
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సురేశ్ రైనా మైదానంలోనూ, వెలుపల ఫుల్ జోష్‌లో ఉంటాడు. ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌ల కోసం ప్రస్తుతం దుబాయ్‌లోని ప్రాక్టీస్ సెషన్లలో బిజీగా ఉన్న అతను.. తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనా మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, స్విమ్మింగ్ పూల్ వద్ద సహచరుడు కేఎమ్ ఆసిఫ్‌తో రైనా జాన్ సీనా స్టంట్‌ను ప్రదర్శిస్తాడు. దీనికి 'దట్ నేమ్ ఈజ్ జాన్ సీనా.. మై నేమ్ ఈజ్ సురేశ్ రైనా' అని క్యాప్షన్‌ను జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. రైనా అద్భుతంగా స్టంట్‌ను ప్రదర్శించాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా, సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. అదే రోజు సీఎస్‌కే జట్టు ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో జరిగిన తొలి ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 2 పరాజయాలతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా, ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 2 పరాజయాలతో టాప్‌లో కొనసాగుతోంది. అయితే, మొదటి 7 మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీ సహా కేవలం 123 పరుగులు మాత్రమే చేసిన రైనా.. చెన్నై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు.
చదవండి: ఆండర్సన్‌కు ఇదే ఆఖరి సిరీస్.. ఐదో టెస్ట్ అనంతరం రిటైర్మెంట్..?
Comments
Please login to add a commentAdd a comment