PC: IPL
ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం దగ్గరపడడంతో.. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని కొనుగోలు చేస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. రానున్న మెగా వేలంలో 1214 మంది ఆటగాళ్లు తమ పేర్లును నమోదు చేసుకున్నారు. అంతే కాకుండా ఈ ఏడాది నుంచి క్యాష్ రీచ్ లీగ్‌లో రెండు కొత్త జట్లు రావడంతో వేలానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఐపీఎల్-2022 మెగా వేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బీసీసీఐ నిర్వహించనుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
రానున్న సీజన్‌లో సన్‌రైజర్స్ హైదారాబాద్ తరుపున రైనా ఆడనున్నాడన్నదే ఆ వార్త సారాంశం. మెగా వేలంలో ఎలాగైనా రైనాను దక్కించుకోవాలని సన్ రైజర్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. కాగా గత కొన్ని సీజన్ల నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు సురేష్ రైనా ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2022 మెగా వేలం ముందు సీఎస్‌కే అతడిని రీటైన్ చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. ఇక గత సీజన్లో సురేష్ రైనాకు చెన్నై సూపర్ కింగ్స్ రూ. 11 కోట్లు చెల్లించింది. అయితే రానున్న వేలంలో అతడి కోసం రూ. 10 కోట్ల వరకైనా సరే ఖర్చు చేయాలని సన్ రైజర్స్ మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే వేలం పూర్తయ్యేంత వరకు వేచి చూడాల్సిందే!
చదవండి: India Test captain: బ్యాటర్‌గా కోహ్లి మరిన్ని రికార్డులు బద్దలుకొడతాడు.. టెస్టు కెప్టెన్‌గా అతడే సరైనోడు: పాంటింగ్
Comments
Please login to add a commentAdd a comment