Endorsement deals
-
రెస్టారెంట్ టూ స్టార్టప్ ఫండింగ్: సురేష్ రైనా నెట్‌వర్త్ తెలిస్తే షాకవుతారు
క్రికెటర్, ఐపీఎల్ ఆటగాడు సురేష్ రైనా నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభించి అటు ఫ్యాన్స్‌ను, ఇటు వ్యాపార వర్గాలను ఆకర్షించాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రైనా వ్యాపార వ్యూహంలో భారీ ప్లాన్లే ఉన్నాయి. ఇండియా నుంచి యూరప్‌కు విస్తారమైన ప్రామాణిక వంటకాలను, రుచులను, అందించనున్నాడు. రెస్టారెంట్ మాత్రమే కాదు వ్యాపార సామ్రాజ్యం, పెట్టుబడి డీల్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఆ వివరాలు ఒకసారి చూద్దాం!. సిక్సర్లేనా.. నోరూరించే ఇండియన్ వంటకాలు కూడా తన ప్రతిభతో క్రికెటర్‌గా పాపులర్ అయిన సురేష్ రైనా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంఎస్ ధోని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఆడిన సంగతి తెలిసిందే. తాజాగా ‘రైనా క్యులినరీ ట్రెజర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో కోట్ల రూపాయల రెస్టారెంట్‌ను ప్రారంభించినట్లు జూన్ 23న సోషల్ మీడియా ద్వారా రైనా ప్రకటించాడు. ఈ రెస్టారెంట్ ఢిల్లీలోని ప్రసిద్ధ చాందినీ చౌక్ నుండి స్నాక్స్‌తో సహా అనేక రకాల శాఖాహార, మాంసాహార వంటకాలను అందిస్తుందట. ఐపీఎల్ 2022 వేలంలో అమ్ముడుపోని తర్వాత, రైనా క్రికెట్ టోర్నమెంట్‌కు వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా వ్యవహరించాడు. ఇది భారీ ఆదాయాన్నే సంపాదించి పెట్టింది. దీంతోపాటు బహుళ ఎండార్స్మెంట్ డీల్స్ ద్వారా కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాడు. (సింగిల్ బ్రాండ్‌తో 100 కోట్ల డీల్ కుదుర్చుకున్న తొలి ఇండియన్ క్రికెటర్ ఎవరో తెలుసా? ) ముఖ్యంగా సురేష్ రైనా , భార్యతో కలిసి ‘మాతే’ అనే బేబీకేర్ బ్రాండ్‌ను కూడా స్థాపించాడు. ఇది ఇది పిల్లల సంరక్షణ కోసం రసాయన రహిత, ఆయుర్వేద ఉత్పత్తులను విక్రయిస్తుంది. దీంతోపాటు క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వార్తలను ప్రచురించే Sahicoin అనే స్టార్టప్ కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టాడు. అలాగే సురేష్ రైనా గతంలో అడిడాస్, టైమెక్స్, మ్యాగీ, ఇంటెక్స్, బూస్ట్ ఎనర్జీ డ్రింక్స్, పెప్సికో, ఆర్కె గ్లోబల్, హెచ్‌పి వంటి అనేక పెద్ద బ్రాండ్లతో ఎండార్స్మెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. అంతేనా, భారత్‌పే, బుకింగ్స్ డాట్కాం, ఎలిస్తా లాంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. వీటన్నింటి విలువు దాదాపు రూ.10 కోట్లకు పైమాటే. దీంతోపాటు విలాసవంతమైన భారీ బంగ్లా కూడా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఈ బంగ్లా విలువ 18 కోట్ల రూపాయలట.స్పోర్ట్స్‌కీడా అంచనా ప్రకారం రైనా నికర విలువ రూ. 200 కోట్లకు పైగా ఉండగా, వార్షిక సంపాదన దాదాపు రూ. 11.5 కోట్లుగా ఉంది.(ఆదిపురుష్ విలన్‌కి కోట్ల విలువైన డైమండ్ వాచ్ గిఫ్ట్: ఎపుడు, ఎవరిచ్చారో తెలుసా?) 1986, నవంబరు 27న యూపీలో పుట్టిన సురేష్ రైనా. ఢిల్లీ యూనివర్శిటీటీ నుంచి బీకాం (డిస్టెన్స్), 2022లో చెన్నైలోని యూనివర్శిటీనుంచి గౌరవ డాక్టరేట్ పొదారు. బీటెక్ చదివిన అతని భార్య ప్రియాంక చౌదరి పలు ఐటీ కంపెనీల్లో పనిచేశారు. ఆ తరువాత 2017లో మాతే నేచురల్ బేబీ కేర్ ఉత్పత్తుల సంస్థను స్థాపించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) -
Virat Kohli: దటీజ్ కోహ్లి
క్రికెట్లో ఒక ఆటగాడి శైలిని.. మరో ఆటగాడితో పోల్చి చూసే వ్యవహారం సహజం. కానీ, ఏ ఆటగాడి ప్రత్యేకత ఆ ఆటగాడికే ఉంటుంది కదా!. అలాగే టీమిండియా టాప్ ప్లేయర్ విరాట్ కోహ్లిని దిగ్గజాలతో పోల్చాలని ప్రయత్నించడం కష్టంతో కూడిన వ్యవహారమే. కోహ్లి అగ్రెసివ్ ఆటిట్యూడ్‌తో పాటు ఆటనూ ఇష్టపడే యంగ్ జనరేషన్‌కి.. అతని పట్ల ఉన్న అభిమానం ఎంతైనా ప్రత్యేకమే!. Virat Kohli Brand Value Without T20 Captaincy?: వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో రకరరకాల చర్చలు.. కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. మరి కోహ్లి గనుక కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే.. అతని బ్రాండ్‌కు వచ్చే నష్టమేమైనా ఉంటుందా? అనే చర్చ కూడా మొదలైంది ఇప్పుడు. రకరకాల బ్రాండ్లు.. కోట్లలో వ్యాపారం కేవలం కోహ్లి బ్రాండ్‌నే నమ్ముకుని నడుస్తున్నాయి. అందుకు ప్రతిగా పారితోషకం సైతం కోహ్లికి భారీగానే ముట్టజెప్పుతున్నారు. మరి క్రికెట్ వ్యూయర్షిప్ను శాసిస్తూ.. ఊహకందని రీతిలో బిజినెస్ చేస్తున్న పొట్టిఫార్మట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచే తప్పుకుంటే.. అది ప్రచారాలపై, కోహ్లి ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపెట్టవా?. అసలు ఆ ఆలోచననే దరి చేరనీయట్లేదట సదరు కంపెనీలు. ఫామ్కొస్తే కేకే.. ఇంతకీ ‘కోహ్లి బ్రాండ్’ అంటే ఏంటో చూద్దాం. క్రికెట్లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా కోహ్లి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఇప్పుడు. ఎమ్ఆర్ఎఫ్, అమెరికన్ టూరిస్టర్, పూమా, వోలిని, అడీ, ఉబెర్ ఇండియా, రాయల్ ఛాలెంజ్.. ఇలా బోలెడు బ్రాండ్స్‌కు ఎండోర్సింగ్ చేస్తున్నాడు కోహ్లి. అయితే ప్రధాన బ్రాండ్లు క్యూ కట్టడానికి ప్రధాన కారణం.. కేవలం స్టార్ ఆటగాడు అని మాత్రమే కాదు.. జనాల్లో కోహ్లికి ఉన్న యాక్సెప్టెన్సీ కూడా. మీడియా, సోషల్ మీడియా, బుల్లితెర.. ఇలా వేదిక ఏదైనాసరే కోహ్లికి విపరీతమైన జనాదరణ ఉంది. ఇది కోహ్లి పర్ఫార్మెన్స్తో ఏమాత్రం సంబంధంలేని వ్యవహారమని చెప్తున్నారు ఇండిపెండెంట్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ రితేస్ నాథ్. అందుకని కెప్టెన్సీ నుంచి వైదొలిగినా కోహ్లి బ్రాండ్‌పై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదని భావిస్తున్నారాయన. ఒకవేళ విమర్శల సంగతే తీసుకున్నా.. కోహ్లి గనుక ఒక్కసారి ఫామ్ పుంజుకుంటే.. అన్నీ మరిచిపోతారని, అప్పుడు మరింత పుంజుకుని బ్రాండ్ వాల్యూ రెట్టింపు అయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారాయన. గతంలో కెప్టెన్సీ వదిలేసిన తర్వాత సచిన్ నాలుగేళ్లపాటు ఎలాగైతే రాణించాడో.. బ్రాండ్ మార్కెట్లో మళ్లీ పుంజుకున్నాడో కోహ్లి విషయంలోనూ అలాగే జరగొచ్చని, అయితే పరిస్థితి అంతదాకా రాకపోవచ్చని అంచనా వేస్తున్నారాయన. కోహ్లి.. కనిపిస్తే చాలు కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్లకు సంబంధించి చేసే ఒక్క పోస్ట్‌కి కోటి ఇరవై ఐదు లక్షలు తీసుకుంటాడు. ఒకప్పుడు ఇది 80 లక్షల రూపాయల దాకా ఉండేది. ఎండోర్స్మెంట్ కోసం ఒక్కో బ్రాండ్‌కి ఏడాదికి ఏడు కోట్లపైనే ఛార్జ్ చేస్తున్నాడు. ఇది ఒకప్పుడు ఐదు కోట్లు ఉండేది. ప్రస్తుతం కోహ్లి తర్వాత రోహిత్ శర్మ 3 కోట్ల దాకా అందుకుంటున్నాడు. అజింక్య రహానే, కేఎల్ రాహుల్ లాంటివాళ్లు కోటి నుంచి కోటిన్నర మధ్య తీసుకుంటున్నారు. ఈ లెక్కన బ్రాండ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా.. కోహ్లితో పోటీపడే క్రికెట్ ప్లేయర్ ఎవరూ లేకపోవడం విశేషం. కోహ్లి గత కొంతకాలంగా పూర్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నప్పటికీ.. బ్రాండ్లు వెనక్కి పోకపోవడమే ఇందుకు మరో ఉదాహరణ. రెండేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదని కోహ్లిని విమర్శించే వ్యతిరేక వర్గం కూడా.. కోహ్లి బ్రాండ్ విషయానికొచ్చేసరికి సైలెంట్ అయిపోతోందని కోరెరో కన్సల్టింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఫౌండర్ సలిల్ వైద్యా అంటున్నారు. అలా తన ఇమేజ్‌తో ప్రత్యర్థుల నోళ్లు సైతం మూయించగల కెపాసిటీ కోహ్లిది. అలాంటిది ప్లేయర్‌గా పర్ఫార్మెన్స్ కనబరిస్తే.. కోహ్లి బ్రాండ్ దూసుకుపోతుందని చెప్తున్నారు సలిల్. ‘‘కోహ్లి అప్పీయరెన్స్‌కు జనాలు బాగా అలవాటు పడ్డారు. యూత్ అతనికి సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా ఆస్వాదిస్తుంది. అసలు క్రికెట్ జెర్సీలో అతని రూపం చాలు.. ప్రచారానికి. అందుకే సీనియర్లకు, క్రికెట్ దిగ్గజాలకు సైతం దక్కని బ్రాండ్ ఇమేజ్.. కోహ్లి పేరిట నడుస్తోంది ఇప్పుడు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) చదవండి: కెప్టెన్‌గా రోహిత్ కంటే అతనే బెటర్! -
Mahesh Babu: మహేశ్... ఇట్స్ ఏ బ్రాండ్
సూర్య ఇది పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అంటూ బిజినెస్‌మేన్ సినిమాలో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌కి బాక్సాఫీస్ దద్దరిల్లింది. వెండితెరపై మహేశ్‌బాబు చేసే యాక్టింగ్‌కే కాదు డైలాగ్ డెలివరీకి, మ్యానరిజమ్ మూమేంట్స్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్లే మహేశ్‌లోని క్రేజ్‌తో తమ బ్రాండ్ల బిజినెస్ పెంచుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు క్యూలు కడుతున్నాయి. బ్రాండ్ అంబాసిడర్‌గా తెలుగు రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసి నేషనల్ లెవల్‌కి వెళ్లిపోయాడు మన మహేశ్. సాక్షి, వెబ్‌డెస్క్: టాలీవుడ్లో మహేశ్ బాబుకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ మాటకొస్తే మోస్ట్ డిజైరబుల్ జాబితాల ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్న హీరో కూడా మహేశే. పాతిక సినిమాలు పూర్తికాక ముందే స్టార్ హీరో రేసులో టాప్ పొజిషన్‌కు చేరడమే కాదు.. హ్యాండ్సమ్ హీరోగానూ మహేష్‌కి పేరుంది. ఈ ట్యాగ్ లైన్ టాలీవుడ్‌కే పరిమితం కాలేదు.. మిగతా భాషల్లోనూ హీరోల అందగాళ్ల జాబితాలోనూ మహేశ్ష్కు చోటు దక్కింది.అందువల్లే ఒకటి కాదు రెండు కాదు డజన్ల కొద్దీ బ్రాండ్లు తమ అంబాసిడర్‌గా మహేశ్‌బాబుని ఎంచుకున్నాయి. సూపర్ స్టార్ ప్రచార పవర్‌కి సలాం కొడుతున్నాయి. వాట్నాట్ కూల్‌డ్రింక్ యాడ్‌తో మొదలైన మహేశ్ యాడ్ ఛరిష్మా.. ఇప్పుడు దాదాపు అన్నింటా పాకింది. బైకులు, సోపులు, బట్టలు, ఈ కామర్స్, మొబైల్ బ్రాండ్స్ వాట్ నాట్ అన్నింటీ మహేశే కావాలన్నట్టుగా బడా కంపెనీలు పోటీ పడుతున్నాయి,. మహేశ్ నటించే యాడ్స్‌ని తీసే బాధ్యతలను ఏస్ డైరెక్టర్లుగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివలాంటి వారికి అప్పగిస్తున్నాయి. మహేశే ఎందుకు మురారీ, అతడు, సీతమ్మ వాకిట్లో, శ్రీమంతుడుతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఒక్కడుతో మాస్‌ని, పోకిరితో యూత్‌లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సాధించిన మహేశ్ ఇప్పటికీ కాలేజ్ బాయ్‌లా కనిపిస్తుంటాడు. అందువల్లే యాడ్లలో మహేశ్ అప్పీయరెన్స్ ఆయన ఫ్యాన్స్‌నే కాదు ఫ్యామిలీ ఆడియొన్స్‌ను సైతం ఫిదా చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకోవాలంటే మహేశ్‌కే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాయి కార్పోరేట్ కంపెనీలు. అందుకే బైజూస్ నుంచి మొదలు పెడితే టూత్‌బ్రష్, వంటనూనె, బంగారం, బట్టలు, పెర్ఫ్యూమ్, బైకులు, కూల్‌డ్రింక్, మొబైల్స్, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ఇలా అన్నింటా బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ కనిపిస్తున్నారు. వేరియేషన్స్ వెండితెరపై కూల్ లుక్‌తో కనిపించే మహేశ్‌కు బుల్లితెరపైనా వచ్చే యాడ్స్‌లో జేమ్స్‌బాండ్ తరహాలో రెచ్చిపోతుంటారు. ముఖ్యంగా థమ్స్యాడ్స్ అన్నీ సూపర్ యాక్షన్ సీక్వెన్స్‌లతోనే వస్తున్నాయి. ప్రొడక్ట్ ఏదైనా సరే ఆ యాడ్‌లో మహేశ్ అలా నడిచి వచ్చి ఇలా ఓ లుక్క్ ఇచ్చి తనదైన స్టైల్లో రెండు మాటలు చెబితే చాలు ఆ బ్రాండ్ జనాల మదిలో రిజిస్టరై పోతుంది. రన్నింగ్ సిగ్నేచర్ సిల్వర్ స్త్రీన్‌పై మహేశ్‌బాబు రన్నింగ్ సీన్లకే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మురారీలో అరటితోటలో మొదలెట్టిన రన్నింగ్ టక్కరి దొంగ, పోకిరి, సీతమ్మ మీదుగా ఇప్పటికీ ఆగడం లేదు. ఈ రన్నింగ్ సీన్లని ఓ కూల్ డ్రింక్ కంపెనీ విపరీతంగా వాడేసుకుంటోంది. ఈ కంపెనీకి ఇతర భాషల్లో ఇప్పటికే పలువురు హీరోలని మార్చినా తెలుగు లో మాత్రం మహేశ్ అలానే ఉన్నాడు. లిస్టు పెద్దదే సోషల్ మీడియాలో టాలీవుడ్‌కు ఫాలోయింగ్ పాఠాలు నేర్పించిన మహేశ్.. సౌత్‌లోనే ఎక్కువ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నాడు. సోషల్ క్యాంపెయిన్స్లోనూ ముందుండే మహేశ్ ఓ ప్రముఖ పిల్లల హాస్పిటల్కూ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక కార్పోరేట్ బ్రాండింగ్ విషయానికి వస్తే మహేశ్ ఇప్పటి వరకు డెన్వర్ డియోడరంట్, ఫ్లిప్‌కార్ట్, క్లోజ్అప్, గోల్డ్ విన్నర్, ప్రోవోగ్ సూపర్ కలెక్షన్, ఐడియా సెల్యూలార్, టాటా స్కై, పారగాన్, టీవీఎస్ మోటార్, సంతూర్, అమృతాంజన్, రాయల్‌స్టాగ్, మహీంద్రా ట్రాక్టర్స్, సౌతిండియా షాపింగ్ మాల్, బైజూస్, నవరత్న, ఐటీసీ వివెల్ షాంపూ, జాస్ అలుకాస్, యూనివర్సల్ సెల్, ప్రోవోగ్, ల్యాయిడ్, గోద్రేజ్, సూర్యా డెవలపర్స్, కార్దేఖో, అభిబస్ ఇలా అనేక బ్రాండ్లకు ప్రచారం చేశారు. దీపం ఉండగానే దీపం ఉండగానే ఇళ్లు.. క్రేజ్ ఉండగానే కమర్షియల్ కెరీర్ చక్కబెట్టుకోవాలి అనేది మన సెలబ్రిటీలకు బాగా వంటపట్టిన విషయం. అందుకే ఓ వైపు వెండితెర వేల్పుగా రెండు చేతులా సంపాదిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్‌లో జిగేల్మంటూ మరికొంత సంపాదిస్తుంటారు. జనాల్లో ఉన్న క్రేజ్‌ను బట్టి వారికి పారితోషం ఇస్తుంటారు. ఇప్పటికే పలువురు సినిమా హీరోలు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీరిలో మహేశ్ బాబు ప్రప్రథమంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వరస హిట్లతో దూసుకెళుతున్న మహేశ్ బాబు ఇటు సినిమాలు చేస్తూ అటు యాడ్స్ కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీటన్నిటికీ ప్రిన్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రిన్స్ మహేశ్ బాబు ఒక్కో ఎండార్స్మెంట్కి రూ. 5 కోట్లకు పైగానే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. -
ధోని కంపెనీకి రైనా గుడ్‌బై
ఐఓఎస్ స్పోర్ట్స్‌తో ఒప్పందం న్యూఢిల్లీ: భారత క్రికెటర్ సురేశ్ రైనా తన బ్రాండింగ్, ఎండార్స్మెంట్ వ్యవహారాలు చూసేం దుకు కొత్త కంపెనీతో జత కట్టాడు. ఈ క్రమంలో తన కెప్టెన్, ఆత్మీయుడు ధోనికి చెందిన రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీతో అతని సుదీర్ఘ అనుబంధం ముగిసింది. ఐఓఎస్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థతో అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. మూడేళ్ల కాలానికి దాదాపు రూ. 35 కోట్ల మొత్తానికి ఈ డీల్ కుదిరినట్లు సమాచారం. ఇకపై రైనాకు సంబంధించిన ఎండార్స్మెంట్స్, లెసైన్స్‌లు, దుస్తుల ప్రమోషన్, అకాడమీల ఏర్పాటు తదితర వ్యవహారాలన్నీ ఐఓఎస్ మేనేజ్ చేస్తుంది. ఈ కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకున్న తొలి క్రికెటర్ రైనా కావడం విశేషం. ఒలింపియన్లు విజేందర్, మేరీకామ్, సుశీల్, గగన్, సుశీల్ తదితర 20 మంది క్రికెటేతర ఆటగాళ్లతో ఈ సంస్థ అనుబంధం కలిగి ఉంది. ప్రస్తుతం రైనాతో అడిడాస్ సంస్థ ఒక్కటే మూడేళ్ల కాంట్రాక్ట్‌ను కొనసాగిస్తోంది.