Cricketer Suresh Raina Net Worth, Who Opened Indian Restaurant in Amsterdam - Sakshi
Sakshi News home page

రెస్టారెంట్ టూ స్టార్టప్ ఫండింగ్: సురేష్‌ రైనా నెట్‌వర్త్‌ తెలిస్తే షాకవుతారు

Published Sun, Jun 25 2023 12:59 PM | Last Updated on Sun, Jun 25 2023 2:58 PM

Cricketer Suresh Raina newworthe who opens Indian restaurant in Amsterdam - Sakshi

క్రికెటర్, ఐపీఎల్‌ ఆటగాడు సురేష్ రైనా నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభించి అటు ఫ్యాన్స్‌ను, ఇటు వ్యాపార వర్గాలను  ఆకర్షించాడు.  క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రైనా వ్యాపార వ్యూహంలో భారీ ప్లాన్లే ఉన్నాయి. ఇండియా నుంచి యూరప్‌కు విస్తారమైన ప్రామాణిక వంటకాలను, రుచులను, అందించనున్నాడు. రెస్టారెంట్ మాత్రమే కాదు  వ్యాపార సామ్రాజ్యం, పెట్టుబడి డీల్స్‌ ఇంకా చాలానే ఉన్నాయి. ఆ వివరాలు ఒకసారి చూద్దాం!. 

సిక్సర్లేనా.. నోరూరించే ఇండియన్‌ వంటకాలు  కూడా 
తన ప్రతిభతో క్రికెటర్‌గా  పాపులర్‌ అయిన  సురేష్ రైనా,  ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంఎస్‌ ధోని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కోసం  ఆడిన సంగతి తెలిసిందే. తాజాగా ‘రైనా క్యులినరీ ట్రెజర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో కోట్ల రూపాయల  రెస్టారెంట్‌ను ప్రారంభించినట్లు జూన్ 23న సోషల్‌ మీడియా ద్వారా రైనా ప్రకటించాడు.  ఈ రెస్టారెంట్ ఢిల్లీలోని ప్రసిద్ధ చాందినీ చౌక్ నుండి స్నాక్స్‌తో సహా అనేక రకాల శాఖాహార, మాంసాహార వంటకాలను అందిస్తుందట.

ఐపీఎల్‌ 2022 వేలంలో అమ్ముడుపోని తర్వాత, రైనా క్రికెట్ టోర్నమెంట్‌కు వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా వ్యవహరించాడు. ఇది భారీ ఆదాయాన్నే సంపాదించి పెట్టింది. దీంతోపాటు  బహుళ ఎండార్స్‌మెంట్  డీల్స్‌ ద్వారా కోట్ల రూపాయలను  ఆర్జిస్తున్నాడు. (సింగిల్‌ బ్రాండ్‌తో 100 కోట్ల డీల్‌ కుదుర్చుకున్న తొలి ఇండియన్‌ క్రికెటర్‌ ఎవరో తెలుసా? )

ముఖ్యంగా సురేష్ రైనా , భార్యతో కలిసి ‘మాతే’ అనే బేబీకేర్ బ్రాండ్‌ను కూడా స్థాపించాడు. ఇది ఇది పిల్లల సంరక్షణ కోసం రసాయన రహిత, ఆయుర్వేద ఉత్పత్తులను విక్రయిస్తుంది. దీంతోపాటు క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వార్తలను ప్రచురించే Sahicoin అనే స్టార్టప్ కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టాడు. అలాగే సురేష్ రైనా గతంలో అడిడాస్, టైమెక్స్, మ్యాగీ, ఇంటెక్స్, బూస్ట్ ఎనర్జీ డ్రింక్స్, పెప్సికో, ఆర్‌కె గ్లోబల్, హెచ్‌పి వంటి అనేక పెద్ద బ్రాండ్‌లతో ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. 

అంతేనా, భారత్‌పే, బుకింగ్స్‌ డాట్‌కాం, ఎలిస్తా లాంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. వీటన్నింటి విలువు దాదాపు రూ.10 కోట్లకు పైమాటే.  దీంతోపాటు విలాసవంతమైన భారీ బంగ్లా కూడా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఈ బంగ్లా విలువ 18 కోట్ల రూపాయలట.స్పోర్ట్స్‌కీడా అంచనా ప్రకారం  రైనా నికర విలువ రూ. 200 కోట్లకు పైగా ఉండగా,  వార్షిక సంపాదన దాదాపు రూ. 11.5 కోట్లుగా ఉంది.(ఆదిపురుష్‌ విలన్‌కి కోట్ల విలువైన డైమండ్‌ వాచ్‌ గిఫ్ట్‌: ఎపుడు, ఎవరిచ్చారో తెలుసా?)

1986, నవంబరు 27న యూపీలో పుట్టిన సురేష్‌ రైనా. ఢిల్లీ యూనివర్శిటీటీ నుంచి బీకాం (డిస్టెన్స్‌), 2022లో చెన్నైలోని యూనివర్శిటీనుంచి గౌరవ డాక్టరేట్‌ పొదారు. బీటెక్‌ చదివిన  అతని భార్య  ప్రియాంక చౌదరి పలు ఐటీ కంపెనీల్లో పనిచేశారు. ఆ తరువాత 2017లో మాతే నేచురల్‌ బేబీ  కేర్‌ ఉత్పత్తుల సంస్థను స్థాపించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. (వైట్‌హౌస్‌ స్టేట్ డిన్నర్‌: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement