teamindia batsman
-
టీమిండియా యంగ్ క్రికెటర్‌కు బాలీవుడ్ నటి బర్త్‌డే విషెస్.. వీడియో వైరల్!
గతంలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మధ్య వివాదం కొనసాగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమె అతనికి సారీ కూడా చెప్పింది. అయితే తాజాగా పంత్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియో షేర్ చేసింది. తన ఇన్‌స్టాలో 'హ్యాపీ బర్త్‌డే' అంటూ ఎవరీ పేరు చెప్పకుండానే పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్తా వైరలవడంతో అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇవాళ పంత్ బర్త్‌డే కావడంతో అతనికే విషెస్ చెప్పారంటూ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. (చదవండి: Rishabh Pant: లైట్ తీసుకున్న పంత్.. సారీ చెప్పిన ఊర్వశి.. వీడియో వైరల్!) ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఆ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. రెడ్ కలర్ డ్రెస్‌లో ఆమె నవ్వుతూ ఫ్లయింగ్ కిస్ ఇస్తున్న వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అందులోనే పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది ఈ బాలీవుడ్ భామ. ఆమె ఎవరికీ చెప్పిందో పేరును ప్రస్తావించనప్పటికీ నెటిజన్లు మాత్రం ఆ వీడియో రిషభ్ పంత్ కోసమేనని కామెంట్స్ చేస్తున్నారు. ఇవాళ టీమిండియా క్రికెటర్ పంత్ తన 25వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
గొప్ప మనసు చాటుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్.. చిన్నారి శస్త్రచికిత్స కోసం ఏకంగా..!
KL Rahul: ఇటీవలే టీమిండియా వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన డాషింగ్ ప్లేయర్ కేఎల్ రాహుల్.. అత్యంత అరుదైన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 11 ఏళ్ల చిన్నారి వరద్ గురించి తెలుసుకుని చలించిపోయాడు. ఆ చిన్నారి ఆపరేషన్ (బోన్ మ్యారో మర్పిడి)కు కావాల్సిన నగదును సమకూర్చి గొప్ప మనసును చాటుకున్నాడు. గివ్ ఇండియా సంస్థ ద్వారా వరద్ గురించి తెలుసుకున్న రాహుల్.. వెంటనే తన టీమ్ ద్వారా వరద్ తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి శస్త్రచికిత్సకు కావాల్సిన రూ.31 లక్షల ఆర్ధిక సాయాన్ని తక్షణమే అందజేసాడు. రాహుల్ సకాలంలో స్పందించడంతో ఆపరేషన్ సక్సెస్ అయ్యి వరద్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న రాహుల్ సంతోషాన్ని వ్యక్తపరచగా, వరద్ తల్లిదండ్రులు సచిన్ నల్వాదే, స్వప్న ఝాలు రాహుల్‌కి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ ముందుకు రాకపోతే ఇంత తక్కువ సమయంలో వరద్‌కి శస్త్ర చికిత్స జరిగేది కాదని వారన్నారు. వరద్‌కి కూడా రాహుల్‌లాగే క్రికెటర్ కావాలని కోరిక ఉందని, చిన్నతనంలో అతని తండ్రి కొనిపెట్టిన బ్యాట్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇదిలా ఉంటే, స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కేఎల్ రాహుల్.. మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో త్వరలో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌కు సెలెక్టర్లు అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. చదవండి: Shahid Afridi: అల్లుడూ.. నువ్వు సూపరప్పా, అచ్చం నాలాగే..! -
సన్‌రైజర్స్‌లోకి సురేష్ రైనా.. ధర ఎంతో తెలుసా?
ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం దగ్గరపడడంతో.. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని కొనుగోలు చేస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. రానున్న మెగా వేలంలో 1214 మంది ఆటగాళ్లు తమ పేర్లును నమోదు చేసుకున్నారు. అంతే కాకుండా ఈ ఏడాది నుంచి క్యాష్ రీచ్ లీగ్‌లో రెండు కొత్త జట్లు రావడంతో వేలానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఐపీఎల్-2022 మెగా వేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బీసీసీఐ నిర్వహించనుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. రానున్న సీజన్లో సన్‌రైజర్స్ హైదారాబాద్ తరుపున రైనా ఆడనున్నాడన్నదే ఆ వార్త సారాంశం. మెగా వేలంలో ఎలాగైనా రైనాను దక్కించుకోవాలని సన్ రైజర్స్ మేనేజ్మెంట్ భావిస్తోందట. కాగా గత కొన్ని సీజన్ల నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు సురేష్ రైనా ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2022 మెగా వేలం ముందు సీఎస్కే అతడిని రీటైన్ చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. ఇక గత సీజన్లో సురేష్ రైనాకు చెన్నై సూపర్ కింగ్స్ రూ. 11 కోట్లు చెల్లించింది. అయితే రానున్న వేలంలో అతడి కోసం రూ. 10 కోట్ల వరకైనా సరే ఖర్చు చేయాలని సన్ రైజర్స్ మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే వేలం పూర్తయ్యేంత వరకు వేచి చూడాల్సిందే! చదవండి: India Test captain: బ్యాటర్‌గా కోహ్లి మరిన్ని రికార్డులు బద్దలుకొడతాడు.. టెస్టు కెప్టెన్‌గా అతడే సరైనోడు: పాంటింగ్ -
శభాష్ విహారి.. నువ్వు నిజంగా చాలా గ్రేట్ గురూ
లండన్: టీమిండియా టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా కాలంలో తన మిత్రులు, అనుచరులతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసి అవసరాల్లో ఉన్నవాళ్లకు సాయం చేస్తున్న విహారి.. తాజాగా ప్రేమోన్మాది చేతిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ అమ్మాయిని కాపాడాడు. సరైన సమయంలో వైద్యానికి అవసరమైన డబ్బును అందించడంతో ప్రియాంక అనే ఆ అమ్మాయి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి కోలుకుంటుంది. As promised yesterday to Priyanka’s family. They’ll be receiving funds from me today n get her surgery started asap. She deserves to have a better life and it’s all of our responsibility to give it to her.thank you everyone who has come forward@Hidderkaran special mention to you — Hanuma vihari (@Hanumavihari) June 7, 2021 వివారాల్లోకి వెళితే... శ్రీకాంత్ అనే అబ్బాయి ప్రేమ పేరుతో బాధితురాలు ప్రియాంకను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ ఓ రోజు ప్రియాంకకు ప్రపోస్ చేయగా.. ఆమె నిరాకరించింది. దీంతో ఆవేశానికి లోనైన శ్రీకాంత్.. కత్తితో ప్రియాంకపై దాడి చేసి, ఆమె గొంతు కోశాడు. ఘటనా స్థలంలో నిర్జీవంగా పడివున్న ప్రియాంకను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆపరేషన్ కోసం 6 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. అంత మొత్తంలో డబ్బులు చెల్లించుకోలేని ప్రియాంక కుటుంబసభ్యులు సోషల్ మీడియా ద్వారా దాతలను అభ్యర్ధించారు. ఈ విషయం తెలుసుకున్న హనుమ విహారి.. వెంటనే స్పందించి ఆ అమ్మయి వైద్యానికి అవసరమయ్యే 5 లక్షలు పంపాడు. ఆపరేషన్ తర్వాత ప్రియాంక ప్రస్తుతం కోలుకుంటోంది. విహారి చేసిన సహాయానికి ప్రియాంక, ఆమె కుటుంబ సభ్యులతో పాటు విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంట కనిపెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. వీరందరూ పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ లాంటి పలు సేవల్ని ప్రజలకు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, 27 ఏళ్ల హనుమ విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ డ్రా చేసుకున్న సిడ్నీ టెస్టులో విహారి.. అశ్విన్‌తో కలిసి నాలుగు గంటల పాటు పోరాడి జట్టును గట్టెక్కించి విషయం తెలిసిందే. చదవండి: ఆసీస్ వికెట్ కీపర్‌కు తీవ్ర గాయాలు.. పెదాలపై ఏడు కుట్లు -
స్నేహితురాలిని పెళ్లాడిన క్రికెటర్
తిరువనంతపురం : టీమిండియా యువ క్రికెటర్ సంజూ శాంసన్ తన చిరకాల స్నేహితురాలు చారులతను పెళ్లాడాడు. కోవలంలోని రిసార్టులో శనివారం అత్యంత సన్నిహితుల మధ్య నిరాండబరంగా వీరి వివాహం జరిగింది. గ్రాడ్యుయేషన్ చేసే రోజుల్లో సంజూ- చారులతల మధ్య ప్రేమ చిగురించింది. ఈ నేపథ్యంలో పెద్దలను ఒప్పించిన ఈ జంట శనివారం మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సంజూ క్రిస్టియన్ మతస్తుడు కాగా, చారులత హిందూ నాయర్ కుటుంబానికి చెందిన మహిళ. ఈ క్రమంలో స్పెషల్ మ్యారేజ్ చట్టం కింద వీరు తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా.. ‘ఇరు కుటుంబాలకు చెందిన 30 మంది కుటుంబ సభ్యుల మధ్య మా పెళ్లి నిరాడంబరంగా జరిగింది’ అని సంజూ వ్యాఖ్యానించాడు. కాగా దేశవాళీ క్రికెట్లో రాణించిన కేరళ బ్యాట్స్‌మెన్ సంజూను ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ టీమ్ 2013లో కొనుగోలు చేసింది. ఈ క్రమంలో టీ20ల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో 2015 జూలైలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపికైన టీమిండియా జట్టులో చోటు సంపాదించుకుని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. -
అప్పుడు చాలా బాధపడ్డా: రైనా
బ్రిస్బేన్: వచ్చే నెలలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో తాను ఫామ్ లోకి రావడం పట్ల టీమిండియా బాట్స్ మన్ సురేశ్ రైనా సంతోషం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన వన్డేలో రైనా అర్థ సెంచరీ సాధించాడు. అంతముందు ఆసీస్ తో జరిగిన రెండు టెస్టు మ్యాచుల్లో అతడు ఘోరంగా విఫలమయ్యారు. రెండేళ్ల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడినందున పరుగులు చేయలేకపోయానని రైనా చెప్పాడు. టెస్టుల్లో విఫలం కావడంతో ఎంతో బాధ పడ్డానని, ఆ సమయంలో జట్టు సభ్యులు తనకు మద్దతుగా నిలిచారని వెల్లడించాడు. మళ్లీ ఫామ్ లోకి రావడానికి కష్టపడ్డానని రైనా తెలిపాడు. ఫామ్ ను కొనసాగిస్తానన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.