లెజెండ్స్ లీగ్-2023లో భాగంగా బుధవారం వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఇండియా మహారాజాస్ పరాజయం పాలైనప్పటికీ.. ఆ జట్టు బ్యాటర్, టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న రైనా.. 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేశాడు.
మహారాజాస్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన పనేసర్ బౌలింగ్‌లో ఐదో బంతికి.. ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి బౌలర్ తలపై నుంచి అద్భుతమైన సిక్స్ రైనా బాదాడు. ఈ సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రైనా తప్పుకున్నప్పటికీ అతడిలో ఏ మాత్రం జోరు తగ్గలేదంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది రైనా ఐపీఎల్‌లో ఆడాలని కోరుకుంటున్నారు.
A classic @ImRaina shot! 🔥@IndMaharajasLLC #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain #IMvsWG pic.twitter.com/FtdhpF5B4U
— Legends League Cricket (@llct20) March 15, 2023
Comments
Please login to add a commentAdd a comment