: అహ్మదాబాద్ మూడు వన్డేల సిరీస్ ► మార్చి 17- ముంబై ► మార్చి 19- వైజాగ్ ► మార్చి 22- చెన్నై ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ చదవండి: Ind Vs Aus: అప్పుడు కోహ్లి లేడు! ఇప్పుడలా కాదు.. టీమిండియాను చూసి ఆసీస్ వణికిపోతోంది! నిదర్శనమిదే.. -
IPL: ఆల్‌టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్! అతడికి బదులు..
Former Players All Time IPL XI: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా భారత్‌లో ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఇండియన్ ఫ్యాన్స్‌కు మరింత చేరువయ్యాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన ఆటతో క్రికెట్ ప్రేమికులను అలరించాడు. ఇక క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న ఏబీ డివిలియర్స్.. 170 ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తంగా 5162 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ అత్యధిక స్కోరు 133. ఇలా అద్భుత ప్రదర్శనతో తను ప్రాతినిథ్యం వహించిన జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ఐపీఎల్లో తనదైన ముద్ర వేసిన ఏబీడీకి టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన ఆల్‌టైం జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం. ఐపీఎల్-2023 నేపథ్యంలో జియోసినిమా షో లెజెండ్స్ లాంజ్‌లో క్రిస్ గేల్, సురేశ్ రైనా, పార్థివ్ పటేల్, రాబిన్ ఊతప్ప, స్కాట్ స్టైరిస్ వంటి మాజీ క్రికెటర్లతో కలిపి పాల్గొన్నాడు అనిల్ కుంబ్లే. డివిలియర్స్ కోసం తనను పక్కనపెట్టలేను ఈ సందర్భంగా... చర్చలో భాగంగా తమ ఆల్‌టైం ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌ను చెప్పాలని కోరగా.. కుంబ్లే.. డివిలియర్స్‌కు తన జట్టులో చోటు కష్టమని పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘నా జట్టుకు ఎంఎస్ ధోని కెప్టెన్. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. డివిలియర్స్ కోసం తనను పక్కనపెట్టలేను. ఇక ఆరోస్థానంలో పొలార్డ్‌ను ఆడిస్తా’’ అని కుంబ్లే చెప్పుకొచ్చాడు. నాలుగుసార్లు టైటిల్ గెలిచిన చెన్నై సారథి ధోనికే తన ఓటు అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇతరుల్లో గేల్ ఓపెనర్‌గా తన పేరును తాను సూచించగా.. పార్థివ్ పటేల్ అతడికి జోడీగా విరాట్ కోహ్లిని ఎంపిక చేశాడు. ఈ చర్చలో భాగంగా ఆఖర్లో పొలార్డ్‌ను కాదని డివిలియర్స్‌కే చోటిచ్చారు మిగతా మాజీలు. లెజెండ్స్ ఎంపిక చేసిన ఆల్‌టైం ఐపీఎల్ జట్టు క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సునిల్ నరైన్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ. చదవండి: Kieron Pollard: విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి! ICC ODI Rankings: నంబర్ వన్ బౌలర్‌గా సిరాజ్ -
'సూర్య లేకుంటే మూడు ఫార్మాట్లు లేనట్లే'
గతేడాది టి20ల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గానూ టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ మెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. టి20ల్లో ఇప్పటికే సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ వన్డేల్లోనూ నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌కు కూడా సూర్య ఎంపికయ్యాడు. ఒకవేళ తుదిజట్టులోకి ఎంపికైతే మాత్రం మూడు ఫార్మాట్లు ఆడిన క్రికెటర్‌గా సూర్యకుమార్ నిలవనున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో పేరు తెచ్చుకున్న సూర్య టెస్టుల్లో ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సూర్యకుమార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు." కచ్చితంగా సూర్యకుమార్ ఆడుతున్న తీరు చూస్తుంటే.. అతడు మూడు ఫార్మాట్లలోనూ ఉండాల్సిందేనని భావిస్తున్నా. అతడు లేకపోతే మూడు ఫార్మాట్లూ ఉండవు. అతని ఆటతీరు, సంకల్పం, షాట్లు ఆడే తీరు నాకు చాలా ఇష్టం. పైగా ఎలాంటి భయం లేకుండా ఆడడం అతని నైజం. గ్రౌండ్ కొలతలను తనకు తగినట్లుగా మార్చుకోగలడు. అతడు ముంబై ప్లేయర్. రెడ్ బాల్ క్రికెట్ ఎలా ఆడాలో అతనికి తెలుసు. అతనికిది గొప్ప అవకాశం. టెస్టు క్రికెట్ ఆడటం వల్ల వన్డే టీమ్ లోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడు. తర్వాత ఎన్నో సెంచరీలు, డబుల్ సెంచరీలు చేయగలడు" అని రైనా అన్నాడు. ఇక ఇదే చర్చలో పాల్గొన్న మరో మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా రైనా వ్యాఖ్యలతో ఏకీభవించాడు. "కచ్చితంగా అతడు టెస్టు టీమ్ లో ఉండాలి. సూర్య ఆడిన తీరు చూస్తే అతడు మూడు ఫార్మాట్లలోనూ ఉండాలి. ఈ ప్రశ్న ఎందుకు వస్తుందో నాకు తెలుసు. సర్ఫరాజ్ ఖాన్ ఆడుతున్న తీరు చూస్తే అదే అనిపిస్తుంది. కానీ అతనికి కూడా టైమ్ వస్తుంది. కానీ సూర్య టెస్టు టీమ్ లో ఉండటానికి 100 శాతం అర్హుడు" అని ఓజా స్పష్టం చేశాడు. ఇక ఏడాది కాలంగా ఇండియన్ క్రికెట్ లో మార్మోగుతున్న పేరు సూర్యకుమార్ యాదవ్. వేగానికి మారుపేరైన సూర్యను టెస్టులకు ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. టాప్ ఫామ్ లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ బదులు సూర్యకు చోటివ్వడమేంటని మాజీ క్రికెటర్లు సహా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: అభిమానులనుద్దేశించి సూర్యకుమార్ ఎమోషనల్ పోస్టు -
IPL 2023: మిస్టర్ ఐపీఎల్ ‘సూపర్‌స్టార్’ లెక్క తప్పింది! వాళ్లను పట్టించుకోనేలేదు!
IPL 2023 Mini Auction- Suresh Raina: ఐపీఎల్ మినీ వేలం-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అంచనా తలకిందులైంది. ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడతాయంటూ మిస్టర్ ఐపీఎల్ చెప్పిన జోస్యం తప్పింది. రైనా అంచనా వేసిన యువ ఆటగాళ్లలో సౌరాష్ట్ర క్రికెటర్ సమర్థ్ వ్యాస్ తప్ప మిగతా ఇద్దరూ వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. కాగా ఐపీఎల్ మినీ వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన జియో సినిమా షోలో.. ఆక్షన్ ఆరంభానికి ముందు రైనా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన జయదేవ్ ఉనాద్కట్, నారాయణ్ జగదీశన్‌పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతాయని అతడు పేర్కొన్నాడు. వీళ్ల విషయంలో నిజమైంది అందుకు తగ్గట్లుగానే లక్నో సూపర్ జెయింట్స్ ఉనాద్కట్‌ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేయగా.. నారాయణ్ జగదీశన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ 90 లక్షలు ఖర్చు చేసింది. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్ బౌలర్ జాషువా లిటిస్ కోసం పోటీ నెలకొంటుందని రైనా అంచనా వేయగా.. గుజరాత్ టైటాన్స్ 4.4 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. లెక్క తప్పాడు! వీరితో పాటు.. బెన్ స్టోక్స్, సామ్ కరన్ విషయంలో అందరిలానే రైనా అంచనాలూ నిజమయ్యాయి. కానీ అన్క్యాప్డ్ ఆటగాళ్ల విషయంలో మాత్రం మిస్టర్ ఐపీఎల్ లెక్క తప్పింది. జమ్మూ కశ్మీర్ ఆల్‌రౌండర్ ముజ్తాబా యూసఫ్ అమ్ముడుపోకుండా మిగిలి పోయాడు. అంతేగాక ఈ వేలంలో సూపర్‌స్టార్‌గా నిలవగల సత్తా ఉందని రైనా అంచనా వేసిన అల్లా అహ్మద్‌ను ఎవరూ పట్టించుకోలేదు. మిస్టర్ ఐపీఎల్ జోస్యంపై కామెంట్లు వేలంలో పేరు నమోదు చేసుకున్న అత్యంత పిన్న వయస్కుడైన 15 ఏళ్ల ఈ అఫ్గనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇక సమర్థ్ వ్యాస్‌ను 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు రైనా జోస్యంపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘వాళ్ల విషయంలో మిస్టర్ ఐపీఎల్ అంచనాలు నిజమయ్యాయి. కానీ సూపర్‌స్టార్ అన్న విషయంలో మాత్రం లెక్క తప్పాడు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: IPL Mini Auction: ఐపీఎల్ 2023 మినీ వేలం.. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా IPL: వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్లు, పదింటిలో ఏ జట్టులో ఎవరు? ఇతర వివరాలు.. అన్నీ ఒకేచోట Ind Vs Ban: అయ్యో పంత్.. సెంచరీ మిస్! అయితేనేం ధోని 15 ఏళ్ల రికార్డు బద్దలు! సాహా తర్వాత.. -
‘15 ఏళ్ల ఆ అఫ్గన్ బౌలర్ సూపర్‌స్టార్! ఉనాద్కట్‌కు భారీ ధర! ఇంకా..’
IPL 2023 Mini Auction- Watch Out: ఐపీఎల్- 2023 మినీ వేలం నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆక్షన్‌లో సత్తా చాటగల అన్క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లేనంటూ ముగ్గురు యువ క్రికెటర్ల పేర్లు ప్రస్తావించాడు. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటుతున్న ముజ్తాబా యూసఫ్, సమర్థ్ వ్యాస్ సహా అఫ్గన్ యువ కెరటం అల్లా మహ్మద్లపై ప్రశంసలు కురిపించాడు. ఈ ముగ్గురు తమ తమ జట్ల తరఫున అద్భుత ప్రదర్శన చేశారని, వేలంలో వీరు మంచి ధర పలకడం ఖాయమని మిస్టర్ ఐపీఎల్ అభిప్రాయపడ్డాడు. కొచ్చి వేదికగా శుక్రవారం మధ్యాహ్నం మినీ వేలం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మొత్తంగా 87 బెర్త్‌ల కోసం బరిలో 405 మంది క్రికెటర్లు పోటీపడనున్నారు. స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో జియో సినిమా షోలో రైనా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఉనాద్కట్ ఇంకా.. ఈ మేరకు.. ‘‘భారత క్రికెటర్లలో.. విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్రను విజేతగా నిలిపిన కెప్టెన్, లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్, తమిళనాడు ప్లేయర్ జగదీశన్‌పై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తాయి. ఆ ఐరిష్ బౌలర్ విదేశీ ఆటగాళ్లలో ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్ కరన్, బెన్ స్టోక్స్ సహా టీ20 ప్రపంచకప్-2022లో సత్తా చాటిన ఐర్లాండ్ బౌలర్ జాషువా లిటిల్ కోసం పోటీ నెలకొంటుంది. సూపర్‌స్టార్ కాగలడు! అన్క్యాప్డ్ ప్లేయర్లలో ముజ్తాబా యూసఫ్, సమర్థ్ వ్యాస్, అల్లా మహ్మద్ సత్తా చాటగలరు. నేను ముజ్తాబాతో కలిసి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడాను. తను అద్భుతమైన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్. ఇక సౌరాష్ట్ర తరఫున సమర్థ్ వ్యాస్ 150 స్ట్రైక్‌రేటుతో మెరిశాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టాప్-5 బ్యాటర్లలో ఒకడు. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ గెలిచిన జట్టులోనూ సభ్యుడు. ఇక అల్లా మహ్మద్.. ఆరడుగుల మీద రెండు అంగుళాల ఎత్తు ఉండే ఈ 15 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్.. సూపర్‌స్టార్ కాగలడు’’ అని రైనా పేర్కొన్నాడు. కాగా దేశవాళీ క్రికెట్లో జమ్మూ కశ్మీర్ జట్టు తరఫున ఆడుతున్న ముజ్తాబా యూసఫ్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఇక సమర్థ్ వ్యాస్.. సౌరాష్ట్ర తరఫున గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అఫ్గనిస్తాన్ యువ సంచలనం 15 ఏళ్ల అల్లా మహ్మద్ అండర్-19 టోర్నీలో(బెస్ట్ 4/15) రాణిస్తున్నాడు. మిస్టర్ ఐపీఎల్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సురేశ్ రైనా.. ఐపీఎల్లో 5528 పరుగులు సాధించాడు. 205 మ్యాచ్‌లలో 136.76 స్ట్రైక్‌రేటుతో ఈ మేరకు రన్స్ చేసి మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందాడు. రైనా ఐపీఎల్ ఖాతాలో ఓ సెంచరీ, 39 అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: Ind Vs Ban: టీమిండియా దిగ్గజం ఘాటు వ్యాఖ్యలు! అప్పుడు తెలుస్తుంది మీకు.. IPL 2023 Auction: గ్రీన్‌కు 20, కర్రన్‌కు 19.5, స్టోక్స్‌కు 19 కోట్లు..! -
Ind Vs Ban: రోహిత్ చెత్త రికార్డు! రైనాకు సాధ్యమైంది.. కానీ హిట్‌మ్యాన్ మాత్రం..
India tour of Bangladesh, 2022- ODI Series- 2nd ODI: ఏడేళ్ల క్రితం.. మళ్లీ ఇప్పుడు బంగ్లాదేశ్ గడ్డపై టీమిండియా చేష్టలుడిగింది. ఈసారి మాత్రంపూర్తిగా బంగ్లాదేశ్ జట్టు చేతిలో కాకుండా ఆ జట్టులోని ఒక్క ప్లేయర్ మెహదీ హసన్ మిరాజ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు టీమిండియా ఓడిందని చెప్పొచ్చు. ఈ ఆల్‌రౌండర్ వీరోచిత శతకంతో ఒకదశలో 69/6 స్కోరుతో ఉన్న బంగ్లాదేశ్ చివరకు 271/7 చేస్తే... ఛేజింగ్‌లో 172/4 స్కోరుతో ఉన్న భారత్ ఆఖరికి 266/9 స్కోరు చేసి ఓడింది. మిర్పూర్: మరోసారి బంగ్లాదేశ్ పర్యటనలో భారత్‌కు చేదు ఫలితమే ఎదురైంది. ఇంకో వన్డే మిగిలుండగానే టీమిండియా 0–2తో సిరీస్‌ను కోల్పోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మెహదీ హసన్ మిరాజ్ (83 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు; 2/46) ఆల్‌రౌండ్ ప్రదర్శన ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ (28 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్) ఆశలు రేపిన మెరుపులు చిన్నబోయాయి. దీంతో భారత్ 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓడింది. మొదట బంగ్లా 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులు చేసింది. మహ్ముదుల్లా (96 బంతు ల్లో 77; 7 ఫోర్లు) రాణించాడు. అనంతరం టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులే చేసి ఓడింది. శ్రేయస్ అయ్యర్ (82; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (56; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే శనివారం జరుగుతుంది. రోహిత్ చెత్త రికార్డు ఈ పరాజయం నేపథ్యంలో రోహిత్ ఇన్నింగ్స్ వృథాగా పోవడమే గాకుండా... కెప్టెన్‌గా ఓ చెత్త రికార్డును కూడా అతడు మూటగట్టుకున్నాడు. బంగ్లా గడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి వన్డే సిరీస్‌ను సమర్పించుకున్న రెండో భారత సారథిగా నిలిచాడు. గతంలో ధోని కెప్టెన్సీలో బంగ్లాలో భారత్ సిరీస్ ఓడిపోయింది. రైనాకు సాధ్యమైంది.. కానీ రోహిత్‌కు మాత్రం కాగా ఇప్పటి వరకు బంగ్లా పర్యటనలో సౌరవ్ గంగూలీ(2004), రాహుల్ ద్రవిడ్(2007), సురేశ్ రైనా(2014) సారథ్యంలో టీమిండియా వన్డే సిరీస్‌లు గెలిచింది. ఇక ధోని కెప్టెన్సీలో 2015లో మొదటి రెండు మ్యాచ్‌లు ఓడినా ఆఖరి వన్డేలో గెలిచి పరువు దక్కించుకుంది. అయితే, ఈసారి రోహిత్ శర్మ, దీపక్ చహర్, కుల్దీప్ సేన్ ఆఖరి వన్డేకు అందుబాటులో ఉండటం లేదు. రోహిత్, చహర్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బే. మరి శనివారం నాటి చివరి వన్డే ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి! చదవండి: Ind VS BAN: వారెవ్వా! రోహిత్ అరుదైన రికార్డ్.. ప్రపంచ క్రికెట్లో రెండో ఆటగాడిగా.. IND vs BAN: రోహిత్ భయ్యా నీ ఇన్నింగ్స్‌కు హ్యాట్సప్.. ఓడిపోయినా పర్వాలేదు -
వాషింగ్టన్ సుందర్ సరికొత్త చరిత్ర.. 12 ఏళ్ల రికార్డు బద్దలు
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం మరోసారి పూర్తిగా తేలిపోయారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఇన్నింగ్స్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్ కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు సాధించాడు. తద్వారా సుందర్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై అత్యంత వేగంగా 30కు పైగా పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా సుందర్ నిలిచాడు అంతకుముందు ఈ రికార్డు టీమిండియా మూజీ ఆటగాడు సురేష్ రైనా పేరిట ఉండేది. 2009లో బ్లాక్ క్యాప్స్‌పై 18 బంతుల్లో 38 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో సుందర్ రైనా రికార్డును బ్రేక్ చేశాడు. ఇక న్యూజిలాండ్, భారత్ మధ్య రెండో వన్డే హామిల్టన్ వేదికగా నవంబర్ 27న జరగనుంది. చదవండి: SL vs AFG: శ్రీలంకను చిత్తు చేసిన ఆఫ్గాన్.. 60 పరుగుల తేడాతో ఘన విజయం -
బీసీసీఐతో తెగదెంపులు చేసుకున్న రైనా.. ఫారిన్ లీగ్‌లో అరంగేట్రం
టీమిండియా మాజీ మిడిలార్డర్ బ్యాటర్ సురేశ్ రైనా భారత క్రికెట్‌తో బంధాన్ని తెంచుకున్నాడు. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు సైతం ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన చిన్న తలా.. బీసీసీఐ, తదితర అనుబంధ క్రికెట్ బోర్డులతో తెగదెంపులు చేసుకున్నాడు. గతేడాది ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోవడంతో నిరాశచెందిన రైనా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడని అతని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. బీసీసీఐతో బంధం తెగిపోవడంతో రైనా చూపు ఇప్పుడు విదేశీ లీగ్‌లపై పడింది. దుబాయ్ వేదికగా జరుగనున్న అబుదాబి టీ10 లీగ్‌లో ఆడేందుకు రైనా సర్వం సిద్ధం చేసుకున్నాడు. ఈ లీగ్‌లో రైనా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ డెక్కన్ గ్లాడియేటర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. టీ20 క్రికెట్‌కు భారత్ అందించిన అతి గొప్ప క్రికెటర్ సేవల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అంటూ ట్వీట్ కూడా చేసింది. కాగా, రైనా ప్రాతినిధ్యం వహించబోయే డెక్కన్ గ్లాడియేటర్స్ తరఫున విండీస్ స్టార్ ఆటగాళ్లు ఆండ్రీ రసెల్, నికోలస్ పూరన్‌లు ఆడుతున్నారు. ఈ లీగ్ ఈ ఏడాది నవంబర్ 23 నుంచి డిసెంబర్ 4 వరకు జరుగనుంది. -
టీ20 వరల్డ్‌కప్‌ల్లో సెంచరీ హీరోలు వీరే.. భారత్ నుంచి ఒకే ఒక్కడు
దేశవాళీ, ఐపీఎల్ తరహా లీగ్‌ల్లో మూడంకెల స్కోర్‌ను చేరుకోవడం సర్వసాధారణమైపోయినప్పటికీ.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం ఈ మార్కును చేరుకోవడం చాలా అరుదుగా చూశాం. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో అయితే సెంచరీ సాధించిన ఆటగాళ్ల సంఖ్యను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. పొట్టి ఫార్మాట్లో ప్రపంచకప్ మొదలైన నాటి నుంచి ఇవాల్టి (అక్టోబర్ 27) దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మ్యాచ్ వరకు కేవలం 10 శతకాలు మాత్రమే నమోదయ్యాయంటే నమ్మి తీరాల్సిందే. టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రొస్సో సాధించిన సుడిగాలి శతకం (56 బంతుల్లో 109; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో పదవ శతకంగా రికార్డయ్యింది. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (117) తొలి శతకాన్ని నమోదు చేశాడు. 2007 ఇనాగురల్ టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాపై గేల్ శతకం బాదాడు. గేల్ తర్వాత పొట్టి ప్రపంచకప్‌లో రెండో శతకాన్ని టీమిండియా ఆటగాడు సురేశ్ రైనా బాదాడు. రైనా 2010 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై 101 పరుగులు సాధించాడు. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా తరఫున ఇప్పటివరకు మూడంకెల స్కోర్ సాధించిన ఆటగాడు రైనా ఒక్కడే కావడం విశేషం. వీరి తర్వాత మహేళ జయవర్ధనే (2010లో జింబాబ్వేపై 100), బ్రెండన్ మెక్కల్లమ్ (2012లో బంగ్లాదేశ్‌పై 123), అలెక్స్ హేల్స్ (2014లో శ్రీలంకపై 116 నాటౌట్), అహ్మద్ షెహజాద్ (2014లో బంగ్లాదేశ్‌పై 111 నాటౌట్), తమీమ్ ఇక్బాల్ (2016లో ఓమన్‌పై 103 నాటౌట్), క్రిస్ గేల్ (2016లో ఇంగ్లండ్‌పై 100 నాటౌట్), జోస్ బట్లర్ (2021లో శ్రీలంకపై 101 నాటౌట్), తాజాగా రిలి రొస్సో టీ20 ప్రపంచకప్‌ల్లో శతకాలు సాధించారు. -
'పాక్‌తో గెలిస్తే చాలు ప్రపంచకప్ మనదే'
టి20 ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ ఆదివారం జరగనున్న మ్యాచ్‌కు ప్రేక్షకులు పోటెత్తనున్నారు. లైవ్‌లో చూడలేని వాళ్లు టీవీలో వీక్షించనున్నారు. మొత్తానికి ఆరోజు టీఆర్పీ రేటింగ్‌లు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా టీమిండియా,పాకిస్తాన్ మ్యాచ్‌పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''పాకిస్తాన్‌తో జరిగే ఓపెనింగ్ మ్యాచ్‌లో గెలిస్తే చాలు ఆ విజయోత్సాహంతో టీమిండియా వరల్డ్ కప్ గెలిచేస్తుంది. ఇప్పుడు టీమిండియా బాగానే ఆడుతోంది. బుమ్రా లేకపోయినా షమీ అతని ప్లేస్‌ని రిప్లేస్ చేశాడు.ఈ సిరీస్‌లో మహ్మద్ షమీ, టీమిండియాకి ఎక్స్-ఫ్యాక్టర్ అవుతాడని అనిపిస్తోంది. అంతేకాకుండా అర్ష్‌దీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. విరాట్ కోహ్లీ కూడా మంచి టచ్‌లో కనబడుతున్నాడు. ఏ టోర్నీ అయినా మొదటి మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. తొలి మ్యాచ్ ప్రభావం తర్వాతి మ్యాచ్‌ల్లో కచ్చితంగా ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేశాను. పాక్‌పై విజయం సాధిస్తే టీమ్‌లో ఎనలేని ఉత్సాహం వస్తుంది. మిగిలిన జట్లను మట్టి కరిపించి టైటిల్ గెలవాడినిక ఇదొక్కటి చాలు. ఈసారి టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటున్నా. బుమ్రా, రవీంద్ర జడేజా స్థానాలను భర్తీ చేయడం కష్టం. ఈసారి మహ్మద్ షమీ కీలకం కానున్నాడు. అతని అనుభవం టీమిండియాకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న వారిలో అతనే బెస్ట్ ఆప్షన్. 2007 టీ20 వరల్డ్ కప్‌లో గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ ఎలా ఆడారో అందరికీ తెలుసు. 2011 వన్డే వరల్డ్ కప్‌లోనూ వీళ్లే కీలకంగా మారారు. అలా చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రిషబ్ పంత్ టీమిండియాకి కీలక ఆటగాడయ్యే అవకాశం ఉంది'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆ రెండు జట్ల మధ్యే : సునీల్ గవాస్కర్ -
Abu Dhabi T10 League: టీ10 లీగ్‌లో ఆడనున్న హర్భజన్, రైనా
అబుదాబి టీ10 లీగ్-2022లో టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనా భాగం కానున్నారు. ఈ లీగ్‌లో ఢిల్లీ బుల్స్‌తో హర్భజన్ సింగ్ ఒప్పందం కుదుర్చుకోగా.. డిఫెండింగ్ ఛాంపియన్ డెక్కన్ గ్లాడియేటర్స్‌కు రైనా ప్రాతినిధ్యం వహించనున్నాడు. డక్కన్ గ్లాడియేటర్స్ జట్టుకు వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా గ్లాడియేటర్స్ జట్టులో టిమ్ డేవిడ్, రహ్మానుల్లా గుర్బాజ్, విల్ జాక్స్, డొమినిక్ డ్రేక్స్, ఫజల్హాక్ ఫరూకీ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జట్టుకు జింబాబ్వే మాజీ ఆటగాడు అండీ ఫ్లవర్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అబుదాబి టీ10 లీగ్ నవంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. Indian legend Harbhajan Singh has signed for @DelhiBullsT10 and will be joining us in #Season6 of the #AbuDhabiT10 🔒#InAbuDhabi #CricketsFastestFormat pic.twitter.com/d4A8N7DJr2 — T10 League (@T10League) September 29, 2022 ఇక సురేష్ రైనా ప్రస్తుతం రోడ్ సెప్టీ లీగ్‌లో ఇండియా లెజెండ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. అదే విధంగా హర్భజన్ సింగ్ లెజెండ్స్ లీగ్ క్రికెట్లో మణిపాల్ టైగర్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. హార్భజన్ సింగ్ 2021లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోగా.. రైనా ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: T20 WC 2022: 'బుమ్రా స్థానంలో అతడికి అవకాశమివ్వండి' -
బ్యాట్ పట్టి రీ ఎంట్రీ ఇస్తున్న మిస్టర్ IPL సురేష్ రైనా
-
సురేష్ రైనా స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే!
టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ప్రపంచ ఉత్తమ ఫీల్డర్లలో ఒకడు. అతడు క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ.. తన ఫీల్డింగ్‌లో ఏ మాత్రం జోరు తగ్గలేదు. తాజాగా సంచలన క్యాచ్‌తో రైనా మరోసారి మెరిశాడు. రైనా ప్రస్తుతం రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్ తరపున ఆడుతున్నాడు. ఈ లీగ్ సెమీఫైనల్-1లో భాగంగా ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో మ్యాచ్‌లో రైనా ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన అభిమాన్యు మిథున్ బౌలింగ్‌లో.. బెన్ డంక్ పాయింట్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న రైనా.. డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. రైనా స్టన్నింగ్ క్యాచ్‌తో బ్యాటర్‌తో పాటు భారత ఫీల్డర్లందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సురేష్ రైనా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అదే విధంగా ఇటీవల అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రైనా వీడ్కోలు పలికాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన కెప్టెన్ సచిన్.. ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వనించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17 ఓవర్ల వద్ద మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. అయితే వర్షం ఎప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను గురువారానికి వాయిదా వేశారు. 17 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. What a dive. What a catch 😱✨@ImRaina you beauty ♥️ Dekhte rahiye @India__Legends vs @aussie_legends in the #RoadSafetyWorldSeries now, only on @Colors_Cineplex, @justvoot, Colors Cineplex Superhits and @Sports18. pic.twitter.com/gXMHxd1KTy — Colors Cineplex (@Colors_Cineplex) September 28, 2022 చదవండి: Abu Dhabi T10 League: రైనా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీ10 లీగ్‌లో ఆడనున్న మిస్టర్ ఐపీఎల్! -
రైనా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీ10 లీగ్‌లో ఆడనున్న మిస్టర్ ఐపీఎల్!
టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ఇటీవలే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే రైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటిలో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అబుదాబి టీ10లీగ్‌లో రైనా పాల్గొనున్నాడన్నది ఆ వార్త సారంశం. అంతేకాకుండా ఈ టోర్నీలో దక్కన్ గ్లాడియేటర్స్ తరపున ఆడనున్నుట్లు అతడి అభిమానులు ట్విటర్ వేదికగా హల్చల్ చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని దైనిక్ జాగరణ్ కూడా తమ నివేదికలో పేర్కొంది. Suresh Raina will play the Abu Dhabi T10 league!❣️🔥@ImRaina #SureshRaina pic.twitter.com/DOukgFOD8Q — That's Raina For You (@Thatsrainaforu) September 28, 2022 " నేను ఇంకా రెండు, మూడు ఏళ్లు ఆడాలనుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్‌లో దేశీయ జట్టులో ప్రస్తుతం చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. నేను ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్ అసోషియషన్ నుంచి అనుమతి దృవీకరణ పత్రం కూడా పొందాను. విదేశీ లీగ్‌లలో ఆడేందకు సముఖత చూపిస్తున్నాను" అని రైనా పేర్కొన్నట్లు దైనిక్ జాగరణ్ వెల్లడించింది. కాగా రైనా ప్రస్తుతం రోడ్‌సెప్టీ లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ ఈవెంట్లో మాస్టర్ బ్లస్టర్ సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. ఇక ఇంతకుముందు అబుదాబి టీ10 లీగ్‌లోఅబుదాబి వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, ఎస్ బద్రీనాథ్, రీతీందర్ సింగ్ సోధి, మునాఫ్ పటేల్, యూసుఫ్ పఠాన్, ప్రవీణ్ కుమార్ వంటి భారత మాజీ ఆటగాళ్లు భాగమయ్యారు. చదవండి: Ind Vs SA: అతడు అద్భుతమైన ఆటగాడు.. కానీ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు.. అయినా: గంగూలీ -
స్టువర్ట్ బిన్నీ విధ్వంసం.. ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు చేసింది. ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ (42 బంతుల్లో 82 పరుగులు నాటౌట్, 5 ఫోర్లు, ఆరు సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. బిన్నీ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడూ సురేశ్ రైనా(33 పరుగులు), ఆఖర్లో యూసఫ్ పఠాన్(15 బంతుల్లో 35 నాటౌట్, ఒక ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. రైనాతో కలిసి మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించిన బిన్నీ.. ఆఖర్లో యూసఫ్ పఠాన్‌తో కలిసి 88 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. దీంతో ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అంతకముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 16 పరుగులు.. నమన్ ఓజా 21 పరుగులు చేసి ఔటయ్యారు. డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మాత్రం ఆరు పరుగులకే వెనుదిరిగి నిరాశపరిచాడు. సౌతాఫ్రికా లెజెండ్స్ బౌలర్లలో వాండర్వాత్ 2, ఎడ్డీ లీ, ఎన్తిని చెరొక వికెట్ తీశారు. చదవండి: Suresh Raina: సురేశ్ రైనా తిరిగి వస్తున్నాడు.. Sourav Ganguly: విరాట్ కోహ్లి నన్ను మించిన తోపు..! -
సురేశ్ రైనా తిరిగి వస్తున్నాడు..
మాజీ క్రికెటర్ సురేశ్ రైనా.. పరిచయం అక్కర్లేని పేరు. ధోని హయాంలో టీమిండియాలో రైనా ఒక వెలుగు వెలిగాడు. కొన్నాళ్ల పాటు తనదైన ఆటతో ప్రత్యేక ముద్ర వేసిన రైనా.. ధోని రిటైర్మెంట్ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోజునే(ఆగస్టు 15, 2020).. రైనా కూడా వీడ్కోలు పలకడం విశేషం. ధోనితో ప్రత్యేక అనుబంధం ఉన్న రైనా ఇటీవలే(సెప్టెంబర్ 6న) అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. అయితే రైనా మళ్లీ తిరిగి వస్తున్నాడు. రోడ్ సేఫ్టీ లీగ్ వరల్డ్ సిరీస్‌లో ఆడేందుకు రైనా సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా లెజెండ్స్ జట్టుతో జాయిన్ అయ్యాడు. శనివారం(సెప్టెంబర్ 10న) కాన్పూర్ వేదికగా ఇండియా లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు రైనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోనూ షేర్ చేశాడు. ఆ వీడియోలో రైనా తన జెర్సీ నెంబర్ అయిన '48' ధరించి నడుచుకుంటూ వెళ్తుంటాడు. ''రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌కు అంతా సిద్ధం.. టీమిండియా లెజెండ్స్ తరపున ఆడేందుకు తిరిగి వస్తున్నా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. రైనా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగానే.. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఫన్నీగా స్పందించాడు. ''వస్తే వస్తున్నావు కానీ మమ్మల్ని మాత్రం ఈజీగా తీసుకో ప్లీజ్'' అంటూ లాఫింగ్ ఎమోజీతో క్యాప్షన్ జత చేశాడు. View this post on Instagram A post shared by Suresh Raina (@sureshraina3) చదవండి: Road Safety World Series 2022: ఇండియా లెజెండ్స్‌తో సౌతాఫ్రికా దిగ్గజాల 'ఢీ' -
రైనా రిటైర్మెంట్పై స్పందించిన చెన్నై యాజమాన్యం
Suresh Raina Retirement: మిస్టర్ ఐపీఎల్, చిన్న తలా సురేశ్ రైనా రిటైర్మెంట్ ప్రకటనపై అతని తాజా మాజీ ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) స్పందించింది. చరిత్ర మరువని విజయాలు సాధించినప్పుడు తమతో ఉన్నవాడు, ఆ విజయాలు సాధించేందుకు తోడ్పడిన వాడు చిన్న తలా..! థ్యాంక్యూ మిస్టర్ ఐపీఎల్ అంటూ రైనా ఫోటోను పోస్ట్ చేసి ట్విటర్లో భావోద్వేగ సందేశం పంపింది. సీఎస్కే సందేశంలో రైనాపై వారికున్న ఆప్యాయత స్పష్టంగా కనబడింది. ఆఖరి సీజన్లో వారు రైనాను కాదనుకున్నప్పటికీ అతనిపై ఇంత గౌరవం ఉండటాన్ని రైనా అభిమానులు మెచ్చుకుంటున్నారు. తమ అభిమాన క్రికెటర్ ఎల్లో ఆర్మీతో, ఐపీఎల్‌తో బంధాన్ని తెంచుకోవడాన్ని చిన్న తలా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. The one who was there when glory was etched in history! The one who made it happen! Thank You for everything, Chinna Thala! 💛#Yellove #WhistlePodu 🦁 pic.twitter.com/9Olro0z0Bn — Chennai Super Kings (@ChennaiIPL) September 6, 2022 కాగా, రైనాకు అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవమున్నా, ఐపీఎల్‌తోనే గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. రైనాకు చెన్నై జట్టుతో ఏర్పడిన విడదీయలేని బంధం అతన్ని మిస్టర్ ఐపీఎల్‌గా నిలబెట్టింది. 2020, 2022 సీజన్లు మినహాయించి రైనా ప్రతి ఐపీఎల్లో ఆడాడు. 2016, 17 సీజన్లలో సీఎస్కేపై నిషేధం ఉండటంతో గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను.. 11 సీజన్ల పాటు ఎల్లో ఆర్మీలో కొనసాగాడు. చెన్నై టైటిల్ గెలిచిన నాలుగు సార్లూ రైనా జట్టుతోనే ఉన్నాడు. ఐపీఎల్లో మొత్తం 205 మ్యాచ్‌లు ఆడిన రైనా సెంచరీ, 39 అర్ధసెంచరీల సాయంతో 5528 పరుగులు సాధించాడు. వయసు పైబడటంతో పాటు ఫామ్‌లో లేకపోవడంతో సీఎస్కే యాజమాన్యం రైనాను 2022 సీజన్‌కు ముందు రీటైన్ చేసుకోలేదు. ఇదే కారణం చేత ఆ తర్వాత జరిగిన మెగా వేలంలోనే కొనుగోలు చేయలేదు. దీంతో అతను ఐపీఎల్ వీడాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇవాళ (సెప్టెంబర్ 6) భారత క్రికెట్‌తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. రైనా తీసుకున్న నిర్ణయంతో అతను ఐపీఎల్‌తో పాటు బీసీసీఐతో అనుబంధం ఉన్న ఏ ఇతర టోర్నీల్లోనూ పాల్గొన్నలేడు. వాస్తవానికి రైనా రెండేళ్ల క్రితమే ధోనీతో కలిసి ఒకే సారి (ఆగస్ట్ 15) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. -
సురేష్ రైనా సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై
టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు మంగళవారం సోషల్‌మీడియా వేదికగా రైనా ప్రకటించాడు. "భారత్‌కు, నా రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ రోజు నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. అదే విధంగా నా కెరీర్లో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, సీఎస్కే, నా అభిమానులకు ధన్యవాదాలు" అంటూ రైనా ట్విటర్లో పేర్కొన్నాడు. ఇక 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రైనా.. ఐపీఎల్లో మాత్రం కొనసాగుతూ వచ్చాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో పాల్గొన్న రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిస్టర్ ఐపీఎల్ మిగిలిపోయాడు. కాగా విదేశీ టీ20 లీగ్‌లలో ఆడేందుకు రైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ టోర్నీలో ఆడాలంటే బీసీసీఐ నిర్వహించే అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోవాలి. ఇక ఐపీఎల్లో11 సీజన్లలో చెన్నైసూపర్ కింగ్స్‌కు రైనా ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో 205 మ్యాచ్‌లు ఆడిన రైనా.. 5528 పరుగులు సాధించాడు. ఇక 18 టెస్టులు,226 వన్డేలు,78 టీ20ల్లో భారత్ తరపున మిస్టర్ ఐపీఎల్ ప్రాతినిథ్యం వహించాడు. It has been an absolute honour to represent my country & state UP. I would like to announce my retirement from all formats of Cricket. I would like to thank @BCCI, @UPCACricket, @ChennaiIPL, @ShuklaRajiv sir & all my fans for their support and unwavering faith in my abilities 🇮🇳 — Suresh Raina🇮🇳 (@ImRaina) September 6, 2022 చదవండి: CSA T20 League: జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ . -
సురేష్ రైనాకు అరుదైన గౌరవం..!
Suresh Raina Doctorate: టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనాకు అరుదైన గౌరవం దక్కింది. చెన్నైలోని ప్రముఖ వేల్స్ యూనివర్శిటీ రైనాను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా రైనా అభిమానులతో పంచుకున్నాడు. "ప్రతిష్టాత్మక వేల్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ గౌరవాన్ని పొందినందుకు సంతోషంగా ఉంది. నాపై చూపించిన ప్రేమకు, అభిమానానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చెన్నై నాకు సొంత ఇల్లు వంటింది. ఇది ఇప్పటికీ నాకు చాలా ప్రత్యేకమైనదిగా ఉండిపోతుంది" అని రైనా ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత రైనా ఐపీఎల్లో మాత్రం కొనసాగాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రైనా ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. కాగా ఐపీఎల్-2022కు ముందు రైనాను చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా రీటైన్ చేసుకోలేదు. దీంతో అతడు వేలంలో పాల్గొన్నాడు. అయితే మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన రైనాను ఐపీఎల్-2022 వేలంలో ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం అందరనీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక వేలంలో అమ్ముడుపోని రైనా ఐపీఎల్లో కామెంటేటర్‌గా సరికొత్త అవతరామెత్తాడు. ఇక భారత తరపున 18 టెస్టులు, 226 వన్డేలు,78 టీ20లు ఆడిన రైనా.. వరుసగా 768, 5615, 1605 పరుగులు సాధించాడు. I am humbled to receive this honour from the outstanding institution VELS Institute of Science & technology & Advanced Studies @VelsVistas @IshariKGanesh Sir. I am moved by all the love & thank you from the bottom of my heart. Chennai is home & it has a special place for me ❤️✨ pic.twitter.com/bZenkMwid8 — Suresh Raina🇮🇳 (@ImRaina) August 5, 2022 చదవండి: KL Rahul: వాళ్లు ఉన్నారుగా! మనకి కేఎల్ రాహుల్ అవసరమా?! అనిపించేలా.. -
ఇంగ్లండ్‌తో రెండో వన్డే.. సందడి చేసిన ధోని, రైనా
IND VS ENG 2nd ODI: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్‌లు సందడి చేశారు. ఈ టీమిండియా మాజీ త్రయం వీఐపీ గ్యాలరీలో ఫోటోలకు పోజులిస్తూ సందడి చేసింది. ఇటీవలి కాలంలో టీమిండియా ఎక్కడికి వెళ్లినా ఫాలో అవుతున్న ధోని.. తొలి వన్డే సందర్భంగా కూడా మైదానంలో హడావుడి చేశాడు. విండీస్ దిగ్గజం గార్డన్ గ్రీనిడ్జ్, సైఫ్ అలీ ఖాన్‌లతో కలిసి ఫోటోలు దిగాడు. తాజాగా తలా.. చిన్న తలా (రైనా)తో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. Great watching the boys in blue 🇮🇳 @harbhajan_singh @msdhoni pic.twitter.com/1UEGAzEG7R — Suresh Raina🇮🇳 (@ImRaina) July 14, 2022 సహచరులు భజ్జీ, ధోనిలతో కలిసి దిగిన ఫోటోలను రైనా ట్విటర్లో పోస్ట్ చేశాడు. కాగా, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను వీక్షించేందుకు దిగ్గజ ఆటగాళ్లు చాలా మంది హాజరవుతున్నారు. తొలి వన్డే సందర్భంగా సచిన్, గంగూలీలతో పాటు చాలా మంది స్టార్లు మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించారు. ఇదిలా ఉంటే, రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఇంగ్లండ్ 246 పరుగులకే ఆలౌటైంది. చహల్ 4, బుమ్రా, హార్థిక్ తలో 2 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ, షమీ చెరో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మొయిన్ అలీ (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: విండీస్ దిగ్గజాల రికార్డుకు ఎసరు పెట్టిన రోహిత్-ధవన్ జోడీ -
నా అన్నయ్య.. కెప్టెన్ ధోని.. హ్యాపీ బర్త్‌డే: కోహ్లి భావోద్వేగ ట్వీట్
Virat Kohli Emotional Wishes For MS Dhoni: ‘‘నీలాంటి నాయకుడు ఇంకెవరూ ఉండరు. భారత క్రికెట్‌కు ఎనలేని సేవ చేసిన నీకు ధన్యవాదాలు. నువ్వు నాకు అన్నయ్యగా మారావు. నీ పట్ల నాకున్న ప్రేమ, గౌరవం ఎల్లప్పుడూ అలాగే ఉంటాయి. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్’’ అంటూ టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లి.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి శుభాకాంక్షలు తెలియజేశాడు. కాగా మిస్టర్ కూల్ ధోని గురువారం తన 41వ పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, అభిమానులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లి సైతం ధోనికి శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగ పూరిత ట్వీట్ చేశాడు. నా కెప్టెన్ ధోని అంటూ అతడితో దిగిన ఫొటోలను పంచుకున్నాడు. కోహ్లి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక స్టార్ బ్యాటర్‌గా.. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి ఎదగడం వెనుక ధోని ప్రోత్సాహం ఉందన్న సంగతి తెలిసిందే. కష్టకాలంలో కోహ్లికి అండగా నిలబడి అతడు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ధోని ప్రోత్సహించాడు. ఈ నేపథ్యంలో తన ‘అన్న’ పట్ల కోహ్లి ట్విటర్ వేదికగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. మరోవైపు హర్భజన్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, సురేశ్ రైనా తదితర క్రికెటర్లు.. రాజకీయ, సినీ ప్రముఖులు ధోని భాయ్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. దీంతో #HappyBirthdayDhoni హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కాగా ధోని తన కెరీర్లో 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలు సాధించి భారత్‌కు మూడు ఐసీసీ మేజర్ ట్రోపీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. చదవండి: Virat Kohli: ఇదే చివరి అవకాశం.. రిపీట్ అయితే ప్రపంచకప్ జట్టు నుంచి కోహ్లి అవుట్! A leader like no other. Thanks for everything you have done for Indian cricket. 🇮🇳 You became more like an elder brother for me. Nothing but love and respect always. Happy birthday skip 🎂@msdhoni pic.twitter.com/kIxdmrEuGP — Virat Kohli (@imVkohli) July 7, 2022 View this post on Instagram A post shared by Sakshi Singh (@sakshisingh_r) Happy Birthday to my big brother. Thank you for being my biggest supporter and mentor in every phase of life, may god bless you and your family with good health always. Much love to you mahi bhai. Wishing you a great year ahead! @msdhoni #HappyBirthdayDhoni pic.twitter.com/3uABWFIlnO — Suresh Raina🇮🇳 (@ImRaina) July 6, 2022 Very very happy birthday to you @msdhoni 🥳 My best wishes are always with you! Have the most wonderful year ahead. Love always 🤗 pic.twitter.com/95n92fqeNT — Harbhajan Turbanator (@harbhajan_singh) July 7, 2022 -
'దక్షిణాఫ్రికాతో సిరీస్ భారత ఆటగాళ్లకు చాలా కీలకం'
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్ భారత యువ ఆటగాళ్లకు ఎంతో కీలకమని టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఐపీఎల్-2022లో అదరగొట్టి భారత జట్టులోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ అద్భుతంగా రాణించాలని రైనా ఆకాంక్షించాడు. దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ సిరీస్‌కు పేస్ సంచలనాలు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్‌లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. "ఈ సిరీస్ టీమిండియాకు చాలా ముఖ్యమైనది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన యువ ఆటగాళ్లు ప్రొటీస్‌తో సిరీస్‌కు భారత జట్టులో భాగమై ఉన్నారు. అయితే టీమిండియా తరపున వారు ఎలా రాణిస్తారు అనేది ముఖ్యం. ఉమ్రాన్ మాలిక్ చాలా టాలెంట్ ఉన్న బౌలర్. అదే విధంగా అర్ష్‌దీప్ ఐపీఎల్లో బౌలింగ్ చేసిన విధానం అద్భుతమైనది. ఇక కెప్టెన్‌గా రాహుల్ ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. కానీ ఇప్పుడు భారత జట్టు వంతు వచ్చింది. అయితే అతడు జట్టును విజయం పథంలో నడిపిస్తాడని నేను భావిస్తున్నాను "అని రైనా పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 జూన్9న ఢిల్లీ వేదికగా జరగనుంది. చదవండి: SL Vs AUS 1st T20: తొలి టీ20.. తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా -
'ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ ఆధిపత్యం చెలాయిస్తుంది'
ఐపీఎల్-2022 ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. మే 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక అరంగేట్ర సీజన్లోనే అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ తొలి టైటిల్ సాధించడానికి ఉర్రూతలూగుతోంది. మరోవైపు రాజస్థాన్ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి రెండోసారి టైటిల్‌ను ముద్దాడాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్-2022 విజేత ఎవరన్నది భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అంచనా వేశాడు. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ కంటే గుజరాత్ టైటాన్స్ కొంచెం మెరుగ్గా కన్పిస్తుందని రైనా అభిప్రాయపడ్డాడు. "ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం చెలాయిస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారికి నాలుగు, ఐదు రోజులు మంచి విశ్రాంతి లభించింది. అదే విధంగా గుజరాత్ ఆటగాళ్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. అలా అని రాజస్తాన్‌ను కూడా తేలికగా తీసుకోలేము. రాజస్తాన్ కూడా అద్భుతమైన ఫామ్‌లో కూడా ఉంది ఇక ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ చెలరేగితే.. అది రాజస్తాన్‌కు జట్టుకు కలిసిస్తోంది. అదే విధంగా అహ్మదాబాద్ వికెట్ అద్భుతంగా ఉంది. కాబట్టి బ్యాటర్లు మరోసారి చెలరేగే అవకాశం ఉంది" అని సురేష్ రైనా పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఫైనల్‌కు 6000 మంది పోలీసులతో భారీ భద్రత.. కారణం అదేనా? -
IND Vs SA: డీకేను సెలక్ట్ చేశారు.. మరి అతడిని ఎందుకు పక్కనపెట్టారు: రైనా
India Vs South Africa T20 Series: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలక్టర్ల తీరును టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా విమర్శించాడు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఎంపిక చేసిన జట్టులో సీనియర్ బ్యాటర్‌కు శిఖర్ ధావన్‌కు ఎందుకు స్థానం కల్పించలేదని ప్రశ్నించాడు. దినేశ్ కార్తిక్‌ను జట్టులోకి తీసుకున్నపుడు ధావన్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశాడు. కాగా దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఆదివారం భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్-2022లో అదరగొట్టిన యువ బౌలర్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్‌లు తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకోగా.. సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ జట్టులోకి వచ్చారు. కానీ, అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న శిఖర్ ధావన్(పంజాబ్ కింగ్స్- 460 పరుగులు- అత్యధిక స్కోరు 88 నాటౌట్)కు మాత్రం మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో సురేశ్ రైనా మాట్లాడుతూ.. ‘‘శిఖర్ ధావన్‌ను దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక చేయాల్సింది. తను జట్టులో ఉంటే ఎంతో బాగుంటుంది. డ్రెస్సింగ్‌రూంలో వాతావరణాన్ని తేలికపరిచి అందరితో కలిసిపోతాడు. దినేశ్ కార్తిక్ పునరాగమనం చేయగలుగుతున్నపుడు శిఖర్ ధావన్ ఎందుకు జట్టులోకి రాకూడదు’’ అని సెలక్టర్ల తీరును ప్రశ్నించాడు. కాగా శిఖర్ ధావన్ ఆఖరిసారిగా గతేడాది జూలైలో శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్-2021 సమయంలో జట్టులో స్థానం కోల్పోయాడు. ఇదిలా ఉంటే ప్రొటిస్‌తో సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు. చదవండి👉🏾IPL 2022: ‘టాప్-4’లోని ఒక్కడు తప్ప ఆ కెప్టెన్లంతా అదరగొట్టారు.. అగ్రస్థానం అతడిదే! చదవండి👉🏾IPL 2022: ప్లే ఆఫ్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయితే..? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ట్వీట్ చేస్తే వెయ్యి రూపాయలు వసూలు చేయాలి
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! పశ్చాత్తాపపు బేరం 2014లో వాట్సాప్‌కు నేను చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా ఉన్నాను. ఫేస్‌బుక్‌కు దాన్ని 22 బిలియన్ డాలర్లకు అమ్మే బేరం కుదర్చ డంలో సాయపడ్డాను. ఇవ్వాళ, దానికి పశ్చాత్తాప పడుతున్నాను. ఫేస్బుక్ అనేది మున్ముందు ఫ్రాంకెన్ స్టెయిన్ రాకాసిలా మారి యూజర్ల డాటాను మింగి, మురికి సొమ్మును ఉమ్మివేస్తుందని ఎవరికీ తెలియదు! మాకూ తెలియలేదు. – నీరజ్ అరోరా, వ్యాపారవేత్త ప్రేరణకు ఖర్చవుతుంది ట్విట్టర్‌ను లాభసాటి చేయడానికి ఎలాన్ మస్క్‌కు ఒక ఐడియా. గూగుల్లోంచి తీసుకుని ప్రేరణ కలిగించే కొటేషన్లను ట్వీట్ చేస్తే వంద రూపాయలు, ఇన్‌స్ట్రాగామ్ నుంచి తీసుకున్న వీడియోను ట్వీట్ చేస్తే వెయ్యి రూపాయలు ఐఏఎస్ అధికారుల నుంచి వసూలు చేయాలి. – అభిషేక్ ద్వివేది, న్యాయవాది ఒప్పందం చేసుకుందాం యూఎస్‌లోని కొన్ని హిందూ రైట్ వింగ్ సంస్థలు వారి ప్రయోజనాలకు నన్ను ఒక సంభావ్య ప్రమాదంగా చూపిస్తూ హిందూ జాతీయవాదుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయట. ఆ సంస్థలకు నా విన్నపం ఏమిటంటే, నా పేరునైనా వాడటం మానండి, లేదా అందులో నాకు 15 శాతం రాయల్టీ అయినా చెల్లించండి. – రఖీబ్ హమీద్ నాయక్, జర్నలిస్ట్ ఎవరు బాధ్యులు? ఇవ్వాళ స్టాక్ మార్కెట్లో రక్తపాతం సంభవించింది. ద్రవ్యోల్బణం ఎన్నడూ లేనంత ఎక్కువ. పెట్రోలు, డీజిల్ ధరలు ఎన్నడూ లేనంత ఎక్కువ. నిరు ద్యోగం ఎన్నడూ లేనంత ఎక్కువ. కోటీశ్వరుల సంఖ్య ఎన్నడూ లేనంత ఎక్కువ. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య ఎన్నడూ లేనంత ఎక్కువ. ఢిల్లీలో ఉష్ణోగ్రత ఎన్నడూ లేనంత ఎక్కువ. మనం నెహ్రూను నిందించగలమా? – ప్రవేశ్ జైన్, పారిశ్రామికవేత్త పెరిగిన స్థాయి ప్రధానమంత్రి మోదీ యూరప్ పర్యటనను దగ్గరగా చూస్తున్నాను. గత మూడు దశాబ్దాల్లో ఏ భారత ప్రధాని పట్ల కూడా ప్రపంచ నాయకులు ఇంత ఎక్కువ స్పందన కనబరచలేదు. భారత సంతతి వారు కూడా చాలా సంతోషపడ్డారు. రాజకీయాలను పక్కనపెట్టి మోదీ దేశ స్థాయిని అమాంతంగా పెంచారని అంగీకరిద్దాం. – హేమంత్ బాత్రా, టీవీ హోస్ట్ ఎందులో ఎక్కువ? ఎందుకు ఈ ‘ప్యూర్ వెజిటేరియన్లు’ ఎప్పుడూ మాంసాహారుల కన్నా తాము అధికులమని చూపుకొంటారు? కులం ఉంది సుమా! – మినీ నాయర్, రచయిత్రి ప్రేమతో కృతజ్ఞతలు మనం రెండు కోట్ల మందికి చేరామంటే నమ్మలేకపోతున్నా(ట్విట్టర్లో ఫాలోవర్ల సంఖ్య రెండు కోట్లయింది). మీ అందరూ నా మీద కురిపిస్తున్న ప్రేమకు ఎంతో పొంగిపోతున్నా. స్థిరంగా నాకు మద్దతిస్తున్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. బోల్డంత ప్రేమ! – సురేశ్ రైనా, క్రికెటర్ -
IPL 2022: ధోని అరుదైన రికార్డు.. రైనా, పొలార్డ్‌ను వెనక్కి నెట్టి
IPL 2022 CSK Vs MI- MS Dhoni Rare Record: ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటర్, మిస్టర్ ఫినిషర్ ఎంఎస్ ధోని అరుదైన రికార్డు సాధించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఒక ప్రత్యర్థి బౌలర్ బౌలింగ్‌లో అత్యంత వేగంగా వంద పరుగుల మార్కును అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో మొదటి వరుసలో ఉన్న సురేశ్ రైనా, ఏబీ డివిల్లియర్స్, కీరన్ పొలార్డ్‌లను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. గురువారం నాటి మ్యాచ్‌లో ముంబై బౌలర్ జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్‌లో వరుస షాట్లు బాది ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్లో మొత్తంగా ఉనాద్కట్ బౌలింగ్‌లో 42 బంతులు ఎదుర్కొన్న ధోని 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు సురేశ్ రైనా సందీప్ శర్మ బౌలింగ్‌లో 47 బంతుల్లో, ఏబీ డివిల్లియర్స్ కూడా సందీప్ శర్మ బౌలింగ్‌లోనే 47 బంతుల్లో, కీరన్ పొలార్డ్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో 47 బంతుల్లో ఈ ఫీట్ నమోదు చేశారు. ఇక ముంబైతో మ్యాచ్‌లో మొత్తంగా 13 బంతులు ఎదుర్కొన్న ధోని 28 పరుగులతో అజేయంగా నిలిచి చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. ఆఖరి బంతికి మిస్టర్ కూల్ ఫోర్ బాదడంతో 3 వికెట్ల తేడాతో జడ్డూ సేనను విజయం వరించింది. ఐపీఎల్లో ఒక ఆటగాడి బౌలింగ్‌లో అత్యంత వేగంగా 100 పరుగులు సాధించిన బ్యాటర్లు: ఎంఎస్ ధోని- 42 బంతుల్లో- జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్‌లో సురేశ్ రైనా- 47 బంతుల్లో- సందీప్ శర్మ బౌలింగ్‌లో ఏబీ డివిల్లియర్స్- 47 బంతుల్లో- సందీప్ శర్మ బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్- 47 బంతుల్లో- రవీంద్ర జడేజా బౌలింగ్‌లో చదవండి: CSK Vs MI: వరుసగా 7 ఓటములు.. అయినా ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే! Nobody finishes cricket matches like him and yet again MS Dhoni 28* (13) shows why he is the best finisher. A four off the final ball to take @ChennaiIPL home. What a finish! #TATAIPL #MIvCSK pic.twitter.com/oAFOOi5uyJ — IndianPremierLeague (@IPL) April 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
"సురేశ్ రైనా.. నా జీవితంలోకి దేవుడిలా వచ్చాడు.. అతడి వల్లే ఇదంతా"
సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ కార్తీక్ త్యాగి తన కెరీర్‌కు సురేష్ రైనా మద్దతుగా నిలిచడాని తెలిపాడు. 2020 అండర్-19 ప్రపంచకప్‌లో అదరగొట్టిన కార్తీక్ త్యాగి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్-2020 వేలంలో త్యాగిని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అతడు ఆ సీజన్లో 9 వికెట్లు పడగొట్టి అందరనీ అకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో కార్తీక్ త్యాగిని రూ. 4 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. "నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే. అండర్-16కు ఆడుతున్నప్పుడు సురేష్ రైనా నా జీవితంలోకి దేవుడిలా వచ్చాడు. ఎందుకంటే రైనా వల్లే నేను ఈ రోజు ఈ స్ధాయిలో ఉన్నాను. నాకు 13 ఏళ్లు ఉన్నప్పడు.. నేను అండర్-14 ట్రయల్స్‌లో పాల్గొన్నాను. అక్కడ నుంచే నా క్రికెట్ ప్రయాణం ప్రారంభమైంది. తరువాత నేను అండర్-14 జట్టుకు ఆడటం ప్రారంభించాను.. ఆపై అండర్-16కు ఆడాను. రంజీ ట్రోఫీలోకి వచ్చినప్పుడు నేను 16 ఏళ్ల యువకుడిని. మిగితా వాళ్లందరూ అప్పటికే సీనియర్లుగా జట్టులొ ఉన్నారు. సురేష్ రైనా రోజూ ప్రాక్టీస్‌కు వచ్చే వాడు. నేను అక్కడే ఉండి అన్నీ గమనిస్తూ ఉండేవాడిని. ఒక రోజు అతడు ప్రాక్టీస్ ముగించుకుని బయలుదేరాడు. కానీ అతను తిరిగి గ్రౌండ్‌కి ఎందుకు వచ్చాడో నాకు తెలియదు. నా దగ్గరకు వచ్చి నీ రోల్ ఏంటి అని అడిగాడు. నేను బౌలర్‌ను అని బదులు చేప్పాను. ఆపై రైనా నాకు నెట్స్‌లో బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. అతడు నా ప్రదర్శన చూసి.. "నీ బౌలింగ్ నాకు నచ్చింది. భవిష్యత్తులో నీకు అవకాశాలు వచ్చేలా చూస్తానని" చెప్పాడు. సురేష్ రైనా లాంటి అత్యత్తుమ ఆటగాడు మెచ్చు కోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత రంజీ ట్రోపీ ఆడే యూపీ జట్టుకు నేను ఎంపికయ్యాను. రైనా వల్లే నా రంజీ కెరీర్ మొదలైంది అని కార్తీక్ త్యాగి పేర్కొన్నాడు. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న త్యాగి..ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. చదవండి: IPL 2022: చెన్నై, ముంబై పోరు భారత్-పాక్ మ్యాచ్‌ను తలపిస్తుంది.. భజ్జీ ఆసక్తికర వ్యాఖ్యలు -
ఆ ఆటగాడిని వెనక్కి పిలవండి.. లేదంటే సీఎస్కే పని అంతే!
ఐపీఎల్ 2022లో సీఎస్కేకు ఘనమైన ఆరంభం లభించలేదు. గతేడాది సీజన్లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న సీఎస్కే నాలుగోసారి చాంపియన్స్‌గా నిలిచింది. అదే ఆటతీరును ప్రస్తుతం కనబరచలేకపోతుంది. ధోని కెప్టెన్‌గా తప్పుకోవడంతో జడేజా ఆ బాధ్యతలు తీసుకున్నాడు. కెప్టెన్‌గా ఉన్నప్పటికి జడేజా ఘోరంగా విఫలమవుతున్నాడు. ధోని మార్క్ కెప్టెన్సీని జడ్డూ చూపెట్టలేకపోతున్నాడు. దీనికి తోడూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓటములను మూటగట్టకుంది. దీంతో సీఎస్కే అభిమానులు రైనాను మళ్లీ సీఎస్కేలోకి తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ మెగావేలానికి ముందు సురేశ్ రైనాను సీఎస్కే రిలీజ్ చేసింది. ఆ తర్వాత మెగావేలంలో రైనాను కొనుగోలు చేయడానికి సీఎస్కేతో పాటు ఏ జట్టు ఆసక్తి చూపించలేదు. దీంతో రైనా అమ్ముడపోని జాబితాలో చేరిపోయాడు. అయితే ప్రస్తుతం రైనా ఐపీఎల్లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. రైనా జట్టులో లేకపోవడంతోనే సీఎస్కే ఈ సీజన్‌ను ఓటములతో ప్రారంభించిదని ఒక వర్గం అభిమానులు అభిప్రాయపడ్డారు. 2020లో రైనా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 13వ సీజన్‌కు దూరమయ్యాడు. యూఏఈ వేదికగా జరిగిన ఆ సీజన్లో సీఎస్కే దారుణ ప్రదర్శన కనబరిచింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన సీఎస్కే తొలిసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆ తర్వాతి సీజన్లో రైనా అందుబాటులోకి రావడం.. సీఎస్కే విజేతగా నిలవడం యాదృశ్చికంగా జరిగిపోయాయి. అంతేగాక చాలా మంది అభిమానులు సీఎస్కే ప్రదర్శనను ఐపీఎల్ 2020 సీజన్‌తో పోలుస్తున్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ రైనా జట్టులో లేకపోవడంతో సీఎస్కే వరుసగా ఓటములు చవిచూసింది. అందుకే రైనాను వెనక్కి తీసుకురావాలని.. ఒకవేళ జట్టులో ఆటగాడిగా కాకున్నా.. కనీసం బ్యాటింగ్ మెంటార్గానైనా అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. మీరు ఏమనుకున్నా సరే.. రైనా లేని జట్టును ఊహించకోవడం కష్టంగా ఉంది.. వెంటనే అతన్ని ఏదో ఒక రూపంలో వెనక్కి పిలిపించండి. రైనా సీఎస్కేతో పాటు ఉంటే కచ్చితంగా ఐపీఎల్ టైటిల్ కొడుతుంది.. లేదంటే అంతే సంగతులు అంటూ సీఎస్కే అభిమానులు కామెంట్ చేశారు. ఇదంతా వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం రైనా పేరు మరోసారి మార్మోగిపోతుంది. ఇంకో విషయమేంటంటే.. రైనా జట్టులో లేని సందర్భాల్లో సీఎస్కే 22 మ్యాచ్‌ల్లో 14 సార్లు ఓడిపోయింది. కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. సీఎస్కేకు రైనా ఇంపాక్ట్ ఎంత ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక రైనా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్లో రైనా 205 మ్యాచ్‌ల్లో 5528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు సెంచరీలు ఉన్నాయి. ధోని తర్వాత సీఎస్కే జట్టులో అంతలా పేరు సంపాదించిన రైనాను అభిమానులు ముద్దుగా చిన్న తలా అని పిలుచుకుంటారు. చదవండి: IPl 2022: 'ధోని అలా చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేది' Can You Imagine a Body without it's soul...? A Heart Without Heartbeat...? It's CSK without Suresh Raina....💔#CSK #Dhoni #ChennaiSuperKings #CSKvsPBKS #CSK𓃬 #Raina #SureshRaina #WhistlePodu #IPL#IPL2022 #WhistlePodu #chinathala pic.twitter.com/zWpbuzfo7z — chaitali♡ॐ (@Chaitali67) April 4, 2022 No hate just a fact@ChennaiIPL in IPL 2022 without @ImRaina and @faf1307 is like Zimbabve in World Cup 😭 #fact #nohate #IPL2022 #FafDuPlessis #Raina #Cricket — Aditya (@Aditya_Nikam23) April 4, 2022 A family is completed with a wife... So @ImRaina is the wife of @ChennaiIPL . Without china thala csk family is incomplete...china thala we miss u.. #CSKvsPBKS — CRIC-FACTS (@SanjitKumarSw12) April 4, 2022 -
‘క్రికెట్’కు గుడ్‌బై చెప్పనున్న సురేశ్ రైనా!?
టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా త్వరలో అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ధోనీతో పాటు సురేష్ రైనా 2020లో కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కానీ ఐపీఎల్లో మాత్రం ఆడుతూ వచ్చాడు. అయితే ఐపీఎల్-2022 మెగా వేలంలో సురేష్ రైనాను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా రైనా మిగిలిపోయాడు. అయితే ఐపీఎల్ 15వ సీజన్లో రైనా కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తాడు. అతడితో పాటు పీయూష్ చావ్లా, ధవల్ కులకర్ణి, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, హర్భజన్ సింగ్ తొలి సారి ఐపీఎల్లో కామెంటరీ ప్యానెల్లో చేరారు. ఇది ఇలా ఉంటే.. 11 సీజన్లలో చెన్నైసూపర్ కింగ్స్‌కు రైనా ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు గుజరాత్ లయన్స్‌కు కెప్టెన్‌గా కూడా రైనా వ్యవహరించాడు. కాగా అతడి వయస్సు దృష్ట్యా క్రికెట్ నుంచి తప్పుకోవాలని రైనా భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రైనాకు 35 ఏళ్లు నిండాయి. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్లో 205 మ్యాచ్‌లు ఆడిన రైనా.. 5528 పరుగులు సాధించాడు. అభిమానులు అతడిని ముద్దుగా మిస్టర్ ఐపీఎల్ అని పిలుచుకుంటారు. చదవండి: IPL 2022: చెన్నై.. 19వ ఓవర్ శివమ్ దూబేతో వేయించడం సరైన నిర్ణయమే: టీమిండియా మాజీ క్రికెటర్ Suresh Raina 🥺💔 pic.twitter.com/nztD5RcO4E — Kanan Shah (@KananShah_) March 26, 2022 -
కామెంటేటర్‌గా డెబ్యూ.. ఎమోషనల్ అయిన మాజీ క్రికెటర్
ఐపీఎల్ 2022కు ముందు జరిగిన మెగావేలంలో సురేశ్‌రైనాను ఎవరు కొనుగోలు చేయని సంగతి తెలిసిందే. క్రితం సీజన్ వరకు ఐపీఎల్లో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన రైనా అమ్ముడుకాని ప్లేయర్ల జాబితాలో చేరిపోయాడు. దీంతో ఐపీఎల్లో ఈసారి రైనా కనిపించడు అని మనం అనుకునేలోపే కామెంటేటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా సీఎస్కే, కేకేఆర్ మధ్య జరుగుతున్న ఆరంభమ్యాచ్కు రైనా కామెంటేటర్‌గా దర్శనమిచ్చాడు. ఇంతకాలం తాను ఏ జట్టుకైతే ప్రాతినిధ్యం వహించాడో అదే జట్టు సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతుండడంతో ఫ్యాన్స్ ఎమోషనల్ అయ్యారు. ఇదే విషయాన్ని ఫ్యాన్స్.. ''వి మిస్ యూ రైనా'' అంటూ ఎల్లో జెర్సీ రూపంలో ఉన్న రైనా ఫోటోను షేర్ చేశారు. విషయం తెలుసుకున్న రైనా స్పందించాడు. ''ఇప్పటికిప్పుడు అవకాశం వస్తే సీఎస్కేకు ఆడాలని ఉంది.. అది ఎల్లో జెర్సీ వేసుకొని. అంతేకాదు స్టేడియంలోకి వెళ్లి చెన్నై ఫ్రాంచైజీకి చెందిన గార్డ్స్ పెట్టుకోవాలని ఉంది.'' అంటూ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Suresh Raina 🥺💔 pic.twitter.com/nztD5RcO4E — Kanan Shah (@KananShah_) March 26, 2022 -
IPL 2022: సీఎస్కే తదుపరి కెప్టెన్ అంబటి రాయుడు.. లేదంటే: రైనా
IPL 2022- Suresh Raina: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందింది చెన్నై సూపర్ కింగ్స్. నాలుగుసార్లు టైటిల్ గెలిచి సత్తా చాటింది. 2010, 2011, 2018, 2021 సీజన్లలో విన్నర్‌గా నిలిచింది. సీఎస్కే ప్రయాణం ఇంత సక్సెస్‌ఫుల్‌గా సాగడంలో కెప్టెన్ ఎంఎస్ ధోని పాత్ర మరువలేనిది. తలా లేని చెన్నై జట్టును ఊహించడం కష్టం. అంతగా తనదైన ముద్ర వేశాడు ధోని. మరి ధోని క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్ బై చెబితే అతడి స్థానాన్ని భర్తీ చేయగల సారథి ఎవరా అంటూ చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సురేశ్ రైనాకు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందించిన రైనా.. ‘‘రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప, డ్వేన్ బ్రావో.. వీరికి చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహించ గల సత్తా ఉంది. ఎంఎస్ ధోని వారసుడిగా జట్టును ముందుకు నడిపే శక్తిసామర్థ్యాలు వారికి ఉన్నాయి. ఆటపై వారికున్న అవగాహన ఇందుకు దోహదం చేస్తుంది. ఇక ఐపీఎల్లో కామెంటేటర్‌గా అవతారం ఎత్తడం గురించి రైనా చెబుతూ.. ‘‘నేను ఇందుకు సిద్ధంగా ఉన్నాను. ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూశ్ చావ్లా.. ఇలా నా స్నేహితుల్లో చాలా మంది ఇప్పటికే కామెంటేటర్లుగా ఉన్నారు. రవి భాయ్(రవి శాస్త్రి) కూడా ఈ సీజన్‌తో ఐపీఎల్లో ఎంట్రీ ఇస్తున్నారు. వీళ్లంతా ఉన్నారు కాబట్టి నాకు ఈ టాస్క్ మరింత సులువు అవుతుందనే అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. కాగా గతంలో చెన్నైకి ప్రాతినిథ్యం వహించిన రైనా మెగా వేలం- 2022లో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. చదవండి: IPL 2022- Virat Kohli: చిన్న బ్రేక్ మాత్రమే.. 2023లో మళ్లీ ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లి! ఎందుకంటే... Unveiling with Yellove! 💛 Here’s a 👀 at our new threads in partnership with @TVSEurogrip! 🥳#TATAIPL #WhistlePodu 🦁 pic.twitter.com/pWioHTJ1vd — Chennai Super Kings (@ChennaiIPL) March 23, 2022 -
మెగావేలంలో అవమానం.. అక్కడ మాత్రం ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక
ఐపీఎల్ మెగావేలంలో సురేశ్ రైనాకు అవమానం జరిగిన సంగతి తెలిసిందే. లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాటర్‌గా పేరున్న రైనాను వేలంలో ఎవరు కొనడానికి ఆసక్తి చూపలేదు. దీంతో రైనా అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. అయితే ఇదే రైనాను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే 'స్పోర్ట్స్ ఐకాన్' అవార్డుకు రైనా ఎంపికయ్యాడు. మొత్తంగా వివిధ దేశాలకు చెందిన 16 మంది క్రీడాకారులు నామినేట్ అయ్యారు. రైనాతోపాటు మాజీ రియల్ మాడ్రిడ్ ఫుట్‌బాల్ ఆటగాడు రాబర్ట్ కార్లోస్, జమైకన్ స్ప్రింటర్ అసఫా పావెల్, శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య, నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ దిగ్గజం ఎడ్గర్ డేవిడ్స్ తదితరులు ఉన్నారు. తన క్రికెట్ కెరీర్లో అతను చేసిన సేవకు గాను ఈ అవార్డు ఇచ్చినట్లు మాల్దీవ్స్ ప్రభుత్వం తెలిపింది. కాగా మార్చి 17న మాల్దీవ్స్‌లోని సింథటిక్ రన్నింగ్ ట్రాక్ మైదానంలో ఈ అవార్డుల వేడుక జరిగింది. ఈ అవార్డును బంగ్లాదేశ్ క్రీడామంత్రి జహీర్ హసన్ రసెల్.. రైనాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా, మాల్దీవుల క్రీడా మంత్రులు పాల్గొన్నారు. ఇక రైనా టీ20ల్లో 8వేల పరుగులు సాధించిన తొలి భారతీయుడిగా.. ఐపీఎల్లో 5వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో చెన్నై జట్టు తరపున 176 మ్యాచ్‌లు ఆడిన సురేశ్ రైనా.. 32.32 సగటుతో 4687 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో మొత్తం 205 మ్యాచ్‌లు ఆడిన రైనా 5528 పరుగులు చేశాడు. -
రైనాకు హ్యాండ్ ఇచ్చిన ఫ్రాంచైజీలు.. కారణం ఇదే అంటున్న కుమార సంగక్కర
జైపూర్: భారత క్రికెట్ ప్లేయర్ సురేష్ రైనా.. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోయిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సురేష్ రైనాకు ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం హ్యాండిచ్చింది. అయితే, ఐపీఎల్‌కు రైనాకు సూపర్ రికార్డుల ఉన్నప్పటికీ వేలంలో మాత్రం అమ్ముడుపోకపోవడం అందరనీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, రైనా 2020 ఐపీఎల్ ఎడిషన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడలేదు. కొన్ని కుటుంబ సమస్యల కారణంగా ఆ సీజన్‌కు దూరమయ్యాడు. ఇక 2021 సీజన్లో మొదటి మ్యాచ్ ఆడిన రైనా ఢిల్లీ క్యాపిటల్స్‌పై మాత్రమే అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. దీంతో వేలంలో ఆ ప్రభావం కనిపించింది. రైనాను కొనుగోలు చేయకపోవడంపై రాజస్థాన్ జట్టు కోచ్ కుమార సంగక్కర స్పందిస్తూ.. రైనాపై ఆసక్తి చూపించకపోవడంపై ఎన్నో కారణాలు ఉండొచ్చన్నాడు. సుదీర్ఘ కేరీర్లో కాలం గడిచే కొద్ది ప్లేయర్స్ ఆటలో మార్పులు వస్తాయన్నారు. యువ ఆటగాళ్లు సైతం రాణించడంతో ఫ్రాంచైజీలు వారిపై ఫోకస్ పెడుతున్నాయని అన్నాడు. రైనాకి ఐపీఎల్లో మంచి రికార్డులు ఉన్నాయన్నాడు. అతను లెంజడరీ క్రికెటర్ అయినప్పటికీ సీజన్లో అతని ఆటతీరును బట్టే కొనుగోలు చేయలేదన్నాడు. మంచి ప్రదర్శన చేసిన వారిపైనే కోచ్‌లు, ఫ్రాంచైజీల ఫోకస్ ఉంటుదన్నారు. -
IPL 2022: రైనా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు ఐపీఎల్లో ఎంట్రీ!
IPL 2022- Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తిరిగి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి ఆటగాడిగా కాకుండా కామెంటేటర్‌గా కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నట్లు సమాచారం. కాగా ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఒకడైన రైనా.. గతేడాది చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే, సీఎస్కే అతడిని రిటైన్ చేసుకోలేదు. దీంతో ఐపీఎల్-2022లో రూ.2 కోట్ల కనీస ధరతో పేరు నమోదు చేసుకున్నాడు. కానీ ఏ జట్టు కూడా రైనా పట్ల ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. కనీసం వివిధ కారణాల వల్ల జట్లకు దూరమైన ఆటగాళ్ల స్థానంలోనైనా ఎంట్రీ ఇస్తాడనుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలో క్రికెట్ కామెంటేటర్‌గా అవతారం ఎత్తేందుకు రైనా సిద్దమైనట్లు ఐపీఎల్ వర్గాల సమాచారం. ఇక రైనాతో పాటు టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి సైతం వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. ‘‘ఈసారి రైనా ఐపీఎల్లో భాగం కావడం లేదని అందరికీ తెలుసు. అయితే, మేము అతడిని తిరిగి లీగ్‌లో చూడాలనుకుంటున్నాం. రైనాకు అభిమానులు ఎక్కువ. ముద్దుగా తనని మిస్టర్ ఐపీఎల్ అని పిలుచుకుంటారు. అతడు తిరిగి వస్తే బాగుంటుంది. ఇక శాస్త్రి ఒకప్పుడు స్టార్ స్పోర్ట్స్ ఇంగ్లింష్ కామెంటరీ టీమ్‌లో ఉన్నాడు. వీరిద్దరు ఐపీఎల్ వ్యాఖ్యాతలుగా ఉంటే బాగుంటుందనుకుంటున్నాం’’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపినట్లు జాగరన్ మీడియా పేర్కొంది. కాగా రైనా, రవిశాస్త్రి ఐపీఎల్ హిందీ కామెంటేటర్లుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా సురేశ్ రైనా గతంలో గుజరాత్ లయన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. చదవండి: Ruturaj Gaikwad - IPL 2022: సీఎస్కేకు బిగ్‌షాక్.. ఆరంభ మ్యాచ్‌లకు స్టార్ ఆటగాడు దూరం! View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
పాపం రైనా.. మరోసారి బిగ్ షాక్... కనీసం ఆ అవకాశం కూడా లేదుగా!
ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ బయో-బబుల్ నిబంధనల కారణంగా ఐపీఎల్-2022 నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మెగా వేలంలో రాయ్‌ను రూ. 2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. అయితే రాయ్ జట్టుకు దూరం కావండంతో అతడి స్ధానంలో వేలంలో అమ్ముడుపోని సురేష్ రైనాను భర్తీ చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలు అన్నీ ఆవాస్తవమని, గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే వేరే ఆటగాడితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘానిస్తాన్ విధ్వంసకర ఓపెనర్ రహ్మెనుల్లా గుర్భాజ్‌ను రాయ్ స్ధానంలో తీసుకుంటున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన గుజరాత్ టైటాన్స్ త్వరలో చేయనుంది. గుర్బాజ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడుతున్నాడు. ఇప్పటి వరకు18 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడిన రహ్మెనుల్లా గుర్భాజ్ 531 పరుగులు చేశాడు. ఇక ఇటీవల ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యూనైటడ్ జట్టుకు ప్రాతనిథ్యం వహించిన గుర్బాజ్.. 6 మ్యాచ్‌ల్లో 139 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్లో కొత్త జట్టుగా అవతరించిన గుజరాత్ టైటాన్స్ హార్ధిక్ పాండ్యా సారథ్యం వహించ నున్నాడు. గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఇక ఐపీఎల్-2022 వాంఖడే వేదికగా మార్చి 26 నుంచి ఫ్రారంభం కానుంది. చదవండి: Rohit Sharma: కలలో కూడా ఊహించలేదు.. నాకు దక్కిన గొప్ప గౌరవం ఇది: రోహిత్ శర్మ భావోద్వేగం -
IPL 2022: గుజరాత్ టైటాన్స్‌లోకి సురేశ్ రైనా..!
ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన సురేశ్ రైనాకు అదృష్టం జేసన్ రాయ్ రూపంలో తలుపుతట్టనుందంటే అవుననే చెప్పాలి. ఇటీవల ముగిసిన వేలంలో జేసన్ రాయ్‌ని గుజరాత్ టైటాన్స్ రూ.2 కోట్ల కనీస ధరకు సొంతం చేసుకోగా.. వ్యక్తిగత కారణాల చేత అతను ఈ ఏడాది లీగ్‌కు అందుబాటులో ఉండనని సీజన్ ఆరంభానికి ముందే ప్రకటించాడు. దీంతో రాయ్ స్థానాన్ని మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాతో భర్తీ చేయాలని నెటిజన్ల నుంచి భారీ ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. రైనా చేరికతో పసలేని గుజరాత్ జట్టుకు బలం చేకూరుతుందని, అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని నెటిజన్లు సూచిస్తున్నారు. రైనాకు 2016, 2017 సీజన్లలో నాటి గుజరాత్ లయన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవముందని, జేసన్ రాయ్ మాదిరిగానే రైనా కూడా విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడగల సమర్ధుడని, రైనాను రాయ్‌కి రిప్లేస్‌మెంట్‌గా తీసుకునేందుకు ఇంతకంటే పెద్ద అర్హతలు అవసరం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. Excellent choice.. Electric Raina can fire the Titan ship ..All the best... — Leo Christopher (@Leomdu) March 2, 2022 ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం కూడా రైనాను తీసుకునేందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రైనా, జేసన్ రాయ్‌లకు గతంలో గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉంది. ఈ ఫ్రాంచైజీ తరఫున రాయ్ కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడగా, రైనా.. రెండు సీజన్లలో కలిపి 40కి పైగా సగటుతో 800 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి సీఎస్కే (2016,2017ల్లో గుజరాత్ లయన్స్‌కు ఆడటం మినహా) జట్టుకు ఆడిన రైనా.. గత సీజన్ మినహాయించి లీగ్ మొత్తంలో అద్భుతంగా రాణించాడు. 205 మ్యాచ్‌ల్లో 32.52 సగటు, 135కు పైగా స్ట్రైక్‌రేట్‌తో 5528 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలున్నాయి. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. లీగ్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వెలువడాల్సి ఉంది. హార్ధిక్ పాండ్యా సారధ్యంలో గుజరాత్ టైటాన్స్, కేఎల్ రాహుల్ నేతృత్వంలో లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. Dear @gujarat_titans, if you pick Suresh Raina as a replacement of Roy, you are not just picking Raina for the team also you would getting almost 10M+ followers for your team who would promote your matches and support. This is important for your brand value. #SureshRaina𓃵 #IPL — CriiicWorld (@Criiicworld) March 2, 2022 Please take raina — Rdx Bipin Roy (@rdx_bipin) March 2, 2022 చదవండి: IPL 2022: వేలంలో ఎవరూ కొనలేదు.. కనీసం విదేశీ లీగ్‌లు ఆడే అనుమతైనా ఇవ్వండి..! -
IPL 2022: వేలంలో ఎవరూ కొనలేదు.. కనీసం విదేశీ లీగ్‌లు ఆడే అనుమతైనా ఇవ్వండి..!
Suresh Raina: ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేశ్ రైనాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఓ స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కని భారత ఆటగాళ్లకు ఇతర దేశాల క్రికెట్ లీగ్స్‌లో ఆడే అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశాడు. Please @ImRo45 consider #SureshRaina for #MumbaiIndians team.🙏🇮🇳💙💙#Boycott_ChennaiSuperKings pic.twitter.com/yiCiZX0gbc — Jyoti Suman (@Jas23478675) February 15, 2022 బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డు కాంట్రాక్టు కలిగిన పురుష క్రికెటర్లు బిగ్ బాష్ లీగ్(బీబీఎల్), కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) వంటి వీదేశీ లీగ్స్ ఆడేందుకు అనుమతి లేదు. భారత్‌లో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు గుడ్ బై చెబితేనే ఇతర దేశాల లీగ్‌లు ఆడే అనుమతి వారికి లభిస్తుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనితో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా.. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ టోర్నీలు ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి విదేశీ లీగ్‌లు ఆడే అవకాశం లేకుండా పోయింది. గతంలోనూ రైనా ఇదే తరహా వాదన వినిపించినప్పటికీ బీసీసీఐ అతని వాదనను కొట్టిపారేసింది. తాజాగా, భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌లు ఆడే అనుమతివ్వాలంటూ రైనా మరోసారి గళం విప్పాడు. రైనా.. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐని అభ్యర్ధిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఇదిలా ఉంటే, రూ.2 కోట్ల కనీస ధరతో ఐపీఎల్ 2022 మెగా వేలం బరిలో నిలిచిన రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో అమ్మడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన రైనా తన ఐపీఎల్ కెరీర్లో 205 మ్యాచ్‌లు ఆడి 30కి పైగా సగటుతో 5528 పరుగులు చేశాడు. చదవండి: IPL 2022 Auction: రైనా.. ధోని నమ్మకాన్ని కోల్పోయాడు, అందుకే ఈ పరిస్థితి..! -
IPL 2022 Auction: రైనా.. ధోని నమ్మకాన్ని కోల్పోయాడు, అందుకే ఈ పరిస్థితి..!
మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేష్ రైనాను ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయకపోవడం అందరిని ఆశ్చర్య పరిచింది. సీఎస్కే యజమాని శ్రీనివాసన్.. రైనాను పక్కకు పెట్టడానికి గల కారణాలను సైతం వివరించాడు. ఈ క్రమంలో చాలా మంది మాజీ క్రికెటర్లు రైనా అమ్ముడుపోకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఉన్నారు. తాజాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్.. రైనాపై ఏ జట్టు ఆసక్తి కనబర్చకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో వ్యక్తిగత కారణాల చేత కొన్ని మ్యాచ్ లకు, మోకాలికి శస్త్రచికిత్స కారణంగా మరి కొన్ని మ్యాచ్ లకు దూరమైన రైనా.. ఫామ్ లేమి కారణంగా ధోనితో పాటు సీఎస్కే యాజమాన్యం నమ్మకాన్ని కోల్పోయాడని, అందుకే అతన్ని తిరిగి జట్టులోకి తీసుకోలేదని, ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ యజమానే స్వయంగా వెల్లడించాడని గుర్తు చేశాడు. ఫామ్ లేమి కారణంగా ఓ ఆటగాడిని ఏ జట్టైనా ఇలా పక్కకు పెడితే, ఇతర జట్లు సదరు ఆటగాడిని కొనుగోలు చేసే సాహసం చేయవని ఓ క్రీడా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇదే కారణంతోనే రైనాను మెగా వేలంలో సీఎస్కే తో పాటు ఏ ఇతర జట్లు కొనుగోలు చేయలేదని సైమన్ డౌల్ అభిప్రాయపడ్డాడు. కాగా, రెండు సీజన్లు (2006,17) మినహా ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్కే కే ప్రాతినిధ్యం వహించిన రైనాకు ఈ సారి ఆ జట్టు రిటెన్షన్ జాబితాలో చోటు దక్కలేదు. వేలంలోనైనా సీఎస్కే అతన్ని దక్కించుకుంటుందని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. వయసు మీద పడటం, అంతంత మాత్రంగానే ఉన్న ఫామ్ కారణంగా అతనిపై ఇతర జట్లు కూడా ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఈ వెటరన్ బ్యాటర్ ఈ ఏడాది మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ట్రోఫీ గెలుచుకున్న జట్టులో సభ్యుడైన రైనా.. తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 205 మ్యాచ్‌లు ఆడి 30కి పైగా సగటుతో 5528 పరుగులు చేశాడు. చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు.. వేలంలో 7కోట్లు! -
IPL 2022: అందుకే రైనాను తీసుకోలేదు.. క్లారిటీ ఇచ్చిన సీఎస్కే
Suresh Raina: బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కొందరు స్టార్ ప్లేయర్స్ అన్ సోల్డ్ గా మిగిలిపోయారు. ఐపీఎల్ కెరీర్లోనే ది బెస్ట్ అనిపించుకున్న వారు సైతం కనీస ధరకు అమ్ముడు పోలేదు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ సురేశ్ రైనా అన్ సోల్డ్‌గా మిగిలిపోవడం క్రికెట్ ఫ్యాన్స్ ను, తమిళ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. Super Thanks for all the Yellove memories, Chinna Thala!🥺 #SuperkingForever 🦁 pic.twitter.com/RgyjXHyl9l — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) February 13, 2022 అయితే, వేలంలో రైనాను తీసుకోకపోవడంపై చైన్నై ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ సోమవారం స్పందించారు. ఆయన మాట్లాడుతూ..' సురేశ్ రైనా పన్నెండేళ్లుగా ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. కానీ, ప్రతీ ఆటగాడిని ఫామ్ ఆధారంగానే జట్టులోకి తీసుకోవడం జరుగుతుంది. అతన్ని కొనుగోలు చేయడం మాకు చాలా కష్టమైన విషయమని అర్థం చేసుకోవాలన్నారు. మా టీంకు అతను ఫిట్ కాదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. రైనాను మిస్ అవుతున్నామని తెలిపారు. మరోవైపు.. ఐపీఎల్లో తమ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన రైనా సేవలకు చెన్నై సూపర్‌కింగ్స్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపింది. చదవండి: IPL 2022: ధోని జట్టుపై గరం అవుతున్న సొంత అభిమానులు.. కారణం ఇదేనా..? -
వేలంలో వారికి పంట పండింది.. వీళ్లను అసలు పట్టించుకోలేదు
రెండురోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగావేలం విజయవంతంగా ముగిసింది. ఈసారి వేలంలో పెద్దగా మెరుపులు లేకపోయినప్పటికి కొందరు ఆటగాళ్లకు జాక్‌పాట్ తగిలితే.. కొందరిని అసలు పట్టించుకోకపోవడం విశేషం. మెగా వేలంలో అన్‌సోల్డ్ జాబితా కూడా పెద్దగానే ఉంది. టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా మొదలుకొని స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, ఇయాన్ మోర్గాన్, ఇషాంత్ శర్మ, తబ్రెయిజ్ షంసీ, కేదార్ జాదవ్, కొలిన్ గ్రాండ్‌హోమ్, గప్టిల్, కార్లోస్ బ్రాత్‌వైట్, పుజారా, హనుమ విహారి లాంటి కీలక ఆటగాళ్లవైపు కనీసం తొంగిచూడలేదు. సారీ సురేశ్ రైనా.. 205 మ్యాచ్‌లు... 5,528 పరుగులు... ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానం... అద్భుత ప్రదర్శనలతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర... ‘చిన్న తలా’ సురేశ్ రైనా సూపర్ కెరీర్ ముగిసినట్లే. వేలంలో రైనాను తీసుకోవడానికి చెన్నై సహా ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. ఇన్నేళ్లలో చెన్నైపై నిషేధం ఉన్న రెండేళ్లు మినహా (అప్పుడు గుజరాత్‌కు) మరే ఫ్రాంచైజీకి అతను ఆడలేదు. అతను రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడకపోవడం కూడా ప్రధాన కారణం. కనీసం బేస్‌ప్రైస్ వద్ద కూడా ఎవరూ పట్టించుకోలేదు. ►అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ఆల్‌రౌండర్‌గా పేరున్న షకీబ్ అల్ హసన్వైపు కూడా ఫ్రాంచైజీలు కన్నెత్తి చూడలేదు. కారణం షకీబ్ ఐపీఎల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవడమే. నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా పేరున్నప్పటికి షకీబ్ ఐపీఎల్లో పెద్దగా రాణించింది లేదు. ►ఇక ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ పరిస్థితి మరొకటి. పరిమిత, టెస్టు క్రికెట్లో మంచి పేరున్న స్మిత్ టి20 క్రికెట్లో అంతగా రాణించలేడనే ముద్ర ఉంది. నిలబడితే మెరుపులు మెరిపించే స్మిత్.. ఆరంభంలో ఎక్కువ సమయం తీసుకుంటాడు. టి20లకు ఇలాంటి ఆట సరిపోదు. ఐపీఎల్ లాంటి లీగ్‌ల్లో అస్సలు పనికిరాదు. గతేడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున స్మిత్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే ఈసారి స్మిత్‌ను ఏ ఫ్రాంచైజీ కొనడానికి ఆసక్తి చూపలేదు. ►గతేడాది ఐపీఎల్లో కేకేఆర్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ జట్టును ముందుండి నడిపించాడు. కెప్టెన్‌గా సక్సెస్ అయినప్పటికి.. బ్యాట్స్‌మన్‌గా విఫలమయ్యాడు. ఐపీఎల్లో కెప్టెన్సీ ఒక్కటే కాదు.. బ్యాటింగ్‌లోనూ మెరవాలి అన్న సంగతి మోర్గాన్ మరిచిపోయాడు. అందుకే ఈసారి వేలంలో ఫ్రాంచైజీలు అతన్ని మరిచిపోయాయి. ఏదైనా ఒక గొప్ప కెప్టెన్‌గా పేరున్న మోర్గాన్ ఐపీఎల్ కెరీర్ దాదాపు ఎండ్ అయినట్లే. ఆటగాళ్లకు జాక్‌పాట్.. విండీస్ ప్లేయర్లే ఎక్కువగా ఈసారి మెగావేలంలో అనూహ్య జాక్‌పాట్ కొట్టిన ఆటగాళ్ల సంఖ్య ఎక్కవే ఉంది. కాగా ఆ జాబితాలో విండీస్ ప్లేయర్లు ఎక్కువగా ఉండడం విశేషం. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్ లాంటి స్టార్ ఆటగాళ్లను మినహాయిస్తే వేలంలో కొందరు ఆటగాళ్లకు పంట పండిందనే చెప్పొచ్చు. విండీస్ ఆటగాళ్లు.. నికోలస్ పూరన్(రూ. 10 కోట్లు), ఓడియన్ స్మిత్(రూ. 6 కోట్లు), రొమెరియో షెఫర్డ్(రూ. 7.75 కోట్లు), జాసన్ హోల్డర్(8.75 కోట్లు), హెట్మైర్లకు (రూ. 8.50 కోట్లు) అనుకున్నదానికంటే ఎక్కువే దక్కింది. ఇక సింగపూర్ క్రికెటర్ టిమ్ డేవిడ్ కూడా(రూ. 8 కోట్లు) ఊహించని ధరకు అమ్ముడుకావడం విశేషం. -
అమ్ముడుపోని ఆటగాళ్లకు మరో చాన్స్ .. అదేంటంటే
ఐపీఎల్ మెగావేలంలో తొలిరోజు అన్‌సోల్డ్ జాబితా లిస్ట్ పెద్దదే. అయితే అందరిని షాక్‌కు గురి చేసిన విషయం ఏంటంటే సురేశ్ రైనా అమ్ముడుపోకపోవడం. ఒకప్పుడు ఐపీఎల్‌ను శాసించిన అతన్ని.. ఈసారి ఒక్క ఫ్రాంచైజీ కూడా పట్టించుకోలేదు. రూ. 2 కోట్ల బిడ్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన రైనా కోసం ఏ ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ చూపలేదు. బేస్‌ప్రైస్ వద్దే రిటైన్ చేసుకునే చాన్స్ ఉన్నా.. చెన్నై పట్టించుకోలేదు. యూఏఈలో జరిగిన ఎడిషన్‌లో అర్ధాంతరంగా తిరిగి రావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక రూ. 2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వచ్చిన స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా, స్టీవ్ స్మిత్, ఇమ్రాన్ తాహిర్, ఆదిల్ రషీద్, వేడ్, బిల్లింగ్స్, మహ్మద్ నబీ, డేవిడ్ మిల్లర్, సందీప్ లామిచానేను ఎవరూ పట్టించుకోలేదు. ఇండియా నుంచి ఉమేశ్ యాదవ్, అమిత్ మిశ్రా, సాహాపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. మరి వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లను మళ్లీ కొనుక్కునే అవకాశం ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే అన్‌సోల్డ్ ఆటగాళ్లకు మరో చాన్స్ ఉంది. వేలం జరిగేటప్పుడు లేదా ముగిసిన తర్వాత ఆయా ఫ్రాంచైజీలు యాక్సిలరేటెడ్ రౌండ కింద వీరిని రీకాల్ చేయవచ్చు. ఒకవేళ ఇందులోనూ ఎవరూ తీసుకోకుంటే మరో అవకాశం కూడా ఉంది. భవిష్యత్తులో ఏదైనా ఫ్రాంచైజీలో ఆటగాడు గాయపడితే వారి స్థానంలో అమ్ముడుపోని ఆటగాళ్లను తీసుకునే చాన్స్ ఉంటుంది. గతంలో విండీస్ హిట్టర్ క్రిస్ గేల్‌ను ఆర్సీబీ ఇదే పద్దతిలో జట్టులోకి తీసుకుంది. -
IPL 2022 Auction: సురేశ్ రైనా, స్మిత్, షకీబ్‌కు భారీ షాక్.. ఎందుకిలా?
Unsold Players In IPL 2022 Day 1: తొలిరోజు వేలంలో పలువురు ప్రముఖ క్రికెటర్లు అమ్ముడుపోలేదు. వేర్వేరు కారణాలతో ఫ్రాంచైజీలు వారిపై ఆసక్తి చూపించలేదు. వరల్డ్ నంబర్‌వన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)ను ఎవరూ పట్టించుకోకపోవడం మాత్రం అన్నింటికంటే ఆశ్చర్యకరం. ఆసీస్ దిగ్గజ ఆటగాడే అయినా టి20ల్లో పేలవ రికార్డు స్టీవ్ స్మిత్‌కు కలిసి రాలేదు. ఐపీఎల్లో కూడా అతను ఇన్నేళ్లలో ఎక్కువ ప్రభావం చూపలేకపోయాడు. ఐపీఎల్ స్టార్లలో ఒకడైన సురేశ్ రైనా ఆటకు దూరంగా ఉంటుండటం అతడిని తీసుకోకపోవడానికి కారణం. గత ఐపీఎల్ తర్వాత అతను మళ్లీ గ్రౌండ్‌లోకే దిగలేదు. టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్ర ఉండటం భారత పేసర్ ఉమేశ్ యాదవ్‌కు కలిసి రాలేదు. ఇక తమకంటూ గుర్తింపు ఉండి ఐపీఎల్ టీమ్‌లు పక్కన పెట్టినవారిలో ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా), ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), ముజీబ్ (అఫ్గానిస్తాన్), ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్), నబీ (అఫ్గానిస్తాన్), మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా), డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా), సామ్ బిల్లింగ్స్ (ఇంగ్లండ్) ఉన్నారు. ఫ్రాంచైజీలు కోరుకుంటే వీరిలో కొందరి పేర్లు నేడు మళ్లీ వేలంలో ఉంచవచ్చు. చదవండి: IPL 2022 Auction: వయసు 37.. ధర 7 కోట్లు.. ఆర్సీబీ సొంతం.. మంచి డీల్.. మా గుండె పగిలింది! IPL Mega Auction 2022: రూ.15.25 కోట్లు.. ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు -
మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం
Former Indian Cricketer Suresh Raina Father Passed Away.. టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట్లో తీవ్ర విషాధం నెలకొంది. రైనా తండ్రి త్రిలోక్‌చంద్ రైనా ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఘజియాబాద్‌లోని తన ఇంట్లో మృతి చెందారు. కాగా రైనా తండ్రి మిలటరీలో సేవలందించారు. బాంబులు తయారు చేయడంలో త్రిలోక్‌చంద్ రైనా దిట్ట. రైనా పూర్వీకులు జమ్మూ కశ్మీర్‌లోని రైనావారీ గ్రామానికి చెందినవారు. రైనా చిన్నతనంలోనే అతని కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాద్‌నగర్‌లో స్థిరపడ్డారు. ఇక సురేశ్ రైనా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీమిండియాలో ఒక దశాబ్ధం పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా కీలకపాత్ర పోషించాడు. టీమిండియా తరపున 226 వన్డేలు, 78 టి20లు, 18 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా రైనా పేరు సంపాధించాడు. రైనా ఐపీఎల్లో ఎక్కువకాలం సీఎస్కేకు ఆడాడు. ఈసారి రైనాను సీఎస్కే రిలీజ్ చేయడంతో ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న మెగావేలంలో ఏ జట్టు సొంతం చేసుకుంటుందో చూడాలి. వేలంలో రైనాను లక్నో సూపర్‌జెయింట్స్ సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: Under-19 World Cup Final: మనోడు ఎన్నాళ్లకెన్నాళ్లకు..ఒకే ఒక్కడిగా రికార్డు! Under-19 World Cup Final: 'నీ ఆట అమోఘం.. ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం' -
సన్‌రైజర్స్‌లోకి సురేష్ రైనా.. ధర ఎంతో తెలుసా?
ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం దగ్గరపడడంతో.. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని కొనుగోలు చేస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. రానున్న మెగా వేలంలో 1214 మంది ఆటగాళ్లు తమ పేర్లును నమోదు చేసుకున్నారు. అంతే కాకుండా ఈ ఏడాది నుంచి క్యాష్ రీచ్ లీగ్‌లో రెండు కొత్త జట్లు రావడంతో వేలానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఐపీఎల్-2022 మెగా వేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బీసీసీఐ నిర్వహించనుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. రానున్న సీజన్లో సన్‌రైజర్స్ హైదారాబాద్ తరుపున రైనా ఆడనున్నాడన్నదే ఆ వార్త సారాంశం. మెగా వేలంలో ఎలాగైనా రైనాను దక్కించుకోవాలని సన్ రైజర్స్ మేనేజ్మెంట్ భావిస్తోందట. కాగా గత కొన్ని సీజన్ల నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు సురేష్ రైనా ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2022 మెగా వేలం ముందు సీఎస్కే అతడిని రీటైన్ చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. ఇక గత సీజన్లో సురేష్ రైనాకు చెన్నై సూపర్ కింగ్స్ రూ. 11 కోట్లు చెల్లించింది. అయితే రానున్న వేలంలో అతడి కోసం రూ. 10 కోట్ల వరకైనా సరే ఖర్చు చేయాలని సన్ రైజర్స్ మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే వేలం పూర్తయ్యేంత వరకు వేచి చూడాల్సిందే! చదవండి: India Test captain: బ్యాటర్‌గా కోహ్లి మరిన్ని రికార్డులు బద్దలుకొడతాడు.. టెస్టు కెప్టెన్‌గా అతడే సరైనోడు: పాంటింగ్ -
"పుష్ప" పాటకు చిందేసిన టీమిండియా మాజీ క్రికెటర్.. తగ్గేదేలే అంటూ..!
Suresh Raina Dance For Srivalli Song: పాన్ ఇండియా మూవీ "పుష్ప" మేనియా క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తుంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్, ప్రముఖ టీమిండియా క్రికెటర్లు శిఖర్ ధవన్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు తగ్గేదేలే అంటూ పుష్ప సినిమా పాటలు, డైలాగులతో ఇరగదీశారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కూడా చేరాడు. పుష్ప సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ "చూపే బంగారమాయనే శ్రీవల్లి.." పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించాడు. రైనాతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా బన్నీ సాంగ్‌కు చిందేశారు. దీనికి సంబంధించిన వీడియోను రైనా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. బన్నీపై ప్రశంసల వర్షం కురిపించాడు. పుష్ప సినిమాను చూశానని, అందులో అల్లు అర్జున్ నటన అద్భుంతంగా ఉందని కొనియాడాడు. బన్నీ మన్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ.. తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. రైనా చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. రైనా ఫ్యాన్స్‌తో పాటు బన్నీ అభిమానులు లైక్‌లు, కామెంట్లతో సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. View this post on Instagram A post shared by Suresh Raina (@sureshraina3) కాగా, రైనా 2020 ఆగస్ట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రైనా భారత్ తరఫున 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. రైనా.. ఐపీఎల్ గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కీలక ఆటగాడిగా కొనసాగాడు. అయితే ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు సీఎస్కే అతన్ని రీటైన్ చేసుకోలేదు. దీంతో అతను 2 కోట్ల బేస్ ధర విభాగంలో వేలంలో పాల్గొననున్నాడు. 35 ఏళ్ల రైనా.. ఐపీఎల్లో 205 మ్యాచ్‌ల్లో 5528 పరుగులు చేశాడు. చదవండి: ఇన్ని రోజులు కెప్టెన్‌గా ఉన్నావు కాబట్టి నడిచింది.. ఇకపై కుదరదు..! -
IPL 2022 Mega Auction: ఈ నలుగురు క్రికెటర్లు అమ్ముడుపోవడం కష్టమే!
IPL 2022 Mega Auction: These 4 Indian Players Who May Go Unsold at Auction Is It: ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలను ప్రకటించిన ఫ్రాంఛైజీలు వేలంలో ఏ ఆటగాడిని కొనుగోలు చేస్తే ఎంత మేరకు ప్రయోజనం చేకూరుతుందన్న అంశంపై కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికర చర్చ తెరమీదకు వచ్చింది. వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయే భారత ఆటగాళ్లు వీళ్లేనంటూ కొంతమంది పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. PC: IPL సురేశ్ రైనా క్యాష్ రిచ్ లీగ్‌లో సురేశ్ రైనా రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అతడు నాలుగో స్థానంలో (5528) ఉన్నాడు ఈ టీమిండియా మాజీ క్రికెటర్. అయితే, గత సీజన్ నుంచి రైనా తన స్థాయి ప్రదర్శన కనబరచలేక చతికిలపడ్డాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఐపీఎల్-2021లోనూ తన మార్కు చూపలేకపోయాడు. కేవలం 160 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే అతడిని వదిలేసింది. కాగా ఒకప్పుడు గుజరాత్ లయన్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న రైనాపై జట్లు ఏ మేరకు ఆసక్తి చూపిస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. చదవండి: IPL 2022 Retention: వీళ్లను వదిలేశారు.. ఈ 11 మంది ఒకే జట్టులో ఉన్నారంటే రికార్డులు బద్దలే! అంబటి రాయుడు ఐపీఎల్-2021లో నిలకడగా ఆడలేకపోయిన అంబటి రాయుడు(13 ఇన్నింగ్స్‌లో 257 పరుగులు)ని సీఎస్కే వదిలేసింది. దీంతో అతడు వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. కాగా రాయుడు అనుభవజ్ఞుడైన ఆటగాడే అయినప్పటికీ.. ఫిట్నెస్, వయసు తనకు అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది. మరి మెగా వేలంలో రాయుడు అమ్ముడుపోతాడా అంటే కాలమే దానికి సమాధానం చెప్పాలి. PC: IPL హర్భజన్ సింగ్ టీమిండియా వెటరన్ ప్లేయర్ హర్భజన్ సింగ్‌ను మినీ వేలంలో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కానీ.. ఐపీఎల్-2021లో అతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఆడిన మూడు ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో కేకేఆర్ అతడిని వదిలేసింది. రాయుడిలాగే వయసు, ఫిట్నెస్ పరంగా చూసుకుంటే.. ఫ్రాంఛైజీలు భజ్జీని కొనుగోలు చేసే అవకాశం కనిపించడం లేదు. PC: IPL దినేశ్ కార్తిక్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ కెప్టెన్ దినేశ్ కార్తిక్‌ను ఆ జట్టు రిటైన్ చేసుకోని సంగతి తెలిసిందే. గత రెండు సీజన్లుగా డీకే పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అంతేగాక... అతడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడి చాలా రోజులైంది. కాబట్టి డీకేను కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపకపోవచ్చు. చదవండి: Shreyas iyer: అహ్మదాబాద్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..! రూ.15 కోట్లు ఆఫర్.. -
India Highest Totals: అప్పుడైతే ఏకంగా 218.. ఆ మ్యాచ్‌లో 186.. రైనా ఒక్కడే సెంచరీతో..
Highest totals for India in T20 World Cup: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా మొదటి విజయాన్ని నమోదు చేసిన విషయం విదితమే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి సేన నిర్ణీత 20 ఓవర్లలో 2 కోల్పోయి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్... 20 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేసి 66 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇది ఇలా ఉంటే... వరుస పరాజయాల తర్వాత టీమిండియాకు భారీ విజయం దక్కడంతో పాటు.. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ అత్యధిక స్కోర్లు నమోదు చేసిన సందర్భాలను పరిశీలిద్దాం. అప్పుడు ఏకంగా 218.. మొట్టమొదటి పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ 2007లో జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంగ్లండ్‌తో డర్బన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ధోని సేన 18 పరుగులతో విజయం సాధించింది. ఇక 2007 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అఫ్గనిస్తాన్‌తో ఇప్పుడు నవంబరు 3, 2021లో అబుదాబిలో జరిగిన అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి సేన 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో గెలుపొందింది. వెస్టిండీస్‌పై... టీ20 ప్రపంచకప్-2016 సెమీ ఫైనల్లో టీమిండియా వెస్టిండీస్‌తో తలపడింది. ఈ క్రమంలో 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. అయితే, పొలార్డ్ బృందం చెలరేగడంతో 7 వికెట్ల తేడాతో భారత్‌కు ఓటమి తప్పలేదు. లెండిల్ సిమన్స్ 82 పరుగులతో అజేయంగా నిలిచి విండీస్‌ను గెలుపు బాట పట్టించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీ20 వరల్డ్‌కప్-2007లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ధోని సేన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సెమీ ఫైనల్లో ఆసీస్‌తో తలపడిన టీమిండియా... యువరాజ్ సింగ్ చెలరేగడంతో 15 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 30 బంతుల్లో 70 పరుగులు చేసిన యువీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ విజయంతో ఫైనల్ చేరిన ధోని బృందం...పాకిస్తాన్‌ను మట్టి కరిపించి మొదటి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. 2010లో దక్షిణాఫ్రికాపై ప్రపంచకప్ టోర్నీ-2010లో భాగంగా సెయింట్ లూసియానాలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌తో టీమిండియా 180 పరుగుల పైచిలుకు స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి... 186 పరుగులు చేసింది. బౌలర్లు రాణించడంతో 172 పరుగులకే ప్రొటిస్‌ను కట్టడి చేసి.. 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇందులో వంద పరుగులు సురేశ్ రైనానే సాధించడం విశేషం. 60 బంతుల్లో 101 పరుగులు చేసి అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న రైనాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక టీ20 వరల్డ్‌కప్-2021లో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక స్కోర్లను పరిశీలిస్తే.. ►ఇండియా వర్సెస్ అఫ్గనిస్తాన్...అబుదాబి- టీమిండియా- 210/2. ►అఫ్గనిస్తాన్ వర్సెస్ స్కాట్లాండ్... షార్జా- అఫ్గనిస్తాన్-190/4. ►పాకిస్తాన్ వర్సెస్ నమీబియా.. అబుదాబి... పాకిస్తాన్- 189/2. ►బంగ్లాదేశ్ వర్సెస్ పపువా న్యూగినియా... ఏఐ అమెరట్- బంగ్లాదేశ్- 181/7. -సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం. చదవండి: IND Vs AFG: టీమిండియా విజయం.. ఐదు ఆసక్తికర విషయాలు -
రైనా సహా 'ఆ ముగ్గురి' ఖేల్ ఖతమైనట్టే..!
4 Players Who Might Go Unsold In IPL 2022 Auction: ప్రస్తుత ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఫామ్ లేమితో సతమతమవుతున్న నలుగురు విధ్వంసకర ఆటగాళ్ల ఐపీఎల్ కెరీర్లు దాదాపుగా సమాప్తమైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరంతా వచ్చేఏడాది ఐపీఎల్ కోసం నిర్వహించే మెగా ఆక్షన్ అమ్ముడుపోని సరుకులుగా మిగిలిపోయే అవకాశం ఉందని వారు జోస్యం చెబుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు, సీఎస్కే డాషింగ్ ప్లేయర్ సురేశ్ రైనా సహా ముగ్గురు విదేశీ విధ్వంసకర బ్యాటర్లు ఉంటారని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. విదేశీ బ్యాటర్ల లిస్ట్‌లో యూనివర్సల్ బాస్, పంజాబ్ కింగ్స్ బ్యాటర్ క్రిస్ గేల్ ముందువరుసలో ఉంటాడని, అతని వెనకాలే కోల్‌కతా నైట్‌రైడర్స్ సారధి, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆతరువాత రాయల్ ఛాలెంజర్స్ స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నలుగురితో పాటు గతేడాది ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన డానియల్ క్రిస్టియన్(ఆర్సీబీ-4.8 కోట్లు), రిలే మెరిడిత్(పంజాబ్ కింగ్స్-8 కోట్లు), జయ్‌దేవ్ ఉనద్కత్(రాజస్థాన్ రాయల్స్-3 కోట్లు), టామ్ కర్రన్(ఢిల్లీ క్యాపిటల్స్-5.25 కోట్లు), జై రిచర్డ్సన్(పంజాబ్ కింగ్స్-14 కోట్లు)లు కచ్చితంగా అమ్ముడుపోని జాబితాలో ఉంటారని అంచనా వేస్తున్నారు. పైన పేర్కొన్న ఆటగాళ్లనంతా ఆయా ఫ్రాంచైజీలు భారీ ధర వెచ్చింది కొనుగోలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో వారిపై వేటు తప్పకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. చదవండి: మోదీపై అమిత్ షా ప్రశంసలు.. వ్యంగ్యంగా స్పందించిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ -
వార్నర్‌కు పట్టిన గతే ఆ సీఎస్కే ఆటగాడికి కూడా పడుతుంది..!
Dale Steyn And Manjrekar Comments On Suresh Raina: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఫామ్ లేమితో సతమతమవుతున్న స్టార్ ఆటగాళ్లను ఉద్దేశించి దిగ్గజ ఫాస్ట్ బౌలర్, సఫారీ మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ కోల్పోతే ఎంతటి స్టార్ ఆటగాళ్లపై అయినా సరే వేటు తప్పదని.. ఇది డేవిడ్ వార్నర్ విషయంలో నిరూపితమైందని పేర్కొన్నారు. ఈ ఇద్దరు మాజీలు ముఖ్యంగా సీఎస్కే మిడిలార్డర్ బ్యాటర్ సురేశ్ రైనాను కార్నర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోని అండ చూసుకుని రైనా ఎన్ని రోజులు నెట్టుకొస్తాడని, అతన్ని జట్టులో నుంచి తప్పించే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. "I want MS Dhoni to play couple of more years for CSK" - Suresh Raina #WhistlePodu 📸- BCCI pic.twitter.com/LRnC36QDlJ — Chennai Super Kings Fans (@CskIPLTeam) September 29, 2021 ఇటీవలి కాలంలో రైనా స్కూల్ పిల్లాడిలా ఆడుతున్నాడని, అతని ఫామ్ ఇలాగే కొనసాగితే బహుశా ఇదే ఆఖరి ఐపీఎల్ కావచ్చని అన్నారు. సన్‌రైజర్స్‌కు అపురూప విజయాలు అందించిన వార్నర్‌ను ఆ ఫ్రాంచైజీ ఎలా అమర్యాదగా పక్కకు పెట్టిందో.. రైనాకు కూడా అదే గతి పట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ధోనిని సీఎస్కే కెప్టెన్‌గా కొనసాగించాలని ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా.. ఈ సీజనే రైనాకు ఆఖరిది అవుతుందని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రైనా 11 మ్యాచ్‌ల్లో కేవలం 157 పరుగులు మాత్రమే చేసి సీఎస్కే అభిమానులను దారుణంగా నిరాశపరిచాడు. అయితే ధోని నేతృత్వంలో సీఎస్కే జట్టు మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతూ తొలి ప్లే ఆఫ్ బెర్తు ఖరారు చేసుకుంది. చదవండి: ఆ మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయట..! -
Virender Sehwag: అతడు సరిగ్గా ఆడటం లేదని ధోనికి తెలుసు.. అయినా
Virender Sehwag Comments On Suresh Raina: చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా.. ఐపీఎల్-2021 సీజన్లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడాడు. సీఎస్కే ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ తుదిజట్టులో అతడికి చోటు దక్కింది. ఇక గురవారం నాటి విజయంతో చెన్నై ప్లే ఆఫ్స్ చేరే నాటికి.. సీజన్లో మొత్తంగా అతడు చేసిన పరుగులు 157. స్ట్రైక్‌రేటు 127.64. అయితే... తొలి దశలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగులు చేసిన రైనా.. ఆ తర్వాత మరీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక నిన్న (సెప్టెంబరు 30) హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు పూర్తిగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. కేవలం రెండు పరుగులు చేసి హోల్డర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ రైనా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే కెప్టెన్ ధోని... రైనా ఫామ్‌లో లేకపోయినా సరే.. అతడికి తుది జట్టులో అవకాశమిస్తాడని పేర్కొన్నాడు. అందుకు గల కారణాలు విశ్లేషిస్తూ... ‘‘రైనా సరిగ్గా ఆడటం లేదని ధోనికి తెలుసు. అయినప్పటికీ ఈ ఎడమ చేతి వాటం గల బ్యాటర్‌ను తుదిజట్టు నుంచి తప్పించే ఆలోచన చేయడు. రైనా 20-30 బంతులైనా ఎదుర్కోవాలి. కనీసం 10-20 పరుగులైనా చేయాలి. అప్పుడే మళ్లీ తనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తమ బ్యాటింగ్ ఆర్డర్ బాగుందని సీఎస్కేకు తెలుసు. శార్దూల్ ఠాకూర్ కూడా బ్యాట్‌తో రాణించగలగడం వారికి అదనపు బలం. Photo Courtesy: IPL/BCCI కాబట్టి వాళ్లు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిజానికి ప్లే ఆఫ్స్‌కు ముందే రైనా ఫాంలోకి రావాలని ధోని భావించాడు. కానీ.. అలా జరుగలేదు. అయినా, రైనా వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు ఒక్కసారి పుంజుకుంటే పరుగులు చేయడం అసాధ్యమైమీ కాదు’’ అని సెహ్వాగ్ క్రిక్‌బజ్‌తో పేర్కొన్నాడు. కాగా సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం రైనా జట్టుకు అవసరమైన సమయంలో తప్పక రాణిస్తాడంటూ అతడికి మద్దతు పలికిన విషయం తెలిసిందే. చదవండి: MS Dhoni: చాలు సామీ.. చాలు.. ఫినిషర్ ఇంకా బతికే ఉన్నాడు! -
అయ్యో రైనా.. వికెట్‌తో పాటు బ్యాట్‌ను విరగొట్టుకున్నాడు
దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సురేశ్ రైనా ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డుప్లిస్, మొయిన్ అలీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రైనా 6 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఫోర్‌తో మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన రైనా ఆ వెంటనే షార్ట్‌బాల్ బలహీనతకు బలయ్యాడు. బౌల్ట్ వేసిన షార్ట్ పిచ్ బంతిని రైనా భారీ షాట్‌కు యత్నించి రాహుల్ చహర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే రైనా పోతూ పోతూ తన బ్యాట్‌ను కూడా విరగొట్టుకొని వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. చదవండి: CSK VS MI: అప్పుడు అర్థ సెంచరీలు.. ఇప్పుడేమో డకౌట్లు ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఒక దశలో 10 పరుగుల లోపే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. చెన్నై స్కోరు కనీసం వంద పరుగులైనా దాటుతుందా అనే అనుమానం కలిగింది. తర్వాత వచ్చిన ధోని కూడా 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం చక్కని ఇన్నింగ్స్‌తో అలరించాడు. 57 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. జడేజా 26 పరుగులతో ఆకట్టుకున్నాడు. చివర్లో బ్రేవో 8 బంతుల్లో 23 పరుగులు చేశాడు. రుతురాజ్ మెరుపులతో సీఎస్కే గౌరవప్రదమైన స్కోరు సాధించింది. చదవండి: IPL 2021 Phase 2: సీఎస్కే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. pic.twitter.com/q3xIf3dLYZ — Simran (@CowCorner9) September 19, 2021 -
Viral Video: అక్కడ జాన్ సీనా అయితే ఇక్కడ సురేశ్ రైనా..
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సురేశ్ రైనా మైదానంలోనూ, వెలుపల ఫుల్ జోష్‌లో ఉంటాడు. ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌ల కోసం ప్రస్తుతం దుబాయ్‌లోని ప్రాక్టీస్ సెషన్లలో బిజీగా ఉన్న అతను.. తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనా మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, స్విమ్మింగ్ పూల్ వద్ద సహచరుడు కేఎమ్ ఆసిఫ్‌తో రైనా జాన్ సీనా స్టంట్‌ను ప్రదర్శిస్తాడు. దీనికి 'దట్ నేమ్ ఈజ్ జాన్ సీనా.. మై నేమ్ ఈజ్ సురేశ్ రైనా' అని క్యాప్షన్‌ను జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. రైనా అద్భుతంగా స్టంట్‌ను ప్రదర్శించాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. అదే రోజు సీఎస్కే జట్టు ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఇదిలా ఉంటే, ఈ సీజన్లో జరిగిన తొలి ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 2 పరాజయాలతో సీఎస్కే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా, ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 2 పరాజయాలతో టాప్‌లో కొనసాగుతోంది. అయితే, మొదటి 7 మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీ సహా కేవలం 123 పరుగులు మాత్రమే చేసిన రైనా.. చెన్నై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. చదవండి: ఆండర్సన్‌కు ఇదే ఆఖరి సిరీస్.. ఐదో టెస్ట్ అనంతరం రిటైర్మెంట్..? View this post on Instagram A post shared by Suresh Raina (@sureshraina3) -
Unmukt Chand: ఉన్ముక్త్ చంద్ రిటైర్మెంట్.. పెప్సీ యాడ్ వైరల్
ఢిల్లీ: భారత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ భారత్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను షాక్‌కు గురిచేశాడు. 28 ఏళ్ల వయసులోనే ఉన్ముక్త్ చంద్ గుడ్‌బై చెప్పడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. కాగా విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే భారత్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ఉన్ముక్త్ బీసీసీఐకి రాసిన లేఖలో తెలిపాడు. భారత క్రికెట్లో అవకాశాలు లేక యునైటెడ్ స్టేట్స్ మేజర్ లీగ్ క్రికెట్(ఎమ్మెల్సీ)తో మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇదిలా ఉంటే ఉన్ముక్త్ చంద్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతని పాత పెప్సీ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ యాడ్‌లో ఉన్ముక్త్ చంద్‌తో కలిసి ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, సురేశ్ రైనాలు ఉండడం విశేషం. ఇక యాడ్ విషయానికి వస్తే.. అండర్ 19 కెప్టెన్‌గా ఉన్న ఉన్ముక్త్ తన ప్రాక్టీస్ ముగించుకొని డ్రెస్సింగ్ రూమ్ వస్తుండగా.. అక్కడే సీనియర్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ చూస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగు ఫ్రిజ్‌లో పెప్సీ కనిపిస్తుంది. వెంటనే లోపలికి వెళ్లిన అతను పెప్సీ తాగుతుంటాడు. అప్పుడే ధోని వచ్చి మా పర్మిషన్ లేకుండా ఎలా వచ్చావు.. అని అడుగుతాడు. అప్పుడే సీన్లోకి కోహ్లి, రైనాలు కూడా ఎంటర్ అవుతారు. ఆ తర్వాత అందరు కలిసి ఉన్ముక్త్‌ను ఆట పట్టిస్తారు. చివరికి అందరు కలిసి పెప్సీ యాడ్‌కు ముగింపు పలుకుతారు. ఇక 2012 అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్ముక్త్ చంద్ (111 పరుగులు నాటౌట్) వీరోచిత సెంచరీతో భారత్‌కు కప్ అందించి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఇండియా- ఏకు కెప్టెన్‌గా ఎంపికైన ఉన్ముక్త్ 2015 వరకు జట్టును విజయవంతంగా నడిపించాడు. ఈ మధ్య కాలంలో అతని ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి 30 మంది ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే అతనికి ఇండియా జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. స్వతహాగా మంచి టెక్నిక్‌తో షాట్లు ఆడే ఉన్ముక్త్ ఆ తర్వాత ఎందుకనో మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన నమోదు చేయలేక వెనుకబడిపోయాడు. ఇక ఉన్ముక్త్ చంద్ 65 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 3379 పరుగులు, 120 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 4505 పరుగులు, ఇక టీ20 క్రికెట్లో 77 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన చంద్ 1565 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ ఆడిన ఉన్మక్త్ చంద్ 21 మ్యాచ్‌ల్లో 300 పరుగులు సాధించాడు. -
జడేజా ఆసక్తికర ట్వీట్; నెటిజన్ల ఆగ్రహం
లండన్: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురువారం తమ సంస్కృతికి సంబంధించి ట్విటర్లో షేర్ చేసిన విషయం ఆసక్తికరంగా మారింది. క్రికెట్లో జడేజా సెంచరీ, అర్థసెంచరీ లేదా ఏదైనా మైల్స్టోన్ సాధించినప్పుడు తన బ్యాట్‌ను ఖడ్గంలా తిప్పడం చాలాసార్లే చూసి ఉంటాం. స్వతహాగా రాజ్‌పుత్ వంశీయులు తమ ఆచారంలో భాగంగా వేడుకల్లో ఖడ్గాన్ని తిప్పడం చూస్తుంటాం. జడేజా కూడా తమ సంస్కృతిలో భాగంగానే తమ సంప్రదాయాన్ని గుర్తుచేసుకుంటానని చాలాసార్లు చెప్పుకొచ్చాడు. అయితే తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2021 సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా బుధవారం కామెంటేటరీ సమయంలో ''నేను బ్రాహ్మిణ్‌నే'' అంటూ కామెంట్ చేయడం వివాదాస్పదంగా మారింది. రైనా తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రైనాకు మద్దతుగా జడేజా ట్వీట్ ఉన్నట్లు అర్థమవుతుంది. '' ఐయామ్ జడేజా.. రాజ్‌పుత్ బాయ్ ఫర్ఎవర్.. జై హింద్'' అంటూ జడేజా ట్వీట్ చేశాడు. అయితే నెటిజన్లు మాత్రం జడేజాను ఏకిపారేశారు. '' ఒక ఆటగాడిగా మీరు ఎంతోమందికి ఆదర్శం. మీలాంటి వ్యక్తి నుంచి ఇలాంటివి మేము ఊహించలేదు. మతం, కులం, రంగు ఇవి మనకు ముఖ్యం కాదు.. ఒక రాజ్‌పుత్ అని చెప్పుకోవడం మంచి విషయమే.. కానీ ఒక హూమన్ యాంగిల్లో ఇలాంటి ట్వీట్స్ చేయడం తప్పు.. వ్యక్తులను వర్గాలుగా చూడడం కంటే సాటి మనిషిగా గౌరవిస్తే మంచిది.. ముందు మనం భారతీయులు.. ఆ తర్వాత ఈ కులాలు, మతాలు వచ్చాయి'' అంటూ కామెంట్లు చేశారు. కాగా ప్రస్తుతం జడేజా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 4 నుంచి జరగనుంది. కాగా కౌంటీ ఎలెవెన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో జడేజా అర్థసెంచరీతో పాటు బంతితోనూ వికెట్లు తీసి మెరిశాడు. #RAJPUTBOY FOREVER. Jai hind🇮🇳 — Ravindrasinh jadeja (@imjadeja) July 22, 2021 -
సురేశ్ రైనా వివాదాస్పద వ్యాఖ్యలు; ఉతికారేస్తున్న నెటిజన్లు
చెన్నై: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)కు రైనా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ ఇస్తూ అక్కడి సంస్కృతిపై మాట్లాడుతూ నోరు జారాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్కేతోనే ఉన్న రైనాను తన సహచర కామెంటేటర్ చెన్నై సంస్కృతి గురించి అడిగాడు. దీనిపై రైనా స్పందింస్తూ.. '' నేను కూడా బ్రాహ్మిణ్‌ను అనుకుంటున్నా. 2004 నుంచి చెన్నై జట్టుకు ఆడుతున్నా. అనిరుద్ధ శ్రీకాంత్, బద్రినాథ్, బాలాజీలతో కలిసి ఆడాను. ఇక్కడి సంస్కృతి అంటే నాకు చాలా ఇష్టం. ఇక నా జట్టు సహచరులు అంటే చెప్పలేనంత అభిమానం. సీఎస్కే జట్టులో మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది.. అది ఎంతలా అంటే మాకు చాలా స్వేచ్చ దొరుకుతుంది. సీఎస్కే జట్టులో భాగం కావడం సంతోషంగా ఉంది '' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రైనా చేసిన కామెంట్స్ దుమారాన్ని లేపాయి. చెన్నై అంటే కేవలం బ్రాహ్మిణ్లే ఉంటారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. '' రైనా ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గుపడాలి. ఇన్నేళ్లుగా చెన్నైకి ఆడుతున్నావు.. నువ్వు నిజమైన చెన్నై సంస్కృతిని చూసినట్లు లేవు'' అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం రైనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఇక గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉన్న రైనా ఈ సీజన్‌కు మాత్రం సీఎస్కే తరపున ఆడాడు. ఈ సీజన్లో సీఎస్కే తరపున 7 మ్యాచ్‌లాడి 123 పరుగులు చేశాడు. గతేడాది ఫేలవ ప్రదర్శన కనబరిచిన సీఎస్కే ఈసారి మాత్రం దుమ్మురేపింది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక సురేశ్ రైనా 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. What the heck @ImRaina sir.. you shouldn’t use that word ….. https://t.co/v8AD1Cp0fT pic.twitter.com/TltPoMbYec — udayyyyyy 👨🏻💻👨🏻💼👨🏻🍳🏋️ (@uday0035) July 19, 2021 So watched the video, I once liked Raina very much and now im sad how ignorant or he has been hiding all these days. Lost it! No more respect — vijay renganathan (@MarineRenga) July 20, 2021 -
ఈ సారి ఐపీఎల్ టైటిల్ అతని కోసం గెలుస్తాం: రైనా
భారత జట్టు మాజీ కెప్టన్ మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనాకు ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా ధోని అంటే ఎంతో గౌరవమని పలు సందర్భాల్లో చెప్పడమే గాక చేతల్లోను చూపించాడు రైనా. తాజాగా ఈ చిన్న తలా ఓ స్పోర్ట్స్ చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో మరో సారి వారి బంధానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం నుంచి, చైన్నై టీంకు పలు టైటిళ్లు గెలుచుకోవడం వరకు, రైనా, ధోనిలు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సురేష్ రైనా మాట్లాడుతూ.. మేం భారత్, చెన్నై తరపున ఎన్నో మ్యాచ్‌లు కలిసి ఆడాం. ఆటగాడిగా ధోని అంటే నాకు ఎంతో గౌరవం ఉంది, అలానే వ్యక్తిగతంగా అతనంటే నాకిష్టం కూడా. నేను అతని నుంచి చాలా నేర్చుకున్నా. ధోనీని నా సహచరుడిలా కాకుండా సోదరుడిలా భావించే వాడినని తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ ధోని కోసం గెలవాలనుకుంటున్నట్లు చెప్పాడు. గత సీజన్ వైఫల్యాలను పునరావృతం కాకుండా రాబోయే ఐపీఎల్ సీజన్లో మా జట్టు మంచి ప్రదర్శనే కనబరుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. మా జట్టుకు ప్రధాన బలంగా చెప్పుకోదగిన వాటిలో ధోని కెప్టెన్సీ ఒకటని చెప్పుకొచ్చాడు. టీంలో మోయిన్ ఆలీ , సామ్ కరన్, బ్రావో లాంటి ప్లేయర్లు గతంలో యూఏఈ లో ఆడినందు వల్ల వారి అనుభవం పనికొస్తుందని చెప్పుకొచ్చాడు. గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ సీజన్లో చెన్నై పేలవ ప్రదర్శన కనబరిచినా తిరిగి ఈ ఏడాది తిరిగి బౌన్స్ అయిన సంగతి తెలిసిందే. -
రైనా మేనమామ హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మేనమామ అశోక్ కుమార్, అతని కుమారుడు కౌశల్ కుమార్ గతేడాది హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇదివరకే 11 మంది నిందితులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకోగా, తాజాగా ప్రధాన నిందితుడు చజ్జూ అలియాస్ చైమార్‌ను ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని చైమార్ తెగకు చెందిన దోపిడీ దొంగల ముఠాలకు నాయకుడైన చజ్జూ.. యూపీ సహా పలు రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యాకాండలకు తెగబడినట్టు పోలీసులు గుర్తించారు. బరేలీ ప్రాంతంలోని బహేదిలో నివసించే అతను అక్కడ్నించే తన ముఠాను నడిపిస్తుంటాడు. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎస్టీఎఫ్ పోలీసులు చజ్జూను అరెస్ట్ చేసి పంజాబ్ పోలీసులకు అప్పగించారు. కాగా, గతేడాది ఆగస్ట్ 19న పంజాబ్‌లోని థరియాల్ గ్రామంలో అశోక్ కుమార్ నివాసంలోకి దోపిడీ దొంగలు చొరబడి అతని కుటుంబసభ్యులపై దాడి చేశారు. బీఎస్ఎఫ్ కాంట్రాక్టర్‌గా విధులు నిర్వహించే అశోక్ కుమార్.. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దోపిడీ దొంగలు కర్రలతో తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అతని భార్య, మరో కుటుంబ సభ్యుడు చావుబతుకులలో పోరాడి కోలుకోగా, కుమారుడు కౌశల్ కుమార్ ప్రాణాలు విడిచాడు. అప్పట్లో ఈ హత్య ఘటనతో దిగ్భ్రాంతికి గురైన సురేశ్ రైనా ఐపీఎల్ ఆడకుండా యూఏఈ నుంచి హుటాహుటిన భారత్‌కు వచ్చేశాడు. తన బంధువుల ఇంట్లో జరిగిన ఘాతుకంపై దర్యాప్తు జరిపించాలంటూ పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్‌కు విజ్ఞప్తి చేశాడు. -
ఐసీసీ ట్రోఫీ దాకా ఎందుకు.. కోహ్లి ఇంకా ఐపీఎల్ కప్ కూడా గెలవలేదు!
న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు సృష్టించి పరుగుల యంత్రంగా గుర్తింపు పొందాడు. అటు కెప్టెన్‌గానూ కోహ్లికి మంచి రికార్డే ఉన్నా... ఇంతవరకు ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా సాధించలేకపోయాడనే లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. టెస్టు క్రికెట్లో భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించిన కోహ్లి సారథ్యంలోని జట్టు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంటుందని అభిమానులు భావించినా చివరకు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో కోహ్లి కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి గొప్ప కెప్టెన్ అని, ఐసీసీ ట్రోఫీ గెలిచేందుకు ఇంకాస్త సమయం పడుతుందన్నాడు. ‘‘సారథిగా తన సత్తా ఏంటో రికార్డులే చెబుతాయి. నాకు తెలిసి ఈ ప్రపంచంలో తనే నెంబర్ 1 బ్యాట్స్‌మెన్. చాలా మంది ఐసీసీ టైటిల్ గురించి మాట్లాడుతున్నారు.. కానీ అతడు ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవలేదు. నిజం చెప్పాలంటే.. వెనువెంటనే కోహ్లి సేన మూడు మేజర్ టోర్నీలు ఆడింది. ఫైనల్ చేరింది. కానీ తుదిపోరులో తృటిలో విజయం చేజారింది. అయినా, ప్రతిసారీ ఇలా ఫైనల్ వరకు చేరడం అంత సులభమేమీ కాదు. కోహ్లికి ఇంకాస్త సమయం ఇవ్వాలి’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక కొంతమంది నెటిజన్లు టీమిండియాను చోకర్స్ అని పిలవడం పట్ల స్పందిస్తూ.. ‘‘మేం చోకర్స్ కాదు. 1983 వన్డే వరల్డ్ కప్, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచాం. ప్రతీ విజయం వెనుక ఆటగాళ్ల కఠిన శ్రమ ఉంటుంది. చోకర్స్ అని పిలవడం సరికాదు’’ అని రైనా పేర్కొన్నాడు. ఇక 2014లో టెస్టు, 2017లో పరిమిత ఓవర్ల క్రికెట్ పగ్గాలను కోహ్లి చేపట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు... ఇంతవరకు ఒక్కసారి టైటిల్ సాధించలేకపోయాడు. -
మహేంద్రుడికి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ.. రైనా ఎమోషనల్ ట్వీట్
న్యూఢిల్లీ: టీమిండియా దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 40వ పుట్టిన రోజు సందర్భంగా యావత్ క్రికెట్ ప్రపంచం శుభాకాంక్షలు తెలిపింది. ఐసీసీ మొదలుకొని బీసీసీఐ, పలు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, దిగ్గజ ఆటగాళ్లు, ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, అభిమానులు ఇలా దాదాపు ప్రతి ఒక్కరు ధోనీని పొగడ్తలతో ముంచెత్తుతూ బర్త్‌డే విషెస్ తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా వీరంతా ధోనీకి శుభాకాంక్షలు తెలుపుతూ, క్రికెట్ దిగ్గజంతో తమకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ధోనీకి విషెస్ చెప్తూ.. 2011 వన్డే ప్రపంచకప్ నాటి ఫొటోని షేర్ చేశాడు. ‘హ్యాపీ బర్త్‌డే కెప్టెన్’ అంటూ క్యాప్షన్ జోడించాడు. కాగా, 2017లో ధోనీ నుంచి పూర్తిస్థాయి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కోహ్లీ.. ధోనీ ఎప్పటికీ నా కెప్టెన్ అని పలు సందర్భాల్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. A colleague, captain & friend! Happy Birthday, Mahi. Wishing you a wonderful year ahead full of joy and good health. pic.twitter.com/uyeqtBm7UW — Sachin Tendulkar (@sachin_rt) July 7, 2021 ఇక సచిన్ ట్వీట్ చేస్తూ.. నా సహచరుడు, నా కెప్టెన్, నా మిత్రుడు హ్యాపీ బర్త్‌డే మాహీ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. A legend and an inspiration! 🙌 🙌 Here's wishing former #TeamIndia captain @msdhoni a very happy birthday. 🎂 👏#HappyBirthdayDhoni pic.twitter.com/QFsEUB3BdV — BCCI (@BCCI) July 6, 2021 ధోనీ ఓ క్రికెట్ దిగ్గజం, భవిష్యత్తు తరాలకు ప్రేరణ.. అంటూ బీసీసీఐ విషెస్ చెప్పగా, కెప్టెన్ కూల్‌కు బర్త్‌డే విషెస్ అంటూ ఐసీసీ ట్వీటింది. Super Birthday to Namma #Thala @msdhoni 😍 The one, the only one, now and forever who makes 💛 go 𝒯𝒽𝒶𝓁𝒶 𝒯𝒽𝒶𝓁𝒶! #THA7A #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/8U9BoJDLrZ — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) July 6, 2021 ఇక ధోనీ ఐపీఎల్ జట్టైన చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేస్తూ.. సూపర్ బర్త్‌డే టు నమ్మ తలా.. వన్, ద ఓన్లీ వన్ ఎంఎస్ ధోనీ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. Wishing you a very happy birthday @msdhoni You have been a friend, brother & a mentor to me, all one could ever ask for. May God bless you with good health & long life! Thank you for being an iconic player & a great leader.#HappyBirthdayDhoni ❤️🙌 pic.twitter.com/qeLExrMonJ — Suresh Raina🇮🇳 (@ImRaina) July 6, 2021 నా సోదరుడు, నా ఫ్రెండ్, నా మెంటర్ ఎంఎస్‌డీకి పుట్టిన రోజు శుభాంకాంక్షలంటూ ధోనీ సీఎస్కే సహచరుడు సురేశ్ రైనా ట్వీట్ చేశాడు. No. 7, you'll always be everyone's No. 1 💛💗#HappyBirthdayMSDhoni | @msdhoni pic.twitter.com/YF1CZLetki — Rajasthan Royals (@rajasthanroyals) July 7, 2021 Happy birthday @msdhoni bhai, have a wonderful birthday and an even better year ahead. 🎂🎂 — Mask up and take your vaccine🙏🙏🇮🇳 (@ashwinravi99) July 7, 2021 ఇలా ధోనీని విష్ చేసిన వారిలో రాజస్థాన్ రాయల్స్, ఇషాంత్ శర్మ, మహ్మద్ కైఫ్, అశ్విన్, హార్ధిక్ పాండ్యా, చహల్, ఉమేశ్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దిగ్గజ క్రికెటర్లు లక్ష్మణ్, సెహ్వాగ్, వసీం జాఫర్ తదితరులున్నారు. Wishing @msdhoni a very joyful birthday. May he experience ever more love and joy and continue to inspire in the times to come.#HappyBirthdayMSDhoni pic.twitter.com/XfFCxW0qDY — VVS Laxman (@VVSLaxman281) July 7, 2021 Mahendra - meaning Lord of the Sky. Certainly pleased the skies with his big hitting when he bust onto the scene and then by earning the love of so many people on earth pleased the earth as well. Once in a generation player , #HappyBirthdayMSDhoni pic.twitter.com/COuu9X2s6L — Virender Sehwag (@virendersehwag) July 7, 2021 -
బయోపిక్: మనసులో మాట బయటపెట్టిన సురేశ్ రైనా
ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల వచ్చిన మహనటి సావిత్రి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళ, కన్నడ, హిందీ పరిశ్రమల్లో కూడా ప్రముఖుల బయోపిక్‌లు తెరకెక్కనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా బయోపిక్‌పై కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో హిందీలో భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్య్వూలో సురేశ్ రైనాకు తన బయోపిక్‌పై ఓ ప్రశ్న ఎదురైంది. సౌత్‌లో మీ బయోపిక్ తీస్తే అందులో ఏ నటుడు నటించాలని అనుకుంటున్నారని యాంకర్ ప్రశ్నించగా వెంటనే రైనా స్పందిస్తూ.. హీరో సూర్య నటిస్తే బాగుంటుందని సమాధానం ఇచ్చాడు. అంతేగాక సూర్య నటన బాగుంటుందని, పాత్రలకు అనుగుణంగా తన శైలిని మార్చుకుంటూ తనదైన నటనను కనబరుస్తాడని, అందుకే ఈ బయోపిక్‌లో సూర్య అయితే తన పాత్రకు కరెక్ట్‌గా సరిపోతాడంటూ రైనా చెప్పుకొచ్చాడు. కాగా టిమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సారధ్యంలో వన్డేల్లో అరంగేట్రం చేసిన రైనా టీమిండియా తరపున 18 టెస్టుల్లో 768 పరుగులు, 226 వన్డేల్లో 5615 పరుగులు, 78 టీ20ల్లో 1605 పరుగులు సాధించాడు. టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించి తొలి భారత ఆటగాడిగా రైనా రికార్డు సృష్టించాడు. ఇక సూర్య విషయానికి వస్తే ఇటీవల అతడు నటించిన ఆకాశం నీహద్దురా సినిమాతో సూపర్ హిట్‌ను అందుకున్నాడు. కొంతకాలంగా సక్సెస్ లేని సూర్యకు ఈ మూవీ ఘనవిజయాన్ని అందించింది. ప్రస్తుతం సూర్య సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సూర్య 40వ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. ఈ మూవీలో సూర్యకు జోడీగా నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు తెలుగు నేరుగా ఎంట్రీ ఇచ్చేందుకు కూడా సూర్య సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై తెలుగు అగ్ర దర్శకులతో సూర్య చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. " If my biopic is made, someone from south may be my favorite @Suriya_offl can do the role" - @ImRaina 💙#Suriya40 | #VaadiVaasal | #Suriya pic.twitter.com/bWUqTHBoN2 — Trends Suriya™ (@Trendz_Suriya) June 24, 2021 చదవండి: టాలీవుడ్ ఎంట్రీకి సూర్య రెడీ.. ఆ దర్శకుడుతో సెట్ అయ్యేనా! -
అసభ్య పదజాలంతో రైనా టీషర్ట్, చీవాట్లు పెట్టిన ద్రవిడ్
న్యూఢిల్లీ: అసభ్య పదజాలంతో ఉన్న టీ షర్ట్ ధరించినందుకు నాటి భారత కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తనకు చివాట్లు పెట్టాడని టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కీలక సభ్యుడు సురేశ్ రైనా గుర్తు చేసుకున్నాడు. తన ఆత్మ కథ 'బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మి'లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేటప్పుడు హుందాగా వ్యవహరించాలని ద్రవిడ్ తనకు క్లాస్ పీకినట్లు రైనా వెల్లడించాడు. తాను ధరించిన టీ షర్ట్‌పై 'FCUK' అన్న పదం రాసుందని, దాన్ని చూడగానే ద్రవిడ్ కోపడ్డాడని పేర్కొన్నాడు. అయితే ద్రవిడ్ హెచ్చరించగానే ఆ టీ షర్ట్‌ను చెత్తబుట్టలో పడేసి మరొకటి ధరించానని రైనా తన ఆత్మ కథలో రాసుకున్నాడు. ద్రవిడ్ సారధ్యంలో వన్డేల్లో అరంగేట్రం చేసిన రైనా.. 2006 మలేషియా పర్యటనలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తన ఆత్మకథలో ప్రస్తావించాడు. అయితే ఈ విషయంలో ద్రవిడ్ స్పందించిన తీరు తనను బాగా కదిలించిందని, అప్పటి నుంచి తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. భారత క్రికెటర్లు హందాగా ఉండాలన్నదే ద్రవిడ్ ఉద్దేశమని, మన వేషధారణ బట్టే మన దేశాన్ని గౌరవిస్తారని ద్రవిడ్ చెప్పిన మాటలు ఎప్పటికీ తనను అలర్ట్ చేస్తుంటాయని పేర్కొన్నాడు. అయితే ఎప్పుడూ రిజర్వ్డ్గా ఉండే ద్రవిడ్‌ను నవ్వుతూ చూడాలన్నదే తన కోరికని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, రైనా టీమిండియా తరపున 18 టెస్టుల్లో 768 పరుగులు, 226 వన్డేల్లో 5615 పరుగులు, 78 టీ20ల్లో 1605 పరుగులు సాధించాడు. టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించి తొలి భారత ఆటగాడిగా రైనా రికార్డు సృష్టించాడు. ఇక, గతేడాది ఆగస్టు 15న ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: WTC Final: విజేతకు భారీ ప్రైజ్‌మనీ -
'ఫ్యామిలీ మ్యాన్-3'కి ప్రిపేర్ అవుతున్నావా బ్రో..
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సురేశ్ రైనా.. తన ఐపీఎల్ సహచరుడు, సీఎస్కే బౌలర్ దీపక్ చాహర్‌పై ఫన్నీ కామెంట్స్ చేశాడు. చాహర్.. తాజాగా తన న్యూలుక్‌కి సంబంధించిన ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేయగా, రైనా స్పందించాడు. ఈ ఫోటోలో చాహర్.. ప్రముఖ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్-2లో టెర్రరిస్ట్ క్యారెక్టర్‌ను పోలి ఉన్నాడని, ఫ్యామిలీ మ్యాన్ పార్ట్ 3 ఆన్ ద వే అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం రైనా చేసిన ఈ కామెంట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. మరోవైపు చాహర్ అభిమానులు కూడా తమదైన శైలిలో స్పందించారు. ఫ్యామిలీ మ్యాన్-2లో లీడ్ రోల్ శ్రీకాంత్.. ఫ్యామిలీ అడ్వైజర్‌ను కలిసే సీన్ చాహర్‌కు సరిపోతుందంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే చాహర్.. గజినీలో ఆమీర్ ఖాన్‌ను పోలి ఉన్నాడంటున్నారు. ఇదిలా ఉంటే, దేశంలో ప్రస్తుతం 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ మేనియా నడుస్తోంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా విడుదలైన ఈ వెబ్ సిరీస్.. విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకుంటుంది. ఫ్యామిలీ మ్యాన్-2లో టాలీవుడ్ హీరోయిన్ సమంతా కీలక పాత్ర పోషించింది. నెగటీవ్ రోల్ అయినప్పటికీ.. రాజీ పాత్రలో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సెకండ్ సీజన్‌ను తమిళులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను కించపరిచే సీన్లున్నాయని, అందకే ఈ సినిమాను నిషేధించాలని వారు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఈ వెబ్ సిరీస్‌ను తెలుగు వారు, చిత్తూరు జిల్లాకు చెందిన రాజ్ అండ్ డీకే(రాజ్ నిడిమోరి, దాసరి కృష్ణ) డైరెక్ట్ చేశారు. ఇదిలా ఉంటే, కరోనా వైరస్ నేపథ్యంలో ఫ్యామిలీ మ్యాన్ మూడో పార్ట్ కూడా రానుందని తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 2021 సీజన్ అర్థంతరంగా వాయిదా పడటంతో సురేశ్ రైనా, దీపక్ చాహర్ ఇంటికే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో చాహర్‌కు చోటు దక్కలేదు. అయితే జూలైలో శ్రీలంకలో పర్యటించనున్న భారత బి జట్టులో అతనికి చోటు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. చదవండి: విశ్వనాథన్ ఆనంద్‌తో తలపడనున్న ఆమీర్ ఖాన్.. ఎందుకో తెలుసా? -
రైనా ఫాలో అయ్యే స్టార్ హీరో ఎవరో తెలుసా?
ముంబై: సురేశ్ రైనా.. టీమిండియా తరపున 15 ఏళ్ల పాటు(2005-2020) అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. జట్టులోకి వచ్చిన అనతి కాలంలోనే మంచి బ్యాట్స్‌మన్‌గా పేరుపొందిన రైనా టీమిండియాకు ఎన్నో కీలక విజయాలు అందించాడు. అంతేగాక రైనాలో మంచి ఫీల్డర్ ఉన్నాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రైనాకు ఆటతో పాటు సినిమాలంటే కూడా ఇష్టమని చాలా ఇంటర్య్వూల్లో పేర్కొన్నాడు. అయితే తాను ఒక్క హీరోను మాత్రమే ఇష్టపడతానని.. అతని సినిమాలు తప్ప వేరేవి చూడడని కొన్ని సందర్భాల్లో రైనా చెప్పుకొచ్చాడు. స్వతహాగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే రైనా అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటాడు. అతనికి ట్విటర్లో 18.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. రైనా మాత్రం 894 మందిని మాత్రమే ఫాలో అవుతాడు. ఆ 894 మందిలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కూడా ఉన్నాడు. రైనాకు సుదీప్ అంటే ప్రాణం.. అతని యాక్టింగ్ నచ్చి వీరాభిమానిగా మారిపోయిన రైనా అతని సినిమాలను మిస్ కాకుండా చూస్తాడు. కాగా టీమిండియా తరపున రైనా 18 టెస్టుల్లో 768 పరుగులు, 226 వన్డేల్లో 5615 పరుగులు, 78 టీ20ల్లో 1605 పరుగులు సాధించాడు. టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించి తొలి ఇండియన్ ఆటగాడిగా రైనా రికార్డు సృష్టించాడు. కాగా గతేడాది ఆగస్టు 15న ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే రైనా తన క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పడం విశేషం. కాగా 2011లో ప్రపంచకప్ సాధించిన జట్టులో రైనా సభ్యుడు. ఇక గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌కు దూరంగా ఉన్న రైనా ఈ సీజన్‌కు మాత్రం అందుబాటులోకి వచ్చాడు. ఐపీఎల్ 14వ సీజన్లో సీఎస్కే తరపున 7 మ్యాచ్‌లాడి 123 పరుగులు సాధించాడు. అయితే కరోనా సెగతో లీగ్‌ను బీసీసీఐ మధ్యలోనే రద్దు చేసింది. చదవండి: 'మీరు చేస్తుంది గొప్ప పని.. అది నాకు కోపం తెప్పించింది' -
క్రికెటర్ పియూష్ చావ్లా ఇంట విషాదం
న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ బౌలర్, ముంబై ఇండియన్స్ క్రికెటర్ పీయూష్ చావ్లా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన, సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పీయూష్ చావ్లా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తన తండ్రి ఫొటోను ఇందుకు జత చేసిన పీయూష్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాల్సిందిగా కోరాడు. ‘‘ఆయన లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. పరిస్థితులు ఇంతకు ముందులా ఉండబోవు. నా అండను కోల్పోయాను’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా టీ20 వరల్డ్ కప్-2007, వన్డే వరల్డ్ కప్-2011 టీమిండియాలో సభ్యుడైన పియూష్.. ఐపీఎల్లో తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, ఈ ఏడాది మినీ వేలంలో భాగంగా ముంబై ఇండియన్స్ 2.40 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ స్పిన్నర్‌ను సొంతం చేసుకుంది. కానీ, ఈ సీజన్లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఇక కరోనా విజృంభణ నేపథ్యంలో ఐపీఎల్-2021 నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. రైనా సంతాపం పియూష్ చావ్లా తండ్రి మృతి పట్ల చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా సంతాపం ప్రకటించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాడు. ఇక ముంబై ఇండియన్స్ సైతం.. ‘ ఈ విషాదకరమైన సమయంలో తనకు, తన కుటుంబానికి మా పూర్తి మద్దతు ఉంటుంది’’ అని ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. చదవండి: చేతన్ సకారియా ఇంట మరో విషాదం Our thoughts go out to Piyush Chawla who lost his father, Mr. Pramod Kumar Chawla this morning. We are with you and your family in this difficult time. Stay strong. pic.twitter.com/81BJBfkzyv — Mumbai Indians (@mipaltan) May 10, 2021 -
Mother's Day: వైరలవుతున్న క్రికెటర్ల పోస్టులు
ముంబై: కన్నతల్లి అంటే ఎవరికి ప్రేమ ఉండదు చెప్పండి. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు ఏ ప్రేమకైనా దూరంగా ఉంటాడేమో కానీ కన్నతల్లి ప్రేమ నుంచి దూరంగ ఉండలేడు. తన సంతోషం కన్నా బిడ్డల సంతోషాన్ని కోరుకునే గొప్ప మానవతావాది అమ్మ. అందుకే ప్రపంచంలో అమ్మ ఎవరికైనా అమ్మే.. ఆ విషయంలో క్రికెటర్లు కూడా ఒక్కటే. ఎంత గొప్ప పేరు సంపాదించినా తల్లి ముందు మాత్రం తాను ఎప్పటికీ పిల్లాడే. మే 9వ తేదీ.. మదర్స్‌డే పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి దీవెనలు అందుకున్నారు. ఈ సందర్భంగా భారత లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మొదలుకొని సెహ్వాగ్, రహానె, సురేశ్ రైనా, శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లీ, క్రిస్‌గేల్, దినేశ్ చండిమాల్, డేవిడ్ వార్నర్ తదితరులు తమ తల్లులతో ఉన్న అనుబంధాలను.. తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీలైతే మీరు ఒకసారి లుక్కేయండి Mothers are the ones who pray for you no matter how old you get. For them, you are always their child. Blessed to have two mothers in my life who have nurtured and loved me always. Wishing Aai and Kaku a very Happy #MothersDay, sharing some photos from the past. 🙏🏻 pic.twitter.com/x22BBvDDiC — Sachin Tendulkar (@sachin_rt) May 9, 2021 — Virender Sehwag (@virendersehwag) May 9, 2021 -
'సామ్ ఇంటికెళ్లి బాగా చదువుకో'.. రైనా ట్రోల్
చెన్నై: సోషల్ మీడియా అంటేనే ట్రోల్స్, మీమ్స్‌కు పెట్టింది పేరు. అప్పుడప్పుడు సాధారణ వ్యక్తులు ట్రోల్ చేస్తూ పెట్టే కామెంట్స్ వైరల్ అవుతుంటాయి. అలాంటిది సెలబ్రిటీలు పెడితే ఇక చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఐపీఎల్ 14వ సీజన్ సందర్భంగా సీఎస్కే ఆటగాళ్లు సురేశ్ రైనా, సామ్ కరన్‌ల మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. వాస్తవానికి వారిద్దరు మాట్లాడుకున్న సందర్భం వేరుగా ఉన్నా.. ఫోటోలో సామ్ కరన్ చిన్నపిల్లాడి ఫోజు వైరల్‌గా మారింది. ''సామ్.. లీగ్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లి బాగా చదువుకో.. జనరల్ నాలెడ్జ్ ఇంకా పెంచుకో అన్నట్లు'' రైనా ట్రోల్ చేసినట్లుగా చూపించారు. దానికి సామ్ కరన్ సరేనన్నట్లు తల ఊపుతున్నట్లుగా అనిపించింది. దీనిపై రైనా తన ట్విటర్లో స్పందిస్తూ.. సూపర్ అంటూ లాఫింగ్ ఎమోజీతో పాటు లాఫింగ్ సింబల్‌ను ట్యాగ్ చేశాడు. ఇక సీఎస్కే గతేడాది ఐపీఎల్ సీజన్‌ను మరిపిస్తూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక గతేడాది ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉన్న రైనా ఐపీఎల్ 14వ సీజన్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్‌లాడిన రైనా 6 ఇన్నింగ్స్‌లు కలిపి 126 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. సామ్ కరన్ ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లాడి 9 వికెట్లు తీశాడు. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ఐపీఎల్ ఆపేసి మంచి పని చేశారు: రోహిత్ Sam Bro. 😂😂 pic.twitter.com/ClDKS4DyoK — Wear Mask!😷 🙏🏻 (@RVCJ_FB) May 6, 2021 View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
రైనాకు సాయం చేసిన సోనూసూద్
ముంబై: బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా విపత్కర పరిస్థితుల్లో తనకు తోచిన సాయం చేస్తూ రియల్ హీరోగా అనిపించుకున్నాడు.కొవిడ్ బాధితులు దేశంలో ఎక్కడ ఉన్నా వారికి అవసరమైన ఆర్థిక, వైద్య సాయం చేస్తూ అండగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నాడు. విషయంలోకి వెళితే.. రైనా తన బంధువు ఒకరు ఆక్సిజన్ కొరతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని రైనా తన ట్విటర్లో పంచుకున్నాడు. ‘మీరట్‌లో ఉన్న మా ఆంటీ కోసం అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ కావాలి. ఆమె వయసు 65ఏండ్లు. ఆమె తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో హాస్పిటల్లో ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. రైనా ట్వీట్‌కు వెంటనే స్పందించిన సోనూ సూద్ మొదట 'రైనా బాయ్.. వివరాలు పంపండి అని ట్వీట్ చేశాడు. రైనా వివరాలు పంపిన తర్వాత కాసేపటికే..'' 10 నిమిషాల్లోనే ఆక్సిజన్ సిలిండర్ అక్కడికి చేరుకుంటుంది భాయ్ అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా ఈ మధ్యనే కరోనా పాజిటివ్‌గా తేలిన సోనూసూద్ అంత కష్టంలోనూ తన సాయం మాత్రం విడువలేదు. ఇక కరోనా నుంచి కోలుకున్న సోనూ కష్టాల్లో ఉన్నవారికి తన సాయాన్ని అందిస్తూనే ఉన్నాడు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌కు దూరంగా ఉన్న రైనా.. ఈ ఏడాది సీజన్లో మాత్రం బరిలోకి దిగాడు. సీఎస్కే తరపున ఆడుతున్న రైనా.. 7 మ్యాచ్‌లాడి ఒక హాఫ్ సెంచరీ సాయంతో 123 పరుగులు సాధించాడు. ఇక రైనా గతేడాది ఆగస్టు 15న ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే తాను కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నాట్లు ప్రకటించాడు. చదవండి: అందరూ సేఫ్‌గా వెళ్లాకే నేను ఇంటికి పోతా! Urgent requirement of an oxygen cylinder in Meerut for my aunt. Age - 65 Hospitalised with Sever lung infection. Covid + SPO2 without support 70 SPO2 with support 91 Kindly help with any leads.@myogiadityanath — Suresh Raina🇮🇳 (@ImRaina) May 6, 2021 Oxygen cylinder reaching in 10 mins bhai. ☑️@Karan_Gilhotra @SoodFoundation https://t.co/BQHCYZJYkV — sonu sood (@SonuSood) May 6, 2021 -
సురేశ్ రైనా అరుదైన ఘనత
ఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్లో 200 మ్యాచ్ ఆడుతున్న రెండో క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు. ఈ ఫీట్‌ను సాధించిన తొలి సీఎస్కే క్రికెటర్ ఎంఎస్ ధోని, ఆ తర్వాత స్థానంలో రైనా నిలిచాడు. ముంబై ఇండియన్స్‌తో శనివారం(మే 1వతేదీ) జరుగుతున్న మ్యాచ్ ద్వారా రైనా ఈ ఫీట్‌ను సాధించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో 200వ మ్యాచ్‌లు ఆడిన నాల్గో ప్లేయర్‌గా రైనా గుర్తింపు పొందాడు. అంతకుముందు రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్‌లు కూడా 200 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు. కాగా, విరాట్ కోహ్లి 200వ ఐపీఎల్ మ్యాచ్‌కు అడుగుదూరంలో ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వచ్చే వారం జరుగనున్న మ్యాచ్‌లో కోహ్లి ఈ మైలురాయిని చేరుకోనున్నాడు. ప్రస్తుతం కోహ్లి 199 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఐపీఎల్లో రైనా ఇప్పటికే ఒక ఘనతను నమోదు చేశాడు. ఐపీఎల్లో 200 సిక్సర్లు బాదిన 7వ క్రికెటర్‌గా నిలిచాడు. మార్చి 19వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రైనా రెండు సిక్స్‌లు కొట్టడం ద్వారా 200 సిక్సర్ల మార్కును చేరాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రైనా ఆ రెండు సిక్స్‌లను కొట్టాడు. ఇక్కడ చదవండి: చీకటి రోజుల్ని గుర్తుచేసుకున్న రసెల్ -
Suresh Raina: జడేజా లాంటి ఆటగాడు అరుదుగా దొరుకుతాడు
ఢిల్లీ: రవీంద్ర జడేజా.. ప్రస్తుత క్రికెట్ తరంలో గొప్ప ఆల్రౌండర్లలో ఒకడిగా పేరు తెచ్చకున్నాడు. తన కెరీర్లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్న జడేజా ఐపీఎల్ 14వ సీజన్లోనూ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ ఆల్‌రౌండ్ షో కనబరిచాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ అన్నింటా తానే ముందుండి జట్టును గెలిపించాడు. మొదట బ్యాటింగ్‌లో 62 పరుగులతో విధ్వంసం.. బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు.. ఫీల్డింగ్‌లో మెరుపు రనౌట్.. వెరసి ఒక ఆల్‌రౌండర్ అంటే ఎలా ఉంటాడో చూపించాడు. విషయంలోకి వెళితే..టీమిండియా తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన రైనా, జడేజాలు ఐపీఎల్‌లోనూ 2011 నుంచి కలిసి ఆడుతున్నారు. 2011 నుంచి సీఎస్కేకు ఆడుతున్న వీరిద్దరు.. 2016లో సీఎస్కే బ్యాన్‌కు గురవడంతో రెండేళ్ల పాటు గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ్యంలో సీఎస్కే సహచర క్రికెటర్ సురేశ్ రైనా జడేజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''జడేజా లాంటి క్రికెటర్ అరుదుగా దొరుకుతుంటాడు. అతను మంచి హార్డ్‌వర్కర్.. నా దృష్టిలో ఇప్పుడు నెంబర్ వన్ ఆల్‌రౌండర్. ఆటలో ఎంత మంచి ప్రదర్శన చేసినా అతి చేయకుండా పద్దతిగా ఉంటాడు. జడేజాలో నాకు నచ్చిన గుణం అదే. ఇక ఫీల్డింగ్‌లో అతను పెట్టే శ్రమ నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మైదానంలో మెరుపువేగంతో కదిలే అతను క్షణాల్లో మ్యాచ్‌ను మలుపుతిప్ప గల సమర్థుడు. మ్యాచ్ మనకు అనుకూలంగా లేదన్న సమయంలో ఒక మెరుపు క్యాచ్ లేదా రనౌట్‌తో ఆటను మార్చేస్తాడు. అందుకే అతనితో కలిసి పనిచేయడం నాకు ఎప్పుడు సంతోషాన్నిస్తుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. రైనా మాట్లాడిన వీడియోనే సీఎస్కే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా ఢిల్లీ వేదికగా సీఎస్కే మరికొద్దిసేపట్లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఆడనుంది. చదవండి: దానికి బ్రాండ్ అంబాసిడర్ కావడం గర్వంగా ఉంది జడేజాతో జాగ్రత్త ఉండాలనే ఆలోచిస్తా: డుప్లెసిస్ View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
హర్షల్ వస్తుంటే.. ధోని జోకులు.. రైనా నవ్వులు
ముంబై: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 69 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 191 పరుగులు చేయగా, ఆర్సీబీ 122 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ క్యూట్టేసింది. రవీంద్ర జడేజా మూడు వికెట్లతో రాణించగా, తాహీర్ రెండు వికెట్లు సాధించాడు. సామ్ కరాన్, శార్దూల్ ఠాకూర్లకు తలో వికెట్ లభించింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఎక్కడా కూడా పోటీ ఇవ్వలేకపోవడంతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆర్సీబీ వికెట్లు వరుసగా పడుతూ సీఎస్కే గెలుపు ఖాయమైన వేళ ఆ జట్టులో జోష్ ఎక్కువవైంది. కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా సరదా సరదాగా జోకులు వేశాడు. ఏబీ డివిలియర్స్ ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరినప్పుడు హర్షల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో ధోని మాట్టాడిన మాటలు వికెట్ల వద్దనున్న మైక్‌లో రికార్డయయ్యాయి. సాధారణంగా మ్యాక్స్‌వెల్, ఏబీ వంటి విదేశీ ఆటగాళ్లు క్రీజ్‌లోకి వచ్చినప్పుడు ధోని హిందీలో మాట్లాడుతూ ఫీల్డింగ్ సెట్ చేస్తూ ఉంటాడు. కానీ హర్షల్ పటేల్ బ్యాటింగ్‌కు క్రీజ్‌లోకి అడుగుపెట్టే సందర్భంలో తాను హిందిలో ఫీల్డింగ్ పెట్టనంటూ ఫీల్డింగ్ పెట్టనంటూ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సురేశ్ రైనా వ్యాఖ్యానించడంతో అతను పగలబడి నవ్వాడు. దీనికి కామెంటేటర్లు కూడా నవ్వడం, దీన్ని ఒక అభిమాని ట్వీటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. pic.twitter.com/UNRJ5CBxUH — pant shirt fc (@pant_fc) April 26, 2021 -
సిక్సర్లలో 7వ స్థానం.. అరుదైన రికార్డు
ముంబై: సీఎస్కే బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో 200 సిక్సర్లు కొట్టిన 7వ ఆటగాడిగా రైనా నిలిచాడు. ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో చహల్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ చివరి బంతిని లాంగాన్ మీదుగా సిక్సర్‌గా మలిచిన రైనా ఈ మైలురాయిని అందుకున్నాడు. ఆ తర్వాత మరో రెండు సిక్సర్లు బాదిన రైనా మొత్తంగా 24 పరుగులు సాధించాడు. కాగా రైనా కంటే ముందు గేల్ 354 సిక్సర్లతో టాప్‌లో ఉండగా.. ఏబీ డివిలియర్స్(240) రోహిత్ శర్మ(222), ఎంఎస్ ధోని(217), కోహ్లి(204), పొలార్డ్(202) తొలి ఆరు స్థానాల్లో నిలిచారు. ఇక ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. జడేజా 11, రాయుడు 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు డుప్లెసిస్ 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. -
సురేశ్ రైనా, అంబటి రాయుడు వీడియో వైరల్
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అంచనాలకు తగ్గట్టు ఆడుతూ దూసుకుపోతోంది. ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే.. మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత సీఎస్కే ఒక్కసారిగా పుంజుకుంది. హ్యాట్రిక్ విజయాలతో దుమ్ములేపింది. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగనున్న మ్యాచ్‌లో సీఎస్కే తలపడనుంది. బుధవారం(ఏప్రిల్ 21వ తేదీ) కేకేఆర్‌తో జరిగిన రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 18 పరుగుల తేడాతో గెలిచింది. సీఎస్కే ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు నాలుగు రోజుల సమయం ఉండటంతో ఆటగాళ్లు ప్రాక్టీస్‌తో పాటు కాసేపు సేద తీరే అవకాశం దొరికింది. ఈ క్రమంలో అంబటి రాయుడు, సురేశ్ రైనాలు తమ కుకింగ్ స్కిల్స్‌ను బయటకు తీస్తున్నారు. సీఎస్కే క్యాంపులో చెఫ్‌లు వంటలు చేసేటప్పుడు వారి వద్దకు వెళ్లి మరీ వారి పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్రైడర్స్లపై సీఎస్కే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని సేన ఓటమి పాలైంది. Just @ImRaina & @RayuduAmbati showing off their cooking skills during the #IPL 🏏#SureshRaina #AmbatiRayudu #IPL2021 #ChennaiSuperKings #CSK #Foodie pic.twitter.com/3AxmVpXdOv — Hyderabad Times (@HydTimes) April 23, 2021 -
వైరల్: భజ్జీ కాళ్లు మొక్కిన రైనా.. వెంటనే
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆట ప్రారంభానికి ముందు సీఎస్కే క్రికెటర్ సురేశ్ రైనా, కేకేఆర్ బౌలర్ హర్భజన్ సింగ్ పాదాలకు నమస్కరించాడు. ఊహించని ఈ పరిణామానికి కంగుతిన్న భజ్జీ.. వెంటనే రైనాను వారించి, గుండెలకు హత్తుకుని ఆప్యాయత చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ట్విటర్ యూజర్ షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో.. ‘‘ అందుకే కదా మాకు రైనా అంటే ఇష్టం. తన మాజీ సహచర ఆటగాడి పట్ల అతడికి ఉన్న గౌరవమర్యాదలు ఇలా తెలియజేశాడు. ఆటగాళ్ల మధ్య ఇలాంటి అనుబంధం చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా హర్భజన్ సింగ్ గత ఐపీఎల్ సీజన్లో సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఈ క్రమంలో, మినీ వేలం-2021లో భాగంగా చెన్నై ఫ్రాంఛైజీ అతడిని వదులుకోగా, కేకేఆర్ రూ. 2 కోట్లు(కనీస ధర) వెచ్చించి భజ్జీని కొనుగోలు చేసింది. కాగా.. రైనా, హర్భజన్ 2011 నాటి వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో సభ్యులు అన్న సంగతి తెలిసిందే. ఇక బుధవానం నాటి మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ధోని సేన, కోల్‌కతాపై 18 పరుగుల తేడాతో గెలుపొందింది. చదవండి: కేకేఆర్ బాయ్స్ మీరు సూపర్: షారుక్ CSK Vs KKR: కమిన్స్ మెరుపులు వృథా pic.twitter.com/DfI3Xa6xVD — Sportzhustle_Squad (@sportzhustle) April 21, 2021 -
ధోనికి పాటను అంకితం చేసిన ఏఆర్ రెహమాన్
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌ను సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని డకౌట్‌తో ఆరంభించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు స్లో ఓవర్ రేట్ కారణంగా ధోని మ్యాచ్ ఫీజులో కోత విధించడం మైనస్‌గా మారింది. కాగా ధోనిని మోటివేట్ చేసేందుకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఒక పాటను అతనికి అంకితం చేశాడు. నేడు పంజాబ్ కింగ్స్‌తో సీఎస్కే తలపడనున్న నేపథ్యంలో రెహమాన్ స్టార్‌స్పోర్ట్స్ చానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా లగాన్ చిత్రంలోని చలే చలో సాంగ్‌ను ధోనికి.. రంగీలా చిత్రంలోని మంగ్తా హై క్యా పాటను రైనాకు అంకితమిచ్చినట్లు తెలిపాడు. ''నెగెటివ్ మూడ్‌లో ఉన్న ధోనిని పాజిటివ్ మూడ్‌లోకి తెచ్చేందుకు లగాన్ సినిమాలోని చలే చలో పాటను ధోని భాయ్‌కి అంకితమిస్తున్నా.. క్రికెట్‌ను కలిసికట్టుగా ఆడేలా ప్లేయర్స్‌ను చలే చలో సాంగ్ ప్రేరేపిస్తుందని, అందుకే ఆ సాంగ్‌ను ధోనికోసం అంకితమిస్తున్నా.. అలాగే రైనా కోసం మంగ్తా హై క్యా సాంగ్‌ను డెడికేట్ చేస్తానని, తాను ఎప్పుడు బెంగళూరు వెళ్లినా వాళ్లు రంగీలా పాటలే ఎక్కువగా వింటుండేవాడిని'' అని చెప్పుకొచ్చాడు. కాగా తొలి మ్యాచ్‌లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడబోతోంది. తొలి మ్యాచ్ చివరి బంతికి గెలిచిన పంజాబ్ వరుసగా రెండో విజయంపై కన్నేయగా.. చెన్నై బోణీ కోసం ఆరాటపడుతోంది. చదవండి: 'అప్పటి ధోనివి కాదు.. బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకో' ధోని మెడపై వేలాడుతున్న నిషేధపు కత్తి -
‘అది మాకు సానుకూలాంశం.. తక్కువ అంచనా వేయొద్దు’
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్లో సీఎస్కే ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలుకావడం ఆ జట్టును తీవ్రంగా నిరాశపరిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 188 పరుగుల భారీ స్కోరు చేసినా పరాజయం చెందింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆది నుంచి దూకుడుగా ఆడటంతో ఆ టార్గెట్‌ను మూడు వికెట్లు కోల్పోయి 18. 4 ఓవర్లలో ఛేదించింది. దీనిపై మ్యాచ్ తర్వాత సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. తాము తిరిగి గాడిలో పడటానికి ఎంత సమయం పట్టదని ఆటగాళ్లలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. తమ జట్టు బౌలింగ్‌లో చేసిన తప్పిదాలతోనే ఓటమి పాలైందని, వాటిని సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్‌ల్లో సత్తాచాటుతామన్నాడు. గతంలో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో పరిస్థితులకు అలవాటు పడటానికి సమయం పట్టిందని, ముంబైలో తాము ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉందన్నాడు. తాము ముంబైలోని వాంఖడేలో పరిస్థితుల్ని సాధ్యమైనంత త్వరగా అర్థం చేసుకుంటామన్నాడు. తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని గాడిలో పడతామన్నాడు. తమది చెన్నైకి చెందిన జట్టని, తమను తక్కువ అంచనా వేయవద్దని పరోక్షంగా ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చాడు. ప్రధానంగా ముంబైలోని పిచ్ పరిస్థితుల్ని బట్టి చూస్తే బౌలింగ్‌లో తాము ఇంకా మెరుగుపడాలన్నాడు. అది మాకు సానుకూలాంశం గత సీజన్‌కు దూరమై ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించిన సురేశ్ రైనాపై ఫ్లెమింగ్ ప్రశంసలు కురిపించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో సురేశ్ రైనా కొట్టిన షాట్లు అతని మునపటి ఫామ్‌ను గుర్తుకు తెచ్చాయన్నాడు. మొయిన్ అలీని దూకుడుగా ఆడటానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, రైనా కూడా అదే రోల్‌ను పోషించడం తమకు సానుకూలాంశమని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. రైనా రెండు-మూడు షాట్లు కొట్టిన తర్వాత ఫుల్ జోష్‌లోకి వచ్చాడన్నాడు. ఈ సీజన్లో సురేశ్ రైనా పాత్ర తమకు కచ్చితంగా లాభిస్తుందని ఫ్లెమింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. బౌలింగ్‌లో తమ ప్రణాళికలు అంతగా ఉపయోగపడలేదని, వచ్చే మ్యాచ్‌ల్లో దాన్ని కూడా అధిగమిస్తామన్నాడు. -
వారెవ్వా రైనా.. నీ విలువేంటో చూపించావు
ముంబై: చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా తన విలువేంటో మరోసారి చూపించాడు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌కు రైనా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సీఎస్కేను తన మెరుపు ఇన్నింగ్స్‌తో నిలబెట్టాడు. కాగా 36 బంతులెదుర్కొన్న రైనా 54 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో మిడ్‌వికెట్ దిశగా కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది.మొదట మొయిన్ అలీ, ఆ తర్వాత అంబటి రాయుడుతో కలిసి సీఎస్కే ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసిన రైనా జడేజాతో సమన్వయ లోపం కారణంగా దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. కాగా సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. చివర్లో సామ్ కరన్ 15 బంతుల్లోనే 34 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో సీఎస్కే భారీ స్కోరు నమోదు చేసింది. చదవండి: 78 ఇన్నింగ్స్‌ల తర్వాత ఇలా ఔటయ్యాడు..! -
ధోని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ అన్న పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం స్పందించింది. ధోనిలో అత్యుత్తమ క్రికెట్ ఆడగలిగే సత్తా ఇంకా ఉందని, అతను మరిన్ని ఐపీఎల్‌లు ఆడగలడని, ఐపీఎల్ 2021 కచ్చితంగా అతనికి ఆఖరి ఐపీఎల్ కాబోదని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ప్రకటించాడు. అయితే ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయమని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి తాము ధోని ప్రత్యామ్నాయం గురించి ఆలోచించట్లేదని, మున్ముందు కూడా ఆ ఆలోచన చేసే అవకాశం రాకపోవచ్చని ఆయన స్పష్టం చేశాడు. కాగా, ధోని ఇటీవలే అంతార్జతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, జట్టులోని మరో ఇద్దరు ముఖ్య ఆటగాళ్ల గురించి కూడా కాశీ విశ్వనాథన్ స్పందించాడు. రైనా, జడేజాల రూపంలో తమ జట్టులో ఇద్దరు భారీ హిట్టర్లు ఉన్నారని, వారు రానున్న సీజన్లో కుర్రాలతో పోటీపడి మరీ పరుగులు సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశాడు. జడేజా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నప్పటికీ.. దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని, అతను ఫిట్‌గా ఉన్నాడని ఎన్సీఏనే స్వయంగా చెప్పిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం జడేజా జట్టుతో చేరాడని, తమ తొలి మ్యాచ్‌లోపు అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు రైనా గత పది రోజులుగా జట్టుతో పాటే ప్రాక్టీస్ చేస్తున్నాడని, ఈ సీజన్లో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆరాటపడుతున్నాడని తెలిపాడు. చదవండి: ఆర్సీబీతో ఫేస్ టు ఫేస్ ఫైట్‌లో ముంబైదే పైచేయి -
IPL2021: సీఎస్కే కు ఆ ముగ్గురు బ్యాటింగే సమస్య కానుందా
మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచిన చెన్నై జట్టు ఈ ఏడాది టైటిల్ సాధించేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. గత ఏడాది ప్రదర్శనను పునరావృతం కాకుండా ఐపిఎల్ 2021 లో తిరిగి తమ పాత ఫామ్‌ను అందుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. అయితే ధోని, రైనా, రాయుడు బ్యాటింగ్ ఫామే ఎల్లో ఆర్మీకి పెద్ద సవాలుగా మారనుందని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. గతేడాది చెన్నై వైఫల్యాలకు బ్యాటింగే ప్రధాన కారణమని ఈ సందర్భంగా చోప్రా గుర్తు చేశాడు. ఆ ముగ్గురు ఆడితేనే సీఎస్కే నిలబడుతుంది ఇటీవలి కాలంలో ధోని, రైనా, రాయుడు అంతర్జాతీయ క్రికెట్లోనే కాక ఏ ఇతర ఫార్మట్‌లోనూ ఆడలేదు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్కే బ్యాటింగ్ పరంగా కొంచెం బలహీనంగా ఉందనే చెప్పాలి. ఇదిలా ఉండగా, దేశవాళీ క్రికెట్లో రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్‌లు మంచి ఫామ్‌లో ఉండటం సీఎస్కేకు ఊరట కలిగించే అంశం. దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు డుప్లెసిస్ ఫామ్ సీఎస్కేకు అదనపు బలం కానుంది. ఏదిఏమైనప్పటికీ, ధోని, రైనా, రాయుడుల బ్యాటింగ్ ఫామ్ చెన్నై జట్టుని కలవరపెడుతోందని ఆకాశ్ పేర్కొన్నాడు. కాగా, చైన్నై జట్టు ముంబైలో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడనుంది. ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు ఏప్రిల్ 10న ముంబైలోని వాంఖడే స్టేడియంలో తమ మొదటి పోరులో ఢిల్లీతో తలపడనుంది. ఈ జట్టు ముంబైలో మొత్తం 5 మ్యాచ్‌లను ఆడనుంది. ఇతర వేదికలైన ఢిల్లీలో 4, బెంగళూరులో 3, కోల్‌కతాలో 2 మ్యాచ్‌లు ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం పేసర్లకే అనుకూలించే అవకాశం ఉండటంతో స్పిన్నర్లు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. -
IPL 2021: కెప్టెన్‌గా ధోని.. రైనాకు దక్కని చోటు
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్ ముంగిట ఆర్సీబీ పవర్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్ టీమ్‌ని ప్రకటించాడు. ఏబీ ప్రకటించిన టీమ్‌కు కెప్టెన్‌గా.. వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనిని ఎంపిక చేశాడు. ఇక ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీని ఎన్నుకున్నాడు. అయితే నాలుగో స్థానంలో ఎవరు ఉంటారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఆ స్థానంలో కేన్ విలియమ్స్‌న్, స్టీవ్ స్మిత్‌తో పాటు తన పేరును కూడా డివిలియర్స్ ప్రకటించడం విశేషం. ఆల్‌రౌండర్ల కోటాలో బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేశాడు. పేస్ బౌలింగ్ బాధ్యతలు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కగిసో రబడలకు అప్పగించగా.. స్పిన్ బాధ్యతల కోసం రషీద్ ఖాన్, జడేజాను పరిగణలోకి తీసుకున్నాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై వేదికగా సీజన్ తొలి మ్యచ్‌ను ఆడనుంది. కాగా డివిలియర్స్ తన బెస్ట్ ఐపీఎల్ ఎలెవెన్ టీమ్ కెప్టెన్‌గా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి అత్యంత విజయవంతమన కెప్టెన్‌గా పేరు పొందిన రోహిత్ శర్మను కాదని ధోనికే ఓటు వేయడం ఇక్కడ విశేషం. అయితే ఐపీఎల్లో విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా పేరున్న సురేశ్ రైనాకు మాత్రం ఏబీ టీమ్‌లో చోటు దక్కలేదు. ఆల్‌టైమ్ ఐపీఎల్ బెస్ట్ ఎలెవన్: వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్/ స్టీవ్‌స్మిత్ / ఏబీ డివిలియర్స్, బెన్‌స్టోక్స్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, కగిసో రబడ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ చదవండి: IPL 2021: కొత్త కెప్టెన్‌తో రాయల్స్‌కు కలిసొచ్చేనా! వైరల్: ప్రాక్టీస్‌లో ఇరగదీసిన ధోని, రైనా.. -
వైరల్: ప్రాక్టీస్‌లో ఇరగదీసిన ధోని, రైనా..
ముంబై: ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా పేరుపొందిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) గతేడాది మాత్రం ఆకట్టుకునే ప్రదర్శన నమోదు చేయలేదు. మూడుసార్లు చాంపియన్.. ఎనిమిది సార్లు ఫైనలిస్ట్ అయిన సీఎస్కే గత సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరు పోందిన సురేశ్ రైనా గైర్హాజరీ కావడం.. జట్టును దెబ్బతీసింది. ఇటీవలే సురేశ్ రైనా తిరిగి జట్టుతో చేరడంతో చెన్నై మరోసారి బలంగా కనిపిస్తుంది. తాజాగా ఎంఎస్ ధోని, రైనాలు కలిసి ప్రాక్టీస్ చేస్తున్న వీడియోనూ సీఎస్కే తన ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సీజన్‌కు సంబంధించి సీఎస్కే మొయిన్ అలీ, కృష్ణప్ప గౌతమ్ లాంటి ఆటగాళ్లు జట్టుతో చేరారు. అయితే ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హజిల్‌వుడ్ మాత్రం ఐపీఎల్ 14వ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కాగా వరుసగా బయో బబుల్స్‌లో గడుపుతుండడంతో వీటికి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడపాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హజిల్‌వుడ్ పేర్కొన్నాడు. కాగా ఈ నెల 10న ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్కే తన తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: IPL 2021: సీఎస్కేకు ఎదురుదెబ్బ IPL 2021: మెస్సీని వచ్చే ఏడాది తీసుకుంటాం 07:03 Anbu Moments! #Yellove #WhistlePodu 💛🦁 @msdhoni @ImRaina pic.twitter.com/eJ1pdDuLMt — Chennai Super Kings (@ChennaiIPL) April 1, 2021 -
పంత్ మంచి కెప్టెన్ అవుతాడు: మాజీ క్రికెటర్
న్యూఢిల్లీ: రిషభ్ పంత్ తప్పకుండా గొప్ప నాయకుడు అవుతాడని టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా రాణించగలిగే సామర్థ్యం అతడికి ఉందని పేర్కొన్నాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్‌ను నియమిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా టోర్నీకి దూరమైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై ట్విటర్ వేదికగా స్పందించిన సురేశ్ రైనా, సారథ్య బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చి పంత్ అందరినీ గర్వపడేలా చేస్తాడంటూ ప్రశంసించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ సైతం, ఢిల్లీ క్యాపిటల్స్‌కు పంత్ వంటి అద్భుతమైన నాయకుడి అవసరం అని, తను తప్పకుండా జట్టుకు విజయాలు అందిస్తాడని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధవన్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ యాజమాన్యం మాత్రం పంత్ వంటి యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్‌కే పగ్గాలు అప్పగించింది. తనకు దక్కిన ఈ అవకాశం పట్ల పంత్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘నేను పుట్టి పెరిగిన చోటు. ఆరేళ్ల క్రితం ఇక్కడే ఐపీఎల్ ప్రయాణం మొదలైంది. ఏదో ఒకరోజు ఈ జట్టుకు సారథ్యం వహించాలన్న నా కల నేడు నెరవేరింది. ఫ్రాంఛైజీ యజమానులకు నా కృతజ్ఞతలు. ఈ పాత్ర పోషించేందుకు నాకు పూర్తి సామర్థ్యం ఉందని నమ్మినందుకు ధన్యవాదాలు. మాకు అద్భుతమైన కోచింగ్ స్టాఫ్ ఉంది. నా చుట్టూ అనుభవజ్ఞులైన సీనియర్లు ఉన్నారు. నా బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా’’ అని పంత్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా, గతేడాది రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ జట్టు.. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ముంబైలో ఏప్రిల్ 10న ఈ మ్యాచ్ జరుగనుంది. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ నూతన సారధిగా రిషబ్ పంత్ 'వైఫై అస్సలు బాలేదు.. సాయం చేయండి' Heartiest congratulations to @RishabhPant17 on being named the captain of @DelhiCapitals for this season. I am sure he will be a talismanic leader and will be donning this new cap with pride.🙌 — Suresh Raina🇮🇳 (@ImRaina) March 30, 2021 #SkipperShreyas isn't just a hashtag to us, it's an emotion 💙 We gonna miss you skip, more power to you to make a roaring comeback soon 🤗#YehHaiNayiDilli @ShreyasIyer15 pic.twitter.com/v666XOHyDP — Delhi Capitals (@DelhiCapitals) March 31, 2021 -
మన డెన్లోకి వచ్చేస్తున్నా : రైనా
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు చెన్నైసూపర్ కింగ్స్ జట్టుతో చేరడం పట్ల సురేష్ రైనా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అతను తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తపరిచాడు. చెన్నై యాజమాన్యం ‘చిన్న తలా వస్తున్నాడు’ అంటూ బుధవారం రైనా ప్రాక్టీస్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో రైనా తన ట్రేడ్ మార్క్ షాట్లతో బంతులను బౌండరీలకు పంపడాన్ని మనం చూడవచ్చు. ఈ వీడియోపై స్పందించిన రైనా ‘మన అడ్డాలోకి రావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని అన్నాడు. ప్రస్తుతం జట్టులో రైనా చేరికతో తమ బ్యాటింగ్ ఆర్డర్ బలపడిందని, గతేడాది ప్రదర్శన పునరావృతం కాదని ఆ జట్టు యాజమాన్యం భావిస్తోంది. మరో పక్క చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపిఎల్ సీజన్ కోసం సన్నాహాలను ప్రారంభించాడు. గత ఏడాది రన్నరప్ ఢిల్లీ కెపిటల్స్తో చెన్నై జట్టు ఏప్రిల్ 10 న ముంబైలోని వాంఖడే స్టేడియంలో తన మొదటి మ్యాచ్‌లో తలపడనుంది. రైనా లేకపోవడం చెన్నైకు లోటే వ్యక్తిగత కారణాల వల్ల యూఏఈలో జరిగిన గత సీజన్‌కు రైనా మిస్ కావడం, చెన్నై బ్యాటింగ్ ఆర్డర్‌పై పెను ప్రభావం చూపింది. జట్టు కూర్పు ఏమాత్రం కుదరలేదు. దీంతో సీఎస్కే లీగ్ చరిత్రలోనే అత్యంత నిరాశజనకమైన ప్రదర్శనతో నిష్క్రమించింది. రైనా లాంటి స్టార్ బ్యాట్స్ మన్ సీఎస్కేకి లేకపోవడమే గత ఐపిఎల్ లో ఆ జట్టు లీగ్ పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. (చదవండి : 'ఐపీఎల్ మాకు మేలు చేసింది.. డబ్బుతో వెలకట్టలేం' ) Super Excited and Eagerly waiting to come to our den #Yellove @msdhoni @SPFleming7 @russcsk ! 🏏✅🤟 https://t.co/pGOZLclzGT — Suresh Raina🇮🇳 (@ImRaina) March 17, 2021 -
నిశ్చితార్ధం చేసుకున్న సిక్సర్ల వీరుడు..
చంఢీగడ్: రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాతియా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున సిక్సర్లతో అదరగొట్టిన ఈ హర్యానా కుర్రాడు..బుధవారం నిశ్చితార్ధం చేసుకున్నాడు. నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలను గురువారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అభిమానులతో సహా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు వీరి జంటకు శుభాకాంక్షలు తెలిపారు. తెవాతియాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు నితీశ్ రాణా, అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ తదితరులు ఉన్నారు. తెవాతియా చివరిసారిగా హర్యానా తరపున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో హర్యానా క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. కాగా, తెవాతియాను ఐపీఎల్ వేళానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు అంటిపెట్టుకుంది. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన తెవాతియా గతేడాది ఐపీఎల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పేసర్ షెల్టన్ కాట్రెల్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది వెలుగులోకి వచ్చాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన మరో ఆటగాడు జయదేవ్ ఉనద్కత్ కూడా మంగళవారం వివాహం చేసుకున్నాడు. -
పంత్ కల ఏంటో చెప్పిన రైనా
న్యూఢిల్లీ: సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 97 పరుగులతో రాణించి మ్యాచ్‌ని డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన రిషభ్ పంత్ బ్రిస్బేన్ టెస్టులో మరింత మెరుగైన ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ని గెలిపించాడు. పంత్ ఆటను ఆ మ్యాచ్ ద్వారా సిరీస్ గెలుపు భారత క్రికెట్ అభిమానులు గుండెల్లో చిరకాలం నిలిచి ఉంటుంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో పంత్ 68.50 సగటుతో 274 పరుగులు చేయడం విశేషం. అయితే, వికెట్ కీపర్‌గా మాత్రం పంత్ కొన్ని తప్పిదాలతో సులభ సాధ్యమైన క్యాచ్‌లను నేలపాలు చేసి విమర్శలు కొనితెచ్చుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌లో అదరగొడుతున్న పంత్‌ను రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా గుర్తించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. (చదవండి: ‘కెప్టెన్ అడిగితే కాదనగలమా’) ఈక్రమంలో మాజీ క్రికెటర్ సురేశ్ రైనా పంత్ గురించి చెప్పిన విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రపంచంలో బెస్ట్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్‌గా ఎదగడం తన కల అని పంత్ గతంలో చెప్పినట్టు రైనా పేర్కొన్నాడు. అతను ప్రతిభ గల ఆటగాడని కొనియాడాడు. భారత క్రికెట్ జట్టులో మేటి ప్లేయర్‌గా ఎదిగే సత్తా పంత్‌కు ఉందని రైనా తెలిపాడు. అతను బ్యాటింగ్‌లో రాణించని సమయంలో మీడియాలో విమర్శలు పరిపాటిగా మారాయని, వాటన్నిటికీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలన్న కసి అతనిలో కనిపించేదని రైనా గుర్తు చేసుకున్నాడు. తన కుటుంబంతో కూడా పంత్‌కు చక్కటి సంబంధాలు ఉన్నాయని రైనా వివరించాడు. అతనితో కలిసి లాంగ్ డ్రైవ్‌కి వెళ్లిన సందర్భాల్లో పంత్ అన్ని విషయాలు చర్చించేవాడని, ముఖ్యంగా ఆటకు సంబంధించి ఎక్కువగా ముచ్చట్లు సాగేవని అన్నాడు. పంత్‌కు సాయమేదీ చేయలేదని, కేవలం తన ఆలోచనలు పంచుకునే వ్యక్తిగా ఉన్నానని తెలిపాడు. పంత్ తన దగ్గర కోరుకుంది అదేనని రైనా పేర్కొన్నాడు. 23 ఏళ్ల పంత్ ముందు అనేక సవాళ్లున్నాయని, ఆసీస్ సిరీస్‌లో మాదిరి అతను మెరుగ్గా రాణిస్తే టీమిండియా సంతోషిస్తుందని రైనా తెలిపాడు. ఇక వ్యక్తిగత కారణాలతో గత ఐపీఎల్ సీజన్‌కు డుమ్మా కొట్టిన రైనాను చెన్నై సూపర్ కింగ్స్ తాజా సీజన్‌కు అట్టిపెట్టుకోవడం తెలిసిందే. (చదవండి: చెన్నైతోనే సురేశ్ రైనా) -
చెన్నైతోనే సురేశ్ రైనా
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్ టి20 క్రికెట్ టోర్నీలో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) జట్టు సురేశ్ రైనాను అట్టిపెట్టుకుంది. యూఏఈలో జరిగిన గత సీజన్లో ఆడటం కోసం రైనా అక్కడిదాకా వెళ్లి... అనూహ్యంగా తిరుగుపయనమయ్యాడు. ఇది చెన్నై బ్యాటింగ్ ఆర్డర్‌పై పెను ప్రభావం చూపింది. జట్టు కూర్పు ఏమాత్రం కుదరలేదు. దీంతో సీఎస్కే లీగ్ చరిత్రలోనే అత్యంత నిరాశజనకమైన ప్రదర్శనతో నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో సురేశ్ రైనాకు చెన్నై ఫ్రాంచైజీ మంగళం పాడటం ఖాయమనే వార్తలొచ్చాయి. అప్పట్లో ఫ్రాంచైజీ యజమాని, బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ కూడా సూచనప్రాయంగా ఇదే చెప్పారు. కానీ ఇప్పుడు సూపర్‌కింగ్స్ రైనాను అట్టిపెట్టుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను చెన్నై విడుదల చేసింది. భజ్జీ కూడా గత సీజన్ ఆడలేదు. ఐపీఎల్ 14వ సీజన్‌కు ముందు వేలం కోసం బుధవారం (జవవరి 20) ఆటగాళ్ల విడుదలకు, అట్టిపెట్టుకునేందుకు ఆఖరి రోజు కావడంతో ఫ్రాంచైజీలన్నీ జాబితాలు విడుదల చేశాయి. రాజస్తాన్ రాయల్స్ అనుభవజ్ఞుడైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను సాగనంపగా... ముంబై ఇండియన్స్ తమ తురుపుముక్క లసిత్ మలింగ (శ్రీలంక)ను వదులుకుంది. కోహ్లి జట్టు బెంగళూరు భారత సీనియర్ సీమర్ ఉమేశ్ యాదవ్‌కు గుడ్‌బై చెప్పింది. పంజాబ్ ఫ్రాంచైజీ స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్‌ను వేలానికి వెళ్లమంది. స్మిత్‌ను పంపించిన రాజస్తాన్ రాయల్స్ తమ జట్టుకు కొత్త కెప్టెన్‌గా సంజూ సామ్సన్ను ఎంపిక చేసింది. ఫిబ్రవరి 11న మినీ వేలం నిర్వహించే అవకాశముంది.