విధ్వంసం సృస్టించిన సురేశ్‌ రైనా | In The Final Of Big Cricket League, Raina Smashed 51 Runs From 26 Balls | Sakshi
Sakshi News home page

విధ్వంసం సృస్టించిన సురేశ్‌ రైనా

Dec 22 2024 9:24 PM | Updated on Dec 22 2024 9:24 PM

In The Final Of Big Cricket League, Raina Smashed 51 Runs From 26 Balls

బిగ్‌ క్రికెట్‌ లీగ్‌-2024 ఎడిషన్‌లో ఇవాళ (డిసెంబర్‌ 22) ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. సథరన్‌ స్పార్టన్స్‌తో జరుగుతున్న అంతిమ పోరులో ముంబై మెరైన్స్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. సథరన్‌ స్పార్టన్స్‌కు టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్‌ రైనా సారథ్యం వహిస్తుండగా.. ‌ముంబై మెరైన్స్‌కు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఫిల్‌ మస్టర్డ్‌ ఊచకోత.. సురేశ్‌ రైనా విధ్వంసం
తొలుత బ్యాటింగ్‌ చేసిన సథరన్‌ స్పార్టన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ ఫిల్‌ మస్టర్డ్‌ (39 బంతుల్లో 78; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోయగా.. సురేశ్‌ రైనా (26 బంతుల్లో 51; 9 ఫోర్లు, సిక్సర్‌) విధ్వంసం సృష్టించాడు. 

స్పార్టన్స్‌ ఇన్నింగ్స్‌లో సోలొమన్‌ మైర్‌ 7, అభిమన్యు మిధున్‌ 25, ఫయాజ్‌ ఫజల్‌ 30, అమాన్‌ ఖాన్‌ 10 పరుగులు చేశారు. మెరైన్స్‌ బౌలర్లలో మన్ప్రీత్‌ గోని, మనన్‌ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్‌ కుమార్ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement