
Courtesy: IPL Twitter/ BCCI
టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా త్వరలో అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ధోనీతో పాటు సురేష్ రైనా 2020లో కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కానీ ఐపీఎల్‌లో మాత్రం ఆడుతూ వచ్చాడు. అయితే ఐపీఎల్-2022 మెగా వేలంలో సురేష్ రైనాను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా రైనా మిగిలిపోయాడు.
అయితే ఐపీఎల్ 15వ సీజన్‌లో రైనా కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తాడు. అతడితో పాటు పీయూష్ చావ్లా, ధవల్ కులకర్ణి, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, హర్భజన్ సింగ్ తొలి సారి ఐపీఎల్‌లో కామెంటరీ ప్యానెల్‌లో చేరారు. ఇది ఇలా ఉంటే.. 11 సీజన్‌లలో చెన్నైసూపర్ కింగ్స్‌కు రైనా ప్రాతినిధ్యం వహించాడు.
మరోవైపు గుజరాత్ లయన్స్‌కు కెప్టెన్‌గా కూడా రైనా వ్యవహరించాడు. కాగా అతడి వయస్సు దృష్ట్యా క్రికెట్ నుంచి తప్పుకోవాలని రైనా భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రైనాకు 35 ఏళ్లు నిండాయి. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడిన రైనా.. 5528 పరుగులు సాధించాడు. అభిమానులు అతడిని ముద్దుగా మిస్టర్ ఐపీఎల్ అని పిలుచుకుంటారు.
చదవండి: IPL 2022: చెన్నై.. 19వ ఓవర్ శివమ్ దూబేతో వేయించడం సరైన నిర్ణయమే: టీమిండియా మాజీ క్రికెటర్
Suresh Raina 🥺💔 pic.twitter.com/nztD5RcO4E
— Kanan Shah (@KananShah_) March 26, 2022