మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేష్ రైనాను ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయకపోవడం అందరిని ఆశ్చర్య పరిచింది. సీఎస్కే యజమాని శ్రీనివాసన్.. రైనాను పక్కకు పెట్టడానికి గల కారణాలను సైతం వివరించాడు. ఈ క్రమంలో చాలా మంది మాజీ క్రికెటర్లు రైనా అమ్ముడుపోకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఉన్నారు. తాజాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్.. రైనాపై ఏ జట్టు ఆసక్తి కనబర్చకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
గత రెండు ఐపీఎల్ సీజన్లలో వ్యక్తిగత కారణాల చేత కొన్ని మ్యాచ్ లకు, మోకాలికి శస్త్రచికిత్స కారణంగా మరి కొన్ని మ్యాచ్ లకు దూరమైన రైనా.. ఫామ్ లేమి కారణంగా ధోనితో పాటు సీఎస్కే యాజమాన్యం నమ్మకాన్ని కోల్పోయాడని, అందుకే అతన్ని తిరిగి జట్టులోకి తీసుకోలేదని, ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ యజమానే స్వయంగా వెల్లడించాడని గుర్తు చేశాడు. ఫామ్ లేమి కారణంగా ఓ ఆటగాడిని ఏ జట్టైనా ఇలా పక్కకు పెడితే, ఇతర జట్లు సదరు ఆటగాడిని కొనుగోలు చేసే సాహసం చేయవని ఓ క్రీడా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇదే కారణంతోనే రైనాను మెగా వేలంలో సీఎస్కే తో పాటు ఏ ఇతర జట్లు కొనుగోలు చేయలేదని సైమన్ డౌల్ అభిప్రాయపడ్డాడు.
కాగా, రెండు సీజన్లు (2006,17) మినహా ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్కే కే ప్రాతినిధ్యం వహించిన రైనాకు ఈ సారి ఆ జట్టు రిటెన్షన్ జాబితాలో చోటు దక్కలేదు. వేలంలోనైనా సీఎస్కే అతన్ని దక్కించుకుంటుందని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. వయసు మీద పడటం, అంతంత మాత్రంగానే ఉన్న ఫామ్ కారణంగా అతనిపై ఇతర జట్లు కూడా ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఈ వెటరన్ బ్యాటర్ ఈ ఏడాది మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ట్రోఫీ గెలుచుకున్న జట్టులో సభ్యుడైన రైనా.. తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 205 మ్యాచ్‌లు ఆడి 30కి పైగా సగటుతో 5528 పరుగులు చేశాడు.
చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు.. వేలంలో 7కోట్లు!
Comments
Please login to add a commentAdd a comment