
Courtesy: IPL Twitter
దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సురేశ్ రైనా ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డుప్లిస్, మొయిన్ అలీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రైనా 6 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఫోర్‌తో మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన రైనా ఆ వెంటనే షార్ట్‌బాల్ బలహీనతకు బలయ్యాడు. బౌల్ట్ వేసిన షార్ట్ పిచ్ బంతిని రైనా భారీ షాట్‌కు యత్నించి రాహుల్ చహర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే రైనా పోతూ పోతూ తన బ్యాట్‌ను కూడా విరగొట్టుకొని వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
చదవండి: CSK VS MI: అప్పుడు అర్థ సెంచరీలు.. ఇప్పుడేమో డకౌట్‌లు
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఒక దశలో 10 పరుగుల లోపే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. చెన్నై స్కోరు కనీసం వంద పరుగులైనా దాటుతుందా అనే అనుమానం కలిగింది. తర్వాత వచ్చిన ధోని కూడా 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం చక్కని ఇన్నింగ్స్‌తో అలరించాడు. 57 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. జడేజా 26 పరుగులతో ఆకట్టుకున్నాడు. చివర్లో బ్రేవో 8 బంతుల్లో 23 పరుగులు చేశాడు. రుతురాజ్ మెరుపులతో సీఎస్‌కే గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
చదవండి: IPL 2021 Phase 2: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
— Simran (@CowCorner9) September 19, 2021